ఆంధ్రభారతి

  • Home
  • ఆంధ్రభారతి

ఆంధ్రభారతి తెలుగు జాతీయవాద రచనలు వార్తల సమాహారం

11/10/2023
MNC ఫార్మా కంపెనీల దోపిడీకి చెక్ పెట్టిన భారత్. మోదీ ప్రభుత్వం మీద ద్వేషానికి ఇదో కారణం
11/10/2023

MNC ఫార్మా కంపెనీల దోపిడీకి చెక్ పెట్టిన భారత్. మోదీ ప్రభుత్వం మీద ద్వేషానికి ఇదో కారణం

ఈమధ్య జరిగిన కోకాపేట ఫినాన్సిల్ డిస్ట్రిక్ట్  నియోపోలిస్ భూముల వేలంలో  దేవుడి మాన్యం కూడా కలిపి అమ్మిన HMDA. ఆందోళనలు చే...
15/09/2023

ఈమధ్య జరిగిన కోకాపేట ఫినాన్సిల్ డిస్ట్రిక్ట్ నియోపోలిస్ భూముల వేలంలో దేవుడి మాన్యం కూడా కలిపి అమ్మిన HMDA. ఆందోళనలు చేస్తున్న ఖానాపూర్ గ్రామస్తులు. పూర్తి వార్త https://telugu.asianetnews.com/telangana/khanapur-villagers-protest-against-kokapet-lands-auction-akp-s0reo4

డాల్డా Hindustan Lever దేశంలోని మొట్టమొదటి కూరగాయల నెయ్యి, ఆ రోజుల్లో స్వతంత్ర భారతదేశంలో చాలా ధనవంతుడైన సేథ్ రామకృష్ణ ద...
14/09/2023

డాల్డా Hindustan Lever దేశంలోని మొట్టమొదటి కూరగాయల నెయ్యి, ఆ రోజుల్లో స్వతంత్ర భారతదేశంలో చాలా ధనవంతుడైన సేథ్ రామకృష్ణ దాల్మియా యాజమాన్యంలో ఉంది, టాటా బిర్లా, దాల్మియా అనే మూడు పేర్లు చిన్నప్పటి నుంచి వింటున్నాం.

దాల్మియా కుటుంబం ఇప్పుడు వ్యాపారంలో ఎక్కడా కనిపించదు పేరు వినిపించదు, నెహ్రూ టైంలో కూడా లక్ష కోట్లకు యజమాని అయిన దాల్మియాను కుట్రల్లో ఇరికించి నెహ్రూ ఎలా నాశనం చేశాడో చదవాలి.

దాల్మియా జీ, స్వామి కర్పాత్రి జీ మహారాజ్‌తో కలిసి గోహత్య నిషేధం, హిందూ కోడ్ బిల్లు విషయంలో నెహ్రూతో గట్టి పోరాటం చేశారు. కానీ నెహ్రూ, హిందువుల మనోభావాలను అణచివేసి, గోహత్యను నిషేధించలేదు హిందూ కోడ్ బిల్లును కూడా ఆమోదించాడు
ప్రతీకారంగా, అతను హిందువుల సేథ్ దాల్మియాను జైలులో పెట్టాడు. అతని పరిశ్రమలను నాశనం చేశాడు.

నెహ్రూ ముందు తల ఎత్తిన వ్యక్తిని నెహ్రూ మట్టికరిపించాడనేది చరిత్ర సాక్షి.

మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సుభాష్ బాబుల పట్ల ఆయన నిర్దయగా ప్రవర్తించిన తీరు దేశప్రజలకు తెలుసు, కానీ చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు కానీ ఆయన మొండితనం కారణంగా ఆ కాలంలో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్త సేఠ్‌ రామకృష్ణ దాల్మియాపై క్రూరంగా కేసులు పెట్టారని చాలా తక్కువ మందికి తెలుసు, అతన్ని చాలా సంవత్సరాలు జైలులో మగ్గించడమే కాకుండా ప్రతి పైసాపై ఆధారపడేలా చేశాడు.

దాల్మియా కలకత్తా లో బులియన్ మార్కెట్‌లో సేల్స్‌మెన్‌గా తన వ్యాపార జీవితాన్ని ప్రారంభించాడు, పారిశ్రామిక సామ్రాజ్యం దేశవ్యాప్తంగా విస్తరించింది వార్తాపత్రికలు, బ్యాంకులు, బీమా కంపెనీలు, విమానయాన సంస్థలు, సిమెంట్, వస్త్ర పరిశ్రమలు, ఆహార వస్తువులు వందలాది పరిశ్రమలను కలిగి ఉండేది, దాల్మియా సేథ్‌కు దేశంలోని పెద్ద నాయకులందరితో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి అతను వారికి ముక్తకంఠంతో ఆర్థిక సహాయం చేసేవాడు.

దాల్మియా దృఢమైన సనాతన హిందువు అని అతను ప్రసిద్ధ హిందూ సన్యాసి స్వామి కర్పాత్రి జీ మహారాజ్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని చెబుతారు. కర్పాత్రి జీ మహారాజ్ 1948లో 'రామరాజ్య పరిషత్' అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 1952 ఎన్నికలలో ఆ పార్టీ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించి 18 సీట్లు గెలుచుకుంది. హిందూ కోడ్ బిల్లు, గోహత్య నిషేధంపై నెహ్రూ దాల్మియాతో గొడవపడ్డారు. నెహ్రూ హిందూ కోడ్ బిల్లును ఆమోదించాలని కోరుకున్నారు, అయితే స్వామి కర్పాత్రి జీ మహారాజ్ దాల్మియా సేథ్ వ్యతిరేకించారు.

స్వామి కర్పాత్రీజీ మహారాజ్ హిందూ కోడ్ బిల్లు గోహత్యను నిషేధించాలని దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించారు, దీనికి దాల్మియా జీ గట్టిగా మద్దతునిచ్చి ఆర్థిక సహాయాన్ని అందించారు. నెహ్రూ ఒత్తిడి మేరకు లోక్‌సభలో హిందూ కోడ్ బిల్లు ఆమోదం పొంది హిందూ మహిళలకు విడాకులు ఇవ్వడానికి అవకాశం కల్పించింది. దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ హిందూ కోడ్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారని, అందుకే ఆయన దానిని ఆమోదించడానికి నిరాకరించారని చెబుతున్నారు.

మొండి పట్టుదలగల నెహ్రూ దీనిని అవమానంగా భావించి, పార్లమెంటు ఉభయ సభల ద్వారా ఈ బిల్లును మళ్లీ ఆమోదించి రాష్ట్రపతికి పంపారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. ఈ సంఘటన నెహ్రూ దాల్మియాకు బద్ధ శత్రువుగా మారింది. నెహ్రూ తన ప్రత్యర్థి అయిన సేఠ్ రామకృష్ణ దాల్మియాను పారద్రోలేందుకు పథకం పన్నినట్లు చెబుతున్నారు. నెహ్రూ పిలుపు మేరకు దాల్మియాపై కార్పొరేట్ కుంభకోణాల ఆరోపణలు లోక్‌సభలో తీవ్రంగా లేవనెత్తారు.

ఈ ఆరోపణలపై విచారణకు వివిన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. తర్వాత ఈ కేసు దర్యాప్తు కోసం స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (నేడు సీబీఐ)కి అప్పగించబడింది. నెహ్రూ తన మొత్తం ప్రభుత్వాన్ని దాల్మియాకు వ్యతిరేకంగా మోహరించారు.ప్రధానమంత్రి పిలుపుతో ప్రతి ప్రభుత్వ శాఖలోనూ వేధింపులు మొదలయ్యాయి.

అతను అనేక నిరాధారమైన కేసుల్లో చిక్కుకున్నాడు. నెహ్రూ ఆగ్రహం రూ.లక్ష కోట్ల యజమాని దాల్మియాను దివాళా తీసింది, అతను టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ లివర్ అనేక ఇతర పరిశ్రమలను చౌకగా విక్రయించాల్సి వచ్చింది. కోర్టులో విచారణ జరిగింది దాల్మియాకు మూడేళ్ల జైలు శిక్ష విధించబడింది.

