Jago Telangana

  • Home
  • Jago Telangana

Jago Telangana మీడియా మొత్తం అమ్ముడు పోతున్న ఈ రోజు?
(8)

Lifetime English Super OfferJust 500కింద లింక్ క్లిక్ చేసి ఫ్రీ గా APP download చేసుకుని lifetime ఇంగ్లీష్ కోర్స్ తీసుకో...
22/03/2023

Lifetime English
Super Offer
Just 500
కింద లింక్ క్లిక్ చేసి ఫ్రీ గా APP download చేసుకుని lifetime ఇంగ్లీష్ కోర్స్ తీసుకోండి

https://play.google.com/store/apps/details?id=com.english.ramesh

Super Offer
మొదటి 200 ల మందికి మాత్రమే
Lifetime English
ఇంగ్లీష్ వొచ్చేదాకా నేర్పిస్తాం
పైన లింక్ క్లిక్ చేసి APP ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోండి
ఈ course Purchase చేయండి

ENGLISH RAMESH APPBAAP OF ALL SPOKEN ENGLISH APPSApp link https://play.google.com/store/apps/details?id=com.english.rame...
12/02/2023

ENGLISH RAMESH APP
BAAP OF ALL SPOKEN ENGLISH APPS

App link
https://play.google.com/store/apps/details?id=com.english.ramesh

ఈ ఒక్క APP మాత్రమే మిమ్మల్ని ఇంగ్లీష్ లో మాట్లాడిస్తుంది

త్వరలోనే అన్ని కోర్సెస్ అప్లోడ్ చేస్తాం
డౌన్లోడ్ చేసి పెట్టుకోండి

A Must watch short filmచూసి తీరాల్సిన షార్ట్ ఫిల్మ్చూస్తే షేర్ చేయకుండా ఉండలేరు
29/01/2023

A Must watch short film
చూసి తీరాల్సిన షార్ట్ ఫిల్మ్
చూస్తే షేర్ చేయకుండా ఉండలేరు

Chandrudu is a short film that describes caste discrimination in India before the 2000s and how footwear is associated with the hierarchical system in societ...

https://youtu.be/1TcWVx5dmSUఅది ఎంత? ఇది ఎంత? అవి ఎంత? ఇవి ఎంత?షాపింగ్ వెళ్ళినపుడు ధరల్ని కూడా ఇంగ్లీష్ లో అడగకపోతే గర్ల...
24/12/2022

https://youtu.be/1TcWVx5dmSU

అది ఎంత? ఇది ఎంత?
అవి ఎంత? ఇవి ఎంత?
షాపింగ్ వెళ్ళినపుడు ధరల్ని కూడా ఇంగ్లీష్ లో అడగకపోతే గర్ల్ ఫ్రెండ్ ముందు ఇజ్జత్ పోతది
అందుకే ఈ క్లాస్ చూడండి

Written by: Venkat Siddareddy 😍22-12-22జీవితంలో బాగా గుర్తుండిపోయే ఒక రోజు.నాకైతే It's the dawn of a new era.Why?Why? అన...
23/12/2022

Written by: Venkat Siddareddy 😍

22-12-22
జీవితంలో బాగా గుర్తుండిపోయే ఒక రోజు.
నాకైతే It's the dawn of a new era.

Why?

Why? అనేది చాలా పెద్ద ప్రశ్న. చాలా డేంజరస్ ప్రశ్న కూడా.

ఎందుకు అని అడగకపోతే మార్పుకి అవకాశం ఉండదు. ఎందుకు అని అడకపోతే ఉన్న సమస్యల పట్ల అవగాహన రాదు. ఎందుకు అని ప్రశ్నించినప్పుడే ఉపరితల-స్థాయి వివరణలకు అందని సూక్ష్మవిషయాల గురించి మనకు తెలుస్తుంది. ఎందుకు అని అడిగితేనే విభిన్న వివరణలు, దృక్కోణాలను పరిశీలించే అవకాశం ఉంటుంది. సమస్య లోతెంతో తెలుస్తుంది.

