Bhim News

Bhim News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhim News, News & Media Website, .

30/09/2024
https://www.youtube.com/watch?v=bhxnlXJsB9c
16/04/2023

https://www.youtube.com/watch?v=bhxnlXJsB9c

Sudheer Sandra - సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు.. | Facts Behind Supreme Court Decision | Sumantv Exclusive ...

https://www.youtube.com/watch?v=hNrW6H25wvA
14/04/2023

https://www.youtube.com/watch?v=hNrW6H25wvA

►Priya Chowdary Analysis On Supreme Court Decision || తండ్రి చెప్పినట్టు వింటేనే.. || Mr NagMr. Nag is the Off Beat...

10/03/2023
03/10/2021

కొమ్ముచిక్కాల లో రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని పంచాయితీ వారు తొలగించడం దారుణం!

31/05/2021

👆(ప్రభువు నందు నిద్రించిన వారు ధన్యులు)
(జాతస్య మరణం ధృవం)
అతి చిన్నవయస్సులో మానుండి దూరమైన మా తమ్ముని మరణం మాకు తీవ్ర ఆవేదనను మిగిల్చింది, ఆయన కుటుంబానికి పూడ్చలేని అగధాన్ని నిర్ధేశించింది.
అయితే అంతకన్నా మించిన ఆవేదన కొంతమంది సంఘస్థుల రూపంలో మాకు కనిపించింది. వారియొక్క అంతర్ముఖత్వం, గోముఖవ్యాఘ్ర రూపం, అపరిచితుని లోని ద్వంద్వ ముఖ చిత్రాలు చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాము.
మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు గౌరవప్రదంగా నిర్వహించాలని అన్ని మతగ్రంధాలూ చెబుతున్నాయి. అయితే నా తమ్ముని పార్థివ దేహం కళ్ళముందు కనిపిస్తుండగానే ప్రేమగల ఏసుక్రీస్తును అనుసరించే కొంతమంది సంఘస్థులు "సుమంత్" మా సంఘం కాదు కనుక రెస్ట్ హౌస్ రోడ్డు నందు భూస్థాపితం చెయ్యనివ్వమని ఖరాఖండిగా చెప్పారు. కొంతమంది ఆత్మీయులు కలుగచేసుకుని స్థలం ఇవ్వమని కోరగా Rs. 2,50,000/- డిమాండ్ చేశారు. ఆ స్థలం సంఘానిది కనుక అడగటానికి వేరే సంఘస్తులకు హక్కు లేదు. మరి వేరే సంఘస్తులకు స్థలం కేటాయించారు. కొంతమంది దగ్గర ఒక లక్ష తీసుకోగా, మరి కొంతమంది దగ్గర లక్షా ఎబ్భై వేలు తీసుకున్నారట. ఇది ఏ రకంగా న్యాయం? వేరే సంఘస్థులకు స్థలం విషయంలో ఒకే న్యాయం ఉండదా?
ఇక చినపేట పెద్దలైతే స్థలం ఇవ్వం గాక ఇవ్వమన్నారు. అక్కడ కూడా వేరే సంఘస్తుల దగ్గర డబ్బులు తీసుకున్నట్టు సాక్ష్యాలు ఉన్నాయి. ఈ విషయం తెలిసి భీమవరం CI గారు ఆశ్చర్యపోయారు.
కొంతమంది హిందూ సోదరులు మునిసిపాలిటీ ఆధీనంలో ఉన్న శ్మశానవాటిక నందు భూస్థాపితం చేద్దామని మాకు నైతిక మద్దతు తెలియచేశారు.
ఈ వేదనలో, పై వారి అనైతిక ప్రవర్తన చూసిన తరువాత నాకేమనిపించిందంటే :

1. ఇతర సంఘస్థులు అందరూ ప్రభుత్వాన్ని తమకు ఒక క్రైస్తవ శ్మశానవాటికకు స్థలం కేటాయించమని కోరటం
2. మరణానంతరం ఏదైనా మెడికల్ కాలేజ్ కు దేహాన్ని డోనేట్ చెయ్యడం
3. హిందూ శ్మశానవాటిక నందు సమాధి చేయటం ...

అశ్రునయనాలతో
(గంటా వరప్రసాద్
కీ.శే. సుమంత్ పెద్దన్నయ్య)

  Bhimavaram BAR Association President Yeleti Newton at Raj Trust office
07/04/2021

Bhimavaram BAR Association President Yeleti Newton at Raj Trust office

28/02/2021

☠️ *వంటనూనెల్లో దాగిన విషం* ☠️

🙏జాగ్రత్త పడవలసిన విషయం🤔

సన్ ఫ్లవర్ 30-40 సంవత్సరాల క్రితం పండించే వారే కాదు అసలు మన భారతదేశంలో 40 సం" కిందట సన్ ఫ్లవర్ నూనె లేదు, పంట లేదు...,
మన ఆహారధాన్యం నూనె ధాన్యం కానే కాదు.
ఆరోగ్యానికి హానికరం

మన భారత దేశం లో తక్కువనే పండిస్తారు

మరి ప్రతి నెలా ఇన్ని లక్షల లీటర్ల సన్ ఫ్లవర్ నూనె ఎలా వస్తున్నది ??

సన్ ఫ్లవర్ నూనె పాకెట్ లో కేవలం 10-15% సన్ ఫ్లవర్ నూనె ఉంటుంది (అది కూడా ఆరోగ్యానికి హానికరం) మిగితా 60% ప్యరాఫీన్ ఆయల్

👉⛽క్రూడ్ లో నుండి డీజిల్, పెట్రోల్ తీసిన తరువాత నీరు లాంటి పారాఫిన్ (Paraffin) ఆయల్ బయటకు వస్తుంది దీనిని వంట నూనెలా ఉపయోగిస్తే హార్ట్, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ , డయాబెటిస్ వ్యాధులు వస్తాయి. ఈ నూనె చాల ప్రమాదకరం🐽

మిగతా 30% శాతం పామాయల్ ఉంటాయి.
పాం ఆయల్ తినే నూనె కాదు హార్ట్ మరియు నరాల వ్యాధులు వస్తాయి.
పూర్వకాలం లో ఎవ్వరూ ఉపయోగించలేదు. అసలు 30 సం"ల క్రితం ఈ పామాయల్ ఉనికే లేదు !

ఈ కల్తీ నూనెలకు తోడు ప్లాస్టిక్ ప్యాకెట్లు....
ప్లాస్టిక్ లో BPA
(bisphenol A) ఇంకా pthalates అనే అతి విషకరమైన కెమికల్స్ నూనె లో కలుస్తాయి వీటి వలన మగవాళ్లలో వీర్యోత్పత్తి తగ్గిపోయి నపుంసకులుగా మారుతున్నారు..!

📵 దరిదాపుగా మార్కెట్ లో బ్రాండెడ్ నూనెలుగా మనం వాడుతున్నవేవీ మంచివి కావు.

కల్తీ నూనెలు నుంచి కాపాడుకునే మార్గాలు :-

👉వేరు శెనగలు, నువ్వులు కుసుమలు లాంటి నూనె ధాన్యాలు కొని ఆయిల్ మిల్ లో మన కళ్ల ముందే గానుగ పట్టించాలి.

👉నూనెను ప్లాస్టిక్ కంటైనర్ లో వేస్తే ప్లాస్టిక్ లో ఉన్న విష కెమికల్స్ నూనె లో కలిసి పోతాయి కాబట్టి నూనె నిల్వ చెయ్యడానికి స్టీల్ కంటైనరే వాడాలి.

👉ఇలా మనం సొంత నూనె వాడుకుంటే భారత దేశంలో 80-90% హార్ట్ వ్యాధులు దూరం అవుతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి రుగ్మతలు దరికి రావు.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అవసరం తగ్గుతుంది !!

