DTalks 24x7

DTalks 24x7 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DTalks 24x7, .

మూడో దశ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్ 'బయోలాజికల్ ఈ వ్యాక్సిన్‌' 3వ దశ ట్రయల్స్‌కు గ్రీన్‌ సిగ్నల్ లభించింది. హైదరాబాద్: హై...
25/04/2021

మూడో దశ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్ 'బయోలాజికల్ ఈ వ్యాక్సిన్‌' 3వ దశ ట్రయల్స్‌కు గ్రీన్‌ సిగ్నల్ లభించింది. హైదరాబాద్: హైదరాబాద్ నుంచి మరో కరోనా టీకా రాబోతుంది. బయోలాజికల్ ‘ఈ వ్యాక్సిన్‌’ 3వ దశ ట్రయల్స్‌కు గ్రీన్‌ సిగ్నల్ లభించింది. గత నవంబర్‌లోనే తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కాగా నవంబర్ 2020లోనే బయోలాజికల్ కరోనా వ్యాక్సిన్ తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. ఈ రెండు దశల్లోనూ ఆశించిన ఫలితాలను రాబట్టింది. ఇక మూడో దశ క్లినికల్ ట్రయల్స్ దేశంలోని 15 ప్రాంతాల్లో చేపట్టనుంది....

https://dtalks24x7.wordpress.com/2021/04/25/%e0%b0%b9%e0%b1%88%e0%b0%a6%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8b-%e0%b0%9f%e0%b1%80%e0%b0%95%e0%b0%be/

మూడో దశ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్ ‘బయోలాజికల్ ఈ వ్యాక్సిన్‌’ 3వ దశ ట్రయల్స్‌కు గ్రీన్‌ సిగ్నల్ లభించింది. హైదర....

ఒక్కసారిగా పెద్ద మొత్తంలో లీకైన ఆక్సిజన్ మహారాష్ట్ర లోని నాసిక్ లో ఉన్న "జకీర్ హుస్సేన్" హాస్పిటల్ లో ఘటనా ICU లో ఆక్సిజ...
21/04/2021

ఒక్కసారిగా పెద్ద మొత్తంలో లీకైన ఆక్సిజన్ మహారాష్ట్ర లోని నాసిక్ లో ఉన్న "జకీర్ హుస్సేన్" హాస్పిటల్ లో ఘటనా ICU లో ఆక్సిజన్ అందక 11 మంది మృతి లీక్ ను అదుపు చేస్తున్న రెస్క్యూ టీమ్ -డి టాక్స్ 24x7

https://dtalks24x7.wordpress.com/2021/04/21/icu-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b0%bf%e0%b0%9c%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%85%e0%b0%82%e0%b0%a6%e0%b0%95-11-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%83%e0%b0%a4/

ఒక్కసారిగా పెద్ద మొత్తంలో లీకైన ఆక్సిజన్ మహారాష్ట్ర లోని నాసిక్ లో ఉన్న “జకీర్ హుస్సేన్” హాస్పిటల్ లో ఘటనా ICU ల.....

బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో నైట్ కర్ఫ్యూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది రాత్రి 9గం...
20/04/2021

బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో నైట్ కర్ఫ్యూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకూ నైట్ కర్ఫ్యూ విధించనున్నారు ఇవాళ్టి నుంచే ఆంక్షలు అమలులోకి రానున్నాయి మే 1వరకూ నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇవ్వనున్నారు నైట్ కర్ఫ్యూతో బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి - డిటాక్స్24x7

https://dtalks24x7.wordpress.com/2021/04/20/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a8%e0%b1%88%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%95%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ab%e0%b1%8d%e0%b0%af%e0%b1%82/

బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో నైట్ కర్ఫ్యూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంద...

ఆంధ్రప్రదేశ్ ప్రథమ పౌరుని హోదాలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్భవన్కు సమీపంలోని చు...
10/03/2021

ఆంధ్రప్రదేశ్ ప్రథమ పౌరుని హోదాలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్భవన్కు సమీపంలోని చుండూరి వెంకట రెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో ఓటు వేసిన గవర్నర్ బిస్వాభూషన్ దంపతులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కామెంట్స్ ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ముఖ్యం. ప్రతీ పౌరుడూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. సమాజంలో మార్పు రావాలంటే ఓటు హక్కు వినియోగించుకోవడం తప్పనిసరి. స్థానిక సంస్థల ఎన్నికలైన, మున్సిపల్ ఎన్నికలైన, జనరల్ ఎలక్షన్ లోనైనా, ఈ ఎన్నికలైన ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యత. ఈ రాష్ట్ర ప్రధమ పౌరుడి గా బాధ్యతతో నేను నా ఓటు హక్కును వినియోగించుకున్న మీరు వినియోగించుకోండి. - డి టాక్స్ 24x7

https://dtalks24x7.wordpress.com/2021/03/10/%e0%b0%b9%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%81-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%af%e0%b1%8b%e0%b0%97%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%97/

ఆంధ్రప్రదేశ్ ప్రథమ పౌరుని హోదాలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్భవన్కు ...

