NeraluGhoralu.com

  • Home
  • NeraluGhoralu.com

NeraluGhoralu.com Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from NeraluGhoralu.com, News & Media Website, .

https://neralughoralu.com/852-2/
15/12/2020

https://neralughoralu.com/852-2/

గెలిచిన వారి చేతిలో లైంగిక దాడికి గురైన అభాగ్యురాలుఆగ్రహంతో ఆమెపై యాసిడ్ పోసి గాయపరిచిన భర్త మహాభారతంలో ధర్మ.....

జైలు నుంచి పెరోల్ పై బయటకు వచ్చిన ఓ ఘరానా నేరస్తుడు ఏకంగా పోలీసుల దగ్గరే తన చేతివాటం చూపించాడు. ఓ రివాల్వర్ కాజేయడం పాటు...
23/11/2020

జైలు నుంచి పెరోల్ పై బయటకు వచ్చిన ఓ ఘరానా నేరస్తుడు ఏకంగా పోలీసుల దగ్గరే తన చేతివాటం చూపించాడు. ఓ రివాల్వర్ కాజేయడం పాటు దానితో నగల దుకాణం దోచుకోవడానికి ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నాడు. చివరి నిమిషంలో పోలీసులకు చిక్కాడు. దక్షిణ దిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి సెంట్రల్ డిస్ర్టిక్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ భాటియా వివరాలు వెల్లడించారు. ఆ ప్రకారం... నిందితుడు అతుల్ ఓ దోపిడీ కేసులో సెప్టెంబరులో జైలుకెళ్లి 45 రోజుల ఫెరోల్ పై బయటకు వచ్చాడు....

https://neralughoralu.com/%e0%b0%aa%e0%b1%86%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%88-%e0%b0%b5%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%be%e0%b0%a1%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b2%e0%b1%80%e0%b0%b8%e0%b1%81/

జైలు నుంచి పెరోల్ పై బయటకు వచ్చిన ఓ ఘరానా నేరస్తుడు ఏకంగా పోలీసుల దగ్గరే తన చేతివాటం చూపించాడు. ఓ రివాల్వర్ కాజే...

నకిలీ మేజర్ ఎంఎన్ చౌహాన్ పెళ్లి కుమారుడి విషయంలో లోతుగా విచారించకుండా పైపై డాబులు చూసినా, పైపైమాటలు నమ్మినా ఎంతగా నష్టపో...
22/11/2020

నకిలీ మేజర్ ఎంఎన్ చౌహాన్ పెళ్లి కుమారుడి విషయంలో లోతుగా విచారించకుండా పైపై డాబులు చూసినా, పైపైమాటలు నమ్మినా ఎంతగా నష్టపోవాల్సి వస్తుందో చెప్పే ఘటన ఇది. ఇంతకీ విషయమేమిటంటే.. ముదావత్ శ్రీను నాయక్ అనే వ్యక్తిని హైదరాబాద్ ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. నిందితుడి గురించి వారు వెల్లడించిన వివరాలు విస్మయం కలిగించాయి. ప్రకాశం జిల్లా పలుకురాళ్ల తండాకు చెందిన నిందితుడు పదో తరగతి వరకు మాత్రమే చదివాడు. 2002లో అదే ప్రాంతానికి చెందిన యువతిని వివాహం చేసుకోగా ఆమె గుంటూరులోని డీఎంహెచ్ వో కార్యాలయంలో సూపరిటెండెంట్ గా పనిచేస్తున్నారు....

https://neralughoralu.com/%e0%b0%aa%e0%b1%86%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b0%82%e0%b0%9f%e0%b0%be%e0%b0%a1%e0%b1%81-%e0%b0%a1%e0%b0%ac%e0%b1%8d%e0%b0%ac%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a6%e0%b0%82%e0%b0%a1%e0%b1%81/

నకిలీ మేజర్ ఎంఎన్ చౌహాన్ పెళ్లి కుమారుడి విషయంలో లోతుగా విచారించకుండా పైపై డాబులు చూసినా, పైపైమాటలు నమ్మినా ఎం...

ఈ అత్తాకోడళ్ల రూటే సెపరేటు. నిర్మానుష్య ఉన్న వీధులే వారి లక్ష్యం. అక్కడ తాళం వేసిన ఇళ్లు కనిపించాయంటే ఆ రోజుకు ఆ ఇంట్లో ...
21/11/2020

ఈ అత్తాకోడళ్ల రూటే సెపరేటు. నిర్మానుష్య ఉన్న వీధులే వారి లక్ష్యం. అక్కడ తాళం వేసిన ఇళ్లు కనిపించాయంటే ఆ రోజుకు ఆ ఇంట్లో చోరీ జరిగిపోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని భవానీపురం, పటమట, అజిత్ సింగ్ నగర్, మాచవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవలి కాలంలో పలు చోరీ ఘటనలు జరిగాయి. తాళం వేసిన ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడి అందినంత అపహరించినట్లు ఫిర్యాదులు అందాయి. ఒకే తరహాలో చోరీలు జరగడంతో పాత నేరస్తులపై పోలీసులు నిఘా ఉంచారు. అప్పుడే మాచవరానికి చెందిన అత్తాకోడళ్లు బోయపాటి ధనలక్ష్మీ (47), సాత్విక అలియాస్ సిరి (20)లు చిక్కారు....

https://neralughoralu.com/%e0%b0%96%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be%e0%b0%95%e0%b1%8d-%e0%b0%85%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%be%e0%b0%95%e0%b1%8b%e0%b0%a1%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a4/

ఈ అత్తాకోడళ్ల రూటే సెపరేటు. నిర్మానుష్య ఉన్న వీధులే వారి లక్ష్యం. అక్కడ తాళం వేసిన ఇళ్లు కనిపించాయంటే ఆ రోజుకు ఆ...

