TUNI News

TUNI News that is the sweetness of tuni and payakaraopeta

తుని పట్టణంలో దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి..కొన్ని ఏరియాల్లో అయితే ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు..ఇటీవల కాలంలో...
06/01/2024

తుని పట్టణంలో దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి..

కొన్ని ఏరియాల్లో అయితే ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు..

ఇటీవల కాలంలో ఫాగింగ్ కూడా చేయలేదని చెబుతున్నారు..

ప్రస్తుతం పారిశుధ్య కార్మికులు సమ్మె బాట పట్టడంతో
పరిస్థితి మరింత తీవ్రతరం అయ్యింది..

కాస్త ఈ అంశాన్ని పరిశీలించండి సార్🙏🙏🙏

05/01/2024
తుని పట్టణంలోని పాత బజారు వీధిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసం పురస్కరించుకుని శుక్రవారం మహాన్నదాన ...
05/01/2024

తుని పట్టణంలోని పాత బజారు వీధిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసం పురస్కరించుకుని శుక్రవారం మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుని నియోజకవర్గ వైసీపీ యువ నేత దాడిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా శ్రీనివాస్ కు ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి దర్శనం చేసుకున్న శ్రీనివాస్ వేద పండితుల వేదాశీర్వచనం పొందారు. తర్వాత అన్నదానం కార్యక్రమంలో ఆయనే స్వయంగా భక్తులకు వడ్డించారు. అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు..

ధనుర్మాసం సందర్భంగా తుని పట్టణంలో ఈ శనివారం అనగా 6వ తేదీ  ఓ వైభవోపేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తుని మండల ఆర్యవైశ...
04/01/2024

ధనుర్మాసం సందర్భంగా తుని పట్టణంలో ఈ శనివారం అనగా 6వ తేదీ ఓ వైభవోపేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తుని మండల ఆర్యవైశ్య సంఘం. పెద్దాపురం మండలం తొలి తిరుపతిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శృంగార వల్లభ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని మన తుని పట్టణంలో కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తుని పట్టణంలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద ఉన్న వాసవి మహాలక్ష్మి గ్రౌండ్స్ లో శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుని పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవాన్ని తిలకించి తరించాలని ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు నార్ల రత్నాజీ కోరారు.

అభ్యర్థి మార్పుపై వస్తున్న ఊహాగానాలపై  మంత్రి రాజా కుండబద్దలు కొట్టారు. తనదైన శైలిలో క్యాడర్ కు, ప్రతిపక్షాలకు క్లారిటీ ...
04/01/2024

అభ్యర్థి మార్పుపై వస్తున్న ఊహాగానాలపై మంత్రి రాజా కుండబద్దలు కొట్టారు. తనదైన శైలిలో క్యాడర్ కు, ప్రతిపక్షాలకు క్లారిటీ ఇచ్చారు. " పులివెందుల లో జగన్ పోటీ చేయడం ఎంత నిజమో, తునిలో రాజా పోటీ చేయడం కూడా అంతే నిజమని స్పష్టం చేశారు. 30000 మెజారిటీ తో గెలవడం కూడా ఖాయమని పునరుద్ఘాటించారు... తుని మండలం వెలమకొత్తూరు గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి రాజా ఈ వ్యాఖ్యలు చేశారు...

ఉత్కంఠ వీడింది. పాయకరావుపేట వైసీపీ ఇంచార్జి ఎవరో తెలిసిపోయింది. ఆశావహుల ఆశలు ఆవిరై పోయాయి. పాయకరావుపేట వైసీపీ ఇంఛార్జి గ...
02/01/2024

ఉత్కంఠ వీడింది. పాయకరావుపేట వైసీపీ ఇంచార్జి ఎవరో తెలిసిపోయింది. ఆశావహుల ఆశలు ఆవిరై పోయాయి. పాయకరావుపేట వైసీపీ ఇంఛార్జి గా శ్రీకాకుళం జిల్లా రాజాం సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.. ఈ ప్రకటనతో వైసీపీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన కంబాల జోగులుకు పేట పగ్గాలు అప్పగించడం చర్చనీయాంశమైంది.

జోగులు బయోడేటా
----------------------
1968లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, రాజాం మండలం, మంగళాపురం గ్రామంలో ఆదమ్మ, గవరయ్య దంపతులకు అయన్ జన్మించారు. ఆయన 10వ తరగతి వరకూ శ్రీకాకుళంలోని ఎస్‌ఎంయూపీ పాఠశాలలో, శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్‌ డిగ్రీ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి, విశాఖపట్నంలోని ఆల్‌సైన్సు క్రిస్టియన్‌ లా కళాశాలలో బీఏ, బీఎల్‌ పట్టా అందుకున్నారు.

రాజకీయ జీవితం
-------------------
కంబాల జోగులు రాజకీయ జీవితం 1995లో తెలుగుదేశం పార్టీతో మొదలయ్యింది ఆయన 1999 ఎన్నికల సమయంలోనే తెలుగుదేశం పార్టీ నుండి పాలకొండ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ టికెట్ దక్కలేదు. ఆయన ఇక 2004లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డా. కళ్యాణ్ బాబు పై 11624 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీ లోకి అడుగు పెట్టారు.2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఆయన 2012లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కంబాల జోగులు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి రాజాం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రతిభా భారతి పై 512 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు.ఆయన 2019 ఎన్నికల్లో ఎన్నికల్లో వైసీపీ నుంచి రాజాం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండ్రు మురళి మోహన్ పై 16848 ఓట్ల మెజారిటీ గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన, సౌకర్యమంతమైన ప్రయాణాన్ని కల్పించేందుకు రైల్వే శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన రైలు "అమృత్ భారత్...
01/01/2024

ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన, సౌకర్యమంతమైన ప్రయాణాన్ని కల్పించేందుకు రైల్వే శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన రైలు "అమృత్ భారత్". పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మాల్డా టౌన్ నుంచి బెంగళూరుకు ఇది రాకపోకలు సాగిస్తుంది. జనవరి 7 ఆదివారం నుంచి ఇది ప్రారంభమవుతుంది. అయితే ఈ రైలు రోజూ రాదు..వారానికి ఒకసారి మాత్రమే. 13434 నంబర్ గల ఈ రైలు ప్రతి ఆదివారం ఉదయం 8.59 నిమిషాలకు మాల్డా టౌన్ నుంచి బయలుదేరుతుంది. మరుసటిరోజు అంటే సోమవారం ఉదయం 7.19 నిమిషాలకు తుని స్టేషన్ కు చేరుతుంది. బెంగళూరుకు మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మంగళవారం మధ్యాహ్నం 1.50 కి బయలదేరుతుంది. తుని మరుసటి రోజు అంటే బుధవారం ఉదయం 5.59 కి చేరుకుంటోంది. ఈ రైలు సామర్లకోట, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఇది నాన్ ఏసీ రైలు. మొత్తం 22 కోచ్ లు ఉంటాయి.. 12 స్లీపర్, 8 జనరల్, ఒక వికలాంగ, ఒక లేడీస్ కోచ్ ఉంటుంది.

జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఏ విజేతకైనా ఆదిగురువులు అమ్మానాన్నలే అని, మన కోసం వారు చేసే త్యాగాలను ఎన్నటికీ మరిచి...
31/12/2023

జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఏ విజేతకైనా ఆదిగురువులు అమ్మానాన్నలే అని, మన కోసం వారు చేసే త్యాగాలను ఎన్నటికీ మరిచిపోకూడదని తుని నియోజకవర్గ వైసీపీ యువ నేత దాడిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువుల మార్గదర్శకత్వంలో ప్రతిఒక్కరూ ముందుకెళ్ళి భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. వినంద - వివేక కళాశాలల యాజమాన్యం ఆదివారం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం పాములవాక శ్రీ పట్టాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆనందోత్సవ వేడుక నిర్వహించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా దాడిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎవరైనా ఒకరు మంచి అలవాట్లతో సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నారు అంటే వారి వెనుక కచ్చితంగా అమ్మానాన్నలు, మంచి గురువులు ఉంటారన్నారు. కెరీర్ విషయంలో కానీ, పై చదువులు విషయంలో కానీ ఎవరికి ఏ కష్టం వచ్చినా, జీవితంలో ఏ ఆటంకాలు ఎదురైనా "దాడిశెట్టి శ్రీనివాస్" ఉన్నాడనే విషయాన్ని మరిచిపోవద్దని విద్యార్థులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో వినంద - వివేక కళాశాలల ఛైర్మెన్ గరగా సుబ్బారావు, తుని నియోజకవర్గ ప్రముఖులు పాల్గొన్నారు..

వైసీపీ పాలకవర్గం తుని మునిసిపాలిటీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ప్రతిపాదించిన మొత్తం రోడ్లు ఎన్నో తెలుసా? అక్...
30/12/2023

వైసీపీ పాలకవర్గం తుని మునిసిపాలిటీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ప్రతిపాదించిన మొత్తం రోడ్లు ఎన్నో తెలుసా? అక్షరాలా 100...అవసరమైన చోట్ల రోడ్లు వేసుకుంటూ వస్తున్న ప్రస్తుత కౌన్సిల్ ఈ ఘనతను సాధించింది. రాష్ట్ర రహదారులు భవనాలు శాఖ మంత్రి దాడిశెట్టి రాజా పూర్తి సహాయ సహకారాలు అందించడంతో ఈ మైలురాయిని చేరుకోగలిగింది ఛైర్పర్సన్ ఏలూరి సుధాబాలు టీమ్.. శనివారం 12వ వార్డు మార్కెట్ వద్ద 100వ రోడ్డుకు శంకుస్థాపన పండుగ వాతావరణంలో జరిగింది. 100వ రోడ్డు శంకుస్థాపన పూర్తయిన సందర్భంగా మునిసిపల్ పాలకవర్గం సభ్యులు, వైసీపీ నాయకులు,కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు..

29/12/2023

Andhra Pradesh Police Dgp Andhra Pradesh Our Kakinada Smart City ౼ మన కాకినాడ స్మార్ట్ సిటీ - మన కాకినాడ జిల్లా kakinada yuvasena Kakinada City Kakinada Reporters Kakinada Kakinada District Peddapuram Jaggampeta Kakinada Today Kakinada I ❤ PEDDAPURAM Samalkot Our Kakinada Smart City Our Kakinada Our Kakinada City TUNI VOICE TUNI News Voice Of Pithapuram Kakinada Friends Club Kakinada Updates KakinadaKaburlu Kakinada VIP Group Kakinada News Kakinada Smart City Kakinada9.com kakinada People's ✌🏻😎 KAKINADA VIP GROUP Kakinada Times Kakinada kaburlu / కాకినాడ కబుర్లు Kakinada_forever Kakinada smart city #రైల్వేస్టేషన్

ఓ మహత్కార్యానికి ఆయన వారధి అయ్యారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 63 రోజులు నడిచిన ఓ గొప్ప అన్నదాన యజ్ఞానికి ఆయన ఒకానొక సార...
29/12/2023

