MYTV siddipet

  • Home
  • MYTV siddipet

MYTV siddipet Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MYTV siddipet, News & Media Website, .

17/12/2023
17/12/2023
సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలం బూరుగుపల్లి వద్ద చిన్న గుండవెల్లి చౌరస్తా ప్రస్తుతం ఇలా ఉంది, మరికొద్ది రోజుల్లో ఈ చౌరస...
15/12/2023

సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలం బూరుగుపల్లి వద్ద చిన్న గుండవెల్లి చౌరస్తా ప్రస్తుతం ఇలా ఉంది, మరికొద్ది రోజుల్లో ఈ చౌరస్తా విస్తృతంగా వెడల్పు జరగనుంది నేషనల్ హైవే ఎన్హెచ్765 డిజి ఇది

కుంకుమ – కుంకుమపువ్వుఒకసారి పరమాచార్యస్వామి వారి దేహం వేడేక్కిపోయింది. ఎక్కువగా ఉన్న కఫం వల్ల వారికి ఊపిరి సరిగ్గా అందటం...
16/11/2023

కుంకుమ – కుంకుమపువ్వు

ఒకసారి పరమాచార్యస్వామి వారి దేహం వేడేక్కిపోయింది. ఎక్కువగా ఉన్న కఫం వల్ల వారికి ఊపిరి సరిగ్గా అందటంలేదు. ఎప్పుడూ వారిని పరీక్షించే వెంగుడి వైద్యులు మొందులు వాడమని చెప్పారు. కాని స్వామి వారు వాటిని తీసుకోవడానికి నిరాకరించారు. వారి జ్వరం ఎంతకూ తగ్గడం లేదు. కఫం కూడా చాలా ఎక్కువ అవుతూఉంది.

ఎప్పుడూ దర్శనానికి వక్చే ఒక మహిళ స్వామి వారి దర్శనానికి వచ్చింది. మహాస్వామి వారి పరిస్థితిని చూసి, గంధం తీసే పలక పైన కుంకుమపువ్వును అరగదీసి సన్నని మంటపై కాచి స్వామివారికి ఇచ్చింది. అప్పుడు మాహాస్వామి వారు మేనాలో కూర్చుని ఉన్నారు. మహాస్వామి వారిపై అమిత భక్తితో ఆ భక్తురాలు ఆ ఖరీదైన ఔషధం సమర్పించింది.

అది చాలా సామాన్య వస్తువుగా పరిగణిస్తూ, ఆకుదొప్పలో ఉన్న ఆ చూర్ణాన్ని తీసుకుని మేనాలో ఒక మూలన పెట్టారు. కామాక్షి అమ్మవారు శ్రీమఠం వైపు ఏదో ఉత్సవ సందర్భంగా ఊరెరిగింపుగా వస్తున్నారు.

ఆ భక్తురాలితో స్వామి వారు, “మఠం ముందుకు కామాక్షి వచ్చింది. వెళ్ళి దర్శించుకోరాదా?” అని చెప్పారు. స్వామి వారి అనుమతితో ఆ భక్తురాలు అమ్మవారి దర్శనానికి బయటకు వెళ్ళింది. ఆవిడ అలా వెళ్ళగానే ఒక పేద యువతి వచ్చింది. ఆమే చేతుల్లో ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ పిల్లవాడు ఛాతీలో ఏర్పడిన రక్త చలన దోషము వలన ఊపిరి అందక ఆరాటపడుతున్నాడు. “పిలాడికి చాలా రొంపి చేసింది. నాకు మందులు కొనే స్థోమత లేదు. సామి కొద్దిగా వీభూతి ఇవ్వండి” అని ఏడుస్తూ ప్రార్థించింది.

మరుక్షణమే మహాస్వామివారు మేనాలో ఉన్న కుంకుమపువ్వు మిశ్రమాన్ని ఆమెకు ఇచ్చి ఇంటికి వెళ్ళిన తరువాత రోజుమొత్తంలో బాబు నుదురుపై రెండు మూడు సార్లు పూయమని చెప్పారు. వెళ్ళేటప్పుడు వీధులలో ఉన్న ధూళి అందులో పడవచ్చు, కనుక దానిపై కొంగు మూసుకుని వెళ్ళమన్నారు. వెంటనే ఆ యువతి వెళ్ళిపోయింది.

వెంటనే వారు మేనాలో ఉన్న కొంచం కుంకుమ తీసుకుని దాన్ని నీళ్ళలో ముద్దగా చేసి నుదురుపై రాసుకున్నారు. అది చూడదానికి కుంకుమపువ్వు చూర్ణం రాసినట్టుగా ఉంది.

