మన సాంప్రదాయాలు

మన సాంప్రదాయాలు I hope u can get information about all our traditions...���

🪷🙏సలేశ్వర క్షేత్రం🙏🪷👉ఈ గుడికి వెళ్ళాలంటే ప్రాణాలపై ఆశ వదులు కోవాల్సిందే..👉మరణించిన వారిని బ్రతికించగలిగే మహా శక్తి ఉన్న ...
09/09/2024

🪷🙏సలేశ్వర క్షేత్రం🙏🪷

👉ఈ గుడికి వెళ్ళాలంటే ప్రాణాలపై ఆశ వదులు కోవాల్సిందే..
👉మరణించిన వారిని బ్రతికించగలిగే మహా శక్తి ఉన్న సంజీవని పర్వతం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా ?
గుడి అంటే రోజూ పూజలు,నైవేద్యాలు ఇవన్నీ రోజూ మామూలే!
కానీ ఓ దేవాలయం కేవలం 5 రోజులు మాత్రమే తెరచివుంటుంది.
ఆ 5 రోజులులూ దేవుడికి పూజలు చేసి గుడిని మూసేస్తారు.
మళ్ళీ తెరిచేది యాడాది తర్వాతే.
ఎందుకంటే ఈ గుడికి వెళ్ళటం ఆషామాషీ వ్యవహారం కాదు.
అక్కడికి వెళ్ళాలంటే గుండెలు అరచేత్తో పట్టుకుని అడుగులు వేయాల్సిందే.
అడుగడుగునా పొంచివున్న ప్రమాదాలతో ఓ సాహసయాత్రను తలపించే ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే భక్తి ఒక్కటే చాలదు.
గుండె ధైర్యం కూడా పుష్కలంగా వుండాలి.
ఇంతకీ ఆ గుడి ఎక్కడ వుంది?
అక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలని వుంది కదూ!
సలేశ్వరం శ్రీశైలం దగ్గరలోని ఒక యత్రా స్థలము.
ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం,
చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం,
ఆధ్యాత్మిక ప్రదేశం.
ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యాత్రా స్థలము.
ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది.
ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తోలి పౌర్ణమికి మొదలగుతుంది.
శ్రీశైలానికి 40 కిలొమిటర్ల దూరంలో వుంటుంది సలేశ్వరం. అడవిలో నుండి 25 కిలోమీటర్ల ప్రయాణం వుంటుంది. ఇందులో 20 కిలొమిటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది.
అక్కడి నుండి 5 కిలొమిటర్ల కాలినడక తప్పదు.
ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో వున్న గుహలో దర్శనమిస్తాడు.
ఇక్కడ సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది.
ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులు అవుతారు.
కలియుగ అంతానికి కారణమయ్యే గుడి !
వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే !
👉1. ఆలవాలం.
అదో దట్టమైన కీకారణ్యం. ఎత్తైన కొండలు, పాలనురుగులా జాలువారే జలపాతాలు,
ప్రకృతి రమణీయదృశ్యాలు,
అక్కడి ప్రతి అణువూ నిండి వుంటుంది.
దీనితో పాటు కారడివి ఆధ్యాత్మికతకు కూడా ఆలవాలంగా వుంటుంది.
👉2. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గం.
తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా నల్లమల అడవులలో కొలువైవున్న సలేశ్వర క్షేత్రం వెళ్ళాలంటే ఎవరికైనా ఒణుకు పుట్టాల్సిందే.
హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గంలో 150కి.మీ రాయి దగ్గర పరహాబాద్ గేటు వుంటుంది.
అక్కడినుంచి 32కిమీ ల దూరం దట్టమైన అడవిలో వెళ్ళాలంటే ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అనుమతి తీసుకోవాల్సిందే.
👉3. జాగ్రత్త.
గుట్ట కొనను చేరుకొన్నాక మళ్ళీ ఉత్తరవైపునకు తిరిగి గుట్టల మధ్య లోయ లోనికి దిగాలి.
ఆ దారిలో ఎన్నెనో గుహలు సన్నని జలధారలు కనిపిస్తాయి.
గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు బాగానికి చేరు కుంటాం.
👉4. లోయలో జాగ్రత్తగా నడవాలి.
గుండం నుండి పారె నీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కోచోట బెత్తెడు దారిలో నడవాల్సి వుంటుంది.
ఏమరు పాటుగా కాలు జారితె ఇక కైలాసానికే.
👉5. నీరు అతి చల్లగా, స్వచ్ఛంగా.
గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాల అందంగా కనిపిస్తుంది.
తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టు ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలోనుండి ఆకాశం కుండ మూతి లోపలి నుండి ఆకాశం కనబడినట్లు కనబడుతుంది. గుండంలోని నీరు అతి చల్లగా, స్వచ్ఛంగా వుంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆనీరు ఆరోగ్యానికి చాల మంచిది.
పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు ప్రయాణం
👉6. లింగమయ్య స్వామి లింగం.
గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి.
పై గుహనే ముందు చేరుకోవచ్చు.
ఆ గుహలోనె ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి లింగం ఉంది.
స్థానిక చెంచులే ఇక్కడ పూజారులు.
క్రింద గుహలో కూడా లింగమే ఉంది.
గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలున్నాయి.
👉7. సలేశ్వరం జాతర సంవత్సరాని కొకసారి చైత్ర పౌర్ణ్మికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులు జరుగుతుంది.
ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుతున్నది గాన కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు 'వత్తన్నం వత్తన్నం లింగమయ్యో' అంటూ వస్తారు.
వెళ్లేటప్పుడు 'పోతున్నం పోతున్నం లింగమయ్యొ' అని అరుస్తూ నడుస్తుంటారు.
👉8. శిధిలావస్థ.
10కి.మీ లు వెళ్ళగానే రోడ్డుకు ఎడమప్రక్కన నిజాం కాలపు శిధిలావస్థలో వున్న భవనాలు కనిపిస్తాయి.
నిజాం రాజు అక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడై వందేళ్ళకు పూర్వమే అక్కడ వేసవి విడిది నిర్మించుకున్నాడు.
అందుకే ఆ ప్రదేశాన్ని పరహాబాద్ అంటారు.
👉9. నడకదారులు.
ఈ ప్రాంతంలో పులులు ఎక్కువగా సంచరిస్తుండడంతో 1973 లో కేంద్రప్రభుత్వం టైగర్ ప్రాజెక్టును ఇక్కడ ఏర్పాటుచేసింది. అక్కడ నుంచి సలేశ్వరానికి 3 నడకదారులున్నాయి. దట్టమైన అడవిలో వున్న సలేశ్వర ఆలయంలో చెంచులే పూజాకార్యక్రమాలు నిర్వహిస్తూవుంటారు.
కొలను భారతి - ఎపి లో ఉన్న ఒకేఒక సరస్వతి దేవాలయం !!
👉10. చైత్రపౌర్ణమి.
సలేశ్వరంలో సంవత్సరానికి ఒక్క సారి జాతర జరుగుతుంది.
చైత్రపౌర్ణమికి రెండు రోజుల ముందు రెండు రోజుల తరువాత అంటే మొత్తం 5 రోజులపాటు జాతర జరిగే సమయంలోనే ఆ గుడిని తెరచివుంచుతారు.
ఈ 5రోజులలో దేవుడి దర్శనానికి వచ్చే భక్తులు సాహసయాత్ర చేయాల్సి వుంటుంది.
👉11. జలపాతాలు.
ఇరుకైన లోయల్లో కేవలం కాలు మాత్రమే పట్టే దారి మాత్రమే వుంటుంది.
పొరపాటున అక్కడ కాలు జారితే అంతే సంగతులు. కనీసం శవం కూడా దొరికే పరిస్థితి వుండదు.
అక్కడికి వెళ్ళే దారిలో వుండే జలపాతాలు మండు వేసవిలో ఎంతో ఆనందాన్ని,ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
👉12. భక్తులతో కిటకిటలాడుతూ.
నీటి గుండాలు చూపులు తిప్పుకోనివ్వవు.
గుడి తెరచి వుండే 5రోజులు భక్తులతో కిటకిటలాడుతూ వుంటుంది.
శ్రీశైలం మల్లికార్జున స్వామి, సలేశ్వర లింగామయ స్వామి, లుగ్దీ మల్లన్న, ఉమామహేశ్వరం ఈ నాలుగు లింగాలే అందరికీ తెలుసు.
ఐదో లింగం నల్లమల అడవులలో ఎక్కడ వుందో ఇప్పటికీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు.
👉13. చరిత్రకారులు.
సలేశ్వర ఆలయాన్ని 6వశతాబ్దిలో నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతారు.
13వ శతాబ్దంలోని మల్లికార్జునపండితారాజ్య చరిత్ర, శ్రీ పర్వత క్షేత్రంలో సలేశ్వర క్షేత్ర విశేషాలను పాల్పురి సోమనాధుడు వర్ణించాడు.
ఆలయం నిర్మించిన నాటి నుంచి ఏడాదిలో 5 రోజులు మాత్రమే తెరచివుంచటం ఆనవాయితీగా వస్తోంది.
17వ శతాబ్దం చివరిలో ఛత్రపతి శివాజీ సలేశ్వరం క్షేత్రంలో ఆశ్రమం పొందినట్లు చరిత్ర చెబుతుంది.
👉14అక్కడి పకృతి అందాలకు ముగ్దుడైన నిజాం.
వంద సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించాడు.
అదిప్పుడు శిథిలావస్థలో వుంది.
ఆ ప్రదేశానికి ఫరాహబాద్ అనిపేరు.
అనగా అందమైన ప్రదేశం అని ఆర్థం.
👉15. ఎలా చేరుకోవాలి.
హైదరాబాద్ - శ్రీశైలం వెళ్ళే దారిలో మన్ననూర్ అనే ఊరు వస్తుంది.
అక్కడి నుండి 10 -12 KM దూరం శ్రీశైలం వెళ్ళే మార్గంలో వెళ్తే ...
సలేశ్వరం అనే బోర్డు కనిపిస్తుంది.
ఆ బోర్డు చూపించే గుర్తు వైపు 10 కిలోమీటర్లు వెళ్తే ... సలేశ్వరం లోయ కనిపిస్తుంది.
అక్కడే వాహనాలు, బస్సులు ఆపాలి.
లోయలో ఐదు కిలోమీటర్లు నడిస్తే ...
ఆకాశ గంగను తలపించే జలపాతం, గుహలు కనిపిస్తాయి.
అదే సలేశ్వర క్షేత్రం.
నిజాం విడిది నుండి ఎడమ వైపున 22 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంపు వస్తుంది.
అక్కడే వాహనాలను ఆపుకోవచ్చు.
అక్కడినుండి సలేశ్వరం అనే జలపాతం చేరుకోడానికి రెండు కిలొమీటర్ల దూరం నడవాలి.
ఓం నమః శివాయ..స్వస్తి..!!

