TNEWS 440

TNEWS 440 Follow The Page

Please Subscribe
09/01/2024

Please Subscribe

Share this post
09/01/2024

Share this post

09/01/2024

Bhagavad Gita 10.6

09/01/2024

Only by Loving Devotion to Me Does One Come to Know Who I am In Truth. gita quotes in telugu, gita quotes whatsapp status, gitas messag...

31/12/2023

🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు,

తేది ... 31 - 12 - 2023,
వారం ... భాను వాసరే (ఆది వారము),
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
కృష్ణ పక్షం,

తిధి : చవితి ఉ 10.11 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం : మఖ పూర్తిగా
యోగం: ప్రీతి తె 3.05 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం : బాలవ ఉ 10.11 వరకు
కౌలవ రా 11.14 వరకు
అమృతకాలం : తె 4.37 - 6.23 వరకు
దుర్ముహూర్తం : సా 4.04 - 4.48 వరకు
వర్జ్యం : సా 6.02 - 7.48 వరకు
రాహుకాలం : సా 4.30 - 6.00 వరకు
యమగండకాలం : మ 12.00 - 1.30 వరకు
సూర్యరాశి : ధనస్సు
చంద్రరాశి : సింహం
సూర్యోదయం : 6.34
సూర్యాస్తమయం : 5.32

*నేటి మాట*

ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ
శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో సుబ్బయ్య శ్రేష్టి తన యొక్క పీఠికాపుర అనుభవాలు, శంకరభట్టుకు తెలియజేస్తూ ఉన్నారు.

సుబ్బయ్య శ్రేష్టి: శ్రీపాదుల వారు ఈ వింతపద్ధతి ద్వారా తన తండ్రిని ఋణవిముక్తులను చేసిన వృత్తాంతము,

పీఠికాపురము అంతయు దావానలము వలె వ్యాపించినది.

శ్రీపాదుడు మూడు సంవత్సరముల బాలుడు.

అప్పలరాజు శర్మ కన్నుల నుండి అశ్రువులు ధారాపాతముగా వర్షించెను.

సుమతీ మహారాణి తన ముద్దుల కుమారుని హృదయమునకు హత్తుకొని ఎంతయోసేపు తన్మయావస్థలో ఉండెను.

రాజశర్మ గారి ఇంటికి,
పైండా వెంకటప్పయ్య శ్రేష్టియును, నరసింహ వర్మయును, బాపనార్యులును వచ్చిరి.

తండ్రిని ఋణవిముక్తుని చేయుట, పుత్రుని ధర్మమని శ్రీపాదుల వారు సెలవిచ్చిరి.

నన్ను కూడా రాజశర్మ గారి ఇంటికి రమ్మని ఆహ్వానించిరి.

నేను సమావిష్టులు అయిన పెద్దల సమక్షంలో, రాజశర్మ గారి బాకీ తీరెనని చెప్పితిని.

దానికి రాజశర్మ గారు అంగీకరించలేదు.

ఎవరో జటాధారి వచ్చి, పది వరహాలు ఇచ్చి, రాగి పాత్రను కొనుక్కొని వెళ్లిన యెడల, ఋణం ఎట్లు తీరినట్లు అవునని, రాజశర్మ ప్రశ్నించెను.

అంతట ఈ రసవత్తరమైన చర్చ జరిగినది.

బాపనార్యులు: ఆ జటాధారి ఎవరో నీకు తెలియునా?

శ్రీపాదుల వారు: ఆ జటాధారియే కాదు, అందరి జటాధారులను గురించి కూడా నాకు తెలియును.

బాపనార్యులు: నీవు మూడు సంవత్సరముల బాలుడవు.
వయస్సునకు మించిన మాటలను పలుకుచున్నావు.
అందరి గురించి తెలియటకు నీవు ఏమైనా సర్వజ్ఞుడవా?

శ్రీపాదుల వారు: నా వయస్సు మూడు సంవత్సరములని మీరందరూ అనుకొనుచున్నారు.
కానీ నేను అనుకొనుట లేదు.

