Shvan

Shvan Shvan.io Opinion that decides

15/04/2022

జగన్ కొత్త మంత్రివర్గం కూర్పు రాష్ట్ర రాజకీయాల్లో చాల మార్పులకు కారణం కాబోతోందా.లయాల్టీ కింద కొంత మందిని లయబిలిటీ కింద మరికొందరిని మంత్రి వర్గంలో చేర్చుకోవడంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.జగన్ ను నమ్ముకుని 2011 ఆయన వెంట నడచి పదవులకు రాజీనామా చేసిన వారికి పదవులు దక్కలేదు.మొదటి మంత్రి వర్గంలో వున్న వారిని ఎందుకు తొలగించారో క్లారిటీ లేదు.మరో వైపు ఓసీ ల్లో రెడ్లు,కాపులు తప్ప మిగతా కులాల వారికి ఇవ్వలేదు.దీంతో వివిధ కులాలు,వర్గాలు,పాత కొత్త నేతల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తులు వచ్చే ఎన్నికల మీద ప్రభావం చూపిస్తాయని రాజకీయ నిపుణుల అభిప్రాయం.మీరేమనుకుంటున్నారు.స్వాన్ ఆప్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి....
Shvan - Opinion That Decide
Download on Android:
https://play.google.com/store/apps/details?id=com.sbp.shvan

11/04/2022

తెలంగాణలో టీఆరెస్ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ తమిళిసై అన్నట్టు మారిపోయింది పరిస్థితి. టీఆరెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిపాదించిన పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ ఆమోదించకపోవడం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించడంతో సహా అనేక విషయాల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా చేసుకుంటున్నారు. గవర్నర్ ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాలకు రాష్ట్ర రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన మాటలు సంచలనం సృష్టించాయి. తాను తలుచుకుంటే ప్రభుత్వ పడిపోయేదని ఆమె అన్న మాటలు వివాదాన్ని రగిల్చాయి.
గవర్నర్ పై టీఆరెస్ నేతలు విమర్షలు గుప్పిస్తున్నారు. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు ? ఈ మొత్తం వివాదంలో తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారు. మీ అభిప్రాయాలను స్వాన్ ఆప్ ద్వారా మాకు తెలియజేయండి.
Shvan - Opinion That Decide
Download on Android:
https://play.google.com/store/apps/details?id=com.sbp.shvan

31/03/2022

దేశ రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక ప్రభంజనం అనవచ్చు.ఎన్టీఆర్ 40 ఏళ్ల క్రితం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి రావడం రాజకీయ పండితులనూ ఆశ్చర్యపరచింది.ఆ తరువాత పార్టీ చంద్రబాబు చేతిలోకి పోవడం మరో పెద్ద మలుపు .పార్టీ ఆవిర్భావం నుంచి విజయాలను అపజయాలను ఎదుర్కోవడం అందరికీ తెలిసిందే.రాష్ట్ర విభజనతో ఎంతో ఆదరించిన తెలంగాణాను లైట్ తీసుకుని ఆంధ్రాకే పరిమితం అయింది. ప్రస్తుతం అక్కడా అధికారాన్నికోల్పోవడమే కాకుండా సీనియర్ నాయకులు మరో పార్టీకి జంప్ అయ్యారు.దీంతో పార్టీలో నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏమిటి.టీడీపీ భవిష్యత్తు మీద మీరేమనుకుంటున్నారు. స్వాన్ ఆప్ ద్వారా మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి.
Shvan - Opinion That Decide
Download on Android:
https://play.google.com/store/apps/details?id=com.sbp.shvan

23/03/2022

Shvan - Opinion That Decide
Download on Android:
https://play.google.com/store/apps/details?id=com.sbp.shvan

ఆంధ్రాలో అప్పుడే అధికార వైసిపిని ఎట్లాగైనా ఓడించడానికి ప్రతిపక్షాలు ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ పార్టీని ఓడించడానికి ఏ పార్టీతో కలవడానికైనా సిధ్దమే నంటూ ప్రకటించాడు.టిడిపి కలిస్తే వైసిపి ఓటమి ఖాయమని ఆయన గట్ ఫీలింగ్.టీడీపీ నేతల్లో కూడా ఇలాంటి ఆలోచనలే నడుస్తున్నట్టు వార్తలు.ఇద్దరూ బిజేపికి దగ్గర కావాలనే అనుకుంటున్నారు.సో ఇక ఆంధ్రాలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు కాబట్టి విజయం ఖాయమన్న ఆలోచనలో వున్నారు.మీరే మనుకుంటున్నారు.ధీటైన ఆధికార పార్టీని ప్రతిపక్షాలు అన్ని కలిసి దెబ్బ తీయగలవని మీరు భావిస్తున్నారా.మీ అభిప్రాయాన్ని స్వాన్ ఆప్ ద్వారా మాకు తెలియజేయండి.

19/03/2022

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది.అధికార టీఆర్ఎస్ అసెంబ్లీతో సహా దొరికిన ప్రతీ అవకాశాన్నీ ప్రతిపక్షాలను తిట్టడానికి వాడుకుంటూ వస్తోంది.ప్రతిపక్షకాంగ్రెస్,బీజేపీ పార్టీల రాష్టాధ్యక్షులు యాత్రలు చేపట్టనున్నారు.కొత్తగా పుట్టుకొచ్చిన షర్మీల పార్టీ,బిఎస్ పీ నేత ఐపిఎస్ ప్రవీణ్ కుమార్ కూడా యాత్రల పేరుతో ప్రజల్లో వుండడానికి ప్రయత్నిస్తున్నారు.దీంతో ముందస్తు ఖాయమంటూ మీడయాల్లో కథనాలు కూడా వస్తున్నాయి.అయితే మీరేమనుకుంటున్నారు. ఎన్నికలు ముందుగా వచ్చే అవకాశం వుందా.మీ అభిప్రాయాన్ని స్వాన్ ఆప్ ద్వారా మాకు తెలియజేయండి.
Shvan - Opinion That Decide
Download on Android:
https://play.google.com/store/apps/details?id=com.sbp.shvan

15/03/2022

ఎన్ని ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ మాత్రం కోలుకోవడం లేదా? క్షేత్ర స్థాయిలో ఇంకా వైస్సార్సీపీ హవానే వీస్తోందా ? ప్రజలపక్షాన ఎవరున్నారు ? తెలుగుదేశం పార్టీ నాయకుల్ని జనం నమ్మడంలేదా? స్థానిక పరిస్థితులు ఇంకా వైస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నాయని ఓటర్లు భావిస్తున్నారా ? తెలుగు దేశంపట్ల ఎందుకింతటి వ్యతిరేకత ? అయితే ఈ మధ్య కాలంలో వైస్సార్సీపీ పట్ల వ్యక్తమౌతున్న వ్యతిరేకత నిజమేనా? అసలు జనమేమనుకుంటున్నారు ? వాళ్ళ మనోభావాలు ఏంటి ? వాళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు ? పల్లె ప్రజల ఆలోచనాలేమిటి ? పట్టణ ప్రాంతాల వ్యవహారశైలి ఏ విధంగా ఉందొ తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది 'శ్వాన్' ! మీరు మీ ఆలోచనల్ని షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. శ్వాన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించండి. గుర్తుంచుకోండి శ్వాన్ ... ఓపెన్ ఎండ్ క్లిక్ ఏ బటన్ ..మీ అభిప్రాయమే నిర్ణయంగా మారుతుంది. YOUR OPINION THAT DECIDES !

11/03/2022

Analysis : ప్రకాష్ రాజ్ కేసీఆర్ కు భారమా ? లాభమా ?