నెహ్రూ వంకర దృష్టి కారణంగా నాశనమైన వ్యక్తి ఆటైంలో అత్యంత ధనవంతుడు దాల్మియా జైలు గదిలో రోజుల తరబడి గడపవలసి వచ్చింది.వ్యక్తిగత జీవితంలో, దాల్మియా చాలా మతపరమైన స్వభావం గల వ్యక్తి.

మంచి సమయంలో అతను మత సామాజిక కార్యక్రమాలకు కోట్లాది రూపాయలను విరాళంగా ఇచ్చాడు. అంతే కాకుండా దేశంలో గోహత్యను నిషేధించే వరకు తాను ఆహారం తీసుకోనని ప్రతిజ్ఞ కూడా చేశారు. తన చివరి శ్వాస వరకు ఈ తీర్మానాన్ని కొనసాగించారు. గోహత్యకు వ్యతిరేకంగా 1978లో ప్రాణత్యాగం చేశారు.
-మోహన్ కిషోర్ నిమ్మా

ఇంత రీజనబుల్ ఓపెన్ ఆఫర్ నా జీవితంలో చూడలేదు. ఆలస్యం అమృతం విషం కాబట్టి టీడీపీని విలీనం చేయటమే ఉత్తమం
14/09/2023

ఇంత రీజనబుల్ ఓపెన్ ఆఫర్ నా జీవితంలో చూడలేదు. ఆలస్యం అమృతం విషం కాబట్టి టీడీపీని విలీనం చేయటమే ఉత్తమం

"అన్ని రకాలుగా ప్రయత్నం చేసినా న్యాయం లభించకపోతే కత్తి పట్టుకునే హక్కు మీకుంది"  అనే గురుగోవింద సింగ్ సూక్తిని నేటి ప్రజ...
13/09/2023

"అన్ని రకాలుగా ప్రయత్నం చేసినా న్యాయం లభించకపోతే కత్తి పట్టుకునే హక్కు మీకుంది" అనే గురుగోవింద సింగ్ సూక్తిని నేటి ప్రజాస్వామ్య యుగంలో ట్వీటిన సిద్ధార్థ లూధ్రా.

ఈయన నిజానికి క్రిమినల్ లాయర్ లా లేడు. వీడే పెద్ద క్రిమినల్ లాగున్నాడు. వంగవీటి, పరిటాల హత్యల తరువాత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అల్లర్లు అందరం చూశాం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు రావాలని ఈయన ఉద్దేశమా?

ఇదే మాట బిజెపి లేదా హిందూ సంస్థలవాళ్ళెవరైనా అనిఉంటే ఈపాటికి శిఖరాలు సుమోటో అంటూ హడావుడి చేసేవి. కత్తులు పట్టుకునేకాడికి నీ కోర్టులెందుకు? నీలాంటి అడ్వొకేట్లెందుకు? కోట్లలో ఫీజులెందుకు? కోర్టులో కేసు ఓడిపోయిన ప్రతి ఒక్కరూ కత్తిపట్టుకుంటే సమజం గతి ఏంటి?

సనాతన ధర్మం నేర్పే సంస్కారం..  సూరత్ లో ఒకామె తమ ఇంట్లో 50 ఏళ్ళు సేవచేసిన పనిమనిషికి సేవలు చేస్తోంది.సూరత్ లో ఓ కాలేజీలో...
12/09/2023

సనాతన ధర్మం నేర్పే సంస్కారం..

సూరత్ లో ఒకామె తమ ఇంట్లో 50 ఏళ్ళు సేవచేసిన పనిమనిషికి సేవలు చేస్తోంది.

సూరత్ లో ఓ కాలేజీలో ప్రొఫెసర్ గారు పని చేసే మహిళ, ఆమె భర్తకూడా కాలేజీ ప్రొఫెసర్ అప్పట్లో వారికి ఉద్యోగరీత్యా ఇబ్బందిగా ఉండడంతో పిల్లల్ని చూసుకునేందుకు రాజు బెన్ గామిత్ అనే ఆదివాసీ మహిళను పనిలో పెట్టుకున్నారు.

ఆ ఆదివాసీ మహిళ వారింట్లో 50 ఏళ్ళు పనిచేసింది, అనంతరం ఆమె అనారోగ్యానికి గురైంది. కాలక్రమంలో పిల్లలు పెద్దవాళ్లయ్యారు, ప్రభుత్వోద్యోగులు అయ్యారు తమపాటికి తాము ఉంటున్నారు, వారు తమ తల్లినే తమదగ్గర ఉంచుకోవడానికి నిరకరించారు.

గత 5ఏళ్లనుండి రిటైర్ అయిన ఆ ప్రొఫెసర్ దంపతులు తమవద్ద పనిచేసిన ఆదివాసీ మహిళకు సేవలందిస్తున్నారు. 95 ఏళ్ల ఆ మహిళను వారే ఆస్పత్రికి తీసుకెళ్లి సేవలు చేస్తున్నారు.

ఆమె ఆదివాసీ మహిళ కావడంతో దేహానంతర క్రియాకర్మ విధివిధానాలు ఇత్యాదులపై ప్రొఫెసర్ దంపతులు కోర్టు అనుమతికూడా తీసుకున్నారు, అనంతరం న్యాయపరమైన చిక్కులు ఏర్పడకుండా.

ఆలోచిస్తే, కుక్కలకి సేవలు చేసుకునే పట్టణ వాతావరణంలో తమవద్ద పనిచేసిన 95ఏళ్ల వృద్ధురాలికి సేవలు చేసుకుంటున్న ప్రొఫెసర్ దంపతులు ఎంతటి ధన్యులో కదా. 🙏🙏🙏

ఓ హిందీ మిత్రుని పోస్ట్ కి తెలుగు స్వేచ్చానువాద ప్రయత్నం.

Courtesy: Sarat Kumar 🙏

10/09/2023

Dr. Qamar Cheema is an Islamabad-based Academic and Stretegic analyst. My area of interest is Islamist Parties of Pakistan, Indo Pacific Region and South Asi...

09/09/2023

भारत जी20 शिखर सम्मेलन की सफलता 4 प्रमुख उपलब्धियां India G20 Summit is Already a Big Success 4 Major AchievementsJoin this channel to get greater access to...

06/09/2023

మనదేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న
ఇండియారత్న కాదు

06/09/2023

Heated Argument Between Kapil Sibal and Solicitor General, Article 370 hearing Source: Supreme Court of India Legal Lab Official: https://youtube.com/...

ప్రాచీన భారతదేశానికి ఆర్యావర్తం అని, భరతవర్షం,ళభరతఖండం అని పేర్లు.  భారత్ అనే పదం మనదేశానికి అన్ని విధాలుగా సరైనది. భారత...
06/09/2023

ప్రాచీన భారతదేశానికి ఆర్యావర్తం అని, భరతవర్షం,ళభరతఖండం అని పేర్లు. భారత్ అనే పదం మనదేశానికి అన్ని విధాలుగా సరైనది. భారతీయులు పుట్టిన దగ్గర నుంచి మరణించిన సందర్భం వరకు చేసే ప్రతి శుభాశుభ కర్మలకు ముందు చెప్పేటప్పుడు జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని సంకల్పం చెబుతాము. శకుంతల-దుష్యంతుల కుమారుడైన భరతుడి పేరు మీదుగా భరతవర్షం అని పేరు వచ్చింది.

