LaxmiTeluguTech

  • Home
  • LaxmiTeluguTech

LaxmiTeluguTech Hello Friends, This is Our Channel Laxmi Telugu Tech, *Welcome to Laxmi Telugu Tech*. We are uploadi

🙏 Om Namo Venkatesaya 🙏18-11-2023Total pilgrims   - 70,686Tonsures: 34,563Hundi kanukalu : 3.02 CrWaiting Compartments… ...
19/11/2023

🙏 Om Namo Venkatesaya 🙏

18-11-2023

Total pilgrims - 70,686

Tonsures: 34,563

Hundi kanukalu : 3.02 Cr

Waiting Compartments… Out side Line at Octopus building.

Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens).... 24 H

(SSD)Time slot Sarvadarshan... 4 to 6 H

Rs 300 Special Darshan Approx. Time... 2 to 4 H

Tq.

------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి గంటల సమయం 18 పడుతుంది, అంటే అది SSDటోకెన్లు లేకుండా ఆల్రెడీ q లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 18 గంటలు అని.
ప్రస్తుతం కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.

------------------------
తిరుమల తాజా సమాచారం కోసం మన తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-
https://www.youtube.com/laxmitelugutech

https://t.me/LaxmiTeluguTech

https://youtu.be/LD6SV53pqtk
18/11/2023

https://youtu.be/LD6SV53pqtk

నేడే తిరుమల మొదటి గడప టికెట్స్ విడుదల | ఈ ఆర్జిత సేవలు రద్దు చేసిన టిటిడి | లక్కిడిప్ రిజిస్ట్రేషన్ లో ఈ తప్పులు చ...

🙏 Om Namo Venkatesaya 🙏17-11-2023Total pilgrims   - 67,140Tonsures: 26,870Hundi kanukalu : 4.01 CrWaiting Compartments… ...
18/11/2023

🙏 Om Namo Venkatesaya 🙏

17-11-2023

Total pilgrims - 67,140

Tonsures: 26,870

Hundi kanukalu : 4.01 Cr

Waiting Compartments… Outside Line at Silathoranam

Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens).... 24 H

(SSD)Time slot Sarvadarshan... 4 to 6 H

Rs 300 Special Darshan Approx. Time... 2 to 4 H

Tq.

------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి గంటల సమయం 18 పడుతుంది, అంటే అది SSDటోకెన్లు లేకుండా ఆల్రెడీ q లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 18 గంటలు అని.
ప్రస్తుతం కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.

------------------------
తిరుమల తాజా సమాచారం కోసం మన తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-
https://www.youtube.com/laxmitelugutech

https://t.me/LaxmiTeluguTech

నవంబరు 19న శ్రీవారి ఆలయంలో పుష్పయాగంతిరుమల, 2023 న‌వంబ‌రు 17: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 19న ఆదివారం పుష్పయాగ మహోత్సవ...
17/11/2023

నవంబరు 19న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం

తిరుమల, 2023 న‌వంబ‌రు 17: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 19న ఆదివారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. నవంబరు 18న శ‌నివారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు.

పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

ఆర్జిత సేవలు ర‌ద్దు

న‌వంబ‌రు 18న అంకురార్ప‌ణ కార‌ణంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ ర‌ద్దు చేసింది. తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి పంచ‌మీతీర్థం సంద‌ర్భంగా తిరుమ‌ల నుండి సారె తీసుకెళ్లాల్సి ఉన్నందున‌ ఉద‌యం సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

న‌వంబ‌రు 19న పుష్ప‌యాగం రోజున కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలు ర‌ద్ద‌య్యాయి. తోమాల‌, అర్చ‌న సేవ‌లు ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

దాత‌ల‌కు వైకుంఠ‌ద్వార ద‌ర్శ‌నం, బ‌స వివ‌రాలుతిరుమ‌ల‌, 2023 నవంబరు 17:  వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి సంబంధించి డిసెంబ‌రు 23 ...
17/11/2023

దాత‌ల‌కు వైకుంఠ‌ద్వార ద‌ర్శ‌నం, బ‌స వివ‌రాలు

తిరుమ‌ల‌, 2023 నవంబరు 17: వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి సంబంధించి డిసెంబ‌రు 23 నుండి జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ వ‌ర‌కు టీటీడీ ట్ర‌స్టులు, స్కీముల దాత‌ల‌కు క‌ల్పిస్తున్న ప్ర‌యోజ‌నాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌నం బుక్ చేసుకున్న దాత‌ల‌ను రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న క్యూలైన్ ద్వారా ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. దాత‌లంద‌రికీ జ‌య‌విజ‌యుల వ‌ద్ద నుండి మ‌హాల‌ఘు ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భ‌క్తుల‌కు పెద్దపీట వేయ‌డంలో భాగంగా వైకుంఠ ఏకాద‌శి రెండు రోజుల ముందు నుండి ద్వాద‌శి వ‌ర‌కు అనగా డిసెంబ‌రు 21 నుండి 24వ తేదీ వ‌ర‌కు, అదేవిధంగా డిసెంబ‌రు 30 నుండి 2024, జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ వ‌ర‌కు దాత‌ల‌కు, వారి సిఫార్సు లేఖ‌ల‌తో వ‌చ్చే వారికి గ‌దుల కేటాయింపు ఉండ‌దు. మిగ‌తారోజుల్లో దాత‌లు య‌థావిధిగా గ‌దులు బుక్ చేసుకోవ‌చ్చు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

👉
17/11/2023

👉

TTD Latest press note| Vaikunta dwara darshan news | Trusts / Scheme Donors Darshan | Tirumala Tirupati Balaji Darshan Latest updates info🙏 ఓం నమో వేంకటేశాయ...

