23/09/2023
మాజీ ఎంపీటీసీ మృతి పట్ల దిగ్భ్రాంతి
* కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన భాస్కర్ రావు
మిర్యాలగూడ మండలంలో బాదలాపురం గ్రామ మాజీ ఎంపీటీసీ ఆవిరెండ్ల మల్లయ్య (80) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం బాదలాపురంలోని మల్లయ్య నివాసానికి చేరుకున్నారు. ఆయన భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఎమ్ఎల్ఏ వెంట రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ధర్మపాల్ రెడ్డి, సర్పంచ్ పంతంగి శోభారాణి సైదులు, ఉప సర్పంచ్ నల్లమేకల వెంకులు, లింగంపల్లి రాము, గ్రామ శాఖ అధ్యక్షులు పంతంగి వెంకటేశ్వర్లు, చె లిమెండ్ల పద్మయ్య, అరుణ్ మాలి రామకిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.