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి "భారత" అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడిని ఓ భరత వంశీయుడా అని సంబోధిస్తారు. ఆధునిక కాలంలో చూస్తే క్రికెట్ కామెంటరీ వచ్చేటప్పుడు గమనిస్తే స్టోర్ బోర్డు మీద IND అని కనబడినా భారత్ అనే కామెంటేటర్లు సంబోధిస్తారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, భారత్ ఎర్త్ మూవర్స్, భారతీయ రైల్, భారత్ సంచార్ నిగం లిమిటెడ్ లాంటి ఎన్నో కేంద్ర ప్రభుత్వ , ప్రైవేటుసంస్థల్లో భారతీయత కనబడుతుంది. భారత్ ఏక్ ఖోజ్ లాంటి చాలా టీవీ సీరియల్స్ కూడా వచ్చాయి. దీన్ని బట్టి భారత్ అనేది కొత్తగా పెడుతున్న పేరు కాదు. వేలాది సంవత్సరాల నుంచి సగటు "భారతీయుల" నోట చలామణిలో ఉన్న పేరే ఇప్పుడు అధికారికంగా ఫైనల్ అవుతుంది

ఇండస్-సింధు నదీ పరీవాహక ప్రాంతం ఆధారంగా మనదేశం ఇండియా-హిందూ అనే పేర్లతో విదేశీయులచే సంబోధించబడింది. ఈరకంగా చూస్తే ఇండియా, హిందూస్తాన్ అనే పదాలు మన దేశాన్ని కేవలం ఒక నదీపరీవాహక ప్రాంతానికి మాత్రమే పరిమితం చేస్తాయి. అదే భారత్ అంటే ఆసేతు హిమాచలపర్యంతం ఉన్న భూమి మొత్తానికి వర్తిస్తుంది. అయోధ్యలో శ్రీరామమందిరం పూర్తై భారత్ అని పేరు మారిస్తే భారతదేశం అగ్రరాజ్యంగా అవతరిస్తుందని కొందరు పండితులు చెప్పిన మాటలు నిజమవ్వాలని కోరుకుందాం- జైభారత్

04/09/2023

| మున్ముందు Jo...

ఉదయనిధి స్టాలిన్
03/09/2023

ఉదయనిధి స్టాలిన్

డీఎంకే, కాంగ్రెస్ , కమ్యూనిస్టు లాంటి విదేశీ భావజాల పార్టీలు డెంగ్యూ, మలేరియా, కరోనా లాంటి వైరస్ ల కంటే ప్రమాదకరమైనవి. వ...
03/09/2023

డీఎంకే, కాంగ్రెస్ , కమ్యూనిస్టు లాంటి విదేశీ భావజాల పార్టీలు డెంగ్యూ, మలేరియా, కరోనా లాంటి వైరస్ ల కంటే ప్రమాదకరమైనవి. వాటిని నిర్మూలిస్తే తప్ప సమాజంలో ప్రశాంతత ఉండదు.

02/09/2023

पूरी दुनियां में फैलते सनातन धर्म को देख पाक सुन्न।हमारे ईद को तो मनाना तो दूर कोई विश भी नहीं करता। ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం
29/08/2023

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం

24/08/2023

Varalakshmi Vratam | Bhāgyada Lakshmi Bāramma | Sivasri Skandaprasad | Sri Purandara dasaru

24/08/2023

#...

24/08/2023

Chandryan 3 Moon Mission Successfully- Congratulations India

ఈరోజు రాహుకాలం 12.18pm నుంచి 1.52pm వరకు, దుర్ముహూర్తం 11.53am నుంచి 12.43pm వరకు యమగండం 7.37am నుంచి 9.11am వరకు ఉంది. ...
23/08/2023

ఈరోజు రాహుకాలం 12.18pm నుంచి 1.52pm వరకు, దుర్ముహూర్తం 11.53am నుంచి 12.43pm వరకు యమగండం 7.37am నుంచి 9.11am వరకు ఉంది. పంచాంగం అర్థం కాకపోతే క్యాలెండర్ అయినా చదివిచావు.

నా అన్వేషణ లాంటి యూట్యూబర్లకు రహస్య ఫండింగ్
19/08/2023

నా అన్వేషణ లాంటి యూట్యూబర్లకు రహస్య ఫండింగ్

యూట్యూబ్ వ్లాగర్స్ ద్వారా తెలుగువాళ్ళని టార్గెట్ చేసిన చైనా! || China Targets Telugu PeopleCourtesy:

15/08/2023

అప్పుడు నెహ్రూ చేసిన పని...ఇప్పటికీ వదలని శని...|| జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు #న...

14/08/2023

is an Islamabad,Pakistan based new-generation journalist having a progressive & journalistic family background . She completed her schooling f...

12/08/2023

తిరుపతి హిందువులకు ముఖ్యమైన వీడియో. తిరుపతిలో మైనారిటీలుగా ఉన్న ముస్లింలను తిరుపతి కౌన్సిల్ లో మెజారిటీగా చేసిన ఘనత భూమన కుటుంబానిదేనని ఇందుకు ముస్లింలు భూమన కుటుంబానికి ఋణపడి ఉండాలని భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు, తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినవ్ రెడ్డి కౌన్సిల్ మీటింగ్ లో బహిరంగంగా సగర్వంగా ప్రకటించారహో. వైసీపీ తరఫున కాబోయే ఎమ్మెల్యే ఈయనే

1993 నుంచి 2013 వరకు సజావుగా సాగిన డిల్లీ పాలన ఇప్పుడెందుకు సమస్యల్లో పడింది? హోంమంత్రి అమిత్షా అన్నట్లు ప్రతిపక్షాలకు ప...
08/08/2023

1993 నుంచి 2013 వరకు సజావుగా సాగిన డిల్లీ పాలన ఇప్పుడెందుకు సమస్యల్లో పడింది? హోంమంత్రి అమిత్షా అన్నట్లు ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్య సాంప్రదాయాలు, ప్రజల శ్రేయస్సు దేశ పురోగతి పట్ల పట్టింపు లేదు. తమ అవినీతి కూటమిని కాపాడుకోవటమే వాటి లక్ష్యం. విపక్షాల వైకరి వల్లే ప్రస్తుత సమావేశాల్లో తొమ్మిది కీలక బిల్లులు ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం పొందాల్సి వచ్చింది
#సత్యకాలమ్
-✍️ వై సత్యకుమార్ గారు
బిజెపి జాతీయ కార్యదర్శి
Satya Kumar Y

03/08/2023

వైదిక ధర్మ ప్రభావం
✍️ కంచి పరమచార్య
#రామానుజ
@@@@@@@@@@@

ఆచార్యపురుషులకు, తదనుయాయులకు ఆత్మబలం సచ్చరిత్రం, నీతీసంపదా ఉన్నట్టయితే వారి మతములకు సుస్థిరత్వం ఏర్పడుతుంది. అట్టి ఆచార్య పురుషుల వల్లనే వైదిక మతము అనేక గండములు గడచి నేటికి సుస్ధిరంగా వుంటున్నది.

గౌతమబుద్దుడు కపిలవస్తు నగరంలో అవతరించి, 2500 ఏండ్ల గడచినవి. వారి త్యాగనిరతీ, వైరాగ్యనిష్ఠ ప్రజల మనస్సులను లోగొన్నవి. బుద్ధుని జీవితగాథ విన్నప్పుడు దేశమంతటా కానవచ్చే బుద్ధవిగ్రహాలను కన్నప్పుడు మనకు శాంత్యానందములు, కరుణా లభిస్తూవుంటవి. బౌద్ధము నాస్తిక మతమైన కారణాన దానికే దేశంలో నిలువనీడ లేకపోయిందనే అభిప్రాయ మొకటి ఈ వరకు ఉంటూవచ్చేది. కాని, సంస్కృతంలో పాళీభాషలో వున్న బౌద్ధధర్మ గ్రంథాలను, అశోకుని శిలాశాసనాలను పరికిస్తే బుద్ధదేవుని మహానుభావం మనకు తెలిసివస్తుంది. అట్టి మహనీయుని పుట్టుకచే ఈ దేశం ధన్యమయినదనిపిస్తుంది. ''ప్రాగ్దిశాజ్యోతి'' అనే గ్రంథంలో ఎడ్విను ఆర్నాల్డు కవి బుద్ధుని దివ్యజీవనాన్ని కీర్తించాడు. ఈ బౌద్ధమతం తమిళ దేశంలోను వ్యాపించింది. బౌద్ధధర్మాలనేకం తమిళ గ్రంథాలలో కానవస్తున్నవి. ఇంతగా గౌరవాస్పదమైన బౌద్ధమతం మనదేశంలో ఏల నిలువ జాలకపోయిందా అని ఆశ్చర్యం కలుగుతూ వుంటుంది.