నా వయస్సు అనేక లక్షల సంవత్సరములు.
నేను ఈ సృష్టికి ముందు ఉన్నాను.
ప్రళయానంతరము కూడా ఉందును.
సృష్టి యొక్క కార్యకలాపములు జరుగు సమయమందును ఉందును.

నేను లేనిదే, సృష్టి స్థితి లయములు జరుగనేరవు.

నేను సాక్షిభూతుడనై వీటన్నింటినీ గమనించుచుందును.

బాపనార్యులు: శ్రీపాదా! చిన్నపిల్లవాడు తాను చంద్రమండలము నందు ఉన్నట్లు తలంచినంత మాత్రమున,
చంద్రమండలము నందు ఉన్నట్లు కాదు.

ప్రత్యక్ష అనుభవము ఉండవలెను.
సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము కేవలము జగత్ప్రభువు యొక్క లక్షణములు.

శ్రీపాదుల వారు: నేను సర్వే సర్వత్ర స్థితమై ఉండు, ఆదితత్వమును.

ఆయా అవసరములను బట్టి నేను అచ్చట ఉన్నట్లు వ్యక్తమగుచుందును.

వ్యక్తముకానంత మాత్రమున, నేను అచ్చట లేనట్లు కాదు.

జీవరాసులలోని, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశముల యందు,
నేను స్థితుడనై ఉన్నాను.

నా ఉనికి వల్లనే అవి,
ఆయా క్రియాకలాపములను కావించును.

నేను ఫలానా కోశమునందు ఉన్నట్లు నీకు అనుభవము ఇచ్చినచో, ఆ కోశము నందు,
నేను ఉన్నట్లు నీవు భావించెదవు.

నీకు నేను అనుభవమును ఇవ్వనంత మాత్రమున,
నేను ఆ కోశములలో లేనని కాదు,
దాని అర్థము.

నేను సర్వే సర్వత్రా ఉన్నాను.

సమస్తములైన జ్ఞానవిజ్ఞానములును నా పాదపీఠిక కడనున్నవి.

నా సంకల్పము మాత్రము చేతనే ఈ సృష్టి అంతయును ఏర్పడినది.

నేను సర్వశక్తిమంతుడను అగుటలో ఆశ్చర్యము ఏమున్నది?

అప్పలరాజు శర్మ: నాయనా! చిన్ననాటి నుండియు,
నీవు మాకు సమస్యాత్మకముగా ఉన్నావు.

నీవు పదేపదే దత్తప్రభువునని అనుచున్నావు.

నృసింహ సరస్వతి అని పేరున మరియొక అవతారముగా వచ్చేదనని,
పదేపదే చెప్పుచున్నావు.

లోకులు కాకులు.
వారు ఇదంతయును నాటకమనియు, బూటకమనియు, మనఃచాంచల్యము వలన కలిగిన,
తెలివిమాలినతనమనియు రకరకములుగా చెప్పుచున్నారు.

మనము బ్రాహ్మణులము.
మనకు విధించబడిన ధర్మకర్మలను ఆచరించుట మంచిది.
అంతకుమించి దైవాంశసంభవులమని, అవతార పురుషులమని, చెప్పుకొనుట,
కేవలము అహంకారముగా నిర్ణయించబడును.

శ్రీపాదుల వారు: తండ్రి! నీవు చెప్పినది నేను కాదనుట లేదు.

సత్యమునే వచించవలెను గదా!

నా పాలబాకీ విషయము వచ్చినప్పుడు, నాకు వినోదముగా ఉన్నది.
పంచభూతముల చేత సాక్ష్యమిప్పించబడినప్పుడు, నేను దత్తప్రభువును కాదని చెప్పినచో, అసత్యదోషము కలుగదా!

నభోమండలము నందు ప్రకాశించు సూర్యుని చూచి,
నీవు సూర్యుడవు కాదు అన్నంత మాత్రమున, సూర్యుడు, సూర్యుడు కాకపోవునా?