జర భద్రం తమ్ముళ్లూ... ఆన్ లైన్ మోసాల్లో పలు రకాలు ఉండగా అందులో ఇదో తరహా. డేటింగ్ వల విసిరి యువకులను బుట్టలో వేసి డబ్బులు...
21/11/2020

జర భద్రం తమ్ముళ్లూ... ఆన్ లైన్ మోసాల్లో పలు రకాలు ఉండగా అందులో ఇదో తరహా. డేటింగ్ వల విసిరి యువకులను బుట్టలో వేసి డబ్బులు దండుకుంటుందో ముఠా. రోజుకు రూ.కోటి సంపాదిస్తుందంటే ఈ మాయగాళ్ల వలలో ప్రతిరోజు ఎంతమంది చిక్కుకుంటున్నారో గ్రహించవచ్చు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ షాద్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి ఓ డేటింగ్ యాప్ ఓపెన్ చేసి మొబైల్ నంబరు సహా తన వివరాలు నమోదు చేశాడు. తర్వాత అతనికి వచ్చిన ఫోన్ కాల్ లో మాట్లాడిన యువతి అతనికి సమీప ప్రాంతంలోని అమ్మాయిల వివరాలు పంపుతామని నమ్మించి రిజిస్ట్రేషన్ ఫీజు, పలు స్కీముల కింద సుమారు రూ.14 లక్షలు ఆన్ లైన్ ద్వారా కట్టించుకుంది....

https://neralughoralu.com/%e0%b0%a1%e0%b1%87%e0%b0%9f%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%87%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%9a%e0%b1%80%e0%b0%9f%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d/

జర భద్రం తమ్ముళ్లూ… ఆన్ లైన్ మోసాల్లో పలు రకాలు ఉండగా అందులో ఇదో తరహా. డేటింగ్ వల విసిరి యువకులను బుట్టలో వేసి డ.....

ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ మేనేజర్ ఘరానా మోసం మోసగాళ్లు పలు రకాలుగా వంచనకు పాల్పడుతున్నా అందుకు వారు వాడే ఏకైక సూత్రం ఆశ....
20/11/2020

ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ మేనేజర్ ఘరానా మోసం మోసగాళ్లు పలు రకాలుగా వంచనకు పాల్పడుతున్నా అందుకు వారు వాడే ఏకైక సూత్రం ఆశ. ఆకర్షణీయమైన ప్రకటనలతో ప్రజలను తమ బుట్టలో పడేలా చేసుకుని తర్వాత మోసాలకు పాల్పడుతుంటారు. ఏ తరహా మోసాన్ని పరిశీలించినా ఈ విషయాలే కనిపిస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఈ తరహా మోసమే వెలుగులోకి వచ్చింది. పటమటలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో మేనేజర్ గా పనిచేస్తున్న వీరబాబు ఈ తరహా మోసానికే పాల్పడ్డాడు. సంస్థతో సంబంధంలేకుండా ఓ గోల్డ్ స్కేమ్ పెట్టాడు....

https://neralughoralu.com/%e0%b0%ac%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b0%82-%e0%b0%86%e0%b0%b6-%e0%b0%9a%e0%b1%82%e0%b0%aa%e0%b0%bf-%e0%b0%ac%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8/

ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ మేనేజర్ ఘరానా మోసం మోసగాళ్లు పలు రకాలుగా వంచనకు పాల్పడుతున్నా అందుకు వారు వాడే ఏకైక .....

ఉత్తరప్రదేశ్ లో గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు సహా 14 మంది మరణించారు. ప్రయాగ్ రాజ్ - లక్...
20/11/2020

ఉత్తరప్రదేశ్ లో గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు సహా 14 మంది మరణించారు. ప్రయాగ్ రాజ్ - లక్నో జాతీయ రహాదారిపై ప్రయాగ్ రాజ్ సమీపాన ఈ ప్రమాదం జరిగింది. కుండా నుంచి ప్రయాగ్ రాజ్ వైపు వెళ్తున్న ఓ బొలెరో వాహనం రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంతో బొలెరోలో ప్రయాణిస్తున్న 14 మంది అక్కడికక్కడే మరణించారు. బొలెరో నుజ్జునుజ్జుకావడంతో మృతదేహాలు బయటకు తీసేందుకు పోలీసులకు వెంటనే సాధ్యపడలేదు....

https://neralughoralu.com/%e0%b0%89%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%b0%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae/

ఉత్తరప్రదేశ్ లో గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు సహా 14 మంది మరణించారు. ప్రయాగ్ రా...

హైదరాబాద్; నగరంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని తను పనిచేస్తున్న కార్యాలయ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. నామాలగుం...
19/11/2020

హైదరాబాద్; నగరంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని తను పనిచేస్తున్న కార్యాలయ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. నామాలగుండుకు చెందిన సుష్మిత టెక్ మహీంద్ర సంస్థలో పనిచేస్తున్నారు. సికింద్రాబాద్ గోపాలపురంలోని తన కార్యాలయానికి గురువారం విధులకు హాజరైన ఆమె అదే కార్యాలయ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే బలవన్మరణానికి కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసినట్లు సమాచారం.

https://neralughoralu.com/%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b0%af-%e0%b0%ad%e0%b0%b5%e0%b0%a8%e0%b0%82%e0%b0%aa%e0%b1%88-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%a6%e0%b1%82/

హైదరాబాద్; నగరంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని తను పనిచేస్తున్న కార్యాలయ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డా.....

అతను పవిత్రమైన న్యాయవాద వృత్తిలో ఉన్నాడు. అయినా కామంతో కళ్లు మూసుకుపోయి వావివరసలు మరిచాడు. కన్న కూతురిపైనే పలుమార్లు అత్...
19/11/2020

అతను పవిత్రమైన న్యాయవాద వృత్తిలో ఉన్నాడు. అయినా కామంతో కళ్లు మూసుకుపోయి వావివరసలు మరిచాడు. కన్న కూతురిపైనే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. జన్మనిచ్చిన తండ్రే పశువుగా మారడంతో బలవన్మరణానికి యత్నించింది. తల్లి అడ్డుకుని నిలదీయడంతో ఆవేదన వెళ్లగక్కింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ దారుణం వివరాల్లోకి వెళ్తే.. హైదర్ షాకోట్ ఏరియా కపిల్ నగర్ కు చెందిన న్యాయవాది ఒకరు పదో తరగతి చదివే కన్నకూతురి పట్ల కీచకుడిగా మారాడు. బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ హేయచర్యలను భరించలేక బలవన్మణానికి యత్నించింది....

https://neralughoralu.com/%e0%b0%95%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%a4%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87-%e0%b0%95%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%82%e0%b0%a7%e0%b1%81%e0%b0%a1%e0%b1%88%e0%b0%a4%e0%b1%87/

అతను పవిత్రమైన న్యాయవాద వృత్తిలో ఉన్నాడు. అయినా కామంతో కళ్లు మూసుకుపోయి వావివరసలు మరిచాడు. కన్న కూతురిపైనే పలు...

వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో పురుషులకు తానేమీ తీసిపోనని నిరూపించిందామె. ఉన్నతాధికారులు ప్రోత్సాహకంగా విసిరిన ...
19/11/2020

వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో పురుషులకు తానేమీ తీసిపోనని నిరూపించిందామె. ఉన్నతాధికారులు ప్రోత్సాహకంగా విసిరిన ఛాలెంజ్ ను సాహసోపేతంగా స్వీకరించి విజయం సాధించింది. ఆమె ఛేదించిన అసాధారణ లక్ష్యానికి ఫలితంగా అసాధారణ పదోన్నతి పొందింది. ఢిల్లీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఓ సాధారణ హెడ్ కానిస్టేబుల్ సీమా ఢాకా ఈ ఘనత సాధించింది. ఇంతకీ ఆమె సాధించిన లక్ష్యం ఏమిటంటారా? చిన్నదేమీ కాదు. ఢిల్లీ, పంజాబ్, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో కనిపించకుండా పోయిన 76 మంది పిల్లల ఆచూకీని గుర్తించింది. ఇందుకు బహుమతిగా ఉన్నతాధికారుల నుంచి సీమా అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ పొందింది....

https://neralughoralu.com/%e0%b0%a4%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%b2%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%97%e0%b1%81%e0%b0%b0/

వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో పురుషులకు తానేమీ తీసిపోనని నిరూపించిందామె. ఉన్నతాధికారులు ప్రోత్సా.....

ఎన్ని పనులు ఉన్నా తల్లిదండ్రులు పసిపిల్లలపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని, లేకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదనే విషయాన్ని త...
19/11/2020

ఎన్ని పనులు ఉన్నా తల్లిదండ్రులు పసిపిల్లలపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని, లేకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదనే విషయాన్ని తాజాగా జరిగిన రెండు ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో జరిగిన ఆ ఘటనల వివరాల్లోకి వెళ్తే... కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరెల్ తండాకు చెందిన బామన్ జగదీశ్, సీతాబాయి దంపతుల 18 నెలల పసిబాలుడు శ్రీగోపాల్ బుధవారం సాయంత్రం బంతితో ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఒంటరిగా ఆడుకుంటున్న పసిబాలుడు అక్కడే ఉన్న నీళ్ల బకెట్ దగ్గరకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో తల్లకిందులుగా పడిపోయాడు....

https://neralughoralu.com/%e0%b0%aa%e0%b0%b8%e0%b0%bf%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%b2-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b7%e0%b0%af%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a4%e0%b0%b8%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%a4/

ఎన్ని పనులు ఉన్నా తల్లిదండ్రులు పసిపిల్లలపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని, లేకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదనే వ...

బిట్‌కాయిన్‌ పేరిట దేశవ్యాప్తంగా వేల మందిని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు సిరిమల్ల నాగరాజును హైదరాబాద్‌ సీసీఎస్‌ పో...
01/10/2020

బిట్‌కాయిన్‌ పేరిట దేశవ్యాప్తంగా వేల మందిని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు సిరిమల్ల నాగరాజును హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. బిట్‌కాయిన్‌ పేరిట ఆన్‌లైన్‌ దందా చేసిన సిరిమల్ల నాగరాజు తెలంగాణ రీజియన్‌కు హెడ్‌గా వ్యవహరించాడు. బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెడితే 18వారాల్లో అధిక మొత్తాల లాభాలతో తిరిగి చెల్లిస్తానని నమ్మించి పలువురిని నట్టేట ముంచాడు. బైనరీ పద్ధతి (గొలుసు స్కీము)లో దేశవ్యాప్తంగా సుమారు 1200 మంది నుంచి రూ. 52కోట్లకు పైగా వసూళ్లకు పాల్పడి ఉంటాడని పోలీసులు గుర్తించారు. తెలంగాణలో 250 మంది బాధితుల వద్ద నుంచి రూ. [ 89 more words ]

https://neralughoralu.com/bit-coin-cheater-arrested/

బిట్‌కాయిన్‌ పేరిట దేశవ్యాప్తంగా వేల మందిని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు సిరిమల్ల నాగరాజును హైదరాబాద్‌...

నల్గొండ: కారు అదుపుతప్పి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత చెందారు. హైదరాబాద్‌-నాగార్జునసాగర్ రహదారిపై జరిగిన ఈ ...
04/09/2020

నల్గొండ: కారు అదుపుతప్పి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత చెందారు. హైదరాబాద్‌-నాగార్జునసాగర్ రహదారిపై జరిగిన ఈ ఘోర ప్రమాదం స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. నల్లొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.హైదరాబాద్ నుంచి సాగర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
https://neralughoralu.com/car-accident/

నల్గొండ:  కారు  అదుపుతప్పి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత చెందారు. హైదరాబాద్‌-నాగార్జునసాగర్  రహదా.....