ఓ మహత్కార్యానికి ఆయన వారధి అయ్యారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 63 రోజులు నడిచిన ఓ గొప్ప అన్నదాన యజ్ఞానికి ఆయన ఒకానొక సారథి అయ్యారు.. మహాన్నదానానికి మహాదాతగా నిలిచారు. వందలాదిమంది అయ్యప్ప భక్తులు, భవానీలు, శివ స్వాములుకు కడుపు నింపే పుణ్య కార్యక్రమానికి ఆయన తోడ్పాటునందించారు. నేనున్నా అంటూ తోడుగా నిలిచారు.. కట్రాళ్ళ కొండపై అయ్యప్ప స్వామి ఆలయం వద్ద 63 రోజులు పాటు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం దిగ్విజయం కావడంలో ప్రధాన భాగస్వామ్యం తుని నియోజకవర్గ వైసీపీ యువ నేత దాడిశెట్టి శ్రీనివాస్ ది. 63 రోజుల పాటు అవసరమయ్యే మొత్తం బియ్యాన్ని ఆయనే అందించారు. ఎంత బియ్యం అవసరం అయితే అంత బియ్యాన్ని ఆయనొక్కరే వితరణ చేశారు. ఇంతటి మహా పుణ్య కార్యక్రమానికి ఆయన తోడ్పాటునందించి కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రధాన భూమిక వహించారు. అన్నదానం ముగిసిన సందర్భంగా శుక్రవారం ఆయనను అన్నదాన కమిటీ ఆలయం వద్దకు ప్రత్యేకంగా ఆహ్వానించింది. పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఆలయంలోనికి ఆహ్వానించారు. ఆలయ అన్నదాన కమిటీ ఈ సందర్భంగా శ్రీనివాస్ సేవలను అభినందించింది. ఇంతటి మహా కార్యక్రమానికి తోడుగా నిలవడంపై ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా దాడిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మహా అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకునే శక్తిని భగవంతుడు తమకు కల్పించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నామని చెప్పారు. ప్రతి ఏడాది కూడా ఇలానే తమ వంతు పూర్తి సహకారం ఆలయ కమిటీకి ఉంటుందన్నారు..

తుని వీరవరపుపేట ప్రాంతానికి చెందిన గారా కాశీ వేదిక మీద పద్యం పాడితే కరతాళ ధ్వనులు మార్మోగుతాయి. ఆయన రాగం తీస్తే మైమరచిపో...
29/12/2023

తుని వీరవరపుపేట ప్రాంతానికి చెందిన గారా కాశీ వేదిక మీద పద్యం పాడితే కరతాళ ధ్వనులు మార్మోగుతాయి. ఆయన రాగం తీస్తే మైమరచిపోవడం ప్రేక్షకుల వంతవుతుంది. మూడు దశాబ్దాల నాటక ప్రస్థానం ఆయనది. కళపై ప్రేమ పెంచుకున్న రంగస్థల రంగమార్తాండ ఆయన..హరిశంద్రుడు నాటకంలో నక్షత్రకుడు గా మెరిసింది ఆయనే. ఎన్నో నాటకాల్లో నారదుడు గా నట విశ్వరూపం చూపింది ఆయనే. సీతారామ కళ్యాణంలో లక్ష్మణుడుగా , మరో నాటకంలో భవానీ శంకరుడుగా పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి రక్తి కట్టించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య..

కాశీకి చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి. అందువల్ల తుని పరిసర ప్రాంతాలలో ఎక్కడ నాటకం జరిగినా అక్కడ కాశీ ఉండేవారు. ఒక్కోసారి తెల్లవార్లు నాటకాలు చూసి చూసి పొద్దున్న ఇంటికి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గేయాలు పాడుకుంటూ పద్యాలు నేర్చుకుంటూ నాటకాల నీడలో ఎదిగిన కాశీ చిన్న చిన్న పాత్రలు వేయడం మొదలుపెట్టారు. ఇలా ఆ పాత్ర ఈ పాత్ర అనేది లేకుండా ఏ పాత్ర ఇచ్చిన కాశీ న్యాయం చేసేవారు. కొంతమంది గురువుల శిష్యరికంలో పద్య గానంలో రాటుదేలిన కాశీ నటనపై పట్టు సాధించారు. అప్పటి నుంచి పెద్ద పాత్రలు వేయడం మొదలు పెట్టారు.

నక్షత్రకుడు పాత్రలో పరకాయ ప్రవేశం
----------------------------
గారా కాశీ నట జీవితంలో బాగా గుర్తుండిపోయే, ఆయనకు ఎనలేని కీర్తిని తీసుకువచ్చిన పాత్ర సత్య హరిశంద్ర నాటకంలోని నక్షత్రకుడు పాత్ర. ఈ పాత్రలో కాశీ చక్కగా ఒదిగిపోతారు. ఈ పాత్ర ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. ఎంతోమంది ప్రశంసలు సాధించిపెట్టింది. ఇక సీతారామ కళ్యాణం నాటకంలో లక్ష్మణుడు పాత్ర కూడా ఆయనకు పేరు తీసుకువచ్చింది. ఇలా ఇప్పటివరకు వందలాది నాటకాల్లో విభిన్నమైన పాత్రల్లో ఆయన ఒదిగిపోయారు. ప్రేక్షకులను మెప్పించారు.. మైమరిపించారు .

