తెలంగాణా బతుకమ్మ ఉత్సవంలో మహిళల కోలాహలం. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం శిలార్ గూడెంలో జరిగిందీ పండుగ. కట్టా లక్ష్మీఉపేందర్ గారు విజేతలకు రూ.20 వేల విలువైన బహుమతులు అందజేసారు
తొలకరి చినుకుల నీటి బిందువుల్లో ఆడుతూ మురిసిపోతున్న పక్షి. చినుకు చుక్కలను తాగుతూ వేసవి ఎండల నుంచి విముక్తి కలిగిందన్న ఉల్లాసం కనిపిస్తోంది దాని చేష్టల్లో
ఉత్తర ఐర్లండ్ లో పాల్ నెల్సన్ అనే సాహసికుడు ప్యారా గ్లైడర్ పై గాలిలో శికారు చేస్తుండగా ఆకాశంలో తిరుగుతున్న నల్ల రాబందు చనువుగా వచ్చి అతని చెంత కూర్చుంది. రాబందులు సాధారణంగా మనుషుల దగ్గరకు రావడానికి ఇష్టపడవు. ఏమనిపించిందో కాసేపు చక్కర్లు కొట్టి ఎగిరి వెళ్లిపోయింది. Paul.Nelson
@batsy09 ఈ వీడియో క్లిప్ ను twitter లో పోస్ట్ చేయగా నెట్లో వైరల్ అయింది.
యాచకులుగా మారిన కళాకారులు
తెలుగు సంస్కృతిలో ఉత్కృష్ట కళగా ఆదరణ పొందిన గంగిరెద్దుల ఆటలో గంగిరెద్దులు మిస్ అవుతున్నాయి. వృషభాలు కొనుక్కోవాల్సి రావడం, పోషణ ఖర్చులు భరించే పరిస్థితులు లేకపోవడంతో వాటిని నమ్ముకుని బతికే కుటుంబాలు ఇలా వీధుల్లో యాచన చేస్తున్నాయి. సన్నాయి మోగిస్తూ అడుక్కునే దృశ్యాలు అంతటా కనిపిస్తాయి, గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే ఈ కళాకారులు అక్కడ ఆదరణ లేక పట్టణాలకు తరలి వస్తున్నారు.
ప్రమాదకర బలప్రదర్శన...
ఏటా శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లాలోని మా వూరు 'సాగర్ తిరుమలగిరి'లో పందెం గుండు ఎత్తే పోటీలు జరుగుతాయి. 100-120 కిలోల బరువు తూగెే నల్ల రాయిని ఎత్తి భుజం మీద నుంచి వెనకకు జారవిడచాలి. 50 ఏళ్లుగా క్రమం తప్పకుండా నవమి ఉత్సవాల సందర్భంగా జరిగే ఈ పోటీలు చాలా ఉత్కంఠ భరితంగా సాగుతాయి. 5 నిమిషాల్లో పోటీదారులు ఎన్నిసార్లు ఎత్తి వేస్తారనే దానిపై విజేతలను నిర్ణయిస్తారు. నగదు బహుమతి ఉంటుంది. మొన్నటి ఏప్రిల్ లో జరిగిన పోటీల్లో మాచెర్లకు చెందిన వీరాంజి 17 సార్లు లిఫ్ట్ చేసి ప్రథమ విజేతగా నిల్చారు. ఈ వీడియోలో అతను లేడు. నల్ల కట్ బనియన్లో ఉన్న యువకుడు రెండో బహుమతి గెల్చిన మారెపల్లి అలేక్య స్థానికుడు. జడ్జిగా కటికర్ల మల్లయ్య వ్యవహరించారు. 30-40 ఏళ్ల క్రితం తయారు చేయించిన ఈ నల్ల రాయి బరువు అప్పట్లో 120 కిలోలు ఉండేదని చెబ్తారు. అరిగ