లోకా సమస్తా సుఖినోభవంతు..!!

🙏సేకరణ🙏

*విశ్వమే ప్రకృతి*భగవంతుడు సృష్టించిన ఈ చరాచర జగత్తంతయు ప్రకృతిగా పరిగణింపబడుతున్నది. పంచ భూతాలు, సూర్యచంద్రులు, నక్షత్రా...
07/09/2024

*విశ్వమే ప్రకృతి*

భగవంతుడు సృష్టించిన ఈ చరాచర జగత్తంతయు ప్రకృతిగా పరిగణింపబడుతున్నది. పంచ భూతాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, నదులు, పర్వతాలు, సముద్రాలు అరణ్యాలు, అందులో జీవ జంతువులు అన్నియూ ప్రకృతిలోని భాగాలే. ఈ సృష్టి సమతుల్యాన్ని కాపాడే చెట్లు, గుట్టలు, అరణ్యాలు, పర్వతాలు తగ్గితే మానవుని మనుగడయే కష్టం.
మానవుడు ఈ భూమిపై అవతరించి తన అవసరాలను తీర్చుకొనుటకు ప్రకృతిమీదనే ఆధారపడుతున్నాడు. ప్రకృతి ప్రసాదించిన ఆకులు, పూలు, పండ్లు, కందమూలాలు, దుంపలు మానవునికే కాకుండా అనేక జీవరాసులకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ ముఖ్యవసరాలు. ఈ మూడు కూడా ప్రకృతి నుండి లభించేవే. మానవుడు తన ప్రజ్ఞ, బుద్ధిబలంతో చెట్ల నీడను సౌధాలుగా చెట్ల నారను పట్టు వస్త్రాలుగా కాయలు, పండ్లను ఆహారంగా మార్చుకున్నాడు. అయితే సృష్టి ప్రారంభమునుండి ప్రతి విషయంలో ఎన్నో మార్పులు కనబడుతున్నాయి. మానవుని మేధస్సులో కలిగే సంచలనం ప్రకృతిలో ప్రతిబింబిస్తున్నది. మానవుని ప్రజ్ఞా ప్రాభవాలు వినీలాకాశంలో స్వేచ్ఛగా పక్షుల్లాగా విహరింపజేస్తున్నాయి. సాంకేతికంగా మానవుడు ప్రగతి పథంలో ఎంత అభివృద్ధిని సాధించినప్పటికిని దీని ప్రభావంతో ప్రకృతి దెబ్బతింటున్నది. పూర్వకాలంలో ప్రకృతి ప్రసాదించిన పండ్లు, కందమూలాలు ఆరగించి మూలికా ఔషధాలను వాడి ఎంతో ఆరోగ్యంగా జీవించెడివాడు. నేటి మానవుడు పట్టణ జీవితానికి అలవడి కృత్రిమ ఆహారాన్ని కల్తీ ఆహారాన్ని తింటూ అనారోగ్యాన్ని పెంచుకుంటున్నాడు.

