14/06/2024
జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని కలిసిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్టు & ఔటసోర్సింగ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు
సోషల్ మీడియాలో వివిధ పత్రికల్లో మద్యం షాపులను ఎత్తివేసి, పాత ప్రైవేటీకరణ వైపుగా చేస్తారని ప్రచారం జరుగుతున్నది. ఇదే నిజం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 12000 ఉద్యోగులము రోడ్డున పడతాము అని రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్ మెన్లు ఇతర ప్రభుత్వం విభాగాలలో ఔట్ సోర్సింగ్ క్రింద ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి మా కుటుంబాలను ఆదుకోమని ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్టు & ఔటసోర్సింగ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు అసోసియేషన్ సభ్యులతో మాట్లాడుతూ మీ విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీకు తగు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని అసోసియేషన్ సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది.