24/11/2023
తెలంగాణలో అధికారం ఎవరిది?
* తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ (TJF) సర్వే ఫలితాలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజాభిప్రాయాలను సేకరించింది తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్. సీనియర్ జర్నలిస్టులతో కూడిన బృందం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పర్యటించి... ప్రజాభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం చేసింది. అంశాలవారీగా క్షేత్రస్థాయి నుంచి పలు వివరాలను సేకరించి, క్రోడీకరించి సర్వే నివేదికను రూపొందించింది. నిష్పక్షపాతంగా నిర్వహించిన ఈ సర్వేలో... బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుందనే తేలింది. మేజిక్ ఫిగర్ ను దాటడంతో పాటు మెజార్టీ సీట్లను కేవసం చేసుకోబోతుంది.
ఏ పార్టీకి ఎన్ని సీట్లు..?
బీఆర్ఎస్ - 64 నుంచి 68
కాంగ్రెస్ - 34 నుంచి 38
బీజేపీ - 5 నుంచి 6
ఎంఐఎం - 6 నుంచి 7
బీ ఎస్ పీ - 1 నుంచి 2
ఇతరులు - 1 నుంచి 2
ఓట్ల శాతం విషయానికొస్తే 41 శాతం ఓట్లు బీఆర్ఎస్ కి వస్తాయని ఈ సర్వే చెబుతోంది. కాంగ్రెస్ కి 36 శాతం ఓట్లు వస్తాయి. బీజేపీకి 15 శాతం ఓట్లు వస్తాయి. ఎంఐఎం కి 3 శాతం ఓట్లు వస్తాయి.బీఎస్పీ కి 3, ఇతరులకు 2 శాతం ఓట్లు వస్తాయని ప్రజల అభిప్రాయాలను బట్టి తెలుస్తోంది.
బీఆర్ఎస్ అనుకూల అంశాలు:
- పదేళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలు
- హైదరాబాద్ నగర అభివృద్ధి
- పార్టీ అధినేత కేసీఆర్ పాలననే మెజార్టీ ప్రజలు కోరుకోవటం
- వ్యవసాయ రంగంపై ప్రధానంగా దృష్టి పెట్టడం,
- పరిశ్రమల ఏర్పాటు
- తెలంగాణ సాధించిన పార్టీగా గుర్తింపు
- కేసీఆర్, కేటీఆర్, హరీశ్ వరుస పర్యటనలు
- ప్రచారంలో అందరికంటే ముందు ఉండటంతో పాటు డిజిటల్ క్యాంపెయినింగ్ బాగా చేయటం.
బీఆర్ఎస్ ప్రతికూల అంశాలు:
- పదేళ్ల కాలంలో కీలకమైన హామీలను విస్మరించటం
- మేనిఫెస్టోలో ప్రజాకర్షక పథకాలు లేకపోవటం
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులపై వ్యతిరేకత ఉండటం
- బీసీలకు టికెట్ల కేటాయింపులో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవటం
- కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు.
- డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ సరిగా అమలు కాకపోవటం. చివర్లో తీసుకువచ్చిన గృహలక్ష్మి స్కీమ్ పట్టాలెక్కకపోవటం.
- దళితబంధు, బీసీ బంధు లబ్ధిదారుల ఎంపికలో నేతల ప్రమేయం
- కీలకమైన కాళేశ్వరంలో లోపాలు బయటపడటంతో ఇబ్బందికర పరిస్థితి.
కాంగ్రెస్‌కు అనుకూల అంశాలు:
- ఆరు గ్యారెంటీల హామీనే ప్రధాన ప్రచారం అస్త్రంగా కాంగ్రెస్ తీసుకుంది. గ్రౌండ్ లో కూడా ఈ విషయాన్ని ప్రధానంగా తీసుకెళ్తున్నారు.
- ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
- రైతులు, మైనార్టీ, బీసీల డిక్లరేషన్లను ప్రకటించినప్పటికీ.. ప్రజల్లో అంత చర్చ జరగటం లేదు. యూత్ డిక్లరేషన్ బాగా పని చేస్తోంది.
- రేవంత్ నాయకత్వాన్ని వద్దన్న నేతలంతా కలిసి ఐక్యంగా పని చేయటం కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చినట్లు అయింది.
- బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా భారీ సభలను తలపెట్టడంతో పాటు ప్రచారం విస్తృతంగా చేస్తోంది.
- కాళేశ్వరం లోపాల విషయంలో బీఆర్ఎస్, బీజేపీలను రాజకీయంగా ఇరుకునపెట్టడంతో పాటు ఎన్నికల వేళ బలమైన అస్త్రం దొరికినట్లు అయింది.