09/03/2022

ఇంతకు ఆంధ్రా రాజధాని ఏది.నిన్న గాక మొన్ననే హైకోర్టు తీర్పుతో రాజధాని అమరావతి మీద ఒక క్లారిటీ వచ్చిందని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.అంతలోనే దీనిపై సుప్రీంకు వెళ్తామని కొందరు మంత్రులు,వైసీపీ నేతల కామెంట్.లేటెస్ట్ గా 2024 వరకు హైదరాబాద్ క్యాపిటల్ అంటూ విభజన రూల్స్ తెరపైకి తెచ్చారు మంత్రి బొత్స.రాజధాని విషయంలో మరోసారి కన్ఫ్యూజన్.ఇది రాష్ట్ర అభివృద్ది మీద ఎంత ప్రభావం పడుతుందనుకుంటున్నారు.మీ అభిప్రాయం స్వాన్ ఆప్ ద్వారా మాకు తెలియజేయండి.

05/03/2022

ఇళ్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇస్తామని సర్కారు చెప్పి ఏడేళ్లు గడిచింది.లెక్కల ప్రకారం 30 లక్షల మందికి కట్టించి ఇవ్వాల్సి వుండగా కేవలం 54వేలు మాత్రమే పూర్తి చేసింది.అందులోని 14 వేల మందికి మాత్రమే పంపిణి చేశారు. ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారు సరైన గూడు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.ప్రభుత్వ పథకాలు ప్రజా సంక్షేమానికి కాదా.అన్నీ పథకాల్లోనూ రాజకీయాలేనా. కేవలం ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికే ఈ పథకమా.దీని మీద మీ అభిప్రాయాన్ని స్వాన్ ఆప్ ద్వారా మాకు చెప్పండి.
Shvan - Opinion That Decide
Download on Android:
https://play.google.com/store/apps/details?id=com.sbp.shvan

01/03/2022

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీర్ ప్రస్తుతం ఓ కొత్త స్నేహితుడిని వెతుకున్నారు. నటుడు, మోదీ వ్యతిరేకి, రాజకీయాలంటే విపరీతమైన ఆసక్తి ఉన్న ప్రకాష్ రాజ్ సడెన్ గా ఈ మధ్య కేసీఆర్ శిబిరంలో కనపడుతున్నారు. ఏకంగా మహా రాష్ట్ర ముఖ్యమంత్రి, కేసీఆర్ మధ్యల జరిగిన సమావేశంలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇప్పుడిక టీఆరెస్ తరపున ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కలిసి తిరగడం మొదలెట్టారు. ఇదంతా బాగానే ఉంది కానీ సినీ నటుల స్థాయి ఎన్నికల్లో కూడా ఓడిపోయిన ప్రకాష్ రాజ్ కేసీఆర్ కు ఏ విధంగా ఉపయోగపడతారు ? ప్రకాష్ రాజ్ కేసీఆర్ కు భారమా ? లాభమా ? మీ అభిప్రాయం ఏంటి ? శ్వాన్ యాప్ ద్వారా తెలియజేయండి.
Shvan - Opinion That Decide
Download on Android:
https://play.google.com/store/apps/details?id=com.sbp.shvan

26/02/2022

ఆంధ్రా పోలీస్ శాఖలో ఏం జరుగుతోంది ? ఆ శాఖ‌ అయోమయంలో పడిపోయిందా ? సడన్ గా మారిన పోలీసు బాసు....వివేకానంద రెడ్డి హత్య కేసులో పోలీసుల పనితీరుపై పలు అనుమానాలు....పోలీసుల మీద అధికార పార్టీ నాయకుల దాడులు,బెదిరింపులు వరుసగా జరుగుతున్నాయి. కృష్ణలంక స్టేషన్ పై నందిగం సురేష్ దాడి, విశాఖ శారదాపీఠం వద్ద మంత్రి సీదిరి అప్పల రాజు అనుచరుల హంగామా,కొవ్వూరు ఎమ్మెల్యే జిల్లా ఎస్పీని తిట్టడం,కుప్పంలో సీఐ సాదిక్ అలీని వైకాపా లీడర్ అనుచిత వ్యాఖ్యలు, శ్రీకాకుళంలో సీఐ లలితను కొట్టడం లాంటి ఎన్నో సంఘటనలు జరిగినా ప్రభుత్వం నుంచి నో రియాక్షన్. దీనికి కారణమేంటి ? ఎవరు కారణం ? దీని మీద మీరేమనుకుంటున్నారు.శ్వాన్ ఆప్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేయండి.
Shvan - Opinion That Decide
Download on Android:
https://play.google.com/store/apps/details?id=com.sbp.shvan