ప్రకృతికి మూలాధారాలైనవి చెట్లు. చెట్లు త్యాగానికి ప్రతిరూపాలు. మనం వాటికి హాని చేసినా అవి మనకు ఎంతో మేలు చేస్తున్నాయి. అందుకే కబీరు- మనం ఇక్కడినుండి రాళ్ళతో కొడితే అవి మనకు అక్కడినుండి ఫలాలనందిస్తున్నాయి. మనకు అవసరమైన ప్రాణవాయువును, ఆకులు, పళ్ళు, కలప ఎన్నో ఇస్తూ ఎంతో మేలు చేస్తున్నాయి. మర్రి, రావి, మేడి, వేప, జమ్మి, ఉసిరిచెట్లను పూజించే ఆచారం హిందువులు ఇప్పటికీ పాటిస్తున్నారు. చెట్లకు ప్రాణశక్తి ఉన్నందువల్ల వాటికి కూడా సుఖ దుఃఖాలున్నవని జగదీశ చంద్రబోసు నిరూపించి ప్రతిష్ఠాత్మకమైన ‘నోబుల్’ బహుమతి పొందాడు. ముఖ్యంగా వృక్షాలకు స్పర్శజ్ఞానం, రసేంద్రియాశక్తి, ఘ్రాణాశక్తి ఉందని నిరూపించారు. సాధారణంగా సామాన్య మానవులకుండే లక్షణాలన్నియు చెట్లకూఉన్నాయి. చెట్లు ప్రకృతిని కాపాడుతాయి. పిడుగులను ఆకర్షించే శక్తి చెట్లకున్నది. చెట్లు దైవీ శక్తులను కలిగి ఉన్నాయి. అవి పిలిస్తే పలికే దైవాలు. భక్తితో చెట్లను పూజించి, ప్రదక్షిణలు చేసి ఏకాగ్రతతో ప్రార్థిస్తే వృక్షమాత అనుగ్రహించి ఆశీర్వదిస్తుందని పెద్దలు చెబుతారు. ప్రకృతిలో ఒక్కొక్క చెట్టు ఎన్నో ఔషధ గుణాలు కలిగి మహత్తర శక్తులను కలిగి ఉన్నాయి. అందుకే ఈ విషయాన్ని గ్రహించి వృక్ష సంపదను పెంపొందించిన దేశ సౌభాగ్యము ఇనుమడిస్తుంది.
శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో- నిరంతరం నిష్కామ భావంతో ప్రకృతిని సేవిస్తూ, రక్షిస్తారో వారి యోగక్షేమాలను నేనే స్వయంగా చూస్తానని అర్థం, ‘వృక్షో రక్షతి రక్షితః’ అని. మనం ప్రకృని కాపాడితే ప్రకృతి మనలను తన ఒడిలో పెట్టుకుని కన్నబిడ్డలా పరిరక్షిస్తుంది. ప్రకృతిని రక్షించు ప్రకృతిలో జీవించు. ప్రకృతిని కల్మషం చేయకుండా ఈశ్వరత సర్వభూతానాం అని తెలిసి కొని భగవంతుడు అన్నింటా వ్యాపించి యున్నాడని అన్ని ప్రాణుల యెడ భూతదయ కలిగి రక్షించుట మానవ ధర్మం. ఇదే వేద సారాంశం.

వినాయక చవితి శుభాకాంక్షలు🙏🙏🙏మట్టి గణపతిని  పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం🙏🌺🪷
07/09/2024

వినాయక చవితి శుభాకాంక్షలు🙏🙏🙏
మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం🙏🌺🪷

🌺☘️🙏బిల్వ చెట్టు వృత్తాంతం, బిల్వాష్టకం - విశిష్టత*🙏🌺☘️శివపూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే, ఒక్కొక్క ఫలితం కలుగుతుంటుంది...
04/09/2024

🌺☘️🙏బిల్వ చెట్టు వృత్తాంతం, బిల్వాష్టకం - విశిష్టత*🙏🌺☘️

శివపూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే, ఒక్కొక్క ఫలితం కలుగుతుంటుంది.
శివుని రోజూ జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసిననంత ఫలితాన్ని పొందుతారు.

*శివపూజకు సంబంధించినంత వరకు*

వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.

వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.

వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం.

వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.

వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మేత్తుపువ్వు ఉత్తమం.

వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం.

వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మిపూవు ఉత్తమం.

వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.

వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపువ్వు ఉత్తమం.

వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపువ్వు శ్రేష్ఠం.

వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు.

_శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువపువ్వు ఉత్తమోత్తమమైనది. శివునికి వేయినల్ల కలువలతో మాలను అల్లి సమర్పించినవారు, శివునితో సమమయిన పరాక్రమంగలవారై వందల, వేలకోట్ల కల్పాలు నిత్యకైలాసంలో నివశిస్తారు._

ఈ పుష్పమాలతో కాక మిగతా పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు.

పరమశివునికి పొగడపూలంటే అమితమైన ఇష్టం.
ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడపువ్వుతో అర్చించే భక్తుడు వేయిగోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు.

ఒక నెలపాటు పొగడపూలతో పూజించినవారు స్వర్గ సుఖాలను పొందుతారు.
రెండునెలలపాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు.
మూడు నెలల పాటు పొగడపూలతో అర్చించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి.
నాలుగు నెలలు పూజించినవారికి కార్య సిద్ధి,
ఐదు నెలలు పూజించినవారికి యోగసిద్ధి.
ఆరు నెలలు పూజించినవారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది.

సాధారణంగా శివునికి బిల్వపత్రాలే ప్రీతిపాత్రమైనవి, మిగతా పత్రాలు ప్రీతికరం కావని అనుకుంటుంటాం.
లింగపురాణం ఆ స్వామికి ఇషామైన మరిన్ని పత్రాలను గురించిన వివరాలను అందిస్తోంది.
మారేడు, జమ్మి, గుంట గలగర, అడ్డరసము, అశోకపత్రాలు, తమాలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచీపత్రి, నల్ల ఉమ్మెత్త, తామరాకు, నీతికలువ, మెట్టకలువ ఆకులు, సంపెంగ పత్రి, తుమ్మి, ఉత్తరేణి ఆకులను పత్రాలను పూజలో ఉపయోగించవచ్చు.
అంటే, ఆయా పుష్పాలు లభించనపుడు, ఆయా పత్రిని ఉపయోగించవచ్చు.

ఇక పుష్పదానానికి సంబంధించినంతవరకు, పుష్పాన్ని గాని, ఫలాన్నిగాని దైవానికి నివేదిస్తున్నప్పుడు ఆ పుష్పం ముఖం బోరగిలబడకూడదు.
అలా చేయడంవల్ల దుఃఖం కలుగుతుంది.
అయితే ఆ పుష్పాలను లేక పత్రిని దోసిట్లో పెట్టుకుని నివేదించేటప్పుడు బోర్లాపడినప్పటికీ దోషం కాదు. ఉమ్మెత్త, కడిమిపువ్వులను శివునికి రాత్రివేళ సమర్పించాలి.
మిగిలిన పూలతో పగిటిపూట. మల్లెలతో రాత్రివేళ, జాజి పూలతో మూడవజామున, గన్నేరుతో అన్నివేళలా పూజించవచ్చు.

ఇప్పటివరకు మనం ఏయే పూలతో శివుని పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం.
అయితే మన మనసులోని కోరికననుసరించి కూడ శివునికి పువ్వులను సమర్పించవచ్చు.

ఉదాహరణకు ధనం కావాలను కున్నవారు శివుని గన్నేరుపూలతో, మోక్షం కావాలంటే ఉమ్మెత్తపూలతో, సుఖశాంతుల కోసం నల్లకాలువతో, చక్రవర్తిత్వం కోసం తెల్లతామరలతో, రాజ్యప్రాప్తి కోసం ఎర్రతామరలతో, నాగకేసరం, కేసరీపుష్పాలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయట.

గన్నేరు, అశోకం, ఊడుగు, తెల్లజిల్లేడులతో పూజించిన వారికి మంత్రసిద్ధి, రోజాపుష్పాలతో లాభాసిద్ధి, దంతి ప్రత్తి పూలతో సౌభాగ్యం కలుగుతుంది.
కోరుకున్న కన్యను పొందాలంటే శివుని సన్నజాజి పూలతో పూజించాలి.
సంతానం కావాలనుకునేవారు శివుని మొల్లపువ్వులతో పూజించాలి.
దర్భపూలతో ఆరోగ్యం, రేలపూలతో ధనం, తుమ్మిపూలతో వశీకరణం, కడిమిపూలతో శత్రుజయం కలుగుతుంది.
బిల్వదళ పూజ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది.
శివుని మరువంతో పూజిస్తే సుఖం, లోద్దుగపూలతో పూజిస్తే గోసంపద కలుగుతుంది.
మోదుగ, బూరుగు పూలతో పూజిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది.

