17/07/2020
రవికిరణాలు బాణాలు గా మేనుని తాకుతుంటే ....
ముడిపడివున్న రెప్పలను తాకుతుంటే ..
నిన్నటి జ్ఞాపకాలు మసకమసకగా
ఈ రోజు కర్తవ్యాలు గుర్తువస్తుంటే ...
అప్పుడే లేయాల లేవకపోతే అమ్మో ...
మత్తు కళ్ళతో వంటగది వైపు అడుగులు ..
చిక్కని కాఫీ కోసం ఫిల్టర్ లో ఉన్న డికాషన్ పోసి
కొంచం గ్లాస్ లో పోసి
చిక్కని వేడి పాలను ,కొంచం పంచదార కలుపుకొని ..
చిక్కని కాఫీ ని ఆస్వాదిస్తూ...
పత్రిక తిరగేస్తే ...
ఎప్పటిలాగే ఈ మధ్య ముఖ్యమైన వార్త కరోన ..
10 లక్షలు దాటాయి .సెప్టెంబర్ కి 20 లక్షలు దాటుతాయి అని ఒక వార్త ..
రాహుల్ గాంధీ ఏమో ఆగష్టు 10 కే దాటాస్తాయి అని ..
మరో పక్క భారత్ బయోటెక్ ప్రకటన కొంచం ఉపసనం..
తెలంగాణా ముఖ్యమంత్రేమో కరోన భయం లేదు అంటాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రేమో అందరకి వస్తుంది అంటాడు .
ప్రజలకేమో భయం భయం ..
మరొక వార్త తెలంగాణా సచివాలయం కూల్చివేత మీద హైకోర్ట్ judgement..
కూల్చుకోవచ్చు అని ..
కరోనా ఉన్న సమయంలో అంత అవసరమా అని కొంత మంది ప్రజలు ,ప్రతి పక్షాలు ఉవాచా..
ఉస్మానియా ఆసుపత్రిలో దుర్గంధ భరిత నీరు చేరడం పైన ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య రగడ
కాని ఎవరు దానికి పరిష్కారం చూపించడంలో విఫలమయ్యారు ..
ఎవరికి ప్రజల సమస్యలు పట్టవు ...అంతా రాజకీయం ..మధ్యలో ప్రజలే నలిగిపోతున్నారు ......
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటు ...
ముకుల్ అంబాని సంపద పెరగడం గురించి వార్తలు ....
సామ్సంగ్ (samsung) ,ఆపిల్ చార్జర్ లు వచ్చే కొత్తఫోన్ లో ఉండవని ...e-waste తగ్గించడంలో
భాగమేనని విమర్శకుల విశ్లేషణ ....
అంతర్జాతీయ విమాన సర్వీసులు మొదలు .ఇండియా నుండి ....
తిరుమల దర్శనాలు అపెయ్యలని రమణ దీక్షితుల డిమాండ్ ..ttd చైర్మెన్ వివరణ ...
ప్రేక్షకులు లేకుండా ఇంగ్లాండ్ ,వెస్టిండీస్ మ్యాచ్ ...ఇంగ్లాండ్ ఆధిక్యం .....
ప్రజలే లేకుండా మ్యాచ్ నా అంతా కరోన మహత్యం ...
కాఫీ తాగడం అయ్యింది ...
ఈ రోజు ఎలా ఉంటుందో ...ఏమి వార్తలు తెస్తుందో ....
శుభోదయం