12 కార్పొరేషన్లు,75 మున్సిపల్ నగర పంచాయతీలకు ఎన్నికలు. మార్చి 10న పోలింగ్ 14న కౌంటింగ్. యస్.ఈ.సి నోటిఫికేషన్ ప్రకారమే ము...
26/02/2021

12 కార్పొరేషన్లు,75 మున్సిపల్ నగర పంచాయతీలకు ఎన్నికలు. మార్చి 10న పోలింగ్ 14న కౌంటింగ్. యస్.ఈ.సి నోటిఫికేషన్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు. యస్.ఈ.సి నోటిఫికేషన్ సవాలుచేస్తూ 16 మధ్యంతర పిటిషన్లు. మధ్యంతర పిటిషన్లను తిరస్కరించిన హైకోర్టు. - డి టాక్స్ 24x7

https://dtalks24x7.wordpress.com/2021/02/26/%e0%b0%ae%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b0%bf%e0%b0%aa%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%b2%e0%b1%88%e0%b0%a8%e0%b1%8d/

12 కార్పొరేషన్లు,75 మున్సిపల్ నగర పంచాయతీలకు ఎన్నికలు. మార్చి 10న పోలింగ్ 14న కౌంటింగ్. యస్.ఈ.సి నోటిఫికేషన్ ప్రకారమే ...

నరసరావుపేట, డి టాక్స్ : నరసరావుపేటలో దారుణం చోటుచేసుకుంది. రావిపాడు శివారులో ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థిని తోటి ...
25/02/2021

నరసరావుపేట, డి టాక్స్ : నరసరావుపేటలో దారుణం చోటుచేసుకుంది. రావిపాడు శివారులో ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థిని తోటి విద్యార్థి గొంతు నులిమి చంపేశాడు. వివరాలు.. ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన అనూష అనే యువతి నరసరావుపేటలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బొల్లాపల్లి మండలం పమిడిపాడు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి కూడా అదే కాలేజీలో చదువుతున్నాడు. కాగా అనూష, విష్ణు కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా యువతి మరో యువకుడితో చనువుగా ఉంటోందని విష్ణు యువతిని అనుమానిస్తున్నాడు....

https://dtalks24x7.wordpress.com/2021/02/25/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%ae%e0%b1%8b%e0%b0%a8%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%98%e0%b0%be%e0%b0%a4%e0%b1%81%e0%b0%95%e0%b0%82-%e0%b0%a1%e0%b0%bf%e0%b0%97/

నరసరావుపేట, డి టాక్స్ : నరసరావుపేటలో దారుణం చోటుచేసుకుంది. రావిపాడు శివారులో ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్...

విశాఖ: విశాఖలో గత కొన్ని రోజులుగా వరుసగా నగరంలో ఏదొక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్త...
01/08/2020

విశాఖ: విశాఖలో గత కొన్ని రోజులుగా వరుసగా నగరంలో ఏదొక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని నగర వాసులు ఆందోళన పడుతూనే ఉన్నారు. ఇదే సమయంలో విశాఖ షిప్ యార్డులో జరిగిన మరో ప్రమాదం స్థానికంగా విషాదాన్ని నింపింది. విశాఖ షిప్ యార్డ్ లో భారీ క్రేన్ ఒకటి లోడ్ టెస్టింగ్ చేస్తుండగా బెర్త్ పై కూలిపోయింది. ఘటనలో 10 మంది వరకూ మృతి చెంది వుండొచ్చు అని సమాచారం. షిప్ యార్డు సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. - డి టాక్స్ 24x7
https://dtalks24x7.wordpress.com/2020/08/02/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b0%be%e0%b0%96-%e0%b0%b7%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d-%e0%b0%af%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae/

విశాఖ: విశాఖలో గత కొన్ని రోజులుగా వరుసగా నగరంలో ఏదొక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం మ....

ఢిల్లీ: టిక్‌టాక్ తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న పబ్జీ పై భారత ప్రభుత్వం త్వరలోనే నిషేధం విధించనుంది. దీనితో పాటే అలీ ఎక్స్...
27/07/2020

ఢిల్లీ: టిక్‌టాక్ తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న పబ్జీ పై భారత ప్రభుత్వం త్వరలోనే నిషేధం విధించనుంది. దీనితో పాటే అలీ ఎక్స్‌ప్రెస్, లూడో సహా చైనాకు చెందిన 275 యాప్‌లపై భారత్ నిషేదం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. గాల్వన్ లోయల్ భారత్-చైనా మధ్య ఉద్రిక్తలు నెలకొన్నప్పటి నుంచి చైనాకు చెందిన యాప్‌లపై ప్రత్యేక దృష్టి సారించిన నిఘా వర్గాలు ఇప్పటికే టిక్‌టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 యాప్‌లను నిషేదించిన సంగతి తెలిసిందే. తాజాగా జాతీయ భద్రతకు ముప్పు కలిగేంచాలా మరో 275 చైనా యాప్‌లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.నిబంధనల్ని ఉల్లంఘిస్తూ భారత వినియోగదారుల డేటా తస్కరణకు గురవుతున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రం ముందుంచారు. [ 63 more words ]
https://dtalks24x7.wordpress.com/2020/07/27/%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a8%e0%b1%87-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b7%e0%b1%87%e0%b0%a7%e0%b0%82/

ఢిల్లీ: టిక్‌టాక్ తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న పబ్జీ పై భారత ప్రభుత్వం త్వరలోనే నిషేధం విధించనుంది. దీనితో పాటే ....

ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ కేసులు పెరుగుతున్నాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా వైరస్ మరింత విస్తరిస్తోంది. దీనికి...
27/07/2020

ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ కేసులు పెరుగుతున్నాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా వైరస్ మరింత విస్తరిస్తోంది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ప్రధానంగా మన జీవనశైలిలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. దీనిని కట్టడి చేయాలంటే లేనిపోని భయాలకు పోకుండా కొన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. కరోనా విజృంభిస్తున్న వేళ జన జీవన శైలిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైరస్‌ రాకుండా అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఒక వేళ వైరస్‌ వచ్చినా దానిని జయించేందుకు ముందుగానే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. మాస్క్‌లు, శానిటైజర్ల వినియోగంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు బలమైన ఆహారాన్ని తీసుకుంటు న్నారు. [ 228 more words ]
https://dtalks24x7.wordpress.com/2020/07/27/%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%b2%e0%b1%88%e0%b0%ab%e0%b1%8d-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%88%e0%b0%b2%e0%b1%8d/

ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ కేసులు పెరుగుతున్నాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా వైరస్ మరింత విస్తరిస్తోం...