తుని భద్రకాళి నాట్య మండలి తరపున ఎన్నో ప్రాంతాల్లో నాటకాలు ప్రదర్శించారు కాశీ బృందం. అయన గాన ప్రతిభను గుర్తించిన నాటక సమాజం గాన కోకిల బిరుదుతో కాశీని సత్కరించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ గుంటూరులో నిర్వహించిన నంది నాటకోత్సవంలో కాశీ బృందం నాటకాలు ప్రదర్శించింది తుని మునిసిపాలిటీ లో ట్రాక్టర్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తూ మరోవైపు నాటక రంగ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న గారా కాశీ లాంటి కళాకారులు మన తునికి చెందినవారు కావడం మనం ఎంతో హర్షించదగ్గ విషయం. ఇంకా అనేక ఏళ్ళ పాటు ఆయన నాటక ప్రస్థానం ఇలానే దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటూ
ఆయనకు TUNI News తరపున అభినందన మందారాలు.. 🙏🙏🙏

డిమాండ్ల పరిష్కారం కోరుతూ మునిసిపల్ ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు బుధవారం నుంచి సమ్మెలోకి వెళ్లారు. దీంతో వారు పట్ట...
27/12/2023

డిమాండ్ల పరిష్కారం కోరుతూ మునిసిపల్ ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు బుధవారం నుంచి సమ్మెలోకి వెళ్లారు. దీంతో వారు పట్టణ వీధుల్లో రోజువారీ విధులకు హాజరు కాని పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పట్టణ ప్రజలు సహకరించాలని తుని మునిసిపల్ కమిషనర్ కోరుతున్నారు. చెత్త నిర్వహణను కొన్నిరోజుల పాటు ప్రజలు ఒక పద్ధతి ప్రకారం చేయాలని చెబుతున్నారు. ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ రోజువారీ వచ్చే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేయాలని అన్నారు. పొడి చెత్తను ప్రతి ఒక్కరూ డబ్బాల్లో ఇంట్లోనే ఉంచుకుని సమ్మె అనంతరం వీధుల్లోకి వచ్చే పారిశుధ్య కార్మికులకు ఇవ్వాలని కోరారు. అలాగే తడి చెత్తను దగ్గర లో ఉన్న మునిసిపల్ డస్ట్ బిన్ లో వేయాలని కోరారు.. ఇలా కాకుండా రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వేయవద్దని కోరారు. ఇలా వేయడం ఆ చెత్త గాలికి ఎగిరి రోడ్లన్నీ అపరిశుభ్రంగా మారతాయని చెప్పారు. పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత పౌరులుగా మనందరిపైన ఉందన్నారు. దయచేసి పట్టణ ప్రజలు మునిసిపల్ అధికారులకు సహకరించాలి కోరారు .

Gk గ్రూప్ అధినేత శ్రీ కృష్ణారెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం మెగా రక్తదాన శి...
27/12/2023

Gk గ్రూప్ అధినేత శ్రీ కృష్ణారెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తుని ఏరియా ఆస్పత్రి సహకారంతో కాకినాడ జిల్లా తొండంగి మండలం వేమవరం గ్రామంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 30 మంది రక్తదానం చేశారు. రక్తదాతలకు శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో I&V మేనేజ్మెంట్ స్టాఫ్, శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు వెళుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా మరో ముందడుగు వేసింది. అందరూ ఆడాలి..ఆరోగ్యంగా ఉ...
26/12/2023

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు వెళుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా మరో ముందడుగు వేసింది. అందరూ ఆడాలి..ఆరోగ్యంగా ఉండాలి అనే లక్ష్యంతో "ఆడుదాం ఆంధ్రా" అనే క్రీడా పండుగ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ప్రారంభమయ్యింది. గుంటూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. తుని నియోజకవర్గంలో కూడా అన్ని మండలాలు, పట్టణంలో కూడా ఈ క్రీడా సంబరం అట్టహాసంగా ప్రారంభమయ్యింది.. వివిధ క్రీడా విభాగాల్లో తొలిరోజు పోటీలు నిర్వహించారు.

తుని నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి యనమల దివ్య శనివారం పట్టణంలోని 19వ వార్డులో పర్యటించారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో ...
23/12/2023

తుని నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి యనమల దివ్య శనివారం పట్టణంలోని 19వ వార్డులో పర్యటించారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా ఆమె ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆశీర్వాదం పొందారు. అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ముందుకు సాగారు. టీడీపీకి ఓటు వేసి భవిష్యత్తు బంగారు బాట అయ్యేందుకు తోడ్పడాలని కోరారు.

తాండవ నదికి వరదలు వచ్చినప్పుడల్లా ప్రజలకు కష్టాలే. కోటనందూరు వద్ద వంతెన లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడేవారు. వాహనదారులు కూ...
22/12/2023

తాండవ నదికి వరదలు వచ్చినప్పుడల్లా ప్రజలకు కష్టాలే. కోటనందూరు వద్ద వంతెన లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడేవారు. వాహనదారులు కూడా రాకపోకలకు అనేక అవస్థలకు గురయ్యేవారు. అయితే ఇక ఈ కష్టాలు తొలగనున్నాయి. రాష్ట్ర రహదారులు , భవనాలు శాఖ మంత్రి దాడిశెట్టి రాజా కృషితో తాండవ నదిపై త్వరలోనే వంతెన నిర్మాణం జరగనుంది. రూ. పది కోట్లతో కొట్టాం-కోటనందూరు మీదుగా 7/8 కి.మీ వద్ద తాండవ నది పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శుక్రవారం మంత్రి దాడిశెట్టి రాజా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ వంతెన నిర్మాణంతో కోటనందూరు ప్రజలకు వరద కష్టాలు తీరతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటనందూరు మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నాయకుడి మీద ఆకాశమంత అభిమానం ఉంటే అవుట్ పుట్ ఇలానే ఉంటుందేమో?.. ఎవరి మీద అయినా నీకు ఎంత ఇష్టం అంటే ఆకాశమంతా అని చెబుతారు ...
21/12/2023

నాయకుడి మీద ఆకాశమంత అభిమానం ఉంటే అవుట్ పుట్ ఇలానే ఉంటుందేమో?.. ఎవరి మీద అయినా నీకు ఎంత ఇష్టం అంటే ఆకాశమంతా అని చెబుతారు కానీ చూపించలేరు కానీ తుని నియోజకవర్గ వైసీపీ యువ నేత దాడిశెట్టి శ్రీనివాస్ ఆ ఆకాశాన్నే వేదిక చేసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తను పెంచుకున్న అభిమానాన్ని చూపించేశారు. సీఎం జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని అమెరికా గగనతలంపై గ్రాండ్ విషెస్ చెప్పారు.. ఫ్లోరిడా లో ఒక ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆకాశంపై సీఎం జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ హెలికాప్టర్ ఫ్లై చేసి happy birthday CM jagananna from dadisetti srinivas అనే పోస్టర్ ను గగనతలంలో ప్రదర్శించింది...

