Today India

Today India Truth

04/02/2024

అమ్మ -నేను- కొంతమంది అమెరికా అమ్మాయిలు !

అది.. అతి నాగరిక దేశం !
కొంగొత్త పోకడలతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి... మానవ జాతి విలుప్తానికి శాయశక్తులా కృషి చేస్తోంది !

అమెరికాలో పెళ్లి కాని ప్రసాద్ లు !

పెళ్ళీడొచ్చినా పెళ్లి చేసుకోని పురుషులు ఎంత మందో తెలుసా ?
ప్రతి ముగ్గురిలో ఇద్దరు .
వీరు సింగల్ గానే వుంటున్నారు .

మరి పెళ్లికాని స్త్రీలు?
ప్రతి ముగ్గురిలో ఒకరు .

అదేంటి స్త్రీల శాతం తక్కువ ఉంది అనుకొంటున్నారా ?

స్త్రీ తన పిల్లలతో ఉంటోంది . పెళ్లి కాకుండా పిల్లలేంటి అనుకొంటున్నారా ? ఎక్కడున్నారండీ మీరు !

అమెరికా లో కేవలం స్త్రీ తన పిల్లలు ఉన్న కుటుంబాల సంఖ్య{ సింగల్ మదర్ ఫ్యామిలీస్ } ఒక కోటి యాభై లక్షలు .

అంటే మొత్తం కుటుంబాల్లో నాలుగో వంతు సింగల్ మదర్ ఫ్యామిలీస్ .

అదేంటండీ ? మొగుడి ఆగడాలను భరిస్తూ స్త్రీ సంసారం చెయ్యాలా ? విధి లేని పరిస్థితుల్లో మహిళ భర్త నుంచి వేరుపడి పిల్లల్ని పెంచి పెద్ద చెయ్య లేదా ? అని అనుకొంటున్నారా ?
నిజమే . విధి లేని పరిస్థితుల్లో వేరుపడడం న్యాయం . అలాగే రేప్ లాంటి అఘాయిత్యాలకు బలై పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్న మహిళలు ఉన్నారు. వారికి వందనం .

కానీ .. ఈ నంబర్స్ చూడండి .

పెళ్లి కాకుండానే పిల్లలకు జన్మనిస్తున్న మహిళల సంఖ్య నలబై శాతం .
అంటే ఏంటి ?

సెక్స్ ఒక శారీరిక వాంఛ అని ఆ సమాజం తలపోస్తోంది . పెళ్లి అనేది ఒక సామజిక వ్యవస్థ అనే విషయాన్ని సమాజం నాగరికత పేరుతొ మరచిపోతోంది .

ఎక్కడో ఆఫ్టర్ పబ్... నిసీది లో కలవడం . లేదా నాలుగు నెలలు లివ్ ఇన్. అటు పై బ్రేక్ అప్ . పుట్టిన పిల్లలకు తండ్రి ఉండరు.

ఏ మాటకామాటే చెప్పుకోవాలి .
అమెరికా లో అయినా... అమ్మ అమ్మే .
పుట్టిన పిల్లల్ని వీధిలో వదిలేయకుండా పెంచి పెద్ద చేస్తున్నారు .

మరి ఆ మగాడు?

దొరికితే ఇంకో స్త్రీ .. టెస్టరోస్టోన్ ఉన్నంత కాలం కొంతమంది అమెరికా అమ్మాయిలు .. లేదా దగ్గర్లోనే ఉన్న బ్రెజిల్ లాంటి దేశాలకు పొతే పనై పోతుంది . డాలర్ శక్తివంతమయినది కదా !

మరి వృద్ధాప్యం లో పురుషుడి గతి ?

భార్య లేదు . పిల్లలు లేరు . తల్లితండ్రి ఎప్పుడో పోయి వుంటారు . మరి సింగల్ గా బతుకుట్టెట్లా?
అథోగతి !

అమ్మ నాన్న ఉంటేనే కుటుంబం .

మరి అమెరికా లో కోటిన్నర కుటుంబాలు సింగల్ మదర్ ఫామిలీస్ కదా ! ఇలాంటి కుటుంబాల్లో పుట్టిన పిల్లలకు సమస్యలు రావా ?

ఇందాకే చెప్పినట్టు మినహాయింపులు ఉంటాయి . అమ్మ నాన్న అన్ని తానే అయ్యి సాకే తల్లులుంటారు .
కానీ నాగరికత పేరుతొ ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా నడిస్తే ..

ఒంటరి జీవనం మానసిక కుంగుబాటుకు ... ఒత్తడికి... ఇంకా రకరకాలైన మానసిక సమస్యలకు దారి తీస్తుంది . అదే విధంగా సింగల్ మదర్ లేదా సింగల్ ఫాదర్ ఫ్యామిలీస్ లో పెరిగిన పిల్లలకు అనేక భావోద్వేగ సమస్యలొస్తాయి .

ఈ డేటా చూడండి .
గత సంవత్సరం అమెరికా లో తుపాకి మరణాలు ఎంతో తెలుసా ?
నలబై వేలు .

ఈ సంవత్సరం మొదటి నాలుగు రోజుల్లో నాలుగు వందలు .
ఒంటరి తనం .. మద్యం ,, గంజాయి , డ్రగ్స్ .. మానసిక రుగ్మతలు .. హింసోన్మాదం ,, ఆత్మ హత్యలు .. హత్యలు .. ఇవన్నీ కవలలు .

మనిషి ఎంత నాగరికుడయినా సృష్టి నియమాలకు వ్యతిరేకంగా పయనించలేడు.
అమెరికా దారిలో మొత్తం మానవాళి పయనిస్తే మానవ జాతి డైనోసార్ లలాగా విలుప్తం ఖాయం .

{
ఒక మాట చెప్పనా .
జనాల ఇలా ఉన్నారు కాబట్టే ఎవడికివాడు దోచేస్తున్నారు .. మోసాలకు అంతులేదు . సెర్వికల్ కాన్సర్ అనే ఒక్క టాపిక్ ను రెండు రోజులు తవ్వితే బంగాళా ఖాతం ఒడ్డున ఉన్న ఇసుకంత చెత్త బయటపడింది . సిలికాన్ ముట్టు పరికరాలు .. దాన్ని ఉపయోగించే విధానం తెలియని మహిళలు . ముట్టు పాడ్స్ లో కాన్సర్ కారక రసాయనాలతో చేసిన జెల్ .. గర్భం రాకుండా తినే మాత్రలు . ఇది కాకుండా మద్యం .. లేత వయసు సంభోగాలు .. అబార్షన్ లు .. వీటి గురించి ఎవరూ మాట్లాడరు. చెబితే ముట్టు బట్టల బిజినెస్ వాడు ఊరుకోడు. పూనమ్మ కాల్ డేటా తీస్తే మరణం డ్రామా వెనుక పూణే గాడి ప్రమేయం ఎంతవుందో తెలుసుకోవడం పోలీస్ లకు చిటికలో పని . ఆలా చెయ్యమని ఎవరూ అడగరు . "పోనీలే ఏదో పబ్లిసిటీ స్టంట్ చేసింది . అయినా సెర్వికల్ కాన్సర్ గురించి జనాల్లో చైతన్యం తెచ్చింది" అని సర్దుకొంటున్నారు . సెర్వికల్ కాన్సర్ గురించి అవగాహన అంటే వీరి దృష్టిలో వాక్ సీన్ గుచ్చుకోవడం.. అదీ నేటి సమాజం. విసుగొస్తుంది .. ).

