Nandigama Varthalu

  • Home
  • Nandigama Varthalu

Nandigama Varthalu WE GIVE ALL NEWS VERY FAST . THE NEWS ABOUT NANDIGAMA AND VIRAL AND TRENDING TELUGU NEWS UP DATES ...

21/07/2024

ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో వైరా కట్టలేరు వాగుకు భారీగా వచ్చి చెరిన వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఆంధ్ర, తెలంగాణ కు సంబంధించిన ఒక రహదారి గుండా పోయే రాకపోకలు బంద్.

సూమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిపివేసిన అదికారులు. వరద ఉధృతను పరిశీలించిన నందిగామ ఆర్డీవో రవీందర్రావు ప్రత్యామ్నాయ మార్గాల చూసుకోవాలని సూచించారు. వరద ఉధృతత తగ్గేవరకు ఈ ప్రాంతం వైపు ఎవరు వెళ్లకుండా చూడాలని అధికారులకు సూచించారు.

శ్రీ తోట మురళీ గారు ఆత్మకు శాంతి చేకూరాలి
16/10/2021

శ్రీ తోట మురళీ గారు ఆత్మకు శాంతి చేకూరాలి

*హఠాన్మరణం* కృష్ణాజిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నందిగామ నియోజకవర్గ నాయకులు  తోట మురళి కృష్ణ  నేటి ఉదయం అనారోగ్య సమస్య ర...
16/10/2021

*హఠాన్మరణం*

కృష్ణాజిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నందిగామ నియోజకవర్గ నాయకులు తోట మురళి కృష్ణ నేటి ఉదయం అనారోగ్య సమస్య రీత్యా హఠాన్మమరణం తో స్వర్గస్థులు అయినారు.. కావున జనసేన పార్టీ కార్యకర్తలు, మెగా అభిమానులు అందరూ ఆయన అంతిమ యాత్రలో పాల్గొని నివాళులు అర్పించవలసిందిగా తెలియజేస్తున్నాము.

ఇట్లు,
*నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ*
Nandigama Varthalu

బండి సీతమ్మ గారు అనారోగ్యంతో మృతికృష్ణా జిల్లా , కంచికచర్ల మండలం : - మండలంలోని మోగులూరు గ్రామానికి చెందిన బండి అమరయ్య గా...
16/09/2021

బండి సీతమ్మ గారు అనారోగ్యంతో మృతి

కృష్ణా జిల్లా , కంచికచర్ల మండలం : - మండలంలోని మోగులూరు గ్రామానికి చెందిన బండి అమరయ్య గారి భార్య, సీతమ్మగారు (65) మరణించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యతొ రెండు రోజుల క్రితం విజయవాడ హస్పటల్‌లో చికిత్స ప్రారంభించారు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఆమె తుది శ్వాస విడిచారు. కుమారుడు విదేశాలనుండి రానున్నా నేపథ్యంలో దహన సంస్కారాలు 18-09-2021న జరిగే అవకాశం ఉంది.

ట్రీట్మెంట్ లేకే బాలింత మృతికృష్ణ జిల్లా నందిగామ : నందిగామ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఓ బాలింత మృతితో మృతురాలి కుంటుంభ సభ్య...
05/08/2021

ట్రీట్మెంట్ లేకే బాలింత మృతి

కృష్ణ జిల్లా నందిగామ : నందిగామ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఓ బాలింత మృతితో మృతురాలి కుంటుంభ సభ్యులు ఆవేధన వ్యక్తం చేశారు. వేల్పుల రత్నకుమారి అనే మహిళ సోమవరం రోజు నందిగామ గవర్నమెంట్ హాస్పిటల్ లో పండంటి బాబుకి జన్మనిచ్చింది.

ఈ రోజు ఉదయం బాలింతలకు ఆయాసం ఎక్కువగా వస్తుందని కుటుంబసభ్యులు హాస్పిటల్ సిబ్బందికి తెలిపారు. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష వైఖరి కారణంగానే రత్నకుమారి మరణించిందని వారు ఆరోపించారు. హాస్పిటల్ లో సరైన ట్రీట్మెంట్ లేదని, నర్సులు కూడా సరిగా స్పందించడం లేదని వారు ఆవేధన వ్యక్తం చేశారు.

