Nandyal Today

  • Home
  • Nandyal Today

Nandyal Today Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nandyal Today, Media/News Company, .

09/02/2023

ఈ బుడ్డోడు ఎంతబాగా చెప్తున్నాడో చూడండి. బజారుకేళితే అప్పులబాధ అంట, ఇంటికి వస్తే పెళ్ళాంబాధ అంట 🤪 😂🤣😂 🤷

https://youtu.be/VUNvPv3Z0lo
01/09/2022

https://youtu.be/VUNvPv3Z0lo

నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ మండలం, టి.లింగం దిన్నె గ్రామంలో టెంకాయ చెట్టుపై పిడుగుపాటు తప్పిన ప్రమాదం....... మండలంలోన.....

29/08/2022

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద,10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల,ఇన్ ఫ్లో 2,35,086 క్యూసెక్కులు,ఔ....

నంద్యాల నందమూరి నగర్ రోడ్డులోని పాత రాణి థియేటర్ ను అత్యాధునిక హంగులతో హారున్ ఫంక్షన్ హాల్ గా తీర్చిదిద్ది పట్టణ ప్రజలకు...
19/08/2022

నంద్యాల నందమూరి నగర్ రోడ్డులోని పాత రాణి థియేటర్ ను అత్యాధునిక హంగులతో హారున్ ఫంక్షన్ హాల్ గా తీర్చిదిద్ది పట్టణ ప్రజలకు నేటి నుంచి అందుబాటులోకి తీసుకొని వచ్చిన యాజమాన్యం.
ఈ ఫంక్షన్ హల్ ను నంద్యాల పట్టణ ప్రజలు ఆదరించాలని వారు కోరారు.

నంద్యాల జిల్లా :నంద్యాల నూతన జిల్లాగా ఏర్పడినప్పటినుంచి నేటికి డోన్ నుండి నంద్యాలకు బస్సు సర్వీసు లేకపోవడంతో ప్రజలు తీవ్...
18/08/2022

నంద్యాల జిల్లా :
నంద్యాల నూతన జిల్లాగా ఏర్పడినప్పటినుంచి నేటికి డోన్ నుండి నంద్యాలకు బస్సు సర్వీసు లేకపోవడంతో ప్రజలు తీవ్రఇబ్బంది పడుతున్న పరిస్ధితిని గమనించి ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు డోన్ నుండి నంద్యాలకు బస్సు సర్వీసు ప్రారంభిస్తున్నట్లు ఆర్.టి.సి అధికారులు తెలిపారు.
ఈ బస్సు ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు డోన్ నుండి బయలుదేరి నంద్యాలకు 9:30 గంటలకి చేరుతుంది.
తిరిగి నంద్యాల నుండి ఉదయం 10:00 గంటలకు బయలుదేరి మధ్యాన్నం ఒంటి గంటకు డోన్ చేరుతుంది.
మళ్ళీ డోన్ నుండి 1:15 నిమిషాలకు బయలుదేరి సాయంత్రం 4:00 గంటలకు చేరుతుంది.
తిరిగి నంద్యాల నుండి సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరి డోన్ కు రాత్రి 7:30 గంటలకు చేరుతుంది.
ఇలా ఈ బస్సు సర్వీసు ప్రతిరోజు తిరుగుతుంది ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు.

నంద్యాల జిల్లా :రైలు బండి నెంబర్ :17261 ( గుంటూరు నుండి తిరుపతి )17262 ( తిరుపతి నుండి గుంటూరు ) ఈ ఎక్స్ ప్రెస్ రైలు ఈ న...
18/08/2022

నంద్యాల జిల్లా :
రైలు బండి నెంబర్ :
17261 ( గుంటూరు నుండి తిరుపతి )
17262 ( తిరుపతి నుండి గుంటూరు )
ఈ ఎక్స్ ప్రెస్ రైలు ఈ నెల 18 వ తేదీ నుంచి ప్రతిరోజు సాయంత్రయం 4:30 గంటలకు
గుంటూరు లో బయలుదేరి రాత్రి 9:25 నిమిషాలకు నంద్యాల చేరును,
అలాగే నంద్యాల నుండి ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట మీదుగా తెల్లవారుజామున 4:25 నిమిషాలకు తిరుపతి చేరును.
తిరుగు ప్రయాణంలో తిరుపతి నుండి రాత్రి 7:35 నిమిషాలకు బయలుదేరి నంద్యాలకు తెల్లవారుజామున 1:55 నిమిషాలకు చేరును.
అలాగే గుంటూరుకు ఉదయం 8:00 గంటలకు చేరును.

https://youtu.be/N8MkS_PBuPg
15/08/2022

https://youtu.be/N8MkS_PBuPg

75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆజాదిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అనగా ఆగస్టు 14 వ తేదీ ఆదివార...