లాల్ కృష్ణ అద్వానీ గారికి  #భారతరత్న అవార్డు  ప్రకటించిన సందర్భం లొ     గారికి శుభాకంక్షలు
03/02/2024

లాల్ కృష్ణ అద్వానీ గారికి #భారతరత్న అవార్డు ప్రకటించిన సందర్భం లొ గారికి శుభాకంక్షలు

ఆధారాలతో
02/02/2024

ఆధారాలతో

01/02/2024

ఢిల్లీ డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేయగలిగారు !

ఝార్ఖండ్ సీఎంని కూడా అరెస్ట్ చేయగలిగారు !!

కానీ...
దేశం కోసం ధర్మం కోసం అనుకుంట... అవినాష్ రెడ్డిని మాత్రం అరెస్ట్ చేయలేకపోతున్నారు !!

46 వేల కోట్ల రూపాయలు ఈడి జప్తు చేసిన కేసుల విచారణ విషయంలో ఈడి ,సిబిఐ న్యాయస్థానాల్లో ఒక్క అడుగు ముందుకు 10 సంవత్సరాలు పైగా ఒక్కడు ముందుకి పడకపోవడం దాని వెనుక ఉన్న రాములవారి అభిమాన పాలకులు హస్తము ఏ స్థాయిలో ఉందో ఆ రాముడికి ఎరుక!

01/02/2024

నువ్వు నెలకో నాలుగైదు లక్షలు సంపాదిస్తే తప్ప, నువ్వు మామూలుగా ఓ మాటంటే సర్దుకుపోరు.నీకో range ఉంటే తప్ప, నువ్వు Function...
01/02/2024

నువ్వు నెలకో నాలుగైదు లక్షలు సంపాదిస్తే తప్ప, నువ్వు మామూలుగా ఓ మాటంటే సర్దుకుపోరు.

నీకో range ఉంటే తప్ప, నువ్వు Functions కి attend అవకపోయినా, Calls answer చేయకపోయినా బంధువులు Ego కి పోరు.

నువ్వు ఎదగడం ఇష్టంలేని సొంతవాళ్లు, నువ్వొక star అయిపోతే, "నా" అని గొప్పలుపడటానికి అపుడు నామోషీ లేదు.

మనం మినిమం కోటీస్వరులం అయితే తప్ప మన గురించి ఆలోచించరు.. ఒోన్ చేసుకోరు

నీ ఆర్థికస్థోమతను బట్టి, నీ పిల్లలపెంపకాన్ని judge చేయాలా వద్దా decide చేస్తారు.

నువ్వొక star అయితే, నీ personal విషాధాల్లోనూ నీ తప్పుల్ని వెతికి, అది మర్చిపోవటానికి నువ్వు చచ్చీ చెడీ అంతకుమించిన success తెచ్చుకుంటే తప్ప, నిన్ను judge చేయకుండా ఉండరు.

మినిమం Gold medal కొడితే తప్ప, నీకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కులేదు.

నీ స్థాయిని బట్టి, నువ్వెట్లా బతకాలో కూడా నిర్ణయం సమాజానిదే.

స్వతంత్ర భారతం!!
శుభోదయం!!

1990 పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయ నా...
29/01/2024

1990 పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తుంది.

రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్స్ వారి ఆలోచనలు వారి ప్రణాళికలు తమ స్వార్ధ ఆర్థిక ఎదుగుదలకు అనుకూలంగా మారింది అన్నట్టు వాస్తవ దేశ ఆర్థిక ప్రపంచం కనపడుతుంది.

అధికారద దాహం స్వార్థ రాజకీయ ప్రయోజనాలు అందులో భాగంగా అవినీతి కి బానిసలుగా బ్రతుకుతున్న దేశ నాయకత్వ వ్యవస్థ మరియు కొద్దిమంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు కలగలిపి బ్యూరోక్రాట్స్ వారికి ఆర్థిక అవినీతిలో భాగం పంచుతూ మొత్తంగా దేశ జిడిపి లేదా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి గండి కొట్టి వారి వ్యక్తిగత ఆర్థిక ఎదుగుదలె దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలగా మసిపూసి మారేడు కాయ చందల్లా ప్రజలకు మా‌ మాయ కబుర్లు చెబుతూ చెబుతూ ప్రజలను కూడా వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల వైపుగా బానిసలు చేస్తూ సంక్షేమ పథకాల పేరుతో పైసలు వెదజల్లుతూ కోట్ల రూపాయలు దేశ ఆర్థిక వనరులు మరియు సహజ సంపదలు దోచుకుంటున్నా రాజకీయ ,పారిశ్రామిక ,బ్యూరోక్రాట్స్ అధికార గణం ..

ఈ దేశ ఆర్థిక ప్రగతిని సంవూలంగా సంపూర్ణంగా దిగజార్చు దిగజార్చింది అనటంలో సందేహం లేదు ఆలోచించండి.
......వెంకటా సత్యాజి పరిమి.

28/01/2024
భూ హక్కు చట్టం అంటే ఏమిటి?కంటెంట్ written by  #ఏలూరిగోపాలకృష్ణ,  అడ్వకేట్ కొవ్వూరు.  కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం ...
06/12/2023

భూ హక్కు చట్టం అంటే ఏమిటి?

కంటెంట్ written by
#ఏలూరిగోపాలకృష్ణ, అడ్వకేట్ కొవ్వూరు.

కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా వెలుగులోకి తెచ్చిన చీకటి చట్టం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను న్యాయవాదులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

అక్టోబర్ 31 2023 నుంచి అమలులోకి వచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ హక్కు చట్టం ప్రకారం ఎటువంటి అర్హత అనుభవం లేని రాష్ట్ర ప్రభుత్వం చే నియమించబడు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ నమోదు చేసే హక్కు రిజిస్టర్ లో ఒక్కసారి భూహక్కుదారుడు పేరు నమోదైన తర్వాత ఈ భూములు పై ఎవరూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు.
ఎవరైనా అభ్యంతరాలు ఉంటే జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో జిల్లాస్థాయిలో ఏర్పాటు చేయబోవు రెవెన్యూ ట్రిబునల్స్ లోనే తేల్చుకోవలసి ఉంటుంది. అంతేతప్ప కోర్టుకు వెళ్లడానికి వీలు లేదు. రెవెన్యూ ట్రిబునల్స్ నందు కేసు దాఖలు చేయాలనుకుంటే టైటిలింగ్ ఆఫీసర్ నమోదు చేసిన వివరాలను రెండు సంవత్సరముల లోపే దాఖలు చేయవలసి ఉంటుంది. సదరు ఎంట్రీస్ ఆన్లైన్లో లభించవు మరియు ఈ చట్టంలో సదరు ఎంట్రీస్ ఎప్పుడు ఎవరి పేరుతో నమోదైనవి వివరాలు పొందుపరచలేదు.

ఉదాహరణ: ఒక సర్వే నంబర్లో A అను అతనికి 4 ఎకరాల్లో భూమి ఉంది అనుకుందాం. ఈ చట్టం ద్వారా ఎటువంటి అనుభవము బాధ్యత లేని టైటిలింగ్ ఆఫీసర్ B పేరు మీద మూడు ఎకరములు నమోదు చేసినారు అనుకుందాం. సదరు చట్టం లో పారదర్శకత లేనందువలన మరియు సదరు రిజిస్టర్ ఆన్లైన్లో లభ్యo కానందువలన A కు సంబంధించిన ఆస్తిని B పేరు నమోదు చేసినందున A కు సదరు విషయం తెలియదు. రెండు సంవత్సరాల తర్వాత ఈ విషయం తెలుసుకొని A కేసు దాఖలు చేయాలనుకున్న దాఖలు చేయుటకు అవకాశం లేదు. దానివల్ల A తీవ్రంగా నష్టపోతాడు.