హైదరాబాద్: సంచలనం సృష్టిస్తున్న అత్యాచార బాధితురాలి ఘటనలో ట్విస్టులు వెలగు చూస్తూనే ఉన్నాయి. డాలర్‌భాయ్‌ చేతిలో కీలు బొమ...
03/09/2020

హైదరాబాద్: సంచలనం సృష్టిస్తున్న అత్యాచార బాధితురాలి ఘటనలో ట్విస్టులు వెలగు చూస్తూనే ఉన్నాయి. డాలర్‌భాయ్‌ చేతిలో కీలు బొమ్మగా మారానని.. అతను బెదిరించడంతోనే అమాయకులపై సైతం కేసులు పెట్టానని మరీ మీడియా సమావేశంలో బాధితురాలు ప్రకటించింది. ఈ వ్యవహారానికి డాలర్‌భాయ్‌ అలియాస్‌ రాజశ్రీకర్‌ రెడ్డి కింగ్‌పిన్‌ అని భావిస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌లో దర్యాప్తు కొనసాగుతోంది. అందులో చాలా మందికి ఈ వ్యవహారంతో సంబంధం లేదని బాధితురాలు చెప్పడంతో కేసులో మరో ట్విస్ట్. ఆమె చెప్పే వివరాల ఆధారంగా అమాయకుల పేర్ల తొలగింపు.. [ 97 more words ]
https://neralughoralu.com/panjagutta-case-twist-on-twist/

హైదరాబాద్: సంచలనం సృష్టిస్తున్న అత్యాచార బాధితురాలి ఘటనలో ట్విస్టులు వెలగు చూస్తూనే ఉన్నాయి. డాలర్‌భాయ్‌ చేత.....

విశాఖ: భీమిలి బీచ్ లో గుర్తు తెలియని మృత దేహం లభ్యమైంది. బీచ్ రోడ్డు జగ్గారావు తోట దగ్గరలో మృతదేహం తీరానికి చేరింది.కేవల...
03/09/2020

విశాఖ: భీమిలి బీచ్ లో గుర్తు తెలియని మృత దేహం లభ్యమైంది. బీచ్ రోడ్డు జగ్గారావు తోట దగ్గరలో మృతదేహం తీరానికి చేరింది.కేవలం స్కెలిటిన్ మాత్రమే ఉన్న మృత దేహం నీటిలో తేలియాడుతుండటం గమనించిన స్థానికులు మృత దేహాన్ని ఒడ్డుకు చేర్చి, పోలీసులకు సమాచారం అందించారు. …. మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్న భీమిలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.మృత దేహం పూర్తిగా కుళ్ళిపోయి, కేవలం అస్థిపంజరం మాత్రమే మిగిలి ఉందని, మెడలో మాస్కు, నడుంకి నల్లటి త్రాడు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మృత దేహం ఆడా,లేదా మగ. చనిపోయి ఎన్ని రోజులు అయ్యింది, హత్యా లేక ఆత్మహత్య అనే సందేహాలు పోస్ట్ మార్టంలో తేలాల్సి ఉంది.
https://neralughoralu.com/skeliton-at-beach/

విశాఖ: భీమిలి బీచ్ లో గుర్తు తెలియని మృత దేహం లభ్యమైంది. బీచ్ రోడ్డు జగ్గారావు తోట దగ్గరలో మృతదేహం తీరానికి చేరి...

అమరావతి:సీఎం వాహనశ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్...
02/09/2020

అమరావతి:సీఎం వాహనశ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.
https://neralughoralu.com/jagan-humanity/

అమరావతి:సీఎం వాహనశ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం న...

హైదరాబాద్‌: అతని స్టైలే వేరు… 9రాషా్ట్రల్లో వ్యాపారాలు.. సొంత విమానంలో షికార్లు… పెద్ద పెద్ద పోలీసు అధికారులతో పరిచయాలు....
29/08/2020

హైదరాబాద్‌: అతని స్టైలే వేరు… 9రాషా్ట్రల్లో వ్యాపారాలు.. సొంత విమానంలో షికార్లు… పెద్ద పెద్ద పోలీసు అధికారులతో పరిచయాలు. ఇలా తనకున్న పలుకుబడితో ఎలాంటి కేసునైనా ఇట్టే మాఫీ చేయిస్తానని నమ్మిస్తాడు. అందిన కాడికి దండుకుని చేతులెత్తేస్తాడు. హైదరాబాద్‌ నగరానికి చెందిన ఇద్దరు వ్యాపార సోదరులను మోసం చేసి రూ. 3.6కోట్లు కాజేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బెదిరింపులు, మోసాలకు పాల్పడి రూ. 3.6కోట్ల రూపాయలు కాజేసిన వ్యక్తిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర, పుణే ప్రాంతానికి చెందిన కపిల్‌ రాజేంద్ర కుమార్‌ బాహెతీ అలియాస్‌ కపిల్‌ పేలుడు పదార్థాల తయారీ వ్యాపారం చేస్తుంటాడు. [ 379 more words ]
https://neralughoralu.com/cheating-of-3-6-crores/

హైదరాబాద్‌: అతని స్టైలే వేరు… 9రాషా్ట్రల్లో వ్యాపారాలు.. సొంత విమానంలో షికార్లు… పెద్ద పెద్ద పోలీసు అధికారులతో ....

...హైదరాబాద్: పరోపకారం, తోటి మానవులకు సాయం  చేయడంలో ముందుండే సైఫాబాద్ పోలీస్ స్టేషన్  డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్...
27/08/2020

...హైదరాబాద్: పరోపకారం, తోటి మానవులకు సాయం చేయడంలో ముందుండే సైఫాబాద్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ మరోసారి మానవత్వం చాటుకున్నారు.కరోనా కష్టకాలంలో తన ఊరి ప్రజలతో పాటు నిరాశ్రయురాలైన ఓ వృద్ధురాలికి ఆధారం కల్పించారు. ఆమె ను అన్ని విధాలా ఆదుకుని మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. డ్రెస్హైదరాబాద్ ఖైరతాబాద్ నాల పక్కనే చిన్న ఇంట్లో నివాసం ఉండే వృద్ధురాలు యాదమ్మ ఇళ్లు భారివర్షాలకు పూర్తిగా కూలి పోయింది. గోడ,రేకులు బాగా దెబ్బ తిన్నాయి. పోలీస్ కానిస్టేబుళ్ల ద్వారా సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ రాజు నాయక్ వెంటనే.. [ 93 more words ]
https://neralughoralu.com/shabhash-raju-nayak/

…హైదరాబాద్: పరోపకారం, తోటి మానవులకు సాయం చేయడంలో ముందుండే సైఫాబాద్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజ....

