మన ఊరి వార్తలు

  • Home
  • మన ఊరి వార్తలు

మన ఊరి వార్తలు Follow Us Now For all Regional, Political, Sports and Educational News..! ప్రాంతం ఏదైన - వార్త ఇక్కడే

*బిగ్ బ్రేకింగ్ న్యూస్* గుంటూరు జిల్లా...*నరసరావుపేట వైసిపి ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు*వైసిపి కు రాజీనామా చేసిన ఎంపీ...
23/01/2024

*బిగ్ బ్రేకింగ్ న్యూస్*

గుంటూరు జిల్లా...

*నరసరావుపేట వైసిపి ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు*

వైసిపి కు రాజీనామా చేసిన ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు.

ఎంపీ పదవికు కూడా రాజీనామా

పల్నాడు ప్రజలు నన్ను ఎంతో ఆదరించారు.

గత ఎన్నికలలో మంచి మెజారిటీ తో పార్లమెంట్ పంపించారు.

నా వంతుగా నేను పల్నాడు ప్రాంత అభివృద్ధి కు కృషి చేశా

కామెంట్ చేయండి!
21/01/2024

కామెంట్ చేయండి!

షర్మిల రాక తో ఏపీలో మళ్లీ కాంగ్రెస్ పూర్వ వైభవం సాద్యంమేన?
21/01/2024

షర్మిల రాక తో ఏపీలో మళ్లీ కాంగ్రెస్ పూర్వ వైభవం సాద్యంమేన?

🔴కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల..!కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ...
16/01/2024

🔴కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల..!

కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొననారు. అయితే, అంతకుముందు.. ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న గిడుగు రుద్రరాజు సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. అయితే, గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజు.. షర్మిల కాంగ్రెస్‌లో చేరిన సమయంలోనే పదవీ త్యాగానికి సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గిడుగు రుద్రరాజు ఏపీ అధ్యక్షుడిగా అందించిన సేవలను అభినందిస్తూ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

🔴చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీం సంచలన తీర్పు..చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. త...
16/01/2024

🔴చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీం సంచలన తీర్పు..
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. త్రిసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులైన అనిరుద్ బోస్, బేలా. ఏం త్రివేది మధ్య 17ఏపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వీరిరువురూ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విడివిడిగా తీర్పును వెల్లడించారు. గతంలో జరిగిన నేరాలకు 17ఏ వర్తించదని.. చట్టం వచ్చిన తర్వాతనే 17ఏ వర్తిస్తుందని జస్టిస్ బేలా. ఏం త్రివేది పేర్కొనగా.. చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు.

🔴స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై నేడే సుప్రీంలో తీర్పు.. ఏం జరుగుతుందో.?స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేస...
16/01/2024

🔴స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై నేడే సుప్రీంలో తీర్పు.. ఏం జరుగుతుందో.?

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు కొట్టేసిన ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. సెక్షన్‌ 17A చుట్టే సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు సాగాయి. ఈ తీర్పు తర్వాత ఏపీలో రాజకీయం మరింత వేడెక్కనుంది.
వివరాల్లోకి వెళ్తే.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్‌లో తుది విచారణ జరిగినా.. తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ చంద్రబాబు తరఫు లాయర్లు వాదిస్తూ వస్తున్న అంశం సెక్షన్ 17-ఏ. రాజకీయ కక్షతో ఉద్దేశపూర్వకంగా ఆధారాల్లేని కేసులు పెట్టకుండా నివారించే ఉద్దేశంతో వచ్చిన సెక్షన్ ఇది. అవినీతి నిరోధక చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం.. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబుపై కేసు పెట్టడం చెల్లదన్నది చంద్రబాబు తరఫు లాయర్ల వాదన.చట్టంలోకి ఈ సెక్షన్ రాకముందే అంటే.. 2018లో నేరం జరిగింది కనుక చంద్రబాబు అరెస్టు విషయంలో 17-ఏ వర్తించదు.. అనేది ప్రభుత్వం తరఫున సీఐడీ చేస్తున్న వాదన. 2021లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదుతోనే ఎఫ్‌ఐఆర్ దాఖలైందని, చంద్రబాబు పేరు కూడా లేని ఆ ఎఫ్‌ఐఆర్ ఆధారంగానే అరెస్ట్ జరిగిందని.. అందుకే ఈ సందర్భంలో సెక్షన్ 17-ఏ వర్తిస్తుందని బాబు తరఫు లాయర్లు వాదించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-Aకి సంబంధించిన ఈ తీర్పు.. న్యాయవ్యవస్థలో ఒక బెంచ్‌ మార్క్ కాబోతోంది. అందుకే.. చంద్రబాబుతో పాటు.. దేశంలోని మిగతా పొలిటికల్ సర్కిల్స్ అన్నీ ఈ తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి!

