Fact-O-Meter

Fact-O-Meter WANT YOU KNOW FACTS, JUST FOLLOW US

ఇది ఉత్తమ బత్తాయితనం అంటే..
05/09/2023

ఇది ఉత్తమ బత్తాయితనం అంటే..

పిల్ల నిబ్బాస్ కి అంత షాక్ ఇస్తే తట్టుకోలేరు మాస్టారూ
04/09/2023

పిల్ల నిబ్బాస్ కి అంత షాక్ ఇస్తే తట్టుకోలేరు మాస్టారూ

ఇదే బత్తాయితనం...
03/09/2023

ఇదే బత్తాయితనం...

 మాకు ఒక కొత్త స్టార్ట్ ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు మనోహర్ గారు🤣🤣 #సత్యాన్వెషి
01/09/2023


మాకు ఒక కొత్త స్టార్ట్ ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు మనోహర్ గారు🤣🤣
#సత్యాన్వెషి

video is a great example of Dunning Kruger effect. How can someone be so ignorant and yet be so condescending an...

 //ఇందిరమ్మ భర్త ఫిరోజ్ జహంగిర్ ఖాన్ రాయ్ బరేలి (UP) నుంచి కాంగ్రెస్ ఎంపీ గా ఎన్నికయ్యారు. పార్లమెంట్ లోప్రధాని నెహ్రుని...
19/08/2023



//ఇందిరమ్మ భర్త ఫిరోజ్ జహంగిర్ ఖాన్ రాయ్ బరేలి (UP) నుంచి కాంగ్రెస్ ఎంపీ గా ఎన్నికయ్యారు. పార్లమెంట్ లోప్రధాని నెహ్రుని నిసితంగా విమర్శించేవాడు. ఆయన నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంపాదకుడుగా ఉండేవాడు. స్వతహాగా జర్నలిస్ట్ అయిన ఆయన కాంగ్రెస్ ఎంపీ అయినా తమపార్టీ అధికారంలో ఉన్నా విమర్శలు చేసేవాడు. నెహ్రూకు ఆది నచ్చలేదు.

ఇందిరమ్మ భర్తను విడిచి తండ్రి నెహ్రు దగ్గరికి పిల్లలతో చేరింది. కొంత కాలనికి ఫిరోజ్ జహంగిర్ ఖాన్ మరణించాడు. మరణం కూడ అనుమానాస్పదం అన్న ప్రచారం ఉంది. తరువాత ఆయన ప్రసక్తి ఇందిరమ్మ కుటుంబసభ్యులు తీసుకురాలేదు. జయంతులు వర్ధంతులు జరుపరు. అసలు ఎక్కడ ఖననం చేసారు. సమాధి ఉందా అన్నది లోకానికి తెలియదు. వాళ్ళకైనా తెలుసో తెలియదో అన్న డౌట్. కాని ఫిరోజ్ జహంఘీర్ ఖాన్ చివరిలో ఖాన్ తీసేసి తగిలించుకున్న "గాంధీ" టాగ్ ని మాత్రం బ్రాండ్ నేమ్ గా ఆ కుటుంబం వాడుకుంటూ అధికారం అనుభవించి మళ్ళి అధికారకోసం ఎదురు చూస్తోంది.

రాజకీయాల్లో ఏది తప్పుకాదు. అధికారమే పరమావధి. అమూల్ బాయ్ రాహుల్ బాబాకి జయమగు గాక.//

https://m.facebook.com/story.php?story_fbid=6374621212637233&id=100002682511034&mibextid=9R9pXO

అని ఒక బత్తాయి అతి తెలివి పోస్ట్ పెడితే ఫిల్ల బత్తాయిలు తెగ షేర్లు చేస్తున్నారు..

అది వాస్తవం కాదు.

1) బాబు వృద్ధ బత్తాయి ఆయన అసలు పేరు ఫిరోజ్ ఖాన్ కాదు ఫీరోజ్ గాంధీ అసలే కాదు, అసలు పేరు ఫిరోజ్ ఘాండీ.

ఫెరోజ్ జహింగీర్ ఘాండీ(గాంధీ) 1912 సెప్టెంబరు12 అప్పటి బాంబే ప్రెసిడెన్సీ లో జొరాష్ట్రియన్ మతానికి ( రతన్ టాటా కుటుంబం పాటించే మతం)చెందిన పార్సీ కుటుంబం లో జన్మించాడు. తండ్రి "ఫరీదుయన్ జహింగీర్ ఘాండీ" తల్లి "రతిమయి కమిషరట్ ఘాండీ" జొరాష్ట్రియన్ మతస్తులు పూర్వపు పర్షియా (ఇరాన్) నుంచి భారత దేశానికి వలస వచ్చారు. భారతదేశం లో జైన, భౌద్ద క్రైస్తవ పేర్లు హిందువుల పేర్లకు ఎలా దగ్గరగా ఉంటాయో అలాగే పార్సీ ల పేర్లు కూడా ముస్లిం పేర్లకు దగ్గరగా ఉంటాయి.

ఫెరోజ్ జహింగీర్ ఘాండీ కి ఇద్దరు సోదరులు "ఫరీదున్ జహింగీర్ ఘాండీ, "దోరబ్ ఘాండీ" ఇద్దరు సోదరీమణులు "తెహ్మినా కేర్ షప్" "ఆలు దస్తర్". వారి కుటుంబం గుజరాత్ లోని బారుచ్ నుండి బొంబాయి కి వలస వచ్చింది.. తండ్రి మెరైన్ ఇంజినీర్..

ఫెరోజ్ జహింగీర్ ఘాంఢీ భారత స్వాతంత్ర్య పోరాటం లో మహాత్మాగాంధీ అనుచరుడిగా ఆయన మీద అభిమానంతో ఫెరోజ్ ఘాండి నుండి ఫేరోజ్ గాంధీ అని పేరు మార్చుకున్నాడు..

https://en.wikipedia.org/wiki/Feroze_Gandhi?wprov=sfla1

2) ఫెరోజ్ గాంధీ ఇందిరా ప్రియదర్శిని ల వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. కానీ ఆ తర్వాత వారి మద్య విభేదాలు వచ్చాయి. ఫెరోజ్ గాంధీ 1960 సెప్టెంబర్ 7 న గుండెపోటుతో మరణించారు. అయన పార్సీ అయినప్పటికీ అంత్యక్రియలు హిందూ సంప్రదాయంలోనే జరిగాయి. పార్శీలు మరణించినపుడు భూమి కలుషితం కాకుండా శవాన్ని ప్రకృతిక నిశ్శబ్దగోపురం (టవర్ ఆఫ్ సైలెన్స్) పైన వదిలేస్తారు. ఎండకు ఎండి కొంత శిథిలం కాగా, రాబందులు, యితర పక్షులు వచ్చి శవాన్ని తినేస్తాయి. ఆ రకమైన అంత్యసంస్కారం తనకు యిష్టం ఉండదని, దహనం చేయమని ఫిరోజ్ కోరాడట. దహనానంతరం కొన్ని అస్తికల్ని అలహాబాద్ శ్మశానవాటికలో సమాధి చేసారు.

https://www.bbc.com/telugu/india-58492521

మరిన్ని వివరాలకు కింద లింక్ చూడండి.

https://telugu.greatandhra.com/articles/mbs/feroze-is-parsi-126870.html

16/08/2023

 //మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, తన పుస్తకం "మై లైఫ్ స్టోరీ" లోని 456 వ పేజీలో ఇలా వ్రాశారు:-ఎందుకో తెలియదు కానీ - నెహ్ర...
16/08/2023



//మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, తన పుస్తకం "మై లైఫ్ స్టోరీ" లోని 456 వ పేజీలో ఇలా వ్రాశారు:

-ఎందుకో తెలియదు కానీ - నెహ్రూ "హిందూ మతంమీద ఎల్లప్పుడు "పక్షపాతం" వహించారు.