కామాక్షి దర్శనానికి వెళ్ళిన ఆ మహిళ తిరిగి వచ్చి మేనా వద్ద నిలుచుంది. పరమాచార్య స్వామి వారి నుదురుపై ఎర్రటి చారికలు చూసి, “ఈశ్వరా! నేను తెచ్చిన కుంకుమపువ్వు మిశ్రమాన్ని పరమాచార్య స్వామి వారు నుదురుపై రాసుకున్నారు” అనుకొని చాలా సంతోషించి మరుసటి రోజు స్వామి వారి దర్శనానికి వచ్చింది.

మహాస్వామి వారు “నువ్వు ఇచ్చిన కుంకుమపువ్వు మిశ్రమం వల్ల కఫం తగ్గింది జ్వరం కూడా లేదు” అని అన్నారు.

ఆ భక్తురాలు చాలా ఆనందపడింది. పరమాచార్య స్వామి వారు అబద్దమాడలేదు. వారు “నా కఫం జ్వరం తగ్గింది” అని అనలేదు. పిల్లాడికి తగ్గిందన్న విషయం చెప్పారు. మొత్తనికి ఆవిడ ఇచ్చిన ఔషదం ఉపయోగపడింది. ఆ భక్తురాలి విశ్వాసాన్ని, అనన్య భక్తిని పొగడడానికి ఇక వేరే సందర్భం ఏముంటుంది?

కాని ఈ లీలను చూసిన పరిచారకులకు మాత్రమే తెలుసు ఖరీదైన కుంకుమపువ్వు చూర్ణం ఒక పేద పిల్లవాడి బాధను పోగొట్టిందని. ఈ దైవరహస్యాలు తెలుసు కాబట్టే వాటిని అనుభవాలుగా చెప్పుకుంటున్నారు వారు.

--- శ్రీమఠం బాలు మామ, మహాపెరియవళ్ దరిశన అనుభవంగళ్

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#కంచిపరమాచార్యవైభవం

విరాళాలు పంపాల్సిన వివరాలు. A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ® A/C. No : 50200059599164 IFSC Code : HDFC0001753 Branch : HDFC Bank UPI ID : 7259859202@hdfcbank Gpay/Phone pay/BHIM/freecharge 7259859202

ఎవరి విగ్రహం అది?నా కుమారుడు బాలాజి పుట్టినప్పుడు, జాతకాన్ని గణించమని జ్యోతిష్కులకు చెప్తే వారు, “పదహారు సంవత్సరముల వరకు...
15/11/2023

ఎవరి విగ్రహం అది?

నా కుమారుడు బాలాజి పుట్టినప్పుడు, జాతకాన్ని గణించమని జ్యోతిష్కులకు చెప్తే వారు, “పదహారు సంవత్సరముల వరకు ఈ అబ్బాయి యోగం సరిగ్గా లేనందున జాతకం ఇప్పుడు గణించడం కంటే ఆ తరువాత చెయ్యడం మేలు” అని చెప్పారు.

నా భార్య సరస్వతి చాలా కంగారు పడింది. తను మొక్కని దేవుడు లేడు, దర్శించని దేవాలయం లేదు, నోచని నోము లేదు. తను తిరుచెంగొట్టు అర్ధనారీశ్వరుని ఎక్కువగా ఆరాధించేది. మాకు ఇద్దరు కుమార్తెలున్నా, అబ్బాయి వీడొక్కడే కావున ఏ తల్లి మాత్రం తన ఒక్కగానొక్క కొడుకు నిండు నూరేళ్ళు బ్రతకాలని కోరుకోదు? మా ఆవిడకూడా అంతే. నెలలో చాలా రోజులు ఏదో ఒక వ్రతం పేరుతో ఉపావసం ఉండేది. కేవలం తన కుమారుని కోసం ఎంతటి కష్టాన్నైనా భరించేది సహించేది.

ఆరోజు గురువారం కాబట్టి ఉపవాసం ఉంటుంది. సాయింత్రం పూజ తరువాతనే అహారం సేవించేది. ఆ సాయింత్రం నా చిన్న కూతురు రాజం పాఠశాల నుండి వచ్చి, పాఠాలు చదువుకుంటూ హఠాత్తుగా తన తల్లి వంక తిరిగి, “అమ్మా అందరూ కంచి పరమాస్వామి వారి గురించి గొప్పగా చెప్తుంటారు. నువ్వెందుకమ్మా బాలాజి కోసం తనని ప్రార్థించకూడదు?” అని అడిగింది.

