27/05/2022
|| *మహానాడు ప్రాంగణం*||
⚪️ *మహానాడు లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం*
⚪️ *మహానాడుకు ఏర్పాట్లు బాగున్నాయి అంటూ ముందుగా ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలకు చంద్రబాబు అభినందనలు*
⚪️ చంద్రబాబు నాయుడు, టిడిపి అధినేత:
◻️ తెలుగు దేశం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో జరుగుతున్న ఈ మహానాడు ప్రత్యేకం.
◻️ రాష్ట్రానికి దశ దిశ నిర్థేశించే స్థలంగా ఈ మహానాడు ఉంటుంది.
◻️ రాష్ట్ర రాజకీయాలను తెలుగు దేశం అవిర్భావం ముందు...తెలుగు దేశం ఆవిర్భావం తరువాత అని లెక్కించుకోవాలి.
◻️రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి....రాక్షస పాలన వచ్చింది.
◻️ ప్రశ్నిస్తు దాడులు చేసే సంస్కృతి ని వైసిపి తీసుకువచ్చింది.
◻️ నేతల అరెస్టులు, కార్యకర్తలపై దాడులు జరిగితే నిద్రలేని రాత్రులు గడిపాం
◻️ వైసిపి ప్రభుత్వానికి అభివృద్ది చేతకాదు...వాళ్లు చెపుతున్న సంక్షేమం ఒక బూటకం
◻️ నాడు రౌడీలను అణిచివేసిన పోలీసులు ఇప్పుడు ఉన్మాది పాలనలో గాడి తప్పారు.
◻️ జగన్ నమ్ముకున్న అధికారులు నాడు జైలుకు వెళ్లారు.
◻️తప్పుడు పనులు చేసిన వారు మళ్లీ జైలుకు వెళతారు.
◻️పన్నులు, ధరలతో ప్రజలపై బాదడే బాదుడు తో జీవితాలు చిన్నాభిన్నం చేశారు.
◻️ బాదుడే బాదుడు డబ్బులు, ప్రభుత్వ ఆదాయం, అప్పుల డబ్బులు ఎక్కడికి పోతున్నాయి.
◻️ రైతులకు జగన్ పాలనలో తీవ్ర ద్రోహం జరుగుతుంది. గిట్టుబాటు ధర అందడం లేదు.
◻️ ఇప్పుడు చంద్రన్న భీమా లేదు, అన్న క్యాంటీన్ లేదు, సంక్రాంతి కానుకలేదు....ఇంకెక్కడ ఉంది సంక్షేమం
◻️ ఒకే దఫా 50 వేల రూపాయలు రుణమాఫీ చేసింది టిడిపి ప్రభుత్వం. జగన్ 7 వేలు ఇచ్చి గొప్పలు చెపుతున్నారు.
◻️జగన్ చెప్పిన మద్యనిషేదం ఏమయ్యింది...మద్యం లో 25 ఏళ్ల ఆదాయం చూపి అప్పులు తెచ్చిన సిఎం జగన్
◻️ రాష్ట్రంలో అప్పులు 8 లక్షల కోట్లకు వెళ్లినా అభివృద్ది మాత్రం కనిపించడం లేదు
◻️ రాష్ట్రంలో ఇసుక ధర ఎందుకు పెరిగింది....సిమెంట్ ఎందుకు పెరిగింది. జగన్ అవినీతి వల్లనే ధరలు పెరిగాయి.
◻️ జగన్ చెప్పిన ప్రత్యేక హోదా ఏమయ్యింది...పోలవరం ఎందుకు పూర్తి కాలేదు.?
◻️ ఉమ్మడి రాష్ట్రంలో ISB లాంటి కంపెనీల కోసం ఎంతో కష్ట పడ్డాను.
◻️ స్వయంగా ఆ సంస్థ ప్రతినిధులకు భోజనం వడ్డించి...గౌరవించి నాడు ఐఎస్బి తెచ్చాను.
◻️ఎవరు గుర్తించినా గుర్తించకున్నా....నాకు ఇప్పుడు ఆ తృప్తి ఉంటుంది.
◻️తెలంగాణకు హైదరాబాద్ ఉన్నట్లు...ఎపికి అమరావతి తీసుకురావాలి అనున్నా.
◻️ఏం పాపం చేసిందని జగన్ అమరావతిని నాశనం చేశారు.
◻️ పోలవరం రాష్ట్రానికి వరం...అలాంటి ప్రాజెక్టును జగన్ బలిపెట్టారు.
◻️ పోలవరం విశిష్టత కూడా తెలియని సిఎం జగన్..దాని వల్ల రాష్ట్రం నష్టపోయింది.
◻️3 ఏళ్లలో 3 ఇళ్లు కట్టిన జగన్....ఇప్పుడు 30 లక్షల ఇళ్లు కడతాం అంటున్నాడు
◻️ టిడిపి 25 వేల కిలోమీటర్లు రోడ్డు వేస్తే...జగన్ రెండు కిలోమీటర్ల రోడ్డు వెయ్యలేదు.
◻️ మళ్లీ వర్షాకాలం వస్తే ఎపిలో రోడ్లమీద నాట్లు వేసుకోవచ్చు.
◻️ ప్రజలు సిఎం సిఎం అని స్లోగన్స్ ఇస్తున్నారు.....నాకు సిఎం పదవి కొత్తకాదు..కానీ రాష్ట్రం కోసం నా తపన.