🙏 Om Namo Venkatesaya 🙏16-11-2023Total pilgrims   - 62,494Tonsures: 27,666Hundi kanukalu : 3.59 CrWaiting Compartments… ...
17/11/2023

🙏 Om Namo Venkatesaya 🙏

16-11-2023

Total pilgrims - 62,494

Tonsures: 27,666

Hundi kanukalu : 3.59 Cr

Waiting Compartments… Outside Line at Silathoranam

Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens).... 24 H

(SSD)Time slot Sarvadarshan... 4 to 6 H

Rs 300 Special Darshan Approx. Time... 2 to 4 H

Tq.

------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి గంటల సమయం 18 పడుతుంది, అంటే అది SSDటోకెన్లు లేకుండా ఆల్రెడీ q లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 18 గంటలు అని.
ప్రస్తుతం కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.

------------------------
తిరుమల తాజా సమాచారం కోసం మన తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-
https://www.youtube.com/laxmitelugutech

https://t.me/LaxmiTeluguTech

https://youtu.be/EwaHYFAreYs
16/11/2023

https://youtu.be/EwaHYFAreYs

శ్రీవారి భక్తులకు తీపి కబుర్లు |తిరుమల మొదటి గడప టికెట్స్ | దర్శనం ఆర్జిత సేవలు అంగప్రదక్షిణం టికెట్స్ ఫిబ్రవర.....

ఫిబ్రవరి 2024 నెలలో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్‌ల ఎలక్ట్రానిక్ డిఐపి రిజిస్ట్రేషన్‌లు 18.11.2023 ఉదయం 10:00 గంటలకు అంద...
16/11/2023

ఫిబ్రవరి 2024 నెలలో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్‌ల ఎలక్ట్రానిక్ డిఐపి రిజిస్ట్రేషన్‌లు 18.11.2023 ఉదయం 10:00 గంటలకు అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్లు 18.11.2023 10:00 AM నుండి 20.11.2023 10:00 AM వరకు తెరిచి ఉంటాయి

2024 ఫిబ్రవరి నెలలో కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవ వంటి సేవల కోసం శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను బుకింగ్ కోసం 21.11.2023 10:00 AM కి అందుబాటులో ఉంటుంది.

ఆన్‌లైన్ సేవ (వర్చువల్ పార్టిసిపేషన్) 2024 ఫిబ్రవరి నెలలో శ్రీవారి ఆలయంలోని శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం & సహస్ర దీపాలంకార సేవలకు అనుసంధానించబడిన దర్శన్ కోటా బుకింగ్ కోసం 21.11.2023 3:00 PM కి అందుబాటులో ఉంటుంది.

ఫిబ్రవరి 2024 నెల తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు బుకింగ్ కోసం 23.11.2023 10:00 AM కి అందుబాటులో ఉంటాయి.

👉
16/11/2023

👉

అలిపిరిలోని సప్త గౌ ప్రదక్షిణ శాలలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం 23.11.2023 నుండి 31.12.2023 వరకు ఆన్‌లైన్ బుక...
16/11/2023

అలిపిరిలోని సప్త గౌ ప్రదక్షిణ శాలలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం 23.11.2023 నుండి 31.12.2023 వరకు ఆన్‌లైన్ బుకింగ్ కోసం ఈ రోజు (16.11.2023) మధ్యాహ్నం 02:00 గంటలకు అందుబాటులో ఉంటుంది.

23.12.2023 నుండి 01.01.2024 వరకు వైకుంట ద్వార దర్శనం కోసం అన్ని ట్రస్ట్‌లు / పథకాల దాతలకు దర్శనం మరియు వసతి కోటా బుకింగ్ కోసం 17.11.2023 మధ్యాహ్నం 03:00 గంటలకు అందుబాటులో ఉంటుంది.

శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం (సూచనలు)

1. సేవను పొందేందుకు రిపోర్టింగ్ పాయింట్ సప్తగిరి గౌ ప్రదక్షిణ శాల, అలిపిరి, తిరుపతి
2. ప్రవేశ సమయంలో, యాత్రికుడు బుకింగ్ సమయంలో ఉపయోగించిన అదే అసలు ఫోటో IDని ఉత్పత్తి చేయాలి. NRI యాత్రికులు చెల్లుబాటు అయ్యే వీసా/PRతో పాస్‌పోర్ట్‌ను తయారు చేయాలి.
3. యాత్రికులు సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. పురుషుడు: ధోతి, చొక్కా స్త్రీ: చీర / హాఫ్ చీర / దుపట్టాతో చుడీదార్. గృహస్థులు కల్యాణోత్సవం / సంకల్పంతో కూడిన లక్ష కుంకుమార్చన కోసం ధోతీ మరియు పై వస్త్రాన్ని ధరించాలి.
4. సేవ కోసం బుక్ చేసుకునే యాత్రికులు తమ రసీదు యొక్క ప్రింటెడ్ కాపీని తీసుకురావాలి.
5. గ్రూప్ టిక్కెట్లలోని యాత్రికులందరూ కలిసి రిపోర్ట్ చేయాలి.
6. క్యూ లైన్లు, మాడ వీధులు మరియు ఆలయంలోకి చప్పల్స్/బూట్లతో ప్రవేశం అనుమతించబడదు.
7. రిపోర్టింగ్ సమయంలో యాత్రికులు ఎలాంటి లగేజీ/సెల్ ఫోన్లు/ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను తీసుకెళ్లకూడదు.
8. అన్ని బుకింగ్‌లు ఫైనల్: ముందస్తు వాయిదా/అడ్వాన్స్‌మెంట్/రద్దు/వాపసు అనుమతించబడదు.
9. ఏదైనా ప్రత్యేక పరిస్థితులలో సేవను రద్దు చేసే హక్కు TTDకి ఉంది.