తమిళ సాహిత్యంలో ఎక్కడ చూచినా జైనమత ప్రచారం కనిపిస్తుంది. దీనినిబట్టి బౌద్ధముకంటే జైనధర్మానికే తమిళనాడులో ప్రాబల్యం లభించిందనుకోవాలి. ఉత్తర భారతంలో గుజరాతు మొదలైన ప్రాంతాల్లో జైనమతస్థు లధికంగా ఉంటున్నారు. బౌద్ధ జైనములు రెండూ అహింసనే పరమధర్మంగా చెపుతున్నా, బౌద్ధులు ఇతరులు చంపిన మృగముల మాంసం తినేవారు. జైనులు మాంససేవనం చప్పగా నిషేధిస్తారు. జైన విగ్రహాలు, ధర్మశాసనాలుకూడా మన దేశమంతటా కనిపిస్తున్నవి. సాంఖ్యమతమనేది కూడా పురాతనమే. బౌద్ధ, జైనములందు కంటే సాంఖ్యమతంలో జ్ఞానులు, ఋషులు ఎక్కువగా ఉన్నా, వారివారి విగ్రహాలుగాని, వారి మతాన్ని ప్రచారంచేసే గాధలు, గీతములుగానీ ఎక్కడా వినరావు మరి తత్త్వశాస్త్ర గ్రంథాలలో చూడబోతే, బౌద్ధ, జైనముల కంటే సాంఖ్యమతానికి ఎక్కువ ప్రస్తావము కనిపిస్తుంది.

వైదికమతాలలో శైవ వైష్ణవాలు తమిళదేశంలో బహుళప్రచారాన్ని పొందినవి. వైష్ణవసిద్దాంతానికి శ్రీమధ్వమునీ శ్రీ రామానుజులు ఆచార్యపురుషులు, రామానుజుల వైష్ణవాన్ని, శైవసిద్ధాంతమూలకమైన శైవాన్ని అవలంబించినవారు తమిళనాడులో విరివిగా ఉన్నారు. వైష్ణవాలయాలన్నిటా రామానుజులకు, నమ్మాళ్వారులకు, మనవాళమునికి వేదాంత దేశికులకు, మరియెందరో ఆళ్వారులకు అర్చా విగ్రహాలు వెలసినవి. శైవాలయాల్లో అట్లే అప్పయ్య, సుందరయ్య, సంబంధయ్య, మాణిక్యవాచకయ్యవార్ల విగ్రహాలు పూజలందుకొంటున్నవి. అంతేకాదు; శేవదివ్యస్థలాల్లో అరువత్తిమూడు నాయనార్ల విగ్రహాలుకూడా నెలకొన్నవి. వైష్ణవాలయాలలో ప్రబంధాలను, శైవాలయాలలో తిరిమరైలను గానంచేసే వారి కోసం వృత్తులు ఏర్పాటైవున్నవి. మరి అద్వైత స్థాపనాచార్యులైన శంకరుల విగ్రహాలు చూడబోతే శైవ వైష్ణవాచార్య విగ్రహాల్లో వెయ్యోవంతుకూడా కనుపించవు.
👉అద్వైతాచార్యులలో ముఖ్యులైన సురేశ్వరాచార్యులకు, అప్పయ్యదీక్షితులకు ఎక్కడా విగ్రహములే కానరావు. పురావస్తుశాఖాధికారి ఒకరు చెప్పినట్లు శాసనాలు, విగ్రహాలు మెదలైన పురావస్తువులను బట్టి దేశచరిత్ర తిరిగి రచించి నట్లయితే, అద్వైతమతప్రసక్తే ఎక్కడా కనుపించకపోవచ్చు.❗

బౌద్ధమతం వైదిక మతాన్ని ఖండించింది. జైనమేమో బౌద్ధాన్ని ఖండించింది. ఇట్లే మతాచార్యులందరూ వారి వారి కాలములందు ప్రచారంలో ఉన్న మతాలను ఖండిస్తూ, తమ మతాలను స్ధాపింపజూచారు. శైవం, వైష్ణవం మొదలైన ఈ మతాలన్నిటికీ వేర్వేరు లక్షణాలు స్ఫుటంగా కనిపిస్తూ ఉంటవి. శైవవైష్ణవాలు రెండూ ప్రతిమార్చనను అంగీకరించినవే అయినా, వైష్ణవం ఈశ్వరునకు సుగుణమూర్తిని కల్పిస్తే, శైవం ఈశ్వర సంకేతమాత్రమయిన లింగం చాలునంటుంది. ఇస్లాము, క్రైస్తవమతస్థులు, ఆర్య సమాజికులూ ప్రతిమార్చన మొదలైనవే పనికిరాదంటారు. హిందువులు అంగీకరించే వేద ప్రామాణ్యాన్ని బౌద్ధులు, జైనులు అంగీకరించరు. ఈ మతాచార్యులందరిచుట్టూ శిష్యగణం విస్తారంగా పోగవుతూ వుండేది.

నేడు మతస్థులస్థితిని పరిశీలించిచూస్తే మానవలోకంలో సగంమంది క్రైస్తవమును, ఇంచుమించు తక్కినసగం బౌద్ధమును అవలంబించియున్నారు. ఈ రెంటికీ చెందనివారు తక్కినమతాల నాశ్రయించి ఉన్నారు. మరియెన్నో మతాలు పుట్టి పెరిగి నశించిపోయినవి. ఈ మతాలిలా యెందుకు పుట్టుతున్నవి? ఎలా నశిస్తున్నవి? ప్రతిమతమూ తనకే సత్యదర్శనమైనదనీ, తన్ను మించిన పరమధర్మంలేదనీ చెప్పుకుంటూ వుంటుంది. నిజానికి సత్యమనేది ఒక్కటే. అది యిన్నివిధాల వుండదు. మరి ప్రతిమతానికి ప్రజలు అసంఖ్యాకంగా ఎగబడుతూనే వుంటారు. మతాల ఉత్కృష్టతను, వాని నవలంభించిన జనుల సంఖ్యను బట్టి నిర్ణయించుదామా అంటే సత్యం తమనొసటనే పొడిచిందని చెప్పుకొన్న మతములు క్షీణించిపోవుట ఎందువల్ల?

సత్యబలంవల్ల మతములు ప్రజారంజకములవుతున్నవా? ప్రజారంజకములైన మతములే సత్యమతము లవుతున్నవా? ప్రజలు సత్యంకోసం మతాన్ని అవలంబిస్తా రనుకొందామా? అంతరించిపోయిన మతాలన్నీ అసత్యమతములనుకుందామా? ఇలా ఎన్నో ప్రశ్నలుదయిస్తున్నవి. ఇవన్నీ పరిశీలించిచూస్తే, ఒక్కవిషయం స్పష్టమవుతుంది. ప్రజారంజనమునుబట్టి, సంఖ్యాబలాన్ని బట్టి మతాలకు స్థిరత్వంగాని ప్రమాణ్యంగా ని నిలభించదని, మనకండ్లయెదుటనే గాంధి ధర్మంకోసమని వేలాది ప్రజలు ఉపవాసంచేసి, బంధిఖానాలు నింపి, ప్రాణాలుకూడా అర్పించారు. మరి ఆ గాంధి ధర్మమును, ఆ గాంధీజీ ప్రాయోపవేశాలను పట్టించుకోక ఎగతాళి చేసిన వారినీ మనమే చూచాము. అంతేకాదు, ఆ గాంధి ధర్మానుయాయుల సంఖ్య నానాటికి దిగనాసిల్లటంకూడా మనమే చూస్తున్నాము.