Anvikshiki Publishers మొదలైందే తెలుగులో వెయ్యి పుస్తకాలు ఎందుకు అమ్మలేము అనే ప్రశ్నతో.

తెలుగులో చాలామంది పబ్లిషర్స్ ఉన్నారు. బలమైనా పునాదులున్న విశాలాంధ్ర, ప్రజాశక్తి., నవచేతన, నవతెలంగాణ వాళ్లు ఉన్నారు. చాలా అనుభవం ఉన్న హైదరాబాద్ బుక్ ట్రస్ట్, పీకాక్ క్లాసిక్స్, మంచి పుస్తకం, ఎమెస్కో, పల్లవి లాంతి వాళ్ళున్నారు. ఇప్పుడిప్పుడే మొదలైన మాలాంటి వాళ్ళున్నారు. అసలు ఉన్నారని కూడా తెలియదు కానీ కోట్లలో వ్యాపారం చేసే ప్రచురణ కర్తలు ఉన్నారు. అయితే వీళ్ళందరు ఉన్నప్పుడు మధ్యలో మేమెందుకు?

Why?

1) Technology - రెండు మూడు పుస్తకాలు ప్రచురించే సమయంలో దగ్గరగా ఉండి గమనించినప్పుడు తెలుసుకున్న విషయమేంటంటే తెలుగు సాహిత్యంలో 99 శాతం పేజ్ మేకర్ అనే ఔట్ డేటెడ్ టెక్నాలజీ పట్టుకుని బయటకు రాలేకపోతున్నారు. దానికి అనుగుణంగా పని చేసే అను ఫాంట్స్ కూడా వీళ్లందరినీ ఒక చట్రంలో ఇరికించేసింది. కానీ ఆ సాఫ్ట్ వేరే అడోబి వాళ్లే వదిలేసి ఒక దశాబ్దం అయింది. ఈ సాఫ్ట్ వేరే కొత్త విండోస్ వెర్షన్స్ లొ పని చేయదు. కాబట్టి పాత సిస్టమ్స్, పాత విండోస్ లోనే ఉండిపోవాలి. అయితే అడోబీ వాళ్లే తయారుచేసిన ఇన్ డిజైన్ లో పేజ్ మేకర్ కంటే పది రెట్లు వేగంగా పని చెయ్యవచ్చు. పది రోజులు పట్టే లే అవుట్ పని, పది గంటల్లో ముగించొచ్చు. మేము ఇది తెలుసుకున్నాం. వాడుతున్నాం.

2) ఫాంట్స్ - ఇదొక పెద్ద సమస్య. అను ఫాంట్స్ వాడడం వల్ల మనం చేసిన పని మరొకరితో షేర్ చేసుకునే అవసరం లేదు. సరే పోనీ అను వదిలేద్దామంటే వేరే దిక్కు లేదు. ప్రింటింగ్ కి సరిపోయే ఫాంట్స్ ఒకటో రెండో ఉన్నాయి. అందుకే ఫాంట్ డెవలపర్స్ తో మాట్లాడి తెలుగులో ప్రింటింగ్ కి సరిపోయేలా కొత్త ఫాంట్స్ డిజైన్ చేపించే పనిలో ఉన్నాం.

3) కవర్ డిజైన్స్ - మారుతున్న కాలానికి అనుగుణంగా ఎట్రాక్టివ్ గా కవర్ పేజీలు చేయడంలోని అవసరాన్ని చాలామంది పబ్లిషర్స్ అసలు గమనించడం లేదు. మేము ఈ విషయంలో విశేషంగా కృషి చేశాం.

4) మార్కెటింగ్ - సినిమాలు తీసి భారీ ప్రమోషన్స్ చేసుకుంటే ఎవరూ ఏమనరు. పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ పెట్టుకుంటే ఆర్టిస్ట్స్ ఎవరూ ఏం అనరు. కానీ రచయిత మాత్రం తన పుస్తకాన్ని తను ప్రమోట్ చేసుకోడానికి సిగ్గుపడతారు. మేము ఆ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాం.