హైదరాబాద్:  నగర శివారు రాజేంద్రనగర్ ప్రాంతంలో చిరుతపులి ఆనవాళ్ళు కనిపించడంతో అధికారులు మరోసారి అప్రమత్తమయ్యారు.  ఆగస్టు ...
27/08/2020

హైదరాబాద్: నగర శివారు రాజేంద్రనగర్ ప్రాంతంలో చిరుతపులి ఆనవాళ్ళు కనిపించడంతో అధికారులు మరోసారి అప్రమత్తమయ్యారు. ఆగస్టు 26 నుంచే చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఆనవాళ్లు గుర్తించి 24 గంటలు గడిచినా ఇప్పటివరకూ చిరుత ఆచూకీ లభించలేదు. దానికోసం గాలిస్తున్న అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాజేంద్ర నగర్లో వాలంతరి రిసెర్చ్ ఫామ్ హౌస్ లేగదూడ పై దాడి చేసి తింటున్న సమయంలో ఆవుల యజమాని శబ్దం చేయడంతో చిరుతపులి పారిపోయింది. అప్పటి నుంచి గాలింపు ప్రక్రియ కొనసాగుతోంది.ఫారెస్ట్ అధికారులు చిరుతపులి జాడ కొనుక్కోడానికి 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. [ 37 more words ]
https://neralughoralu.com/chiruta-ekkada/

హైదరాబాద్: నగర శివారు రాజేంద్రనగర్ ప్రాంతంలో చిరుతపులి ఆనవాళ్ళు కనిపించడంతో అధికారులు మరోసారి అప్రమత్తమయ్యా....

హైదరాబాద్:  నగరంలోని గాంధీ ఆస్పత్రిలో  మరో కలకలం రేగింది.కరోనా పాజిటివ్ తో  చికిత్స పొందుతున్న నలుగురు ఖైదీలు ఆస్పత్రి న...
27/08/2020

హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రిలో మరో కలకలం రేగింది.కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతున్న నలుగురు ఖైదీలు ఆస్పత్రి నుంచి పరారయ్యారు. వైరస్ సోకడంతో కొన్ని రోజుల క్రితం చర్లపల్లి జైలు శాఖ అధికారులు వారిని ఆస్పత్రిలో చేర్పించారు. గాంధీ ఆస్పత్రి లోని మెయిన్ బిల్డింగ్ రెండో అంతస్తులో చికిత్స పొందుతూ ఆ నలుగురు ఆగస్టు 27 తెల్లవారుజామున పారిపోయారు. రెండో అంతస్తులో ని బాత్రూం లో ఉన్న గ్రిల్స్ తొలగించి వారు పరారైనట్లు అత్యధిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు తప్పించుకున్న ఖైదీల కోసం గాలిస్తున్నారు.
https://neralughoralu.com/khideelu-paraar/

హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రిలో మరో కలకలం రేగింది.కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతున్న నలుగురు ఖైదీలు ఆస్...

!హైదరాబాద్:  విధులు నిర్వహిస్తూ ఓ పోలీసు కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించాడు.  బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో  పి సి నెంబ...
27/08/2020

!హైదరాబాద్: విధులు నిర్వహిస్తూ ఓ పోలీసు కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించాడు. బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో పి సి నెంబర్ 3564 గా పని చేస్తున్న అంపోలు క్రాంతికుమార్{27) పోలీస్ కానిస్టేబుల్ గా 2014లో ఎంపికయ్యాడు. విధుల నిర్వహణలో భాగంగా ఆగస్టు 26న రాత్రి 8 గంటలకు గాంధీ ఆస్పత్రి వద్ద డ్యూటీకి రిపోర్ట్ చేశాడు. విధులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా అతనికి గుండెపోటు రావడంతో వెంటనే చికిత్స నిమిత్తం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు క్రాంతి కుమార్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
https://neralughoralu.com/constable-died/

!హైదరాబాద్: విధులు నిర్వహిస్తూ ఓ పోలీసు కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించాడు. బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో పి స....

అర్ధరాత్రి అరాచకం.. నిజామాబాద్: దేశంలో అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. శిక్షలంటే భయం లేదు.. చట్టాలంటే లెక్కలేదు. మృగాలు ర...
26/08/2020

అర్ధరాత్రి అరాచకం.. నిజామాబాద్: దేశంలో అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. శిక్షలంటే భయం లేదు.. చట్టాలంటే లెక్కలేదు. మృగాలు రెచ్చిపోతూనే ఉన్నారు. ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. నిత్యం ఏదో ఒక చోట ఈ ఘోరాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా…. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలోనే ఒంటరి మహిళపై అత్యాచారం జరిగింది. 12 మంది యవకులు సామూహిక అత్యాచారం చేశారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ 2 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. [ 90 more words ]
https://neralughoralu.com/midnight-crime/

అర్ధరాత్రి అరాచకం.. నిజామాబాద్: దేశంలో అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. శిక్షలంటే భయం లేదు.. చట్టాలంటే లెక్కలేదు. .....

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువతిపై సామూహిక అత్యాచారం ఘటనపై నిరసనలు ప్రారంభమయ్యాయి.గత తొమ్మిదేళ్లుగా...
26/08/2020

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువతిపై సామూహిక అత్యాచారం ఘటనపై నిరసనలు ప్రారంభమయ్యాయి.గత తొమ్మిదేళ్లుగా.... ఓ యువతిని శారీరికంగా, మానసికంగా హింసించి సమాజం సిగ్గుపడేలా అత్యాచారం చేసిన దుండగులను అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. అమ్మాయికి రక్షణ కల్పించి,ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తెరవెనుక ఉన్న కీచకులందరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు నిరసనలు వ్యక్తం చేశారు. ఇదే ఘటనకు సంబంధించి పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే వివిధ సెక్షన్ల [ 75 more words ]
https://neralughoralu.com/gang-rape-case-panjagutta-to-ccs/

హైదరాబాద్:  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువతిపై సామూహిక అత్యాచారం ఘటనపై నిరసనలు ప్రారంభమయ్యాయి.గత తొ...