కాబట్టి సత్యప్రతిపాదనంవల్లనే మతాలు సుస్థిరములు, ప్రబలములు అవుతవని చెప్పలేము. మతములు ఏకారణంవల్ల పతనమైనవో తెలిసికొంటే వాని వృద్ధికిగల రహస్యంకూడా తెలిసిపోతుంది. మహాబలిపురంలో గుట్టలను ఆలయాలుగా మలిపించిన మహేంద్రవర్మ అనే రాజు ''మత్తవిలాస'' మనే ప్రహసనం రచించాడు. దానిలో బౌద్ధధర్మచ్యుతులైన భిక్షువుల స్వేచ్ఛాచారాన్ని గూర్చిన ప్రస్తావనకనిపిస్తుంది. పురుషులతో పాటు స్త్రీలకు గూడా భిక్షుదీక్షలివ్వడం అపాయకరమని బుద్ధుడు ముందే ఊహించాడు. కాబట్టి తమ సచ్చరిత్రంవల్ల ఇతరులకు మార్గదర్శకులు కాదగిన భిక్షుమండలి ధర్మభ్రష్టమగుటవల్లనే బౌద్ధమతానికి పతనంకలిగిందని ఏర్పడుతున్నది. దీనినే వ్యతిరేకలక్షణతో చెపితే మతపరిరక్షణ కొర కేర్పడిన వారు నిష్కళంక చరిత్రులై తత్వజ్ఞులై ఉదారబుద్ధితో ఆచరణ ప్రచారములు ఎప్పటికప్పుడు చేస్తూవుంటే, మతములు సుస్థిరంగా వర్థిల్లుతవని చెప్పవచ్చు. మతకర్తల మహానుభావం వల్లనే మతాలకు ఆదిలో చోదనలభించుట నిజమే అయినా, తదనంతరం వచ్చే ఆచార్యపరంపరకు ఉత్సాహశక్తి, నియమనిగ్రహాలు, సచ్చరిత్రమూ అలవడాలి. తదనుయాయులకు శ్రద్ధా భక్తులుండాలి. అప్పుడే ఆ మతాలకు సుస్థిరత్వం, ప్రజారంజనం లభిస్తుంది. ప్రజాసామాన్యాన్ని ఆకరించేది ఆచార్యపురుషుల మహానుభావమే. కాని, మత పరమార్థం కాదు. ఎవరో పండితులు మాత్రమే ఆ పరమార్థాన్ని విచారించగలుగుతారు. చిరప్రతిష్ఠితములైన, మతములు గూడా మహనీయులైన ఆచార్యపురుషులు కరవగుటవల్లనే క్రమంగా క్షీణించిపోతవి.

కనుక ఏమతమయినా తదనుయాయులు భక్తిశ్రద్ధలతో ధర్మాచరణం చేస్తూవుంటే సుప్రతిష్ఠితమై వర్ధిల్లుతుంది. ప్రజాబాహుళ్యం ఎగబడి సందడి చేసినంతమాత్రాన చేకూరేది వాపేగాని బలుపుగాదు. నిజానికి సాంఖ్యాద్వైతమతాలకు సందడి చాలాతక్కువ. అనాదియైన వైదికమతానికి కర్తలెవరో ఎరుగము. అయినా, అది నేటికీ బహుజనుల కాలంబమై నిలిచి వున్నదంటే త్యాగధనులు, సచ్చరిత్రులు, భక్తులు అయిన ఆచార్యపురుషు లెందరో దానికాలంబమై ఆచరణ ప్రచారములు చేస్తూవుండటమే కారణం. కనుక, మనయీమతం చిరకాలం ఇలాగే వర్ధిల్లి లోకాన్ని ఉద్ధరించాలనే అభిలాష మనకుండాలి. అట్టి అభిలాషతో మనం సదాచారులమై, ధర్మపరాయణులమై, మనోవాక్కాయములచే సత్కర్మాచరణం చేస్తూవుండాలి.

--- “జగద్గురు బోధలు” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#కంచిపరమాచార్యవైభవం

 #సత్యకాలమ్ -✍️ వై సత్యకుమార్ గారు బిజెపి జాతీయ కార్యదర్శి Satya Kumar Y
01/08/2023

#సత్యకాలమ్
-✍️ వై సత్యకుమార్ గారు
బిజెపి జాతీయ కార్యదర్శి
Satya Kumar Y

01/08/2023

రాజ్యాంగపరంగా అనుకూలిస్తే ప్రేమ వివాహాలకు పెద్దల ఆమోదం తప్పనసరి చేయడానికి సంబంధించిన ఒక వ్యవస్థను ఏర్పాటు చే...

30/07/2023

Arif ki Bhasha Pakistani elite’s loot is horrible. Bhikari Pakistan in top list of Global Hunger indexThe super caste system of Muslims & Arfa Mosi. Pak Nucl...

26/07/2023

ఉన్మత్త శేఖరుడు - జగద్గురు బోధలు
#రామానూజ
#రామానూజాచార్యులు

@@@@@@@@@

ఏదోఒక కారణంచేత ఒకనికి పిచ్చి పట్టుతుంది. వానిని చూచి అందరముకలిసి జాలిపడతాం. వానిని తీసుకొనిపోయి వైద్యులకు చూపిస్తాం. పిచ్చాసుపత్రికి తీసుకొనివెళ్ళి 'వీనికి పిచ్చిపట్టింది కాస్తగమనించండి. త్వరగా నిమ్మలించే మార్గం చూడండి' అని అచ్చటి అధికారులను ప్రార్ధిస్తాం.

నావద్దకు జనము వస్తుంటారు. వీళ్ళలో చాలామందికి కుటుంబంలో ఎన్నోకష్టాలు. 'స్వామీ! ఈ బాధలు పడలేకుండా ఉన్నాము. ఇవి నివృత్తి అయ్యేవిధంగా మీరు అనుగ్రహించాలి.' అని అడుగుతుంటారు. అలాంటి సమయాలలో నాకు తోచిన విషయాలను మొహమాటంలేకుండా వారితో చెప్పితే వారికి ఊరట కల్గడానికి బదులు మరింత దుఃఖం కల్గుతుంది. అందుచే విషయగోపనం చేయవలసి వస్తుంటుంది. ఆ విషయమే, ఇపుడు చెప్పవచ్చినది.

పిచ్చివాడున్నాడు. వైద్యంలో వానిపిచ్చి నెమ్మళిస్తే మళ్ళా లోగడమనిషి అయిపోతాడు. మనవలె మనస్సుకు తోచినదంతా బయటికి చెప్పక దాచి పెట్టడానికి ప్రారంభిస్తాడు. అదేమనిషి పిచ్చితో ఉన్నప్పుడు నోటికివచ్చినట్లు వాగేవాడు. తోచినదంతా చెప్పేవాడు. దేనిని దాచిపెట్టేవాడుకాదు. ఇపుడు వానికి స్వస్థత ఏర్పడేసరికి రహస్యం గుర్తిస్తున్నాడు. ఒకనికి వరుసగా నాలుగేండ్లు పిచ్చి ఉన్నట్లయితే ఆకాలంలో వాడుచేసే పాపాలు పిచ్చి లేని కాలంకంటే ఎంతో తక్కువ.

ఐతే లోకంలో పాపాలను చేయనివారెవరు ? బాలుకు, ఉన్మత్తులు.❗ జ్ఞానియొక్క స్థితి 'బాలోన్మత్త పిశాచవత్‌' లని వర్ణిస్తుంటారు. అనగా జ్ఞానులు పిల్లవాండ్లలాగా పిచ్చివాండ్లలాగా ఉంటారని అర్థం. పిచ్చి తలకు ఎక్కినవాడు ఉన్మత్తుడు. ఉమ్మెత్త పువ్వునుకూడా ఉన్మత్తమని అంటారు. దీనిని తింటే పిచ్చి పట్టుతుందని సాధారణంగా చెపుతుంటారు. ఈపూవంటే ఈశ్వరునికి చాలాఇష్టం. ఆయన ఉన్మత్త శేఖరుడు. అంటే ఉమ్మెత్త పూవులను శిరసులో దాల్చినవాడని ఒక అర్థం. పిచ్చివాళ్ళలో అగ్రేసరుడని మరొక అర్థం. పిచ్చివానివలే తిరగడమంటే పరమశివునికి పరమప్రీతి. తుమ్మి, ఉమ్మెత్త, జిల్లేడు ఇవంటే ఈశ్వరునికి ప్రియం. వీనికి ఈ కాలంలోకూడా వెలలేదు. ఎవరైనా వీనిని కోస్తుంటే 'ఎందుకు కోస్తున్నావు?' అని అడ్డుచెప్పరు. వీనిని సంపాదించడానికి ఏవిధమైనా శ్రమాలేదు. జిల్లేడులో తెల్ల జిల్లేడు విశేషం. ఇట్టి వెల లేని వస్తువులతో ఆయనను పూజిస్తే ఆ పిచ్చివానికి, ఆ ఉన్మత్త శేఖరునికి చాలాఇష్టం. ''అర్కద్రోణ ప్రభృతి కుసుమై రర్చనం తేవిధేయమ్‌'' అర్కమనగా జిల్లేడు. ద్రోణమనగా తుమ్మిపూవు. 'నీవు ఉన్మత్త శేఖరుడివి. కొమ్ములు తిరిగిన పిచ్చివాడివి. ఎవరికీ అక్కరలేని అర్కద్రోణాదులంటే నీకు అమిత ఇష్టం.'

