13/09/2024
వైసీపీ వీరాభిమానులు, కొంతమంది సామాజికవేత్తల ముసుగులో ఉన్న జగన్ గారి భక్తులు (ఫాలోవర్స్).. కూటమి ప్రభుత్వ సఖ్యతను సహించలేక గగ్గోలు పెడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నంబర్ వన్ అయితే, నంబర్ టు పొజిషన్లో లోకేష్ గారు ఉన్నారట.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అసలు ప్రయారిటీ లేదట. ఇది వారి విశ్లేషణ(ఏడుపు)..
దానికి సాకుగా..
సినీ ప్రముఖులు వరద(Flood )బాధితులకు విరాళాలు ఇచ్చే విషయంలో.. కేవలం సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ ను మాత్రమే కలిసి చెక్కులు అందజేసి ఫోటోలు దిగుతున్నారట. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టేసారని వైసిపి సానుభూతిపరులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి కాళ్లు పట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నారు లోకేష్ బాబు(Nara Lokesh). ఇక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ప్రయారిటీ ఇస్తూ డిప్యూటీ సీఎం తో పాటు పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ & నీటిపారుదల, అటవీ శాఖ వంటి కీలక శాఖలు అప్పజెప్పి ఆయనను ఎంతగానో గౌరవించారు హై ప్రయారిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అయితే సడన్ గా పవన్ కళ్యాణ్ మీద వైసిపి వారికి ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? అది ప్రేమ కాదు కూటమి ప్రభుత్వం విచ్చిన్నమ్మవడమే మొదట్నుంచి వారి లక్ష్యం. వాళ్ల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని గౌరవించారో, ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎంత నీచంగా వ్యాఖ్యలు చేశారో ప్రజలందరూ ఇంకా మర్చిపోలేదు. అయినా మీ ట్రాప్ లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ పడరు. ఎలక్షన్లో కూటమి ఏర్పడకూడదని మీరు ఎంత కుట్రలు చేసినా పవన్ కళ్యాణ్ గారు టిడిపి తోనే కలిశారు, విజయం సాధించారు, ఉపముఖ్యమంత్రి అయ్యారు.. దటీజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
మొత్తంగా చెప్పొచ్చేది ఏంటంటే
పవన్ కళ్యాణ్ గారు ఊహించిన దానికంటే తెలుగుదేశం పార్టీ ఆయన ఉన్నతంగా హెచ్చించింది అధిక ప్రాముఖ్యతను ఇచ్చింది.
కోసమెరుపు ఏంటంటే ఆర్థికపరమైన కేసులు,మరి ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసు వెరసి దరిదాపుల్లో కూడా రాజకీయ భవిష్యత్తు కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డికి అర్థమైందా రాజా..!
Written By
నోముల మాణిక్యరావు