*మరి ఎలాంటి వంట నూనెలు వాడాలి*

జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్ధమైన వంట నూనెలను వాడవలెను. శుద్ధమైన నూనె అంటే నాన్ రిఫైండ్ నూనే (Non Refined Oil). నూనెలో ఏమీ కలపకుండా గానుగ నుండి సరాసరి తెచ్చుకున్న నూనె వాడాలి. ఈ శుద్ధమైన నూనెకు వాసన ఎక్కువగా ఉంటుంది, బాగా జిగురు, జిగురుగా ఉంటుంది. చిక్కగా మంచి వాసన వస్తూ ఉంటుంది . నూనెలో ఉండవలసిన ముఖ్య అంశం జిగురు పదార్ధము, ప్రోటీన్స్. ఆ జిగురును వేరు చేస్తే నూనె మిగలదు. నూనెలో వాసన రూపంలో ఉండే ఆర్గానిక్ కంటేంటే ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్. నూనెని రిఫైండ్ (Refined) చేసినపుడు జిగురు, వాసన పోతాయి. ఇక అందులో ఉండేది నూనె కాదు నీళ్ళే .

ఏ నూనెలో కూడా మంచి కొలెస్ట్రాల్, చెడ్డ కోలెస్ట్రాల్ వుండదు . మనము తీసుకొనే ఆహారము మరియు నూనెల నుండి మన శరీరంలో ఈ కొలెస్ట్రాల్ తయారవుతుంది . మనము శుద్ధమైన నూనె (Non Refined Oil) తీసుకున్నప్పుడు మన శరీరంలో *లివర్* సహాయంతో మంచి కొలెస్ట్రాల్ (H.D.L.) ఎక్కవ మోతాదులో తయారవుతుంది. శుద్ధమైన నూనె వాడి జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి.

భారత దేశంలో 50 సంవత్సరాల పూర్వం వరకు ఈ రిఫైండ్ ఆయిల్ లేదు. రిఫైండ్ నూనె చేసేటప్పుడు 6 రకాల హానికరమైన కెమికల్స్, డబుల్ రిఫైండ్ చేసేటప్పుడు 13 రకాల హానికరమైన కెమికల్స్ వాడుతారు. ఈ కెమికల్స్ ముందు ముందు మన శరీరంలో వాటంతట అవే విషాన్ని పుట్టిస్తాయి. ఈ రిఫైండ్ అయిలో మన శరీరానికి కావలసిన జిగురు, వాసన, ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఏవీ వుండవు. చాలా హానికరమైన ఎటువంటి రిఫైండ్ ఆయిల్స్ వాడకూడదు.

వాతాన్ని నివారించటానికి శుద్ధమైన నూనె, పిత్తాన్ని నివారించటానికి దేశవాళి ఆవు నెయ్యి, కఫంను సక్రమంగా ఉంచాలంటే అన్నింటికన్నా ఉత్తమమైనవి బెల్లం, తేనె.
కుస్తీపట్లు, దండీలు, బస్కీలు తీసేవారికి మాత్రమే గేదె నెయ్యి మంచిది.

రోగాలకు రాజు వాతరోగాలు.
మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి, మెడనొప్పులు, హార్ట్ ఎటాక్, పక్షవాతము, బ్రైన్ ట్యూమర్ వంటివి వాతము పూర్తిగా తగ్గిపోవటం వల్ల కానీ లేదా చెడిపోవటం వల్ల కానీ కలుగుతాయి.

జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్దమైన నునెలు (Non -Refined) వేరు శెనగ నూనె , కొబ్బరి నూనె, కుసుమల నూనె, నువ్వుల నూనె మరియు ఆవాల నూనెలు మాత్రమే వాడవలెను.

ప్రొద్దుతిరుగుడు పూల విత్తనాలను (Sun flower seeds) గేదలకు మరియు పశువులకు మాత్రమే పెట్టదగినవి . మనకు ఏ మాత్రము ఈ Sun flower oil వాడదగినది కాదు, ఆరోగ్యకరము కాదు.