2021-22 వ సంవత్సరం పదోవ తరగతి నందు 400 పైబడి మార్కులుసాధించిన పేద ముస్లిం విద్యార్థిని విద్యార్థులకు ₹ 2500 రూపాయలు నగదు...
09/08/2022

2021-22 వ సంవత్సరం పదోవ తరగతి నందు 400 పైబడి మార్కులు
సాధించిన పేద ముస్లిం విద్యార్థిని విద్యార్థులకు ₹ 2500 రూపాయలు నగదు చెక్కును
బహుమతిగా ఇవ్వనున్నట్లు నంద్యాల అంజుమాన్ ఇస్లామీయ అధ్యక్షులు నశ్యం అబ్దుల్ ఖుద్దుస్ ఒక ప్రకటనలో తెలిపారు.
షరతులు :-
* విద్యార్థిని విద్యార్థులు నంద్యాల పట్టణవాసులై ఉండాలి.
* 2021-22 విద్య సంవత్సరంకుగాను 400 పైబడి మార్కులు సాధించి ఉండాలి.
* ప్రభుత్వ, మునిసిపల్ మరియు ఎయిడెడ్ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును.
గమనిక : విద్యార్థులు అప్లికేషన్లను నంద్యాల బస్టాండ్ దెగ్గరున్న అంజుమన్ ఇస్లామియా కార్యాలయంలో అందజేయవలెనని తెలియజేసారు.

కర్నూల్ జిల్లా ఆదోని ఆర్టీసీ డిపోలో డ్రైవర్లుగా పని చేసేందుకు అర్హులైన అభ్యర్థులుదరఖాస్తు చేసుకోవాలని డిపో మేనేజర్ ఎం.డి...
09/08/2022

కర్నూల్ జిల్లా ఆదోని ఆర్టీసీ డిపోలో డ్రైవర్లుగా పని చేసేందుకు అర్హులైన అభ్యర్థులు
దరఖాస్తు చేసుకోవాలని డిపో మేనేజర్ ఎం.డి.రఫిక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హతలు :-
* హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
* 18 నెలలు డ్రైవింగ్ లో అనుభవం ఉండాలి.
* వయస్సు 21 సంవత్సరాల నుండి 62 ఏళ్లలోపు ఉండాలి.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు నేరుగా ఆదోని APSRTC డిపోలో సంప్రదించాలన్నారు.
రోజుకు 600 రూపాయల నుండి 1200 రూపాయలు చెల్లిస్తామని డిపో మేనేజర్ తెలిపారు.

రాబోయే రెండు, మూడు రోజుల్లో జిల్లాలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం ...
08/08/2022

రాబోయే రెండు, మూడు రోజుల్లో జిల్లాలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అలాగే కుందు నది పరివాహక ప్రాంతప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు.
ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలు, ఉద్యాన పంటలు మరియు పశు సంపద నష్టపరిహారం అంచనా వేయాల్సిందిగా జిల్లా వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ప్రధానంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరంగా చేపట్టాలని మునిసిపల్ మరియు సంబంధిత అధికారులను ఆదేశించారు.
సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు తగిన వైద్య చికిత్సలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత వైద్యులను ఆదేశించారు.
అలాగే నివాసిత ప్రాంతాల్లో క్రిందికి వేలాడుతూ ప్రమాదకరంగా మారిన విద్యుత్ లైన్లను, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి వెంటనే తగిన మరమ్మతులు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

https://youtu.be/Rlvw1ke8ISc
08/08/2022

https://youtu.be/Rlvw1ke8ISc

నంద్యాల జిల్లా నంద్యాల లో నిన్న రాత్రి హత్యకు గురైన కానిస్టేబుల్ సురేంద్ర మృతదేహానికి నేడు పోస్టు మార్టం అనంత....