*ఇక, శివపూజకు పనికిరాని పువ్వుల గురించి మన పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి!!*

మొగిలి, మాధవి, అడవిమల్లి, సన్నజాజి, దిరిసెన, సాల, మంకెన పువ్వులు శివార్చనకు పనికిరావు.
బావంచి ఆకులు, పువ్వులు, కానుగపూలు, తాండ్ర ఆకులు, దాసాని, ఎర్రమద్ది, మందార, విషముష్టి, అడవిమొల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర, తెల్ల గులాబీలు, దిరిసెన పువ్వులు శివపూజకు పనికిరావు.
వేప, వెలగ, గురివింద పూలు కూడా శివపూజకు అర్హం కావు.

దశసౌగంధికం పుష్పం నిర్గంధియది భామిని
శాతసాహస్రి కామాలా అనంతం లింగపూజసే పది సుగంధపుష్పాలతో (ఒకవేళ పరిమళం లేకపోయిన వైనప్పటికీ) శివలింగాన్ని పూజిస్తే, శతసహస్రమాలలతో పూజించిన అనంత పుణ్యఫలం లభిస్తుందని శివధర్మ సంగ్రహం చెబుతోంది.
ఓం నమశ్శివాయ నమః
హరే కృష్ణ గోవిందా
🌸🙏🌸🥭🌸🎻🌸🪔🌸💦🌸

🌷🙏🙏🌷స్వామి అర్థనారీశ్వరుడి గా అవతరించడం కూడా ఆయన లీలా విశేషమే. 🌷🙏🙏🌷బ్రహ్మ సృష్టి అంతటిని ప్రారంభించినప్పుడు ఆయన సృష్టి వ...
04/09/2024

🌷🙏🙏🌷స్వామి అర్థనారీశ్వరుడి గా అవతరించడం కూడా ఆయన లీలా విశేషమే. 🌷🙏🙏🌷

బ్రహ్మ సృష్టి అంతటిని ప్రారంభించినప్పుడు ఆయన సృష్టి విస్తరిల్లకపోవడంతో బ్రహ్మకు తీవ్రమైన దుఃఖం కలిగింది.
చతుర్ముఖుడు అలా దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉండగా, ఆకాశవాణి, బ్రహ్మదేవా! సృష్టి పరిఢవిల్లాలంటే మైథునీ సృష్టి చేయవలెను అని పలికింది.
వెంటనే బ్రహ్మ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మైథునీ సృష్టిని చేయనారంభించాడు.
కానీ, అప్పటి వరకూ నారీ జననోత్పత్తి కాకపోవడంతో, చతుర్ముఖుడు తన నిశ్చయంలో సఫలుడు కాలేకపోయాడు.
శివుని కృప లేకుండా మైథునీ సృష్టి జరుగదని తెలుసుకున్న బ్రహ్మ పరమశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు కఠోర తపస్సు చేయనారంభించాడు.
కొన్నేళ్ళ పాటు ఉమా మహేశ్వరధ్యానంలో మునిగిపోయాడు.
బ్రహ్మ తపస్సును మెచ్చిన మహేశ్వ రుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు.
ఆయన రూపాన్ని చూసిన చతుర్ముఖుడు ఆశ్చర్యపోయాడు.

🌺🙏*అర్థనారీశ్వర రూపం *🙏🌺

ఆ దివ్యరూపానికి దండప్రమాణాలను అర్పించిన బ్రహ్మదేవుడు పలువిధాలుగా స్తుతించాడు.
అప్పుడు అర్థనారీశ్వర మూర్తి బ్రహ్మదేవునితో, బ్రహ్మదేవా! నీ మనోరథం నాకు అర్థమైంది.
సృష్టి వర్ధిల్లాలన్న భావంతో నీవు చేసిన కఠోర తపస్సుకు నేను సంతుష్టి చెందాను.
నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్పిన శివుడు తన శరీరం నుంచి ఉమాదేవిని వేరు చేశాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు పరాశక్తికి ప్రణ మిల్లి, అమ్మా! సృష్టి ప్రారంభంలో మీ నాథుడు నన్ను సృజించాడు.
ఆయన ఆదేశానుసారమే నేను మానసిక సృష్టి్ట చేశాను.
అనేక ప్రయత్నాలు చేసి నప్పటికీ, నేను సృష్టి్టని వర్ధిల్లజేయడంలో సఫలుడిని కాలేకపోయాను.
ప్రస్తుతం మీ దంపతుల దయ వలన స్త్రీ, పురుష సమాగమం ద్వారా ప్రజోత్పత్తిని చేస్తూ, సృష్టిని వర్ధిల్లచేయదలిచాను.

అయితే, ఇంత వరకు నారీగణం ప్రకటింపబడలేదు.
నారీగణాన్ని సృష్టించడం నా శక్తికి మించిన పనిగా ఉంది.
దేవీ! నువ్వు సంపూర్ణ సృష్టికీ, శక్తులకు ఉద్గమస్థానానివి.
నారీగణాన్ని సృష్టి చేసే శక్తిని నాకు ప్రసాదించు తల్లీ అని ప్రార్థించగా, దేవి తథాస్తు అని పలికింది.
అప్పుడు శివుడు చిరునవ్వులు చిందిస్తూ, దేవీ! బ్రహ్మ తపస్సు ద్వారా నిన్ను ఆరాధించాడు.
మనం బ్రహ్మ కోరికను అనుగ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పగా, ఆమె దక్షపుత్రికగా అవతరించింది.
అలా బ్రహ్మకు అనుపమ శక్తిని అను గ్రహించి, మహాదేవుడి శరీరంలోకి ప్రవేశించింది. నాటి నుంచి ఈ లోకంలో మైథునీ సృష్టి ప్రారంభమైంది.
బ్రహ్మ ఉమామహేశ్వరులను తలు చుకుంటూ సృష్టిని నిర్విఘ్నంగా విస్తరింపజేశాడు.
అలా శివ-శక్తులు పరస్పరాభిన్నులై సృష్టికి ఆది కారణులయ్యారు.
అందుకే వారు ఆది దంపతులు.
వారే మన సకల మానవాళికి
మాత పితరులు.

#ఓం నమః శివాయ🙏🌷
#జై శివ శంకర ప్రళయ భయంకర🙏🌷
#హర హర మహాదేవ 🙏🌷

అరుణాచలం గిరి ప్రదక్షిణ పూర్వ కాలం నుంచి ఇప్పటివరకు ఎవరెవరు చేశారు?స:అరుణాచలం గిరి ప్రదక్షిణ కుల,మత,జాతి,వర్ణ,వయో భేదం ల...
02/09/2024

అరుణాచలం గిరి ప్రదక్షిణ పూర్వ కాలం నుంచి ఇప్పటివరకు ఎవరెవరు చేశారు?

స:అరుణాచలం గిరి ప్రదక్షిణ కుల,మత,జాతి,వర్ణ,వయో భేదం లేకుండా ఎందరో చేశారు.ఇప్పటికీ చేస్తున్నారు కూడా వారిలో చిన్న,పెద్ద,ముసలి వాళ్ళు ఇంకా శైవులు,శ్రీ వైష్ణవులు,శాక్తేయులు,గాణపత్యులు,సౌర్యులు, కౌమారులు,బౌద్ధులు,ముస్లింలు, విదేశీ క్రైస్తవులు ఇంకా మహాత్ములు,మహర్షులు,బ్రహ్మర్షులు,దేవతలు ఇంకా నాస్తికులు కూడా ఇలా ఇన్ని రకాల వాళ్ళు ఈ గిరి ప్రదక్షిణ చేశారు.ఒంట్లో శక్తి ఉండి మేము నడవాలి అని సంకల్పించుకుని ఆ అరుణాచలేశ్వరుడి మీద నమ్మకం ఉంచితే చాలు ఆయనే నడిపించేస్తాడు అంటే ఒంట్లో శక్తి ఉన్నవాళ్లు ఎవరైనా చేయవచ్చు.దీనికి వాళ్ళు చేయవచ్చా లేదా వీళ్ళు చేయవచ్చా అనే భావం అస్సలు అక్కర్లేదు.అస్సలు ఈ ప్రదక్షిణకి ఎటువంటి నియమ నిబంధనలు(బహిష్టు(నెలసరి),మైల ఉన్నవాళ్లు కూడా ఈ ప్రదక్షిణకి అర్హులే)లేవు అని పరమేశ్వరుడే సెలవిచ్చాడు.మనం చెయ్యాలి అనుకోవడం ఆయన శక్తి ఇచ్చి నడిపించుకోవడం ఇలా తరతరాలుగా ఇదే ఈ గిరి ప్రదక్షిణలో జరుగుతుంది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అరుణాచల శివ🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