ఈశ్వడొక మహారాజుగా ఉండిఉంటే వాని దర్శనం దుర్లభం. కాని అదృష్టవశాత్తు అతడొక భిక్షుకుడుగానూ, ఉన్మత్తుడుగానూ ఉన్నాడు కనుక వాని దర్శనం చాలా సులభం. కొంతకాలం పిచ్చి ఉన్నవానికి పాపాలు తక్కువ అనిఅన్నాము. ఈతనికి ఎప్పుడూ పిచ్చే అందుచే పాపాలకు అతీతుడు. మనమున్నూ పాపవిముక్తికోసం పాటుపడవలెనంటే, ఆవలిగట్టు చేరుకొన వలెనంటే సర్వపాపములకున్నూ అతీతుడైన ఆ సర్వేశ్వరుని ప్రాపకం పొందాలి. అడుసులో ఉన్నవానిని గట్టుపై ఉన్న వాడులాగి బయటకు వేయగలడు. కాని అడుసులోనే చిక్కుకొని పరితపించే మరొక అసహాయుడు ఎవరికయినా సహాయం చేయగలడా ?

సుందరమూర్తి శివభక్తులలో ఒకడు. ఆయన శివునికి 'తడుత్తు ఆడ్కొండా&' అన్న బిరుదు ఇచ్చాడు. ఈపదానికి తెలుగులో 'అడ్డువచ్చి రక్షించినవాడు' అని అర్థం. సుందరమూర్తికథ చాలా చిత్రంగానూ, సుందరంగానూ ఉంటుంది.

సుందరమూర్తి బ్రాహ్మణకులంలో పుట్టాడు. జన్మక్షేత్రం తిరువారూర్‌. యుక్తవయస్సు వచ్చేసరికి తండ్రి. ఒక సంబంధంకుదిర్చి ముహూర్తం నిర్ణయిస్తాడు. ఆ ముహూర్తంనాడు పెళ్ళిపీటలమీద పెళ్ళికొడుకు కూచునిఉంటాడు. వధువు వచ్చే సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కల్యాణమంటపం సమీపించి ''ఈసుందరమూర్తి నాదాసుడు. అందుచే నాకు దాస్యం చేయడానికి రావాలి'' - అని అంటాడు. 'నీకేమైన పిచ్చా, వెఱ్ఱా? పోపో, అని సుందరమూర్తి అతనిని కసురుకుంటాడు. ''నీవు కసురుకుంటే నేను వదలి పెడతానా? చూడు మా తాత వంశపారంపర్యంగా నాకు దాస్యం చేస్తామని వ్రాసియిచ్చిన పత్రం'' అని ఆవృద్ధుడు ఒక పత్రం చూపెటతాడు. అందులో తాతగారి వ్రాలు ఉంటుంది. అంతటితో సుందరమూర్తి నిర్వణ్ణుడై ఆవృద్ధ బ్రాహ్మణున్ని అనుగమిస్తాడు. ఆ వృద్ధుడు నడచి, నడచి ఒక శివాలయంలోదూరి ఆదృశ్యుడౌతాడు. సుందరమూర్తి ఆలయంలోనికి వెళ్ళిచూస్తే పార్వతీసమేతుడైన పరమశివు డాతనికి దర్శనమిచ్చి నీవుప్రమథగణానికి చెందినవాడవు. శాపవశాత్తు ఈలోకంలో పుట్టినావు. శాపకాలంలో ఎక్కడఉన్నా 'నీ దాసత్వం మాత్రం నాకు అనుగ్రహించు' అని నీవునన్ను వేడుకొన్నందువల్ల ఈవిధంగా నాటకమాడి నిన్ను నా దాసునిగా చేసుకొన్నాను, అని విశదపరుస్తాడు. తన పెళ్ళి అడ్డగించి తన్ను రక్షించిదాసునిగా స్వీకరించినాడు గనుగ - శివుని 'తడత్తు ఆడ్కొండాన్‌' అనివర్ణించి 'పిత్తాపిరై చూడి పెరుకూనే అరుళాళా' అన్న మకుటంతో ఒక పదికమును సుందరమూర్తి గానం చేశారు.

మహావిష్ణువు మహారాజు, లోకరక్షకుడు, త్రిభువన చక్రవర్తి. పరమశివుడు భిక్షకుడు, లోక భక్షకుడు, ఉన్మత్త చక్రవర్తి. ఈయన ఆభరణాలకు వెలలేదు. వేలంవేస్తే ఇద్దరి ఆభరణాలూ అమూల్యాలే. ఒకరికి ఒంటిమీద విభూతిపూత చేతిలో మనిషిపుఱ్ఱ, శిరస్సులో జిల్లేడుపూలు ఉమ్మెత్తపూలూ, మరొకరికి కౌస్తుభం, పీతాంబరం, శంఖచక్ర గదాదులు ఆభరణాలు. వీటి నన్నిటిని మించి మహావిశిష్టమైన ఆభరణాన్ని విష్ణువు హృదయంలోనే పదిలపరచుకొని ఉన్నాడు. ఆ ఆభరణం మహాలక్ష్మి. ఈశ్వరుడో, ఇతరులు కన్నెత్తి అయినా చూడని పుష్పాలతో అలంకరించుకొని పిచ్చి బ్రాహ్మడివలె భిక్షాటన మూర్తియై తిరుగుతున్నాడు.

అప్పయ్య దీక్షితులవారు గొప్ప శివభక్తులు. ఒకప్పుడు వారికొక సందేహం కల్గింది. ''నేను చాలాకాలంగా శివభక్తుడను. భక్తి ఉన్నదో, లేదో కాని ఉన్నదనే అనుకుంటూ ఉన్నాను. మనకున్నది నిజమైన భక్తియేనా లేక భక్త్యాభాసమా? ఇంతచేసినా నాకేదైనా విమోచన ఉన్నదా? లేదా? ఆపత్సమయాలలో నాకు ఈశ్వర స్మరణ ఉంటుందా లేక ఆ కష్టాల్లో క్రుంగిపోయి ఈశ్వరుణ్ణి విస్మరిస్తానా?'' అన్న సందేహం కలిగింది. తన భక్తిని తానే పరీక్షించ దలచుకొన్నాడాయన.

సాధారణంగా మనం మంచివారమనే అనుకొంటాం. సదాలోచననే చేస్తున్నామనీ అనుకొంటాం. కానీ ఒక్కొక్కప్పుడు మనకువచ్చే కలలను పరిశీలిస్తే అంతర్గతంగా ఎట్టి పాపాలోచనలు చేస్తున్నామో అవగతం అవుతుంది. జాగ్రదవస్థలో తలచడానికికూడా యోగ్యతలేని యోచనలన్నీ స్వప్నంలో విశదము అవుతూఉంటవి. నిజానికి జీవితంలో తీరని అభిలాషల స్వరూపమే స్వప్నం. అందుచే మనం చెడ్డకలలు కనకపోతే అంతవరకు జీవితాన్ని శుద్ధిచేసుకొన్నామని అర్ధం. అట్లుకాక పాపకార్యాలు చేస్తున్నట్లుగానీ, పాపాలోచనలు చేస్తున్నట్లుగానీ కలలుకంటే ఇంకా చిత్తశుద్ధి మనకు పూర్ణంగా అంటలేదని తెలుసుకోగలం. తమ్ముతాము పరీక్షించుకోడానికి ఈశ్వరుడు స్వప్నావస్థను కల్పిస్తాడు.

అప్పయ్య దీక్షితులవారికి ఈస్వప్నమర్మం తెలుసు. అయన శివపూజచేస్తున్నట్లూశివారాధన చేస్తున్నట్లూ ఎన్నో మార్లు కలగని ఉన్నారు. శివపరములైన గ్రంథాలనెన్నో వ్రాసినారు. ఇతర మనగ్రంథాలనూ నిష్పాక్షికంగా వ్రాశారు. కాని తానుమాత్రం అద్వైతి.