నంద్యాల లో కానిస్టేబుల్ సురేంద్ర దారుణ హత్య... ఒక్కసారిగా పోలీస్ శాఖలో అలజడి.ఘటన పై ఎస్పీ సీరియస్, దుండగులు ఎంతటి వారైనా...
07/08/2022

నంద్యాల లో కానిస్టేబుల్ సురేంద్ర దారుణ హత్య... ఒక్కసారిగా పోలీస్ శాఖలో అలజడి.
ఘటన పై ఎస్పీ సీరియస్, దుండగులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అంటున్న ఎస్పీ.
హత్యకు ముందు కిడ్నప్, అనంతరం హత్య చేసినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నంద్యాల కలెక్టరేట్ యూనిట్ కు ఎన్నికలు ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలల...
07/08/2022

ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నంద్యాల కలెక్టరేట్ యూనిట్ కు ఎన్నికలు ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో సభ్యులందరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కలెక్టరేట్ యూనిట్ ప్రెసిడెంట్ గా శ్రీ K.L.V.ప్రసాద రావు గారు, అసోసియేట్ ప్రెసిడెంట్ గా శ్రీ ఆదినారాయణ గారు, సెక్రటరీగా O.K.రామసంజీవ గారు, కోశాధికారి గా నారాయణ స్వామి గారు, వైస్ ప్రెసిడెంట్స్ గా శ్రీమతి సురేఖ, హేమంత్ కుమార్, నిఖిలేశ్వరుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మీనా కుమార్ మరియు జాయింట్ సెక్రటరీ లు గా సాయినాథ్ రావు, వెంకటేశ్వర్లు,రేకుల శ్రీధర్ లను ఏకగ్రీవంగా సభ్యులందరు కలిసి ఎన్నుకోవడం జరిగింది.

నంద్యాల జిల్లా పాణ్యం మండలం కొత్తూరు నుండి తేల్లపురి వెళ్లే దారిలో గగ్గటూర్ వద్ద వాగు ఉధృతికి కొట్టుకుపోయిన కారు, ఒకరు మ...
07/08/2022

నంద్యాల జిల్లా పాణ్యం మండలం కొత్తూరు నుండి తేల్లపురి వెళ్లే దారిలో గగ్గటూర్ వద్ద వాగు ఉధృతికి కొట్టుకుపోయిన కారు, ఒకరు మృతి మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా త్రివర్ణ విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్న కర్నూలు కొండారెడ్డి బురుజు.
07/08/2022

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా త్రివర్ణ విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్న కర్నూలు కొండారెడ్డి బురుజు.



ఈ రోజు నంద్యాల లో 75 వ స్వతంత్ర దినోత్సవం లో భాగంగా భారత ప్రధాని పిలుపు మేరకు అజాదిక అమ్రిత్ మహోత్సవ్ సందర్భంగా హర్ ఘర్ ...
07/08/2022

ఈ రోజు నంద్యాల లో 75 వ స్వతంత్ర దినోత్సవం లో భాగంగా భారత ప్రధాని పిలుపు మేరకు అజాదిక అమ్రిత్ మహోత్సవ్ సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు 300 అడుగుల భారీ జాతీయ జెండాతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, డిఎస్పీ మహేశ్వర రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి, ఇతర శాఖల అధికారులు, విద్యార్థిని & విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొన్నారు.



Beauty of Kolkatahttps://youtu.be/btL7MTyF_FY
07/08/2022

Beauty of Kolkata

https://youtu.be/btL7MTyF_FY

Howra Bridge on Hooghly River is Located Near at Howra Railway Station, Kolkata, West Bengal, India.

జగదీప్ ధన్కర్ గారు మన భారతదేశ ఉపరాష్ట్రపతి గా ఎన్నికయ్యారు. వారికి మా Nandyal Today ఛానల్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు.
07/08/2022

జగదీప్ ధన్కర్ గారు మన భారతదేశ ఉపరాష్ట్రపతి గా ఎన్నికయ్యారు. వారికి మా Nandyal Today ఛానల్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు.

Address


Alerts

Be the first to know and let us send you an email when Nandyal Today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share