Piler poragallu

  • Home
  • Piler poragallu

Piler poragallu దగా పడ్డ పేజ్ � come back కోసం ప్రయత్నిస్తు?

03/11/2023

Think before vote

14/10/2023

*కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు..👨‍👩‍👧‍👦*

అతి తొందరలోనే కుటుంబ వ్యవస్థ పూర్తిగా కూలిపోతుంది. ఈ రోజుల్లో ఎవ్వరూ ఫ్యామిలీ అంటే ఇష్ట పడటం లేదు. ఫ్యామిలీ అంటే ఇష్టం లేకున్నా ఏదో తూ తూ మంత్రంగా ఇష్టం అన్నట్టు నటిస్తున్నారు. నిజానికి మనుష్యులు అంటేనే జనాలకు అలెర్జీ పుడుతుంది. దగ్గరి వారు అంటే నచ్చడమే లేదు.

*కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి కారణాలు:*

1.అతి తెలివి,
2.చిన్న తప్పును కూడా భరించే శక్తి , సహనం లేకపోవడం,
3.అందరూ సమానమే అనే వింత భావన పెరగటం ( డెమాక్రసి).
4.పెద్దలూ, పిల్లలూ అందరూ కూర్చొని మాట్లాడుకొనక పోవడం.
5.ఎంతసేపూ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాంలలో మునిగి పోవడం. ఎక్కడో ఉన్న సినిమా నటులు ఈ రోజు ఉదయం ఏమి చేశారో చెప్ప గలుగుతున్నారు. కానీ, ఇంట్లో వారు ఎప్పుడు ఏమి చేస్తున్నారో చెప్పలేని దుస్థితి వచ్చేసింది.
6.చిన్న దానికీ అలిగి దగ్గరి వారికి కూడా దూరం జరుగుతున్నారు.
7.ఎవరో ఒకరి నోటి దురుసు తనం కుటుంబం మొత్తం చిన్నా భిన్నం కావడానికి కారణం అవుతుంది.
8.ఆర్థిక సమస్యల వల్ల ఇంటి పెద్దలు సరిగ్గా ,దృఢంగా ,బలంగా మేనేజ్ చేయలేకపోవడం కూడా ఒక కారణం.
9.ఇంట్లో భార్యా భర్తలు (తల్లి దండ్రులు) చీటికి మాటికి తగాదా పడుతూ ఉంటే ఇంటిల్లి పాది ఏదో దిగులుతో ఉంటున్నారు.
😔
అన్ని ఫ్యామిలీలల్లో గొడవలు, కొట్లాటలు చూసి ఫ్యామిలీ అంటే జడుసు కుంటున్నారు. అన్యోన్యంగా , ప్రేమతో, అవగాహనతో ఉన్న ఫ్యామిలీస్ కనబడక పోవడంతో ఆ వ్యవస్థ పై నమ్మకం పోయింది.
😣
అందుకే యువత పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. 31దాటినా పెళ్లి ముచ్చట ఎత్తడమే లేదు. గత 30,40 ఏళ్ళల్లో మనస్ఫర్థలు, గొడవలతో విసిగి వేసారిన జనం అలాంటి వ్యవస్థ వద్దు బాబోయ్ అని తమ పిల్లలకు నేరుగా నే చెబుతున్నారు.
10.ఆర్థిక అవసరాలు, వ్యత్యాసాలు, పోల్చుకోవడం తదితర కారణాల వల్ల కూడా కుటుంబ వ్యవస్థ నిలబడ లేకుండా పోతుంది.
11.మనుష్యులు అంటేనే విలువ లేదు.మనిషికి మరో మనిషి అంటే బోర్ వచ్చేసింది. అధిక జనాభా, సుఖ లాలస, సుఖాలకు అడ్డు వచ్చిన వారిని అంతమొందించే తెంపరితనం కూడా వచ్చింది.
12.మధ్య వర్తిత్వం వహించే పెద్దలు లేకుండా అయ్యారు.దీంతో ఎవ్వరిష్టం వారిదే అయ్యింది.
13.కుటుంబ నిర్వహణ ఒక కళ.ఆ కళ అందరికీ లేకపోవడం వల్ల కూడా వ్యవస్థ అతలాకుతలం కావడానికి కారణం అవుతుంది.
14.మానవ ప్రవర్తనపై కనీస అవగాహన లేని దుస్థితి వచ్చింది.మొరటుగా ప్రవర్తిస్తున్నారు.
☘️
నేను నా భార్య/ భర్త అనే సిద్దాంతం పోయి "నేనే నేను "" నేను నేనే"
పాలసీ వచ్చింది. పిల్లలకు పెళ్లి కాగానే వేరుపడేయటం ఆచారమైనది. ఇంట్లో ఉంచు కోవాలంటే భయ పడుతున్నారు. అంత్య నిష్టూరంగా కన్నా ఆది నిష్టూరం మేలు అంటున్నారు.
☘️
కుటుంబ విలువలు, కట్టు బాట్లు ఇక ఉండవు. ఎవ్వడిష్టం వాడిదే అయ్యే రోజులు అప్పుడే వచ్చినవి. అన్నా దమ్ములు, అక్కా చెల్లెళ్ళు, అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ళ , భార్యా భర్తల మధ్య బలమైన బంధాలు ఇప్పుడు లేనే లేవు.
🤓
సమస్త మానవ సంబంధాల కథ ఫినిష్ అయ్యింది. ఇక్కడ అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే. ప్రస్తుతం నడుస్తుందంతా ఒక షో, ఒక నాటకం. ఈ షో కూడా ఇంకొన్నాళ్ళకి పూర్తిగా ఉండకుండా పోతుంది. ఇంకా పచ్చిగా అవుతారు. దీనికి అందరూ అతీతులే. ఇక్కడ ఎవ్వరూ శ్రీ రామచంద్రులు లేరు. ఎక్కడా సీతమ్మలు లేరు. ఉన్నవారంతా అటు ఇటు గానీ వింత జాతి. ఇది ఇంతే. అది అంతే. ఎవ్వరూ ఏమీ చేయ లేరు.
🙃
ఇదంతా ఊరకే అనుకోవడం తప్ప మనo మాత్రం మారం కదా?

 #ప్రామిసరీ_నోట్ అంటే..!   #ప్రోనోటు_రాసుకున్నప్పుడు పాటించవలసిన నియమ నిబంధనలుప్రామిసరీ_నోట్ (ప్రోనోట్) అంటే రాతపూర్వకమై...
04/08/2023

#ప్రామిసరీ_నోట్ అంటే..! #ప్రోనోటు_రాసుకున్నప్పుడు పాటించవలసిన నియమ నిబంధనలు

ప్రామిసరీ_నోట్ (ప్రోనోట్) అంటే రాతపూర్వకమైన పత్రమని అర్థం. ప్రామినరీ నోట్‌లో డబ్బు ఇచ్చే వ్యక్తి (రుణదాత), అప్పు తీసుకున్న వ్యక్తి (రుణగ్రహీత) పూర్తి పేర్లు, చిరునామాలు ఉండాలి.