K. దక్షిణ మూర్తి జగిత్యాల:  కోవిడ్-19  తో పోరాడుతూ జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ కె. దక్షిణామూర్తి మృతి చెందారు.  ఈనెల 31న...
26/08/2020

K. దక్షిణ మూర్తి జగిత్యాల: కోవిడ్-19 తో పోరాడుతూ జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ కె. దక్షిణామూర్తి మృతి చెందారు. ఈనెల 31న పదవీ విరమణ చేయనున్న ఆయన అకాల మరణానికి తోటి సిబ్బంది సహచరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. 5 రోజుల క్రితం పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 26 న ఉదయం మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కోవిడ్-19 తో పోరాడుతూ మృతి చెందిన పోలీసు సిబ్బంది లో అదనపు ఎస్పీ స్థాయి అధికారి చనిపోవడం తెలంగాణలో ఇదే ప్రథమం. [ 28 more words ]
https://neralughoralu.com/asp-died-due-to-corona/

K. దక్షిణ మూర్తి జగిత్యాల: కోవిడ్-19 తో పోరాడుతూ జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ కె. దక్షిణామూర్తి మృతి చెందారు. ఈనెల 31న ...

వివరాలు వెల్లడిస్తున్న ఏ ఎస్ పీ భద్రాచలం: మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మరోసారి గంజాయి కలకలం రేపింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదే...
25/08/2020

వివరాలు వెల్లడిస్తున్న ఏ ఎస్ పీ భద్రాచలం: మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మరోసారి గంజాయి కలకలం రేపింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రెండు వాహనాల్లో తరలిస్తున్న 636 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆగస్ట్ 25న ఉదయం 07:00 గంటలకు భద్రాచలం అంబేద్కర్ సెంటర్ వద్ద సిఐ వినోద్, ఎస్సై మహేష్ లు తమ సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించారు. [ 97 more words ]
https://neralughoralu.com/ganjai-illegal/

వివరాలు వెల్లడిస్తున్న ఏ ఎస్ పీ భద్రాచలం:  మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మరోసారి గంజాయి కలకలం రేపింది.  తెలంగాణ,  ....

హైదరాబాద్‌: తోటి వ్యాపారి వ్యాపారానికి సంబంధించిన కేసులు మాఫీ చేస్తానని… అరెస్టు అయిన వ్యాపారి సోదరుడిని విడుదల చేయిస్తా...
25/08/2020

హైదరాబాద్‌: తోటి వ్యాపారి వ్యాపారానికి సంబంధించిన కేసులు మాఫీ చేస్తానని… అరెస్టు అయిన వ్యాపారి సోదరుడిని విడుదల చేయిస్తానని లైసెన్సుడ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ వ్యాపారి వద్ద నుంచి రూ. 3.6కోట్లు కాజేశాడు. అంతే కాకుండా అధిక డబ్బులు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడటంతో బాధితుడు సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగింది. నిందితున్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పుణే నివాసి కపిల్‌ రాజేంద్ర కుమార్‌ బాహెతీ అలియాస్‌ కపిల్‌ తమిళనాడు, రాజస్థాన్‌, మహారాష్ట్రల్లో పేలుడు పదార్థాల తయారీ వ్యాపారం చేస్తుంటాడు. హైదరాబాద్‌కు చెందిన సోదరులు ఏ. [ 202 more words ]
https://neralughoralu.com/cheat-of-3-60-crores/

హైదరాబాద్‌: తోటి వ్యాపారి వ్యాపారానికి సంబంధించిన కేసులు మాఫీ చేస్తానని… అరెస్టు అయిన వ్యాపారి సోదరుడిని విడ.....

న్యూఢిల్లీ; కాశ్మీరులో సుమారు ఏడాదిన్నర కిందట జరిగిన పుల్వామా ఉగ్రవాద దాడులు గుర్తున్నాయా? సుమారు 40 మంది మృతికి కారణమైన...
25/08/2020

న్యూఢిల్లీ; కాశ్మీరులో సుమారు ఏడాదిన్నర కిందట జరిగిన పుల్వామా ఉగ్రవాద దాడులు గుర్తున్నాయా? సుమారు 40 మంది మృతికి కారణమైన ఈ దాడులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఏకంగా 5 వేల పేజీల ఛార్జిషీట్ ను సిద్ధం చేసింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైష్-ఎ-మహమ్మద్ సంస్థ అధినేత మసూద్ అజహర్, అతని సోదరుడు రవూఫ్ అస్గర్ ఈ దాడికి ప్రధాన సూత్రధారులని ఛార్జిషీట్లో పేర్కొన్నారు. జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో 2019 ఫిబ్రవరి 14న భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద పుల్వామా జిల్లా లేథిపురా వద్ద పేలుడు పదార్థాలు నింపిన కారుతో ఉగ్రవాదులు దాడి చేశారు. [ 236 more words ]
https://neralughoralu.com/5-pages-charge-sheet/

న్యూఢిల్లీ; కాశ్మీరులో సుమారు ఏడాదిన్నర కిందట జరిగిన పుల్వామా ఉగ్రవాద దాడులు గుర్తున్నాయా? సుమారు 40 మంది మృతిక....

ఆంధ్రప్రదేశ్: సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జాతీయ స్థాయి లో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ పది అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సంవ...
25/08/2020

ఆంధ్రప్రదేశ్: సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జాతీయ స్థాయి లో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ పది అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సంవత్సరం ఇప్పటికే 26 అవార్డులను దక్కించుకున్న ఏపీ పోలీస్ శాఖ తాజాగా వివిధ విభాగాల్లో మరో పది అవార్డులను కైవసం చేసుకుంది. టెక్నికల్ విభాగం లో 7 అవార్డులు, అనంతపురం జిల్లాకు 2, సీఐడీ 4S 4U విభాగానికి 1 అవార్డులను దక్కించుకుంది.ఏడాది వ్యవధిలో రికార్డ్ స్థాయిలో 36అవార్డులను దక్కించుకున్న ఏకైక ప్రభుత్వ విభాగం ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ.ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పోలీస్ శాఖ కు ఇస్తున్న ప్రాముఖ్యత తోనే సత్ఫలితాలు సాధిస్తున్నామన్న డీజీపీ. [ 540 more words ]
https://neralughoralu.com/ap-police/

ఆంధ్రప్రదేశ్: సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జాతీయ స్థాయి లో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ పది అవార్డులను సొంతం చేసుక....