ఆశ వర్కర్ల చేత అక్రమ రవాణా గుట్టు రట్టు విశాఖ: విశాఖలో చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసారు....
27/07/2020

ఆశ వర్కర్ల చేత అక్రమ రవాణా గుట్టు రట్టు విశాఖ: విశాఖలో చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసారు. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండీ నర్మత ఆధ్వర్యంలో చిన్నపిల్లల అమ్మకాలు జరుగుతున్నట్టు గుర్తించారు. పిల్లలను పోషించే స్థితిలో లేని తల్లి దండ్రులను టార్గెట్ చేసి అమ్మకాలు చేస్తున్నట్టు తేలింది. తల్లి తండ్రులకు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి పుట్టిన తరవాత పిల్లలను తరలిస్తున్నట్టు గుర్తించారు. పిల్లలను అక్రమరవాణా చేస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసారు. ఇద్దరు ఆశావర్కర్లు వెంకటలక్ష్మి, అన్నపూర్ణ, డాక్టర్‌ తిరుమల ఈ ముఠాకు సహకరిస్తునట్టు గుర్తించారు. [ 50 more words ]
https://dtalks24x7.wordpress.com/2020/07/27/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b0%be%e0%b0%96%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%b2-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0/

ఆశ వర్కర్ల చేత అక్రమ రవాణా గుట్టు రట్టు విశాఖ: విశాఖలో చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్.....

మేడ్చల్ జిల్లా ఐడీఏ గాంధీనగర్‌ పారిశ్రామికవాడలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ముగ...
27/07/2020

మేడ్చల్ జిల్లా ఐడీఏ గాంధీనగర్‌ పారిశ్రామికవాడలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. పేలుడు ధాటికి పరిశ్రమ మొదటి అంతస్తులో గోడలు కూలిపోయాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అర్ధరాత్రి జరగడం, ఆ సమయంలో కార్మికులు తక్కవగా ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. - డి టాక్స్ 24x7
https://dtalks24x7.wordpress.com/2020/07/27/%e0%b0%aa%e0%b1%87%e0%b0%b2%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%ae%e0%b1%81%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b0%bf/

మేడ్చల్ జిల్లా ఐడీఏ గాంధీనగర్‌ పారిశ్రామికవాడలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ...

జంతువులు కూడా నేరాలు చేస్తాయా? ఔను చేస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 15 మేకలు తప్పు చేసినందుకు వాటిని అదుపులోకి తీ...
27/07/2020

జంతువులు కూడా నేరాలు చేస్తాయా? ఔను చేస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 15 మేకలు తప్పు చేసినందుకు వాటిని అదుపులోకి తీసుకున్నారు. అవి చేసిన తప్పు ఏంటంటే.. ఆకులు తినడం. హరితహారంలో భాగంగా ప్రభుత్వం నాటిన మొక్కలను ఆ మేకలు నమిలేశాయి. ఒక్కో దానికి రూ.3000 చొప్పున జరిమానా కూడా విధించారు. ఈ ఏడాది జనవరిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోదశ హరితహారం చేపట్టారు. రాష్ట్రం మొత్తం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఆరో దశలో మొత్తం 30 కోట్ల మొక్కలను నాటుతున్నట్టు చెప్పారు. అటవీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో హరితహారం చేపడుతోంది తెలంగాణ ప్రభుత్వం. - డి టాక్స్ 24x7
https://dtalks24x7.wordpress.com/2020/07/27/%e0%b0%9c%e0%b0%82%e0%b0%a4%e0%b1%81%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%95%e0%b1%82%e0%b0%a1%e0%b0%be-%e0%b0%a8%e0%b1%87%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8/

జంతువులు కూడా నేరాలు చేస్తాయా? ఔను చేస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 15 మేకలు తప్పు చేసినందుకు వాటిని అదుప...

క‌రోనాకు చెక్ పెట్టేది మొద్దు నిద్రేనట..! క‌రోనా వైర‌స్ పేరు ఎత్తుతేనే అంద‌రూ భ‌య‌ప‌డిపోతున్నారు. సామాన్యులే కాకుండా ప‌ల...
26/07/2020

క‌రోనాకు చెక్ పెట్టేది మొద్దు నిద్రేనట..! క‌రోనా వైర‌స్ పేరు ఎత్తుతేనే అంద‌రూ భ‌య‌ప‌డిపోతున్నారు. సామాన్యులే కాకుండా ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, న‌టులు, వీఐపీలు, పోలీసులు, వైద్య సిబ్బంది ఇలా అంద‌రూ క‌రోనా బారిన ప‌డుతూనే ఉన్నారు. ఇక దేశ వ్యాప్తంగా కూడా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ మ‌హ‌మ్మారికి సరైన వ్యాక్సిన్ రాక‌పోవ‌డంతో ఇమ్యునిటీని పెంచుకోవ‌డ‌మే సరైన మార్గ‌మ‌ని శాస్త్ర‌వేత్త‌లు, వైద్యులు చెబుతూనే ఉన్నారు. ఈ ఇమ్యునిటీలో నిద్ర కూడా ఒక భాగ‌మ‌ట‌. స‌రిగ్గా నిద్ర‌పోక‌పోతే శ‌రీరంలో తెల్ల ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తి త‌గ్గిపోతాయ‌ట‌. [ 107 more words ]
https://dtalks24x7.wordpress.com/2020/07/27/944/

క‌రోనాకు చెక్ పెట్టేది మొద్దు నిద్రేనట..! క‌రోనా వైర‌స్ పేరు ఎత్తుతేనే అంద‌రూ భ‌య‌ప‌డిపోతున్నారు. సామాన్యులే క.....