రెవెన్యూ ట్రిబునల్స్ ఇచ్చిన జడ్జిమెంట్ మీద 15 రోజుల లోపల రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేయబోవు ట్రిబునల్స్ లోనే కేసు దాఖలు చేయవలసి ఉంటుంది. సదరు ట్రిబునల్స్ ఇచ్చిన తీర్పు పై హైకోర్టులో మాత్రమే అప్పీలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఒకవేళ ట్రిబ్యునల్ తీర్పుపై ఎవరు అప్పీలు దాఖలు చేయకపోయినా రెండు సంవత్సరముల లోపల ట్రిబ్యునల్ లో కేసు వేయకపోయినా సదురు ఆస్తిపై హక్కు ఉండదు. ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్లిన ఆ కేసులను కోర్టు ట్రిబ్యునల్ కు పంపుతాయి. కోర్టులకు ప్రత్యామ్నాయ సమాంతర అధికారాలు ఉండవు. ఒకవేళ హక్కుదారుడు మరణించిన ఎడల వారసులు దరఖాస్తు చేసుకొనవచ్చును. అప్పుడు మరణించిన భూహక్కుదారుడి పేరును వారసులపేరుతో భర్తీ చేసే అధికారం ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్కే ఉంటుంది. అందువల్ల అసలు హక్కు దారులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది.

గౌరవ సుప్రీంకోర్టు వారు పలు సందర్భాలలో రెవిన్యూ రికార్డుల్లో పేరు నమోదయినంత మాత్రాన ఆస్తి మీద అతను భూ యజమాని కాదని రెవెన్యూ రికార్డులు యాజమాన్య హక్కులకు సాక్ష్యముగా పనికిరావని స్పష్టం చేసింది. ఎందుకంటే అవన్నీ శిస్తు వసూలు చేయడానికి బ్రిటిష్ వారు నుంచి వ్రాసిన లెక్కలు పుస్తకాలు. అందులో పన్ను ఎంత కట్టాలో ఉంటుంది తప్ప ఆ భూమి మీద ఎవరికి హక్కు ఉంటుంది అని చెప్పలేదు. ఈ చట్టం అమలులోకి వచ్చినట్లయితే భారత పౌరుని యొక్క రైట్ టు ప్రాపర్టీ హక్కుకే విధానం కలిగే అవకాశం ఉన్నది.
న్యాయ పరిధిలోని అంశాలపై న్యాయస్థానంలో విచారణ చేయకుండా రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండే విధంగా ఉన్నది. అందువలన ఈ చట్టాన్ని సవరించవలసినదిగా న్యాయవాదులు పోరాటం చేస్తున్నారు.

ఈ చీకటి చట్టం గురించి న్యాయవాదులు చేస్తున్నటువంటి న్యాయపరమైన పోరాటములకు ప్రజలు సహకరించవలసినదిగా కోరడమైనది

1.కులం ,2.మతం, 3.ప్రాంతీయత ,4.మనీ మరియు 5.అవినీతిపరులైన బ్యూరోక్రాట్స్ ఈ దేశ ప్రజాస్వామ్యానికి  హానికరమైన పంచభూతాలు వీరు
29/11/2023

1.కులం ,2.మతం, 3.ప్రాంతీయత ,4.మనీ మరియు 5.అవినీతిపరులైన బ్యూరోక్రాట్స్ ఈ దేశ ప్రజాస్వామ్యానికి హానికరమైన పంచభూతాలు వీరు

AP చేసిన పెద్ద తప్పు .. ఇదే. Once chance effect .
23/11/2023

AP చేసిన పెద్ద తప్పు .. ఇదే. Once chance effect .

ఎన్నాళ్ళు ఉన్నచోటే ఉంటావ్.. పోరాడు. నీ అలవాట్లలో, నీ స్వభావంలో, నీ ఖర్చులో సమయానికి తగ్గట్లు ఉండాలి. జీవితంలో పోటీ ఉండాల...
21/11/2023

ఎన్నాళ్ళు ఉన్నచోటే ఉంటావ్.. పోరాడు. నీ అలవాట్లలో, నీ స్వభావంలో, నీ ఖర్చులో సమయానికి తగ్గట్లు ఉండాలి.

జీవితంలో పోటీ ఉండాలి. ఎవరెస్ట్ అధిగమించే సాహసం ఉండాలి. మడి కట్టుకొని నీతి నిజాయితీ అంటే ఇటు ఎదగడం అవ్వదు, అటు సర్వం కొల్పోతావ్.

పోటీ పడు. నీలో ఉన్న శక్తి నీకు తెలుస్తుంది. భయపడితే భయపెట్టే లోకం కాదు ఇది. ఎదిరించి నిలబడితే భయపడే లోకం. భయానికి ఎదురుగా నిలబడే ధైర్యం నీలో ఉంటే భయమే భయంతో పారిపోతుంది. పిరికితనంతో ఎన్నాళ్ళు బ్రతుకుతావ్.. అందరూ ఏదో రకంగా తొక్కే వాళ్ళే ఉన్నారిక్కడ. భయపడుతుంటే చీమ కూడా ఏనుగులా కనిపిస్తుంది. .

19/11/2023

*దేశం గెలవాల్సింది...*
*స్టేడియాల్లో కాదు...*
*పచ్చని పొలాల్లో...*

🌱🍅🌰🍠🥔🌶🌽🍆

వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందేమోనని భయపడే
దేశ భక్తులారా....
ఈవిషయాలపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా....
ఒక్కసారి ఆలోచించండి...

దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్
పట్టించుకుంటున్నావా.......

🍅🍅🍅

ఇష్టమయిన క్రికేటరెవరో
వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు,
నీకు తెలిసిన రైతు ఎవరైనా
వంద బస్తాలు పండించాలని
ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా.....

🍏🍏🍏

రెండు గంటలు బ్యాటు పట్టుకోని ఆడినతను గాడ్ అయితే
నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్న కే పేరు పెడుతావ్ ?....

🌽🌽🌽

దేశాన్ని గెలిపించడానికి
కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే ,
టెన్షన్ పడి గొంతు తడుపుకుంటావ్.
దేశాన్ని బతికించే
నదులు చెరువులు కొన్ని మాత్రమే నీళ్ళతో ఉన్నాయ్
అనే ఆందోళన నీకుందా ?...

🌶🌶🌶

నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్ళను
నీకు ఇష్టమయిన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావ్
నిన్ను బతికించే రైతులకెవరూ
ఎంకరేజ్ చెయ్యడం లేదని తెలుసా....

🥕🥕🥕

నీకు ఏ స్టేడియం లో పిచ్ ఎలా ఉంటదో తెలుసు కానీ
నీ ఊరిలో మార్కెట్టు యార్డు అసలెక్కడుందో
ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా......

🍆🍆🍆

అన్నం తింటూ కూడా ..
పాకిస్తానీ టీం ని దేశం లో రానియ్యాల వద్దా అని
నీకు తెలిసిన గొప్పలు ప్రదర్శిస్తావ్ .
అసలు నీ చేతిలో ఉన్నది స్వదేశి బియ్యమో
విదేశి దిగుమతి బియ్యమో తెలుసా.....

🍋🍋🍋

ఇండియన్ క్రికేట్ బోర్డో , క్రికేట్ టీమో
చేసే తప్పోప్పులన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటావ్
వ్యవసాయానికి పెట్టింది పేరయినా దేశం లో
ప్రభుత్వాలు చేసే తప్పోప్పుల్ని
అసలెప్పుడయినా పట్టించుకున్నావా.....