బెంగళూరు : చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారి, సామాజాన్ని చక్కదిద్దాల్సిన జర్నలిస్టు తప్పుదారి పట్టారు. ఓ ముఠాతో చెయ్య...
25/08/2020

బెంగళూరు : చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారి, సామాజాన్ని చక్కదిద్దాల్సిన జర్నలిస్టు తప్పుదారి పట్టారు. ఓ ముఠాతో చెయ్యి కలిపి వ్యక్తి నుంచి ఏకంగా 26.5 లక్షలు కొట్టేశారు. పోలీసుల విచారణలో నిజాలు నిగ్గు తేలడంతో ఊచలు లెక్కిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగుళూర్‌లోని చిక్కపేటలో జరిగిన ఈ ఘటన వివరాలివి… ఆగస్టు 19న ఉదయం శివ కుమారస్వామి అనే వ్యక్తి 26.5 లక్షల నగదును తీసుకువస్తున్నట్లు అతడి స్నేహితుడి ద్వారా ఓ దొంగల ముఠాకు తెలిసింది. కుమారస్వామి చిక్కపేట మెట్రో స్టేషన్ సమీపానికి రాగానే ముగ్గురు అతడిని అడ్డగించి మొబైల్ ఫోన్‌ లాక్కొని కారులో అపహరించారు. [ 62 more words ]
https://neralughoralu.com/si-journalist-cheats/

బెంగళూరు : చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారి, సామాజాన్ని చక్కదిద్దాల్సిన జర్నలిస్టు తప్పుదారి పట్టారు. ఓ ము...

కరోనా సోకిన వ్యక్తులు కోలుకుని నెగెటివ్ వచ్చాక… మరోసారి వ్యాధి బారిన పడే అవకాశాలు తక్కువని ఇప్పటివరకు చాలా మంది భావిస్తూ...
25/08/2020

కరోనా సోకిన వ్యక్తులు కోలుకుని నెగెటివ్ వచ్చాక… మరోసారి వ్యాధి బారిన పడే అవకాశాలు తక్కువని ఇప్పటివరకు చాలా మంది భావిస్తూ వచ్చారు. కానీ అది తప్పని నిరూపించే కేసు హాంకాంగ్ లో వెలుగు చూసింది. యూరప్ నుంచి హాంకాంగ్ తిరిగి వస్తున్న 33 ఏళ్ల వ్యక్తికి రెండోసారి సార్స్ కోవ్ -2 సోకిందని విమానాశ్రయంలో జరిపిన స్క్రీనింగ్ లో తేలింది.అతడికి మొదటిసారి గత ఏప్రిల్ నెలలో పాజిటివ్ రాగా కోలుకున్నాడు. ఇప్పుడు మళ్లీ రెండోసారి వ్యాధి అతడిని తాకింది. దీన్ని బట్టి కొన్ని నెలల వ్యవధిలోనే ఇన్ఫెక్షన్ రెండోసారి రావచ్చని అర్థమవుతోంది. [ 61 more words ]
https://neralughoralu.com/first-person-in-world-corona-2nd-time/

కరోనా సోకిన వ్యక్తులు కోలుకుని నెగెటివ్ వచ్చాక… మరోసారి వ్యాధి బారిన పడే అవకాశాలు తక్కువని ఇప్పటివరకు చాలా మం....

తెలంగాణ పేరు అంత‌ర్జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నియాంశం హైద‌రాబాద్ : ప‌్ర‌భుత్వం ప్ర‌చారం చేస్తున్న‌ట్టు అంత‌ర్జాతీయ స్థాయిలో తె...
25/08/2020

తెలంగాణ పేరు అంత‌ర్జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నియాంశం హైద‌రాబాద్ : ప‌్ర‌భుత్వం ప్ర‌చారం చేస్తున్న‌ట్టు అంత‌ర్జాతీయ స్థాయిలో తెలంగాణ పేరు ఉందో లేదో తెలియ‌దు కానీ.. భారీ సొమ్ముతో అవినీతి నిరోద‌క‌శాఖకు ప‌ట్టుబ‌డ్డ కీస‌ర త‌హ‌సీల్దార్ ఎర్వ బాల‌రాజు నాగ‌రాజ్ పేరు మాత్రం ఇప్ప‌డు అంత‌ర్జాతీయ దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. ఒక‌ భూప‌ట్టా విష‌యంలో రూ. 2 కోట్ల‌కు డీల్ మాట్లాడుకుని రూ. 1.10 కోట్లు స్వీక‌రిస్తూ ఇటీవ‌లే త‌హ‌సీల్దార్ ప‌ట్టుబ‌డిన విష‌యం జాతీయ‌స్థాయిలో చ‌ర్చ‌నియాంశ‌మైంది. తెలంగాణ ఆవిర్భావం అనంత‌రమే కాదు ఉమ్మ‌డి రాష్ట్ర చ‌రిత్ర‌లోనే ఇది అతిపెద్ద అవినీతి అని, విధుల్లో భాగంగా చేయాల్సిన ప‌నికి రూ. [ 198 more words ]
https://neralughoralu.com/%e0%b0%97%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%ac%e0%b1%81%e0%b0%95%e0%b1%8d-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a1%e0%b1%81%e0%b0%95%e0%b1%81/

keesara tahsildar corruption

హైదరాబాద్‌: చైనీయులు ఆడిన ఆట… డ్రాగన్‌ గేమింగ్‌లో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న నలుగురు నిందితులను సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీస...
25/08/2020