హిందువులను "రెండవ పౌరులుగా" మార్చడానికి "హిందూ కోడ్ బిల్లు" తీసుకురావడానికి నెహ్రూ పెద్ద ప్రయత్నం చేశారు.

కానీ సర్దార్ పటేల్ నెహ్రూని హెచ్చరిస్తూ ఇలా అన్నారు:
"నేను జీవించి ఉన్నంత కాలం.. మీరు ఎప్పుడైనా హిందూ కోడ్ బిల్లు గురించి ఆలోచించారో, అప్పుడు నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాను. ఈ బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లోకి హిందువులతో వస్తాను" అని..

పటేల్ బెదిరింపుతో నెహ్రూ భయపడ్డాడు. సర్దార్ పటేల్ గారి మరణం తరువాత పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు.//
https://m.facebook.com/story.php?story_fbid=10233396850560236&id=1143547077&mibextid=9R9pXO
అని ముదిరిపోయిన ఒక బత్తాయి ఒక పోస్ట్ పెడితే, లేత అంధ బత్తాయిలు షేర్ చేస్తున్నారు. అందులోని వాస్తవాలు అవాస్తవాలు ఏంటో చూద్దాం.

1) మొరార్జీ దేశాయ్ అత్మకథ పుస్తకం పేరు "మై లైఫ్ స్టోరి" కాదు. "The story of my life".
అందులో 456 పేజీలో అటువంటి వివరణ ఏమి లేదు.

2) స్వాతంత్య్రం సిద్దించాక 1947 లో అప్పటి న్యాయశాఖ మంత్రి డా బి ఆర్ అంబేద్కర్ "హిందూ కోడ్ బిల్" కు రూపకల్పన చేసారు. నెహ్రూ కు బిల్లు రూపకల్పనలో ఎలాంటి పాత్రలేదు.

3)భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది 1950 జనవరి 26. అదే ఏడాది డిసెంబర్ లో పటేల్ మరణించారు. హిందూ కోడ్ బిల్లు 1952లో ప్రతిపాదించి, ఆ తర్వాత ఆమోదించారు. పటేల్ బతికి ఉన్న దశలో మొరార్జీ దేశాయ్ ఓ సాధారణ నాయకుడు. 1952లో అయన నెహ్రూ మద్దతుతో బాంబే సీఎం అయ్యారు.

4) నిజానికి హిందూ కోడ్ బిల్ రావడానికి ముఖ్య కారకులు డా బి అర్ అంబేద్కర్. అతివాద హిందూ గ్రూపుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో నెహ్రూ బిల్లును అందులోని కొన్ని అంశాలను వ్యతిరేఖించాడు. దీనికి వ్యతిరేకంగా 1951 లో అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేసారు.

5) 1952 లో ఆమోదించబడిన "హిందూ కోడ్ బిల్" లో హిందువులను రెండవ శ్రేణి పౌరులుగా చేసే అంశాలు ఏవి లేవు. హిందూ స్త్రీలకు సమాన హక్కులు కల్పించే అంశాలను అందులో పొందు పరచారు.

https://www.legalserviceindia.com/legal/article-9181-hindu-code-bill-and-ambedkar.html

6)హిందూకోడ్‌ బిల్లులోని ముఖ్యాంశాలు...

ఒకటి - మగపిల్లలకు తండ్రి ఆస్తిలో ఎంత హక్కు ఉన్నదో ఆడపిల్లలకూ అంతే హక్కు ఉండటం.

రెండు - పిల్లలను దత్తత చేసుకునే హక్కు, దత్తత ఇచ్చే హక్కు స్త్రీలకు కలిగించటం.

మూడు - దత్తత విషయంలో దత్తత తీసుకోబడిన వారితోబాటు దత్తత తీసుకున్న తల్లికీ ఆస్తిలో భాగం ఉండటం.

నాలుగు - కులాంతర/మతాంతర వివాహాలు అనుమతించటం.

ఐదు - బహుభార్యత్వం రద్దు.

ఆరు - భార్యాభర్తలు తమ వివాహాన్ని విడాకుల ద్వారా రద్దు చేసుకోగలిగే హక్కు.

ఏడు - వివాహం వలెనే దత్తత కూడా ఏ కులం నుంచి అయినా తీసుకోగలగటం.

ఎనిమిది - ఒక కుటుంబంలోని భాగస్తులందరికీ ఆస్తిలో నిర్ణీత సమభాగాలు అందేలా చూడటం.
సమాన హక్కులుండాలని...

మహిళలకు కొంత సాధికారతను సాధించిపెట్టే ఈ బిల్లు భారత సమాజానికి ఎంత మాత్రమూ నచ్చలేదు. అంబేద్కర్‌ కంటే ముందు స్త్రీల సమస్యల గురించి పోరాటం చేసిన వారూ, సంస్కరణలు తెచ్చిన వారూ చాలామంది ఉన్నారు.

అయితే అవన్నీ మనుధర్మ శాస్త్ర పరిధిలోనే జరిగాయి. అవి సమాజావసరాలకు అనుగుణంగా స్త్రీలను తీర్చిదిద్దాయి తప్ప వారికి హక్కులు ఇవ్వలేదు. ఇవ్వాలనీ అనుకోలేదు. స్త్రీలు పురుషులతో సమంగా పురోగమించాలంటే వారికీ సమాన హక్కులుండాలని అంబేద్కర్‌ గుర్తించారు. ఆస్తితోనే పురుషుల పెత్తనానికి బలం వస్తున్నదనీ గ్రహించారు. కాబట్టే హిందూ కోడ్‌ బిల్లును సమగ్రం చేసి ప్రవేశపెట్టారు.

సంపదను, హక్కులను రక్షించుకోవాలని...
స్త్రీలు సామాజికంగా, రాజకీయంగా ముందుకు రావాలి. స్త్రీ తోడ్పాటుతోనే సమాజం పురోగతి సాధిస్తుంది. వారివల్లనే జరిగే పనులు చాలా ఉన్నాయి' అని అంబేద్కర్‌ నమ్మేవారు. 'స్వేచ్ఛ అనేది సంపదను అనుసరించి ఉంటుంది. స్త్రీ తన సంపదను, హక్కులను రక్షించుకోగలిగినప్పుడే ఆమెకు విలువ, అప్పుడే ఆమె స్వేచ్ఛనూ, గౌరవాన్నీ పొందగలుగుతుంది' అనేవారు అంబేద్కర్‌.

ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టే అగ్రశ్రేణి హిందువులు, అతివాద విభాగాలు దీనికి వ్యతిరేఖించాయి. కాని అంబేద్కర్ చొరవ బిల్లు రూపం దాల్చింది. అప్పుడు వ్యతిరేఖించిన బత్తాయి మూలాలే ఇప్పుడు నెహ్రూను ఆడిపోసుకుంటున్నారే తప్ప, ఆ పోస్ట్ లో "హిందూ కోడ్ బిల్" గూర్చి చెప్పిన దాంట్లో ఎటువంటి వాస్తవం వేదు.