👉
16/11/2023

👉

తిరుమల శ్రీవారి భక్తులకు మరో అద్భుత అవకాశం.. ఆన్‌లైన్‌లో టికెట్లు, బుక్ చేస్కోండి | తిరుమల తాజా సమాచారం | శ్రీవార....

🙏 Om Namo Venkatesaya 🙏15-11-2023Total pilgrims   - 71,123Tonsures: 26,689Hundi kanukalu : 3.84CrWaiting Compartments… 2...
16/11/2023

🙏 Om Namo Venkatesaya 🙏

15-11-2023

Total pilgrims - 71,123

Tonsures: 26,689

Hundi kanukalu : 3.84Cr

Waiting Compartments… 26

Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens).... 14 H

(SSD / DD)Time slot Sarvadarshan... 3 to 5 H

Rs 300 Special Darshan Approx. Time... 2 to 3 H

Tq.

------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతుంది, అంటే అది ఎటువంటి టోకెన్లు లేకుండా ఆల్రెడీ q లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 08 గంటలు అని.
ప్రస్తుతం కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 10 నుంచి 14 గంటల సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.

------------------------
తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్, తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-
https://www.youtube.com/

https://t.me/LaxmiTeluguTech

https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

డిసెంబర్-2023 నెలలో శ్రీవారి సేవ, తిరుమల మరియు తిరుపతి అదనపు కోటా 20.11.2023 ఉదయం 11:00 గంటలకు విడుదల చేయబడుతుంది.డిసెంబ...
15/11/2023

డిసెంబర్-2023 నెలలో శ్రీవారి సేవ, తిరుమల మరియు తిరుపతి అదనపు కోటా 20.11.2023 ఉదయం 11:00 గంటలకు విడుదల చేయబడుతుంది.

డిసెంబర్-2023 నెల నవనేత సేవ, తిరుమల అదనపు కోటా 20.11.2023 మధ్యాహ్నం 12:00 గంటలకు విడుదల చేయబడుతుంది.

డిసెంబర్-2023 నెలకు సంబంధించిన పరకామణి సేవ, తిరుమల అదనపు కోటా 20.11.2023న మధ్యాహ్నం 3:00 గంటలకు విడుదల చేయబడుతుంది.

https://youtu.be/4WunuNms64A
15/11/2023

https://youtu.be/4WunuNms64A

Current Darshan details of Tirumala || Answers to Doubts of Srivari Devotees || టిటిడి తాజా సమాచారం 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్స్అ...

🙏 Om Namo Venkatesaya 🙏14-11-2023Total pilgrims   - 69,041Tonsures: 22,415Hundi kanukalu : 3.19CrWaiting Compartments… 2...
15/11/2023

🙏 Om Namo Venkatesaya 🙏

14-11-2023

Total pilgrims - 69,041

Tonsures: 22,415

Hundi kanukalu : 3.19Cr

Waiting Compartments… 23

Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens).... 14 H

(SSD / DD)Time slot Sarvadarshan... 3 to 5 H

Rs 300 Special Darshan Approx. Time... 2 to 3 H

Tq.

------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతుంది, అంటే అది ఎటువంటి టోకెన్లు లేకుండా ఆల్రెడీ q లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 08 గంటలు అని.
ప్రస్తుతం కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 10 నుంచి 14 గంటల సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.

------------------------
తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్, తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-
https://www.youtube.com/

https://t.me/LaxmiTeluguTech

https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో ముఖ్య నిర్ణ‌యాలుతిరుమ‌ల‌, 2023 న‌వంబ‌రు 14: టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌...
14/11/2023

టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో ముఖ్య నిర్ణ‌యాలు

తిరుమ‌ల‌, 2023 న‌వంబ‌రు 14: టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఇందులో తీసుకున్న కొన్ని ముఖ్య నిర్ణ‌యాలు ఇవి.

– టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగుల‌ రెగ్యుల‌రైజేషన్ ను రాష్ట్ర‌ ప్ర‌భుత్వ జి.ఓ.114 విధివిధానాల‌కు లోబ‌డి టీటీడీలో అమలుకు నిర్ణయం. వ‌చ్చే బోర్డు స‌మావేశంలో వివ‌రాలు తెలియ‌జేస్తాం.

– శ్రీ శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌హ విశేష హోమం ఈ నెల 23న అలిపిరి వ‌ద్దగ‌ల స‌ప్త‌గోప్ర‌ద‌క్షిణ మందిరంలో ప్రారంభం కానుంది. మొద‌ట కొద్దిమందితో ప్రారంభించి ఆ త‌రువాత విస్తృత స్థాయిలో స్లాట్ల విధానంలో నిర్వ‌హిస్తారు. ఇందుకోసం టికెట్ ధ‌ర రూ.1000/-గా నిర్ణ‌యించారు. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో టికెట్లు కేటాయిస్తారు. ప్ర‌త్య‌క్షంగా, వ‌ర్చువ‌ల్‌గా పాల్గొన‌వ‌చ్చు.

– వ‌డ‌మాలపేట మండ‌లం పాదిరేడు అర‌ణ్యం వ‌ద్ద టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థ‌లాలు అందించ‌డానికి అవ‌స‌ర‌మైన ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఇందుకోసం ఆ భూమిలో రూ.25.67 కోట్ల‌తో గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి టెండ‌రు ఖ‌రారు చేశాం.

అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉద్యోగుల‌కు అద‌నంగా కేటాయించిన 132 ఎక‌రాల్లో కూడా గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి రూ.15 కోట్ల‌తో టెండ‌ర్లు పిల‌వ‌డానికి పాల‌క‌మండ‌లి ఆమోదం తెలిపింది. ఇందుక‌య్యే ఖ‌ర్చును ఉద్యోగులు భ‌రిస్తారు. రిటైర్డ్ ఉద్యోగులు స‌హా అంద‌రికీ ఇవ్వ‌డానికి ఇంకా భూమి కోరాం. త్వ‌ర‌లో మ‌రిన్ని ఎక‌రాల వ‌స్తాయి.

– తిరుప‌తిలో టీటీడీ ఉద్యోగులు నివ‌సిస్తున్న‌ రామ్‌న‌గ‌ర్ క్వార్ట‌ర్స్‌లో రూ.6.15 కోట్ల‌తో అభివృద్ధి ప‌నులు చేయ‌డానికి టెండ‌ర్ల‌ను ఆమోదించాం.

– తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి రెండు బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి, బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసిన ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌క్క‌టి సేవ‌లు అందించిన రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌కు రూ.14 వేలు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌కు రూ.6,850/- బ్ర‌హ్మోత్స‌వ బ‌హుమానం అందించాల‌ని నిర్ణ‌యించాం.

– మ్యాన్‌ప‌వ‌ర్ స‌ర్దుబాటులో భాగంగా ప్ర‌స్తుతం టైపిస్ట్‌, టెలెక్స్ ఆప‌రేట‌ర్‌, టెలిఫోన్ ఆప‌రేట‌ర్ గ్రేడ్-1 హోదాల్లో ఉన్న ఉద్యోగుల‌ను జూనియ‌ర్ అసిస్టెంట్ క్యాడ‌ర్‌గా మార్పు చేసేందుకు ఆమోదం.

– టీటీడీ అన్న‌ప్ర‌సాదం విభాగంలో భ‌క్తుల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లు అందించ‌డానికి ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గ‌వ‌ర్న‌మెంట్ సంస్థ త‌ర‌ఫున క్లీనింగ్‌, స‌ర్వింగ్‌,లోడింగ్‌, అన్‌లోడింగ్ సేవ‌లు అందిస్తున్న‌ 528 మంది కార్మికుల‌ను మ‌రో మూడు నెల‌ల పాటు కొన‌సాగించేందుకు రూ.2.40 కోట్లు మంజూరుకు చేశాం.

– తిరుమ‌ల ఆరోగ్య విభాగం ఆధ్వ‌ర్యంలో ఐదు ప్యాకేజీల కింద సేవ‌లందిస్తున్న 1694 మంది పారిశుద్ధ్య కార్మికుల‌ను మ‌రో ఏడాది పాటు కొన‌సాగించేందుకు రూ.3.40 కోట్లు మంజూరుచేశాం.

– అదేవిధంగా తిరుమ‌ల‌లో ఎఫ్ఎంఎస్ సేవ‌లను మ‌రో ఏడాది పాటు పొడిగించేందుకు గాను సౌత్ ప్యాకేజీ రూ.13.20 కోట్లు, ఈస్ట్ ప్యాకేజి రూ.9.60 కోట్లు మంజూరుకు ఆమోదం.

– శ్రీ‌వారి ఆల‌యం, ఇత‌ర అనుబంధ ఆల‌యాల్లో నైవేద్యం, ప్ర‌సాదాలు, మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్నప్ర‌సాద కేంద్రంలో అన్న‌ప్ర‌సాదాల త‌యారీకి అవ‌స‌ర‌మైన ప‌ప్పు దినుసులు, చ‌క్కెర‌, మిర‌ప‌కాయ‌లు, నెయ్యి డ‌బ్బాలు నిల్వ ఉంచ‌డానికి తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద గ‌ల మార్కెటింగ్ గోడౌన్ల ప్రాంగ‌ణంలో రూ.11.05 కోట్ల‌తో నూత‌న గోడౌన్ నిర్మాణానికి టెండ‌ర్లు ఆమోదించాం.

ప్ర‌స్తుతం ఉన్న మూడు గోడౌన్ల‌లో టీటీడీ అవ‌స‌రాల‌కు 15 రోజులకు స‌రిప‌డా స్టాక్ నిల్వ ఉంచేందుకు మాత్ర‌మే అవ‌కాశముంది. నూత‌న గోడౌన్ నిర్మాణం ద్వారా 60 రోజుల నుండి 90 రోజుల వ‌ర‌కు స్టాక్ నిల్వ ఉంచుకునే సామ‌ర్థ్యం క‌లుగుతుంది.

– తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ద‌ర్శ‌నం కోసం వివిధ ప్రాంతాల నుండి విచ్చేస్తున్న భ‌క్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. భ‌క్తుల సంఖ్య‌కు త‌గిన‌ట్లుగా ర‌వాణా స‌దుపాయాలు పెంచాల్సిన బాధ్య‌త టీటీడీపై ఉంది. ఇందుకుగానూ ట్రాఫిక్ ఇబ్బందులు త‌గ్గించేందుకు మంగ‌ళం ఆర్‌టిఓ కార్యాల‌యం నుండి రేణిగుంట రోడ్డులోని ప‌ద్మావ‌తి ఫ్లోర్‌మిల్ వ‌ర‌కు గ‌ల 2.90 కి.మీ రోడ్డును 80 అడుగుల రోడ్డుగా విస్త‌రించేందుకు రూ.15.12 కోట్లు మంజూరుచేశాం.