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో హర్యానా రాష్ట్రంలోగల పోస్ట్‌గ్రాడ్యుయ...
26/07/2020

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో హర్యానా రాష్ట్రంలోగల పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెన్‌ (పీజీఐ)లో ‘కొవాగ్జిన్‌’ టీకా మొదటి దశ క్లినికల్‌ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తైనట్లు ట్రయల్‌ టీం ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ డాక్టర్‌ సవితావర్మ వెల్లడించారు. ఫేస్‌-1 లో రెండో భాగం కింద శనివారం మొత్తం ఆరుగురికి టీకా వేసినట్లు ఆమె చెప్పారు. సవితావర్మ మాట్లాడుతూ ‘టీకా ట్రయల్‌ ఫేస్‌ -1 లో మొదటి భాగం పూర్తయింది. భారతదేశం అంతటా 50 మందికి వ్యాక్సిన్ ఇచ్చాం. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. [ 39 more words ]
https://dtalks24x7.wordpress.com/2020/07/27/%e0%b0%86%e0%b0%b6%e0%b0%be%e0%b0%9c%e0%b0%a8%e0%b0%95%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%95%e0%b1%8a%e0%b0%b5%e0%b0%be%e0%b0%97%e0%b1%8d%e0%b0%9c%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e2%80%8c/

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో హర్యానా రాష్ట్రంలోగల పోస్ట్.....

చిత్తూర్: నటుడు సోనూసూద్ దాతృత్వాన్ని చాటుకున్నారు. రైతు, నాగేశ్వర రావు ఆయన భార్య, కూతుళ్లు పడుతున్న కష్టాన్ని చూసి చలిం...
26/07/2020

చిత్తూర్: నటుడు సోనూసూద్ దాతృత్వాన్ని చాటుకున్నారు. రైతు, నాగేశ్వర రావు ఆయన భార్య, కూతుళ్లు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయారు. నాగేశ్వరరావుకు ట్రాక్టర్‌ను కొని ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్‌ను అందించారు. దీంతో నాగేశ్వరరావు కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సోనూసూద్‌కు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా సోనూకు రైతు కృతజ్ఞతలు తెలిపారు. కాగా నాగేశ్వరరావు చిత్తూరు జిల్లా మదనపల్లెలో టీ హోటల్ నిర్వహించేవాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆయన కుటుంబానికి ఉపాధి పోయింది. దీంతో నాగేశ్వరావు కుటుంబంతో సహా తన స్వంత గ్రామానికి వెళ్లాడు. [ 73 more words ]
https://dtalks24x7.wordpress.com/2020/07/27/%e0%b0%9a%e0%b1%86%e0%b0%aa%e0%b0%bf%e0%b0%a8%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b0%be%e0%b0%a8%e0%b1%87-%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d/

చిత్తూర్: నటుడు సోనూసూద్ దాతృత్వాన్ని చాటుకున్నారు. రైతు, నాగేశ్వర రావు ఆయన భార్య, కూతుళ్లు పడుతున్న కష్టాన్ని ....

జగిత్యాల: జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఆలూర్-వీరాపూర్ గ్రామాల మధ్యలో సారంగాపూర్ నుండి దావన్ పెల్లి గ్రామానికి ఏపీ 3...
26/07/2020

జగిత్యాల: జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఆలూర్-వీరాపూర్ గ్రామాల మధ్యలో సారంగాపూర్ నుండి దావన్ పెల్లి గ్రామానికి ఏపీ 36 ఎల్ 9962 నెంబర్ కారులో డ్రైవర్ తో సహా 4గురు వ్యక్తులు ఆదివారం రోజున వివాహ వేడుకలకు వెళ్తున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవర్ అత్యంత వేగంగా కారును నడపడంతో అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న పొలంలో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో సహా నలుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. గాయాలపాలైన వ్యక్తులను వైద్యం కొరకు 108 అంబులెన్స్ లో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. - డి టాక్స్ 24x7
https://dtalks24x7.wordpress.com/2020/07/26/%e0%b0%b5%e0%b1%87%e0%b0%97%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%a6%e0%b1%82%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%b5%e0%b1%86%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b3%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8a%e0%b0%b2%e0%b0%82/

జగిత్యాల: జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఆలూర్-వీరాపూర్ గ్రామాల మధ్యలో సారంగాపూర్ నుండి దావన్ పెల్లి గ్రామ....

ఏపీ కరోనా తాజా బులెటిన్ విడుదల చేసిన ఏపీ ఆరోగ్యశాఖ - డి టాక్స్ 24x7https://dtalks24x7.wordpress.com/2020/07/26/%e0%b0%8f...
26/07/2020

ఏపీ కరోనా తాజా బులెటిన్ విడుదల చేసిన ఏపీ ఆరోగ్యశాఖ - డి టాక్స్ 24x7
https://dtalks24x7.wordpress.com/2020/07/26/%e0%b0%8f%e0%b0%aa%e0%b1%80%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%97%e0%b0%be-7627-%e0%b0%95%e0%b0%b0%e0%b1%8b%e0%b0%a8%e0%b0%be-%e0%b0%aa%e0%b0%be%e0%b0%9c%e0%b0%bf/