ఆ చిన్నపిల్ల నోటి నుండి వచ్చిన మాటలే దేవి పలికించిన మాటలుగా భావించి ఆ రోజునుండి నా భార్య పరమాచార్య స్వామి వారిని ప్రార్థించడం ప్రారంభించింది. మరొక ప్రత్యేకత ఏమంటే మా ఆవిడ ఏమి ప్రారంభించినా దాని గురించి చాలా శ్రద్ధగా తీవ్రంగా చేస్తుంది. కాబట్టి తను పిచ్చి దానిలా మహాస్వామి వారి ఆరాధన చెయ్యడం మొదలుపెట్టింది. తన ధ్యాస అంతా కంచి పరమాచార్యులవారే.

ఒక రోజు రాత్రి తనకు ఒక కల వచ్చింది. నేను వ్రాసుకోవడానికి ఉపయోగించే కుర్చీలో మహాస్వామి వారు కూర్చున్నారు. వారికి తనకు మధ్యలో శబ్ధం చేస్తూ నీరు ప్రవహిస్తోంది. ఇవతలివైపు నా భార్య కుమారుని కోసం ప్రార్థిస్తోంది. మహాస్వామి వారు ప్రశాంత వదనంతో “నీ ఖాతాలో పుణ్యాన్ని చాలా జమ చేసుకున్నావు. అందులో నుండి కొంత తీసుకుంటే అదేమి తగ్గదులే”

అంతలోనే కల చదిరిపోయింది. అది తెల్లవారుఝాము సమయం. అప్పటినుండి తనకు మహాస్వామివారే లోకం. తన స్నేహితులు తను కలిసి ప్రతి పౌర్ణమికి కంచికి వెళ్ళి కామాక్షి అమ్మవారిని మహాస్వామి వారిని దర్శించుకోవడం మొదలుపెట్టారు.

దీని గురించి నా ఆలోచన కొంచం వేరు. నా ఉద్దేశం పీఠాధిపతులను గౌరవిస్తే చాలు. వారిని దేవతలులాగా పూజించవలసిన పని లేదు.

ఇటువంటి సమయంలో నా స్నేహితుడొకరు పూంపుహార్ ఆర్ట్ శాప్ నుండి ఒక చిన్న దేవి విగ్రహాన్ని బహూకరించాడు. దీంతో కొత్త వాదనకు బీజం పడింది. ఇంట్లో ‘విగ్రహ ఆరాధన’ చెయ్యవచ్చా? చెయ్యకూడదా? అని.

దానికంటే ముందు అసలు ఆ విగ్రం ఏ దేవతది? నిశ్చయంగా ఏ దేవతా మూర్తియో చెప్పడానికి కుదరని అవస్థ.

నేను మా ఆవిడతో “కంచి మహాస్వామి వారిని చూడడానికి వెళ్తావు కదా, ఈ విగ్రహ శిల దేవతా మూర్తి గురించి ఆయన్ను అడుగు. వారు సరిగ్గా చెబితే నేను వారు మనుష్యులలో ఉన్న డేవుడని నమ్ముతాను” అని చెప్పాను.

”ఈసారి మీరూ మాతోపాటు రండి” అని అన్నది. ఏదో శక్తి నాచేత “సరేలే వెళ్దాం” అని పలికించింది. అందరమూ వెళ్ళాము. చలా మంది భక్తులు వారి దర్శనార్థమై వచ్చారు. ఒకరితరువాత ఒకరు స్వామి వారిని దర్శించుకొని ముందుకు వెళ్తున్నారు. కొంతమంది తరువాత మా ఆవిడ వెనకాతల నేను నిలబడి ఉన్నాము. స్వామి వారు తమ చేతితో నా భార్యను రమ్మని పిలిచారు. తను దగ్గరకు వెళ్ళగానే రెండు చేతులని పైకెత్తి ఆశీర్వదించారు. వెంటనే తనను “మీ ఇంటికి అఖిలాండేశ్వరి వచ్చింది కదా?” అని అడిగారు.

కళ్ళ నీరు కారుతుండగా నా భార్య అవునన్నట్టు తల ఊపి, స్వామి వారికి నమస్కారం చేసి నిలబడింది. స్వామివారు తనని ఆపాదమస్తకం చూసారు.