తుని పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించా...
21/12/2023

తుని పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ముందుగా రామా థియేటర్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పార్టీ మహిళా నాయకులు భారీ కేక్ ను కట్ చేశారు. అక్కడ నుంచి తుని ఏరియా ఆస్పత్రికి వెళ్లి గర్భిణులకు, రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.

" అంగన్వాడీ సిబ్బంది ఆకలి పోరాటం చేస్తున్నారు..తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నారు..ప్రభుత్వం వారికి అండగా ఉండ...
19/12/2023

" అంగన్వాడీ సిబ్బంది ఆకలి పోరాటం చేస్తున్నారు..తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నారు..ప్రభుత్వం వారికి అండగా ఉండాల్సింది పోయి దౌర్జన్యంగా వ్యవహరిస్తోంది.. సచివాలయం సిబ్బందితో బలవంతంగా కేంద్రాలను తెరిపించాలని చూస్తోంది. తాళాలు బద్దలు కొట్టిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి నియంతృత్వ చర్యలు సరికాదు" అని తుని నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి యనమల దివ్య అన్నారు. తునిలో అంగన్వాడీల సమ్మెకు ఆమె మద్దతు తెలిపారు. అంగన్వాడీల నిరసన దీక్షల శిబిరాన్ని మంగళవారం ఆమె సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్వాడీ లు కోరుతున్నారన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. టీడీపీ తరపున వారి ఆందోళనకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి యనమల కృష్ణుడు, టీడీపీ నేత మోతుకూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..

సమస్యలు తెలుసుకునేందుకు తుని నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి యనమల దివ్య జనబాట పట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుక...
18/12/2023

సమస్యలు తెలుసుకునేందుకు తుని నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి యనమల దివ్య జనబాట పట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా యనమల దివ్య సోమవారం తుని పట్టణంలోని 16వ వార్డులో పర్యటించారు. తమ ముంగిటకు వచ్చిన దివ్యకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా హారతులిచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యనమల దివ్య బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలు అందించి టీడీపీ ప్రభుత్వంలో అందించే పథకాలను వివరించారు. అభివృద్ధితో కూడిన నిజమైన సంక్షేమ రాజ్యం చంద్రబాబు తోనే సాధ్యమని దివ్య చెప్పారు..

సీఎంఆర్ షాపింగ్ మాల్ మన తునిలోఉండిపోవడానికే వచ్చింది..ప్రతి రోజూ ఇక్కడే ఉంటుంది...అన్ని రోజుల్లోనూ మోడరన్ డిజైన్లు, ఆఫర్...
18/12/2023

సీఎంఆర్ షాపింగ్ మాల్ మన తునిలో
ఉండిపోవడానికే వచ్చింది..
ప్రతి రోజూ ఇక్కడే ఉంటుంది...
అన్ని రోజుల్లోనూ మోడరన్ డిజైన్లు, ఆఫర్లు ఉంటాయి..
గుంపులో పిల్లలతో కొంతమంది వెళ్లిపోతున్నారు
జాగ్రత్త సుమా!!

తుని పట్టణంలోని పెంటకోటరోడ్డు దారిలో ఉన్న గౌరిదేవి గుడి వీధిలో గౌరీపరమేశ్వరుల నిమజ్జనోత్సవం ఘనంగా జరుగుతోంది.  శక్తి వేష...
16/12/2023

తుని పట్టణంలోని పెంటకోటరోడ్డు దారిలో ఉన్న గౌరిదేవి గుడి వీధిలో గౌరీపరమేశ్వరుల నిమజ్జనోత్సవం ఘనంగా జరుగుతోంది. శక్తి వేషాలు, డప్పు వాయిద్యాలు, బాణ సంచా కాల్పుల నడుమ అమ్మవారిని పట్టణ వీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. అనంతరం గౌరి దేవి గుడి వీధిలో అమ్మవారి ఆలయం వద్ద ఉత్సవం ఘనంగా జరిగింది. వివిధ దేవతా మూర్తుల వేషధారణలు, కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాలతో సంబరం అంబరాన్ని తాకింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాన్ని తిలకించారు.

శీతాకాలంలో ఎవరూ ఇబ్బంది పడకూడదన్న మంచి హృదయంతో తుని పరిసర ప్రాంతాల్లో వైసీపీ యువ నేత దాడిశెట్టి శ్రీనివాస్ మూడు రోజులుగా...
15/12/2023

శీతాకాలంలో ఎవరూ ఇబ్బంది పడకూడదన్న మంచి హృదయంతో తుని పరిసర ప్రాంతాల్లో వైసీపీ యువ నేత దాడిశెట్టి శ్రీనివాస్ మూడు రోజులుగా రగ్గుల పంపిణీ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. తుని పట్టణంలో వందలాది మంది పేదలకు రగ్గులు పంపిణీ చేసిన శ్రీనివాస్ తాజాగా అన్నవరం శాంతివర్ధన విభిన్న ప్రతిభావంతులు ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు కూడా రగ్గులు అందించారు. శుక్రవారం సాయంత్రం ఈ రగ్గుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు దాడిశెట్టి శ్రీనివాస్ సేవానిరతిని కొనియాడారు. చిన్నారుల తరపున ధన్యవాదాలు తెలిపారు..