ఏపీ కరోనా తాజా బులెటిన్ విడుదల చేసిన ఏపీ ఆరోగ్యశాఖ – డి టాక్స్ 24×7

భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ కొవిడ్‌ టీకా 2-3 దశల ప్రయోగాలు డీసీజీఐ అనుమతి కోరిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ దిల్లీ: ఆక్స్‌ఫర్డ్‌ అభ...
26/07/2020

భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ కొవిడ్‌ టీకా 2-3 దశల ప్రయోగాలు డీసీజీఐ అనుమతి కోరిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ దిల్లీ: ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌-19 టీకాకు (వ్యాక్సిన్‌) భారత్‌లో రెండో, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపేందుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతిని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కోరింది. ‘కొవిషీల్డ్‌’ ట్రయల్స్‌ నిమిత్తం డీసీజీఐకి సీరమ్‌ దరఖాస్తు సమర్పించిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కొవిషీల్డ్‌ టీకాతో ఆరోగ్యవంతులైన పెద్దవారిలో రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయి? ఎంత వరకు ఇది సురక్షితం? [ 30 more words ]
https://dtalks24x7.wordpress.com/2020/07/26/%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e2%80%8c%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c%e0%b0%ab%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a1%e0%b1%8d%e2%80%8c-%e0%b0%95%e0%b1%8a/

భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ కొవిడ్‌ టీకా 2-3 దశల ప్రయోగాలు డీసీజీఐ అనుమతి కోరిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ దిల్లీ: ఆక్స్‌....

హ్యాండ్ శానిటైజర్లు అతిగా వాడినా ప్రమాదమేనంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా అడ్వయిజరీలో హెచ్చరించింది. దేశంలో కరోనా మహమ్మారి...
26/07/2020

హ్యాండ్ శానిటైజర్లు అతిగా వాడినా ప్రమాదమేనంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా అడ్వయిజరీలో హెచ్చరించింది. దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర దశకు చేరుకున్న తరుణంలో ఆరోగ్య శాఖ ఈ అడ్వయిజరీ జారీ చేయడం విశేషం. 'ఇదొక అసాధారణ స్థితి. ఎవరికీ వైరస్ స్వభావం ఏమిటో తెలియని పరిస్థితి ఉంది. మనలను మనం రక్షించుకోవడానికి మాస్క్‌లు వాడండి. తరచు వేడినీరు తాగండి. చేతులు బాగా కడుక్కుంటూ ఉండండి. శానిటైజర్లను మాత్రం అతిగా వాడొద్దు' అని ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్.కె.వర్మ తెలిపారు. [ 32 more words ]
https://dtalks24x7.wordpress.com/2020/07/26/%e0%b0%b9%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%b6%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%9f%e0%b1%88%e0%b0%9c%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%85%e0%b0%a4%e0%b0%bf%e0%b0%97/

హ్యాండ్ శానిటైజర్లు అతిగా వాడినా ప్రమాదమేనంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా అడ్వయిజరీలో హెచ్చరించింది. దేశంలో కర.....

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారం రాత్రి 8 గంటల వరకు 1,593 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం బ...
26/07/2020

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారం రాత్రి 8 గంటల వరకు 1,593 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 54,059కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 641కేసులు నమోదుకాగా.. రంగారెడ్డిలో 171, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 131 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. కరోనా కారణంగా నిన్న 8 మంది ప్రాణాలు కోల్పోల్పోగా.. మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 463గా ఉంది. 41,332 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి కాగా.. మరో 12,264 మంది వివిధ కొవిడ్‌ ఆస్పత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. [ 32 more words ]
https://dtalks24x7.wordpress.com/2020/07/26/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b6%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%82-%e0%b0%b0%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf/

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారం రాత్రి 8 గంటల వరకు 1,593 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభు.....

పోలీస్ సిబ్బంది కరోనా వ్యాధి బారిన పడకుండా మాస్కులు, శానిటైజర్ లు పంపిణీ చేసిన హుస్నాబాద్ ఏసిపి మహేందర్ ఈరోజు హుస్నాబాద్...
26/07/2020

పోలీస్ సిబ్బంది కరోనా వ్యాధి బారిన పడకుండా మాస్కులు, శానిటైజర్ లు పంపిణీ చేసిన హుస్నాబాద్ ఏసిపి మహేందర్ ఈరోజు హుస్నాబాద్ ఏసిపి మహేందర్, సీఐ రఘు, ఎస్ఐ శ్రీధర్ కలసి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి కరోనా వ్యాధి బారిన పడకుండా మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏసిపి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలని, శానిటైజర్ బాటిల్ వెంబడి ఉంచుకోవాలని, ప్రజలతో మాట్లాడే సమయంలో భౌతిక దూరం పాటించాలని సూచించారు. పోలీస్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వెంటనే ఎస్ఐకి తెలియజేయాలని వారి ఆరోగ్య రక్షణ గురించి అన్ని చర్యలు చేపడతామని తెలిపారు. [ 42 more words ]
https://dtalks24x7.wordpress.com/2020/07/26/%e0%b0%ae%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b6%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%9f%e0%b1%88%e0%b0%9c%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%81-%e0%b0%aa%e0%b0%82/

పోలీస్ సిబ్బంది కరోనా వ్యాధి బారిన పడకుండా మాస్కులు, శానిటైజర్ లు పంపిణీ చేసిన హుస్నాబాద్ ఏసిపి మహేందర్ ఈరోజు .....