ఈ రిఫైండ్ ఆయిల్స్ (Refined oils) ఎంత మాత్రమూ వాడతగినవి కాదు .

సోయాబీన్స్, సోయాబీన్స్ ఆయిల్ మరియు సోయాబీన్ పాలు ఏ మాత్రము వాడరాదు. పందులు తినతగినవి ఈ సోయాబీన్స్, ఎందుకనగా పందులు మాత్రమే వీటిని తిని అరగించు కోగలవు . మనుష్యులలో ఈ సోయాబీన్స్ ని అరిగించే ఎంజైమ్స్ లేనే లేవు. కావున వీటిని వాడరాదు. వీటిని వాడిన యెడల మందులు లేని భయంకరమైన రోగాలు ఖచ్చితంగా వస్తాయి.

పామోలిన్ అయిల్ కూడా చాలా హానికరమైన అయిల్. వీటిని వాడుతున్నవారికి మొదట మలబద్దకుము వస్తుంది. ఈ మలబద్దకమే అన్ని రోగాలకు మూలము. ప్రస్తుతము చాలా రోగాలకు మూలము ఈ పామోలిన్ అయిల్. ఈ పామోలిన్ పంట పండించే దేశాలలో ఈ నూనెను నిషేదించినారు. వారు ఏ విధముగా కూడా ఈ పామోలిన్ వాడటం లేదు. ప్రపంచములో ఒక్క భారత దేశములో మాత్రమే ఉపయోగిస్తున్నారు.

విదేశీయులకు భారత దేశము ఒక ప్రయోగశాలగా మారింది. కావున మనము మన సంపూర్ణ ఆరోగ్యము కొరకు త్యజించ వలెయును .
*శుద్దమైన నూనెలను* వాడితే మీరు జీవితాంతం ఆరోగ్యంగా జీవించ గలరు.

*గమనిక :-*
*సన్ ఫ్లవర్ ఆయిల్ (Sun Flower Oil), సోయాబిన్ ఆయిల్ (Soya Bean Oil) , పామోలిన్ ఆయిల్ (Pamolene Oil)

28/02/2021


ముఖ్యంగా రైతులకు

1) ఒక ఎకరాకు = 40 గుంటలు
2) ఒక ఎకరాకు = 4840 Syd
3) ఒక ఎకరాకు = 43,560 Sft
4) ఒక గుంటకు = 121 Syd
5) ఒక గుంటకు = 1089 Sft
6) ఒక స్క్వయర్ యార్డ్ కు 3 x 3 = 09చదరపు ఫీట్లు
7) 121 x 09 = 1089 Sft
8) 4840 Syd x 09 = 43,560 Sft
9) ఒక సెంట్ కు = 48.4 Syd
10) ఒక సెంట్ కు = 435.6 Sft

Land servay కోసం అత్యవసరమైన information...
Common Terminology in Revenue Department

#గ్రామ_కంఠం :
గ్రామంలో నివసించేందుsకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి.

#అసైన్డ్‌భూమి :
భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు.

#ఆయకట్టు :
ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు.

#బంజరు_భూమి (బంచరామి) :
గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి. దీనిని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.

#అగ్రహారం :
పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.

#దేవళ్‌_ఇనాం :
దేవాలయ ఇనాం భూమి. దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరునగానీ, దేవాలయం పేరున కేటాయించిన భూమి.