– అలాగే రేణిగుంట రోడ్డులోని నారాయ‌ణాద్రి ఆసుప‌త్రి జంక్ష‌న్ నుండి తిరుచానూరు వ‌ద్దగల హైవే రోడ్డు వ‌ర‌కు ఉన్న రోడ్డును డివైడ‌ర్ల‌తో కూడిన నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు రూ.13.29 కోట్ల‌తో టెండ‌రు ఆమోదించాం.

– శ్రీ‌వారి భ‌క్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొల‌గించ‌డంలో భాగంగా రేణిగుంట రోడ్డులోని హీరో షోరూమ్ నుండి తిరుచానూరు గ్రాండ్ రిడ్జి హోట‌ల్ వ‌ర‌కు 1.135 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ.3.11 కోట్ల‌తో టెండ‌ర్ల‌ను ఆమోదించాం.

– తిరుప‌తిలోని ఎంఆర్‌.ప‌ల్లి జంక్ష‌న్ నుండి పాత తిరుచానూరు రోడ్డు జంక్ష‌న్ వ‌ర‌కు (అన్న‌మ‌య్య మార్గం), 2వ స‌త్రం నుండి అన్న‌మ‌య్య మార్గం వ‌ర‌కు ఫుట్‌పాత్‌లు, డ్రెయిన్లు, సెంట్ర‌ల్ డివైడ‌ర్ త‌దిత‌ర అభివృద్ధి ప‌నుల కోసం రూ.4.89 కోట్ల మంజూరు చేశాం.

– శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి త‌ల్లి అయిన శ్రీ వ‌కుళామాత ఆల‌యానికి వ‌స్తున్న భ‌క్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న విష‌యం తెలిసిందే. భ‌క్తుల స‌దుపాయం కోసం తిరుప‌తి స‌మీపంలోని పుదిప‌ట్ల జంక్ష‌న్ నుండి వ‌కుళమాత ఆల‌యం వ‌ద్ద గ‌ల జాతీయ ర‌హ‌దారి వ‌ర‌కు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.21.10 కోట్ల‌తో టెండ‌రు ఆమోదించాం. ఇది పూర్త‌యితే తిరుప‌తికి పూర్తిగా ఔట‌ర్ రింగ్ రోడ్డు ఏర్ప‌డుతుంది.

– రోగుల‌కు చ‌క్క‌టి ఆయుర్వేద వైద్య సేవ‌లు అందిస్తున్న ఎస్వీ ఆయుర్వేద ఆసుప‌త్రిలో రోగుల‌కు మ‌రింత సౌక‌ర్యాలు క‌ల్పించ‌డానికి రూ.1.65 కోట్ల‌తో గ్రౌండ్ ఫ్లోర్ అభివృద్ధి ప‌నుల‌కు టెండ‌రు ఆమోదం.

– తిరుప‌తిలో శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల సూప‌ర్‌స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఆసుప‌త్రి నిర్మాణం కోసం రుయా ఆసుప్ర‌తిలో గ‌ల పాత టిబి వార్డు స్థ‌లాన్ని వినియోగించుకోవ‌డం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో రుయా ఆసుప‌త్రికి వ‌స్తున్న టిబి రోగుల‌కు మంచి స‌దుపాయాల‌తో కూడిన నూత‌న టిబి వార్డు నిర్మాణానికి రూ.1.79 కోట్ల‌తో టెండ‌రు ఆమోదించాం.

– రాయ‌ల‌సీమ‌కే త‌ల‌మానిక‌మైన స్విమ్స్ ఆసుప‌త్రికి రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతూ ఉంది. రోగుల‌కు స‌హాయ‌కులుగా వ‌చ్చిన వారు చెట్ల‌కింద విశ్రాంతి తీసుకుంటూ ఇబ్బందులు ప‌డుతుండ‌టంతో వారి కోసం ఇటీవ‌ల వ‌స‌తి భ‌వ‌నం నిర్మించ‌డం జ‌రిగింది. కానీ మ‌రింత‌మంది రోగుల సౌక‌ర్యం కోసం రూ.3.35 కోట్ల‌తో ప్ర‌స్తుతం ఉన్న భ‌వ‌నంపై మ‌రో రెండు అంత‌స్తుల నిర్మాణానికి టెండ‌రు ఆమోదించాం.

– స్విమ్స్‌కు వైద్యం కోసం వ‌చ్చే రోగుల‌కు మ‌రింత ఆధునిక వైద్య స‌దుపాయాలు అందుబాటులోకి తేవ‌డంలో భాగంగా నూత‌న‌ కార్డియో న్యూరో బ్లాక్ నిర్మాణానికి రూ.74.24 కోట్ల‌తో టెండ‌రు ఖరారు చేశాం.

– అదేవిధంగా స్విమ్స్ ఆసుప‌త్రి భ‌వ‌నాల ఆధునీక‌ర‌ణ‌కు, పున‌ర్నిర్మాణానికి రూ.197 కోట్లతో ప‌రిపాల‌న అనుమ‌తికి ఆమోదం. మూడేళ్ల‌లో ద‌శ‌ల‌వారీగా ఈ అభివృద్ధి ప‌నులు చేప‌డ‌తాం.

– న‌డ‌క దారుల్లో తిరుమ‌ల‌కు వ‌స్తున్న భ‌క్తుల భ‌ద్ర‌త కోసం తిరుప‌తి డిఎఫ్‌వో ఆధ్వ‌ర్యంలో డిజిట‌ల్ కెమెరా ట్రాప్‌లు, వైల్డ్ లైఫ్ మానిట‌రింగ్ సెల్‌, కంట్రోల్ రూమ్‌కు అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాల కొనుగోలుకు రూ.3.50 కోట్లు మంజూరుకు ఆమోదం.