రాబోవు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో ఈరోజు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించిన హుస్నాబాద్ ఎస్ఐ...
26/07/2020

రాబోవు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో ఈరోజు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించిన హుస్నాబాద్ ఎస్ఐ శ్రీధర్ రాబోవు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో ఈరోజు హుస్నాబాద్ పోలీసు స్టేషన్ ఆవరణలో సమావేశం నిర్వహించిన హుస్నాబాద్ ఎస్ఐ శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బక్రీద్ సందర్భంగా గోవధ చేయవద్దని, ప్రభుత్వం గోవధ నిషేధించడం చేయడం జరిగిందని తెలిపారు. గోవధ చేసే వారిపై, మరియు గోవులను అక్రమంగా రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు మరియు పరస్పరం మతాలను గౌరవించుకుంటూ పండుగను నిర్వహించుకోవలని, అన్ని కులాల మతాల పండుగ పర్వదినాలను శాంతియుతంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, మత సామరస్యం గురించి ప్రతి ఒక్కరు పాటుపడాలని తెలిపారు. [ 126 more words ]
https://dtalks24x7.wordpress.com/2020/07/26/%e0%b0%ac%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%a6%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%82%e0%b0%a1%e0%b1%81%e0%b0%97-%e0%b0%b8%e0%b0%82%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ad%e0%b0%82%e0%b0%97%e0%b0%be/

రాబోవు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో ఈరోజు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించిన హుస.....

ఆరు అంబులెన్స్‌లు ఇస్తానని ప్రకటన కేటీఆర్ బాటలో పార్టీ నాయకులు వంద అంబులెన్స్‌లను సమకూర్చాలని నిర్ణయం టీఆర్‌ఎస్ పార్టీ వ...
25/07/2020

ఆరు అంబులెన్స్‌లు ఇస్తానని ప్రకటన కేటీఆర్ బాటలో పార్టీ నాయకులు వంద అంబులెన్స్‌లను సమకూర్చాలని నిర్ణయం టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓ ఆదర్శమంతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర మంత్రిగా ప్రజల నుంచి వచ్చే విజ్ఙప్తులను మానవీయకోణంలో పరిష్కరించే రామన్న.. తన పుట్టిన రోజునాడు తనవంతుగా ఆరు అంబులెన్స్‌లను ప్రభుత్వ ఆస్పత్రులకు ఇస్తానని ప్రకటించారు. పార్టీ నేతగా తాను ఇస్తానని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు చెప్పారు. [ 401 more words ]
https://dtalks24x7.wordpress.com/2020/07/26/%e0%b0%85%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%95%e0%b0%b0%e0%b1%8b%e0%b0%a8%e0%b0%be-%e0%b0%9f%e0%b1%86/

ఆరు అంబులెన్స్‌లు ఇస్తానని ప్రకటనకేటీఆర్ బాటలో పార్టీ నాయకులు వంద అంబులెన్స్‌లను సమకూర్చాలని నిర్ణయం టీఆర్‌....

పెళ్ళి భోజనం సమయంలో పీపీఈ కిట్లతో దిగిన బృందం బిత్తరపోయిన బంధువులు కృష్ణా జిల్లాలో జరిగిన ఓ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాల...
25/07/2020

పెళ్ళి భోజనం సమయంలో పీపీఈ కిట్లతో దిగిన బృందం బిత్తరపోయిన బంధువులు కృష్ణా జిల్లాలో జరిగిన ఓ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి వరకూ మామూలుగా జరిగితే అందులో వింతేముంది. పెళ్ళికి వచ్చిన వారికి భోజనం వడ్డించే దగ్గరే ఒక విచిత్రం జరిగింది. పెళ్ళికి వచ్చిన అతిధులకు భోజనం వడ్డించే క్యాటరింగ్ బాయ్స్ అందరూ పీపీఈ కిట్లు వేసుకొని రావడంతో పెళ్లికొచ్చిన వారంతా బిత్తరపోయారు. తొలుత కరోనా పేషెంట్ల కోసం వచ్చారని పొరపడినా తరువాత విషయం తెలుసుకొని, మీ జాగ్రత్తలు పాడుగానూ అంటూ ముసిముసిగా నవ్వుకున్నారు. - డి టాక్స్ 24x7
https://dtalks24x7.wordpress.com/2020/07/25/%e0%b0%aa%e0%b1%80%e0%b0%aa%e0%b1%80%e0%b0%88-%e0%b0%95%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%a6%e0%b0%bf%e0%b0%97%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%ac%e0%b1%83%e0%b0%82%e0%b0%a6/

పెళ్ళి భోజనం సమయంలో పీపీఈ కిట్లతో దిగిన బృందం బిత్తరపోయిన బంధువులు కృష్ణా జిల్లాలో జరిగిన ఓ పెళ్లి ఇప్పుడు సోష...

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం అన్నవరం బైపాస్ NH16 లో కారు , లారీ ఢీ. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు. కారులో ముగ్గురు ప్రయాణ...
25/05/2020

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం అన్నవరం బైపాస్ NH16 లో కారు , లారీ ఢీ. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు. కారులో ముగ్గురు ప్రయాణికులు. ఇద్దరికి గాయాల, ఒకరి పరిస్థితి విషమం. గాయపడ్డాడిన వారిని తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కారు విజయనగరం వెళ్తున్నటు సమాచారం.
https://dtalks24x7.wordpress.com/2020/05/25/%e0%b0%85%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%b5%e0%b0%b0%e0%b0%82-%e0%b0%ac%e0%b1%88%e0%b0%aa%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d-nh16-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%81-%e0%b0%b2%e0%b0%be/

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం అన్నవరం బైపాస్ NH16 లో కారు , లారీ ఢీ. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు. కారులో ముగ్గురు ప్.....