మహేశ్వరేవా జగతా మధీశ్వరే

జనార్దనేవా జగదంతరాత్మని,

నవస్తు భేద ప్రతిపత్తి రస్తిమే

తథాపి భక్తిస్తరుణందు శేఖరే.

'రెండువస్తువు లున్నవని నేను అనుకోలేదు. రెండూ ఒక్కటే అన్న తీర్మానమె నాకు'. అని అప్పయ్యదీక్షితుల వారు తనకు అద్వైతమందున్న అపారభక్తిని ప్రకటించినారు.

దీక్షితులవారు తమ్ముతాము పరీక్షించుకోడానికి మార్గమేదని ఆలోచించి, మనంగా ఉన్మత్తావస్థను తెచ్చుకొంటే ఆసమయంలో మన మాటలు చేష్టలు, ఏలా ఉంటవో, అవే మన నైజగుణానికి చిహ్నాలుగా ఉంటవని తీర్మానించి శిష్యులను పిలిచి తాను మందుతిని పిచ్చిగా ఉన్నప్పుడు చెప్పే మాటలన్నిటినీ వ్రాసి ఉంచమనిచెప్పి, పిచ్చి నిమ్మళించడానికి ఇవ్వవలసిన ఔషధమున్నూ వారికిచెప్పి పిచ్చివాడై పోయాడు. అంతటితో ఆయనకు ఉన్మాద ప్రలాపములున్నూ ఆరంభమైనవి. శిష్యులు ఆయన చెప్పినట్లే వాగినదంతా వ్రాసుకొన్నారు. కొంతసేపటికి నివారణౌషధం ఇవ్వగా దీక్షితుల వారికి స్వస్థత కలిగింది. ఆ ఉన్మాదావస్థలో ఆయన ఏబది శ్లోకాలు ఆశువుగా చెప్పారట. వానికి ఆత్మార్పణస్తుతి ఆనీ, ఉన్మత్త పంచశతి అనీ పేర్లు. అందులోనిదే ఈ శ్లోకం.

అర్కద్రోణ ప్రభృతికుసుమై రర్చనంతే విధేయం

ప్రాప్యంతేన స్మరహరఫలం మోక్షసామ్రాజ్యలక్ష్మీః,

ఏతజ్జానన్నపి; శివశివ వ్యర్థయ& కాలమాత్మ&

ఆత్మద్రోహీకరణవివశో భూయసాధఃపతాని.

''శివ శివ! నీ అనుగ్రహమును ఏమని వర్ణించను? సులభంగా లభించే జిల్లేడుపూలను తుమ్మిపూలను భక్తుల నుండి సంగ్రహించి నీ సౌలభ్యమును ప్రకటిస్తూ వారికి మోక్ష సామ్రాజ్యలక్ష్మినే అనుగ్రహిస్తున్నావు. ఇది తెలియకుండా కాలాన్ని మేము వ్యర్థం చేస్తున్నాము.

దీక్షితులవారిని ఉన్మదావస్థలోనూ, శివస్మరణ వీడలేదు. తన్మయతతో బాష్ప నేత్రాలతో ఆయన శివునే తలుస్తూ ఉండినాడు. పిచ్చి ఎత్తినప్పటికీ బుద్ధిమారకుండా ఒకే ఆత్మ ఉన్నందున శివస్మరణ చేసినాడు. ఎటువంటి కష్టములు వచ్చినప్పటికీ, ఎటువంటి వ్యాధులు వచ్చినప్పటికీ దైవస్మరణ మాత్రం మనం వదలరాదు. ఆంత్యకాలంలో ప్రాణావసాన సమయంలో ఏ స్మరణతో ఉంటామో దాని కనుగుణంగా మరుసటి జన్మలో శరీరం కలుగుతుందని గీత చెపుతుంది.

యం యం వాపి స్మరన్బావం త్యజత్యంతే కళేబరం,

తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః,

ఈశ్వర స్మరణతో దేహాన్ని వదిలినట్లయితే ఈశ్వర స్వరూపంలో ఐక్యమవుతాము. దుఃఖిస్తూ ప్రాణాలను వదిలితే దుఃఖ భాజనమైన మరొక శరీరం మనకు లభిస్తుంది.

అంతిమక్షణాలలో ఈశ్వరస్మరణ వుండవలెనని జీవితమంతా జపధ్యానాదులతో గడపవలసిన అవసరమేమి? అప్పుడు మాత్రం భగవంతుని తలిస్తే చాలదా? అని అడుగవచ్చును. నియమంగా అనుష్ఠానం జరిపే వారికే ఒకచిన్న కష్టం వస్తే దైవవిస్మరణ కలుగుతుంటే అంత్యకాలంలో చూచుకొందాములే అని సోమరిపోతులై కూర్చుంటే శరీరత్యాగ సమయంలో మనకు ఈశ్వరస్మరణ ఎట్లా కలుగుతుంది. అందుచేతనే కుటుంబంలో ఎలాంటి కష్టములు ఉన్నప్పటికిన్నీ దేహానికి ఎలాంటి రుగ్మత వచ్చినప్పటికిన్నీ, అన్ని శ్రమలనూ ఎప్పటికప్పుడే ప్రక్కకు నెట్టుతూ జన్మ నివృత్తికోసం పాటుపడుతూ ఈశ్వరస్మరణ అనవరతమూ చేసే అలవాటు కలిగిందా లేదా అని ఒక్కక్కనాడు స్నప్నావస్థనుబట్టి మనలను మనం పరీక్షించుకుంటూ వుండవలె, మనం క్షేమంగా ఉండాలంటే మంచి కార్యాలు చేస్తుండాలి. మంచికార్యం ఏదంటే భగవచ్చింతనయే! వాచికంగా చెప్పుతూ భగవచ్చింతన చేయడం ఒక విధం. మానసికంగా చేయడం మరీ విశేషం. దాన్నే అంతరంగిక భక్తి అని అంటారు.❗ఎప్పుడూ ఏదో కార్యంచేస్తూ అందులో మగ్నులమైపోయి దైవాన్ని తలవకపోవచ్చు. కాని పనిపూర్తికాగానే వెనువెంటనే ఈశ్వర చింతన కలుగవలె. ఇట్లు విరామమున్నప్పుడల్లా నామస్మరణ స్వరూప ధ్యానం చేసే అలవాటు మనం కలిగించుకోవాలి. అభ్యాసం ముదిరేకొద్ది చింతన సహజమై పోతుంది. దీనికి ఆదర్శం అప్పయ్య దీక్షితులే.

ఈశ్వరుడు పిచ్చిబాంబడు. బిచ్చగాడు. పూర్వకాలంలో బ్రాహ్మడొకడే బిచ్చ మెత్తేవాడు. ఇతర జాతులవారు అయాచితంగా వచ్చిన వానిని కూడా స్వీకరించేవారుకారు. కుంభకోణంలో 'బిచ్చమెత్తే బ్రాహ్మల వీథి' అనేఒక వీధి కూడా వుండేది. బ్రాహ్మణ సన్యాసులు అన్న భిక్షయాచించేవారు. ఇతరులు ధాన్య భిక్షను గ్రహించేవారు. ఉంఛవృత్తి చేసేవారు. ఇతర జాతులకు యాచించే గుణం లేదు. ఏదోపనిచేసి దానికిబదులు కూలితీసుకొనేవారు. ఆ వ్యవస్థలన్నీ ఇప్పుడు మారిపోయినవి.

