Lokal App- Telangana

  • Home
  • Lokal App- Telangana

Lokal App- Telangana Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Lokal App- Telangana, Media/News Company, .

Telangana Chief Minister Revanth Reddy may lay the foundation of Old city metro line from MGBS to Falaknuma on 7th March...
04/03/2024

Telangana Chief Minister Revanth Reddy may lay the foundation of Old city metro line from MGBS to Falaknuma on 7th March.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు దేశ విదేశాల నుంచి అనేక మంది సెలబ్...
04/03/2024

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు దేశ విదేశాల నుంచి అనేక మంది సెలబ్రిటీలు వచ్చారు. మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్, క్రికెటర్ సచిన్ తెందూల్కర్, సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో పాటు వ్యాపారవేత్తలు, సినీ నటులు వచ్చారు.

02/03/2024

Follow

02/03/2024

సీఎం రేవంత్ రెడ్డికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తానని.. రేవంత్ కూడా సీఎం పదవికి రాజీనామా చేసి తనపై బరిలోకి దిగాలని ఛాలెంజ్ చేశారు. మల్కాజ్ గిరిలో తేల్చుకుందాం.. అని కేటీఆర్ సవాల్ విసిరారు. కాగా, కేటీఆర్ మగాడైతే రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు గెలిచి చూపించాలని సీఎం ఛాలెంజ్ చేశారు.

తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. 11,062 టీచర్ పోస్టులతో డీఎస్సీ కొత్త నోటిఫికేషన్.. ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న అభ...
01/03/2024

తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. 11,062 టీచర్ పోస్టులతో డీఎస్సీ కొత్త నోటిఫికేషన్.. ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్న విద్యాశాఖ.. స్కూల్ అసిస్టెంట్ 2629, లాంగ్వేజ్ పండిట్ 727, ఎస్‌జీటీ 6508, పీఈటీ 182 పోస్టులు

కుమారి ఆంటీ తన వ్యాపారాన్ని కొనసాగించేందుకు అనుమతించాలని డీజీపీని ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డి.. నమోదైన కేసులను మూసివేయా...
01/03/2024

కుమారి ఆంటీ తన వ్యాపారాన్ని కొనసాగించేందుకు అనుమతించాలని డీజీపీని ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డి.. నమోదైన కేసులను మూసివేయాలని అదేశించిన సీఎం..

01/03/2024

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిందని, రైతులంతా రుణమాఫీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కే తారకరామారావు తెలిపారు.

29/02/2024

తెలంగాణాలో ఎవరి ప్రభుత్వ పరిపాలన బాగుంది అనుకుంటున్నారు?



29/02/2024

రేవంత్ పేరుతో ఓట్లడిగితే కాంగ్రెస్కు ఒక్క ఓటు రాకపోవు అన్న కేటీఆర్ వ్యాఖ్యల్లో నిజం ఉందని భావిస్తున్నారా?


28/02/2024

రైతు బంధు పథకంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతు బంధు డబ్బులు జమ చేయడం లేదన్న ప్రతిపక్షాల విమర్శలపై సీఎం రేవంత్ స్పందించారు. జనవరి మొదలుపెట్టి మార్చి 31 లోగా చెల్లిస్తామని అన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అందరికీ జమ చేస్తామని ప్రకటించారు. 15 రోజుల్లోనే రైతుబంధు ఇచ్చేయవచ్చు.. కాకపోతే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సంక్షేమ హాస్టల్ డబ్బులు ఆపాల్సి వస్తుందని అన్నారు.

28/02/2024

ఇటీవల అల్లు అయాన్ షారుఖ్ ఖాన్ డంకీ సినిమాలోని లుట్ పుట్ గయా అనే సాంగ్‌ని పాడాడు. అల్లు అయాన్ పాడుతుండగా వీడియో తీసి స్నేహరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనికి షారుఖ్ ఖాన్ రిప్లై ఇస్తూ థ్యాంక్యూ లిటిల్ వన్, ఫ్లవర్, ఫైర్ రెండూ ఒకేదాంట్లో చూపించావు, ఇప్పుడు నా పిల్లలు శ్రీవల్లి సాంగ్ ప్రాక్టీస్ చేస్తారు అంటూ అల్లు అర్జున్ ని ట్యాగ్ చేస్తూ పుష్పని గుర్తుచేశారు. దీంతో షారుఖ్ ట్వీట్ వైరల్ గా మారింది.