#అడంగల్‌ (పహాణీ) :
గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్‌ను అడంగల్‌ (పహాణీ) అంటారు. ఆంధ్ర ప్రాం తంలో అడంగల్‌ అనీ, తెలంగాణలో పహాణీ అని పిలుస్తారు. భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికపుడు ఇందులో నమోదు చేస్తారు.
Satya Vara Prasad
*తరి : సాగు భూమి

*ఖుష్కీ : మెట్ట ప్రాంతం

*గెట్టు : పొలం హద్దు

*కౌల్దార్‌ : భూమిని కౌలుకు తీసకునేవాడు

*కమతం : భూమి విస్తీర్ణం

*ఇలాకా : ప్రాంతం

*ఇనాం : సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమి

*బాలోతా ఇనాం :
భూమిలేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమి

*సర్ఫేఖాస్‌ : నిజాం నవాబు సొంత భూమి

*సీలింగ్‌ : భూ గరిష్ఠ పరిమితి

*సర్వే నంబర్‌ : భూముల గుర్తింపు కోసం కేటాయించేది

*నక్షా : భూముల వివరాలు తెలిపే చిత్రపటం

*కబ్జాదార్‌ : భూమిని తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించే వ్యక్తి

*ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) :
భూ స్వరూపాన్ని తెలియజేసే ధ్రువీకరణ పత్రం. 32 ఏళ్లలోపు ఓ సర్వే నంబర్‌ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు.

*ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ (ఎఫ్‌ఎంబీ) బుక్‌ :
దీన్నే ఎఫ్‌ఎంబీ టీపన్‌ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్‌ఎంబీ ఒక భాగం. ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు, పట్టాలు, కొలతలు ఉంటాయి.

*బందోబస్తు :
వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తు అంటారు.

*బీ మెమో :
ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు, జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీస్‌ను బీ మెమో అంటారు.

*పోరంబోకు :
భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూములు. ఇది కూడా ప్రభుత్వ భూమే.

*ఫైసల్‌ పట్టీ :
బదిలీ రిజిస్టర్‌

*చౌఫస్లా :
ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వేనంబర్ల భూముల పన్ను ముదింపు రికార్డు.

*డైగ్లాట్‌ :
తెలుగు, ఇంగ్లిఫ్‌ భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ-రిజిస్టర్‌.

*విరాసత్‌/ఫౌతి :
భూ యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం.

*కాస్తు :
సాగు చేయడం

*మింజుములే :
మొత్తం భూమి.

*మార్ట్‌గేజ్‌ :
రుణం కోసం భూమిని కుదవపెట్టడం.

*మోకా :
క్షేత్రస్థాయి పరిశీలన(స్పాట్‌ఇన్‌స్పెక్షన్‌).

*పట్టాదారు పాస్‌ పుస్తకం :
రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం.

*టైటిల్‌ డీడ్‌ :
భూ హక్కు దస్తావేజు, దీనిపై ఆర్డీవో సంతకం ఉంటుంది.

*ఆర్వోఆర్‌ (రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌) :
భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్‌.

*ఆర్‌ఎస్సార్‌ :
రీ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ లేదా శాశ్వత ఏ రిజిస్టర్‌.

*పర్మినెంట్‌ రిజిస్టర్‌ :
సర్వే నంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్‌. సేత్వార్‌ స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు.

*సేత్వార్‌ :
రెవెన్యూ గ్రామాల వారీగా మొదటి సారి చేసిన భూమి సర్వే వివరాలు, పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్‌. ఇది 1953 దాకా అమలులో ఉంది. తర్వాత ఖాస్రా పహాణీ అందుబాటులోకి వచ్చింది.

*సాదాబైనామా :
భూ క్రయ విక్రయాలకు సంబంధించి తెల్లకాగితంపై రాసుకొనే ఒప్పంద పత్రం.

*దస్తావేజు :
భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం.

*ఎకరం :
భూమి విస్తీర్ణం కొలమానం. 4840 చదరపు గజాల స్థలంగానీ, 100 సెంట్లు (ఒక సెంటుకు 48.4 గజాలు)గానీ, 40గుంటలు (ఒక గుంటకు 121 గజాలు)ను ఎకరం అంటారు. ఆంధ్రా ప్రాంతంలో సెంటు, తెలంగాణలో గుంట అని అంటారు.