మ‌నిషికి అనేక అవ‌స‌రాలు తీర్చే సాధ‌నం డ‌బ్బు.. అందుకే ఆర్ధిక అవ‌స‌రాలు ఉన్న వ్య‌క్తులు ఇత‌రుల నుంచి అప్పులు తీసుకోవ‌డం సాధార‌ణ‌మైపోయింది. న‌మ్మ‌కంతో ఎటువంటి ష్యూరిటి లేకుండానే అప్పులు ఇచ్చేవారు కొంద‌రైతే… ప్రామిస‌రీ నోటు రాసుకుని రుణ‌మిచ్చేవారు ఇంకొంద‌రు. ఇలా రాసుకునే ప్రామిస‌రీ నోట్లు ఎటువంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి…? వాటి కాల‌ప‌రిమితి ఎంత‌..? ప్రామిస‌రి నోటు ఎటువంటి ల‌క్ష‌ణాలు క‌లిగి ఉండాలి..? డ‌బ్బులు న‌ష్ట‌పోకుండా ఉండాలంటే ప్రామిస‌రీ నోటు ఏ విధంగా ఉండాలి వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రజలు తమ అవసరాలకోసం అప్పు తీసుకోవడం సహజం. ఈక్రమంలో సెక్యూరిటీ ప్రామిసరి నోట్‌ న్యాయపరంగా చెల్లే విధంగా రాసుకొవడం లేదు. దీంతో అప్పు ఇచ్చిన వారు కోర్టులో దావా వేసినా.. న్యాయపరంగా చెల్లుబాటు కాకపోవడంతో దావాలు వేసినా ఫలితం ఉండ డంలేదు. అప్పు తీసుకున్న వారు కొంతమంది అప్పునుంచి ఎలా తప్పించుకోవాలని అనేక ఆలోచనలు చేస్తుండడంతో కోర్టులలో ప్రామీసరి నోట్‌ కేసులు పెరిగిపోతున్నాయి. అప్పు పెద్ద మొత్తమైనా లేక చిన్న మొత్తమైనా, అప్పు తీసుకున్నవారు పరిచయస్తులైనా లేక దగ్గరి వారైనా, బంధువులైనా, ఎవరైనా సరే, డబ్బు అప్పుగా తీసుకున్న వారి దగ్గరనుంచి ఋణపత్రాన్ని రాయించుకోవడం చాలా ముఖ్యం. డబ్బు విషయంలో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు.డబ్బు గడ్డి తినిపిస్తుందనే సామెత తెలుగులో ఉండనే ఉంది.

డబ్బు కోసం సొంత వారిని కూడా మోసం చేసిన ఘటనలు మన చుట్టూ రోజు జరుగుతూనే ఉన్నాయి.డబ్బు విషయంలో చిన్న అజాగ్రత్త వహించినా కూడా మోసపోవాల్సి వస్తుంది. నేడు మన అనుకున్న వ్యక్తికి డబ్బు ఇస్తాం. ఆ డబ్బు ఇచ్చే సమయానికి ఆ వ్యక్తితో విభేదాలు తలెత్తితే ఆ డబ్బును రాబట్టుకోవడంకు చుక్కలు లెక్కపెట్టాల్సిందే. అందుకే మన అనుకున్నా కూడా డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

డబ్బులు ఎవరికి ఇచ్చినా, ఎంత మొత్తంలో వడ్డీ కి ఇచ్చినా కూడా సరైన పద్దతిలో ప్రామిసరీ నోటును రాయించుకోవాల్సి ఉంటుంది.అలా ప్రామిసరి నోటు రాయించుకుంటేనే ఆ డబ్బుపై ఆశ పెట్టుకోగలం. ఒకవేళ ఆ వ్యక్తి ఇవ్వనంటూ మొండికి వేస్తే కోర్టులో ఆ ప్రామిసరి నోటుతో డబ్బును రాబట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకే ప్రామిసరి నోటు రాసుకునే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కోర్టులలో చెల్లే విధంగా ప్రామిసరి నోటు ఉండాలని, లేదంటే ఆ డబ్బులకు భద్రత లేనట్లే అంటూ న్యాయవాదులు చెబుతున్నారు. ప్రామిసరి నోట్లు రాయించుకునే సమయంలో తప్పకుండా పాటించాల్సిన కొన్ని విషయాలను మనం ఇప్పుడు చర్చిద్దాం. ప్రామిసరి నోట్ల విషయంలో కొందరు తరచు చేసే తప్పులు ఏంటంటే ఆ నోట్లపై స్టాంపులు అతికించక పోవడం, జామీను సంతకం తీసుకోక పోవడం, సాక్షి సంతకం చేయించుకోక పోవడం.ఇక ప్రామిసరి నోటు సొంత దస్తూరితో రాయడం.ఈ నాలుగు తప్పులు చేయడం చేయకుండా ఉండాలి.

ఎంత మొత్తంకు ప్రామిసరి నోటు రాయించుకున్నా కూడా తప్పనిసరిగా స్టాంపులు అతికించాలి. స్టాంపుపై డబ్బు తీసుకున్న వ్యక్తి సంతకం చేయించుకోవాలి.ఇక ప్రామిసరి నోటులో జామీను అనే ఆప్షన్‌ ఉంటుంది. కాని అంతా కూడా దాన్ని పట్టించుకోరు. కాని అదే చాలా కీలకం. తప్పనిసరిగా అప్పు తీసుకున్న వ్యక్తి మరో వ్యక్తిని తన జామీనుగా ఉంచాలి. ఇక సదరు వ్యక్తికి డబ్బు ఇచ్చినట్లుగా డబ్బు ఇచ్చే వ్యక్తి ఒక సాక్షిని కూడా సంతకం చేయించాలి.

ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటీ అంటే డబ్బు తీసుకున్న వ్యక్తి ప్రామిసరి నోటును రాయాల్సి ఉంటుంది. ఒకవేళ అతను రాయకుంటే ఎవరైతే రాస్తారో వారి సంతకం ఉండాలి.అంతే కాని డబ్బు ఇచ్చే వ్యక్తి అస్సలు రాయవద్దు.

ఇక లక్షకు ఒక ప్రామిసరి నోటు చొప్పున రాయించుకుంటే బెటర్‌.మూడు నాలుగు లక్షలకు కలిపి ఒకే ప్రామిసరి నోటును రాయించుకుంటే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది.

వడ్డీ ప్రభుత్వ కండీషన్స్‌కు తగ్గట్లుగా ఉండాలి. అనగా 2 రూపాయలు అలా కాదని అయిదు, పది రూపాయల వడ్డీని ప్రామిసరి నోటులో రాస్తే ఆ నోటు కోర్టులో చెల్లదు.

#ప్రామిసరి_రాస్తున్నప్పుడు పాటించాల్సిన నియమాలు
ప్రామిస‌రి నోట్ రాతపూర్వకంగా ఉండాలి.

1. రాత‌పూర్వ‌కంగా ఉండాలి.
2. ష‌ర‌తులు లేకుండా ఉండాలి.
3. అప్పు తీసుకునే వారి పేరు స్ప‌ష్టంగా ఉండాలి. అంటే ప్ర‌భుత్వ వ్య‌వ‌హ‌రాల్లో భాగంగా ఎలా ఉందో అలా ఉండేలా చూసుకోవాలి.
4. ఎవరి పేరు మీద రాయ‌బ‌డింది, ఎవ‌రికి ఇవ్వాల్సింది రాయాలి.
5. ప్రామిస‌రీ నోటు రాసిన స్థ‌ల‌, తేదీల‌ను పేర్కొనాలి.
6. అప్పు తీసుకున్న సొమ్ము అంకెల్లోనూ, అక్ష‌రాల్లోనూ రాయాలి.
7. రెవెన్యూ స్టాంప్ అంటించి, సంత‌కం చేయాలి.
8. అడిగిన త‌క్ష‌ణం మీకు గానీ మీ అనుమ‌తి పొందిన మ‌రొక‌రికి గానీ సొమ్ము చెల్లించ‌గ‌ల వాడ‌ను అనే భేష‌ర‌తు నిర్వ‌హ‌ణ ఉండేలా చూసుకోవాలి.
9. సాక్షుల వివ‌రాలు ఉంటే మంచిది.
10. దీనికి అటెస్టేష‌న్ అవ‌స‌రం లేదు.
11. న‌గ‌దు ద్వారా ముట్టిన‌దో, చెక్కుద్వారా ముట్టిన‌దో రాయాల్సి ఉంటుంది.
12. ప్రామిస‌రీ నోటులో పోస్టాఫీసు జారీ చేసే రెవెన్యూ స్టాంప్‌ల‌ను అతికించాలి.
తీసుకున్న అప్పును తీర్చ‌వ‌ల‌సిన స‌మ‌యంలో తీర్చ‌క‌పోతే, సివిల్ కోర్టులో డ‌బ్బు వ‌సూలు చేయ‌డం కోసం కేసు వేయ‌వ‌చ్చును.

#ప్రామిస‌రీ నోట్ కాల‌ప‌రిమితి

ప్రామిసరీ నోట్‌పై ఉన్న తేదీ నుంచి మూడేళ్లు, ప్రామిసరీ నోట్ రాసిన తేదీ నుంచి మూడేళ్లలోపు రుణగ్రహీత సొమ్ము చెల్లించకుంటే కోర్టులో కేసు దాఖలు చేయవచ్చు. ఆపైకాలం దాటితే కోర్టులో కేసు వేయడానికి వీలు లేదు. మూడేళ్ల కాలంలో రుణగ్రహీత ఏమైనా సొమ్ము చెల్లిస్తే ప్రామిసరీ నోట్ వెనుక ఎంత చెల్లించిందీ రాసి, సంతకం చేసి తేదీ వేయాలి. దీంతో ఆ తేదీ నుంచి తిరిగి మూడేళ్లు ప్రోనోట్‌కు కాలపరిమితి ఉంటుంది.

#నోటీసు :- కోర్టులో కేసు పైల్ చేసే ముందు తప్పకుండా మూడు సంవత్సరాలలోపు మాత్రమే నోటీసు ఇచ్చి కోర్టులో దావా వేయాలి

#వడ్డీ : అప్పుగా తీసుకున్న సొమ్ముకు రూ.2 మాత్రమే వడ్డీగా వసూలు చేయాలి. అధిక వడ్డీ వసూలు చేయడం నేరం.


#ఎంతమొత్తానికి_ప్రామిసరినోటు_వ్రాసుకొనవచ్చు

అయిదు లక్షల వరకు మాత్రమే ప్రామిసరి నోట్లను వాడితే బెటర్‌.అంతకు మించి డబ్బు ఇస్తే 100 రూపాయల బాండ్‌ పేపర్‌ను వాడటం ఉత్తమం.

ఇక ప్రామిసరి నోటును డబ్బు తీసుకునే వ్యక్తి కుటుంబ సభ్యుల సమక్షంలో రాయించుకుంటే మంచిది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రామిసరి నోటు కోర్టుకు వెళ్తే కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా రాయించుకుంటే ఆ డబ్బు రావడం అనుమానమే.

#రుణగ్రహీత_బాధ్యతలు
ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులపై సంతకాలు చేస్తే ఇబ్బందులు తప్పవు. తాను అప్పుగా తీసుకున్న సొమ్మును సకాలంలో తీర్చాలి. తన ఆర్థిక శక్తి ఎంత ఉందో అంతవరకే అప్పు తీసుకోవడం మంచిది.

#ప్రోనోట్_బదిలీ
ప్రామిసరీ నోట్‌ను రుణదాత తనకు కావాల్సిన వ్యక్తికి బదిలీ చేయవచ్చు. రుణగ్రహీత నుంచి అప్పు వసూలు చేసుకునే హక్కును బదిలీ చేయవచ్చు.

21/07/2023
13/07/2023

రాజకీయాల్లో నీతిమంతులు రాకపోతే నీతిలేని వారే రాజ్యమేలుతారు - సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ

అవేర్నెస్ క్రియేట్ చెయ్యడానికి ఈ పోస్టర్ తయారు చెయ్యడం జరిగింది.మీకు ఈ పోస్ట్ నచ్చితే.  అవసరమైన వారితో ఈ సమాచారాన్ని పంచ...
02/07/2023

అవేర్నెస్ క్రియేట్ చెయ్యడానికి ఈ పోస్టర్ తయారు చెయ్యడం జరిగింది.మీకు ఈ పోస్ట్ నచ్చితే. అవసరమైన వారితో ఈ సమాచారాన్ని పంచుకోండి, అందువల్ల వారికి చట్టలపై ఉన్న సందేహాలకు పరిష్కారం లభిస్తుంది (ఈ సందేశం కేవలం విద్యా ప్రయోజనం కోసమే. మరింత సమాచారం కోసం మీ న్యాయవాదిని సంప్రదించండి)చట్టానికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ పేజీని లైక్ మరియు ఫాలో చేయండి

అయినా ఏదైనా UPDATE వస్తే play store/APP store లో వస్తుంది లింక్స్ షేర్ చేస్తున్నారు అంటే అర్ధం చేసుకోవాలి
14/06/2023

అయినా ఏదైనా UPDATE వస్తే play store/APP store లో వస్తుంది లింక్స్ షేర్ చేస్తున్నారు అంటే అర్ధం చేసుకోవాలి

10/06/2023

" రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు "
రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు "

* సుప్రీం కోర్ట్ , హై కోర్టుల సంచలన తీర్పులు

సమాజం లో మనం చాలా సందర్భాల్లో ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో , కోర్టుల్లో , పలు కేసుల్లో , రాజకీయంగా రౌడీ షీట్ అనే పదం వింటూనే ఉంటాం . రౌడీ షీట్ అనగానే చాలా మందికి సాధారణ ప్రజలకి ఒకరకమైన భయం , అభద్రత భావం . రౌడీ షీటర్ అనీ ఒక వ్యక్తికి ముద్రపడగానే కొంత వరకు సమాజం ఆ వ్యక్తీ పట్ల చిన్నా కూడా చూపు చూపిస్తుంది. కొందరు సాధారణ పౌర జీవనం నుండి గతీ తప్పిన యువకులు చెడు వ్యసనాలకు పాల్పడి నేరాలు చేసి కేసులు నమోదు కావటం వలన పలు పోలీస్ స్టేషన్లో రౌడీలు గా నమోదు అవుతున్నారు. కొందరు సినీమాలూ , సీరియళ్లు , సాంఘిక , కుటుంబ నేపథ్యం లో రౌడీ లుగా నమోదు అయితే మరీ కొందరు స్థానిక పరిస్థితుల ఆధారంగా రాజకీయ క్రీడలో కక్ష్య పూరితంగా రౌడీలుగ బలవంతంగా నమోదు అవుతున్నారు . నేటి కాలంలో అయితే రాజకీయనాయకులే కొందరు పోలీస్ అధికారుల సహాయంతో కక్ష్య పూరితంగా రౌడీ షీటర్ లను ఉత్పత్తి చేస్తున్నారు ముద్రవేస్తున్నారు. స్థానికంగా ఎదుటి వ్యక్తి అంటే గిట్టనివారు ఇతర ప్రత్యర్థుల మీదా పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు చేయించి ఎదుటి వ్యక్తికి వినాశనాన్ని కోరుకుంటున్నారు. ఇది ఒక రకమైన విద్వేషంగా చెప్పవచ్చు.

1. రౌడీ షీట్ అంటే ఏమిటి...?

ఒక వ్యక్తి పదే పదే habitual గా అలవాటుగా నేరాలకు పాల్పడితే అతని పై పోలీసులు రౌడీ షీట్ నూ నమోదు చేయటాన్ని రౌడీ షీట్ అంటారు.స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అభ్యర్థన మేరకు సిపి, ఎసిపి , డిఎస్పీ, లాంటి ఉన్నాత పోలీసు అధికారులు రెండూ , లేదా మూడు కంటే ఎక్కువ కేసులూ నమోదు కాబడిన వ్యక్తుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నా చిన్నా నేరాలకు కాకుండా పబ్లిక్ ఆర్డర్ కూ భంగం కలిగిన సందర్భాల్లో జడ్జీ గారి అనుమతితో ఓపెన్ చేయాలీ అది కూడా హిస్టరీ షీట్ మాత్రమే రౌడీ షీట్ ఎంత మాత్రం కాదు.

2. రౌడీ షీట్ ఎవరీ పై ఓపెన్ చెస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 2500 పైగా రౌడి షీట్స్ ఓపెన్ చేశారని గణాంకాలు చెప్తున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పి ఎస్ ఓ లు పోలీస్ పరిపాలన మార్గదర్శకాలు తెలంగాణలో కూడా దత్తతకు తీసుకున్నాము. వాటి ఆధారంగానే రౌడీ షీట్ లు నమోదు చేస్తున్నారు. రౌడి షీట్లు ముఖ్యంగా భూ మాఫియా చేసే వారి పై , సెటిల్మెంట్ లు చేసేవారిపై , హత్య కేసులు ఉన్నవారిపై,ఇవ్ టీజర్స్ పై, దోపిడీలు చేసే వారిపై రౌడి షీట్లు నమోదు చేస్తున్నారు పోలీస్ లు. భూ సమస్యలు ఉన్నవారి పై , చిన్న చిన్న నేరాలకు పాల్పడిన వారి పై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని పోలీస్ స్థానిక రాజకీయాలకు తలోగ్గి సామాన్యుల మీద రౌడి షీట్లు నమోదు చేసినా సంఘటనలు కోకొల్లలు. ఇంటి పక్కవాల్లతో విభేదాలు, ద్వేషం, అసూయ, రాజకీయ కక్ష్యలు లాంటి కారణాల చేత కూడా రౌడి షీట్లు నమోదు చేస్తున్నారు పోలస్ అధికారుల. రాజకీయ జోక్యం తోనే రౌడి షీట్లు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. రౌడి షీట్ కు ఎఫ్ ఐ ఆర్ ఉండదు, కేసు ఉండదు.

3. రౌడీ షీటర్ అనీ మీ పై పోలీస్ లు ముద్ర వేయ్యోచా.?

మీ పై పోలీస్ స్టేషనులో పలు కేసులూ నమోదు అయినప్పటికీ మీ పై చట్టము ప్రకారం రౌడీ షీట్ ఓపెన్ చేయటం కానీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ జస్టిస్ ఇవీఎస్ సోమయాజులు సంచలనమైన తీర్పు నూ వెలువరించారు ఆ తీర్పు ప్రకారం మీ వ్యక్తిగత వివరాలను,చిరునామా లను పలు పోలీస్ స్టేషన్లో ప్రదర్శించటం చెయ్యరాదు. అలాగే మీ తలపై ముసుగు వేసి , లేదా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టీ మీరూ రౌడీ లు అనీ చెప్పటానికి కూడా వీలు లేదునీ మీ ఫొటోస్ , వేలి ముద్రలు కూడా తీసుకోవటానికి పోలీస్ లకు లేదని . మీ వ్యక్తిగత గోప్యతా హక్కులను బంగపరచటానికి పోలీస్ లకు అధికారం లేదు అని ఏపీ హై కోర్ట్ స్పష్టం చేసింది. సుప్రీం కోర్ట్ కే ఎస్ పుట్టు స్వామి కేసులో ఇచ్చిన తీర్పును ఉల్లంఘించరాదని పేర్కొంది. కాబట్టి మిమ్మలని రౌడీ లు అనీ చెప్పటానికి పోలీసులకు ఎంత మాత్రం అధికారం లేదు.

4. మీ పై రౌడీ షీట్ ఓపెన్ చేస్తే పోలీస్ ల పై క్రిమినల్ అండ్ సివిల్ కేసులు వేయొచ్చు.

పోలీస్ లు చట్టబద్దత లేని రౌడీ షీట్ మీ పై ఓపెన్ చేస్తే సదర్ పోలీస్ అధికారి పై మీరూ క్రిమినల్ కేసులు మరియూ సివిల్ కేసులు పరువు నష్టం దావా కేసులు వేయొచ్చు. అలాగే కోర్టు దిక్కరణ కేసులు కూడా నమోదు చెయ్యొచ్చు. సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు కె యస్ పుట్టు స్వామీ కేసు లో , ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ ఈవీఎస్ సోమయాజులు ఇచ్చిన తీర్పులో పేర్కొన్న అంశాలను బేస్ చేసుకోవచ్చు. స్వయంగా హైకోర్ట్ రౌడీ షీట్ ఓపెన్ చేస్తే కోర్ట్ దిక్కరణ కేసులు నమోదు చేయాలని పేర్కొనటం గమనార్హం.

5. మీ పై రౌడీ షీట్ ను ఎలా ఎదుర్కోవాలి.

చాలా మంది రౌడీ షీట్ నమోదు అయిన వ్యక్తులూ, సామాన్యులు రౌడీ ఓపెన్ కాగానే ఇక వారి జీవితం ముగిసిందని జీవితం ప్రమాదంలో పడింది అనీ ఆత్మ నున్యత భావంలో వెళ్తున్నారు. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో చాలా మందికి తెలియదు.r ఒక రౌడీ షీట్ క్లోజ్ చేయాలంటే ఒకటీ పోలీస్ అధికారులు చేస్తారు రెండోది కోర్టు చేస్తుంది. పోలీస్ అధికారుల దృష్టిలో సదర్ రౌడీ షీట్ నమోదు కాబడిన వ్యక్టి ప్రవర్తనలో మార్పు వచ్చిందని భావించి అతనీ పై ఎలాంటి క్రిమినల్ కేసులో లేకుంటే జిల్లా స్థాయి పోలీస్ ఉన్నత అధికారి ఎస్ ఎచ్ ఓ సూచన మేరకు తొలగించవచ్చు కానీ ఎలాంటి కేసులు లేకున్నా , కేసులు కోర్టులలో కొట్టుడు పోయిన రౌడీ షీట్ నూ పోలీస్ లు కొనసాగిస్తున్నారు. రెండోది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హై కోర్టులో మీ పై నమోదు అయిన రౌడీ షీట్ ను సవాల్ చేస్తూ వాజ్యం వేయొచ్చు. రౌడీ షీట్లకు చట్ట బద్దత లేదు కాబట్టి కచ్చితంగా కొట్టివేయబడుతుంది.

* జస్టిస్ ఇవీఎస్ సోమయాజులు ఇచ్చిన తీర్పులో ముఖ్యమైన అంశాలు.

1. పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ కేవలం పరిపాలన మార్గదర్శకాలు మాత్రమే అనీ స్పష్టం చేసింది.
2. రౌడీ షీట్ నమోదు, కొనసాగింపు తరుచ ఠానాల్లోకి పిలవటం, వేలి ముద్రల, ఫోటోల సేకరణ, ప్రదర్శన, వ్యక్తుల గోప్యతా హక్కులను ఉల్లంగించటమేనని స్పష్టం చేసింది
3.పోలీస్ మార్గ దర్శకాల ఆధారంగా రౌడీ షీట్ నమోదు చేస్తే కోర్ట్ దిక్కరన కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది.
4. చట్టం అనుమతి లేకుండ రౌడీ షీట్ నమోదు, కొనసాగింపు,వ్యక్తిగత సమాచారం సేకరించవద్దని పోలీస్ లకు తేల్చి చెప్పింది.
5. పోలీస్ మార్గదర్శకాల పేరు చెప్పి నిందితుల, అనుమానితుల ఇండ్లకు రాత్రిళ్ళు వెళ్ళ వద్దని చెప్పింది.
6. వారాంతపు సెలవుల్లో నిందితుల,అనుమానితులను పోలీస్ స్టేషన్లకు పిలువ వద్దని, ఠానాల్లో వారిని వేచి ఉండేలా చెయ్యొద్దని పేర్కొంది.
7. స్టేషన్ దాటి వెళ్ళాలంటే అనుమతి తీసుకోవాలనే షరతులు పెట్టొద్దని పోలీస్ లకు స్పష్టం చేసింది.
8. సుప్రీం కోర్ట్, హై కోర్ట్ గతంలో ఇచ్చిన తీర్పులను ఉల్లంఘిస్తూ రౌడీ షీట్ లు నమోదు చేస్తున్నారని పేర్కొంది.
9. తగిన కారణాలు, విశ్వసనీయ సమాచారం లేకుండా లేకుండ చాలా మంది పై రౌడీషీటర్ లుగా ముద్రా వేస్తున్నారని అంది.

10.1960 లో ఎపి పి ఎస్ వో ప్రవేశ పెట్టినపుడు అవీ మార్గదర్శకాలేనని ఆ జి ఓ లనే స్పష్టంగా పేర్కొన్నారు అనీ తెలిపింది.
11. ఏపీ పి ఎస్ ఓ కు చట్ట బద్దత లెని ఏపీ పి ఎస్ ఓ ఆధారంగా రౌడీ షీట్ నమోదు, నిఘా పెట్టడం, ఫొటోల ప్రదర్శన చేయటం కే ఎస్ పుట్టు స్వామీ కేసులో సుప్రీం కోర్టులో ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉల్లంఘించడమే.

తిరిగిరాని సంప్రదాయం... 👍పెద్దలకు "మహారాజశ్రీ" అనే పదం వాడేవారు. పిన్నలకు  "ప్రియమైన" లేక "చిరంజీవి" పదాలు వాడేవారు. స్త...
08/06/2023

తిరిగిరాని సంప్రదాయం... 👍

పెద్దలకు "మహారాజశ్రీ" అనే పదం వాడేవారు. పిన్నలకు "ప్రియమైన" లేక "చిరంజీవి" పదాలు వాడేవారు. స్త్రీలకు పెద్దవాళ్ళైతే "లక్ష్మి సమానురాలగు" పదాలు వాడేవారు. విధవలకు "గంగా భాగీరథీ సమానురాలగు" అనే పదాలు వాడేవారు.

ఆ రోజుల్లో పోస్టుకార్డులు ఎక్కువగా వాడేవారు. ఉత్తరం యొక్క శరీర భాగంలో ఆరోగ్య సమాచారాలు, కష్టసుఖాలు, కుటుంబ సమస్యలు, బాంధవ్యాలకు అనుగుణంగా సంభోదించుకొంటూ, పెద్దలకు నమస్కారాలు, పిన్నలకు దీవెనలతో ముగిస్తుండేవారు. ఆనాటి ఉత్తరాల్లో ప్రేమ, పెద్దరికం, చక్కని బాంధవ్యాలు కనిపించేవి.

వివాహాలు, అమ్మాయిల వోణీ ధారణ లాంటి శుభ సమాచారాలుంటే ఉత్తరానికి నలుమూలల ‘పసుపు’ రాసి పంపిస్తుండేవారు. చావులాంటి అశుభ వార్తలుంటే ‘సిరా’ ఉత్తరానికి నలుమూలల రాసి పంపిస్తుండేవారు. అలాంటి ఉత్తరాలు వస్తే చదివి బయటే చించి పడేస్తుండేవారు. మామూలు ఉత్తరాలను ఒక ‘తీగెకు గుచ్చి’ పదిలంగా ఉంచుతుండేవారు.*

₹10రూ ల సొంత డబ్బులతో పానీపూరీ కొనుకొనితింటే ప్లేట్‌లోని నీళ్లను వదలకుండా తాగుతాము....!ఐస్‌క్రీం కొంటే చివరికి మూత కూడా ...
07/06/2023

₹10రూ ల సొంత డబ్బులతో పానీపూరీ కొనుకొనితింటే
ప్లేట్‌లోని నీళ్లను వదలకుండా తాగుతాము....!

ఐస్‌క్రీం కొంటే చివరికి మూత కూడా నాకుతారము...!

కాల్చిన మాంసపు ముక్క తీసుకుంటే నలుపు (మసి)పెంకు కూడా వదలము...!

#అలాంటిది మనము పెళ్లిళ్లకు
డిన్నర్లకు,దావత్లకు, birthday party లకు
ఇతర వేడుకలకు వెళ్లిన తర్వాత ఆహారాన్ని ఎందుకు వృధా చేస్తారు?
దాని వల్ల మన హోదా ఏమైనా పెరుగుతుందా ?
ఒక్కొక్క ధాన్యపు గింజ ఆహారం గా మారడానికి, అది మన కడుపులోకి రావడానికి రైతుల శ్రమ, కష్టం, డబ్బు, కూలీలా చెమట చుక్కలు ఉన్నాయనేది మనం మరవ కూడదు.
మన కుటుంబాలలోనే ఒక తండ్రి, తల్లి తన జీవితమంతా
ఆ ఆహారం కోసం కష్టపడి ఉండవచ్చు.
ప్రపంచంలో అన్నిటికంటే బాధ"ఆకలి"
ప్రతి సంవత్సరం కోట్లాదిమంది ఆహారం లేక ఆకలి చావులకు గురి అవుతున్నారు.
కడుపులోకి ఎంత కావాలంటే అంత తీసుకో...!
ఆకలిని తీర్చుకో కానీ ఆహారం వృధా చేసి ఇతర ప్రాణుల నోటి ముద్ద దూరం చేయకు
ఇంట్లో అయినా బయట అయినా ఆహారాన్ని వృధా చేయడం మహా పాపం.
Don't waste food

దయచేసి ఆహారాన్ని వృధా చేయకండి.
✍️
🙏💐

02/06/2023

_*సోషల్ మీడియాలో శృతిమించి ప్రవర్తిస్తే ఈ సెక్షన్లు అమలు చేయవచ్చు....*_

★ ఐటీ ఆక్ట్ 2000ఐటీ ఆక్ట్ సెక్షన్ 66ఐపీసీ సెక్షన్ 292సెక్షన్ 354A 354D (నిర్భయ చట్టం) సెక్షన్ 499సెక్షన్ 66D ట్రోల్ చేసే వారి కోసం.. సోషల్ మీడియా లో శ్రుతి మించి ప్రవర్తిస్తే

*1.* *ట్రోలింగ్* (ఆడవారి మీద అసహ్యకర, అసభ్య, జోకులు వేయడం.వారి పేర్లు pics కి పెట్టడం).

*2.* *డిఫమేషన్* (ఆడపిల్లలు లేదా పెళ్లి అయిన వారి ని కామెంట్ చేస్తూ పోస్ట్ పెట్టడం.. వారి కుటుంబ ప్రతిష్ట ను దెబ్బ తీసేలా కామెంట్స్ చేయడం.. పరువు నష్టం కలిగించడం).

*3.* *స్టాకింగ్* (ఆడవారిపై అభ్యంతరకర కామెంట్స్ చేయడం, పోస్ట్లు పెట్టడం.)

★ ఈ పై 3 పనులకు పాల్పడిన వారు.. వారి స్నేహితులైనా.. సన్నిహితులైన.. బంధువులైనా… ఐటీ ఆక్ట్ 2000 ప్రకారం నేరస్థులు గా పరిగణింపబడుతారు.

★ ఐటీ ఆక్ట్ సెక్షన్ 66 ప్రకారం పనిష్మెంట్ ఫర్ వయోలాషన్ ఆఫ్ ప్రైవసీ కింద.. నిర్భయ చట్టం లోని సెక్షన్ 354A, 354D ప్రకారంహారాస్మెంట్ వయా ఎలెక్ట్రానిక్ కమ్యూనికేషన్ ప్రకారం నేరం...

★ సోషల్ మీడియాలో అసభ్యకర ఫొటో షేర్ చేస్తే..?

*1.* ఐపీసీ సెక్షన్ 292 కింద శిక్షార్హులవుతారు. ఈ సెక్షన్ ప్రకారం అసభ్యకరమైన అంశాన్ని వీడియో, ఫొటో, టెక్ట్స్ ఏదైనా సరే షేర్ చేస్తే 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అదే ఇలాంటి పని మళ్లీ చేస్తే అప్పుడు ఏకంగా 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.

*2.* ఏదైనా మతాన్ని, వర్గాన్ని కించపరుస్తూ కామెంట్, పోస్ట్ పెడితే..? ఇలాంటి విషయాల్లో ఐటీ చట్టం కింద కేసు పెడతారు. దానితో పాటుగా మతానికి సంబంధించిన అంశం గనక అయితే 295 సెక్షన్ పెడతారు. ఒక వేళ ఇలాంటి విషయాల్లో అవతలి వారి పరువుకు భంగం కలిగితే సెక్షన్ 499 కింద కూడా కేసు పెడతారు.

*3.* అనుమతి లేకుండా వేరే వ్యక్తి ఫొటో వాడితే..? అవతలి వ్యక్తి అనుమతి లేకుండా ఎవరైనా అతని/ఆమె ఫొటోను వాడుకుంటే ఐటీ చట్టం సెక్షన్ 499 కింద కేసు పెడతారు. ఫొటోను వాడారు కనుక చీటింగ్ కేసు పెడతారు. అలాగే మార్ఫింగ్ చేస్తే అదనపు కేసులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది.

*4.* నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే..? ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో నకిలీ ప్రొఫైల్స్ ఎక్కువగా క్రియేట్ చేస్తుంటారు. అయితే ఇలా చేస్తే సెక్షన్ 499 కింద కేసు పెడతారు. అలాగే ఐటీ చట్టం సెక్షన్ 66డి కింద కూడా కేసు పెడతారు. చాలా మంది తాము ఏమేం చేస్తున్నా అది ఎవరికీ తెలియదు అని అనుకుంటున్నారు. అయితే అది తప్పు. ఎందుకంటే ఇంటర్నెట్‌లో ఎవరు ఏం చేసినా అది రికార్డెడ్‌గా ఉంటుంది. ఎవరైనా ఏ తప్పు చేసినా దాన్ని బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులు, సైబర్ నిపుణులు తేలిగ్గా ట్రాక్ చేయగలుగుతారు.

★ ఫోన్ లేదా కంప్యూటర్ ఏది వాడినా అందులో ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే దానికి ఉండే ఐపీ అడ్రస్‌ను వారు ట్రాక్ చేస్తారు.

★ సోషల్ మీడియాలో మనం పెట్టె పోస్టులు వేరేవర్ని భాదించనివి అయితే మీకు ప్రాబ్లం ఉండదు.

*దయచేసి పోస్ట్స్ కామెంట్స్ పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్త తీసుకోండి.*

★ లైట్ గా తీసుకుంటున్నారులే అని అనుకోoడి, భాదితులు కంప్లైంట్ ఇస్తే ఉన్న జాబ్స్ పోయి బెయిల్ కూడా రాని విధంగా ఉంటుంది.

★ మీరు పోస్ట్ డిలీట్ చేసినా సరే అంతకుముందు అతను / ఆమెతో జరిగిన ఒక సంభాషణ చాలు కేసు బుక్ చెయ్యడానికి.

*జాగ్రత్తగా గమనించగలరు*

అమ్మాయిలు, మహిళలు వివిధ సోషల్ మీడియాలో వేదికల్లో తమ వ్యక్తిగత ఫోటోను ప్రొఫైల్ డిపిగా పెట్టుకునేప్పుడు ఒకటికి రెండు సార్ల...
21/05/2023

అమ్మాయిలు, మహిళలు వివిధ సోషల్ మీడియాలో వేదికల్లో తమ వ్యక్తిగత ఫోటోను ప్రొఫైల్ డిపిగా పెట్టుకునేప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఆ ఫోటోను సైబర్ నేరగాళ్లు మార్ఫింగ్ చేసి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే ప్రమాదముంది.

అందరూ కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోగలరని నా యొక్క విన్నపము ఈరోజు మనందరం కూడా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు...
12/05/2023

అందరూ కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోగలరని నా యొక్క విన్నపము ఈరోజు మనందరం కూడా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఈవెంట్స్ అని మరియు భోజనాలకు సంబంధించినటువంటి విధానాన్ని గురించి చెప్పదలుచుకున్నాను ఈవెంట్స్ విషయానికొస్తే ఈ విధంగా ఈవెంట్స్ కండక్ట్ చేయటం వల్ల వాళ్ళు ఏ శుభకార్యాలకైతే వచ్చారు ఆ శుభకార్యాలను సక్రమంగా చూడలేకపోతున్నారు మరియు ఈవెంట్స్ లో జరిపేటటువంటి కార్యక్రమాల వల్ల వచ్చినటువంటి బంధువులకు చాలా ఇబ్బందికరంగాను ఉంటుంది మరియు ఆ సౌండ్స్ ద్వారా చాలామందికి హార్ట్ ఎటాక్ కూడా వస్తున్నాయని ఇటీవల కాలంలో మనము వింటున్నాము ఈ విషయాన్ని పెద్దలందరూ .భోజనాల విషయానికి వస్తే ఈరోజు లల్లో అందరూ కూడా ఈ బఫ్ సిస్టం పెట్టడం వల్ల చాలా రకాల ప్రాబ్లంను ఎదుర్కొంటున్నారు ఇది పెద్ద వాళ్లకు మరియు చిన్న పిల్లలు ఉన్న వాళ్లకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది పెద్దవాళ్ల విషయానికొస్తే వాళ్లు ఆ ప్లేట్స్ పట్టుకొని క్యూలైన్లో నించొని భోజనాన్ని తీసుకొని తినటం చాలా కష్టంగా ఉంటుంది కొన్ని ఫంక్షన్లలో కూర్చోవడానికి కుర్చీలు లేకపోవటం వల్ల వాళ్లు నిలబడి అంత బరువు ప్లేట్ పట్టుకొని తినటం మరియు నీళ్లు త్రాగటం కష్టంగా మారుతుంది ఉండిన పదార్థాలు ఒకచోట నీళ్లు ఒకచోట ఉండటం వలన పెద్దవాళ్లు ఆ ప్లేట్లను తీసుకొని వెళ్లేటప్పుడు మధ్యలో భోజనాలు చేసేవారి కి కూడా ఇబ్బంది కలుగుతుంది కావున ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించగలరని కోరుకుంటున్నాను ఇకనుండి అయినా మీ ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు టేబుల్ మీల్స్ ఏర్పాటు చేసి భోజనాలు పెట్టవలెనని కోరుకుంటున్నాను ఇది ముఖ్యంగా పెద్దవాళ్లు గమనించవలెనుఈ విషయాన్ని ముఖ్యంగా ఆర్యవైశ్యులు గుర్తించవలెనుఈ విషయాన్ని అందరూ కూడా మీరు తెలియపరచండి ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ఆచారాలు సాంప్రదాయాలు వెళ్లిపోయాయి. భోజనాలలో పెట్టే వంటలు కూడా మన యొక్క ఆచారాలకు తగిన టివి కావు. వాళ్లు పెట్టేటటువంటి పీజాలు బర్గర్లు ఫ్రైడ్ రైస్లు వీటిని తినటం వల్ల ఇళ్లల్లో కూడా మసాలా ఫుడ్లు తినటం బాగా అలవాటయింది తద్వారా ఆరోగ్యాలు కూడా దెబ్బతిని గ్యాస్ ట్రబుల్ లాంటివి వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా పెళ్లిళ్లకు ఎవరైనా పిలిచినప్పుడు వాళ్లని మీరు డైరెక్ట్ గా అడగండి మీరు పెళ్లిలో బఫె భోజనాల టేబుల్ మీల్స్ అని అడగండి టేబుల్ మీల్స్ అయితేనే మేము వస్తాము రాకపోతే రామ అని చెప్పండి ఇలా చేయటం వల్ల కొంత రకానానికైనా మార్పు రావడం జరుగుతుందిఇప్పడి నుంచైనా మార్పు జరిగితే ఒక సంవత్సరం వరకు లోనన్న మార్పు వచ్చేస్తదండి పెళ్లిళ్లు సీజన్ నుంచైనా కొంచెంఅన్న మారమని చెప్పండి అందరికి కూడా మీరు డైరెక్ట్ గా అసలు మీ పెళ్లిళ్లకు కూడా రావని చెప్పడం కూడా మంచిది అనిపిస్తుంది పెళ్లి కార్డుల మీద కూడా మేము కూర్చోబెట్టి టేబుల్ భోజనాలు పెడతాను చెప్పాలి అప్పుడే పెళ్లికి వెళ్లాలి ఆ విధంగా కొన్ని పెళ్లిళ్ల కన్నా బంద్ చేస్తే అప్పుడు మార్పు వస్తది వాళ్ళు అంత అంత డబ్బు ఖర్చు పెడతారు కాబట్టి ఎవరికి పోకపోవటం వల్ల ఆ డబ్బంతా వృధా అయి మిగిలిన వాళ్ళకి కూడా జ్ఞానోదయం అయింది

ప్రజా సమాచారార్థం.. వాట్సప్ & ఫేస్ బుక్ లో స్టేటస్ లో అప్ డేట్ చేయగలరు.. వీలైన లోకల్ & ఇతర పబ్లిక్ గ్రూప్ లలో.. ఇతర సోషల...
03/05/2023

ప్రజా సమాచారార్థం.. వాట్సప్ & ఫేస్ బుక్ లో స్టేటస్ లో అప్ డేట్ చేయగలరు.. వీలైన లోకల్ & ఇతర పబ్లిక్ గ్రూప్ లలో.. ఇతర సోషల్ మీడియాలో.. షేర్ చేయగలరు..

 #అవినీతి_అధికారులపై_ఫిర్యాదుకు_రాష్ట్ర_లోకాయుక్త_సంస్థ.    ప్రభుత్వ అధికారి,ఉద్యోగి విధుల్లో నిర్లక్ష్యం,అవినీతి, చట్ట ...
24/04/2023

#అవినీతి_అధికారులపై_ఫిర్యాదుకు_రాష్ట్ర_లోకాయుక్త_సంస్థ.
ప్రభుత్వ అధికారి,ఉద్యోగి విధుల్లో నిర్లక్ష్యం,అవినీతి, చట్ట విరుద్ధంగా చేయకూడని పనులు చేయడం, చేయాల్సిన విధులు బాధ్యతలు నిర్వహించక పోవడం. మొదలగు వాటిపై ఫిర్యాదులు స్వీకరించి విచారణ జరిపి చర్యలు తీసుకోవడానికి వున్న సంస్థ రాష్ట్ర లోకాయుక్త సంస్థ. ఫిర్యాదుకు రుసుము: Rs.150/- రుసుము పోస్టల్ MO లేదా బ్యాంక్ DD చెల్లించి ఫిర్యాదు తో పాటు జత చేసి పంపాలి.
ఫిర్యాదులు పంప వలసిన చిరునామా: ,
D.No.: 96/3-72-124-1, Santhosh Nagar Main Road, Behind: Mahendra Showroom, Kurnool-518006. Andhra Pradesh.

20/04/2023

#ప్రభుత్వాన్ని_ఎవరు_ప్రశ్నించాలి?
●ఉద్యోగులు తమ ఉద్యోగం పోతుందేమోనని ప్రశ్నించరు.
●IAS, ,IPS, ప్రజాప్రతినిధుల చేతుల్లో బంధీలై పోతున్నారు. వాళ్ల అడుగులకు మడుగులోత్తుతూ, కొందరు బానిసల్లాగా జీవనం సాగిస్తున్నారు.
ఇక ఎక్కడ వారు ప్రశ్నిస్తారు?
●వ్యాపారస్తులు తమ వ్యాపారం దెబ్బతింటుందేమోనని ప్రశ్నించరు.
● ఆధ్యాత్మికవాదులు తమ దైవ భావన "నటన" ప్రశ్నిస్తారేమోనని," దేవుడు ఎక్కడ నిరూపించండి" అంటారని, తమ దోపిడీ ఎక్కడ ఆగిపోతుందో?
అని ప్రశ్నించరు.
●రైతులు తమ పంటలు పంటలు పండించకపోతే
తినే తిండి కూడా కరవౌతుందేమోనని, విధిలేక తమ పంటకు గిట్టుబాటు రాక, ప్రభుత్వ దయాదాక్షిన్యాలపై బతుకీడుస్తున్న రైతన్నలు ప్రశ్నించరు
● డాక్టర్లు తమ ప్రాక్టీస్ దెబ్బతింటుందేమోనని ప్రశ్నించరు.
●లాయర్లు కొందరు తమకు ఫీజు రాదేమోనని ప్రశ్నించరు. సమాజం శ్రేయస్సుకోసం పని చేసే లాయర్ ముక్కుసూటిగా ప్రశ్నిస్తారు...
●ఇంజనీర్లు తమ కట్టడాలను గూర్చి ఎక్కడ లోపాలు వెతుకుతారేమోనని వాళ్లు ప్రశ్నించరు.
●మేధావులు తాము గొప్ప మేధావులమన్న భావనతో అన్నీ అంతా మాకు తెలుసు ఎవరితో కయ్యం ఎందుకు అని ప్రశ్నించరు.మేధావులమన్న పోజు కొట్టడం తప్ప ప్రశ్నించరు.
●రాజకీయ నాయకులు ప్రశ్నలు ఎలాగో సహించరు. వాళ్లు ప్రశ్నించనే ప్రశ్నించరు. ఎందుకంటే వారి రాజకీయ మూలాలు పెకలించచబడతాయని,
ప్రశ్న అంటేనే వాళ్లకు విసుగు అసహనం. ప్రజలు ప్రశ్నించకుంటే, ప్రజల అజ్ఞానంలో ఉంటే ప్రజలు నిరక్షరాస్యులుగా ఉంటేనే వారికి వారి పదవి పదిలంగా ఉంటుంది ఎందుకంటే పదవి ఊడిపోతుందేమోనని భయం.
●ప్రింట్ మీడియా ప్రజలను సందేహంలో ఆందోళనలో ఉంచుతారు ఎందుకంటే ఒక విషయాన్ని అలా అనుకుంటున్నారు ఇలా అంటున్నారు అలా కావచ్చు ఇలా కావచ్చు అని అనుకుంటున్నారు విశ్వసనీయ వర్గాల వారి వల్ల తెలిసింది ఇలాంటి ప్రకటనలతో
"తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ?" అన్నట్టుగా సమస్యల్ని ప్రసారం చేస్తుంటారు.
●ఎలక్ట్రానిక్ మీడియా,ఏదో ఒక పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నది. తప్పైనా ఒప్పైనా ఆ పార్టీ కే వత్తాసు పలుకుతున్నాయి. పార్టీలు తాము డబ్బు ఇచ్చి ఉంచుకున్న మీడియాను తమ అబద్ధాలప్రచారాలకు,వినియోగించుకుంటున్నాయి, అవసరం ప్రజలకు అవసరం లేనివి, ధనవంతులకు బడా బాబులకు వారిని ఆకాశానికి ఎత్తడానికి, వాళ్లు ఎంత హీనమైన సరే గొప్ప మహానుభావులుగా చిత్రీకరించి, డబ్బా వాయించడానికి ఛానల్స్ పనికొస్తున్నాయి.

ఇక ఎవరు ప్రశ్నించగలరు?
ఎవరు ప్రజల తరఫున గొంతు ఎత్తగలరు?
పిడికిలి బిగించి "మా హక్కులు మాకు ఇవ్వండి" అని ధైర్యంగా ఎవరు ముందుకు వస్తారు?
కులమతాల కతీతంగా ప్రశ్నించగల స్వేచ్ఛ, స్వాతంత్రాలు కలిగిన హేతువాదులే, ఈ సమాజ మార్పుకు దోహదం చేయగలరు. ఎందుకంటే వీరు స్వేచ్ఛ జీవులు కాబట్టి ఏది ఏమైనా సరే అని ధైర్యం చేసి ముందుకు కదిలి అడిగేసే దమ్ము ధైర్యం ఉన్నవారు కాబట్టి ఈ సమాజాన్ని మార్చగలరు.

Which side you are??
19/04/2023

Which side you are??

18/04/2023

🌹 *వైద్యులు రోగి పట్ల నిర్లక్ష్యం వహిస్తే కన్సమర్ కోర్టులో నష్టపరిహారం* కోరవచ్చు - సుప్రీం సంచలన తీర్పు.* 🌹
దేశంలోని వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే వ్యక్తులు కూడా సవరించిన వినియోగదారుల రక్షణ చట్టం 2019 పరిధిలోకి వస్తారని ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ డి.వై.చంద్ర చూడ్, జస్టిస్ హిమా కోహ్లి తమ తీర్పులో సేవలు అన్న పదానికి విస్తృతమైన నిర్వచనం ఉందని చెపుతూనే ఏ తరహా సేవలైనా వినియోగదారులు రక్షణ చట్టం పరిధిలోకి కచ్చితంగా వస్తాయని, వైద్యుడు , రోగి మధ్య ఉండే సంబంధం యజమాని సేవకుడు సంబంధం కాదని వైద్య సేవ అనేది వైద్యుడు రోగి మధ్య కుదుర్చుకున్న వ్యక్తిగత ఒప్పందం (కాంట్రాక్టు)అని, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే వ్యక్తులకి వినియోగదారుల రక్షణ చట్టం నుండి మినహాయింపు లేదని తీర్పనిచ్చింది . ఈ తీర్పు తో వైద్య రంగంలో దోపిడీకి అడ్డు కట్ట వేసినట్లయిoది
వినియోగదారుడి పట్ల ఒక వైద్యుడి నిర్లక్ష్యం పై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా" మెడికోస్ లీగల్ యాక్షన్ గ్రూప్" సుప్రీంకోర్టులో పిల్ వేసింది.దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ వినియోగదారులకి అండగా ఇటీవల చరిత్రాత్మక తీర్పును ఇచ్చింది. దేశంలో రోగుల పట్ల అన్యాయంగా వ్యవహరించే, అడ్డగోలు దోపిడీ చేసే వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే వ్యక్తులు వినియోగదారుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి సుప్రీంకోర్టు తీర్పు తో ఏర్పడింది ఇది ముమ్మాటికీ వినియోగదారుల విజయం .