సత్యము, దేశకాలాబాధితము.

మన పీఠికాపుర బ్రాహ్మణ్యము, తాము శరీరధారులమనియు, మనుష్యులమనియు భావించి, మానవతత్వమును ఏవిధముగా అనుభవించుచున్నారో,

అదే విధమున, నేనునూ, సర్వజ్ఞత్వ, సర్వశక్తిత్వ సర్వాంతర్యామిత్వములను కలిగిన దత్తుడనే అనియెడి తత్వమును మీకు పదేపదే ఙ్ఞప్తికి చేయుచున్నాను.

యుగములు గతించవచ్చును.
అనేక జగత్తులు, సృష్టి స్థితి లయములను పొందుచుండవచ్చును.

కానీ, సాక్షాత్తు దత్తుడనైన నేను, దత్తుడను కాకపోవుటెట్లు?

సర్వం శ్రీపాద శ్రీవల్లభ చరణారవిందమస్తు🙏

30/12/2023

*🕉️ఎంగిలి దోషం🕉️*

*🕉️మన పూర్వీకులు అందించిన ఆరోగ్య సూత్రాలలో ఒకటి ఎంగిలి దోషం అంటకుండా జాగ్రత్త పడటం. ఇతరులు తినగా మిగిలినది, లేదా ఇతరులు తింటున్న సమయంలో వారి దగ్గరి నుంచి తీసుకుని తినడం ఎంగిలి. ఒకరి ఎంగిలి ఇంకొకరు తినడం మహాపాపం అన్నారు.*

*👉ఎంగిలి చాలా ప్రమాదకరం*

*👉ఒకరి ఎంగిలి మరొకరు తినడం, తాగటం వలన సూక్ష్మక్రిములు వ్యాపించి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ముమ్మరంగా ఉంటుంది. ఒకే కంచంలోని ఆహారం ఇద్దరు ముగ్గురు కలిసి తినడం, ఓకే సీసాలోని నీటిని నలుగురైదుగురు ఒకరి తరువాత ఒకరు తాగటం మొదలైనవన్నీ ఎంగిలి దోషాలే.*

*🕉️ఇంతెందుకు! స్వయంగా సీసాలోని నీటిని సగం తాగి పక్కన పెట్టి ఐదు నిమిషాల తర్వాత మిగిలిన సగాన్ని తాగితే కూడా ఎంగిలి దోషం అంటుతుంది, అంటే స్వంత ఎంగిలి కూడా మనకు పనికి రాదు అని అర్థం.*

*🕉️👉పెద్దలు, పూజ్యులు, గురువుల ముందుకు వెళ్ళినప్పుడు నేరుగా మాట్లాడరు. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని మాట్లాడతారు.అది కనీసం మర్యాద. పొరపాటున కూడా పెద్దలు, గురువుల మీద మాటల సమయంలో ఉమ్ము పడకూడదు.*

*👉పసిపిల్లలకు కూడా ఎంగిలి ఆహారం పెట్టకూడదు*.

*👉ఉపనయనంలో హోమం సందర్భంలో కొన్ని మంత్రాలు వస్తాయి. అందులో ఇంతకముందు నేను ఎంగిలి తినడం వలన ఏదైనా పాపం వచ్చివుంటే అది శమించుగాక అని ప్రాయాశ్చిత్తం చేయిస్తారు. ఇక ముందు తినను అని అగ్నిదేవునకు వటువుతో చెప్పిస్తారు*

*👉ఐదువేళ్ళతో నోటిలో నమలడానికి సరిపోయేటంత ఆహారం మాత్రమే స్వీకరించాలి.నోట్లోకి ఎక్కువ ఆహారం తీసుకుని, అది నమలలేక, తిరిగి కంచంలో పెట్టడం దోషమని శాస్త్రం చెప్తుంది.*