ఇదే అంశంపై స్పందించిన హాస్పిటల్ సూపర్డెంట్ గత నాలుగు రోజుల నుంచి రత్నకుమారి అరోగ్యంగానే ఉందని తెలిపారు. ఈరోజు ఉదయం గుండె పోటు రావడం వల్ల ఆమే మృతి చెందినట్లు సూపర్నెంట్ వివరించారు.

నగరంలోని డి వి ఆర్ కాలనీలో పేకటరాయుళ్ళ ఆట కట్టుకృష్ణాజిల్లా నందిగామ : టాస్క్ఫోర్స్ సిఐ మురళీకృష్ణ,  ఎస్ఐ హరిప్రసాద్ ఆధ్వ...
08/06/2021

నగరంలోని డి వి ఆర్ కాలనీలో పేకటరాయుళ్ళ ఆట కట్టు

కృష్ణాజిల్లా నందిగామ : టాస్క్ఫోర్స్ సిఐ మురళీకృష్ణ, ఎస్ఐ హరిప్రసాద్ ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లొ భాగంగా నందిగామలోని డి వి ఆర్ కాలనీలో ఆరుగురు వ్యక్తులు, మరియు 3200 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతు... అసాంఘిక కార్యకలాపాలకు, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

కృష్ణాజిల్లా కంచికచర్ల పోలీసులు గుడ్క అక్రమ నిలవాలపై మెరుపు దాడులు నార్వహించారు.  ఈ దాడులలో లక్షల రూపాయల విలులైన నిషేధిత...
05/06/2021

కృష్ణాజిల్లా కంచికచర్ల పోలీసులు గుడ్క అక్రమ నిలవాలపై మెరుపు దాడులు నార్వహించారు. ఈ దాడులలో లక్షల రూపాయల విలులైన నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడుల నేపధ్యంలో కొంతమంది వ్యాపారులు తమకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని, అధికారికంగా టాక్స్ చెల్లించి వ్యాపారం చేస్తున్నామని వాపోయారు. ఇప్పటివరకు తమ దెగ్గర ఉన్న లేటర్లను చూపి అధికారికంగ వ్యాపారం చేసామని, గతంలో కూడా అధికారులు గుడ్క తీసుకోని వెళ్ళి మళ్ళి ఇచ్చారని గుర్తు చేశారు. ఇన్నాళ్ళు తము చాలా హుందాగ వ్యాపారం చేశామని ఈ రోజు తమని అక్రమ గుడ్క వ్యాపారులని ముద్ర వెస్తున్నారని వారు వాపోయారు.

ఇక ఇదే విషయంపై స్పందించిన రూరల్ సీఐ నాగేంద్రబాబు త్వరలో ప్రెస్ మీట్ నిర్వహిస్తామని అన్ని ప్రశ్నాలకు వివరాలు తెలుపుతామని తెలిపారు

నేడు ఎన్టీఆర్ 98వ జయంతి
28/05/2021

నేడు ఎన్టీఆర్ 98వ జయంతి

26/05/2021

ఆనందయ్య కు జెడ్ కేటగిరి భద్రత కల్పిస్తున్నట్లు ఉప రాష్ట్రపతి  వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రె...
22/05/2021

ఆనందయ్య కు జెడ్ కేటగిరి భద్రత కల్పిస్తున్నట్లు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు.