హైదరాబాద్‌: చైనీయులు ఆడిన ఆట… డ్రాగన్‌ గేమింగ్‌లో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న నలుగురు నిందితులను సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీసులు సోమవారం (ఆగస్టు24న) కస్టడీలోకి తీసుకున్నారు. రెండో రోజు కూడా సీసీఎస్‌లో వారి విచారణ కొనసాగుతోంది. ఆన్‌లైన్‌లో సేకరించిన వందల కోట్ల రూపాయలను ఎలా మళ్లించారు… నిర్వాహకులు ఎంతమంది.. మన దేశంలో సహకరిస్తున్న వారితో పాటు బాధితులు ఎంతమంది ఉన్నారనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభమైంది. తొలుత రూ. 1100కోట్ల స్కామ్‌తో ప్రారంభమైన గేమింగ్‌ వ్యవహారం విచారణలో పోలీసులు తవ్విన కొద్దీ వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే రెండు అకౌంట్ల నుంచి చైనాకు రూ. [ 343 more words ]
https://neralughoralu.com/drogon-accused-in-custody/

హైదరాబాద్‌: చైనీయులు ఆడిన ఆట… డ్రాగన్‌ గేమింగ్‌లో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న నలుగురు నిందితులను సీసీఎస్‌ సైబర్.....

నల్గొండ:  మర్డర్ సినిమా విడుదలకు నల్గొండ ఎస్సీ ఎస్టీ  కోర్టు బ్రేక్ ఇవ్వడంతో  ఆర్జివి న్యాయవాదులు  హై కోర్టుకు వెళ్లే యో...
25/08/2020

నల్గొండ: మర్డర్ సినిమా విడుదలకు నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు బ్రేక్ ఇవ్వడంతో ఆర్జివి న్యాయవాదులు హై కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు.వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కోర్టు షాకిచ్చింది. వర్మ రూపొందిస్తున్న ‘మర్డర్’ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. నల్గొండలో జరిగిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా వర్మ ‘మర్డర్’ సినిమా రూపొందిస్తున్నట్లు ఆయన ట్విట్టర్‌ పోస్టులను, సినిమా టీజర్‌ను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రణయ్ భార్య అమృత, తండ్రి బాలస్వామి కోర్టును ఆశ్రయించారు. [ 60 more words ]
https://neralughoralu.com/murder-break/

నల్గొండ: మర్డర్ సినిమా విడుదలకు నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు బ్రేక్ ఇవ్వడంతో ఆర్జివి న్యాయవాదులు హై కోర్టుకు వెళ...

Ganjai seized భద్రాచలం: భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద అధికారులు మరోసారి భారీ ఎత్తున గంజాయి పట్టుకున్నారు. భద్రాచలం ...
06/08/2020

Ganjai seized భద్రాచలం: భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద అధికారులు మరోసారి భారీ ఎత్తున గంజాయి పట్టుకున్నారు. భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర ఐపిఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 6 ఉదయం 7 గంటల సమయంలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద భద్రాచలం టౌన్ ఎస్ఐ మహేష్ టౌన్ సిబ్బంది మరియు సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో నిషేధిత గంజాయి లోడుతో వెళ్తున్న రెండు వాహనాలపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ తనిఖీ చేయగా.... AP 29 TV 1856 అనే మహేంద్ర వెరిటో వాహనంలో ఉన్న రాథోడ్ ప్రేమ్ అనే వ్యక్తిని విచారించారు. [ 129 more words ]
https://neralughoralu.com/ganjai-seized/

Ganjai seized భద్రాచలం:  భద్రాచలం  ఫారెస్ట్ చెక్ పోస్ట్  వద్ద  అధికారులు మరోసారి భారీ ఎత్తున గంజాయి పట్టుకున్నారు.  భద్ర....

సికింద్రాబాద్: 8 ఏళ్ల క్రితం ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడి కి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చి...
06/08/2020

సికింద్రాబాద్: 8 ఏళ్ల క్రితం ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడి కి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. వాస్తు నిపుణుడిగా చలామణి అవుతూ.. సివిల్ కాంట్రాక్టర్ గా వ్యాపారం చేసుకునే గట్టు రాజేందర్ కు పదేళ్ల జైలు శిక్ష.. లక్ష రూపాయల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. న్యూ బోయినపల్లి కి చెందిన రాజేందర్ 2012లో మహిళ పై అత్యాచారానికి పాల్పడ్డాడు... అప్పట్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన బోయినపల్లీ పోలీసులు న్యాయస్థానం లో ఛార్జ్ షీటు దాఖలు చేశారు. [ 37 more words ]
https://neralughoralu.com/10-years-jail/

సికింద్రాబాద్: 8 ఏళ్ల క్రితం ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడి కి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర....

Covid-19 హైదరాబాద్‌: కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కింగ్‌కోఠి ఆస్పత్రి నుంచి అదృశ్యమైన ఘటన నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌ ...
06/08/2020

Covid-19 హైదరాబాద్‌: కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కింగ్‌కోఠి ఆస్పత్రి నుంచి అదృశ్యమైన ఘటన నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన వ్యక్తి (49)కి కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ నెల 1న కింగ్‌కోఠి ఆస్పత్రిలో చేరాడు. అతనికి టెస్టులు నిర్వహించగా ఈ నెల 4న పాజిటివ్‌ అని తేలింది. ఆ రోజు ఆస్పత్రి వద్ద భార్యను కల్సిన ఆ వ్యక్తి ఆమె వెళ్లి పోయిన తర్వాత లోపలికి వెళ్లకుండా అక్కడి నుంచి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో మరో రోగిని ప్రశ్నించంగా అతని భార్యను కలిసి వచ్చిన 5 నిముషాల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపాడు. ఆస్పత్రి నుంచి అదృశ్యమైన భర్త గురించి భార్య నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
https://neralughoralu.com/covid-patient-missing/

Covid-19 హైదరాబాద్‌: కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కింగ్‌కోఠి ఆస్పత్రి నుంచి అదృశ్యమైన ఘటన నారాయణగూడ పోలీస్‌స్ట...

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when NeraluGhoralu.com posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share