04/10/2022
అభివృద్ధి ఫలాలు 29 గ్రామాలకే పరిమితమా!
అమరావతి అభివృద్ధి అంటే కేవలం 29 గ్రామాలేనా?
ఐదు కోట్ల ఆంధ్రులను, వదిలేసి కేవలం 29 గ్రామాలనే డెవలప్ చేయాలా? ఇదెక్కడి వితండవాద ప్రశ్న?
🤔🤔🤔🤔🤔
ఒక అభివృద్ధి కార్యక్రమమైనా, ఒక పరిశ్రమ అయినా, ఒక ఇన్స్టిట్యూషన్ అయినా, ఒక యూనివర్సిటీ అయినా, అందరికీ అనువైన చోట, ఎక్కడో ఒకచోటే పెడతారు. అంతేకానీ 16వేల గ్రామాలలో ఒక్కొక్క ముక్క పెట్టరు. దాని అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చూస్తారు.
కళ్ళుండి చూడలేని కబోదులం, అంటే ఎవరూ చేసేదేం లేదు.
కానీ వాస్తవ రూపాన్ని దర్శించటానికి మనకు కాస్త జ్ఞానం కావాలి.
ఒక హైటెక్ సిటీ హైదరాబాదులో ప్రారంభిస్తే, దాని చుట్టూ అల్లుకున్న సాఫ్ట్వేర్ సంస్థలతో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంత భూముల రేట్లు పెరగవచ్చు, అక్కడ బీడు భూములు కొంతమందిని సుసంపన్నం చేసి ఉండవచ్చు.
కానీ ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తును మార్చివేసింది. కంబైన్డ్ ఆంధ్ర ప్రదేశ్ లో, ఎంతమంది తల్లిదండ్రుల గీతను మార్చింది. ప్రతి కుటుంబం నుంచి ఒకరు సాఫ్ట్వేర్ లోకి వెళ్లి, ఇంటి స్థితిగతులను మార్చారు. రాష్ట్రానికి ఎంత ఆదాయం పెరిగింది. ప్రజల ఆర్థిక అభివృద్ధి ఎంత పెరిగింది, ఈ మాట్లాడే సోకాల్డ్ నాయకులంతా హైదరాబాద్ హైదరాబాదు అని ఎందుకు పరిగెత్తారు. వచ్చిన జనాభాతో,సర్వీస్ సెక్టార్నీ బేస్ చేసుకుని హైదరాబాద్ ఎంతగా పెరిగింది.
ఆర్థిక అభివృద్ధి అంటే దానిని అంటారు.
వెనుకబడ్డ ప్రాంతమైన రాయలసీమలో, ఫాక్ష్యన్తో కొట్టుకులాడే పెనుగొండ ప్రాంతంలో, కియా కార్ల కంపెనీ స్థాపించబడింది. అక్కడ భూముల రేట్లు పెరిగాయి. అదా మనం చూడవలసింది.
కార్ల పరిశ్రమ వలన ఎంతమందికి ఉపాధి దొరికింది, కార్ల అమ్మకాల వలన రాష్ట్రానికి ఎంత జీఎస్టీ వస్తుంది, తద్వారా రాష్ట్ర బడ్జెట్ కి ఎంత ఊతం కలుగుతుంది, అన్నది మాత్రమే కొంత జ్ఞానం కలిగిన వారికి అర్థమవుతుంది. అలాగే రాయలసీమలో రావలసిన పరిశ్రమలు, శ్రీ సిటీ మొదలైన పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రాల వలన, కొంత పరిధిలో భూముల రేట్లు పెరగవచ్చు కానీ, తద్వారా జరిగే సామాజిక అభివృద్ధిని కానవలసి ఉంది.
విశాఖపట్నంలో ఎన్నో పరిశ్రమలు, యూనివర్సిటీలు స్థాపించబడి ఉన్నాయి. రాష్ట్రంలోనే ఎక్కడా లేనంతగా, విశాఖలో భూముల రేట్లు అందుబాటులో లేనంత ఎత్తులో ఉన్నాయి. అందుకని విశాఖ వాసులను నిందిద్దామా? విశాఖలో భూముల రేట్లు ఎక్కువగా ఉన్నాయని బాగా అభివృద్ధి చెందారని, అక్కడ ఏ పరిశ్రమ , ఏ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, సినీ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ, అక్కడకు రావడానికి వీల్లేదని నిందిస్తూ కూర్చుందామా?
విశాఖ స్టీలు,పోర్టు, ఫార్మాసిటీ, వగైరాలలో ఉద్యోగాలు, లాభాలు, విశాఖవాసులే పొందుతున్నారు అని నిందిద్దామా
లేక విశాఖ నుండి, ఆంధ్రప్రదేశ్ కు
వనకూరుతున్న ఆర్థిక అభివృద్ధిని, తలచుకొని సంతోషిద్దామా?
వాస్తవానికి హైదరాబాదులో సాఫ్ట్వేర్ భూమ్ కి కారణం ఎవరు. కోస్తా రాయలసీమ నుంచి వచ్చిన ఆంధ్రులే కదా?
వారికి అనువైన ప్రాంతమైన విశాఖలో, ఆ తీరుగా డెవలప్ చేయడానికి మన వంతు ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నామా, నటీనట సాంకేతిక వర్గం మనవారైయుండి , సినీ పరిశ్రమకు అవకాశాలు ఏమైనా కల్పిస్తున్నామా? ఆంధ్ర శీతల విడిది అరకుని, అభివృద్ధి చేసి పర్యాటక రంగాన్ని ఏమైన ప్రోత్సహిస్తున్నామా?
అభివృద్ధి అంటే, ఇటువంటి సర్వీస్ సెంటర్ అంతా వస్తే, తద్వారా వచ్చే ఆర్థిక అభివృద్ధి నుంచి వస్తుంది.
29 ఊళ్లంటారు, అభివృద్ధి అంతా అక్కడేనా, అంటారు, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి 29 గ్రామాలలో ఏ పరిశ్రమలు పెట్టే అవకాశం ఉంది, దాని పెరుగుదల స్కోప్ ఎంత? గవర్నమెంట్ కాంప్లెక్స్ లతోపాటు, కొన్ని కాలేజీలు ,హాస్పిటల్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వగైరా మాత్రమే అక్కడ, నెలకొల్పడానికి అవకాశం ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు విట్, ఎస్ఆర్ఎం, అమృత, నిట్ వగైరా కాలేజీలు. వాటిలో 29 గ్రామాల వారే చదువుకుంటారా?
అమరావతి ప్రాంతం అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి అక్కడ రాజధాని ఏర్పాటు చేయడం జరిగింది. 29 గ్రామాలలో పెరిగే కొద్దిపాటి భూమి రేట్లను చూపించి, ఐదు కోట్ల ఆంధ్రులకు ఒరిగే ప్రయోజనాలను విస్మరించటం బాధాకరం! ఈ మాత్రం భూమి రేట్లు ఆంధ్ర రాష్ట్రంలో ఏ మూలకెళ్లినా ఉన్నాయని గమనించండి.
నాయకుల లక్ష్యం కేవలం ప్రాంతీయ విద్వేషాలు రగల్చడం, తద్వారా వారి ప్రయోజనాలను కాపాడుకోవడం.
సామాన్య ప్రజలమైన మనం, వాస్తవ పరిస్థితులను గాంచితే, ఈ మూడు ముక్కలాట ఉద్దేశ్యలు ఏమిటో గ్రహించగలిగితే
రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.
మనం మన రాజధాని
🙏🙏🙏🙏🙏🙏