కోవిఢ్ తో వ్యాపారి మృతికిరాణా వ్యాపారి పమిడిమర్రి రాజా (శివ) మృతిడబ్బులు కట్టించుకొని డిశ్చార్జి చేసిన ప్రైవేట్ ఆస్పత్రి...
21/05/2021

కోవిఢ్ తో వ్యాపారి మృతి
కిరాణా వ్యాపారి పమిడిమర్రి రాజా (శివ) మృతిడబ్బులు కట్టించుకొని డిశ్చార్జి చేసిన ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం అక్సిజన్‌ అందక మృతి చేందిన శివ

కృష్ణా జిల్లా నందిగామ : కంచికచర్ల కు చెందిన ప్రముఖ కిరాణా వ్యాపారి పమిడిమర్రి రాజాకు 7 రోజుల క్రిందట కరోన వచ్చినట్లుగ తెలుస్తుంది. దీంతో కుంటుభ సభ్యులు రాజని విజయవాడ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. 4 రోజులుగా వెంటిలేటర్‌పై అతనికి వైధ్యం అందించారు. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే అతనికి ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి.

ప్రవేట్‌ ఆసుపత్రి యాజమాన్యం అతనికి అరోగ్యం బాగవుతుందని నమ్మ బలికి డబ్బు కట్టించుకున్నారు. అనంతరం అతనికి తగ్గిపోయొందాని డిస్చార్జ్‌ చేశారు. ఇంటికి తీసుకువస్తుండగా... మార్గమధ్యంలోనే అతనికి అక్సిజన్‌ అందక మృతి చేందాడు.

మృతి చేందిన శివకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయనతో పాటు కోవిడ్ సోకి అదే ఆసుపత్రిలో చికిత్స పొందిన శివ తల్లి రెండు రోజుల క్రితం డిశ్చార్జ్‌ అయ్యి ఆమే ఇంట్లోనే క్షేమంగ ఉన్నారు.

ఇన్ఫర్‌మేషన్‌ ఇచ్చిమరి తనీఖాలు చేసిన ఎన్ఫోర్స్మెంట్కృష్ణాజిల్లా నందిగామ : స్పెషల్‌ ఎన్ఫోర్స్మెంట్ అధికారి వకుల్ జిందాల్ ...
18/05/2021

ఇన్ఫర్‌మేషన్‌ ఇచ్చిమరి తనీఖాలు చేసిన ఎన్ఫోర్స్మెంట్

కృష్ణాజిల్లా నందిగామ : స్పెషల్‌ ఎన్ఫోర్స్మెంట్ అధికారి వకుల్ జిందాల్ ఇసుక ర్యాంప్ లను పరిశీలించారు. ఈ కార్య్రక్రమంలో భాగంగ నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల మండలం మున్నలూరు, చందర్లపాడు మండలం ఉస్తేపల్లి ఇసుక రీచ్ లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నందిగామ సబ్ డివిజన్ పరిధి డియస్పీ నాగేశ్వర రెడ్డి మరియు నందిగామ రూరల్ సిఐ సతీష్, చందర్లపాడు ఎస్ఐ ఏసోబు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.

ఇంతకు ముందు కూడా అధికారులు తనీఖీలు నిర్వహించారు. వారు వచ్చే విషయలను చాల గొప్యత పాటించేవారు కాని ఇసారి అలా జరకుండ బాహటంగ అందరికి తెలిసేల రావడంపై సర్వత్ర అనుమానలకు తావిస్తుంది. అక్రమార్కులకు అధికారులు కోమ్మకాస్తున్నారు అంటు కోందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అనంతరం వకుల్ జిందాల్ మాట్లాడుతు... కృష్ణాజిల్లా లోని కొన్ని ఇసుక రీచ్ లను జేపి పవర్ కంపెనీ తన పరిధి లోనికి తీసుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ రీచ్ లను పరిశీస్తున్నామని తెలిపారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్, ఎన్ఫోర్స్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ ల సమన్వయంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జేపి పవన్ కంపెనీ కి అప్పగించటం జరుగుతుందని, ఈ ఇసుక రీచ్ లను జేపి పవర్ కంపెనీ కి అప్పగించడంలో ఎవ్వరైనా అడ్డుపడితే వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.

ఈ ప్రణాల ఖరీదు ఏంతా... సారు?>వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్న జనం >పట్టించుకోని అధికార యంత్రాంగంకృష్ణా జిల్లా, నందిగామ: కోవిడ్...
15/05/2021

ఈ ప్రణాల ఖరీదు ఏంతా... సారు?

>వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్న జనం
>పట్టించుకోని అధికార యంత్రాంగం

కృష్ణా జిల్లా, నందిగామ: కోవిడ్, వాక్సిన్‌ విషయాలలో అధికారలు నిర్లక్షం వ్యవహరిస్తున్నారిని ఇప్పలికే ప్రజ సంఘాలు గఘోలు పెడుతున్నాయి. దానికి తగ్గటుగానే అధికారుల నిర్లక్షనికి నిదర్శనంగ ఓ సంఘటన చోటుచేసేకుంది.

నందిగామ జడ్పీహెచ్ స్కూల్ లో రెండో డోస్ వేయించుకునే వారికోసం ANMల ద్వారా స్లిప్పులు పంపిణీ చేశారు. తీర వారు వచ్చిన తరువాత పట్టించుకునే దిక్కు అక్కడ లేదు. అంటే అధికారులు ప్రజల ప్రణాలకు ఏంత విలువిస్తున్నారు...? అధికారులు సాలరీలు తీసుకుంటుంది ఇలా ప్రజల ప్రణాలు గాల్లో కలుస్తుంటే చూడడానికేనా అంటు పలువురు భావిస్తున్నారు.

వాక్సిన్‌ కోసం వచ్చిన వారిని కంట్రోల్ చేయటానికి ఏ ఒక్కరూ కూడా అక్కడ లేరు, దీంతో క్యూలైన్లలో ఉన్నా జనం ఒకరిని ఓకరు తోసుకుంటు కరోనా వ్యాప్తిని మరింత పేంచే విధంగ అధికారులు దోహదం చేస్తున్నారని సిపిఎం నాయుకులు మండ్డి పడ్డారు. పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు.

జర్నలిస్టు మిత్రులకు ఫేస్ షీల్డ్ మాస్కులు పంపిణీకృష్ణా జిల్లా , నందిగామ: నందిగామ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్...
14/05/2021

జర్నలిస్టు మిత్రులకు ఫేస్ షీల్డ్ మాస్కులు పంపిణీ

కృష్ణా జిల్లా , నందిగామ: నందిగామ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఫేస్ షీల్డ్ మాస్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. కీర్తి శేషులు కొల్లూరి నాగేశ్వరరావు జ్ఞాపకార్దం కొల్లూరి భుజంగరావు ఈ కార్యక్రమన్ని నిర్వహించారు. నందిగామ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం నందు పాత్రికేయులకు ఫేస్ షీల్డ్ మాస్కులను పలువురు జర్నలిస్టులకు అందించారు.

చికిత్స అందిస్తూ వైధ్యురాలు మృతికరోన బాధితులకు చికిత్స అందిస్తూ వైధ్యురాలు మృతిచౌటపల్లికి చేందిన వైధ్యరాలు పల్లెపోగు శోభ...
12/05/2021

చికిత్స అందిస్తూ వైధ్యురాలు మృతి
కరోన బాధితులకు చికిత్స అందిస్తూ వైధ్యురాలు మృతిచౌటపల్లికి చేందిన వైధ్యరాలు పల్లెపోగు శోభారాణి

కృష్ణా జిల్లా , నందిగామ: వీరులపాడు మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన పల్లెపోగు శోభారాణి హైదరాబాద్ ఈయస్ఐ హాస్పిటల్ లో వైధ్యురాలిగా పని చేస్తూ కరోనా బారిన పడి మృతిచేందారు.

హైదరాబాద్ ఈయస్ఐ హాస్పిటల్ లో కరోనా రోగులకు అత్యున్నతమైన వైధ్యసేవలందిస్తు అందరి మన్ననలను పోందారు, ఏంతొ మంది కరోనా భాదితులు కోలుకోని వెళ్ళేటప్పుడు ఆమేకు దండం పెట్టి వెళ్ళేవారు. ఏంతమందిని విలైతే అంతమందిని ఆ మహమ్మరినుండి కాపడాలని... తివ్రంగ రాత్రిబంగళ్ళ స్రమించి అదే మహమ్మరితో శొభారాణి మృతి చెందడం అందరిని బాదించింది.
ఈ విషయం తెలియడంతొ స్థానిక MLA మొండితోక జగన్‌మ్మోహన్‌ రావు, శొభారిణి కుటుంభ సభ్యులు ధైర్యంగ ఉండాలని కొరారు. ఈ కార్యక్రమంలో పలువు పార్టీ నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#నందిగామవార్తలు

18 సంవత్సరాలు నిండిన వారందరికి ప్రభుత్వం కరోన వాక్సీన్ ఇవ్వలని టిడిపి నిరసనకృష్ణ జిల్లా నందిగామ : కంచికచర్ల టిడిపి అఫిస్...
08/05/2021

18 సంవత్సరాలు నిండిన వారందరికి ప్రభుత్వం కరోన వాక్సీన్ ఇవ్వలని టిడిపి నిరసన

కృష్ణ జిల్లా నందిగామ : కంచికచర్ల టిడిపి అఫిస్‌లో టిడిపి నాయకులు నిరసన తెలిపారు. కరోనా నివారణలో వైసీపి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమయ్యందని, కానుక జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచనల ప్రకారం గ్రామాల్లో “18 ఏళ్ళ నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ వేయాలని డీమాండ్‌ చేశారు. "ప్రజల ప్రాణాలు కాపాడాలి "అనే నినాదంతో ఫ్లకార్డులతో నిరసన కార్యక్రమం చెపట్టారు.

ఈ కార్యక్రమం కంచికచర్ల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కోగంటి బాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వేమ వెంకట్రావు పంచాయతీ వార్డు మెంబెర్స్ , నాయకులు మరయు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

            నలుగురికి చెప్పల్సిన వారే.... ఇలా చేస్తే ...?కృష్ణ జిల్లా , నందిగామ : నందిగామ నగరపంచయాతిలో అధికారుల దొరణి ప్...
06/05/2021



నలుగురికి చెప్పల్సిన వారే.... ఇలా చేస్తే ...?

కృష్ణ జిల్లా , నందిగామ : నందిగామ నగరపంచయాతిలో అధికారుల దొరణి ప్రజలకు అగ్రహన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల రిత్య, మాస్క్‌, కామన్‌ డిస్టన్స్‌ పాటించాలని, సానిటైజర్‌ వాడాలని కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వలు నిబందనలు పెట్టాయి కాని నందిగామ మున్పిపల్‌ అధికారులు ఆ నిభందనలను తుంగలో తొక్కారు. నందిగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మండవ వరలక్ష్మి వివహ వార్శికొత్సవాన్ని ఈ రోజు జరుపుకున్నారు. ఈ వేడుకలొ ఆమే భర్త పిచ్చయ్యా.. మన్సిపల్‌ కమీస్నార్‌ జయరామ్‌ పలువు అధికారులు నాయుకులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో అధికారులు ఏవరు మాస్క పెట్టుకోక పోవడం, కామన్‌ డిస్టన్స్‌కు తావివ్వకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒక వేళ వారు మాస్కలేకుండ బాయట కనిపిస్తే కొట్టి మరి పెనల్టీలు కట్టిస్తారు మరీ వీరిపై ఎలాంటి చర్యలు తిసుకుంటారో తెలపాలని, ఇలాంటి అధికారుల పై చర్యలు తీసుకునే అంత ధైర్యం పోలీసులు చయ్యగలరా అని అవేధన వ్యక్తం చేశారు. ఈ చర్యను సుమోటోగా తీసుకోని పోలీసులు బాద్యులపై విచారణ జరిపి తగుచర్యలు తీసుకోవాలని ప్రజ సంఘల నాయకులు బావిస్తున్నారు.