వారి మాటలు వింటున్న నేను వారి ముందు పడిపోయి, నా ఎనిమిది అంగములు నేలకు తగిలేట్టు సాష్టాంగం చేసాను. వారిని చూస్తూ నమ్స్కార ముద్రలోకి పోయిన నా చేతులు చాలా సేపు అలాగే ఉన్నాయి.

మహాస్వామి వారు మళ్ళా మా ఆవిడను పిలిచి ఆశీర్వదించి పంపారు. ఆనాటినుండి నేను పరమాచార్య స్వామి వారికి బానిసను.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#కంచిపరమాచార్యవైభవం

విరాళాలు పంపాల్సిన వివరాలు. A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ® A/C. No : 50200059599164 IFSC Code : HDFC0001753 Branch : HDFC Bank UPI ID : 7259859202@hdfcbank Gpay/Phone pay/BHIM/freecharge 7259859202

14/11/2023

_*ఆకాశదీపం అంటే ఏమిటి కార్తీకంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా*_
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

ఈ కార్తీకమాసం అంటే పుణ్య మాసం అనే చెప్పాలి, ఈనెల శివకేశవులకి ఎంతో ప్రియమైనది. అంతేకాదు ఈ సమయంలో వారికి పూజలు అభిషేకాలు వ్రతాలు చేస్తూ ఉంటారు, కార్తీకమాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ఆకాశ దీపం వెళాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు.ఇది ప్రతీ శివాలయంలో వెలిగించడం మనకు కనిపిస్తుంది.

గుడికి వెళ్లిన సమయంలో ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తారు అందరూ, ఇలా చేయడం వల్ల పితృదేవతలకు మార్గం చూపుతుంది అని నమ్మకం..దానిని తాడు సాయంతో పైకి పంపించి, ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఇలా ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని వారికి దారి కోసం అని కార్తీకపురాణం చెబుతోంది.

ఇలా ఆ దీపాన్ని చూసినా తలచుకున్నా ఎంతో మంచిది మనలో ఉన్న నెగిటీవ్ ఎనర్జీ మొత్తం పోతుంది.. ఆ కాంతిలో ఆ ప్రాంతం అంతా ఆ శివయ్య కాపాడుతాడు అని కూడా నమ్ముతారు. ఇక ఇంట్లో కూడా ఇలా ఆకాశదీపం వెలిగించవచ్చు
ఎత్తుగా ఒక కర్రకట్టి దానికి వేలాడదీయవచ్చు అని పెద్దలు పండితులు చెబుతారు, కొందరు ఇళ్లల్లో కూడా దీనిని కడతారు.
అరుణాచలశివ 🌹
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

సిద్దిపేటలోని శ్రీ కాశీ అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం, నాడు అమ్మవారికి విశేషాలంకరణ, స్వామి వారికి...
10/11/2023

సిద్దిపేటలోని శ్రీ కాశీ అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం, నాడు అమ్మవారికి విశేషాలంకరణ, స్వామి వారికి కిరీట ధారణ, గణపయ్యకు ఆంజనేయస్వామి లకు చందన ఉత్సవాలు జరిగాయి. ఆలయంలో పారాయణం భక్తులకు ప్రసాదం వితరణ జరిగాయి

07/11/2023

సిద్దిపేట (మై టివి సిద్దిపేట ఎడిటర్)
2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే 13 అత్యవసర సేవల శాఖల సిబ్బందికి భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఎన్నికల పోలింగ్ విధులలో పాల్గొనే వారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించు కోవాలనుకునే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు మాత్రమే ఫారం 12-డి, అక్రిడేషన్ కార్డు, ఎపిక్ కార్డు జిరాక్స్ ప్రతిని జతచేస్తూ 12-డి ఫారంలో పేరు, మీడియా పేరు, హోదా, నియోజకవర్గం పేరు, పోలింగ్ బూత్ తదితర వివరాలతో (08 నవంబర్ 2023 బుధవారం) మధ్యాహ్నం 12:00 గంటలలోపు సిద్దిపేట డిపిఆర్ఓ కార్యాలయంలో అందజేయాలని మనవి.

నోట్:
12D ఫారం తెలుగు,ఇంగ్లీష్ లో పోస్ట్ చేయడం జరిగింది.