*అబి :
వానకాలం పంట

*ఆబాది :
గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు

*అసైన్‌మెంట్‌ :
ప్రత్యేకంగాకేటాయంచిన భూమి

*శిఖం :
చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం

*బేవార్స్‌ :
హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవార్స్‌ భూమి అంటారు.

*దో ఫసల్‌ :
రెండు పంటలు పండే భూమిsvp

*ఫసలీ :
జులై 1నుంచి 12 నెలల కాలన్ని ఫసలీ అంటారు.

*నాలా :
వ్యవసాయేతర భూమి

*ఇస్తిఫా భూమి :
పట్టదారు స్వచ్ఛందంగా ప్రభుత్వపరం చేసిన భూమి

*ఇనాం దస్తర్‌దాన్‌ :
పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి

*ఖాస్రాపహానీ :
ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరుమీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహాణీ.

*గైరాన్‌ :
సామాజిక పోరంబోకు

*యేక్‌రార్‌నామా :
ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేయర్‌ తీసుకునే గ్రామాల ఒప్పందం..
Urs..Satya

28/02/2021

*ఐపిసిలో సెక్షన్ ల అర్థం తెలుసుకోండి*
======================
* సెక్షన్ 307 * = హత్యాయత్నం
* సెక్షన్ 302 * = హత్యకు శిక్ష
* సెక్షన్ 376 * = అత్యాచారం
* సెక్షన్ 395 * = దోపిడీ
* సెక్షన్ 377 * = అసహజ కదలికలు
* సెక్షన్ 396 * = దోపిడీ
సమయంలో హత్య
* సెక్షన్ 120 * = కుట్ర
* సెక్షన్ 365 * = కిడ్నాప్
* సెక్షన్ 201 * = సాక్ష్యాలను తొలగించడం
* సెక్షన్ 34 * = వస్తువుల ఉద్దేశం
* సెక్షన్ 412 *= జరుపుకుంటున్నారు
* సెక్షన్ 378 * = దొంగతనం
* సెక్షన్ 141 * = అక్రమ డిపాజిట్
* విభాగం 191 * = తప్పు లక్ష్యం
* సెక్షన్ 300 * = హత్య
* సెక్షన్ 309 * = ఆత్మహత్య ప్రయత్నం
* సెక్షన్ 310 * = మోసం
* సెక్షన్ 312 * = గర్భస్రావం
* సెక్షన్ 351 * = దాడి చేయడానికి
* సెక్షన్ 354 * = మహిళలపై సిగ్గు
* సెక్షన్ 362 * = కిడ్నాప్
* సెక్షన్ 415 * = ట్రిక్
* సెక్షన్ 445 * = దేశీయ వివక్ష
* సెక్షన్ 494 * = జీవిత భాగస్వామి
జీవితంలో పునర్వివాహం
* సెక్షన్ 499 * = పరువు నష్టం
* సెక్షన్ 511 * = నేరారోపణపై జీవిత ఖైదు.

మన దేశంలో, మనకు తెలియని కొన్ని చట్టాలు ఉన్నాయి.

*ఐదు ఆసక్తికరమైన విషయాలు*
ఆ సమాచారం తెలుసుకుందాం,
ఇది జీవితంలో ఎప్పుడైనా
ఉపయోగపడుతుంది.

*(1) సాయంత్రం 6 గం,,తర్వాత ఉదయం 6గం,, లోపు మహిళలను అరెస్టు చేయలేము* -

క్రిమినల్ కోడ్, సెక్షన్ 46 ప్రకారం, సాయంత్రం 6 గంటల తరువాత మరియు ఉదయం 6 గంటలకు ముందు, భారత పోలీసులు ఎంత తీవ్రమైన నేరం చేసినా, ఏ మహిళను అరెస్టు చేయలేరు. పోలీసులు అలా చేస్తే, అరెస్టు చేసిన పోలీసు అధికారిపై ఫిర్యాదు చేయవచ్చు. ఇది ఈ పోలీసు అధికారి ఉద్యోగానికి హాని కలిగించవచ్చు.