/ //హిందువులపై రాజస్థాన్ కాంగ్రెస్ మారణ కాండ. హిందూ మహిళలను మానభంగం చేసి ,చంపి పడేసిన దుర్మార్గులు. రామ్ నగర్ లో ఆరు నెల...
10/08/2023

/

//హిందువులపై రాజస్థాన్ కాంగ్రెస్ మారణ కాండ. హిందూ మహిళలను మానభంగం చేసి ,చంపి పడేసిన దుర్మార్గులు. రామ్ నగర్ లో ఆరు నెలల పసికందు, ఇద్దరు మహిళలు సహా ముగ్గురు పెద్దలను సజీవ దహనం చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి మాట్లాడలేదు, రాహుల్ గాంధీ మాట్లాడలేదు, కాంగ్రెస్ నుంచి ముఖ్యులు ఎవరూ మాట్లాడలేదు, ఎందుకంటే అత్యాచారాలు, హత్యలు కాంగ్రెస్ కు రాజకీయ సాధనాలు మాత్రమే. మణుగూరు లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగితేనే అది కూడా హిందువులు కానీ వాళ్ళకి జరిగితేనే వీళ్లు మాట్లాడతారేమో //

అని మణిపూర్ ను మణుగూరు అని ఒక నిరక్షర కుక్షి ఒక ఫేక్ పోస్ట్ రాస్తే చదువుకున్న బత్తాయిలు అంధ భక్తుల్లాగా అన్ని గ్రూప్ లలో షేర్ చేస్తున్నారు. అది వాస్తవం కాదు.

ఈ సంఘటన జులై 14, 2023 న జైపూర్ కు 100 కిలో మీటర్ల దూరంలోని రామ్ నగర్ ధని తాలూకా లోని చైరాయ్ అనే గ్రామంలో జరిగింది.

పప్పురామ్ అనే యువకుడు కుటుంబ కలహాలు, ఆస్థి తగాదాల కారణంగా తన మేనమామ అయి న పూనారామ్ అతని భార్య భన్వరీ దేవి, వారి కోడలు ధాపు మరియు వారి ఆరు సంవత్సరాల మనుమరాలిని ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంటికి నిప్పు అంటించి హత్య చేసాడు.

అంతేకాని అది ఆ బత్తాయిలు రాసినట్లుగా మతపరమైన హత్య కాదు. పూర్తిగా వ్యక్తిగత కక్ష్యతో చేసిన హత్య. హతులు మరియు హంతకుడు ఇద్దరు హిందువులే..

పూర్తి వివరాలకు కింద లింక్ చూడండి..
https://www.bhaskar.com/local/rajasthan/jodhpur/news/the-family-was-sleeping-outside-the-house-late-at-night-dragged-them-to-the-courtyard-131560977.html

The manipur burning part 2👇👇👇👇https://youtu.be/H2dXu9uMWFAmanipur violence,manipur violence reason,violence in manipur,m...
07/08/2023

The manipur burning part 2👇👇👇👇
https://youtu.be/H2dXu9uMWFA

manipur violence,manipur violence reason,violence in manipur,manipur,manipur news,manipur violence update,manipur violence news,manipur violence latest update,manipur violence explained,manipur violence news today,manipur violence latest news,telugu news,manipur violence latest report,manipur violence latest,etv telugu,manipur violence today,manipur violence top news,manipur violence telugu,no1 news channel in telugu states,manipur violence video

05/08/2023

The manipur real stroy

30/07/2023



//స్వామీ ఆనంద్ స్వరూప్
మహారాజ్ వారి లీలలు
మరోసారి చూద్దాం రండి.//

అని ఇద్దరు మహిళలలతో ఉన్న స్వామీజీ కి దేహశుద్ధి చేస్తున్న విడియోను స్వామి ఆనంద స్వరూప్ మహరాజ్ అని ఒక పోస్ట్ ను చాలా మంది షేర్ చేస్తున్నారు.

అది వాస్తవం కాదు.

ఆ విడియో లో ఉన్నది హిందూ సన్యాసి కాదు. ఆ సంఘటన శ్రీలంకలో జరిగింది. జులై 8, 2023 లో నవగామువా ప్రావిన్స్ లోని రాసపన్ను అనే పట్టణంలో జరిగింది. "పల్లెగామ సుమన థేరో" అనే భౌద్ధ భిక్షువు ఒక గదిలో ఇద్దరు మహిళలతో ఉండగా కొంతమంది యువకులు పట్టుకుని వారిమీద దాడి చేయడం జరిగింది. అందుకు గాను వారి మీద నవగామువా పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది.
https://www.dailymirror.lk/worldnews/breaking_news/Eight-arrested-for-stripping--assaulting-monk-and-two-women/108-262688

ఆ విడియో లో ఒకచోట ఆ భౌద్ధ భిక్షువు ఒకప్పటి శ్రీలంక ప్రధానమంత్రి అయిన మహేంద్ర రాజపక్సే తో కలిసి దిగిన ఫోటో కూడా చూడవచ్చు.

అంతేకానీ ఆ సంఘటనకు భారతదేశానికి ఆనంద స్వరూప్ మహరాజ్ అనే హిందు సన్యాసి కీ ఎటువంటి సంబంధం లేదు.

పూర్తి వివరాలకు క్రింద లింక్ చూడండి.

https://www.asianmirror.lk/news/item/35266-sex-scandal-involving-monk-and-two-women-four-youths-arrested-over%20assault-complaint-withdrawn,-reconciliation-sought

వాళ్ళ విధానాలు ఒక్కటే, అబద్ధాలు చెప్పి ప్రజల మధ్య విద్వేషాలు నింపటం
28/07/2023

వాళ్ళ విధానాలు ఒక్కటే, అబద్ధాలు చెప్పి ప్రజల మధ్య విద్వేషాలు నింపటం

అక్క చెప్పే ఒక్కో డైలాగ్ ఒక్కో డైమెండ్ అన్నమాట
26/07/2023

అక్క చెప్పే ఒక్కో డైలాగ్ ఒక్కో డైమెండ్ అన్నమాట

  //మణిపూర్ లో హిందూ మహిళలపై క్రైస్తవుల హత్యాచారాలు// అని కొంత మందు సాయుధులు ఒక మహిళను హింసించి కాల్చి చంపిన ఒక విడియోను...
25/07/2023



//మణిపూర్ లో హిందూ మహిళలపై క్రైస్తవుల హత్యాచారాలు//

అని కొంత మందు సాయుధులు ఒక మహిళను హింసించి కాల్చి చంపిన ఒక విడియోను మణిపూర్ లో కుకీ తీవ్రవాదులు మొయితె మహిళను హింసించి చంపేసారు అని అర్థం వచ్చేలా పిచ్చి బత్తాయిలు తెగ షేర్ చేస్తున్నారు.