పత్రికా ప్రకటనతేదీ: 06-నవంబర్-2023*గుర్తుతెలియని సైబర్ నేరగాళ్లు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, పేరు, సెల్ నెంబర్ 9934941611...
07/11/2023

పత్రికా ప్రకటన
తేదీ: 06-నవంబర్-2023

*గుర్తుతెలియని సైబర్ నేరగాళ్లు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, పేరు, సెల్ నెంబర్ 9934941611 పైన ఫేక్ ఐడి క్రియేట్ చేసి డబ్బులు అత్యవసరంగా ఉన్నాయని మెసేజ్ పంపిస్తున్నారు, ఎవరు కూడా పై మెసేజ్ కి రెస్పాండ్ కావద్దు, డబ్బులు పంపించి మోసపోవద్దు*

*పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మేడం గారు*

గుర్తుతెలియని సైబర్ నేరగాళ్లు పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఐపీఎస్ పేరు, సెల్ నెంబర్ 9934941611 పైన ఫేక్ ఐడి క్రియేట్ చేసి డబ్బులు అత్యవసరంగా ఉన్నాయని 30 వేల రూపాయలు పంపించమని తిరిగి గంటలోపు పంపిస్తానని నా యొక్క పేరుపైన ఎవరో గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లు ఐడి క్రియేట్ చేసి మొత్తం సర్కులేట్ చేస్తున్నారు.

జిల్లా ప్రజలకు మరియు పోలీస్ అధికారులకు వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు ముఖ్య గమనిక పై నెంబర్ పై వచ్చే ఫేక్ ఐడి వాట్సప్ సోషల్ మీడియా ద్వారా సర్క్యులేట్ అవుతున్నందున ఎవరు కూడా నమ్మవద్దని నమ్మి డబ్బులు పంపించి మోసపోవద్దని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ మేడం గారు ఒక ప్రకటనలో తెలిపారు.
కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.

పత్రిక ప్రకటనతేదీ: 06-నవంబర్-2023*పొన్నాల చెక్ పోస్టును  తనిఖీ చేసిన అడిషనల్ డీసీపీ L&O (శాంతి భద్రతలు) ఎస్. మల్లారెడ్డి...
06/11/2023

పత్రిక ప్రకటన
తేదీ: 06-నవంబర్-2023

*పొన్నాల చెక్ పోస్టును తనిఖీ చేసిన అడిషనల్ డీసీపీ L&O (శాంతి భద్రతలు) ఎస్. మల్లారెడ్డి*

*రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నియమావళి ప్రకారం జిల్లా చెక్ పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు*

*అడిషనల్ డిసిపి L&O ఎస్. మల్లారెడ్డి గారు మాట్లాడుతూ* పోలీస్ కమిషనర్ గారి ఆదేశానుసారం ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నియమావళి ప్రకారం జిల్లాలో 10 చెక్పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
అక్రమంగా ఎవరైనా ఎలాంటి ఆధారాలు లేని నగదు కానీ మద్యం మరియు ఓటర్లను ప్రలోభాలకు కురిచేసే వస్తువులను, మాదకద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లాలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో పూర్తిచేయడం జరిగిందన్నారు.

చెక్ పోస్ట్ లో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని 24X7 విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతి వాహనాన్ని క్షున్యంగా తనిఖీ చేయాలని, తనిఖీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. వచ్చిపోయే వాహనాలను పరిశీలిస్తూ తనిఖీలు చేయాలని తెలిపారు. రాత్రి సమయాల్లో తనిఖీ చేసేటప్పుడు టార్చ్ లైట్ తప్పక ఉపయోగించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ చేరాలు, రూరల్ ఎస్ఐ కిరణ్, స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు పాల్గొన్నారు.

కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.

పత్రికా ప్రకటన...2023 ఎలక్షన్స్ లో భాగంగా ఈరోజు సిద్దిపేట ఆర్డిఓ, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ సిద్దిపేట సురేందర్ రెడ్డి గా...
05/11/2023

పత్రికా ప్రకటన...

2023 ఎలక్షన్స్ లో భాగంగా ఈరోజు సిద్దిపేట ఆర్డిఓ, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ సిద్దిపేట సురేందర్ రెడ్డి గారు, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ మరియు టూ టౌన్ ఇన్స్పెక్టర్ వీ.రవికుమార్ గారు,, సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ బూత్ లు చెక్ చేయడం జరిగింది.. ఎలక్షన్స్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడం కోసం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు మరియు ఎవరైనా పోలింగ్ బూత్ల వద్ద చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేశారంటే వారిపై తగు చర్య తీసుకుంటామని ఏసీపి సురేందర్ రెడ్డి గారు తెలియజేశారు.

Address


Alerts

Be the first to know and let us send you an email when MYTV siddipet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share