*(2.) సిలిండర్ పేలడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టంపై రూ .4 మిలియన్ల వరకు బీమా పొందవచ్చు*

పబ్లిక్ లయబిలిటీ పాలసీ ప్రకారం, ఏదైనా కారణం చేత మీ ఇంటిలో సిలిండర్ పేలిపోయి, మీరు ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఎదుర్కొంటే, మీరు వెంటనే గ్యాస్ కంపెనీ నుండి బీమా రక్షణ పొందవచ్చు. గ్యాస్ కంపెనీ నుండి రూ .4 మిలియన్ల వరకు బీమా క్లెయిమ్ చేయవచ్చు. కంపెనీ మీ దావాను తిరస్కరించినా లేదా వాయిదా వేసినా, దాని గురించి ఫిర్యాదు చేయవచ్చు. నేరం రుజువైతే, గ్యాస్ కంపెనీ లైసెన్స్ రద్దు చేయవచ్చు.

*(3) ఏదైనా హోటల్ 5 నక్షత్రాలు అయినా; మీరు ఉచితంగా నీరు త్రాగవచ్చు మరియు వాష్‌రూమ్‌ను ఉపయోగించవచ్చు* -

ఇండియన్ సిరీస్ యాక్ట్, 1887 ప్రకారం, మీరు దేశంలోని ఏ హోటల్‌కైనా వెళ్లి నీరు అడగవచ్చు మరియు త్రాగవచ్చు మరియు ఆ హోటల్ యొక్క వాష్‌రూమ్‌ను కూడా ఉపయోగించవచ్చు. హోటల్ చిన్నది లేదా 5 నక్షత్రాలు అయితే, వారు మిమ్మల్ని ఆపలేరు. హోటల్ యజమాని లేదా ఉద్యోగి మిమ్మల్ని తాగునీరు లేదా వాష్‌రూమ్ ఉపయోగించకుండా ఆపివేస్తే, మీరు చర్య తీసుకోవచ్చు. మీ ఫిర్యాదు ఈ హోటల్ లైసెన్స్ రద్దు చేయబడవచ్చు.

*(4) గర్భిణీ స్త్రీలను తొలగించలేరు* -

ప్రసూతి ప్రయోజన చట్టం 1961 ప్రకారం, గర్భిణీ స్త్రీలను అకస్మాత్తుగా తొలగించలేరు. గర్భధారణ సమయంలో, యజమాని మూడు నెలల నోటీసు మరియు ఖర్చులలో కొంత భాగాన్ని చెల్లించాలి. అతను అలా చేయకపోతే, ప్రభుత్వ ఉపాధి సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదు సంస్థను మూసివేయడానికి కారణం కావచ్చు లేదా కంపెనీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

*(5) మీ ఫిర్యాదు రాయడానికి పోలీసు అధికారి నిరాకరించలేరు*

ఐపిసి సెక్షన్ 166 ఎ ప్రకారం, మీ ఫిర్యాదులను నమోదు చేయడానికి ఏ పోలీసు అధికారి నిరాకరించలేరు. అతను అలా చేస్తే, అతనిపై సీనియర్ పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. నేరం రుజువైతే, పోలీసు అధికారికి కనీసం * (6) * నెలల నుండి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా తొలగింపును ఎదుర్కోవచ్చు.

ఇవి ఆసక్తికరమైన వాస్తవాలు, ఇవి మన దేశ చట్టం ప్రకారం వస్తాయి, కాని వాటి గురించి మనకు తెలియదు. మీ జీవితంలో ఉపయోగపడే ఆసక్తికరమైన విషయాలను మీకు అందించడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తాను.

*ఈ సందేశాన్ని మీ వద్ద ఉంచుకోండి, ఈ హక్కులు ఎప్పుడైనా చెల్లుతాయి*.
=================

03/08/2020

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Bhim News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share