అందులో ఎటువంటి వాస్తవం లేదు. ఆ సంఘటనకు మణిపూర్ అల్లర్లకు ఎటువంటి సంభందం లేదు. ఆ విడియో మయన్మార్ దేశానికి సంభందించినది. జూన్ 2022 లో మణిపూర్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న మయన్మార్ దేశపు "టాము" అను పట్టణంలో ఈ సంఘటన జరిగింది. తమ నాయకుని హత్యకు కుట్ర చేసిందనే ఆరోపణతో "పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్" సాయుధ సభ్యులు ఒక మహిళా ను అలా హింసించి చంపేసారు..
https://elevenmyanmar.com/news/a-young-woman-beaten-shot-dead-and-was-forced-to-make-a-confession-that-she-was-a-military

అంతేకానీ ఆ సంఘటన కు మణిపూర్ కు మనదేశానికి ఏమాత్రం సంభందం లేదు. పూర్తి వివరాలకు క్రింద లింక్ చూడండి..

https://www.boomlive.in/fact-check/kuki-woman-killed-manipur-meitei-myanmar-video-viral-execution-military-peoples-defence-force-fact-check-22287

  //మణిపూర్‌లో పోలీసులను ఎదిరించేందుకు ప్రత్యేక నగ్న మహిళల టీమ్‌ని ఏర్పాటు చేశారు, పోలీసులను నగ్నంగా వెంబడిస్తున్నారు అం...
25/07/2023



//మణిపూర్‌లో పోలీసులను ఎదిరించేందుకు ప్రత్యేక నగ్న మహిళల టీమ్‌ని ఏర్పాటు చేశారు, పోలీసులను నగ్నంగా వెంబడిస్తున్నారు అంటే.. అక్కడ ఎలాంటి కుట్ర జరుగుతోందో ఊహించండి.⁉️//

అంటూ నగ్నంగా ఓ మహిళ పోలీసుల మీద తిరగబడుతున్న విడియోను మణిపూర్ పోలీసుల మీద దాడి చేస్తున్న కుకీ మహిళ అని అర్థం వచ్చేల కొంత మంది బత్తాయిలు విష ప్రచారం చేస్తున్నారు..

అది వాస్తవం కాదు..

ఆ వీడియో మణిపూర్‌కు చెందినది కాదు. అది ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలోని పండిట్ దీన దయాళ్ నగర్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తీసింది. ఓట్లను తిరిగి లెక్కించాలని డిమాండ్ చేస్తూ సోను కిన్నార్ అనే స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారులు కౌంటింగ్ కేంద్రం వెలుపల గుమిగూడి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైరల్ వీడియో ఈ సంఘటనను చూపిస్తుంది.

పూర్తి వివరాలకు క్రింద లింక్ చూడండి

https://www.boomlive.in/fact-check/viral-video-manipur-naked-woman-chasing-police-uttar-pradesh-protest-social-media-22385

మతం లో దేవుడి కి మాత్రమే హక్కులు ఉంటాయి మనిషి కి కాదు 👌👌👌Babu Gogineni Fact-O-Meter      https://youtu.be/sGywxCBXU9A
15/07/2023

మతం లో దేవుడి కి మాత్రమే హక్కులు ఉంటాయి మనిషి కి కాదు 👌👌👌
Babu Gogineni Fact-O-Meter

https://youtu.be/sGywxCBXU9A

     Fact-O-Meter //కోయంబత్తూరులో బిర్యానీలో గర్భనిరోధక మాత్రలు కలిపి హిందువులకు... ముస్లింలు బిర్యానీ సరఫరా చేస్తున్నార...
11/07/2023

Fact-O-Meter

//కోయంబత్తూరులో బిర్యానీలో గర్భనిరోధక మాత్రలు కలిపి హిందువులకు... ముస్లింలు బిర్యానీ సరఫరా చేస్తున్నారు. అమ్మిన ముస్లిం దుకాణదారులు అరెస్ట్, ఇక నుంచి హిందువులు గౌరవంగా పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటో అర్థమైందా?ముస్లిం షాపుల్లో బిర్యానీ తింటే ఎలాంటి ప్రభావం ఉంటుందో..//

అనే ఒక పోస్ట్ ను కషాయధీరులు, ఫేకు వీరులు, వాట్సాప్ శూరులు తెగ వైరల్ చేస్తున్నారు.
https://m.facebook.com/story.php?story_fbid=229812213298301&id=100088085710492&mibextid=Nif5oz

అందులో ఎటువంటి వాస్తవం లేదు.

అందులో ని మొదటి ఫోటో 2019 లో ఉత్తర్ ప్రదేశ్ లోని బిజ్నోర్ లో జరిగిన ఒక ఘటన కి సంబంధించినవి. బిజ్నోర్ లోని ఒక మదర్సా లో అక్రమంగా ఆయుధాలను నిలువ చేశారనే ఆరోపణతో మదర్సా నిర్వాహుకులను బిజ్నోర్ పోలీసులు ఆరెస్ట్ చేశారు.
https://twitter.com/bijnorpolice/status/1149309124049432578?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1149309124049432578%

రెండవ ఫోటో శ్రీలంక కి సంబంధించినది. 2019 లో నిషేధించబడ్డ టాబ్లెట్లను శ్రీలంక స్పెషల్ టాస్క్ ఫోర్సు వారు పట్టుకున్నప్పటి ఫోటోలు అని ‘The Daily Mirror’ ఆర్టికల్ లో చూడవొచ్చు. పాకిస్తాన్లో తయారు చేయబడి, శ్రీలంకలో అమ్మడానికి నిషేధించబడ్డ ట్రామాడోల్ మరియు అనేక అక్రమ మందులను కొలంబో లో పట్టుకున్నారు.
https://www.dailymirror.lk/breaking_news/Father--son-nabbed-with-illegal-drugs/108-166288

బిర్యానీ ని సర్వ్ చేస్తున్న వ్యక్తి ఫోటో యూట్యూబ్ లోని INDIAN MUSLIM FESTIVAL DUM BIRYANI అనే ఛానల్ లోని ఒక విడియో నుంచి తీసుకున్నారు.
https://youtu.be/QJrWViyOw68

ఇలా మూడు వేరు వేరు కాలాలకు ప్రాంతాలకు చెందిన ఫోటోలను ఒకచోట పోస్ట్ చేసి ఒక మతానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

పూర్తి వివరాలకు కింద లింక్ చూడండి
https://m.timesofindia.com/times-fact-check/news/fact-check-are-hindus-being-fed-biryani-laced-with-contraceptives-in-coimbatore/articleshow/76303585.cms?fbclid=IwAR2p3GEVNMsJkJx8pf5DTbBrnT_e-4ogDZ2N1dNlRStl_zepyznETn1Rv9M

  ఈ క్రింది కామెంట్  chandu గారి పోస్ట్ లో ఓక వీర బత్తాయి పెట్టాడు..ఇలాంటి బత్తాయిలు ఎన్నడు రాజ్యాంగాన్ని చదివిన పాపాన ల...
25/06/2023



ఈ క్రింది కామెంట్ chandu గారి పోస్ట్ లో ఓక వీర బత్తాయి పెట్టాడు..

ఇలాంటి బత్తాయిలు ఎన్నడు రాజ్యాంగాన్ని చదివిన పాపాన లేరు..

అసలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30A అనేదే లేదు. రాజ్యాంగంలో ఆర్టికల్స్ 30 (1), 30 (1A), మరియు 30 (2) ఉన్నాయి. ఈ ఆర్టికల్స్ అన్ని మైనారిటీల హక్కులకు సంబంధించినవి.

విద్యాసంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి మైనారిటీల హక్కును భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 పేర్కొంది.

ఆర్టికల్ 30 (1) ప్రకారం, మైనారిటీలు, మతం లేదా భాష ఆధారంగా అయినా, తమకు నచ్చిన విద్యా సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి హక్కు ఉంటుంది.

ఆర్టికల్ 30 (1 ఎ) మైనారిటీ సమూహాలచే స్థాపించబడిన ఏదైనా విద్యా సంస్థ యొక్క ఆస్తిని సంపాదించడానికి మొత్తాన్ని నిర్ణయించడం గురించి వివరిస్తుంది.