5) పుస్తకాల షాపులు - తెలుగు సాహిత్య రంగంలో అతి పెద్ద సమస్య ఇదే. ఉన్నవే కొన్ని షాపులు.ఉన్నవి కూడా అంతంత మాత్రమే నడుస్తున్నాయి. ఆ ఉన్న షాపులకైనా పుస్తకాలిస్తే డబ్బులు తిరిగిరావనేది పెద్ద కంప్లయింట్. నాలుగేళ్ళు అన్ని పుస్తకాల షాపుల వాళ్లతో కలిసి పని చేస్తున్నాం కాబట్టి వాళ్ల ఇబ్బందులేంటో కూడా తెలుసు. అందుకే మేము ఆన్ లైన్ ద్వారా పుస్తకాలను అందరికీ చేర్చడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం.

6) అసలు తెలుగు పాఠకులు ఎక్కడున్నారు? ఏమైపోయారు?

ప్రచురణ సంస్థలు కొత్తవారి రచనలు ప్రోత్సాహించవు. వందేళ్ల క్రిందటి రష్యన్ సాహిత్యం అంటే ఇప్పటికే మక్కువ. అదొక నోస్టాల్జియా ఏమో. లేదా అవే పాత క్లాసిక్స్ ని మళ్ళీ మళ్ళీ ముద్రించడం. రాసినవి ప్రచురించే ప్రింట్ పత్రికలు కరువైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త రచయితలు ఎందుకు రాస్తారు? రాసినా ఏం రాయాలి? సామాజిక ప్రయోజమున్నదే రాయాలా? అవును. అదే రాయాలి. లేకపోతే ఈ సమాజం రచయితను గుర్తించదు. సైన్స్ ఫిక్షన్ మాకొద్దు. క్రైమ్ ఫిక్షన్ మాకొద్దు. రొమాంటిక్ ఫిక్షన్ మాకొద్దు. అర్బన్ కాంటెంపరరీ నేపథ్యం అసలే వద్దు. అన్నీ వద్దు. కేవలం సామాజిక ప్రయోజం ఉన్నవే రాయాలి. ముందు మనలో ఉండాలి కదా ఆ యాంగిల్. మొదట్లో కొంత కష్టపడి రాసినా రాను రానూ మనలో మన రాతల్లో ఉన్న వైరుధ్యం వల్ల అసలు రాయడానికే దూరమైపోతాం. రచయిత సమాజానికి కుక్క కాపలా కాయలేడని కొ.కునే ఎప్పుడో అన్నారు. కానీ ఆ బాధ్యత ను కొన్ని అదృశ్య శక్తులు తెలుగు రచయితల మీద గట్టిగా మోపింది. గత మూడు దశాబ్దాలుగా రచయితలు ఇదే పనిగా పెట్టుకున్నారు. సమాజానికి ఉపయోగపడే సాహిత్యం పాఠకుడు ఉన్నా, లేకపోయినా వస్తూనే ఉంటుంది. కానీ మొదట మనం చదివేది ఫ్యాంటసీ కథలు, తర్వాత కొంచెం పెద్దయ్యాక ప్రేమ కథలు ఆకర్షిస్తాయి. ఇది అందరికీ జరిగేదే. ఇలా అలరించే సాహిత్యం లేక పాఠకులు దూరంగా వెళ్ళిపోయారు. కొత్త జెనరేషన్ వాళ్ళలో చదివేవాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ వారికి కావాల్సిన ఎంట్రీ పాయింట్ సాహిత్యం లేదు. ఇది అన్నింటికన్నా పెద్ద సమస్య.