*🕉️పూర్వం మన ఇళ్ళలో ఎవరి కంచాలు, చెంబులు వారికే ఉండేవి. అతిథులు వచ్చినప్పుడు, వారికి వేర పాత్రలలో ఇచ్చేవారు. ఒక 50 ఏళ్ళ క్రితం వరకు పేదవారి ఇళ్ళలో కూడా వెండి కంచాలు, చెంబులు ఉండేవి.*

*👉వెండి అనేది చాలాశాతం క్రిములను తన ఉపరితలం మీద నిలువనీయదు. అది వాటిని నశింపజేస్తుంది.ఇంకొన్ని ఇళ్ళలో అయితేవెండి కంచంలో బంగారు పువ్వు వేసి ఉండేది. అప్పుడా కంచానికి ఎంగిలి దోషం ఉండదని చెప్పేవారు*

*🕉️ఇప్పుడు కూడా వెండి క్రిమి సంహారకమని శాస్త్రవేత్తలు ఋజువు చేస్తున్నారు.*

*👉🕉️వంట వండే సమయంలో సైతం మనవాళ్ళు మడి కట్టుకుని మౌనంగా ఉండటంలో ఇది కూడా ఒక కారణం. మాట్లాడితే పొరపాటున నోటి తుంపరలు వండే ఆహారంలో పడి అవి ఎంగిలి అవుతాయని భయం.*

*👉🕉️కొందరు ఈనాటికి నిత్యపూజకు మడి నీళ్ళు పడితే చాలామంది వరలక్ష్మీ వ్రతం,వినాయకచవితి మొదలైన పర్వదినాలప్పుడు, పితృకర్మలు చేసే రోజుల్లో మడి కట్టుకుని నీళ్ళు పడతారు. ఆ దైవకార్యం పూర్తయ్యేవరకు ఆ నీటిని వేరే పనులకు వాడరు, అశుభ్రంగా ముట్టుకోరు.*

*👉🕉️ఎంగిలి చేసిన అన్నాన్ని ఆవు, కుక్క, కాకి మొదలైన జీవాలకు కూడా పెట్టడం దోషమని చెప్తారు.ఆహారం (అది ఏదైనా సరే) పడేయకూడదు.అలాగని ఎంగిలి చేసి ఇతరులకు పెట్టకూడదు.ఎంతకావాలో అంతే వడ్డించుకుని తినాలి. ఆహారం వృధ చేస్తే వచ్చే జన్మలో ఆహారం దొరక్క బాధపడతారు.*

*🕉️ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో నోటి ద్వారా తుంపరలు వ్యాపించకుండా జాగ్రత్త వహించమని ఈ ఎంగిలిదోషాన్ని నిర్వచిస్తున్నారు.*

*👉ఎంగిలి దోషం అంటని మూడు పదార్థాలు ఈ లోకంలో ఉన్నాయి.అవి..*

*1.చిలక కొరికిన పండు*

*2.తేనెటీగ నోటిద్వారా తయారైన తేనె*.

*🕉️3.దూడ తాగిన తర్వాత పిండినటు వంటి ఆవుపాలు. వీటిని చక్కగా దేవుని అభిషేకానికి వాడవచ్చు, మనమూ సేవించవచ్చు*.

*🕉️వేద సంస్కృతి వల్ల మనకు లభించిన పూర్వ ఆచారాలను మన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్ధి కోసం పాటిద్దాం*.

18/12/2023

మొట్టమొదటి కేబినెట్ భేటీలో డీఎస్సి ప్రకటిస్తాం అన్నారు
ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లోనే రుణమాఫీ చేస్తామన్నారు
డిసెంబర్ 9 న ఇస్తామన్న రూ. 15,000 ల రైతు భరోసా ఏమైంది ?
Amzon https://xpshort.com/16Vq
realme narzo 60 5G (Mars Orange,8GB+256GB) | 90Hz

#

17/12/2023

గవర్నర్ ప్రసంగంలో పౌర సరఫరాల శాఖలో అప్పులున్నట్లు చేసిన అసత్యాలను తిప్పికొట్టిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ

amazon https://amzn.to/3Nvhnr6
Brand Conquer Wool Beanie Cap & Muffler for Mens & Women – Winter

08/12/2023

ఉల్లిగడ్డని 'Potato' అంటారు అంట .. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి !?