ఆర్టికల్ 30 (2) ప్రకారం, ప్రభుత్వం ఏ విద్యా సంస్థపైనా మైనారిటీ నిర్వహణలో ఉంది, మతం లేదా భాష ఆధారంగా అయినా, సహాయం ఇచ్చేటప్పుడు వివక్ష చూపకూడదు.

ఈ అంధభక్తులు మతం, నెహ్రూ మరియు హిందువు అనే అక్షరం కనబడగానే వెనక ముందు చూడకుండానే షేర్ చేస్తుంటారు..

ఇలాంటి ఎధవ రాతలు అబద్ధపు కూతలు కూస్తారు కాబట్టే నిజాలు ధైర్యంగా రాసే #తులసి_చందు లాంటి జర్నలిస్టుల కు మనకు మద్దతు పలకాలి..

ఆరేయ్ బత్తాయి మొహపోడా ఆ స్టేషన్ మేనేజర్ ముస్లిం కాదురా... ఆ రోజు స్టేషన్లో  అసిస్టెంట్ స్టేషన్ మేనేజర్ మాత్రమే ఉన్నాడు. ...
04/06/2023

ఆరేయ్ బత్తాయి మొహపోడా ఆ స్టేషన్ మేనేజర్ ముస్లిం కాదురా...
ఆ రోజు స్టేషన్లో అసిస్టెంట్ స్టేషన్ మేనేజర్ మాత్రమే ఉన్నాడు. వాడు హిందువే, వాడి పేరు డి బి మొహంతి. దుర్ఘటన జరిగిన తర్వాత సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు..

https://kalingatv.com/state/odisha-train-accident-bahanaga-assistant-station-master-is-on-the-run-case-registered/

  //ఘోర దుర్ఘటన జరిగిన ప్రదేశం పక్కనే ఉన్న కట్టడం ఏంటో ఎవరైనా గుర్తుపట్టగలరా..?Note: మరో రహస్యం ఏంటంటే.. నిన్న రాళ్లవారం...
04/06/2023



//ఘోర దుర్ఘటన జరిగిన ప్రదేశం పక్కనే ఉన్న కట్టడం ఏంటో ఎవరైనా గుర్తుపట్టగలరా..?
Note: మరో రహస్యం ఏంటంటే.. నిన్న రాళ్లవారం..//

అని ఒరిస్సా లో జరిగిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైల్ ప్రమాదానికి సంఘటన జరిగిన ప్రదేశానికి దగ్గరలో ఉన్న మసీదుకు ముడిపెడుతూ ముస్లింలు ఆ దుర్ఘటన కు కారణం అని అర్థం వచ్చేల చాల మంది మత పిచ్చ గాల్లు పోస్ట్ చేసారు.
https://m.facebook.com/story.php?story_fbid=6419146004818820&id=100001704534706&mibextid=Nif5oz

నిజానికి అది మసీదు కాదు. అది ఇస్కాన్ టెంపుల్..
మతానికి పుట్టీ, మతంలో పెరిగి మతంలోనే చచ్చే ఎదవులు ఎదుటివారి చావును కూడా మతానికి అంటగడతారు.

https://www.altnews.in/social-media-users-add-communal-spin-to-odisha-mishap-falsely-describe-temple-near-tracks-as-a-mosque/?utm_source=website&utm_medium=social-media&utm_campaign=newpost

 //పాకిస్థాన్ (Pakistan) లో అమ్మాయిలపై లైంగిక వేధింపులు తారస్థాయికి చేరుకున్నాయి. బతికున్నప్పుడే కాదు.. చనిపోయాక కూడా మహ...
30/04/2023



//పాకిస్థాన్ (Pakistan) లో అమ్మాయిలపై లైంగిక వేధింపులు తారస్థాయికి చేరుకున్నాయి. బతికున్నప్పుడే కాదు.. చనిపోయాక కూడా మహిళలను మృగాళ్లు వదలట్లేదు. సమాధులను తవ్వి మరీ... మృతదేహాలపై అత్యాచారాల (Rapes) కు పాల్పడుతున్నారు.//

అని చాలా మంది ఒక సమాధి ఫోటోను పాకిస్థాన్ లో జరిగింది అని షేర్ చేస్తున్నారు.

https://m.facebook.com/story.php?story_fbid=1321616265366781&id=100025552605155&mibextid=Nif5oz

డబ్బులకు అమ్ముడుపోయిన జాతీయ న్యూస్ మీడియా వెనక ముందు ఆలోచించకుండా దానిని ప్రచురిస్తే తెలుగు వ్యభిచార పత్రికలు నిజమని రాసాయి.
https://www.aninews.in/topic/necrophilia-cases/

అది వాస్తవం కాదు..

నిజానికి ఆ సమాధి పాకిస్థాన్ లోనిది కాదు, తెలంగాణ లోని హైదరాబాద్ లో, మాదన్నపేట్ రెయిన్ బజార్ లోని ఖబరిస్తాన్ లో ఉంది.

హైదరాబాద్ లో చనిపోతే సమాధి చేసేందుకు స్థలాలు లేవు. ఉన్న ఖబ్రాస్తాన్ లు నిండిపోయాయి. దీనితో ఇప్పటికే ఉన్న సమాధులను తవ్వి మళ్లీ వేరే శవాలను ఖననం చేస్తున్నారు. అలా జరగకుండా సమాధులను మృతుల కుటుంబాలకు గ్రిల్స్ వంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్ని దర్గాలకు కూడా గ్రిల్స్ వంటివి ఏర్పాటు చేస్తారు.

అలా తాళాం వేసి ఉన్న హైదరాబాద్ లోని ముస్లిం ఖబరిస్తాన్ లోని ఒక ఫోటోను తీసుకుని పాకిస్థాన్ నెక్రోఫీలియా అని కథలు అల్లి తమ మానసిక వికారాన్ని తీర్చుకుంటున్నారు.

ఆ ఖబ్రస్తాన్ బోర్డు మీద ఉర్దూలో ఇలా రాసి ఉంది...

Jama masjid, Magbara salar -e -Mulk Bani Nawab Hussain dost Marhoom Virsa e silsal e Mulk Tarad, Eidgah, Madanna Pet, Rainbazar, Hyderabad"

పూర్తి వివరాలకు క్రింద లింక్ చదవండి..

https://indtoday.com/fact-check-grill-lock-on-grave-originated-from-hyderabad/

16/04/2023



భారత దేశ ఖ్యాతి ఖండ ఖండాలు చాటి చెప్పిన స్వామి వివేకానందుని వీడియో అని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు.
https://fb.watch/jXyBQZPAIz/?mibextid=Nif5oz

అది వాస్తవం కాదు..