🍠🍠🍠

ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేసారో తెలిసిన
నీకు
రోజెక్కడెక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారొ తెలుసా ....

🥒🥒🥒

🍍🍍🍍

ఎప్పుడయినా ,
గిట్టు బాటు ధరలకోసమో ,విద్యుత్తుకోసమో పోరాటం చేస్తూ
లాఠీ దెబ్బలు తింటూ పరిగెత్తే రైతన్నలను బాధలను చూసావా.....

🍇🍇🍇

ఏ దేశం బౌలరు ఎలా బాల్ వేస్తాడో తెలిసిన నీకు
రాజ్యం , దళారీలు ఎలా రైతులను మోసం చేస్తున్నారో ఏనాడైనా ఆలోచించావా.

🍈🍈🍈

కామెంట్రీలు వింటూ టీవి లకు అతుక్కు పోయినట్లు
రైతుల గురించి చర్చా కార్యక్రమాలు ఏనాడైనాచూసావా... ?

🥜🥜
🍊🍊🍊

పది మంది ఆడే ఆటకోసం లక్షల మంది ఒక్కటౌతున్నాం
కోట్లమంది ఆకలి తీర్చే రైతుల కోసం ఏం చేస్తున్నాం....

🌿🌿
🐓🐓🐓

ఇండియా గెలవాల్సింది స్టేడియాల్లో కాదు
పచ్చని పోలాల్లో ....
అందుకు
రైతులు నాటౌట్ గా నిలవాలి...🙏💐🌾🎋

స్థలాలు లేదా ఇల్లు కొని లేదా అమ్మినప్పుడు  ,   నమ్మకంగా మన పక్కనే ఉండే వాళ్ళు చేసే మోసాలు.చాలా మంది తెలియక మోసపోతూ ఉంటార...
23/10/2023

స్థలాలు లేదా ఇల్లు కొని లేదా అమ్మినప్పుడు , నమ్మకంగా మన పక్కనే ఉండే వాళ్ళు చేసే మోసాలు.చాలా మంది తెలియక మోసపోతూ ఉంటారు వారికోసం ఇది. ( కొంత మంది మాత్రమే )

%%%% ముందుగా Brokers చేసే మోసాలు %%%%%
1) స్థలం కొనేటప్పుడు తప్పుడు వివరాలు ఇస్తారు.100% వాళ్ళ మాటలు నమ్మవద్దు.సంపాదించడం చేతకాని వాళ్ళు ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి సంపాదిస్తారు.ఎంగిలి మెతుకులు కోసం ఆశ పడే వారు ( కొంత మంది కి మాత్రమే )

2) 2% Broker Commision తీసుకుంటారు.బేరం మాట్లాడేటప్పుడు ఎక్కువ Brokers వస్తారు.మనలని రెచ్చ కొట్టి ఎక్కువ రేట్ కి కొనే విధముగా చేస్తారు.

3) నిజ యజమానిని తీసుకురాకుండా నకిలీ వాళ్ళని తీసుకొచ్చి బేరం చేస్తారు.

4) ఆస్తి ఎవరి పేరు మీద ఉందొ తెలుసుకోవాలి అంటే office లో తెస్తే తెలుస్తుంది.300 అవుతుంది EC కి.

5) కొనే ముందు original ( Original document ) లో ఉండే యజమాని photo చూడండి. అన్ని links documents history చూడాలి.

6) ఎట్టి పరిస్థితుల్లో agreement ( ) min 3months ఉండేలా చూడండి.మీ దగ్గర డబ్బు ఉన్న 3 Months తక్కువ వెయ్యవద్దు.ఈ రోజు ఏమి జరుగుతుందో తెలియదు.Agreement amount 5 -10% కన్నా ఎక్కువ ఇవ్వవద్దు. cancel చేస్తే తిరిగి ఇవ్వకుండా బాగా తిప్పుకుంటారు.

7) మీ సొంత మనుషులు,మీ స్నేహితులు చెప్పే మాటలు నమ్మవద్దు.వల్లే కోసం కకృతి పడతారు.

8.) A,B brokers ఉన్నారు అనుకుందాం. A broker నీకు తెలుసు, వీడు B broker దగ్గరకి బేరం కోసం తీసుకొని వెళ్తాడు.యజమాని B broker కి Agrement వేసాడు అని అబద్ధం చెపుతారు.స్థలం రేట్ 1Lakh అనుకుందాం,స్థలం యజమానికి తో ఈ Brokers 1Lakh కన్నా ఎక్కువ వస్తే మేము తీసుకుంటాము అని deal చేసుకుంటారు. అప్పుడు B broker 1,10,000 కి కొనే వారి దగ్గర బేరం కుదుర్చుకుంటాడు.

9) ఎట్టి పరిస్థితుల్లో బేరం మాట్లాడే తప్పుడు నిజమైన యజమానితోనే మాట్లాడండి.ఈ Brokers యజమాని busy గా ఉన్నాడు,వేరే దేశాలలో ఉన్నాడు అని అబద్దాలు చెపుతారు.కనీసం video call లో ఇన మాట్లాడండి. యజమాని ఏదయినా ID proof చూపించమనాలి.

10) మీరు కొనే స్థలం,వాటి డాకుమెంట్స్ నిజమో కాదో తెలుసుకోండి.ఎక్కడో ఉన్న స్థలం డాకుమెంట్స్ తో మంచి Area లో ఉన్న స్థలం చూపించి మోసం చేస్తారు.మీరు అనుకున్న స్థలం orginal స్థలాలు వేరుగా ఉంటాయి.

11) Original స్థలం size, Document స్థలం size లో తేడాలు ఉంటాయి.

required for Property
1) Main Owner Sale Deed document original, ఒరిజినల్ పేపర్స్ మీద stamp చూడాలి.
2) All Linked Documents
3) అన్ని డాకుమెంట్స్ లో కొనేవారు, అమ్మేవారు ఒక్కరు కాకపోతే అమ్మేవాడి Family tree certificate ( తండ్రి చనిపోతే పిల్లలు స్థలం ఆమ్మితె లేదా వరాసత్వముగా వచ్చే ఆస్తి ఐతే)
4) Documents front page లో ఏదయినా court seal, sign ఉంటే property మీద case ఉన్నది అని అర్థం.
5) EC - Encumbrance certificate (EC)
6) deed certificate
7) - Record of Rights, Tenancy and Crops (For Agriculture Land)
8.) Survey Sketch
9) Approval
10) Certificate
11) certificate ( agriculture to Non-Agriculture land conversion)
12) Tax Certificate

13) SC, ST సోదరులకు ప్రభుత్వామ్ ఉచితముగా స్థలాలు ఇచ్చినది.అటువంటి స్థలాలు కొన్న మళ్ళీ వారికే వెళ్తాయి, రిజిస్ట్రేషన్ చెల్లదు.
14) పేద వారికి ప్రభుత్వామ్ ఉచితముగా స్థలాలు ఇచ్చినది,అటువంటి స్థలాలు కొనకూడదు.
14) ఐతే plan approval, OC, CC ఉండాలి. 3Floors కి plan approval తీసుకొని 4 or 5 floors కడతారు.వాళ్ళు బ్యాంక్ వాడితో link పెట్టుకొని మీ లోన్ easy గా చేపిస్తారు resale అప్పుడు problem అవుతుంది.

15) మనతో మంచిగా నటిస్తూ మనం అనుకునే మాటలని brokers చెప్తూ తీసుకుంటారు. వాళ్ళతో జాగ్రత్త.