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణంఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లుపశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువా...
15/12/2023

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం

ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ప్రమాదం..

అక్కడికక్కడే మృతి చెందిన ఎమ్మెల్సీ

ఉపాధ్యాయ ఉద్యమాల్లో కీలక భూమిక పోషించిన సాబ్జీ

ఏళ్ల తరబడి యూటీఎఫ్ కు సేవలు

సంతాపం వ్యక్తం చేసిన ఉపాధ్యాయ సంఘాలు

శరీరంలో కాకుండా ప్రపంచంలోని ఏ ప్రముఖ ప్రయోగశాలలో కూడా తయారు చేయలేని అత్యంత అరుదైన పదార్థం రక్తం. అంత విలువైన పదార్థమైన ర...
14/12/2023

శరీరంలో కాకుండా ప్రపంచంలోని ఏ ప్రముఖ ప్రయోగశాలలో కూడా తయారు చేయలేని అత్యంత అరుదైన పదార్థం రక్తం. అంత విలువైన పదార్థమైన రక్తాన్ని చాలామంది సేవాభావంతో చాలా ఈజీగా దానం చేసేస్తున్నారు. వాళ్ళందరికీ హ్యాట్సాఫ్. కానీ అంతే విలువైన రక్తాన్ని చాలా మంది ఒక్క ఫోన్ కాల్ తో పొందుతున్నారు..అలాంటి వాళ్ళకి మా ప్రశ్న..

"మీరెప్పుడైనా రక్తదానం చేశారా??"

మీరే కాదు బాస్ సాయం పొందుతున్న వారిలో 30 శాతం మంది కూడా రక్తదానం చేయరు. ఒకరి దగ్గర పిండేయడానికి రెడీ అయిపోతున్నారు కానీ మీరు మాత్రం పిండించికోవడంలేదు...ఎవరికైనా రక్తం అవసరం అయితే ఇలాంటి సేవలు అందిస్తున్న వారు వెంటనే గుర్తుకు వస్తారు కానీ మన శరీరంలో ఉంది కూడా ఆ రక్తమే అని మీకు ఎందుకు గుర్తుకు రాదు.. అక్కడ ఏమీ వాటర్ ప్లాంట్స్ లాగా బ్లడ్ ప్లాంట్స్ లేవు లీటర్లు లీటర్లు లాగేయడానికి...వాళ్ళు మాత్రం ఎన్ని సార్లని ఇస్తారు..ఎంత మందికి ఇస్తారు...??

ఎదుట వ్యక్తితో ఎలాంటి బంధం లేకున్నా కొంత మంది ముందుకు వచ్చి రక్తం ఇస్తున్నారు..కానీ బంధం ఉన్న వారు మాత్రం రక్తం అవసరం వస్తే ఆ కొంతమంది కోసమే వెతుకుతున్నారు తప్పితే ముందుకు వచ్చి రక్తం ఇవ్వడం లేదు. ఎవరూ లేని వారు అయితే పర్లేదు.. అందరూ ఉన్న వారు కూడా అలానే చేస్తున్నారు..నాన్నకో, అమ్మకో, భార్యకో కష్టం వచ్చినప్పుడు ఆ సమయంలో మీరే రక్తం ఇవ్వొచ్చు కదా అని ఎవరూ అడగరు.. కానీ ఆ కష్టం తీరినప్పుడు ఒక థాంక్స్ చెప్పి వదిలేయకుండా అన్నా ఈ సారి అవసరం అయితే చెప్పు మేము కూడా ఎవరికైనా రక్తం ఇస్తాం అని చెప్పి ఫోన్ నంబర్ ఇస్తే ఎంత బాగుంటుంది... అలా కాకపోయినా మీ చుట్టుపక్కల వారిలో ప్రేరణ నింపి వాళ్ళ చేత రక్తదానం చేయించినా మీరు పొందిన సాయానికి ఒక సార్థకం ఉంటుంది..
సాయం పొందడం తప్పు కాదు..సాయం చేయకపోవడం తప్పు..బయట చాలా మంది రక్తం ఇస్తున్నారు అంటే వాళ్ళకి ఎక్కువైపోయో, అదొక సరదాయో కాదు..సమాజం మీద వాళ్ళకున్న బాధ్యత. కానీ సాయం పొందుతున్న వారికి ఆ బాధ్యత ఉండడం లేదు. సాయం పొందిన ప్రతి ఇంట్లో కనీసం ఒకరు ఇచ్చినా మన తునిలో రక్త నిల్వల కొరత ఉండదు.

"మీ ఇంట్లో ఆపద వచ్చి ఈ సమయంలో ఎవరైనా సాయం చేస్తే బాగున్ను అని మీరు అనుకున్నప్పుడు..వేరే ఇల్లు ఆపదలో ఉంటే మీరే ఎందుకు సాయపడకూడదు. బాగా ఆలోచించండి బ్రదర్స్.. 🙏🙏

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తూ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవలందిస్తున్న అంగన్వ...
14/12/2023

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తూ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవలందిస్తున్న అంగన్వాడీ సిబ్బందికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి యనమల కృష్ణుడు అన్నారు. తక్షణమే ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. తుని పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు చేస్తున్న అంగన్వాడీ సిబ్బందికి టీడీపీ, జనసేన పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. టీడీపీ నేత యనమల కృష్ణుడు, జనసేన నేత చోడిశెట్టి గణేష్ అధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. అంగన్వాడీ సిబ్బందికి అండగా ఉండి వారి న్యాయమైన డిమాండ్ల సాధనకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం మొండి పట్టుదల విడనాడి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పాల్మాన్ పేట గ్రామానికి చెందిన కంద...
13/12/2023

బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పాల్మాన్ పేట గ్రామానికి చెందిన కందాల కాశిరావు కుటుంబానికి శ్రీ స్ఫూర్తి ఫౌండషన్ ఆర్థిక సాయం చేసింది. ఫౌండేషన్ సహాయనిధి నుంచి 35000/- రూపాయలు అందించింది. శ్రీ యువసేన సతీష్ బుధవారం కాకినాడ న్యూరో స్టార్ హాస్పిటల్ వద్ద ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ స్పూర్తి ఫౌండేషన్ సభ్యులు NSR & KSR, మైలపల్లి అశోక్ , గరికిన నాగార్జున ,ఎరిపిల్లి దేవుడు ,పోలవరపు రాజేష్ , పీర్ల శేషగిరి , పెంకే దుర్గాప్రసాద్ ,కందాల సత్తిబాబు , కుక్కా శ్రీనివాస్ పాల్గొన్నారు.

పేదవాడి కష్టం ఒక్కోసారి కంటికి కనిపించదు.. కానీ మనసును తాకుతుంది.. ఈ కష్ట సమయంలో వాళ్ళు ఎలా ఉన్నారో?? అనే భావన మనసున్న న...
12/12/2023

పేదవాడి కష్టం ఒక్కోసారి కంటికి కనిపించదు.. కానీ మనసును తాకుతుంది.. ఈ కష్ట సమయంలో వాళ్ళు ఎలా ఉన్నారో?? అనే భావన మనసున్న నాయకుడిని కుదురుగా ఉండనివ్వదు. ఏదో ఒక సాయం చేసేలా పురుగొల్పుతుంది. రోడ్ల మీద చలిలో వణుకుతూ రాత్రి పూట నిద్రించే పేదల కష్టాన్ని తలుచుకుని నియోజవర్గ వైసీపీ యువ నేత దాడిశెట్టి శ్రీనివాస్ కదిలిపోయారు. తుని, పాయకరావుపేట ప్రాంతాల్లో ఇలా ఎంత మంది ఉంటే అంత మందికి తక్షణమే రగ్గులు పంపించారు. ఇలా ఎందరికో మంగళవారం రగ్గులు పంపిణీ జరిగింది. కప్పుకోవడానికి చిన్న వస్త్రం కూడా లేని వారు ఆ రగ్గులను చూసి ఎంతో ఆనందించారు. దాడిశెట్టి శ్రీనివాస్ కు మనస్పూర్తిగా కృతఙ్ఞతలు తెలిపారు.

హలో సార్..రక్తం కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కదా.. నాది సేమ్ గ్రూప్ సార్..నేను రక్తం ఇస్తాను. ఆస్పత్రికి బయలుదేర...
12/12/2023

హలో సార్..రక్తం కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కదా.. నాది సేమ్ గ్రూప్ సార్..నేను రక్తం ఇస్తాను. ఆస్పత్రికి బయలుదేరుతున్నా..మీరు కంగారు పడకండి. నేను వచ్చేస్తున్నా...
(కొద్ది సేపటి తర్వాత)

సార్ నేను ఆస్పత్రికి వస్తుంటే పోలీసులు పట్టుకున్నారు సార్.. రూ.2 వేలు చలానా కట్టమంటున్నారు సార్. మీరు ఫోన్ పే చేస్తే వాళ్ళకి కట్టేసి వచ్చి రక్తం ఇస్తా సార్..
(ఇలా ఒకడు)

సార్ నేను వస్తుంటే బండికి పెట్రోల్ అయిపోయింది సార్. నా దగ్గర టైమ్ కి డబ్బులు లేవు సార్.. మీరు ఒక 500 పంపిస్తే వెంటనే వచ్చి రక్తం ఇస్తా సార్..
(ఇలా ఇంకొకడు)

రక్తాన్ని పీల్చుకుని తినే వాటిని రక్త పిశాచులు అంటే ఆపదలో ఉన్నవారిని పీల్చుకుని తినే ఇలాంటి దౌర్భాగ్యులను ఏమనాలి?... చిల్లర పైసలకు ఆశపడి చిల్లర నాకొడుకులు చేసే చెత్త పనులను ఏ పేరుతో పిలవాలి. కష్టాల్లో ఉన్నవారిని నమ్మించి మోసం చేసేవారిని ఏ చెప్పుతో కొట్టాలి.. ఆపదలో ఉన్నారని తెలిసి డబ్బులు లాగి ఆనందం పొందే వాళ్ళని ఏ నోటితో తిట్టాలి. ..వీళ్ళను శాడిస్టులు అని కాకుండా ఇంకేమనాలి??
తుని నుంచి విశాఖపట్నం వరకు జరుగుతున్న చిల్లర దందా ఇది!!