వ్యాక్సిన్‌ కోసం జనం పడిగాపులు - పత్త లేని అధికారులుకృష్ణ జిల్లా, నందిగామ :రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగ...
05/05/2021

వ్యాక్సిన్‌ కోసం జనం పడిగాపులు - పత్త లేని అధికారులు

కృష్ణ జిల్లా, నందిగామ :రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్న నేపధ్యంలో కంచికచర్ల PHC లొ ప్రజలు వాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. అంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యప్తంగా పాక్షిక లాక్‌డౌన్‌ నిబందనలు ఈ రోజు నుండే అమలులొకి వచ్చాయి. అంటే కరోనా ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవచ్చు, దీంతొ ప్రజలు వాక్సిన్‌ కోసం అయా PHCలో బారులు తిరారు.

ఈ నేపధ్యంలోనే కంచికచర్ల మండలంలోని PHCలో వ్యాక్సిన్‌ కోరకు ప్రజలు బారులు తీరారు. కాని వైధ్యఅధికారులు ఎవరు వారిని పట్టించుకున్న పాపన పోలేదు సరి కదా , కనిసం మాస్క్‌ పెట్టుకొమాని గాని, దూరన్ని పాటించమని చెప్పడానికూడా అక్కడ ఏవరు లేక పోవడం గమనార్హం. వాక్సిన్‌ కొసం ప్రజలు ప్రణాలకు తెగించి హస్పటల్‌ వద్ద ఎదురు చూస్తున్నా ఏ వైధ్య అధికారి , వాక్సిన్‌ ఇవ్వకపోగ కనిసం సమాదానం ఇచ్చేందుకు కూడా లేక పొవడం దారుణామని వారు వాపోతున్నారు.

ప్రజలు ప్రణాలతో ఆడుకునేందుకేనా మీరు వైధ్య వృత్తిలో ఉంది అంటు కోందరు అవేధనకు లోనవుతున్నారు. హస్పటల్‌ వద్ద ఉన్నవారిలో ఎవరికైన కరోన ఉండి అది తమకు సోకుతుందని తెలిసిన , కేవలం వాక్సిన్‌ కోసం మాత్రమె వచ్చామని మరి కోందరు అవేధన వ్యక్తం చేస్తున్నారు. వైధ్య అధికారులు స్పందించక పోవడం , వాక్సిన్‌ పక్రియ అగిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైన అధికారులు మొలుకోని ప్రజల ప్రణాలు కాపడాలని కోందారు కోరుతున్నారు.

         ప్రముఖ లాయర్‌ గౌతం హరిబాబు కరోనతో మృతినందిగామ బార్ అసోసియేషన్ మెంబర్ గౌతం హరిబాబు గత కొద్దిరోజులుగ కరోనాతొ పోరడ...
04/05/2021



ప్రముఖ లాయర్‌ గౌతం హరిబాబు కరోనతో మృతి

నందిగామ బార్ అసోసియేషన్ మెంబర్ గౌతం హరిబాబు గత కొద్దిరోజులుగ కరోనాతొ పోరడినా హరి బాబు ఈ రోజు ఉదయం మరణించారు. హరిబాబు నందిగామ కాపు సేవాసమితి కార్యవర్గ సభ్యులుగ పనిచేశారు. నందిగామ బార్ అసోసియేషన్ మెంబర్గ కూడా గౌతం హరిబాబు పలు సేవలు అందించారు. ఈ రోజు ఉదయం ఆయన మరణంతో కాపు సంఘం నాయకులు, పలు లాయర్ల నాయకులు మరియు బంధువులు తివ్ర ధిగ్‌బ్రంతికి గురయ్యారు.

చనిపోయిన వృధురాలికి కారోనా పాజిటీవ్‌మరణించిన తర్వత వేలుగులెకి వాస్తావంకృష్ణా జిల్లా నందిగామ లో దారుణం చోటు చేసుకుంది. ఆన...
03/05/2021

చనిపోయిన వృధురాలికి కారోనా పాజిటీవ్‌
మరణించిన తర్వత వేలుగులెకి వాస్తావం

కృష్ణా జిల్లా నందిగామ లో దారుణం చోటు చేసుకుంది. ఆనారోగ్యం కారణంగా మార్తమ్మ అనే వృధ్దురాలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తసుకుంటు మృతి చేందింది. అమే మరణించిన అనంతరం అధికారులు కరోన నిర్ధరన టేస్ట్‌ చేయగ కరోనా పాజిటివ్ అని తెలింది. దీంతొ అమే భందువులు మృతదేహన్ని అక్కడే వదిలి వెళ్ళిపోయారు. మార్తమ్మ వీరులపాడు మండలం కొనతాలపలి గ్రామానికి చెందిన వ్యక్తిగ అధికారులు తెలిపారు.

అనంతరం కోవిడ్ కవర్లతో మృతదేహాన్ని బద్రపరిచి, బ్లీచింగ్ చల్లి మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులు ఎవరు రాకపోతే సంబంధిత అధికారుల అనుమతులతో, ఆసుపత్రి సూపర్నెంట్ అధ్వర్యంలో... మునిసిపల్ సిబ్బంది ద్వారా దహన సంస్కారాల్లో చేస్తారు.

01/05/2021

nandigama municipality election resultshttps://youtu.be/_yGqgHvBkFI
14/03/2021

nandigama municipality election results

https://youtu.be/_yGqgHvBkFI

Nandigama Municipality Election Results | Nandigama Municipality Results 2021 , ,

లొకల్‌ ఎలక్షన్‌ ఫలితాలు విళ్లు లైవ్‌ అప్‌డేట్స్‌ ఇస్తారంట ఓ లుక్‌ ఎయ్యండి....https://youtu.be/Faei_cDfqnA
09/02/2021

లొకల్‌ ఎలక్షన్‌ ఫలితాలు విళ్లు లైవ్‌ అప్‌డేట్స్‌ ఇస్తారంట ఓ లుక్‌ ఎయ్యండి....
https://youtu.be/Faei_cDfqnA

AP Panchayat election results 2021 | BGR Telugu News Live | We Want to Give Election Results Live Updates For Moguluru Live, Kunikanapadu, Munnaluru, Cheviti...

కృష్ణ జిల్లా , కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.  మొ...
14/01/2021

కృష్ణ జిల్లా , కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. మొండితోక అరుణ్ ని విమర్శించిన టిడిపి నాయకులను, వైసీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు.

https://youtu.be/I0cVk2x9D6g

kanchikacherla: local ycp leader fire on sajja ajay | TDP | YCP | Mondithoka arun | Bgr news |కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ...

కోడి పందాల ఏర్పాటు స్థావరాలపై పోలీసుల దాడిసంక్రాంతి సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలు జరగవంటూ ఎస్పీ ఆదేశాలతో న...
12/01/2021

కోడి పందాల ఏర్పాటు స్థావరాలపై పోలీసుల దాడి

సంక్రాంతి సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలు జరగవంటూ ఎస్పీ ఆదేశాలతో నందిగామ అర్బన్‌ పోలీసులు ఇప్పటికే పలు చోట్ల దాడులు నిర్వహించారు. మరోవైపు నిర్వాహకులు మాత్రం ఎక్కడికక్కడ బరులు ఏర్పాటు చేసుకొనేందుకు కావలసిన సన్నాహాలు చేసుకుంటూనే వివిధ ప్రాంతాల్లోని పందెపు రాయుళ్లకు తమ బరులకు రావల్సిందిగా ఆహ్వానాలు పంపుతున్నారు. ఓవైపు పోలీస్‌ దాడులు మరోవైపు నిర్వాహకులు చేస్తున్న ఏర్పాట్లతో ఏం జరుగుతుందోనని సామాన్యులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఈ నేపధ్యంలొనే కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామ శివారులో కోడి పందాల కోసం ఏర్పాటు చేసిన బరులను పోలీసులు ధ్వంసం చేశారు. నందిగామ రూరల్ పరిధిలో 21 కేసుల్లో 42 మంది ని బైండోవర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

https://youtu.be/6xjKSR2_4yM

kanchikacherla police raid pendyala C**k fight - bgr newsకంచికచర్ల మండలం పెండ్యాల గ్రామ శివారులో కోడి పందాల కోసం ఏర్పాటు చేసిన బరులను పోలీసులు ధ్వ...

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Nandigama Varthalu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share