HANU-MAN లో Teja Sajja కాకుండా ఏ హీరో చేస్తే బావుంటుంది..?
28/02/2024

HANU-MAN లో Teja Sajja కాకుండా ఏ హీరో చేస్తే బావుంటుంది..?

రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్ని లోక్ సభ సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది ?                                    ...
27/02/2024

రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్ని లోక్ సభ సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది ?

మహబూబ్నగర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ నేత మల్లు ...
26/02/2024

మహబూబ్నగర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ నేత మల్లు రవి ఖండించారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు వచ్చే పరిస్థితి లేదని అన్నారు. సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద మల్లు రవి మాట్లాడారు.

26/02/2024

టాలీవుడ్ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్ర పోషించిన హార్రర్ మూవీ 'గీతాంజలి మళ్లీ వచ్చింది' టీజర్ విడుదలైంది. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. హార్రర్ కామెడీ మూవీగా డైరెక్టర్ శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, సునీల్, అలీ, షకలక శంకర్ కీలక పాత్రలు పోషించారు. కోన వెంకట్ నిర్మిస్తున్నారు. మార్చి 22న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

26/02/2024

హైదరాబాద్‌ నగరంలో తెల్లవారుజామునే జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. నిన్ననే బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు వేకువజామున 4 గంటలకు నగరంలోని సోలార్ సైకిల్ ట్రాక్ వద్ద ఓ కారు ప్రమాదానికి గురయింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం.

ప్రణవ్ అనే యువకుడు ఒక టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేస్తున్నాడు. అతడి ఫొటోను త్రిష అనే యువతి ఒక మ్యాట్రిమోనీ యాప్‌లో చూస...
24/02/2024

ప్రణవ్ అనే యువకుడు ఒక టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేస్తున్నాడు. అతడి ఫొటోను త్రిష అనే యువతి ఒక మ్యాట్రిమోనీ యాప్‌లో చూసి ఇష్టపడింది. ఆమె డిజిటల్ మార్కెటింగ్‌‌లో పనిచేస్తోంది. అలాగే ఐదు స్టార్టప్ కంపెనీలకు ఎండీగా కూడా ఉంది.

HYDERABAD WOMAN ST@LKED AND KIDN@PPED TV ANCHOR TO MARRY HIM!🤦

🤣🤣😂😂😂.... Phone matladuthu bike drive chesthunnadu umcleSupport & Follow us Turn on Post Notifications ❤️               ...
24/02/2024

🤣🤣😂😂😂.... Phone matladuthu bike drive chesthunnadu umcle

Support & Follow us

Turn on Post Notifications ❤️
🌴

🥵🔥
24/02/2024

🥵🔥





సినిమా ఛాన్సులు తగ్గిన తర్వాత కిరణ్ పేరుతో ఒక యాప్ను ప్రారంభించి అభిమానులతో వ్యాపారం చేస్తోందని ఆమెపై రూమర్స్ వచ్చాయి. ఆ...
24/02/2024

సినిమా ఛాన్సులు తగ్గిన తర్వాత కిరణ్ పేరుతో ఒక యాప్ను ప్రారంభించి అభిమానులతో వ్యాపారం చేస్తోందని ఆమెపై రూమర్స్ వచ్చాయి. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలంటే రూ.49 ఖర్చు చేయాలి. ఆ యాప్ ద్వారా వెయ్యి రూపాయలు చెల్లిస్తే కిరణ్ తన రెండు గ్లామరస్ ఫొటోలను పంపుతుంది. అదేవిధంగా ఆమెతో 5 నిమిషాలు మాట్లాడాలంటే రూ.10 వేలు చెల్లించాల్సిందేనట. వీడియో కాల్లో 15 నిమిషాలు మాట్లాడాలంటే రూ.15 వేలు, 25 నిమిషాలు మాట్లాడాలంటే రూ.25 వేలు చెల్లించాల్సిందే అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.. వాటి గురించి తొలిసారి కిరణ్ రియాక్ట్ అయ్యారు.