గుంటూరు రూరల్ పోలీస్: సకాలం లో రక్త దానం చేసి మహిళ ప్రాణం కాపాడిన దాచేపల్లి ఎస్ ఐ బాలనాగి రెడ్డి కుటుంబ కలహాలు నేపథ్యం ల...
25/05/2020

గుంటూరు రూరల్ పోలీస్: సకాలం లో రక్త దానం చేసి మహిళ ప్రాణం కాపాడిన దాచేపల్లి ఎస్ ఐ బాలనాగి రెడ్డి కుటుంబ కలహాలు నేపథ్యం లో భార్య ను కత్తి తో పొడిచిన భర్త దాచేపల్లి మండలం దుర్గ భవాని కాలనీ లో భార్య కాపురానికి రాలేదని భర్త భార్య ఇంటి వద్దకు వెళ్లినప్పుడు భార్య భర్తల మధ్య జరిగిన ఘర్షణలో భర్త తమ్మిశెట్టి శివ భార్య షేక్ జానీ ని కత్తితో కడుపులో పొడిచిన భర్త గుంటూరు జిజిహెచ్ నందు ఆపరేషన్ నిమిత్తం అత్యవసరంగా రక్తము అవసరం కాగా మానవతా దృకదంతో దాచేపల్లి ఎస్ఐ ఈ బాల నాగిరెడ్డి రక్త దానం చేసి ఆమెను కాపాడినారు.
https://dtalks24x7.wordpress.com/2020/05/25/%e0%b0%b8%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%82-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4-%e0%b0%a6%e0%b0%be%e0%b0%a8%e0%b0%82-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%b9/

గుంటూరు రూరల్ పోలీస్: సకాలం లో రక్త దానం చేసి మహిళ ప్రాణం కాపాడిన దాచేపల్లి ఎస్ ఐ బాలనాగి రెడ్డి కుటుంబ కలహాలు న.....

అమరావతి: ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాస్‌పోర్ట్‌ స్వా...
25/05/2020

అమరావతి: ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాస్‌పోర్ట్‌ స్వాధీనపరచాలని కంపెనీ డైరెక్టర్లను ఆదేశించింది. తమ అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లొద్దని పేర్కొంది. లాక్‌డౌన్‌ తర్వాత కంపెనీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు.. ఎవరి పర్మిషన్‌ తీసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. ఎల్జీ పాలిమర్స్‌ పరిసరాలను సీజ్‌ చేయాలని.. కంపెనీ డైరెక్టర్లతో సహా ఏ ఒక్కరినీ లోనికి అనుమతించకూడదని తెలిపింది. గ్యాస్‌ దుర్ఘటనపై విచారణ జరుపుతున్న కమిటీలు మాత్రమే ఎల్జీ పాలిమర్స్‌ పరిసరాల్లోకి ప్రవేశించవచ్చని తెలిపింది. [ 75 more words ]
https://dtalks24x7.wordpress.com/2020/05/25/%e0%b0%86%e0%b0%82%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d%e0%b0%8e%e0%b0%b2%e0%b1%8d%e0%b0%9c%e0%b1%80-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf%e0%b0%ae/

అమరావతి: ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాస్‌పో...

లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో కేంద్రం దేశీయ ప్రయాణాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. విమాన, రైలు, అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణ...
25/05/2020

లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో కేంద్రం దేశీయ ప్రయాణాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. విమాన, రైలు, అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణాలకు ఈ మార్గదర్శకాలు ఉపకరించనున్నాయి. టికెట్ బుకింగ్ ఏజెన్సీలు టికెట్లతో పాటు వివరాలు కూడా ముద్రించాలని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రయాణికులు తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్ వద్ద కరోనాపై ప్రకటనలు చేయాలని ఆదేశించింది. విమానాలు, బస్సులు, రైళ్లలో పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రకటనలు చేయాలని వివరించింది. ప్రయాణాలకు సిద్ధమైన వారు తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలని కేంద్రం పేర్కొంది. [ 70 more words ]
https://dtalks24x7.wordpress.com/2020/05/25/%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b1%80%e0%b0%af-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%af%e0%b0%be%e0%b0%a3%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%a6%e0%b0%b0/

లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో కేంద్రం దేశీయ ప్రయాణాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. విమాన, రైలు, అంతర్రాష్ట్ర బస.....

రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఎండలకు జనాలు జంకుతున్నారు. రాష్ట్...
25/05/2020

రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఎండలకు జనాలు జంకుతున్నారు. రాష్ట్రంలో అధికంగా వడగాల్పుల తీవ్రత ఉంది. వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాగల రెండు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట వరకు నమోదైన ఉష్ణోగ్రతలను ప్రకటించారు. జగిత్యాలలో 47. 2 డిగ్రీల ఉష్ణోగ్రత, పెద్దపల్లిలో 47.0, మంచిర్యాలలో 46.9, నల్లగొండలో 46.8, పెద్దపల్లిలో 46.7, భద్రాద్రి కొత్తగూడెంలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. [ 165 more words ]
https://dtalks24x7.wordpress.com/2020/05/25/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ad%e0%b0%be%e0%b0%a8%e0%b1%81%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%89%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b0%e0%b1%82%e0%b0%aa/

రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఎండలకు జనాలు జంకుతున్నా...