23/02/2022

Shvan - Opinion That Decide
Download on Android:
https://play.google.com/store/apps/details?id=com.sbp.shvan
తన కుమారుడు కేటీఆర్ ను తెలంగాణకు ముఖ్యమంత్రిని చేయాలన్న కేసీఆర్ కంటున్న కల నెరవేరేనా ? కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పుడల్లా ఆయనకు ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ముఖ్యంగా ఆయన మేనల్లుడు హరీష్ రూపంలో ఆటంకాలు వస్తున్నాయి. దాంతో హరీష్ ను ఏం చేయలేక ఆయనకు అనుచరుడైన ఈటల రాజేందర్ కు పొగబెట్టి బైటికి పంపారు. అయినా తన కలను మాత్రం మర్చిపోలేదు. మళ్ళీ మళ్ళీ తన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కేసీఆర్. ఇప్పుడు తాను జాతీయ రాజకీయాలకు వెళ్తానంటూ హడావుడి చేసేది కూడా కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకే అనే వాదనలు కూడా వినవస్తున్నాయి. మరి ఈ సారైనా కేసీఆర్ కల నెరవేరుతుందా? కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారా ?

దీనిపై మీరేమనుకుంటున్నారు ? శ్వాన్ యాప్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి

19/02/2022

కేంద్రం మీద కేసిఆర్ సడన్ గా విరుచుకుపడడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చను లేవనెత్తింది.మోడీ ప్రభుత్వం చేపట్టిన ప్రతీ పథకాన్నీ తీవ్రంగా విమర్శించడమే కాకుండా బీజేపీని తరిమి తరిమి కొడతానంటూ హెచ్చరించారు.కలిసి వచ్చే ప్రతిపక్షాలతో కలిసి ఫ్రంట్ పెడతానని కూడా చెప్పుతున్నారు.2019 ఎన్నికల ముందు ఇంతకంటె ఎక్కువగా చెలరేగిన చంద్రబాబు పరిస్థితి ఏమయిందో కేసీఆర్ కూ అదే గతి పడుతుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.ఇదంతా మోడీ,కేసీఆర్ డ్రామా అని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు.ఈ వాదనల గురించి మీరేమనుకుంటున్నారు.మీ అభిప్రాయాన్నిస్వాన్ ఆప్ ద్వారా మాకు తెలియజేయండి.
Shvan - Opinion That Decide
Download on Android:
https://play.google.com/store/apps/details?id=com.sbp.shvan

10/02/2022

వంద సంశయాలకు ...సమస్యలకూ సమాధానం ఒక్క ప్రశ్న ! మీ ప్రశ్న ! మన ప్రశ్న ! ఒకే ఒక్క ప్రశ్న... కాకపోతే అది వెయ్యి ప్రశ్నలకు సమాధానం ! అవును .. మీరు గొంతెత్తి అడగలేకపోతే ... ప్రశ్నించకపోతే ... అదే మన మెడలకు చుట్టుకునే మొట్టమొదటి ప్రశ్న! అర్ధం కాలేదా? ఒక ఆలోచన.. ఒక సూచన... ఒక్క పరిష్కారం ! ఇక్కడొక్కసారి క్లిక్ చెయ్యండి!

03/02/2022

Address


Alerts

Be the first to know and let us send you an email when Shvan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share