ఆ వీడియోలో సాంప్రదాయ దుస్తులు ధరించి ఉన్న వ్యక్తి పేరు స్వామి పరమహంస యోగానంద. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు. ఒక యోగి ఆత్మ కథ అనే పుస్తకం రాసారు.
https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%B0%E0%B0%AE%E0%B0%B9%E0%B0%82%E0%B0%B8_%E0%B0%AF%E0%B1%8B%E0%B0%97%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6?wprov=sfla1
అమెరికాలోని న్యూయార్కు నగరాన్ని ఆయన పర్యటించిన్నప్పుడు తీసిన విడియో అది. 42 సెకన్ల నిడివి గల ఆ వీడియోను 33 సెకన్లు మాత్రమే చూపించి స్వామి వివేకానంద అని షేర్ చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్రింద లింక్ లోని విడియో చూడండి..
https://digital.tcl.sc.edu/digital/collection/MVTN/id/221/rec/1

  సావర్కర్ కు నాసిక్ జిల్లా కలెక్టర్ హత్యకు గాను డిసెంబర్ 1910 లో జీవిత ఖైదు 25 సంవత్సరాలు మరియు మరో కేసులో 25 సంవత్సరాల...
06/04/2023


సావర్కర్ కు నాసిక్ జిల్లా కలెక్టర్ హత్యకు గాను డిసెంబర్ 1910 లో జీవిత ఖైదు 25 సంవత్సరాలు మరియు మరో కేసులో 25 సంవత్సరాలు మొత్తం రెండు జీవిత ఖైదులు (50 సంవత్సరాల) శిక్ష 1911 జనవరి 31న విధించబడింది. అప్పటి వరకు ఎరవాడ జైలులో ఉన్న సావర్కర్‌ను అండమాన్ సెల్యులార్ జైలుకు తరలించారు. 11, జూలై 1911 నుండి మే 1921 వరకు అతను అండమాన్ దీవులలో సుమారు 9 సంవత్సరాల 10 నెలల పాటు జైలులో ఉన్నాడు.

జైలులో ఉన్న 9 సంవత్సరాల కాలంలో 6 సార్లు బ్రిటీష్ వారికి క్షమాభిక్ష కోరుతూ బ్రిటిష్ వారికి ఉత్తరాలు రాసాడు. ఉత్తరాలు రాయడం , బ్రిటిష్ అధికారులకు అనుకూలంగా ఉండటం చేత మే 21, 1921 న సావర్కర్‌ను అండమాన్ నుండి రత్నగిరి జైలుకు తరలించారు.

రత్నగిరి జిల్లా కలెక్టరు అనుమతి లేకుండా ఏ రాజకీయ కార్యకలాపంలో పాల్గొనకూడదని మరియు జిల్లాను విడిచి వెళ్లకూడదనే షరతుపై సావర్కర్ 1924 జనవరిలో రత్నగిరి జైలు నుండి విడుదలయ్యాడు అంటే 1911 నుండి 1924 వరకు మరియు 13 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. అందులో 9 సంవత్సరాలు అండమాన్ సెల్యూలార్ జైలులో. 50 ఏళ్ల జైలు శిక్ష విధించడం అనేది శుద్ధ అబద్ధం.

02/04/2023



ఈ మద్య ఒక విడియో లో ఒక పత్తి చెట్టు లాంటి మొక్కకు కాయ దగ్గరకు అగ్గిపుల్ల పెట్టి మంట వచ్చేలా చేసి చేసి ఇదిగో మహిమ గల చెట్టు అని ప్రచార మాద్యమాల్లో విపరీతంగా షేరు చేస్తున్నారు..

అందులో ఎటువంటి మహత్యం లేదు. ఆ చెట్టు పేరు తెల్ల జీడిగింజ చెట్టు (calotropis procera). ఆ చెట్టు కాయలకు మంట పుట్టించే గుణం ఏమి లేదు.

ఆ కాయల మీద కొద్దిగా సానిటైజర్ గాని ఆల్కహాల్ స్పిరిట్ గాని వేసి ఒకసారి మండిస్తే, తర్వాత ఆ మంట కొద్ది సేపు ఉండి ఆరిపోయినట్లుగా కనిపిస్తుంది, కాని మండుతూనే ఉంటుంది. పగటి వెలుగులో కనిపించదు. రాత్రి వెలుగులో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మంటకు దగ్గరగా అగ్గిపుల్ల లేదా పేపర్ పెడితే మండుతుంది.

మంట కనబడకపోవడం గురించి చెప్పాలంటే, వర్ణరహిత (colour less) శానిటైజర్లలో ( ఏ ద్రావణం ఐనా సరే) ఆల్కహాల్ శాతం ఎంత ఎక్కువగా ఉంటే మంట అంత పారదర్శకంగా (transparent) ఉంటుంది. అందుకే మంట కనబడదు.

సానిటైజర్ పేస్ట్ ను పాత్రలో వేసి మండించినప్పుడు మంట ఎంత పారదర్శకంగా ఉంటుందో కామెంట్స్ లోని విడియోలో చూడండి.

మహిమలు ఉన్నాయని చెప్పి కాయలు అమ్ముకునే మోసగాల్లు తీసిన ఇలాంటి విడియోలు ఎవరు నమ్మకండి.

  //నోబెల్ శాంతి బహుమతికి ప్రధాని మోదీ అతిపెద్ద పోటీదారు// https://m.facebook.com/story.php?story_fbid=10223603783706321...
17/03/2023



//నోబెల్ శాంతి బహుమతికి ప్రధాని మోదీ అతిపెద్ద పోటీదారు//

https://m.facebook.com/story.php?story_fbid=10223603783706321&id=1342642958&mibextid=Nif5oz

అని నోబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ లీడర్ ఆస్లే టోజే అన్నట్టు చెప్తున్న పోస్ట్ ను మన మోడి భక్తులు విపరీతంగా షేర్ చేస్తున్నారు..

అందులో ఎటువంటి వాస్తవం లేదు. నోబెల్ నియమాల ప్రకారం బహుమతి కోసం పరిశీలించిన వ్యక్తుల వివరాలు చాలా గోప్యంగా ఉంచుతారు. నోబెల్ బహుమతికి నామినేట్ అయిన వ్యక్తుల వివరాలు, అలాగే వారిని నామినేట్ చేసిన వారి వివరాలు, 50 సంవత్సరాల వరకు బయటికి తెలియనివ్వరు.

నోబెల్ శాంతి బహుమతి కమిటీ డిప్యూటీ లీడర్ ఆస్లే టోజే ఇటీవల 14 మార్చి 2023న ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ (IIC)లో ఇండియా సెంటర్ ఫౌండేషన్ నిర్వహించిన “Alternative Development Model & Peace” అనే అంశంపై రౌండ్ టేబుల్ చర్చకు హాజరయ్యారు. ఈ సమావేశంలో టోజే రష్యా-ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో ప్రపంచ శాంతి గురించి మాట్లాడారు.

ఈ సందర్భంలో మోదీకి నోబెల్ శాంతి బహుమతి సంబంధించి ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘నోబెల్ శాంతి బహుమతిని అందుకోవాలని ఏ నాయకుడైనా కోరుకుంటారు. ఈ అవార్డుకు అర్హులు కావడానికి ప్రపంచంలో శాంతి కోసం తగినంతగా చేయడానికి ప్రయత్నించాలి. ఆవార్డుల కన్నా ప్రపంచం ముఖ్యం’ అని సమాధానమిచ్చాడు. అంతేకానీ మోడీ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నాడని అనలేదు.

మోదీ నోబెల్ బహుమతి రేసులో ఉన్నాడని తాను అన్నట్టు వస్తున్న వార్తలను ఆస్లే టోజే ఖండించాడు. మోదీని ఉద్దేశించి తను ఈ వ్యాఖ్యలను చేయలేదని మీడియాకు స్పష్టం చేసాడు.

https://www.livemint.com/news/india/its-fake-nobel-committee-member-on-pm-modi-being-considered-for-nobel-prize-11678966764838.html

  //బ్రహ్మదేవుడిని అనుసరిస్తున్నారని బ్రహ్మ తన కూతురిని వివాహం ఆడిన విధంగానే 62 సంవత్సరాల వృద్ధుడు తన సొంత కుమార్తెను పె...
08/01/2023



//బ్రహ్మదేవుడిని అనుసరిస్తున్నారని బ్రహ్మ తన కూతురిని వివాహం ఆడిన విధంగానే 62 సంవత్సరాల వృద్ధుడు తన సొంత కుమార్తెను పెళ్లి చేసుకున్నటువంటి సంఘటన ఏ విధమైన సందేశాన్ని ఈ దేశానికి ఇస్తుందో చెప్పండి..//

అంటూ ఒక వృద్ధుడు, ఒక యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్న విడియోను చాలా మంది షేర్ చేస్తున్నారు. అది వాస్తవం కాదు..