– క‌రీంన‌గ‌ర్‌లో శ్రీ ప‌ద్మావ‌తి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య నిర్మాణానికి రూ.15.54 కోట్ల‌తో టెండ‌రు ఆమోదం తెలిపాం.

– సంప్ర‌దాయ క‌ళ‌ల‌ను ప్రోత్స‌హించ‌డంలో భాగంగా తిరుప‌తిలోని ఎస్వీ శిల్ప‌క‌ళాశాల‌లో సంప్ర‌దాయ క‌ళంకారీ, శిల్ప‌క‌ళలో ప్రాథ‌మిక శిక్ష‌ణ సాయంకాలం కోర్సులు ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిర్ణ‌యం.

ఈ స‌మావేశంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, బోర్డు స‌భ్యులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

https://youtu.be/qtGBnbTtCiE
14/11/2023

https://youtu.be/qtGBnbTtCiE

"🌐 TTD Jobs Alert & Tirumala Updates: Golden Opportunities Await! Stay In the Loop with the Latest Job Notifications and Exclusive Tirumala News! 🚀🔔 ...

🙏 Om Namo Venkatesaya 🙏13-11-2023Total pilgrims   - 70,902Tonsures: 22,858Hundi kanukalu : 3.24CrWaiting Compartments… 2...
14/11/2023

🙏 Om Namo Venkatesaya 🙏

13-11-2023

Total pilgrims - 70,902

Tonsures: 22,858

Hundi kanukalu : 3.24Cr

Waiting Compartments… 24

Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens).... 12 H

(SSD / DD)Time slot Sarvadarshan... 2 to 5 H

Rs 300 Special Darshan Approx. Time... 2 to 3 H

Tq.

------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతుంది, అంటే అది ఎటువంటి టోకెన్లు లేకుండా ఆల్రెడీ q లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 08 గంటలు అని.
ప్రస్తుతం కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.

------------------------
తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్, తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-
https://www.youtube.com/

https://t.me/LaxmiTeluguTech

https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

🙏 Om Namo Venkatesaya 🙏12-11-2023Total pilgrims   - 74,807Tonsures: 21,974Hundi kanukalu : 3.58 CrWaiting Compartments.....
13/11/2023

🙏 Om Namo Venkatesaya 🙏

12-11-2023

Total pilgrims - 74,807

Tonsures: 21,974

Hundi kanukalu : 3.58 Cr

Waiting Compartments...Present Direct Line

Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens)....After 7.00AM ....6H.

(SSD / DD)Time slot Sarvadarshan... 2 to 3 H

Rs 300 Special Darshan Approx. Time... 1 to 2 H

Tq.
------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి డైరెక్ట్ లైన్లో భక్తులను అనుమతిస్తున్నారు, ఈ రోజు ఉదయం 8.00 గంటల తర్వాత కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 4 నుంచి 6 గంటల పైన సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.

------------------------
తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్, తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-
https://www.youtube.com/

https://t.me/LaxmiTeluguTech

https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

https://youtu.be/RT_nS5gGd9c
12/11/2023

https://youtu.be/RT_nS5gGd9c

Vaikuntha Ekadashi Darshan tickets are still available || Tirumala February Darshan Tickets || Latest information"Unlock Divine Bliss: Vaikuntha Ekadashi Dar...

శ్రీవారి భక్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు.....మహాలక్ష్మీ ఆశీర్వాదంతో మీ ఇంట్లో సిరులు పండాలి, మీరు ఆయురారోగ్యాలతో, అష్ట...
12/11/2023

శ్రీవారి భక్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు.....

మహాలక్ష్మీ ఆశీర్వాదంతో మీ ఇంట్లో సిరులు పండాలి, మీరు ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు...

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏

🙏 Om Namo Venkatesaya 🙏శ్రీవారి భక్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు.....11-11-2023Total pilgrims   - 71,490Tonsures: 24,99...
12/11/2023

🙏 Om Namo Venkatesaya 🙏

శ్రీవారి భక్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు.....

11-11-2023

Total pilgrims - 71,490

Tonsures: 24,993

Hundi kanukalu : 3.87Cr

Waiting Compartments… 21

Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens).... 12 H

(SSD / DD)Time slot Sarvadarshan... 2 to 5 H

Rs 300 Special Darshan Approx. Time... 2 to 3 H

Tq.

------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతుంది, అంటే అది ఎటువంటి టోకెన్లు లేకుండా ఆల్రెడీ q లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 08 గంటలు అని.
ప్రస్తుతం కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 08 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.

------------------------
తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్, తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-
https://www.youtube.com/

https://t.me/LaxmiTeluguTech

https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

https://youtu.be/aApeSumwrFQ
11/11/2023

https://youtu.be/aApeSumwrFQ

Vaikuntha Ekadashi Darshan tickets are still available || Tirumala February Darshan Tickets || Latest information"Unlock Divine Bliss: Vaikuntha Ekadashi Dar...

🙏 Om Namo Venkatesaya 🙏10-11-2023Total pilgrims   - 56,978Tonsures: 19,617Hundi kanukalu : 4.87 CrWaiting Compartments.....
11/11/2023

🙏 Om Namo Venkatesaya 🙏

10-11-2023

Total pilgrims - 56,978

Tonsures: 19,617

Hundi kanukalu : 4.87 Cr

Waiting Compartments...Present Direct Line

Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens)....After 8.00AM ....6H.