05/12/2023

Animal Movie Entry BGM

04/12/2023
04/12/2023

భక్తులను నిలువు దోపిడి చేస్తున్న పెదకాకని ఆలయ అధికారులు. గుంటూరు జిల్లా #టెంపుల్

23/11/2023

Ktr Phone Call leek

కేసీఆర్ నోట మళ్లీ దళిత ముఖ్యమంత్రి మాట.దళితుల బిడ్డల ఓట్లు అవసరమైతే గానీ దొరకు 10 ఏళ్ల కింద ఇచ్చిన మాట గుర్తుకురాలే.తెలం...
21/11/2023

కేసీఆర్ నోట మళ్లీ దళిత ముఖ్యమంత్రి మాట.దళితుల బిడ్డల ఓట్లు అవసరమైతే గానీ దొరకు 10 ఏళ్ల కింద ఇచ్చిన మాట గుర్తుకురాలే.తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే అంటూ ఉద్యమంలో దొంగ మాటలు చెప్పి మోసం చేశారు.స్వరాష్ట్రంలో రెండు సార్లు పీఠమెక్కి దళిత సీఎం అని ఏనాడూ అనలేదని దళితులను అవమానించారు.కనీసం రెండో దఫా ఉప ముఖ్యమంత్రి కూడా ఇవ్వకుండా దళిత సమాజాన్ని కించ పరిచారు. దళిత వ్యక్తి పక్కన కూర్చుంటే పక్కకు నెట్టిన నీచ సంస్కృతి దొర కేసీఅర్ ది.పాలనలో సంక్షేమాన్ని తుంగలో తొక్కి... మూడెకరాల భూమి నుంచి దళిత బంధు దాక..డబుల్ బెడ్ రూం ఇండ్ల నుంచి కార్పొరేషన్ రుణాల దాక అన్ని మోసాలే.దళిత బిడ్డలకు అనునిత్యం ఆగచాట్లే.10 యేండ్ల పాలనలో దళితులపై లాఠీలు జులిపించిన ఘనత కేసీఆర్ ది.దళిత మహిళలను లాకప్ డెత్ చేయించిన నియంత పాలన కేసీఆర్ ది.అసెంబ్లీ వేదికగా దళిత ముఖ్యమంత్రి పై మాట మార్చిన దొర గారు...సమయం వచ్చినప్పుడు దళితుడిని సీఎం చేస్తానని చెప్పడం కొత్త కుట్రకు నిదర్శనం. నిజంగా దళిత బిడ్డను సీఎం చేయడానికి ఇప్పుడు సమయం లేదా? అర్హతున్న దళిత నాయకులు లేరా? లేక మీ తాలిబాన్ పాలనలో అసలు దళితులకు రాజ్యాధికారం వద్దా? ఒకపక్క కొడుకును సీఎం చేసేందుకు మోడీతో తెరచాటు ఒప్పందాలు చేసుకుంటూ..అవసరం వచ్చినప్పుడు దళిత సీఎం అంటే నమ్మే రోజులు ఇక లేవు కేసీఆర్ గారు.దమ్ముంటే,నిజంగా దళితులపై ప్రేముంటే ఎన్నికల ముందే దళిత ముఖ్యమంత్రి ప్రకటన చెయ్యి. లేదంటే ఈ డ్రామాలన్నీ ఎన్నికల కోసమే అని ఒప్పుకో.

ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి తండ్రీకొడుకులకు మతి భ్రమించినట్లుంది.10 ఏళ్లు అధికారమిస్తే 65 వేల ఉద్యోగాలు ఇయ్యలేనోడికి,1...
21/11/2023

ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి తండ్రీకొడుకులకు మతి భ్రమించినట్లుంది.10 ఏళ్లు అధికారమిస్తే 65 వేల ఉద్యోగాలు ఇయ్యలేనోడికి,12 లక్షల దరఖాస్తులకు లక్ష ఇండ్లు కట్ట చేతకానోడికి మళ్లీ అధికారమిస్తే వడ్లు పండించినట్లు వరద పారిస్తడట. చెప్పేటోనికి వినేటోడు లోకువ అన్నంట్లుంది కేసీఆర్ తీరు. ఉద్యోగాలు,ప్రభుత్వ పథకాలు ఎక్కడ? అని నిలదీస్తే చిన్న దొరకు జనం చెత్త నా కొడుకులు, సన్నాసులు లెక్క కనిపిస్తున్నరు. అధికార మదంతో కళ్లు నెత్తికెక్కితే నిరుద్యోగులు సన్నాసుల్లా కనిపిస్తున్నారా కేటీఆర్ గారు ? ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం అని మాట ఇచ్చిన సన్నాసులు నువ్వు మీ నాయన. ఉద్యోగాలు నింపలేక పేపర్లు లీకులు చేసి అమ్ముకున్న పెద్ద సన్నాసివి నువ్వే.కేజీ టూ పీజీ అని చెప్పి విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించిన సన్నాసుల పాలన మీది. నిరుద్యోగుల శవాల మీద ఇంతకాలం అధికారంలో కూర్చున్న మీకు ఓట్లు అడగడానికి ఉండాలే ఇజ్జత్,మానం.బంగారు తెలంగాణలో ఇంటిల్లిపాది కొలువులు అనుభవించి, అందిన కాడికి దోచుకొని, మళ్లీ గెలిస్తే ఇండ్లిస్తాం, ఉద్యోగాలిస్తాం,జాబ్ క్యాలెండర్ ఇస్తాం అనే వింత మాటలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.

10/11/2023

ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్లంతా కడుపు మాడి లేదా కడుపు మండి పెట్టేవాళ్లే జగన్ రెడ్డీ... మరి వీళ్లపై కేసులు ఎందుకు పెడుతున్నావ్? ఆస్తులు సీజ్ చేస్తావా? ఇంతగా వ్యవస్థలను వాడుకుని జనాన్ని భయపెడుతున్న తమరు సీఎం పదవికి అర్హులా?
#సీఎం

07/11/2023

Tv9 Rajani kanth Files Case on Mahasena Rajesh

07/11/2023

06/11/2023

Sharmila to sajjala Ramakrishna reedy

05/11/2023

చాల్లే ఆపు జగన్ రెడ్డీ! నీ...నీ...నీ వాళ్ళెవరో దళితులు అందరికీ తెలుసు. దళిత హంతకులను హత్తుకు తిరిగే నువ్వు దళిత ద్రోహివే

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల షెడ్యూల్ విడుదలవిజయవాడ: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల షెడ్యూల్ గురువ...
02/11/2023

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల షెడ్యూల్ విడుదల

విజయవాడ: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల షెడ్యూల్ గురువారం విడుదలైంది. ఈ నెల 27వ తేదీ నుంచి భవానీ దీక్షలు ప్రారంభంకానున్నాయి..

జనవరి 7న పూర్ణాహుతితో భవానీ దీక్ష విరమణలు ముగియనున్నాయి. ఈ నెల 23 నుంచి 27 వరకు మండల దీక్ష మాలధారణలు జరుగనున్నాయి. డిసెంబరు 13 నుంచి 17 వరకు అర్ధ మండల దీక్షా మాలధారణలు జరుగుతాయి. డిసెంబరు 26న కలశ జ్యోతి మహోత్సవం జరుగనుంది..