అది https://youtube.com/
ఒక యూట్యూబ్ ఛానెల్ వాల్లు రేటింగ్ పెంచుకోవటం కోసం తీసిన ప్రాంక్ విడియో అది.. ఈ ఛానెల్ వాల్లు రేటింగ్ ల కోసం అడ్డమైన ప్రాంక్ విడియోలు ఘూట్ చేసి ఛానెల్ లో అప్లోడ్ చేస్తుంటారు. అలాంటిదే ఈ విడియో కూడా.. https://youtu.be/e_8GuZF-fm0

ఆ విడియోలో ఉన్న నటి నటించిన మరో విడియో గోల్డెన్ గర్ల్ అనే పేరుతో యూట్యూబ్ లో ఉంది..
https://youtu.be/tKNbJpFCZuQ

ఆ విడియోలో 0.38 వద్ద ఇందులోని పాత్రలు వాస్తవం కాదు, ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం నవ్వుకోవటానికి మాత్రమే అని disclaimer లో సపష్టంగా ఉంది..

కాబట్టి సోషల్ మీడియాలో దేనిని గుడ్డిగా నమ్మకండి.. కొంచెం ఆలోచించండి..

06/01/2023



//సృష్టిలో అంతుచిక్కని రహస్యాలలో ఇది ఒకటి.

హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ సమీపంలో ఉన్న ఈ "వింత వృక్షం" పర్యాటకులనే కాకుండా శాస్త్రజ్ఞులను కూడా విస్మయ పరుస్తోంది.//

అని కత్తిరించిన కాండం కలిగిన ఒక మర్రిచెట్టు విడియోని గాలిలో తేలియాడుతున్న చెట్టు అని అర్థం వచ్చేలా ఉన్న ఒక విడియో ను చాలామంది షేర్ చేస్తున్నారు. అది వాస్తవం కాదు..

స్థానికులు ఈ చెట్టును "అక్షయ వట్ వృక్షం లేదా బడ్కా చెట్టు" అని పిలుస్తారు. హర్యానాలోని హిస్సార్ లోగల హన్సిలోని బాబా జగన్నాథపురి సమాధ ఆలయంలో ఈ చెట్టు ఉంది. జగన్నాథ్ పూరీ బాబా ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ 'సమాధి' తీసుకున్నారని నమ్ముతారు. అందుకే ప్రజలు ఈ చెట్టును అద్భుతంగా భావిస్తారు మరియు దాని చుట్టూ ఎర్రటి దారం కట్టారు.

ఆ విడియోలో చెప్తున్నట్లగా ఈ చెట్టు వెనుక ఎటువంటి అద్భుతాలు లేవు. అది కేవలం మధ్య నుండి విరిగిన ఒక మర్రి చెట్టు, దాని కొమ్మ నేలను తాకినప్పుడు అది వేళ్ళూనుకుంది. విరిగిన కాండం అలానే ఉండి వేరే వైపున వేర్లు భూమి లోనికి వెల్లి ధానికి ఆధారాన్ని ఇచ్చాయి. ఆ వేర్లు కాలక్రమేణ భూమి లోపలికి చొచ్చుకునిపోయి కాండాలుగా మారి చెట్టు చనిపోకుండా బతికే ఉంది. దాని కొమ్మ పాత చెట్టుకు అతుక్కుపోయి ఉంటుంది.

మర్రి చెట్టుకు ఊడలు భూమిలోకి చొచ్చుకెల్లి కొద్ది రోజుల తర్వాత ఆ ఊడలు కాండం గా మారి ఆ చెట్టు తన విస్తీర్ణం పెంచుకోవటం చాలా ప్రాంతాల్లో జరుగుతుంది. ఉదాహరణకు తెలంగాణ లోని మహబూబ్నగర్ లో "పిల్లలమర్రి చెట్టు" ఆంద్రప్రదేశ్ లోని కదిరికి దగ్గరగా "తిమ్మమ్మ మర్రి మాను" అని ఉన్నాయి..

ఇక ఆ విడియో లో కాండం అలా వేలాడడానికి కారణం ఆసరా వేరు (prop root, aerial root ) వేరే వైపున బలంగా ఉండటమే. అంతేకానీ అందులో ఎటువంటి మహత్యాలు లేవు.. పూర్తి వివరాలకు క్రింద లింక్ చూడండి..

https://www.vishvasnews.com/english/viral/fact-check-viral-claim-of-hanging-tree-is-misleading-formation-is-the-result-of-prop-root-phenomenon/

03/01/2023



//అతని ప్రతిభని గౌరవించండి రా,
తక్కువ కులం వాడు అన్ని అవమానించకండి రా బాబు... చాలా భాదకర విషయం అలా అవమానించటం..//

అని ఒక బాడీ బిల్డర్ తనకు బహుమతి గా వచ్చిన మిక్సీ ని తన్నుతున్న విడియోను, కులం పేరుతో అవమానిస్తే భాధతో అలా తన్ని తన నిరసన వ్యక్తం చేసాడనే అర్థం వచ్చేలా చాలా మంది పోస్ట్ చేస్తున్నారు.

అందులో ఏమాత్రం వాస్తవం లేదు..

ఆ సంఘటన భారతదేశం లో జరగలేదు. బంగ్లాదేశ్ లో జరిగింది. బంగ్లాదేశ్ జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలో పాల్గొన్న జాహిద్ హసన్ అనే బాడీ బిల్డర్ మొదటి స్థానం వస్తుందనుకున్న తనకు రెండవ స్థానం రావటంతో, అన్యాయం జరిగింది అని తనకు స్టేజి పై మాట్లాడే అవకాశం అడగగా నిర్వాహకులు అవకాశం ఇవ్వకపోవట చేత అలా ప్రవర్తించాడు. అంతే గానీ కులపరమైన వివక్ష చూపారని కాదు. ఆ సంఘటనకు కుల వివక్షకు, భారతదేశానికి సంబంధం లేదు.

పూర్తి వివరాలకై క్రింద లింక్ చూడండి..

https://www.google.com/amp/s/thebridge.in/amp/bodybuilding/bangladesh-bodybuilder-kicks-blender-prize-38395

29/12/2022



//ముసలి వయసులో పక్షులు ఎగరలేవు,వాటికి ఓల్డేజ్‌హోంలు ఉండవు,దాని పిల్ల పక్షి ఆహారము అందజేస్తుంది.దీనిని చూసి మనషులు నేర్చుకోవల్సింది చాలాఉంది.ఇది సమస్త మానవాళికి గొప్ప కనువిప్పు కలిగించే మెసేజ్.//

అని ఒక విడియోను చాలామంది షేర్ చేస్తున్నారు అది వాస్తవం కాదు.

"Eurasian cuckoo" or "common cuckoo" మనం తెలుగులో ముద్దుగా పిలుచుకునే కోకిల, స్వరం వినడానికి మధురంగా ఉన్నా తాను ఎదగడానికి చేసే ప్రయత్నాలు భయానకంగా ఉంటాయి. ఇది ఒక Brood parasite (సంతాన పరాన్న జీవి). తన సంతానాన్ని అభివృద్ధి చేయడానికి ఇతర జీవుల పై ఆధార పడే జీవి..