*కనుమరుగవుతున్న ఆనాటి  పెళ్ళి ముచ్చట్లు.**పెళ్ళి భోజనాలు-వడియాలు*పెళ్ళిలో భోజనాలంటే ఒక పెద్ద యఙ్ఞంలా వుండేది, సరదాగానూ వ...
17/08/2024

*కనుమరుగవుతున్న ఆనాటి పెళ్ళి ముచ్చట్లు.*

*పెళ్ళి భోజనాలు-వడియాలు*

పెళ్ళిలో భోజనాలంటే ఒక పెద్ద యఙ్ఞంలా వుండేది, సరదాగానూ వుండేది. భోజనాలకి పిలుపుల దగ్గరనుంచి భోజనాలు కార్యక్రమం పూర్తి కావడం ఒక పెద్ద వేడుక. ఐదురోజుల పెళ్ళిలో చెప్పేదేముంది, పూట పూటా సంబరమే…

పెద్దపెద్ద మండువా లోగిళ్ళుండేవి. మండువాలో ఒక పక్క ఆకులేస్తే ఒక పాతిక మందికి భోజనానికి సరిపడేది. ఇలా నాలుగుపక్కలవేస్తే దగ్గరగా వొక వంద మంది ఒక సారి భోజనం చేయడానికి వీలుండేది. ఇలా వీలు లేక పోతే దొడ్డిలో ఒక పెద్ద పందిరివేసి దానిని గదులుగా కట్టి గాలి వెలుతురు కోసం మనిషి పై ఎత్తు నుంచి ఖాళీగా వదిలేసే వారు. అలా కట్టిన వాటిలో నేల చదును చేసి కళ్ళాపు జల్లి అలికిన మట్టి ఇంటిలా తయారు చేసేవారు. భోజనాలకి కూచోడానికి ఈతాకుగాని, తాటాకు చాపలుగాని వేసేవారు. కింద కూచుని భోజనం చేసేవారు.

సాధారణంగా అరటి ఆకులు వుపయోగించే వారు. అత్యవసర పరిస్థితులలో అడ్డాకులు వాడేవారు. ఇక్కడ కూడా ఒకసారి వంద మంది పైగా ఒక సారి భోజనాలు చేసేందుకు సావకాశం ఉండేది.

పంక్తులుగా ఆకులేసి, అందరూ కూచున్న తరవాత వడ్డన ప్రారంభించేవారు. భోజనానికి, వడ్డనకి ఒక క్రమం ఉంది. నేటి ప్రోటోకోల్ లాగా! ముందు పప్పు, కూరలు, పచ్చళ్ళు, వూరగాయ, పిండివంటలు అన్నీ అయిన తరవాత అన్నం పెట్టేవారు. వడ్డన ప్రారంభించిన వెంటనే పెట్టినవి తినెయ్యకూడదు. అందరూ ఒక సారి తినడం మొదలు పెట్టాలి. వడ్డన అంతా పూర్తి అయినతరవాత గోవిందనామ స్మరణతో భోజనం ప్రారభమయ్యేది. అసలు సిసలు వడ్డన ఆ తరవాత ప్రారంభమయ్యేది,తినడం ప్రారంభించిన తరవాత. యువకులు యువతులు వడ్డన చేసేవారు. పంచకట్టి ఆపైన తువాలు మొలకి గట్టిగా బిగించేవారు యువకులు. యువతులు పమిట పూర్తిగా వేసుకుని ఆ కొంగు మొలలో దోపుకును వడ్డనకి ఉపక్రమించే వారు.

వడ్డన సామానుల పేర్లే మరిచిపోతున్నారు,ఇప్పుడు. పులుసు వడ్డించడానికి వాడేపాత్రని గోకర్ణం అనేవారు. మొదటిది పప్పు, ఇది పట్టుకుని ఒకరు, నెయ్యి పట్టుకుని ఒకరూ బయలుదేరేవారు. పప్పు వేసే అతను పప్పండి, మీకండి, పప్పండి,పప్పండి,పప్పండి అని వడిగా అంటు కదిలేవాడు. వెనకాల వచ్చే నెయ్యి తెచ్చినతను నెయ్యండి, నెయ్యండి,నెయ్యండి అంటూ వేసుకుంటూ వెళ్ళేవాడు. ఈ మాటలు గబగబా అంటే మరొక అర్ధం స్ఫురిస్తుంది. అని చూడండి. ఆ తరవాతది కూర. కూర తెచ్చినతను కూరండి, కూరండి, కూరండి అంటూ కావలసిన వాళ్ళకి వేసుకుంటూ వెళ్ళేవాడు. మధ్యలో అన్నం బుట్ట పట్టుకుని ఒకరు వచ్చేవారు. వేడిఅన్నం తాటాకు బుట్టలో పెట్టుకుని, బుట్ట చేతిమీద పెట్టుకుని, కాలకుండా బుట్ట కింద అరటాకు వేసుకుని ఒక హస్తంలాటి దానితో అన్నం వడ్డించేవారు. వీరు అన్నమండి తో ప్రారంభించి, మీకన్నమండి,మీకన్నమండి, మీకన్నమండి అంటూ సాగిపోయేవారు. మీకు+అన్నమండి=మీకన్నమండి అయిపోయింది. ఈ మాటలన్నీ వడిగా అంటేనే ఆ అందం అర్ధం స్ఫురిస్తాయి. పప్పుతో పులుసు వడ్డించేవారు. ఈ పులుసుని పులుసండి నుంచి పులసండి, పులసండి అనుకుంటూ వెళ్ళేవారు. పులసండి కి అర్ధం పులవమని. ఈ మాటలని కొంతమంది యువకులు ఆటపట్టించడానికి కూడా వాడే వారు, గబగబా అంటూ. పప్పుతో కాకుండా పులుసు వేరేగా కలుపుకుని తినేవారు. అప్పుడు నంజుడుకి వుండటానికి వడియాలు, అప్పడాలు వేసేవారు. ఒక కొంటె యువకుడు పంక్తిలో ఒక తాతగారి దగ్గరకెళ్ళి తాతగారు వడియాలు కావాలా అని అడిగేవాడు. ఆయన కావాలంటే ఒక పెద్ద కేక వేసేవాడు! ఒరేయ్ సుబ్బన్నా! ఇక్కడ తాతగారికి వడియాలు కావాలి పట్రా అని. అంటే తాతగారికి పడుచుపెళ్ళాం కావాలంటున్నాడురా అని ఎద్దేవా అన్న మాట. నిజంగా ఇందులో పైకి ఏ విచిత్రమూ లేదు కాని అసలు కొంటె తనం వుంది. తాతగారు కొద్ది ఘటికుడైతే మరొకలా సాగేది. కావాలని వడియాలు తెచ్చినతరవాత ఇదేమిటి ఇవితెచ్చేవూ అనేవాడు. మీరేగా వడియాలుకావలన్నారని అనేవాడు, యువకుడు.అప్పుడు తాతగారు ఒర్నీ! వడియాలంటె పడుచుపెళ్ళాన్ని తెస్తావనుకున్నారా అనేవాడు. మరోలా కూడా సాగేది. ఏమిటీ అన్నారూ అనేవాడు, ముసలాయన. వడియాలుకావాలా అని మళ్ళి అడిగేవాడు, యువకుడు. ఈ తాతగారు ఘటికుడు కనక వడియాలు నాకెందుకూ అనేవాడే కాని వద్దనేవాడు కాదు. తాతా! పెళ్ళిచేసుకుంటావా అంటే పిల్లనిచ్చేవాడెవడురా! అనేవారుకాని వద్దనేవారు కాదు!. అది ఒక సరదా.! వడియాలు నేనేమి చేసుకోనూ అనేవాడు. అంటే నమలడానికి పళ్ళు లేవనీ అర్ధం, పడుచు పెళ్ళాంని నేనేమి చేసుకోనూ అని కూడా అర్ధం వచ్చేది. పోనీ అప్పడాలు కావాలా అంటే, అప్పడాలు ఇప్పటిదాకా నాదగ్గరే వుండాలి, ఎక్కడుందో చూడునాయనా అనేవాడు. ఒకవేళ భార్య పక్కనుంటే అప్పడాలు పక్కనే వుందిగా అనేవాడు.