17/04/2023

ఆస్తి పత్రాలు కనపడడం లేదా..? అయితే ఈ విధంగా అనుసరిస్తేనే మంచిది..!

ఆస్తి పత్రాలు ఎంత విలువైనవో అందరికీ తెలుసు. వాటిని సురక్షితంగా ఉంచుకోవాలి. అయితే వాటిని సురక్షితంగా ఉంచుకోవాలి అని కొందరు బ్యాంకు లాకర్లులో కూడా పెడుతూ ఉంటారు.

ఎందుకంటే ఆ ఆస్తి మీది అని చూపించే ప్రూఫ్ కేవలం ఆ పత్రాలు మాత్రమే. ఒకవేళ కనుక మీరు మీ యొక్క ఆస్తి పత్రాలను పోగొట్టుకుంటే డూప్లికేట్ డాక్యుమెంట్ ని తయారు చేయించుకోవాలి. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం.

ఎఫ్ఐఆర్ ఫైల్:

ముందుగా మీ యొక్క కాగితాలు పోయినట్లు లేదా ఎవరైనా దొంగిలించారని మీరు తెలిసిన వెంటనే మీకు దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అయితే ఎఫ్ఐఆర్లో పేపర్లు పోయాయని వ్రాసిన కాపీని మీరు తీసుకుని భద్రపరచుకోవాలి.

న్యూస్ పేపర్:

మీరు వార్తా పత్రికలో మీ కాగితాలు పోయాయని నోటీసు ఇవ్వాలి. ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నోటీసు అవుతుంది. ఆ తర్వాత మరో 15 రోజుల పాటు లాగండి. ఎందుకంటే ఎవరికైనా దొరికితే మీ దగ్గరికి తీసుకు వస్తారు.

డూప్లికేట్ షేర్ సర్టిఫికెట్:

హౌసింగ్ సొసైటీలో నివసిస్తుంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లేదా RWA నుంచి డూప్లికేట్ సర్టిఫికెట్ ని పొందొచ్చు. డూప్లికేట్ షేర్ సర్టిఫికెట్ పొందాలంటే ఎఫ్ఐఆర్ కాపీ వార్తాపత్రికలో, ముద్రించిన నోటీసు తప్పక ఉండాలి. తర్వాత RWA సమావేశాన్ని ఏర్పాటు చేసి పత్రాలను పరిశీలించి అది నిజమని తేలితే అప్పుడు షేర్ సర్టిఫికెట్ ఇస్తారు.

చట్టపరమైన మార్గాన్ని అనుసరించాలి:

ప్రాపర్టీ పేపర్ కోసం స్టాంప్ పేపర్ పై చేసిన అండర్ టేకింగ్ కావాలి. అయితే దీనిలో ఆస్తి గురించి పూర్తిగా సమాచారం ఉంటుంది. దానిలో పోయిన పేపర్ల గురించి ఎఫ్ఐఆర్, వార్తాపత్రిక నోటీసులు పేర్కొనాలి. నోటరీ ద్వారా ఆమోదించి తరవాత రిజిస్టర్ కార్యాలయానికి వాటినివ్వాలి.

డూప్లికేట్ ప్రాపర్టీ పేపర్స్:

ఇలా ఇవన్నీ మీరు చేసిన తర్వాత రిజిస్టర్ కార్యాలయంలో మీయొక్క ఆస్తి కోసం నకిలీ సేల్ డీడ్ తో దరఖాస్తు చేసుకోవాలి. దీనికోసం మీకు ఎఫ్ఐఆర్ కాపీ, వార్తా పత్రికలో ప్రకటన, డూప్లికేట్ షేర్ సర్టిఫికెట్, నోటరీ మీకు అవసరం అవుతాయి. వీటిని మీరు రిజిస్టర్ కార్యాలయంలో ఇవ్వాలి అలానే దీనికోసం కొంత రుసుము చెల్లించాలి. ఇవన్నీ అయిపోయాక మీకు డూప్లికేట్ సేల్ డీడ్ వస్తుంది.

తిరుమల సమాచారం👍
17/04/2023

తిరుమల సమాచారం👍

అవేర్నెస్ క్రియేట్ చెయ్యడానికి ఈ పోస్టర్ తయారు చెయ్యడం జరిగింది.మీకు ఈ పోస్ట్ నచ్చితే.  అవసరమైన వారితో ఈ సమాచారాన్ని పంచ...
09/04/2023

అవేర్నెస్ క్రియేట్ చెయ్యడానికి ఈ పోస్టర్ తయారు చెయ్యడం జరిగింది.మీకు ఈ పోస్ట్ నచ్చితే. అవసరమైన వారితో ఈ సమాచారాన్ని పంచుకోండి, అందువల్ల వారికి చట్టలపై ఉన్న సందేహాలకు పరిష్కారం లభిస్తుంది (ఈ సందేశం కేవలం విద్యా ప్రయోజనం కోసమే. మరింత సమాచారం కోసం మీ న్యాయవాదిని సంప్రదించండి)

09/04/2023

క్లాస్ -1 చట్టపరమైన వారసులు ఎవరు?

ఒక హిందువు యొక్క ఆస్తి, వీలునామా (ప్రేగు) వదలకుండా మరణిస్తే, మొదట అతని క్లాస్ -1 వారసులకు ఇవ్వబడుతుంది.
ఒక వ్యక్తి యొక్క క్లాస్ -1 వారసులు:

కుమారులు
కుమార్తెలు
వితంతువు
తల్లి
పూర్వపు కుమారుడి కుమారుడు
పూర్వపు కుమారుడి కుమార్తె
పూర్వపు కుమార్తె కుమారుడు
పూర్వపు కుమార్తె కుమార్తె
పూర్వపు కుమారుడి భార్య
పూర్వపు కుమారుడి కుమారుడు
పూర్వపు కుమారుడి కుమారుడు
పూర్వపు కుమారుని యొక్క వితంతువు
పూర్వపు కుమార్తె యొక్క పూర్వపు కుమార్తె కుమారుడు
మృతురాలి కుమార్తె కుమార్తె
పూర్వపు కుమార్తె యొక్క పూర్వపు కుమారుడి కుమార్తె
పూర్వపు కుమారుడి కూతురు కుమార్తె

ఓటుకు నోటు తీసుకుంటే ప్రశ్నించే హక్కును కోల్పోతారు. ఓటర్లు అంతా మూతికుట్టుకుని మౌనంగా కూర్చుండాలి. ఎన్నికల్లో కర్చుపెట్ట...
09/04/2023

ఓటుకు నోటు తీసుకుంటే ప్రశ్నించే హక్కును కోల్పోతారు. ఓటర్లు అంతా మూతికుట్టుకుని మౌనంగా కూర్చుండాలి. ఎన్నికల్లో కర్చుపెట్టిన దానికంటే 10రెట్లు సంపాదించుకుంటారు. నీతులు తప్ప అభివృద్ధి ఉండదు. వాదనలు తప్ప చర్చలుండవు..! రాద్దంతాలు తప్ప సిద్ధాంతాలు ఉండవు...! వెన్నుపోటు తప్ప వెన్ను తట్టుడులుండవు...!!

Address


Alerts

Be the first to know and let us send you an email when Piler poragallu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share