ఇవి కాకుండా ఇంకో వంద సమస్యలున్నాయి. కానీ ముఖ్యంగా అందరినీ ఇబ్బంది పెట్టే అంశాలు ఇవి. వాటన్నింటికీ మాకు వీలైనంతలో సొల్యూషన్స్ కనుక్కున్నాం కాబట్టే ఇంత త్వరగా వంద మంచి పుస్తకాలు తేగలిగాం. అయినా కూడా ఇది సరిపోదు. పది కోట్లమంది ఉన్న తెలుగు వాళ్లకి వెయ్యి కాపీలు అమ్మలేక పోవడమనేది చాలా పెద్ద సమస్య. ఇలాగే కొనసాగితే కొన్నేళ్లకు చదివేవాళ్ళు అసలే ఉండరని అర్థమైంది.

రాసేవాళ్లు ఎప్పటికీ ఉంటారు. రాయడం చాలాసార్లు బాధ్యత. అలవాటు. ఆనందం.

కానీ పూర్తిగా చదివేవాళ్ళే లేకపోతే ఏమవుతుంది?

మేము నాలుగేళ్ళుగా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే ప్రాసెస్ లో ఉన్నాం. ఇది ఎంత రిస్క్ తో కూడుకున్నదంటే ఎగురుతున్న విమానాన్ని రిపేర్ చేయడం లాంటిది. ఎప్పుడైనా కూలిపోవచ్చు. అసలు రిపేర్ కూడా కాకపోవచ్చు. అయినా కూడా ఎక్కడో ఏదో ఆశ. Light at the end of the tunnel లాగా.

ఇంత కష్టం వృధా పోతుందా? దేవుడు, కర్మ ఇవన్నీ కాకపోయినా మా కష్టం వృధా పోవడం అసలు ప్రకృతి విరుద్ధం అన్నంతగా మేము చేస్తున్న పనిని నమ్మాం.

పోయిన సంవత్సరం Bp Padala ని ఒకసారి కలిసినప్పుడు నేను కూడా తెలుగు సాహిత్యానికి ఏదో ఒక విధంగా కాంట్రిబ్యూట్ చెయ్యాలనుంది అన్నారు. అప్పుడు నా మనసులో ఉన్న ఒక ఐడియా చెప్పాను.

మనం ఎంత కష్టపడ్డా ఇప్పుడున్న ప్రచురణ రంగాన్ని సమూలంగా మార్చడమనేది చాలా కష్టమైన పని. ప్రపంచంలో అన్ని భాషల్లో, అన్ని దేశాల్లో పుస్తకాలు కొనుక్కుని చదివే వాళ్ళు, పుస్తకాలను తమ టాబ్లెట్, మొబైల్స్ లో ఈ బుక్ లేదా ఆడియో బుక్ గా చదివే/వినే వాళ్ల శాతం దాదాపు 50:50 గా ఉంది. కానీ మన దురదృష్టం ఏంటంటే ఆమెజాన్ కిండిల్ లాంటి పరికరాల్లో తెలుగు సపోర్ట్ లేదు. గత నాలుగేళ్ళుగా ఎదురు చూస్తున్నా, ఎన్నో భారతీయ భాషలున్నప్పటికీ, తెలుగు మాత్రం లేదు. బహుశా మన వెయ్యి కాపీల విషయం వాళ్లకీ తెలిసే ఉంటుంది.

ప్రింట్ బుక్స్ ఉన్నప్పటికీ రాబోయే కాలంలో ఈ-బుక్స్, ఆడియో బుక్స్ వాడే వాళ్ల సంఖ్య పెరిగిపోతుంది. ఆ డైరెక్షన్ లో నేను కొంత వర్క్ చేసిపెట్టాను. మీరు ఇన్వెస్ట్ చేస్తానంటే ఒక ప్రయత్నం చెయ్యొచ్చు అని పని మొదలు పెట్టాం. తెలుగులో ఈబుక్ తయారు చేయడం వరకూ ఈజీగానే అయిపోయింది. కానీ ఇక్కడ్నుంచే అసలు సమస్యలు మొదలయ్యాయి.