ఈశ్వరుడు పిచ్చి బ్రాహ్మడు. మహరి. సదా అభిషిక్త జలంలో మునిగితేలుతూ ఉంటాడు కానీ, నారాయణుడు త్రిభువన చక్రవర్తి. సర్వకాలిభిషేచన ఆయనకు లేదు. అట్లు అయనకు అభిషేకము చేసినా, అదిన్నీ, సుగంధ తైలంతోనే. శివాలయంలో అట్లుకాక దినంలో ఆరువేళలా అభిషేకం ఉంటుంది. కొన్నిచోట్ల ఇరువది నాలుగు గంటలూ ధారాపాత్రనుండి సంతతమూ జలధార పడుతూంటే అందులో మునిగి తేలుతూ ఉంటాడు శివుడు. బ్రాహ్మడు శివుని మాదిరిగా మాటిమాటికి స్నానాలు చేస్తుంటాడు. ఈశ్వరుడు భిక్షుకుడు. బ్రాహ్మడూ బిచ్చగాడే. ఇరువురిస్వభావమూ ఒక్కటే. రుద్రుని విశ్వాధికుడనిన్నీ మహరియనిన్నీ వేదం చెప్పుతూంది. అతని ఆరాధన అతి సులభం. ఒక్క తుమ్మిపూవు చాలు అతనికి. దానిని స్వీకరించి ఆనందించడానికి ఆ పిచ్చివాడు ఎదురు చూస్తుంటాడు.

👉👉 ఒకప్పుడు రామానూజాచార్యుల వారు విష్ణువు తప్ప దేవతాంతర ముండరాదని అందరూ విష్ణువునే ఐకాంతిక భక్తితో పూజించవలెనని, శివాలయాలకు వెళ్ళటంకాని శివభక్తి కానీ కూడదనీ బోధింప నారంభించారు. పూర్వం ప్రతిఊరిలోనూ శివాలయమూ విష్ణాలయమూ ఉండేది. ఉదయం విష్ణుగుడికి, సాయంత్రం శివాలయంలో నర్తన సమయానికి శివుని కొల్వుకు వచ్చేవారు. చోళరాజు శివభక్తుడు. ఎన్నో శివాలయాలు కట్టించాడు. అతనికి రామానుజుల ఉపదేశం వింతగా తోచింది. ఆచార్యులు చెప్పేది శాస్త్రీయమేనా అని సందేహం కల్గింది. ఒక సభ ఏర్పాటు చేద్దామని కుంభకోణానికి పదిమైళ్ళ దూరంలో ఉన్న గంగైకొండ చోళపురానికి రమ్మని రామానుజులను పిలువనంపాడు.

అప్పుడు రామానుజులు శ్రీరంగలో ఉన్నారు. ఆయన అనుచరులలో ఒకరు, కూరత్తాళ్వారు. ఆయన కూరం అనే గ్రామానికి చెందినవారు. వారు రామానుజులతో ''మిమ్ములను చోళరాజు రమ్మని పిలుస్తున్నాడు. మీరు శివాలయాలకు వెళ్ళరాదని బోధిస్తున్న విషయం ఆయనకు తెలిసే వుంటుంది. రాజు శైవుడు. అతని అనుష్ఠానాలకు మీరు అపచారం చేస్తున్నారు. మీకు ఏదోదండన విధించేటట్లే వుంది. అందుచే మీ కాషాయాలను నాకివ్వండి. నా ధవళ వస్త్రం మీరు గ్రహించి ఎక్కడికైనా పారిపొండి. మీ కాషాయాలను దాల్చి నేనే రామానుజుడనని రాజు దగ్గరకు వెళ్ళతాను. నాకేమి ఆపదవచ్చినా రానీండి. మీరు మాకు ఆచార్యులు. మీకు అపాయం రారాదు. అందుచేత ఈ ప్రకారం చేయండి''. అని అన్నారట.

రామానుజులు ఆరాత్రే శ్రీరంగానికి ఇరవైమైళ్ళ దూరంలో ఉన్న తిరునారాయణ పురానికి వెళ్ళిపోయారు. అంతటితో ఆగక అక్కడనుండి మైసూరునకు దాపునవున్న మరొక తిరునారాయణ పురం చేరుకున్నారు. చోళరాజ్యాన్నే ఆయన విడిచారు ఇప్పటికీ దీనికి చిహ్నంగా 'వెల్లై! సాత్తువడి అనే ఉత్సవం చేస్తుంటారు.

కూరత్తాళ్వారు కాషాయాలు ధరించి, చోళరాజు సభకు వచ్చారు. రామానుజులు వీరేనా? అని రాజు అడిగిన ప్రశ్నకు రాజుగారిమంత్రి 'రామానుజులతో సమాన ఆధిక్యంకలవారే' అని సూక్ష్మంగా తేల్చి వేశారట. శాస్త్రార్ధాలుఆరంభమయినవి. పండితులు రావడమూ, దానికేకదా! వచ్చిన విద్వాంసులు లెక్క లేనంతమంది. వారందరూ తీర్మానించి, శివుని కంటే అధికుడు వేరే లేడని వాక్యార్థం చెప్పి 'శివా త్పరతరం నాస్తి' అని తాళపత్రం మీద వ్రాసి కూరత్తాళ్వారులతో మీకు ఆక్షేపం ఉంటే చెప్పండి, లేకుంటే దీనిమీద చేవ్రాలు పెట్టండి. అని దానిని ఆయనముందు ఉంచారట. కూరత్తాళ్వార్లు సామాన్యులుకాదు. గొప్ప విద్వాంసులు. వెంటనే దానిని అందుకొని 'అస్తిద్రోణ మతః పరం' అని పూరించినారట. శివునికంటే పరతరం వేరే ఉన్నది. అది ద్రోణము. శివునికంటే అధికమైనది తుమ్మిపూవు అని ఆయన చమత్కరించిరట.

'అస్తి ద్రోణం అతః పరం' అన్న వాక్యాన్ని నేను అప్పుడప్పుడూ స్మరిస్తూ ఉంటాను. దీక్షితులవారి 'అర్క ద్రోణ ప్రభృతి కుసుమై రర్చనంతే విధేయం' అన్న శ్లోక పాదమూ జ్ఞాపకం వస్తుంటుంది. మఠమునకు వచ్చే భక్తులలో కొందరు తుమ్మిపూవును విశేషంగా తెస్తుంటారు. నేను వానిని గ్రహించి ఈశ్వరుడికి అర్పిస్తుంటాను. నాకంటే వీనిని తెచ్చియిచ్చే భక్తులకే అధికమైన పుణ్యం. ❗ స్వామికంటే స్వామికర్పించే పూజాద్రవ్యములే అధికమని వేదం చెపుతూంది. నమకంలో ఏకాదశానువాకం పూర్తికాగానే 'అయంమే హస్తో భగవా నయంమేభగవత్తరః' అన్న మంత్రం వస్తుంది, ''ఈనా చేయి అన్నదేఇదే నాకు మోక్షాన్ని సంపాదించి ఇస్తున్నది. భగవత్స్వరూపం కాదు మోక్షాన్నివ్వడం, ఈ చేయియే మోక్షాన్నిస్తున్నది. అందుచే ఈ చేయియే భగవంతుడు. కాదు ఇది భగవంతుని మించినది. ఇది భగవత్తరము. భగవత్పూజచే నాకు మోక్షసుఖాన్ని సంపాదిస్తున్నది. ఈహస్తమే కదా! అందుచే ఇది భగవత్తరము''. అందుచే తుమ్మిపూలను పూజార్థం, గ్రహించేటప్పుడంతా, 'శివాత్పరతరం నాస్తి, అస్తి ద్రోణం అతః పరం' అన్న ఆళ్వార్వమాట జ్ఞప్తికొస్తుంటుంది.

ఈశ్వరుడు పరమసులభుడు. పైగా బీదవాడు ఆళ్వార్లు అందరున్నూ అనుభూతిపరులు. విద్వాంసులు. పాశురాలు పాడినవారు. కాని ఈశ్వరానుగ్రహం పొందిన వారందరూ సాధారణ జనులు. ఏమియు తెలియని అమాయకులు. వారికి చదువనురాదు. వ్రాయనూరాదు, చెట్లుకొట్టేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు - చాకలివాళ్ళు - ఇలాంటి వృత్తులను పాటిస్తూ అమాయకంగా జీవితంగడిపిన వీళ్ళందరూ ఈశ్వరానుగ్రహం చేత మోక్ష సామ్రాజ్యాధిష్ఠితులైనారు. అట్టి సర్వజన సులభుడు ఈశ్వరుడు. ఆయనను స్మరించినపుడల్లా మన మనస్సు కరిగిపోతేకాని మన జన్మ సఫలంకాదు.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when ఆంధ్రభారతి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share