(SSD / DD)Time slot Sarvadarshan... 2 to 3 H

Rs 300 Special Darshan Approx. Time... 1 to 2 H

Tq.
------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి డైరెక్ట్ లైన్లో భక్తులను అనుమతిస్తున్నారు, ఈ రోజు ఉదయం 8.00 గంటల తర్వాత కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 4 నుంచి 8 గంటల పైన సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.

------------------------
తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్, తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-
https://www.youtube.com/

https://t.me/LaxmiTeluguTech

https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

https://youtu.be/CYV2Z4qQLzA
10/11/2023

https://youtu.be/CYV2Z4qQLzA

Breaking news | తిరుమల తాజా సమాచారం | ఈరోజు దర్శనం టికెట్స్ బుకింగ్ సమాచారంనేడే తిరుమల వైకుంఠ ఏకాదశి శ్రీవాణి టికెట్స్ మ.....

బ్రేకింగ్ న్యూస్ వైకుంట ద్వార దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనం మరియు వసతి కోటా 23.12.2023 నుండి 01.01.2024 వరక...
10/11/2023

బ్రేకింగ్ న్యూస్

వైకుంట ద్వార దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనం మరియు వసతి కోటా 23.12.2023 నుండి 01.01.2024 వరకు బుకింగ్ కోసం ఈరోజు మద్యాహ్నం 03:00 కి అందుబాటులో ఉంటుంది.

వైకుంట ద్వార దర్శనం వసతి 21.12.2023, 25.12.2023 నుండి 01.01.2024 వరకు తిరుమల వసతి కోటా బుకింగ్ కోసం ఈరోజు సాయంత్రం 05:00 కి అందుబాటులో ఉంటుంది.

🙏 Om Namo Venkatesaya 🙏09-11-2023Total pilgrims   - 56,723Tonsures: 21,778Hundi kanukalu : 3.37CrWaiting Compartments… 1...
10/11/2023

🙏 Om Namo Venkatesaya 🙏

09-11-2023

Total pilgrims - 56,723

Tonsures: 21,778

Hundi kanukalu : 3.37Cr

Waiting Compartments… 13

Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens).... 08 H

(SSD / DD)Time slot Sarvadarshan... 2 to 4 H

Rs 300 Special Darshan Approx. Time... 1 to 3 H

Tq.

------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి 05 గంటల సమయం పడుతుంది, అంటే అది ఎటువంటి టోకెన్లు లేకుండా ఆల్రెడీ q లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 05 గంటలు అని.
ప్రస్తుతం కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 06 నుంచి 08 గంటల సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.

------------------------
తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్, తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-
https://www.youtube.com/

https://t.me/LaxmiTeluguTech

https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

🙏 Om Namo Venkatesaya 🙏08-11-2023Total pilgrims   - 58,157Tonsures: 24,054Hundi kanukalu : 4.55CrWaiting Compartments… 0...
09/11/2023

🙏 Om Namo Venkatesaya 🙏

08-11-2023

Total pilgrims - 58,157

Tonsures: 24,054

Hundi kanukalu : 4.55Cr

Waiting Compartments… 06

Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens).... 06 H

(SSD / DD)Time slot Sarvadarshan... 2 to 4 H

Rs 300 Special Darshan Approx. Time... 1 to 2 H

Tq.

------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి 05 గంటల సమయం పడుతుంది, అంటే అది ఎటువంటి టోకెన్లు లేకుండా ఆల్రెడీ q లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 05 గంటలు అని.
ప్రస్తుతం కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 06 నుంచి 08 గంటల సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.

------------------------
తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్, తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-
https://www.youtube.com/

https://t.me/LaxmiTeluguTech

https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

👉
08/11/2023

👉

IMPORTANT INFORMATION & RULES FOR BOOKING | Vaikunta Ekadasi tickets Booking Tips |TTD Latest Press Release| Tirumala tirupati updates | తి...

బ్రేకింగ్ న్యూస్ 23.12.2023 నుండి 01.01.2024 వరకు వైకుంట ద్వార దర్శనం కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టిక్కెట్లు బు...
08/11/2023

బ్రేకింగ్ న్యూస్

23.12.2023 నుండి 01.01.2024 వరకు వైకుంట ద్వార దర్శనం కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టిక్కెట్లు బుకింగ్ కోసం 10.11.2023 ఉదయం 10:00 గంటలకు అందుబాటులో ఉంటాయి.

వైకుంట ద్వార దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనం మరియు వసతి కోటా 23.12.2023 నుండి 01.01.2024 వరకు బుకింగ్ కోసం 10.11.2023 03:00 PM అందుబాటులో ఉంటుంది.

వైకుంట ద్వార దర్శనం వ్యవధి 25.12.2023 నుండి 01.01.2024 వరకు తిరుమల వసతి కోటా బుకింగ్ కోసం w.e.f. 10.11.2023 05:00 PM అందుబాటులో ఉంటుంది.

