Telugo

https://www.youtube.com/c/telugoమీకు, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు మరియు ప్రపంచంలోని చుట్టుపక్కల ఉన్న ప్రత...
14/08/2022

https://www.youtube.com/c/telugo
మీకు, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు మరియు ప్రపంచంలోని చుట్టుపక్కల ఉన్న ప్రతి భారతీయునికి 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

మేము తెలుగు వాళ్లమైనందుకు చాలా గర్వపడుతున్నాము. తెలుగు వాళ్లమైయ్యుండి, ఎన్నో విశిష్టమైన సంప్రదాయాలు, శైలి, ఆహారం, వారసత్వం మరియు మరెన్నిటి గురించో చాలా నేర్చుకున్నాము.

మనమందరం ఇక్కడ నివసించడానికి,
సంస్కృతి, జీవనశైలి, ఆహారం మరియు సంప్రదాయాలను అనుభవించడానికి ఈ అవకాశాన్ని పొందినందుకు,
మేము ఎంతో సంతోషిస్తున్నాము మరియు గర్విస్తున్నాము!

నేను మరియు నికిత తెలుగువాళ్ళమైనందుకు ఏ విధంగా గర్వపడుతున్నామో, మా స్నేహితులు కూడా మలయాళీలుగా అంతే గర్విస్తున్నారు.

తెలుగువాళ్ళమైనప్పటికీ, భారతదేశంలోని అన్ని ఇతర సంస్కృతులలో భాగం కావడమే మనల్ని మరింత బలంగా చేస్తుంది. అంతే కాకుండా, బహుళ సంస్కృతులతో విభిన్నమైనప్పటికీ ఐక్యంగా ఉన్న దేశంలో భాగమైనందుకు మేమందరమూ గర్విస్తున్నాము.

మా ప్రయాణాలలో గ్రహించిన ఒక విషయం ఏమిటంటే, మన దేశం - గొప్ప సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు, భాషలు మరియు ప్రజలతో ఎంత అందంగా ఉందో, భారతదేశం నిజంగా అపురూపమైనది!

ఒక ఉదాహరణ తెలియచెయ్యాలంటే, మేము ప్రయాణిస్తున్నప్పుడు వాష్‌రూమ్‌ల కోసం లేదా టీ కోసం ఆగినప్పుడు,మాలో ఒకరు మాత్రమే దిగినప్పుడు లేదా మేము ఒంటరిగా ఉన్నప్పుడు చాలా మంది ట్రక్ డ్రైవర్లు, బైకర్లు, రోడ్డుపై మా వైపు చూస్తూ ఉండటం మేము గమనించాము.ఇలాంటి సంఘటనలను ఎన్నోసార్లు ఎదుర్కొన్నాము. మేము అందరం కలసి ఉన్నప్పుడు మాత్రమే మేము సురక్షితంగా ఉన్న ధైర్యం వస్తుంది.

ఈ విధంగా మన దేశంలో అన్నీ రాష్ట్రాలు, మతాలు, నాగరికతలు... అందరూ కలిసి ఐక్యమాత్యంగా ఉన్నపుడే మనం భలంగా, ధైర్యంగా భారత దేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తాము. like one india💪

భారతీయులుగా మనం గర్విస్తున్నాం కానీ మానవత్వం ప్రపంచానికి అక్షరరూపం! మనం మానవులందరి పట్ల ప్రేమను చూపిస్తూ, మన సహ-జీవులకు మద్దతు ఇస్తూ, మన ప్రపంచములో జీవించడానికి మరింత మెరుగైన మరియు అందమైన ప్రదేశంగా మార్చగలుగుతాము... like an Indian to the World🤗

మతం, కులం, లింగం, భాషలు లేదా రాష్ట్రాల సరిహద్దులు మా జీవితాలలో ఎలాంటి ప్రభావాన్ని కలిగించలేదు. కాబట్టి మన ఐక్యతను గౌరవిస్తూ మరియు మద్దతు ఇస్తూ, మనమందరం కలిసి మన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి మరియు మీతో పాటు కలిసి ఈ వేడుకలో భాగమైనందుకు మేమందరము ఎంతో సంతోషంగా ఉన్నాము.

స్వాతంత్ర యోధులు, సమరయోధులు, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులు, మన పూర్వీకులు, పగలు, రాత్రి మనల్ని కాపాడుతున్న సైనికులు, ప్రధానిగారు, ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల మంత్రులు, అధికారులు, వివిధ రంగాల ప్రజలకు ఎంతో ధన్యవాదాలు. మనకు ఈ స్వేచ్ఛ మరియు సౌకర్యాన్ని అందించడానికి ఎంతో కష్టపడ్డారు ఇంకా త్యాగం చేస్తూనే ఉన్నారు.

మన ఏకత్వాన్ని గౌరవిస్తూ, మనమందరం కలిసి మన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలనే మా అందరి కోరిక.

మీరు మాతో ఏకీభవిస్తే, తప్పకుండ మీ Status లొ షేర్ చెయ్యండి...

మీ అందరి సపోర్ట్ మాతో తప్పకుండా ఉండాలి... మరొకసారి మా అందరి తరపునుంచి భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

మా సందేశంలో ఏదైనా పొరపాటు ఉంటే, దయచేసి మమ్మల్ని క్షమించండి.🙏😊

12/08/2022
12/08/2022

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Telugo posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share