కుటుంబాల కోసం దోచుకునే కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటు వేయవద్దని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు....
23/02/2024

కుటుంబాల కోసం దోచుకునే కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటు వేయవద్దని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఆయన దేవరకద్ర కార్నర్ మీటింగ్లో మాట్లాడారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు పాలన నడుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి ను...
23/02/2024

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు పాలన నడుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తీర్చకుంటే ఉద్యమం చేస్తామని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఇక, తాజాగా మాజీ మంత్రి హరీష్రవు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారం కోల్పోతే పార్టీలో ఉండే వారి కంటే పక్క పార్టీల వైపు చూసే వాళ్లు ఎక్కువ ఉంటారు. తెలంగాణలో ప్రస్తుతం అదే జరుగుతోంది...
22/02/2024

అధికారం కోల్పోతే పార్టీలో ఉండే వారి కంటే పక్క పార్టీల వైపు చూసే వాళ్లు ఎక్కువ ఉంటారు. తెలంగాణలో ప్రస్తుతం అదే జరుగుతోంది. పదేళ్లుగా అధికారాన్ని కొనసాగించిన బీఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వారం రోజులు గడవక ముందే మరో ఇద్దరు కీలక నేతల్లో ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరారు.మరొకరు చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

21/02/2024

తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ధర్మపురికి వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ప్రమాదానికి గురైంది. లారీని తప్పించే క్రమంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేతో పాటు ఇతరులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.

20/02/2024

మెగాస్టార్‌ చిరు తన భార్యకు కవిత రాసి తనదైన స్టైల్‌లో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. మెగా కోడలు ఉపాసన కూడా తన అత్తగారికి ప్రత్యేకంగా విషెష్‌ చెప్పారు. 'అత్తమ్మాస్‌ కిచెన్‌' పేరుతో ఆన్‌లైన్‌ వ్యాపారాన్ని ప్రారంభించారు. 'అత్తమ్మ పుట్టినరోజు సందర్భంగా మా వ్యవస్థాపక వెంచర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. రెడీ మిక్స్‌ రూపంలో కొన్ని ఆహార ప్రొడక్ట్స్ వస్తున్నాయి. మీరు మీ ఇంట్లోనే వాటిని ఆస్వాదించండి.' అని ఆమె తెలిపారు.

మరో రెండు రోజుల్లో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. దాదాపు 11 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి వి...
20/02/2024

మరో రెండు రోజుల్లో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. దాదాపు 11 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనుంది. గత ప్రభుత్వం 5089 పోస్టులతో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసి, కొత్త పోస్టులతో కలిపి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనుంది. ప్రభుత్వ బడుల్లో చదువుకునే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం స్పెషల్ టీచర్లను కూడా ఈ నోటిఫికేషన్ లోనే రిక్రూట్ చేయనుంది.

20/02/2024

తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై విడుదల చేసిన శ్వేతపత్రంపై వాడీవేడి చర్చ జరుగుతోంది. మంత్రులు ఉత్తమ్, భట్టి, జూపల్లి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో మిడ్ మానేరును కాంగ్రెస్ హయాంలో పూర్తిచేసినట్లు నిరూపిస్తే తను ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టనని ఛాలెంజ్ చేశారు.

18/02/2024

మహబూబ్ నగర్ జిల్లాలోని పొన్నకల్ లో దారుణం జరిగింది. నలుగురు వ్యక్తులు అర్ధరాత్రి గ్రామంలో ప్రవేశించి తుపాకీతో కుక్కలపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. తుపాకీ శబ్దాలకు భయపడి ప్రజలు ఇంటినుండి నుంచి బయటకు రాలేదు. ఈ భయానక కాల్పుల్లో 20కి పైగా కుక్కలు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని కుక్కలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

18/02/2024

తెలంగాణలో ఫ్రీ బస్సు పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సు నిండా సీట్లుంటే ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉండడం లేదని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ భావించింది. దీంతో బస్సు మధ్యలో మెట్రోరైలు మాదిరిగా సిటింగ్ ఏర్పాటు చేసింది. దీనిపై మీ కామెంట్..?

ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. గాజుల రామారంకు చెందిన అభిలాష్, అమరావతి దంపతులకు 2019లో వివాహం జరిగింది. రూ.4 కోట్లు క...
17/02/2024

ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. గాజుల రామారంకు చెందిన అభిలాష్, అమరావతి దంపతులకు 2019లో వివాహం జరిగింది. రూ.4 కోట్లు కట్నం ఇచ్చినా వారికి సరిపోలేదు. అదనంగా వరకట్నం తేవాలని అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. వేధింపులు తట్టుకోలేక అమరావతి సూసైడ్ లెటర్ రాసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Follow

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Lokal App- Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share