ఇప్పుడర్ధమైనదనుకుంటాను, అప్పడాలు ( అప్పటి+ ఆలు= అప్పటాలు, అప్పటియాలు, అప్పడాలు అనగా పాత భార్య) వడియాలు అనగా ( వడి+ఆలు= వడియాలు వడి అనగా వేగం, విసురు అని అర్ధాలు, అనగా పడుచు భార్య). ఒక్క మంచినీళ్ళు పోసేవారు మాత్రమే మాట్లాడకుండా ఖాళీ గ్లాసుల్లో మంచినీళ్ళుపోసేవారు. ఇక చివరిది పెరుగు, పెరుగు తెచ్చినవారు పెరుగండి నుంచి పెరగండి నుంచి వడిగా అనడం లో జరగండి దాకా వెళ్ళిపోయేది. అంటే ఇక తిన్నది చాలు లేవండి అన్నట్లుగా.భోజనాల దగ్గరనుంచి అంతా ఒక సారి లేచేవారు, గోవింద నామ స్మరణ చేస్తూ. పంక్తి లో ఎవరేనా తినడంలో వెనక పడితే వారికోసం అందరూ వారి భొజనం పూర్తి అయ్యేదాకా కూచుని వుండేవారు. ఇది వారి పట్ల చూపే గౌరవం. మన వాళ్ళు భోజనాలలో కూడా ఇలాసరదా చూపేవారు. అలా సందడి సందడిగా భోజనాలు ముగిసేవి.

ఇప్పుడు ప్లేట్లు పట్టుకుని క్యూలో నుంచుని కావల్సినవి వేసుకుని/వేయించుకుని కొండొకచో ఒంటి కాలిమీద నిలబడి/ ఎక్కడో ఒకచోట కూచుని భోజనం కానిచ్చేస్తున్నాం మరి. మాధాకోళం బ్రతుకులైపోయాయని ఒక పెద్దాయన వాపోవడం విన్నాను . అందం, హాస్యం చచ్చిపోయాయి.

మీరేమంటారు !
సేకరణ .

*🙏దానం🙏*దానం చేయడంవల్లే గౌరవం లభిస్తుంది కాని కూడబెట్టడంవల్ల కాదు. మేఘాలు నీటిని దానం చేస్తున్నాయి కనుక వాటి స్థానం పైన ...
27/03/2024

*🙏దానం🙏*

దానం చేయడంవల్లే గౌరవం లభిస్తుంది కాని కూడబెట్టడంవల్ల కాదు. మేఘాలు నీటిని దానం చేస్తున్నాయి కనుక వాటి స్థానం పైన ఉంది. సముద్రం నీటిని కూడబెడుతోంది కాబట్టి దాని స్థానం కిందనే ఉంది. దానధర్మాలు అనేది సాధారణంగా వాడే పదం. దానం ధర్మం ఈ రెండు వేర్వేరు శబ్దాలు అయినా దానం అనేది ధర్మాలలో నొకటి. దానం అనేది అతి సులువైన ధర్మం. దానం ద్వారా అన్నింటిని పొందవచ్చును. దానమే పరమ ధర్మమని గరుడ పురాణంలోవుంది. దానం చేయడానికి ముఖ్యంగా రెండు గుణాలుండాలి. అవి దయ, త్యాగభావన. కలియుగంలో యజ్ఞయాగాదులు చేయడం ఎక్కడో కానీ అంతటా సంభవం కాదు. అందువలన ఈ యుగంలో దానమే ప్రధాన ధర్మం అనేది ఋషుల వచనం. దాని వలన సుఖం లభిస్తుంది, సంపదలు వృద్ధి పొందుతాయి, యశస్సు కలుగుతుంది, సత్సంతానం కలుగుతుంది. పాపం హరించుకుపోతుంది, పుణ్యం వస్తుంది.
కేవలం తన కొరకే వండుకొనువారు పంచసూన పాపభూయిష్టితమగు అన్నమును తినుచున్నారు అని భగవద్గీత తృతీయాధ్యాయంలో శ్రీకృష్ణపరమాత్మ తెలిపియున్నాడు. ఈ విషయాన్ని మరింత వివరంగా వ్యాస భగవానుడు శ్రీమద్భాగతంలో చెప్పి ఉన్నాడు.
తన అవసరానికి మించినదానిని ఆశించేవారు, సేకరించేవారు దొంగ అనిపించుకుంటారు. వారు శిక్షార్హులు. కడుపు నిండడడానికి ఎంత అవసరమో అది మాత్రమే నీది. ఈ సంపదలు నీ ప్రయోజనం వలన సమకూరలేదు. ఈశ్వరుని దయవలన నీవు సంపాదిస్తున్నావు. అందువలన అది ఈశ్వరుని సంపద. నీవు ధర్మకర్తవు. అధిక సంపదలు తిరిగి ఈశ్వరునికే అర్పించాలి. అందుకు ధర్మబద్ధనా ధనం దానం. దీన దుఃఖితులకు, అసహాయులకు సహాయం చేయడమే మానవ జన్మకు పరాకాష్ఠ. ఇది ఆర్షమత సిద్ధాంతం.
దానం చేసే దాతలు కొన్ని నియమాలు పాటించాలి. దానం చేసే ద్రవ్యం దాత స్వార్జితమై వుండాలి. న్యాయార్జితం, ధర్మబద్ధంగా ఆర్జించిన ధనమువల్లనే దానఫలం లభిస్తుంది. అక్రమార్జిత ధనం దానం చేస్తే సద్గతులుండవు. అది పాపకృత్యం. నీదికానిది నీవెలాగు ఇతరులకివ్వగలవు? క్షేత్రమెరిగి బీజం- పాత్ర మెరిగి దానం అంటారు. సారవంతమైన నేలలో నాటిన విత్తనం మాత్రమే మొలకెత్తి పెరిగి ఫలాలనిస్తుంది. అట్లే పాత్రుడైనవానికే దానం చేయాలి. అపాత్రునికి ఎట్టి పరస్థితులలోనూ దానం చేయరాదు. దానాలు పది రకాలు అని చెబుతారు. అవి గోవు, భూమి, తిలలు, బంగారం, నెయ్యి, వస్తమ్రు, ధాన్యము, బెల్లము, ఉప్పు, వెండి. నేటి కాలంలో మరికొన్ని దానాలు ప్రాచుర్యం పొందాయి. ప్రాణదానం, విద్యాదానం, అన్నదానం. దానఫలాలు మూడు రకాలు. ఒకటి స్వయంగా పాత్రుడైన వ్యక్తి దగ్గరకు వెళ్లి ఇచ్చిన దానికి ఫలితం ఉత్తమం. తన వద్దకు పిలిచి ఇచ్చిన దానికి ఫలితం మధ్యమం. యాచించినవానికి ఇచ్చిన దానఫలితం అథమం. ఇది అధమముదైనా దానం చేసినందున దోషం లేదు. ఏమంటే యాచకుడికి మీ అవసరం ఉంటుంది.
ధనానికి మూడు రకాల గుణాలున్నాయి. ఒకటి దానము, రెండు భోగము, మూడు నాశము. దానము ఉత్తమమైనది. భోగము మధ్యమమైనది. నాశము అంటే దుర్వినియోగము అధమమైనదని పెద్దలు చెప్తారు. ఉత్కృష్టదానం చేసినవారు మనకు పురాణేతిహాసాలలో గోచరిస్తారు. వామనుడికి భూమి దానం చేసిన బలి చక్రవర్తి, రాక్షస సంహారార్థం దేవతలకు తోడ్పడుట కొరకు ప్రాణదానం చేసిన దధీచి మహర్షి, శరణాగతి కోరిన కపోతాన్ని రక్షించడానికి దేహత్యాగానికి సిద్ధపడిన శిబి చక్రవర్తి, ఊంఛ వృత్తిద్వారా సంపాదించిన ఆహారాన్ని అతిథులకు నివేదించిన ముద్గలమహర్షి, కవచ కుండలాలను దానం చేసిన కర్ణుడు, రాజర్షి పురుషోత్తమదాస్ టండన్‌ను ఈ దానమూర్తుల సరసన చేర్చవచ్చు. దానం వినయంగా శ్రద్ధగా అహంకార రహితంగా చేయాలి.