16) స్థలం కాగితాల copys ఎట్టి పరిస్థితులలో ఎవరికి ఇవ్వకండి. ఆ copy ఇతరుల దగ్గర ఉండటం వల్ల మనకి చెడు చేసే అవకాశం ఎక్కువ.

17) ఇల్లు కట్టి ఉంటే ఉండాలి.

18) Agrement రోజు, ముందు రోజు EC తీయండి. కొంత మంది వేరే వాళ్ళకి అమ్మి మన దగ్గర Agrement వేస్తారు. EC లో స్థల యజమాని ఎవరో , ఎప్పుడు కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు ఉంటాయి.

19) ఆ ల్యాండ్ పైన ఎమైనా విద్యుత్ lines ఉన్నాయా, ల్యాండ్ క్రింద ఎమైనా ఉన్నదా. govt ప్రజా అవసరాలకు తీసుకుంటున్న కోనకూడదు.

20) ఇప్పుడు Online Registration process ఉన్నది. 15Years back online లేదు ఆ time లో ఒకే property ని ఎక్కువ మంది పేరుతో రిజిస్టర్ చేశారు మోసం చేసి.

21) మీరే నెను కింద ఇచ్చిన గవర్నమెంట్ వెబ్ సైట్ లో స్వయంగా మీరే చూసి తెలుసుకోండి. మీరు కోనాలనుకున్న, లేదా కోనుకున్న స్థలం, ప్లాట్ భూమి ఎదైనా కావచ్చు. దానికి సంబంధిత ఈసి, అది ప్రబుత్వ స్థలమా పోరంబోకు స్థలమా పట్టా ఉన్న స్థలమా అనేవి ఇందులో పోందుపరచిఉంటాయి. మీ ప్లాట్, భూమి కి సంబంధిత రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోవచ్చు లింక్ డాక్యుమెంట్స్ తో సహా. మీ ప్లాట్ కోలతలు హద్దులు ఎవరి నుంచి ఎవరికి హక్కుగా సంక్రమించింది తదితర వివరాలు ప్రింటుతో సహా ఉచితంగా తిసుకోవచ్చు. మీరుకోనే భూమి, ప్లాట్ రిజిస్ట్రేషన్ విలువ ఎంత తదితర వివరాలకు సైతం ఈ వెబ్ సైట్ చాలా చాలా ఉపయోగం. మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధిత రిజిస్ట్రేషన్ సైట్స్.

http://registration.ap.gov.in/

http://registration.telangana.gov.in/
తీసుకొనేఅప్పుడు బ్యాంక్ వాళ్ళు చేసే మోసాలు

1) ఎట్టి పరిస్థితుల్లోనూ Broker లేదా యజమాని Refer చేసిన బ్యాంక్ లో Loan తీసుకోవద్దు.వాళ్ళు బ్యాంక్ వాడికి కమిషన్ ఇచ్చి వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉన్నది.Agrement time period లో మీకు loan sanction కాకుండా చేసి agreement డబ్బులు brokers, bank, owner పంచుకుంటారు.

2) బ్యాంక్ Loan రావాలి అంటే పైన చెప్పిన documents compulsary ఉండాలి. అవి లేకుండా బ్యాంక్ loan ఇవ్వదు.

3) బ్యాంక్ loan 70% నుంచి 80% వరకు ఇస్తారు. అది కూడా మీరు Registration Document లో చూపించిన Property value లో. Property government value 5Lak అనుకోండి. Actual market price 30Lak అనుకోండి. మీకు loan 15Lak కావాలి అనుకోండి. అప్పుడు మీరు registration document లో 20L చూపించి Register చేసుకోవాలి. మీకు 20L లో 75% అంటే 15L బ్యాంక్ లోన్ ఇష్టది.

4) మీరు 20Lks registration document లో చూపిస్తే మీకు registration charges పెరుగుతాయి. స్థల యజమానికి TAX పడుతుంది. INDEX based Tax యజమాని Govt కి కట్టాలి. అందువల్ల యజమాని ఒప్పుకొడు.

5) బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు processing fee ఉంటది min 10,000. 1.5% loan amount లో తీసుకోవాలి . కొన్ని Banks ( ) 5% కన్నా ఎక్కువ insurance charge చేస్తాయి మనకి తెలియకుండా Enable చేస్తారు. Mortage(తాకట్టు) registration బదులు 0.3% value లో మీద లోన్ agrement వేస్తే సరిపోతుంది.

6) Registration అప్పుడు వచ్చి యజమానికి ఇచ్చి, అన్ని Original documents తీసుకొనిపోతారు. అందువల్ల వాటి zerox తీసుకోండి.

7) పైన చెప్పిన process బ్యాంక్ లో చేసేది. అవి అవసరం లేదు మేము Loan ఇప్పిస్తాము , Sale agreement వేసుకొండి అని బ్యాంక్స్ చెపుతాను. 1Week లో Loan process complete అవుతుంది అని చెపుతారు. Agreement వేసుకొని వెళ్లిన తరువాత చుక్కలు చూపిస్తారు.

8) బ్యాంక్ లోన్ process min 20days పడుతుంది. బ్యాంక్ వెదవలు ( కొంత మందికి మాత్రమే) చెప్పే మాటలు నమ్మి sale agrement తక్కువ రోజుల్లో వేసుకోవద్దు. Min 3months agreement వేసుకోవాలి.

9) తీసుకుంటే Processing fee ఉంటది, optional. ముందే Insurance వద్దు అని చెప్పాలి.

10) బ్యాంక్ Loan కి రెండు రకాల వడ్డీలు ఉంటాయి , . ఐతే future లో వడ్డీ rates మారవు. Variable interest ఐతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వడ్డీ rates మారుస్తూ ఉంటారు.

11) pre Closing charges, ఎన్ని నెలలు తరువాత చెయ్య వచ్చు. వంటి వివరాలు తెలుసుకోవాలి.

12) బ్యాంక్ వాళ్లు చెప్పిన ప్రతి మాటని చేసుకోండి. వాడు చెప్పిన దానిని mail నుంచి మీ mail కి పంపమని చెప్పండి.

13) ఇప్పుడు కొంత మంది వాళ్లే పెద్ద దొంగలు, వారితో జాగ్రత్త

14) బ్యాంక్ లో వడ్డీ + అసలు ఉండాలి.కొన్ని దొంగ బ్యాంక్స్ వడ్డీ మాత్రమే తీసుకుంటాయి. మనం బ్యాంక్ కి వెళ్లి కట్టాలి. దొంగ rules ఇవి.

15) కొంటె క్రింద రాదు

రాధే కృష్ణా....ప్రేమ... చదవడానికి రెండే అక్షరాలు కావొచ్చు..చూడడానికి చిన్న పదమే కావొచ్చు.. కానీ సృష్టిని నడిపించేంత శక్త...
11/10/2023

రాధే కృష్ణా....

ప్రేమ...
చదవడానికి రెండే అక్షరాలు కావొచ్చు..
చూడడానికి చిన్న పదమే కావొచ్చు..
కానీ సృష్టిని నడిపించేంత
శక్తి ఉన్నది వాటికి...

పంచభూతాలైన
నింగి, నేల, నీరు, నిప్పు, గాలి...
ఈ సృష్టిని ఎంత ప్రభావితం చేస్తాయో...
అవే రెండక్షరాలైన ప్రేమ కూడా అంతే ప్రభావితం చేస్తుందనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి...

వాటికి ఏవిధంగా మరణం లేదో..
వాటిలాగే ప్రేమకూడా అమరం.
ప్రేమ ఎంత విలువైనది..
దాని విలువ తెలుకున్న వారికి
అదో అక్షయపాత్ర వంటిది.
ప్రేమ "నీటిలా" స్వచ్ఛమైనది..
చూసే వారి కనులకు
రకరకాలుగా కనిపించినా..
అది ఎప్పటికీ నిర్మలమైనదే. ..