నాతో కలిసి పనిచేసే ఒక మంచి టెక్ టీం కోసం చాలావెతికాను. నాకు టెక్నాలజీ తెలుసు, కానీ దాదాపు ఒక ఏడేళ్ల పాటు ఒక్క లైన్ కూడా కోడ్ రాయలేదు. కొత్త టెక్నాలజీ నేర్చుకుని చేసేంత ధైర్యం చెయ్యలేకపోయాను. పడాల కి సారీ చెప్పేసి నా పనిలో పడిపోయాను.

ఒకరోజు సంజయ్ అని ఒకతను మా ఆఫీస్ కి వచ్చాడు. మిత్రుడు Vijay Namoju కలీగ్ అతను. కలిసాక మాటల్లో అతను తనొక ఈబుక్ యాప్ తయారు చేస్తున్నానని చెప్పాడు. వెంటనే కనెక్ట్ అయిపోయాం. ముందు యాప్ పేరేం పెడ్దాం అనుకున్నాం. చదువు అని డిసైడ్ అయిపోయాం. అలా "చదువు" అనే ఒక కొత్త ఐడియాకి బీజం పడింది.

చేసెయ్యొచ్చు అనుకున్నాం. సంజయ్ టెక్నాలజీ వైపు, నేను, మహి సాహిత్యం వైపు ఫోకస్ పెట్టి పని మొదలు పెట్టాం.

అసలింతవరకూ భారతదేశంలో ఏ ప్రాంతీయ భాషలోనూ సరైన ఏ బుక్ యాప్ లేదు. అమెజాన్ కిండిల్, లేదా గూగుల్ ప్లే బుక్ స్టోర్ లో మన ఈ బుక్స్ పెట్టుకోవడం తప్ప ఆ భాష కోసం ప్రత్యేకంగా ఒక యాప్ లేదు. ఆశ్వర్యంగా అనిపించింది. అసలు ప్రాంతీయ భాషల్లోనే కాదు, ఇంగ్లీష్ కి కూడా ఒక్క జగ్గర్‌నాట్ అనే యాప్ తప్పితే మరొక యాప్ కనిపించలేదు. ఇదేంటి? ప్రపంచమంతా ఈ బుక్ యాప్ వైపు వెళ్తుంటే మనవాళ్ళు ఎందుకింకా ఆ ప్రయత్నాలు మొదలుపెట్టలేదని అనుకున్నాం.

చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఇంపాజిబుల్ టాస్క్ ని నెత్తిమీద పెట్టుకున్నామని అర్థమైంది. ఆరునెలలుగా మా చిన్న టీం నిద్రాహారాలు మానేసి పని చేశారు. ఇంపాజిబుల్ అనుకున్న ఎన్నో పనులను సాధ్యం చేశారు.

ఒక నెల క్రితం, డిశెంబర్ బుక్ ఫెయిర్ కల్లా సిద్ధం కావొచ్చు అని నమ్మకం కుదిరాక, చదువు యాప్ ని ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు వాళ్లకి చేరేలాగా ఎవరైనా నమ్మకమైన వ్యక్తి బ్రాండ్ ఎంబాసిడర్ గా ఉంటే బావుంటుంది అనుకున్నాం. వెంటనే సుకుమార్ గారిని కాంటాక్ట్ చేశాం, అడగ్గానే ఒప్పుకున్నారు. అలా మాతో చేతులు కలిపారు సుకుమార్.

ఆయనకి మేమెప్పుడూ రుణపడి పుంటాం. ఆయన మా మీద పెట్టిన నమ్మకాన్ని పోగొట్టకుండా అద్భుతంగా "చదువు" యాప్ తయరు చేశాం.

ఈబుక్ యాప్ తయారు చేయడం పెద్ద కష్టం కాదు. వారం రోజుల్లో మంచి ఈపబ్ రీడర్ ఒకటి చేసెయ్యొచ్చు., కానీ ఇది హాబీ ప్రాజెక్ట్ గా బిల్డ్ చేసిన యాప్ కాదు. ముందు తెలుగు సాహితీ ప్రియులను చేరుకుని, ఆ తర్వాత మిగతా అన్ని భాషల్లోకి వెళ్ళగలిగే సామర్థ్యంతో తయారు చేసిన ప్రొఫెషనల్ యాప్.