జనవరి 3 నుంచి 7 వరకు గిరి ప్రదక్షణలు, భవానీ దీక్షా విరమణలు ఉండనున్నాయి. జనవరి 3న ఉదయం 6:30 గంటలకు భవానీ దీక్ష విరమణలు ప్రారంభమవుతాయి. జనవరి 7న ఉదయం 10:30 గంటలకు పూర్ణాహుతితో భవానీ దీక్ష విరమణలు ముగియనున్నాయిముగియనున్నాయి.
Vijayawada #విజయవాడలో

*Big breaking news********************రాజమండ్రి జైలు నుండి బయటకు వచ్చిన చంద్రబాబు.53 రోజుల తర్వాత ప్రజల ముందుకు చంద్రబాబ...
31/10/2023

*Big breaking news*
*******************

రాజమండ్రి జైలు నుండి బయటకు వచ్చిన చంద్రబాబు.53 రోజుల తర్వాత ప్రజల ముందుకు చంద్రబాబు.కుటుంబ సభ్యులను నాయకులను కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు నాయుడు.
చంద్రబాబును చూసేందుకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు నాయకులు అభిమానులు.నా కష్టాన్ని గుర్తించారు అంటూ భావోద్వేగంగా మాట్లాడిన చంద్రబాబు.తనకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన చంద్రబాబు.

*Big breaking news*********************చంద్రబాబుకు బెయిల్స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరునాలుగు వారాల పాట...
31/10/2023

*Big breaking news*
********************

చంద్రబాబుకు బెయిల్

స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు

నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.

 #న్యూస్  #విజయవాడలో   విజయవాడ ప్రతినిత్యం ప్రతినిధిప్రార్థన మందిరాల లేక అడ్డదారి ఆదాయ మార్గాల?విజయవాడ మహానగరంలో అక్రమంగ...
31/10/2023

#న్యూస్ #విజయవాడలో
విజయవాడ ప్రతినిత్యం ప్రతినిధి

ప్రార్థన మందిరాల లేక అడ్డదారి ఆదాయ మార్గాల?

విజయవాడ మహానగరంలో అక్రమంగా కట్టిన ప్రార్థన మందిరాలు ప్రార్థనా మందిరాల్లో కాకుండా అక్రమార్కులకు ఆదాయ మార్గాలుగా మారిపోతున్నాయి విషయంలోకి వెళితే ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా వేరే ప్రార్థన మందిరం ఉంది ఆ ప్రార్థన మందిరం చుట్టూ అక్రమార్కులు అడ్డు అదుపు లేకుండా ప్రార్థన మందిరాలు చుట్టూ రోడ్లు సైతం ఆక్రమించి షాపులు ఏర్పాటు చేసి అమాయకులకు లీజికిచ్చి వారి దగ్గర డబ్బులు దండుకుంటున్నారు అంతేకాకుండా ఈ దుకాణాలు రోడ్డు మీదకు రావడం వల్ల అసలే అంతంతమాత్రంగా ఉన్న రోడ్డు పూర్తిగా కుంచించుకుపోయి దుర్గమ్మ భక్తులకు నరకం చూపిస్తున్నారు ఇంత జరుగుతున్నా అటు పోలీసు అధికారులు కానీ ఇటు అక్రమ కట్టడాలను అరికట్టవలసిన మున్సిపల్ అధికారులు కానీ అటు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది ఇప్పటికే హిందూ సంఘాలు అనేకసార్లు దీని మీద మున్సిపల్ అధికారులకు పోలీసులు దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ అక్రమార్కులు యదేచ్చగా ఆక్రమించుకోవడం కడుసోచినియం అమ్మవారి భక్తులు ఐదు నిమిషాలు బండి పార్క్ చేస్తేనే అమ్మనా బూతులు తిట్టే పోలీసు అధికారులు ఒక్క అడుగు ఆక్రమిస్తే గోడను సైతం కూల్చే గొప్ప విజయవాడ అధికారులు కనీసం ఇటు చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని, ఇప్పటికైనా అక్కడున్న ప్రార్థన మందిరం చుట్టూ ఎటువంటి అక్రమాలు లేకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని హిందూ సంఘాలు అమ్మవారి భక్తులు విజయవాడ వాసులు కోరుకుంటున్నారు.

Address


Alerts

Be the first to know and let us send you an email when TNEWS 440 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share