08/10/2023

From Mrs. నిర్మలా రవీంద్రా రెడ్డి
*మీ డబ్బు ఎక్కడకు పోతుంది?!*

*మనసుని కదిలించే కళ్లు చెదిరే నిజం,చదివిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు... మీ డబ్బు ఎక్కడకు పోతుంది?!*

మన భారతదేశంలో మొత్తం 4120 మంది ఎమ్మెల్యేలు మరియు 462 ఎమ్మెల్సీలు అంటే మొత్తం 4,582 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఒక్కో ఎమ్మెల్యే జీత భత్యంతో కలిపి నెలకు 2 లక్షలు ఖర్చు చేస్తారు.వేరే పదాల్లో నెలకు 91 కోట్ల 64 లక్షల రూపాయలు.

దీని ప్రకారం సంవత్సరానికి సుమారు 1100 కోట్ల రూపాయలన్నమాట.

భారతదేశంలో లోక్‌సభ మరియు రాజ్యసభతో కలిపి మొత్తం 776 మంది ఎంపీలు ఉన్నారు.

ఈ ఎంపీలకు జీతం భత్యంతో కలిపి నెలకు 5 లక్షలు ఇస్తారు.అంటే మొత్తం ఎంపీల జీతం నెలకు 38 కోట్ల 80 లక్షలు.

ఇక ప్రతి సంవత్సరం ఈ MP లకు జీత భత్యం కింద రూ.465 కోట్ల 60 లక్షలు ఇస్తారు.

అంటే భారతదేశంలోని ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ప్రతి సంవత్సరం 15 వేల కోట్ల 660 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

ఇది వారి ప్రాథమిక వేతనం మరియు భత్యానికి సంబంధించిన విషయం. వారి నివాసం,జీవనం, ఆహారం,ప్రయాణ భత్యం, చికిత్స,విదేశీ విహార యాత్రలు మొదలైన వాటి ఖర్చు కూడా దాదాపు అదే.

అంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం దాదాపు 30 వేలకోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి.

ఇప్పుడు వారి భద్రతలో మోహరించిన భద్రతా సిబ్బంది జీతాన్ని పరిగణించండి.

ఒక ఎమ్మెల్యేకు ఇద్దరు అంగరక్షకులు మరియు ఒక సెక్షన్ హౌస్ గార్డు అంటే కనీసం 5 మంది పోలీసులు, అంటే మొత్తం 7 మంది పోలీసులు భద్రత కల్పిస్తారు.

7 గురు పోలీసుల జీతం సుమారుగా (నెలకు రూ. 35,000 చొప్పున) రూ. 2 లక్షా 45 వేలు.

దీని ప్రకారం 4582 మంది ఎమ్మెల్యేల భద్రతకు వార్షిక వ్యయం ఏడాదికి 9 వేలకోట్ల 62 కోట్ల 22 లక్షలు.

అదే విధంగా ఎంపీల భద్రత కోసం ఏటా 164 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

జెడ్ కేటగిరీ భద్రతా నాయకులు,మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి భద్రత కోసం దాదాపు 16000 మంది సిబ్బందిని ప్రత్యేకంగా మోహరించారు.

దీని కోసం మొత్తం వార్షిక వ్యయం రూ.776 కోట్లు ఖర్చు.

ఇలా ప్రతి ఏటా దాదాపు 20 వేలకోట్ల రూపాయలు పాలక నేతల భద్రతకు వెచ్చిస్తున్నారు.

*అంటే ఏటా కనీసం 50 వేలకోట్ల రూపాయలు రాజకీయ నాయకుల కోసం ఖర్చు చేస్తున్నారు.*

ఈ ఖర్చులలో గవర్నర్ ఖర్చులు,మాజీ నాయకులు, పార్టీ నాయకులు,పార్టీ అధ్యక్షుల పెన్షన్,వారి భద్రత మొదలైనవి ఉండవు.

అది కూడా కలుపుకుంటే మొత్తం ఖర్చు దాదాపు 100 బిలియన్ రూపాయలు అవుతుంది.

*ఇప్పుడు ఆలోచించండి.*

మనం ప్రతి సంవత్సరం రాజకీయ నాయకుల కోసం 100 బిలియన్ రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాము,పేద ప్రజలకు ప్రతిఫలంగా ఏమి లభిస్తుంది?

ఇదా ప్రజాస్వామ్యం?

(ఈ 100 బిలియన్ రూపాయలను మన భారతీయుల నుండి మాత్రమే పన్నుగా వసూలు చేయబదుతుంది.)

ఇక్కడ కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగింది.భారతదేశంలో రెండు చట్టాలు చేయాలి.

*మొదటిది:*

ఎన్నికల ప్రచారంపై నిషేధం
నాయకులు టెలివిజన్ (TV) ద్వారా మాత్రమే ప్రచారం చేయాలి, ప్రచార ఖర్చు ఒకరికి 10 వెలు మాత్రమే.

*రెండవది:*

నాయకుల జీతాలు, ఉచితాలు,సబ్సిడీలు మరియు అలవెన్సులపై నిషేధం విధించాలి
అప్పుడు కనబడుతుంది రాజకీయ నాయకుల్లో సేవ చేసే గుణం,దేశభక్తి ఎవరికి ఎంతుందో..

ప్రతి భారతీయుడు ఈ రాజకీయ నాయకుల అనవసర, అంతు లేని ఖర్చు,వ్యయానికి వ్యతిరేకంగా మాట్లాడాలి.

*ఈ సందేశాన్ని వీలైనన్ని ఎక్కువ Facebook మరియు WhatsApp సమూహాలకు ఫార్వార్డ్ చేయడం ద్వారా మీ దేశభక్తిని పరిచయం చేసుకోండి.*

గౌరవనీయులైన ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి గరికి
దయచేసి అన్ని ప్లానింగ్స్ ఆపండి.

*ప్రతి పది కిలోమీటర్లకు పార్లమెంట్ హౌస్ లో లాంటి క్యాంటీన్ తెరవండి.*

తగాదాలన్నీ అయిపోతాయి.

*మీకు ₹29 /-కే ఫుల్ మీల్స్ లభిస్తుంది..*

80% ప్రజల కోసం,ఇంటిని నడిపే పోరాటం గుర్తుంది..

సిలిండర్,రేషన్ తీసుకురావడం వుండదు.

మరియు ఇంటి ఆడపడుచు కూడా సంతోషంగా ఉంది.

చుట్టూ ఆనందం ఉంటుంది. అప్పుడు అందరి మద్దతు, అందరి అభివృద్ధి అంటాం.

*అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు ₹1 కి కిలో గోధుమలు బియ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు.*

మధ్యతరగతి ప్రజలు తమ సొంత మార్గంలో తమ ఇంటిని నడపాలని ప్రధాన మంత్రి గారు చెప్పనవసరం లేదు.

దయచేసి కష్టపడి సంపాదించిన ఈ సమాచారాన్ని దేశంలోని ప్రతి పౌరునికి అందించ డానికి ప్రయత్నించండి.

*ఇది అహంకారమా లేక మోసమా....లేక గుత్తాధి పత్యమా?*

భారతదేశంలో ఆహార పదార్థాలు అతి తక్కువ ధరకు లభించే ప్రదేశం ఒక్కటే అదే ఢిల్లీ లో వున్న భారత పార్లమెంట్ లో ని క్యాంటీన్ లో...