కాంగ్రెస్ ప్రతికూల అంశాలు:
- టికెట్ల ఖరారు అంశంలో చివరి వరకు జాప్యం చేయటం
- అగ్రనేతలు పర్యటనలే తప్ప రాష్ట్ర స్థాయి నేతలు క్యాంపెయినింగ్ చేయకపోవటం
- ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను విస్మరించటం, బీసీలకు టికెట్ల కేటాయింపు విషయంలో ప్రాధాన్యత ఇవ్వకపోవటం
- ముఖ్యమంత్రి పీఠంపై క్లారిటీ లేకపోవటం, అధికారంలోకి వచ్చినా నేతల మధ్య ఆధిపత్య పోరు ఉంటుందనే అభిప్రాయం బలంగా ఉండటం
- డిజటల్ క్యాంపెయినింగ్ లో కాస్త వెనకబడటం.
బీజేపీ అనుకూల అంశాలు:
- బీసీ ముఖ్యమంత్రి ప్రకటన బాగా కలిసి వచ్చే అంశం
- బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీసీలకు టికెట్లు ఇవ్వటం
- ప్రధాని మోదీతో పాటు అగ్రనేతల పర్యటనల ప్రభావం
ప్రతికూల అంశాలు:
- ఎన్నికల వేళ పార్టీ అధ్యక్షుడు(బండి సంజయ్) మార్పు
- బీఆర్ఎస్ - బీజేపీ ఒక్కటే అన్న బలమైన అభిప్రాయం ప్రజల్లో ఉండటం
- రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మాటల వరకే తప్ప పోరాటం చేయకపోవటం
- గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్టీలో వర్గపోరు కొనసాగుతుండటం
- పార్టీలో కొరవడిన సమన్వయం
బీఎస్పీకి అనుకూల అంశాలు:
- గతంలో కంటే బీఎస్పీకి తెలంగాణలో ఓటింగ్ శాతం పెరగనుంది.
- యువత ఓట్లను ఆకర్షించటం కలిసి వచ్చే అంశం.
- అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీకి ప్రధాన బలంగా కనిపిస్తున్నారు.
- బీసీలకు, ముఖ్యమైన నేతలకు టికెట్‌లు ఇవ్వడం.
- కొన్ని నియోజకవర్గాల్లో మంచి ఓట్లను సాధించబోతుంది.
బీఎస్పీకి ప్రతికూల అంశాలు:
- ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచార సభలు చేసుకోకపోవడం.
- సోషల్ మీడియాను బలంగా వాడుకోకపోవడం
- అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అనేది ప్రజలకు సరిగ్గా చేరవేయకపోవడం.
ప్రజలను అడిగిన ప్రశ్నలు :
సర్వే నిర్వహణలో భాగంగా మొదటి ప్రశ్నగా "మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు?" అంటూ ప్రజలను అడగటం జరిగింది.
రెండో ప్రశ్నగా "మీరు సదరు పార్టీకే ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు?" అని అడగటం జరిగింది.
ఇందులో భాగంగా "బీఆర్ఎస్ కు ఓటు వేస్తాం" అని సమాధానం ఇచ్చిన వారిని "ఎందుకు బీఆర్ఎస్ కు ఓటు వేయాలనుకుంటున్నారు?" అంటూ ప్రశ్నించగా సదరు వ్యక్తులు పలు రకాల సమాధానం ఇచ్చారు.
ఇందులో ప్రధానంగా "కెసిఆర్ పాలన బాగుంది" అంటూ అత్యధికంగా 51 శాతం మంది చెప్పారు.
"ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి" అంటూ 39 శాతం ప్రజలు చెప్పారు. "ఎమ్మెల్యే పనితీరు బాగుంది" అంటూ 8 శాతం మంది చెప్పారు. " "ప్రత్యామ్నాయం ఎవరూ లేరు" అంటూ 2 శాతం మంది చెప్పారు.
ఇక "కాంగ్రెస్ కు ఓటు వేస్తాం" అని సమాధానం ఇచ్చిన వారిని "ఎందుకు కాంగ్రెస్ కు ఓటు వేయాలనుకుంటున్నారు?" అంటూ ప్రశ్నించగా సదరు వ్యక్తులు కూడా పలు రకాల సమాధానాలు ఇచ్చారు.
"కాంగ్రెస్ పాలన కోరుకుంటున్నాము" అంటూ 36 శాతం మంది చెప్పారు. "కెసిఆర్ పాలన వద్దు" అంటూ 24 శాతం మంది చెప్పారు. "కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై అభిమానం" అంటూ 21 శాతం మంది చెప్పారు. "కాంగ్రెస్ హామీలు నచ్చాయి " అంటూ 19 శాతం మంది చెప్పారు.
---------------
తెలంగాణ జర్నలిస్తుల ఫోరమ్ నుంచి సీనియర్ జర్నలిస్టుల బృందం మొత్తం 119 నియోజకవర్గాల్లో ఈ సర్వే చేపట్టారు. రైతులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, నిరుద్యోగులు, చిన్నతరహా పరిశ్రమల వారు, కార్మికులు, గృహిణిలు.. ఇలా అన్ని వర్గాలనుంచి అభిప్రాయాలు సేకరించడం జరిగింది.
TIMES is a Biggest multi-lingual News platform, from Media Boss Network Company., which serves news content in English and seven Ind...