విదేశాల్లో చిక్కుబడిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఉద్దేశించిన స్పెషల్ విమానాల్లో మధ్య సీటును ఖాళీగా ఉంచాల్సిందేన...
25/05/2020

విదేశాల్లో చిక్కుబడిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఉద్దేశించిన స్పెషల్ విమానాల్లో మధ్య సీటును ఖాళీగా ఉంచాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. భౌతిక దూరం అన్నది చాలా ముఖ్యమని పేర్కొంది. బయట ఒక్కో వ్యక్తికి మధ్య ఆరు అడుగుల దూరాన్ని పాటిస్తున్నప్పుడు విమానాల్లో మధ్య సీటునుఖాళీగా ఉంచకపోవడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించింది. అయితే నిపుణుల సలహా పైనే విమానాల్లో మధ్య సీటును ఖాళీగా ఉంచడంలేదని కేంద్రం తరపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. సరైన విధానమేమిటంటే టెస్టింగ్, క్వారంటైన్ అన్నవే అని ఆయన పేర్కొన్నారు. [ 31 more words ]
https://dtalks24x7.wordpress.com/2020/05/25/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ae%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af-%e0%b0%b8%e0%b1%80%e0%b0%9f%e0%b1%81-%e0%b0%96%e0%b0%be%e0%b0%b3/

విదేశాల్లో చిక్కుబడిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఉద్దేశించిన స్పెషల్ విమానాల్లో మధ్య సీటును ఖాళీగ.....

న్యూఢిల్లీ: భారత్  రోజు రోజుకు ఉగ్రరూపం దాలుస్తోన్న కరోనా గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6 వేల 977 పాజిటివ్ కేసులు న...
25/05/2020

న్యూఢిల్లీ: భారత్ రోజు రోజుకు ఉగ్రరూపం దాలుస్తోన్న కరోనా గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6 వేల 977 పాజిటివ్ కేసులు నమోదు దేశంలో వైరస్ బయటపడ్డ తరువాత 24 గంటల్లో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి దేశంలో కరోనా బాధితుల సంఖ్య లక్షా 38 వేల 845లు నిన్న ఒక్కరోజే 154 మంది మృత్యువాత మొత్తం కరోనా మరణాల సంఖ్య 4 వేల 21కి చేరిక మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 57 వేల 720 మంది కోలుకొని డిశ్చార్జ్ మరో 77 వేల 103 మందికి కొనసాగుతున్న చికిత్స
https://dtalks24x7.wordpress.com/2020/05/25/%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81%e0%b0%95%e0%b1%81-%e0%b0%89%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b0%e0%b1%82/

న్యూఢిల్లీ: భారత్ రోజు రోజుకు ఉగ్రరూపం దాలుస్తోన్న కరోనా గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6 వేల 977 పాజిటివ్ కేసు....

అమరావతి రెండు నెలల తర్వాత ఎపి లో అడుగు పెట్టిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎపి, తెలంగాణ సరిహద్దు గరికపాడు చెక్ పోస్ట్...
25/05/2020

అమరావతి రెండు నెలల తర్వాత ఎపి లో అడుగు పెట్టిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎపి, తెలంగాణ సరిహద్దు గరికపాడు చెక్ పోస్ట్ దాటిన చంద్రబాబు నాయుడు మార్చి 22న హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు నాయుడు లాక్ డౌన్ అమల్లోకి రావడంతో అక్లడే ఉండిపోయిన చంద్రబాబు నాయుడు లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో ఎపికి వచ్చిన చంద్రబాబు నాయుడు విశాఖపట్నం వెళ్లాల్సి ఉన్నా.. విమానాలు రద్దు కావడంతో పర్యటన వాయిదా రోడ్డు మార్గాన హైదరాబాద్ నుండి తాడేపల్లి లో తన నివాసానికి బయలుదేరిన చంద్రబాబు నాయుడు గరికపాడు చెక్‌ పోస్ట్ వద్ద చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వాహనాల వరకు అనుమతించిన పోలీసులు అదనంగా ఉన్న కార్లను ఆపి తనిఖీ చేసిన పోలీసులు
https://dtalks24x7.wordpress.com/2020/05/25/%e0%b0%b0%e0%b1%86%e0%b0%82%e0%b0%a1%e0%b1%81-%e0%b0%a8%e0%b1%86%e0%b0%b2%e0%b0%b2-%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%a4-%e0%b0%8e%e0%b0%aa%e0%b0%bf-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%85/

అమరావతి రెండు నెలల తర్వాత ఎపి లో అడుగు పెట్టిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎపి, తెలంగాణ సరిహద్దు గరికపాడు చె....

అవినీతి లేని పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగడపగడపకు సంక్షేమ ఫలాలు. మహిళామనులకే ప్రాదాన్యత అగ్రతాంబూలం.ఏడాదిలో 4 లక్షల ఉ...
25/05/2020

అవినీతి లేని పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగడపగడపకు సంక్షేమ ఫలాలు. మహిళామనులకే ప్రాదాన్యత అగ్రతాంబూలం.ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం : జగన్‌ పాలనా వ్యవస్థలో పూర్తిగా మార్పులు తీసుకువచ్చి ముందుకెళ్తున్నామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ‘మన పాలన-మీ సూచన’ పేరిట విభాగాల వారీగా సీఎం మేధోమథన సదస్సు నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల మెరుగుదలకు చర్యలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సదస్సులో జగన్‌ మాట్లాడుతూ. ‘అవినీతి, వివక్షకు ఎక్కడా తావులేకుండా పనిచేయడం ముఖ్యం. రాష్ట్రంలో గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ చక్కగా పనిచేస్తోంది [ 230 more words ]
https://dtalks24x7.wordpress.com/2020/05/25/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%85%e0%b0%ae%e0%b0%b0%e0%b0%be/

అవినీతి లేని పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగడపగడపకు సంక్షేమ ఫలాలు. మహిళామనులకే ప్రాదాన్యత అగ్రతాంబూలం.ఏడాది...

Address


Alerts

Be the first to know and let us send you an email when DTalks 24x7 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share