టీ = ₹ 1
sup = ₹ 5.50
పప్పు = ₹ 1.50
ఆహారం = ₹2.00
చపాతీ = ₹1.00
చికెన్ = ₹24.50
దోస = ₹4.00
బిర్యానీ=₹8.00
చేప = ₹13.00

ఈ వస్తువులన్నీ భారత పార్లమెంటు క్యాంటీన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఇవన్నీ పార్లమెంటు సభ్యులకు,ఎంపీలకు, అందులో పనిచేసే వారికి మనమందరం కలిసి కష్టపడి సంపాదించిన డబ్బులతో వారికి మనం ఇస్తున్న దాన ధర్మం.

ఆలోచించండి మనం వేసిన ఓట్లతో గెలిచి, దర్జాలు అనుభవిస్తూ మనం పెట్టిన భిక్ష తిని, మనం ఇచ్చే ఆరోగ్యం పొంది,మనం ఇచ్చే కార్లలో తిరుగుతూ వారి కుటుంబాలతో జల్సాలు చేస్తూ భోగభాగ్యాలు అనుభవిస్తూ మనకు మోసం చేస్తూ,మనకు ఇబ్బంది కలిగితే కంటి చూపుకు కూడా కనిపించని రాజకీయ నాయకుల జీవితం ఇది.

MP, MLA, MLC లు మరియు ఏ ఇతర ప్రజలు ఎన్నుకున్న నాయకులు పబ్లిక్ సర్వెంట్లు మాత్రమే.

ఈ విషయం మెదడులో పెట్టుకుని నాయకులు పని...కాదు...కాదు సేవ చేయాలి.

రోజుకు 30 లేదా 32 రూపాయలు సంపాదించే వాడు భికారి,పేదవాడు కాదని వారు భావించడానికి కారణం ఇదే.

*ఎన్నో జోక్స్ ప్రతిరోజూ ఫార్వార్డ్ చేయ బడతాయి, మీ మొబైల్‌లో అన్ని నంబర్‌లను ఫార్వార్డ్ చేయండి మరియు భారతదేశ ప్రజలకు అవగాహన కల్పించండి.*

*మెరా భారత్ మహాన్ ఎవరి చేతుల్లో వుంది.*

*సేకరణ: పవర్ ఆఫ్ ఆర్టీఐ.* b

*Mrs.నిర్మలారవీంద్రారెడ్డి Advocate,*

సీఐడీ కస్టడీకి చంద్రబాబురెండు రోజుల పాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనే విచారించాలి • విచారణ సమయంలో వైద్య సదుపాయం కల్...
23/09/2023

సీఐడీ కస్టడీకి చంద్రబాబు

రెండు రోజుల పాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనే విచారించాలి

• విచారణ సమయంలో వైద్య సదుపాయం కల్పించాలి. వీడియోలు, ఫొటోలు విడుదల చేయొద్దు

• ఆదేశాలు జారీచేసిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం

ఏ తప్పూ చేయకున్నా పెద్ద శిక్షే వేశారు















చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ పై అన్ని వర్గాల నుంచి నిరసన.  చంద్రబాబు గారి నాటి విజన్ గుర్తు చేసుకుంటూ లింకెడిన్ లో పోస్ట...
22/09/2023

చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ పై అన్ని వర్గాల నుంచి నిరసన. చంద్రబాబు గారి నాటి విజన్ గుర్తు చేసుకుంటూ లింకెడిన్ లో పోస్ట్ పెట్టిన ప్రపంచ ఆర్థిక నిపుణుడు, ఇన్వెంటస్ ఎండి కన్వాల్ రేఖీ.

నాటి సైబరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు గారి పాత్ర, పెట్టుబడుల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన పడే తపన వివరిస్తూ ప్రశంసలు.

ఈ దేశంలో చంద్రబాబు లాంటి విజన్ ఉన్న నాయకుడు, నాయుడు ఒక్కడే అంటూ కితాబు







08/07/2023

This poem written By
Dr. Devaraju Maharaju
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త

💐దిల్ కి బాత్💐

భర్తకు దక్కని భార్య రాజస్థాన్ ముఖ్యమంత్రయ్యింది

భార్యకు దక్కని భర్త దేశానికి ప్రధాని అయ్యాడు

చాయ్ దగ్గర మొదలైన ప్రభుత్వం ఆవు దగ్గర ఆగిపోయింది

వికాసమనే తల్లి దారి తప్పి, ఎక్కడో ఆగమైంది

అమ్మాయిలు భావోద్వేగాలు తింటున్నారు

అబ్బాయిలు మోసపు కలలు తింటున్నారు

ఉద్యోగులు లంచం తింటున్నారు

నేతలు కరెన్సీ తింటున్నారు

రైతులు విషం తింటున్నారు

ఉద్యమకారులు బుల్లెట్లు తింటున్నారు

అందరూ ఏదో ఒకటి సుష్ఠుగా తింటూనే ఉన్నారు

ఎవరంటారు భారత్ ఆకలితో అలమటిస్తోందని?

ఎవరంటారు భారత్ ఆర్థికంగా దిగజారిపోయిందని?

ఊడ్చేవాడు ముఖ్యమంత్రయ్యాడు

పన్నెండు చదివినమ్మ విద్యామంత్రయ్యింది

గోచీ సన్నాసులంతా మంత్రులయ్యారు

వేలిముద్రగాళ్ళు ఎమ్మెల్యేలయ్యారు

నేరగాళ్ళేమో యం.పి. లయ్యారు

పీజీలు చేసిన వాళ్ళంతా ఫేస్ బుక్, వాట్సప్ ల్లో ఇరుక్కున్నారు

ఒంటరిగా ఉన్నవాడు వ్యవస్థల్ని ముక్కలు చేస్తున్నాడు

వివాహితుడు మార్కెట్లో కూరలు కొనలేకపోతున్నాడు

వినేవాళ్ళకే కదా మిత్రో – ఎవరైనా చెవుల్లో పూలు పెడతారూ?

తెలివిగల జపాన్ వాళ్ళు బెల్లెట్ ట్రయిన్ నడుపుతారు

మన మేధావులు పదకొండు మందికి ఓం నమశ్శివాయ – పంపుతారు

దాంతో ఫ్రీ బాలెన్స్ చమత్కారం జరుగుతుందని ఆశపడతారు

అగర్ బత్తులు రెండు రకాలుగా ఉంటాయి

ఒకటి భగవంతుడికి మరోటి దోమలకు

భగవంతుడు వచ్చేది లేదు-దోమలు పోయేది లేదు!

ఉన్నవి ఖాళీ కడుపులు, యోగా చేయమంటారు

జేబులో చిల్లి గవ్వ ఉండదు, బ్యాంక్ ఎకౌంట్ తెరవమంటారు

ఉండటానికి ఇల్లు లేదురా నాయనా అంటే

మరుగుదొడ్లు కట్టిస్తామంటారు

ఊళ్ళో కరెంటు ఉండదు, డిజిటల్ ఇండియా అయిందంటారు

నగరాల్లో ఇంటర్నెట్ ఉంటుంది కాని, ఆపేస్తారు

దొరికేవన్నీ విదేశీ కంపెనీల వస్తువులు

దాన్నే ‘మేకిన్ ఇండియా’ అనమంటారు

పప్పు ఉప్పు బియ్యం జనం కొనలేకపోతున్నారు

టాటాకార్లు, సెల్ ఫోన్లూ అగ్గువైపోయాయంటున్నారు

మెదడ్లో జాతి మతాల ద్వేషం నింపుతారు

స్వచ్ఛ భారత్ అభియాన్ గూర్చి గొప్పగా చెపుతారు

నిషా కరోనా వైరస్ లను ఎదుర్కోగలిగే జనం,

దేశంలో కాషాయ వైరస్ ను ఎదుర్కోలేకపోతున్నారు

అసమాన్యుడి ‘మన్ కీ బాత్’ లో –ఏదీ- వినిపించదు?