04/12/2023
🕉 కార్తీక మాసంలో తులసి పూజ విశిష్టత🔅 తులసి పూజ మనము ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శుక్లపక్ష నాడు జరుపుకుంటారు. ఈ రోజున త...
28/11/2023

🕉 కార్తీక మాసంలో తులసి పూజ విశిష్టత

🔅 తులసి పూజ మనము ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శుక్లపక్ష నాడు జరుపుకుంటారు.
ఈ రోజున తులసికి వివాహం జరిపిస్తారు.
ఇంతకీ తులసి చెట్టుకు ఎవరు తాళి కడతారు?
ఎవరితో వివాహం జరిపిస్తారు?
ఎందుకు ఈ పండుగను జరుపుకుంటారో తెలుసుకుందాం.

🔅 హిందూ పురాణాలలో తులసి దేవిని వృందగా పిలుస్తారు.
ఈమె కాలనేమి అనే రాక్షసుడికి అందమైన కూతురు.
ఈ యువరాణి జలంధర్ అనే రాక్షసుడిని వివాహం చేసుకుంటుంది. శివుడి మూడో కన్ను నుంచి వచ్చిన అగ్నిలో నుంచి పుట్టడం వల్ల జలంధరుడికి అపారమైన శక్తులు ఉంటాయి. జలంధరునికి దేవుళ్లంటే అసహ్యం. కానీ దేవుళ్లను అమితంగా ఆరాధించే వృందను ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె మహావిష్ణువుకు మహాభక్తురాలు.

🔅 ఆ యువరాణితో పెళ్లి తర్వాత ఆమె భక్తి, పవిత్రత వల్ల జలంధరుడికి మరింత శక్తి పెరిగిపోతుంది. అది ఎంతలా అంటే ఆఖరికి ఈశ్వరుడు కూడా జలంధరుడిని ఓడించలేకపోతాడు. అతని మూర్ఖత్వంతో శివుడినే ఓడించి ఈ సమస్త విశ్వానికి అధిపతి కావాలని జలంధరుడు కలలు కంటాడు.

🔅 ఈ సమయంలో దేవుళ్లందరూ విష్ణుమూర్తి సహాయం కోరతారు. విష్ణుమూర్తి వృంద తన భక్తురాలు కావటంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్ధంలో పడతాడు.
కానీ జలంధరుడి వల్ల జరిగే నష్టం గుర్తించిన విష్ణువు ఓ మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు.

🔅 పరమ శివునితో జలంధరుడు యుద్ధంలో ఉండగా.. జలంధరుని రూపంలో విష్ణువు.. వృంద వద్దకు వెళ్తాడు. ఆమె విష్ణువుని గుర్తు పట్టలేక అతడే జలంధర్ అని భావిస్తుంది. జలంధరుని రూపంలో ఉన్న విష్ణువు ఆమెను తాకగానే.. అతను తన భర్త కాదని గ్రహిస్తుంది. దీంతో ఆమె పతివ్రత నిష్ట భగ్నం అవుతుంది. వెంటనే జలంధరుడు బలహీనుడు అవుతాడు. అంతలోనే నిజం తెలుసుకున్న ఆమె.. మహావిష్ణువు నిజ రూపాన్ని కోరుతుంది.

🔅 ఆమె తను పూజించిన దేవుడే తనను మాయ చేశాడని తెలుసుకుని బాధపడుతుంది. శ్రీ మహావిష్ణువు మారు రూపం తెలుసుకుని.. తన పవిత్రతపై జరిగిన మోసానికి ఆమె విష్ణువుని రాయిలా మారిపోమని శపిస్తుంది.
విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండక నది వద్ద సాలిగ్రామ శిలగా మారతాడు.
ఆ తర్వాత జలంధరుడు పరమశివుని చేతిలో హతుడవుతాడు. దీంతో ఆమె బాధపడుతూ, తన జీవితాన్ని కూడా ముగించాలి అనుకుంటుంది.

🔅 మహా విష్ణువు భార్య లక్ష్మీదేవి జలంధరుడి భార్యతో తన మాటలను వెనక్కి తీసుకొని శాపం ప్రభావాన్ని ఆపమని కోరుతుంది. అప్పుడు ఆమె తన శాపాన్ని వెనక్కి తీసుకుంటుంది.
అయితే విష్ణువు సాలిగ్రామ రూపాన్ని వివాహం చేసుకున్న తర్వాత ఈ శాపం అంతమవుతుందని చెబుతుంది.
దీని తర్వాత ఆమె సతి సహగమనం చేస్తుంది.

🔅 ఆమె దేహం పూర్తిగా కాలిపోయిన తర్వాత.. ఆమె బూడిద నుంచి తులసి మొక్క పుట్టిందని పురాణాలు చెప్తున్నాయి.

⚜ ద్వాదశ దీపాలు :

🔅 క్షీరాబ్ది ద్వాదశిగా పిలుచుకునే తులసి పండుగ రోజున సాయంత్రం వేళలో తులసి మొక్క దగ్గర ధాత్రి (ఉసిరి మొక్కను) ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు.
అలాగే 12 లేదా 16 లేదా 21 దీపాలను వెలిగించి ప్రత్యేకంగా పూజలు చేస్తారు.
వీటినే ద్వాదశ దీపాలు అంటారు.
ఆ రోజున ప్రతి ఇంటా దీపాల కాంతులతో వెలుగులు విరాజిల్లుతాయి.
తులసి మొక్కను గౌరీదేవిగా.. ఉసిరి మొక్కను శ్రీ మహావిష్ణువుగా పూజించి గౌరీ పూజ చేస్తారు. ఇలా చేస్తే ఆర్థిక బాధలు తొలగి.. సర్వ సంపదలు కలుగుతాయి అంటారు.
కార్తీక మాసంలో ఉసిరి, తులసి పూజ చేస్తే ఎంతో పుణ్యఫలం కూడా లభిస్తుంది.