న‌వంబ‌రు 10న ఎస్ఇడి, శ్రీ‌వాణి, గ‌దుల కోటా విడుద‌ల‌తిరుమల, 2023 నవంబరు 08: డిసెంబ‌రు 23 నుండి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు వై...
08/11/2023

న‌వంబ‌రు 10న ఎస్ఇడి, శ్రీ‌వాణి, గ‌దుల కోటా విడుద‌ల‌

తిరుమల, 2023 నవంబరు 08: డిసెంబ‌రు 23 నుండి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి సంబంధించి రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు, శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లు, గ‌దుల కోటాను న‌వంబ‌రు 10న టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

2.25 ల‌క్ష‌ల రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల‌ను ఉద‌యం 10 గంట‌ల‌కు, రోజుకు 2 వేలు చొప్పున 20 వేల శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు, గ‌దుల కోటాను సాయంత్రం 5 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తారు. భ‌క్తులు ఈ విష‌యాల‌ను గ‌మ‌నించాల్సిందిగా కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

08/11/2023

SED, SRIVANI, ACCOMMODATION ON NOVEMBER 10

TIRUMALA, 08 NOVEMBER 2023: TTD will release the online quota of Rs.300 SED tickets, SRIVANI and accommodation for Vaikuntha Dwara Darshanam period between December 23 to January 1 on November 10.

TTD will release 2.25Lakh SED tickets at 10am and 20,000 ( per day) tickets of SRIVANI on the same day at 3pm.

While the accommodation quota for the period will be released at 5pm.

The devotees are requested to make note of this.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

🙏 Om Namo Venkatesaya 🙏07-11-2023Total pilgrims   - 61,640Tonsures: 19,064Hundi kanukalu : 3.19 CrWaiting Compartments.....
08/11/2023

🙏 Om Namo Venkatesaya 🙏

07-11-2023

Total pilgrims - 61,640

Tonsures: 19,064

Hundi kanukalu : 3.19 Cr

Waiting Compartments...Present Direct Line

Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens)....After 7.00AM ....8H.

(SSD / DD)Time slot Sarvadarshan... 2 to 3 H

Rs 300 Special Darshan Approx. Time... 1 to 2 H

Tq.
------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి ప్రెజెంట్ డైరెక్ట్ లైన్లో భక్తులను అనుమతిస్తున్నారు, ఈ రోజు ఉదయం 7.00 గంటల తర్వాత కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 6 నుంచి 8 గంటల పైన సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.

------------------------
తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్, తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-
https://www.youtube.com/

https://t.me/LaxmiTeluguTech

https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

https://youtu.be/nvJqXq8d10I
07/11/2023

https://youtu.be/nvJqXq8d10I

తిరుమల పుష్పయాగం శ్రీవారి భక్తుల సందేహాలకు సమాధానాలు మరియు తిరుమల దర్శనం వివరాలు || టిటిడి రోజువారీ అప్డేట్స్ TT...

నవంబర్ 17న పెద్ద శేష వాహనంతిరుమల, 07 నవంబర్ 2023: నవంబర్ 17న నాగుల చవితి సందర్భంగా అదే రోజు సాయంత్రం తిరుమలలో పెద్ద శేషవ...
07/11/2023

నవంబర్ 17న పెద్ద శేష వాహనం

తిరుమల, 07 నవంబర్ 2023: నవంబర్ 17న నాగుల చవితి సందర్భంగా అదే రోజు సాయంత్రం తిరుమలలో పెద్ద శేషవాహన సేవ జరగనుంది.

ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామి సప్త శీర్ష వాహనంపై దివ్యవాహనం చేసి రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు.

ప్రజా సంబంధాల అధికారి TTDలు, తిరుపతి ద్వారా జారీ చేయబడింది

తిరుమల తరహాలో  శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవలు– తిరుచానూరులో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనంలో పాల్గొన్న టీటీడీ ఛైర్మన్ శ్ర...
07/11/2023

తిరుమల తరహాలో శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవలు

– తిరుచానూరులో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనంలో పాల్గొన్న టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి

తిరుపతి, 2023 నవంబరు 07: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారని టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగ‌ళ‌వారం కోయిల్‌
ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం టీటీడీ ఛైర్మన్ శ్రీ కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముందుగా జరిగే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించామన్నారు. నవంబరు 9న అంకురార్పణ, 10న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 14న అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహన సేవకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని, ఎక్కువ మంది భక్తులు దర్శించుకునేలా అధికారులు చక్కటి ప్రణాళికల్ని రూపొందించారని తెలిపారు. 18న పంచమితీర్థానికి విశేషంగా భక్తులు తరలివచ్చి కోనేరులో పుణ్యస్నానాలు చేస్తారని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. దాదాపు రూ.9 కోట్లతో పంష్కరిణిని ఆధునీకరించి నీటితో నింపారని తెలియజేశారు.

ఆలయంలో ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

15 పరదాలు విరాళం

ఈ సందర్భంగా అమ్మవారి ఆలయానికి చైర్మన్ శ్రీ కరుణాకర రెడ్డి చేతుల మీదుగా భక్తులు 15 పరదాలను విరాళంగా అందించారు. హైదరాబాదుకు చెందిన శ్రీ స్వర్ణ కుమార్ రెడ్డి 11, గుంటూరుకు చెందిన శ్రీ అరుణ్ కుమార్, శ్రీమతి పద్మావతి, తిరుచానూరుకు చెందిన శ్రీమతి పవిత్ర, శ్రీమతి రజిని ఒక్కొక్కటి చొప్పున నాలుగు పరదాలను విరాళంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ యానాదయ్య, శ్రీ నాగసత్యం, శ్రీ సుబ్బరాజు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, విజివో శ్రీ బాలిరెడ్డి, ఏఈవో శ్రీ రమేష్, పాంచరాత్ర ఆగమసలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్లు శ్రీమతి శ్రీవాణి, శ్రీ శేషగిరి, అర్చకులు శ్రీ బాబుస్వామి, శ్రీ వేంపల్లి శ్రీను స్వామి, శ్రీ మణికంఠ స్వామి, సిఐ శ్రీ శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when LaxmiTeluguTech posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share