సామాన్యుడి ‘దిల్ కి బాత్!’

(కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త)
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

03/07/2023

మీకు తెలుసా ..🤔😡

బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు!

ఫ్రాన్స్‌లో 109 మంది వీఐపీలు ఉన్నారు!

జపాన్‌లో 125 మంది వీఐపీలు ఉన్నారు!

జర్మనీలో 142 మంది వీఐపీ లు ఉన్నారు!

USAలో 252!

రష్యాలో 312!

*చైనాలో మొత్తం వీఐపీల సంఖ్య 435!

**భారతదేశంలో మొత్తం VIP ల సంఖ్య 1,79,092!*

*భారత ప్రభుత్వం వీరందరికీ 4 చొప్పున సెక్యూరిటీ గార్డ్స్ మరియు గన్ మెన్స్ ను ఫ్లైట్ బిల్లులను, విదేశీ ప్రయాణం, జల్సాల కోసం వెకేషన్, ఉచిత రవాణా, ఉచిత విద్యుత్, ఉచిత నీరు, ఉచిత ఫోన్, ఉచిత గ్యాస్, అధికార నివాసానికి ఒక క్వార్టర్ మరియు ఆఫీస్ నిర్వాహణకు ఒక క్వార్టర్ PS ఒక్కరు, PA ఒక్కరు, OSD ఒక్కరు, COOK ఒక్కరు, ఇద్దరు అటెండర్స్, క్యాంటీన్లలో రాయితీతో కూడిన అధిక నాణ్యత గల ఆహారం కోసం ప్రభుత్వం చెల్లించే బిల్లులను ఊహించుకోండి! ఈ సొమ్ము అంతా ఎవరిది? ఎవరి సొమ్మును ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు?*

*ఈ సంఖ్యను దేశంలోని 29 రాష్ట్రాలలో కలిపి 290 కంటే తక్కువకు తగ్గించడం అత్యవసరం మరియు ఇది మన దేశానికి ఉత్తమమైన సంస్కరణ!*

*ఈ దేశంలోని సామాన్య ప్రజల కోసం ఖర్చు చేయవలసిన విలువైన జాతీయ వనరులను వృథా చేస్తున్న రాజకీయ నాయకుల నైజాన్ని ఎండగట్టండి!*

ఈ వాస్తవాన్ని వ్యాప్తి చేసి మీ నైతిక బాధ్యతను నిర్వర్తించలేరా..?

20/06/2023
మనం 100 కడితే మనకి 46/- కేంద్రం ఇస్తుంది... అదే ఉత్తరాది జనాలు 100 కడితే వాళ్ళకి తిరిగి 333/- ఇస్తుంది కేంద్రం...ఇక ఆలోచ...
20/06/2023

మనం 100 కడితే మనకి 46/- కేంద్రం ఇస్తుంది...
అదే ఉత్తరాది జనాలు 100 కడితే వాళ్ళకి తిరిగి 333/- ఇస్తుంది కేంద్రం...

ఇక ఆలోచించండి... 🤷🏻‍♂️ Why this ?

Today morning at 3 am visakhapatnam railway station status @ చెత్త తో నిండిపోయి వుంది చాలా వరెస్ట్ గా !
20/06/2023

Today morning at 3 am visakhapatnam railway station status @ చెత్త తో నిండిపోయి వుంది చాలా వరెస్ట్ గా !

   #యువభారతం  #నేటియువత  #నాదేశయువత ను చూస్తుంటే చాలా చాలా గర్వ౦గా ఉంది..* నిజంగానే  గర్వ౦గా  ఉంది..  *ఎందుకు* అంటారా..?...
18/06/2023

#యువభారతం #నేటియువత #నాదేశయువత ను చూస్తుంటే చాలా చాలా గర్వ౦గా ఉంది..*

నిజంగానే గర్వ౦గా ఉంది..

*ఎందుకు* అంటారా..? చదవండి..

👇👇👇

దేశం లో *నిరుద్యోగం*
గురించి మాట్లాడాల్సిన యువత *మతం* గురించి మాట్లాడుకుంటున్నందుకు..🤔🤔

•దేశం లో *ఆర్ధిక వ్యవస్థ* కుప్పకూలి పోతుంటే..
ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించాల్సిన యువత 3 గంటల *సినిమా* గురించి చర్చ చేస్తున్నందుకు..🤔🤔

•అంతర్జాతీయ మార్కెట్ లో ఆయిల్ ధరలు తగ్గినప్పుడు.. మన దేశం లో
*పెట్రోల్ డీజిల్ గ్యాస్* రేట్లు ఎందుకు తగ్గవు అని నిలదీయాల్సిన యువత
*హిందూ, ముస్లిం* గొడవల గురించి మాట్లాడుతున్నందుకు
🤔🤔

•మేము అధికారం లోకి వస్తే ఏడాదికి
*రెండు కోట్ల ఉద్యోగాలు* ఇస్తాం అని అధికారం లోకి వచ్చి ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదు అని ప్రశ్నించాల్సిన యువత ప్రశ్నించకుండా.. *హిజాబ్* గురించి మాత్రమే ప్రశ్నిస్తున్నందుకు..
🤔🤔

•నేను అధికారం లోకి వస్తే *నల్లధనం* తీసుకు వచ్చి పేదల బ్రతుకులు మార్చేస్తా అని ప్రగల్భాలు పలికి *అధికారాన్ని* సాధించిన వ్యక్తిని నిలదీయనందుకు...
🤔🤔

•దేశం లో ఎన్నడూ లేని విధంగా *నిత్యావసర వస్తువుల* ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. ప్రశ్నించలేని
*చేవ చచ్చిన* మనుషులుగా మారిబ్రతుకుతున్నందుకు...
🤔🤔

•స్కూల్స్,
*కాలేజీలు, హాస్పిటల్* ఎందుకు నిర్మించట్లేదు అని ఆలోచించాల్సిన యువత
*గుడి నిర్మాణాల* గురించి మాట్లాడుతున్నందుకు
🤔🤔

*•ప్రభుత్వరంగ సంస్థలు* నిర్మించాల్సింది పోయి వాటిని కారు చౌకగా.. తన
*కార్పొరేట్ మిత్రులకు* అమ్ముతుంటే.. ఎదురు తిరిగి గొంతు ఎత్తాల్సిన యువత గొంతు *మూగబొయినందుకు* ..
🤔🤔

•కరోనా మరణాలు... వలస కార్మికుల
*ఆకలి చావులు* .. నిరుద్యోగుల *ఆత్మహత్యలు* .. హాయిగా మర్చిపోయిన యువత
*మళ్ళీ.. మళ్ళీ..*
మా ఓటు మీకే అంటూ *బానిసలుగా* మారినందుకు..

స్పందన ఆగిన వీరి హృదయాలను ఏ మంటలలో వేయాలి ఆలోచిండం ఆగిపోయిన వీరి మెదళ్ళను ఏ కొలిమిలో కాల్చాలి

నిజంగా గర్వ౦గా ఉంది *భారతీయుడా* .. నిజంగా గర్వ౦గా ఉంది...*భారతీయుడు* నైనందుకు



నా మరణానికి ముందు ఈ దేశాన్ని జ్ఞాన వంతంగా తీర్చిదిద్దాలని కలలు కనే
*- ఒక పెద సగటు భారతీతుడు గా నా ఆవేదన.*

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Today India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share