ప్రపంచంలో ఏ ఈబుక్ యాప్ కైనా సరితూగేలా డిజైన్ చెయ్యబడ్డ యాప్ చదువు. ఇందులో

1) ఈబుక్స్
2) ఆడియో బుక్స్
3) పుస్తక పరిచయాలు
4) కథలు
5) మ్యాగజైన్స్

ఉంటాయి.

రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో కొత్త ఫీచర్స్ చదువులో అందుబాటులోకి వస్తాయి.

ఒక పుస్తకం చదవాలంటే ఇప్పుడు కేవలం ఒక్క క్లిక్ తో మీ మొబైల్ లో హాయిగా చదువుకోవచ్చు. ఇది PDF రీడర్ కాదు. ఇందులో ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. బ్యాక్ గ్రౌండ్ మార్చుకోవచ్చు. ఇంకా చాలా కస్టమైజ్ చేసుకోవచ్చు.

ఇందులో కేవలం ఆన్వీక్షికి పుస్తకాలు మాత్రమే కాదు తెలుగు సాహిత్యంలో ముఖ్యమైన పుస్తకాలన్నీ ఒక్క క్లిక్ లో ప్రపంచంలో ఏ మూలన్నా చదువుకోవచ్చు.

కన్యాశుల్కం నుంచి కొండపొలం వరకూ
మైదానం నుంచి మనోధర్మపరాగం వరకూ
ఏ పుస్తకమైనా పాఠకులకు అందుబాటులోకి తేవాలన్నది మా కల.
మొన్నమొన్నటి వరకీ ఇది కలే.
ఇప్పుడు ఇది పూర్తిగా నిజం.
ఇప్పుడు మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా "చదువు"కోవచ్చు.

ప్రతి పుస్తకం కొనక్కర్లేదు. నెలకి 99 రూపాయలకే మీకు నచ్చినన్ని పుస్తకాలు చదువుకోవచ్చు.

వారం వారం ఐదు కొత్త పుస్తకాలు.
పాతిక కొత్త కథలు.
మ్యాగజైన్స్, ఆడియో బుక్స్. త్వరలో బాలసాహిత్యం కూడా అందుబాటులోకి తెస్తాం.

మన యాప్ అని ప్రతి తెలుగు వాడు గర్వంగా చూపించుకునేలా అతి సుందరంగా డిజైన్ చేయబడింది.

మీ ప్లే స్టోర్ లో, లేదా ఆపిల్ స్టోర్ లో డౌన్ లోడ్ చేసుకోండి.

ఒక్కసారి ఫీచర్స్, కంటెంట్ బ్రౌజ్ చేయండి. మా కష్టం మీకే తెలుస్తుంది. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. ఈ బుక్ ఫెయిర్ లో వన్ ఇయర్ సబ్‌స్క్రిప్షన్ కేవలం 299 రూపాయలకే పొందండి.

రోజుకు రూపాయి కంటే తక్కువ ఖర్చుతో లక్ష పేజీలకు పైగా సాహిత్యం ఉన్న పాకెట్ లైబ్రరీ - చదువు.

వెంటనే చదువు డౌన్ లోడ్ చేసుకోండి.

https://onelink.to/u9znsh

తెలుగు సాహిత్యాన్ని మేలిమలుపు తిప్పండి.

PS: ఇంకా చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరు ఎదుర్కొన్న సమస్యలు మాకు తెలియచేయండి. దాదాపు యాభై వేల పేజిలు స్కాన్ చేసి, టైప్ చేసి, లే అవుట్ చేసి, ప్రూఫ్ చేయడంలో ఖచ్చితంగా చాలా తప్పులు దొర్లుంటాయి. అవన్నీ కంటున్యూయస్ గా కరెక్ట్ చేస్తూనే ఉన్నాం. టెక్నాలజీ పరంగా అక్కడక్కాడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మాకు తెలియచేయండి.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Jago Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share