◻️ ఒక్క చాన్స్ అని కరెంట్ తీగ పట్టుకోవద్దని నేను ఆనాడే చెప్పాను.
◻️ జగన్ కు ఒక్క చాన్స్ అని అవకాశం ఇస్తే రాష్ట్రం నాశనం అయ్యింది.
◻️ జగన్ పాలనలో తప్పులను ప్రజలు నడిరోడ్డులో నిలదీయాలి.
◻️ డ్రైవర్ ను చంపిన ఎమ్మెల్సీని రక్షించే ప్రయత్నం చేశారు.
◻️ ప్రశాంతమైన కోనసీమలో గొడవలకు ఈ ప్రభుత్వమే కారణం
◻️ అంబేద్కర్ పై జగన్ కు గౌరవం ఉంటే అమరావతిలో 125 అడుగుల విగ్రహం ప్రాజెక్టను ఎందుకు నిలిపివేశారు.
◻️ కోనసీమలో మంత్రి ఇల్లు తగలబడిన ఘటనలో అనేక అనుమానాలు ఉన్నాయి.
◻️ మీరే దాడి చేసుకుని...మీరే రాజకీయం చేసి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
◻️గడపగడపకూ వైసిపి కార్యక్రమానికి జనం రాకపోవడంతో గడప గడపకూ ప్రభుత్వం అన్నారు.
◻️ జగన్ సభల్లోంచి జనం బయటకు వెళ్లిపోతున్నారు. జనం వెళ్లిపోవడం సహాయ నిరాకరణకు నిదర్శనం.
◻️ జగన్ రాజ్యసభ ఎవరికి ఇచ్చారు....రాజ్యసభ సీట్లు ఇచ్చిన వారిలో ముగ్గురు సహ నిందితులు, ముగ్గురు ఇతర రాష్ట్రాల వారు.
◻️ ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి ఒక్కరికి రాజ్యసభ ఇవ్వలేదు.
◻️ బిసిల జాబితా నుంచి బిసిలను తొలగిస్తే మాట్లాడని ఆర్ కృష్ణయ్య బిసిలకు చాంపియన్ ఎలా అవుతారు.
◻️ జగన్ ఆదాయం పెరిగింది...అనుచరుల ఆదాయం పెరిగింది....కానీ ప్రజల ఆదాయం పెరగలేదు.
◻️ వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.
◻️వ్యవసాయ మోటర్లకు మీటర్లను తీసేసింది ఎన్టీఆర్.
◻️ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టనివ్వం.
◻️ రైతులు తమ మోటార్లకు మీటర్లు పెటనివ్వకుండా పోరాడాలి.
◻️ రైతుల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుంది.
◻️ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే చాలా ఇబ్బందులు వస్తాయి.
◻️ కార్యకర్తలే కాదు.. సాధారణ ప్రజలను ఇబ్బంది పడుతోన్న పరిస్థితి.
◻️ ఈ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది.
◻️ జగన్ పాలనలో అభివృద్ధి నాటకం.. సంక్షేమం బూటకం.
◻️ ఒక ఉన్మాది చేతుల్లో పోలీసులు బలి కాకూడదు.
◻️ జగన్ పాలన గురించి డీజీపీ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ఆలోచించుకోవాలి.
◻️ తప్పుడుగా వ్యవహరించిన అధికారులను.. పోలీసులను వదిలి పెట్టేదే లేదు.
◻️ మహిళలపై అరాచకాలు పెరిగాయి.
◻️ మద్యం, డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నాయి.. ఏపీ నేరాంధ్రప్రదేశుగా మారుతోంది.
◻️టీడీపీ హయాంలో ప్రారంభించిన ISB 20 ఏళ్ల వార్షికోత్సవానికి ప్రధాని వచ్చారు.
◻️ జగన్ అబద్దాల్లో దిట్ట.
◻️ ఎన్నికల ముందు బాబాయ్ హత్య గుండె పోటు అంటూ జగన్ ప్రచారం చేశారు.
◻️గొడ్డలి పోటును గుండె పోటు అని చెప్పుకుని సింపతీ ఓట్లేయించుకున్నారు.
◻️కోడి కత్తి డ్రామా ఏమైంది..?
◻️ బాబాయ్ మరణం గుండెపోటుగా మారితే.. కాకినాడలో సుబ్రమణ్యం హత్య రోడ్ ప్రమాదంగా మారింది.
◻️రాష్ట్రంలో జగన్ ఇచ్చిన ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయి అంటే వాలంటీర్ ఉద్యోగాలు.
◻️జగన్ చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమయ్యింది.
◻️ టిడిపి హయాంలో ఒప్పందం చేసుకున్న గ్రీన్ కో వాళ్లతో ఇప్పుడు దావోస్ వెళ్లి జగన్ తిరిగి ఒప్పందం చేసుకున్నారు.
◻️ టిడిపి మరో 40 ఏళ్లు సమర్థవంతంగా పని చెయ్యాలి.
◻️ ఆవిర్భావం దినోత్సవంలో చెప్పినట్లు ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తాను.
◻️ పార్టీలో కొత్త రక్తం కోసం అంతా సహకరించాలి.
◻️ జగన్ రాజకీయాల నుంచి దిగిపోతే తప్ప రాష్ట్రానికి మంచి రోజులు రావు.
◻️ రాష్ట్ర ప్రజలకు ఒకటే పిలుపు ఇస్తున్నా...క్విట్ జగన్...సేవ్ ఆంధ్ర ప్రదేశ్.
*Sixth media*