ఆడ కోకిల తాను గుడ్లు పెట్టె సమయంలో మగ కోకిలతో కలిసి చుట్టు పక్కల ఉండే పక్షి గూళ్ళను గుర్తిస్తుంది. మగ కోకిల ఆ గూడులో పొదుగుతూ ఉండే పక్షిని భయపెట్టి పారిపోయేలా చేస్తే అదే సమయంలో ఆడ కోకిల ఆ గూడులోని పొదగబడుతున్న ఒక గుడ్డును కింద పడవేసి అందులో తన గుడ్డు పెడుతుంది.

ఇదేమి తెలియని ఆ పక్షి తిరిగి వచ్చి యథావిధిగా తన గుడ్లతో పాటు కోకిల గుడ్డు ను కూడా పొదుగుతుంది. కాని గుడ్డు నుండి భయటకు వచ్చిన పిల్ల కోకిల మెల్లగా మెల్లగా గూడు లోని ఇతర గుడ్లను బయటకు నెట్టేస్తుంది. విధిలేని పరిస్తితుల్లో ఆ తల్లి పక్షి పరిమాణంలో తనకన్న రెండింతలు పెద్దదిగా ఉన్న ఆ పిల్ల కోకిల కడుపు నింపడానికి నానా కష్టాలు పడుతుంది.. ఆ పిల్ల పక్షి చివరకు ఒక్కోసారి ఆ గూడులో కూడ పట్టనంత భారీ పరిణామాన్ని సంతరించుకుంటుంది..

ఆ తల్లి పక్షి పరిమాణం లో నాలుగైదు రెట్లు పెద్దగా ఉన్న పిల్ల పక్షికి నానా తంటాలు పడి ఆహారాన్ని అందిస్తుంది. అంతేకానీ ముసలిదైపోయిన తన తల్లికి ఆహారాన్ని అందివ్వడం జరగదు..

పక్షులు సామాన్యంగా మరణించేంతవరకు తమ ఆహారాన్ని తామే సమకూర్చుకుంటాయి...

https://en.wikipedia.org/wiki/Brood_parasite?wprov=sfla1

https://www.techarp.com/science/baby-birds-feed-old-birds-facts/?amp=1

21/12/2022



//మొబైల్ ఇయర్ ఫోన్‌లో నెట్ యాక్టివేట్ కావడంతో రైలులోని హైటెన్షన్ కేబుల్ నుంచి కరెంట్ పాస్ అయ్యి, చెవి ద్వారా మెదడుకు చేరుకుంది మరి ఆ తర్వాత ఏం జరిగింది..?
*అది మీరే చూడండి..!*
ప్రయాణిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఇయిర్ ఫోన్‌లను , బ్లూ టూత్ ఉపయోగించకుండా మరియు ప్లాట్‌ఫారమ్‌పై "రైలు మార్గానికి దగ్గరగా" నిలబడకుండా ఉండండి..//

అని రైల్వే ఫ్లాట్ ఫాం మీద నిలుచున్న వ్యక్తి మీద పిడుగుపాటుకు గురి అయిన ఒక విడియో ను చాలా మంది షేర్ చేస్తున్నారు..

అది వాస్తవం కాదు..

ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లోని ఖరగ్ పూర్ లో జరిగింది... ఓ పక్షి కారణంగా రైల్వే విద్యుత్ లైను కేబుల్ తెగి ఫ్లాట్ఫాం మీద నిలుచున్న టిటిఐపై పడింది. ఈ కారణంగానే అతను షాక్ కు గురయ్యాడు. ప్రస్తుతం అతనికి ప్రాణాపాయం తప్పింది...

ఇయర్ ఫోన్... నెట్ ఆక్టివేట్ ...
చెవి ద్వారా మెదడుకు కరెంటు...
అలాంటివన్నీ అబద్ధం..

పూర్తి వివరాలకు క్రింది లింక్ చూడండి...

https://www.thehealthsite.com/diseases-conditions/west-bengal-electrocution-electric-wire-fell-on-tt-standing-on-railways-station-horrific-incident-captured-on-cctv-933010/

15/10/2022



//ముష్కరులు దేవాలయాన్ని కూలగొడుతుంటే.. పక్కనున్న ఆ మహిళ ఆర్తనాదాలు వినండి. ముష్కరుల సంఖ్య పెరిగిన ప్రతీ చోటా ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమవుతాయి.//

అని ఒక దర్గా ద్వారాన్ని ముస్లింలు ధ్వంసం చేస్తున్న విడియోను నాగ దేవత దేవాలయాన్ని కూలగొడుతున్న ముస్లింలు అని చాలా మంది షేర్ చేస్తున్నారు.

https://m.facebook.com/story.php?story_fbid=5349493918509851&id=100003478863248

అది వాస్తవం కాదు..

నిజానికి అది నాగ దేవతాలయం కాదు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు పట్టణంలో నాగూర్ మీరా మరియు దూదేకుల పస్మాండ ముస్లింలు గౌరవించే నాగూరవలీ దర్గా. పట్టణంలోని అగ్రవర్ణ ఆష్రాఫ్ ముస్లింలు దర్గాలను పూజించటం ఇస్లాం సాంప్రదాయం కాదని దానిని కూలగొట్టి అక్కడ మసీదును నిర్మించడానికి దర్గాను కూల్చివేశారు.

https://twitter.com/satyakumar_y/status/1580834205172654080?t=-A7NA3E3x0Ab2jx4djYIXA&s=19

అంతేకాని అది హిందూ దేవాలయం కాదు.
పూర్తి వివరాలకై క్రింద విడియో చూడండి..

  //రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ జండాలు ఎందుకు ఉన్నాయి అని మిమ్ములను మీరు ప్రశ్నించుకుంటే........శ్రీ నరేం...
09/10/2022



//రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ జండాలు ఎందుకు ఉన్నాయి అని మిమ్ములను మీరు ప్రశ్నించుకుంటే........

శ్రీ నరేంద్ర మోదీకి BJP కి ఓటు ఎందుకు వేయాలో అర్థం అవుతుంది.//

అని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో పాకిస్థాన్ జెండాలతో ముస్లింలు పాల్గొన్నారు అని అర్థం వచ్చేలా ఉన్న ఒక పోస్ట్ చాలా మంది షేర్ చేస్తున్నారు..

అది నిజం కాదు, ఆ జెండా "INDIAN UNION OF MUSLIM LEAGUE" అనే పార్టీ కి చెందింది..

https://www.facebook.com/iumlofficial

ఇది కేరళ మరియు తమిళ నాడు రాష్ట్రాలలో ఆక్టివ్ గా ఉంది..

పాకిస్థాన్ జెండాలో తెలుపు రంగు నిలువులో ఉండి ఆకుపచ్చని జెండా మీద నెలవంక మరియు నక్షత్రాలు తెలుపు రంగులో ఉంటాయి...

https://en.wikipedia.org/wiki/Flag_of_Pakistan?wprov=sfla1

నెలవంక నక్షత్రాలు మరియు ఆకుపచ్చ రంగులో ఉన్న ప్రతీది పాకిస్థాన్ జెండా అవదు...

https://thelogicalindian.com/fact-check/pakistan-flag-bharat-jodo-yatra-37850

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Fact-O-Meter posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share