🔅 తులసి పూజా విధానం :
తులసి చెట్టును లేదా తులసి మొక్క తీసుకుని చిన్న మండపంలా ఏర్పాటు చేసుకోండి. మండపం చుట్టూ ఎర్రటి చీరను కట్టండి. లేదంటే తులసి మొక్కను నేరుగా ఎర్రటి వస్త్రంతో చుట్టవచ్చు.
ఆ తర్వాత తులసి కొమ్మలకు ఎర్రటి గాజులు వేసి అలంకరించండి.
విఘ్నేశ్వరుడు, ఇతర దేవుళ్లకు ప్రార్థనలు చేయండి. అప్పుడు సాలిగ్రాముని కూడా ఆరాధించండి. తులసి చెట్టు దగ్గర కొబ్బరికాయ, చక్కెర బొమ్మలు, ఐదు రకాల పండ్లను ఉంచండి. అనంతరం హారతి ఇచ్చి తులసి, సాలిగ్రామని జపిస్తూ ప్రార్థించండి.

🔅 పండుగ ప్రాముఖ్యత :
తులసికి వివాహం చేయడం వల్ల వివాహ జీవితంలో కష్టాల నుంచి ప్రయోజనం పొందవచ్చు. అలాగే పెళ్లి చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ తులసి పూజను చేస్తే వారికి పరిష్కారం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ పండుగ వివాహ సంబంధిత సమ్యలను తొలగిస్తుందని చెబుతారు.

🔅 కార్తీకమాసంలో మహా లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టును పూజిస్తారు. ఉసిరి చెట్టును నారాయణుడిగా, తులసి చెట్టును లక్ష్మీదేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు.

🔅 ఈ మాసం విష్ణువుకి అత్యంత ఇష్టమైన మాసం కావడంతో, ఈ మాసంలో విష్ణువును, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం పూజలు నిర్వహిస్తారు.

🔅 తులసి మొక్క మూలంలో సర్వ తీర్థాలు, మధ్యభాగంలో సమస్త దేవతలు, తులసి మొక్క పైభాగంలో సర్వ వేదాలతో కొలువై ఉన్న లక్ష్మీదేవి ఉంటారు.

🔅 అందుకే కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అని పండితులు చెబుతున్నారు.

సర్వేజనాం సుఖినోభవంతుః

సేకరణ :జి.వి.రావు

10/11/2023

🕉 *ఓంకారం విశిష్ట‌త‌.*🕉
🕉 ➖➖➖🕉

*మ‌న‌లో చాలామంది ప్ర‌శాంత‌త కోసం నిశ్శ‌బ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎంద‌రో శ్ర‌వ‌ణానందం క‌లిగించే శ‌బ్దాన్ని సంగీతం రూపంలో ఆస్వాదిస్తారు.*

*పంచ‌భూతాల్లో శ‌బ్దం అన్నింటిక‌ంటే ముందు ఉంటుంద‌ని పండితులు చెబుతారు. ఆ శ‌బ్దం ఆకాశం నుంచి వ‌స్తుంది. శ‌బ్దానికి ఆధారం ఓంకారం.*

*నిజానికి ఓంకారం ప్ర‌తి దేహంలో ఉంటుంది. ‘ఓం’ అని శబ్దం చేయగానే, ఆ తరంగాలతో దేహం పులకితం అవుతుంది.*

*‘ఓం’ అన్న‌ది మంత్రం కాదు..! మ‌త సంబంధ‌మైన‌ది అస‌లే కాదు.. వేదాల‌లో నిక్షిప్త‌మైన ఓంకార నాదం మానవ ఆరోగ్య ర‌హ‌స్యానికి ఒక సూత్రం.*

*ప్రాచీన కాలంలో ఋషులు వాత‌వార‌ణ ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను త‌ట్టుకుని ఉప‌వాస దీక్ష‌ల‌లో కూడా ఆరోగ్య‌వంతంగా ఉండ‌టం వెనుక ఓంకార నాద‌మే ర‌హ‌స్యం.*

*విదేశాల్లోని విశ్వ‌విద్యాల‌యాల్లో జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో సైతం ఓంకారం మృత్యుంజ‌య జ‌పం అని బ‌య‌ట‌ప‌డింది.*

*ఓంకారాన్ని, మ‌తాన్ని ముడిపెట్ట‌డం వ‌ల్ల ఓంకారం చేసే మేలు ప‌రిమితం ‌ అవుతుంది.*

*ఓంకారం ఉచ్ఛ‌రించ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు…*

*నాభిలోంచి ల‌య‌బ‌ద్ధంగా ఓంకార ప‌దాన్ని ప‌ల‌క‌గ‌లిగితే మాన‌వుడి ఆరోగ్యం ప‌రిపూర్ణంగా ఉంటుంది.*

*ఓంకారం ప‌దిహేను నిమిషాల పాటు ఉచ్చ‌రించ‌గ‌లిగితే ర‌క్త‌పోటు త‌గ్గుతుంది.*

*ర‌క్త‌ ప్ర‌స‌ర‌ణ స‌క్ర‌మంగా జ‌రిగి గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.*

*మాన‌సిక అల‌స‌ట‌, అల‌జ‌డి త‌గ్గి ప్ర‌శాంతత క‌లుగుతుంది.*

*ఊపిరితిత్తుల ప‌నితీరు మెరుగుప‌డుతుంది.*

*జీర్ణ ప్ర‌క్రియ స‌వ్యంగా సాగుతుంది.*

*కిడ్నీ వ్య‌వ‌స్థ క్ర‌మ‌బ‌ద్ధంగా ప‌నిచేస్తుంది.*

*థైరాయిడ్ ప‌నితీరును క్ర‌మ‌బ‌ద్ధం చేస్తుంది. ఓంకారంలో ఉన్న మ‌హ‌త్యం ఇదే.*✍️ *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🕉🌷🙏🌷🕉

🕉🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏🕉

సేకరణ : కండగడ్డల రెడ్డయ్య - యోగాచార్యులు

🕉 *Omkara specialty.* 🕉
🕉➖➖➖🕉

*Many of us seek silence for peace. Also, many people enjoy the sound of listening pleasure in the form of music.*

*Scholars say that sound comes first in Panchabhutas. That voice comes from the sky. Omkara is the basis of sound.*

*Actually Omkara is present in every body. When the sound of 'OM' is uttered, the body is thrilled with those waves.*

* 'Om' is not a mantra..! Not religious at all.. Omkara nadam enshrined in the Vedas is a formula for the secret of human health.*

Omkara nada is the secret behind how sages in ancient times survived adverse weather conditions and remained healthy even during fasting initiations.*

*In the researches conducted in the universities abroad, it has been revealed that Omkara is the chanting of Mrityunjaya.*

*Linking Omkara with religion will limit the good of Omkara.*

*Benefits of chanting Omkara…*

*A person's health will be perfect if he can chant the word Omkara rhythmically from the navel.*

*If Omkara can be chanted for fifteen minutes, the blood pressure will decrease.*

* Blood circulation is regular and heart health is improved.*

*Reduces mental fatigue, restlessness and calmness.*

*Lung function improves.*

*Digestive process goes smoothly.*

*Kidney system works regularly.*

* Regulates thyroid function. This is the importance of Omkara.*✍️ *Sarvam Shrikrishnarpanamastu*
🕉 🌷🙏🌷🕉

🕉🙏Loka Samasta Sukhinobhavantu!🙏🕉 🕉

Collection : Kandagaddala Reddaiya - Yogacharyas

Address

Rajahmundry

Website

Alerts

Be the first to know and let us send you an email when మన సాంప్రదాయాలు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to మన సాంప్రదాయాలు:

Videos

Share

Category


Other Magazines in Rajahmundry

Show All