ఈ మధ్య కాలంలో రక్తం అవసరం చాలా ఎక్కువైంది. అనుకోని ప్రమాదాలకు గురైన వారు, గర్భిణులు, వివిధ ఆపరేషన్లు చేయించుకునే వారు..ఇలా ఆపద ఏదైనా రక్తం మాత్రం అవసరం అవుతుంది. ఈ క్రమంలో చాలా మంది ఏమి చేయాలో తెలియక సోషల్ మీడియాలో తమ అవసరాన్ని తెలియజేస్తారు. అలానే బ్లడ్ వాలంటీర్లను ఆశ్రయించి వాళ్ళని సాయం కోరతారు. వాళ్ళు తమ తమ గ్రూపుల్లో ఈ విషయాన్ని పోస్ట్ చేస్తారు. అయితే కొంతమంది ఈ పోస్టులు చూసి అవసరమైన వారికి ఫోన్ చేసి రక్తం ఇస్తామని చెప్పి... వాళ్ల అవసరాన్ని, ఆపదను అడ్డం పెట్టుకుని డబ్బులు అడుక్కుంటున్నారు. మధ్యలో బండి ఆగిపోయిందని, పోలీసులు పట్టుకున్నారని, ఇంకా ఏవేవో కారణాలు చెప్పి డబ్బులు అడుగుతున్నారు. పాపం ఈ మోసం తెలియక రక్తం ఇస్తారనే ఆశతో చాలా మంది డబ్బులు పంపిస్తున్నారు. అయితే కొద్దిసేపటికే వాళ్ల ఫోన్లు స్విచ్ఛాఫ్ అవుతున్నాయి. వాళ్లు వస్తారని రక్తం ఇస్తారని ఇక ఎక్కడా ప్రయత్నం చేయకుండా ఉండి పోతున్నారు. చాలా సేపటికి కానీ తెలియడం లేదు వాళ్ళు డబ్బులు అడుక్కుతినే చిల్లరగాళ్లని... అలా డబ్బులు పోతున్నాయి, అవసరానికి రక్తం అందక సమస్యలు కూడా వస్తున్నాయి. కొన్ని సార్లు అయితే వాళ్ళ కోసం వేచి చూసి చూసి ప్రాణాల మీదకు వస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. తుని నుంచి విశాఖ పట్నం వరకు చాలా మంది ఆకతాయిలు ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నారు. చార్జీలకు డబ్బులు అడిగే వారు ఉన్నారు, ఆఖరికి భోజనానికి అని చెప్పి డబ్బులు దండుకుని మోసం చేసే వారు ఉన్నారు..తమ అవసరాల కోసం ఆపదను ఒక అవకాశంగా, డబ్బులు సంపాదించే మార్గంగా ఎంచుకుంటున్నారు. డబ్బులు పంపిన తర్వాత పరారై పోతున్నారు. వీళ్ళకి బంధాలతో, బంధుత్వాలతో పని లేదు. మానవత్వం వీళ్ళకి మచ్చుకైనా లేదు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు. ఎదుటివాడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఏం ప్రమాదంలో ఉన్నాడు అనేది వీళ్ళకి అవసరం లేదు.. సమాజానికి వీళ్ళు చీడే కాదు వదిలించుకోవలసిన పీడ కూడా .. ఇకపై ఇలాంటి వారిపై పోలీసు అధికారులు నిఘా ఉంచాలి. కొంతమందినైనా పట్టుకుని తగిన గుణపాఠం చెబితే ఇంకొకరు ఇలాంటి పని చేయడానికి భయపడతారు.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నాం...

11/12/2023

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర లో భాగంగా తుని విచ్చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనతో ఫొటో దిగేందుకు అభిమానులు, కార్యకర్తలు పోటీ పడ్డారు. భారీ క్యూ లైన్ లో నిల్చుని మరీ తమ అభిమాన నాయకుడితో ఫొటో దిగారు. నారా లోకేశ్ ఓపిగ్గా అందరితో చిరునవ్వుతో ఫొటో తీయించుకున్నారు..

నారా లోకేశ్ యువగళం పాదయాత్రను 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం ఆయన ప...
11/12/2023

నారా లోకేశ్ యువగళం పాదయాత్రను 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం ఆయన పైలాన్ ను ఆవిష్కరించారు. తేటగుంటలో యనమల అతిథి గృహం సమీప ప్రాంగణంలో ఈ పైలాన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ ముఖ్య నేతలు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా, నిమ్మల రామానాయుడు, జ్యోతుల నెహ్రూ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యకర్తల కేరింతల మధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ పైలాన్ ను ఆవిష్కరించారు. నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

నారా లోకేశ్ యువగళం పాదయాత్రను 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం ఆయన ప...
11/12/2023

నారా లోకేశ్ యువగళం పాదయాత్రను 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం ఆయన పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. తేటగుంటలో యనమల అతిథి గృహం సమీప ప్రాంగణంలో ఈ పైలాన్ ను ఏర్పాటు చేశారు. టీడీపీ ముఖ్య నేతలు, వేలాది మంది కార్యకర్తలు మధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉదయం 8 గంటల తర్వాత ఈ పైలాన్ ను ఆవిష్కరించనున్నారు..

యువగళం పాదయాత్రలో భాగంగా తుని నియోజకవర్గంలో పర్యటిస్తున్న నారా లోకేశ్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా హారతుల...
10/12/2023

యువగళం పాదయాత్రలో భాగంగా తుని నియోజకవర్గంలో పర్యటిస్తున్న నారా లోకేశ్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా హారతులిచ్చి స్వాగతం పలుకుతున్నారు. పెద్దలకు ఆప్యాయంగా అభివాదం చేస్తూ, యువకులను ఉత్సాహంగా పలకరిస్తూ, ముసి ముసి నవ్వుల చిన్నారులను ప్రేమగా ముద్దాడుతూ ముందుకు సాగిపోతున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్....

తుని నియోజవర్గం పెరుమాళ్లపురంలో జగనన్న గుంతల పథకంలో భారీ గోతులు ఏర్పడ్డాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎ...
09/12/2023

తుని నియోజవర్గం పెరుమాళ్లపురంలో జగనన్న గుంతల పథకంలో భారీ గోతులు ఏర్పడ్డాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక రాష్ట్రం మొత్తమ్మీద ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని ఆయన అన్నారు. యువగళం పాదయాత్ర లో భాగంగా శనివారం తొండంగి మండలం పెరుమాళ్ళపురంలో పర్యటించిన లోకేశ్ గుంతలు పడిన రోడ్లను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లకు వివిధ విభాగాల ద్వారా రూ.2లక్షల కోట్లకు పైగా బకాయిలు పెట్టడంతో ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా రోడ్లు వేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితిని స్థానిక మంత్రి పట్టించుకోవాలని హితవు పలికారు.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when TUNI News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share