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలుWishing everyone a joyful and prosperous Sankranti!
15/01/2024

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

Wishing everyone a joyful and prosperous Sankranti!

ఈ పంటల పండుగలు అందరికీ సమృద్ధిగా ఆనందం మరియు శ్రేయస్సును అందించాలని కోరుకుంటూ.. తెలుగు ప్రజలందరికీ "మకర సంక్రాంతి" శుభాక...
15/01/2024

ఈ పంటల పండుగలు అందరికీ సమృద్ధిగా ఆనందం మరియు శ్రేయస్సును అందించాలని కోరుకుంటూ.. తెలుగు ప్రజలందరికీ "మకర సంక్రాంతి" శుభాకాంక్షలు.

తెలుగు ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగుదేశం! #సంక్రాంతిసంకల్పం
15/01/2024

తెలుగు ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగుదేశం!

#సంక్రాంతిసంకల్పం


తెలుగు ప్రజలందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలుఈ సంక్రాంతి రైతన్నలతో పాటుగా అన్ని వర్గాల ప్రజల ఇంట సిరులు, సంతోషం తీ...
15/01/2024

తెలుగు ప్రజలందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

ఈ సంక్రాంతి రైతన్నలతో పాటుగా అన్ని వర్గాల ప్రజల ఇంట సిరులు, సంతోషం తీసుకురావాలని కోరుకుంటూ, ఉత్తరాయణ ప్రారంభం సందర్భంగా ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఆ సూర్య భగవానుని ప్రార్థిస్తున్నాము.


తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ.. ఆనందాలు నింపే సంక్రాంతి మీ అందరి జీవితాల్లో సంతోషాలు నింపాలని కోరుకుంటూ...
15/01/2024

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ.. ఆనందాలు నింపే సంక్రాంతి మీ అందరి జీవితాల్లో సంతోషాలు నింపాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.




హైదరాబాద్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి తమ కుమారుడి వివాహానికి రావాలని చంద్రబాబును ఆహ్వానించిన వై...
13/01/2024

హైదరాబాద్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి తమ కుమారుడి వివాహానికి రావాలని చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్ షర్మిల!

🔴వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా.. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలశౌరి!
13/01/2024

🔴వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా.. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలశౌరి!

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్...
13/01/2024

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కి, నాదెండ్ల మనోహర్ సాదర స్వాగతం పలికిన బాబు,లోకేష్!

*హైదరాబాద్*  *చంద్రబాబు ను కలవనున్న షర్మిల* *వైఎస్ షర్మిల   ఇవ్వాళ ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజ...
13/01/2024

*హైదరాబాద్*

*చంద్రబాబు ను కలవనున్న షర్మిల*

*వైఎస్ షర్మిల ఇవ్వాళ ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆయన నివాసంలో కలుస్తారు*

.*కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అదించనున్నారు.*

రాష్ట్రంలోని పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన YSR Congress  Party అభ్యర్ధుల 3వ జాబితా.
11/01/2024

రాష్ట్రంలోని పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన YSR Congress Party అభ్యర్ధుల 3వ జాబితా.

తండ్రి అడుగుజాడల్లో నడవడం సంతోషంగా ఉంది: షర్మిలతండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో నడవడం సంతోషంగా ఉందని షర్మిల అన...
04/01/2024

తండ్రి అడుగుజాడల్లో నడవడం సంతోషంగా ఉంది: షర్మిల

తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో నడవడం సంతోషంగా ఉందని షర్మిల అన్నారు. ఆయన తన జీవితమంతా కాంగ్రెస్ కోసమే పనిచేశారని చెప్పారు. నేటి నుంచి వైఎస్సార్టీపీ కాంగ్రెస్లో భాగమని స్పష్టం చేశారు. దేశంలో అతిపెద్ద సెక్యూలర్ పార్టీ అని కాంగ్రెస్ అని చెప్పారు. మణిపూర్లో హింస తనకు మింగుడుపడలేదన్నారు. ఈ పరిస్థితులు పోవాలంటే దేశంలో సెక్యులర్ పార్టీ అధికారంలో రావాలని ఆమె ఆకాంక్షించారు.

ఇటీవలే కాలి తుంటి శస్త్ర చికిత్స చేయించుకున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ని పరామర్శించి.. వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలు...
04/01/2024

ఇటీవలే కాలి తుంటి శస్త్ర చికిత్స చేయించుకున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ని పరామర్శించి.. వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం YS Jagan Mohan Reddy .

టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన మంగళగిరి  టిడిపి కేంద్ర కార్యాలయంలో “జయహో బీసీ సదస్సు” నిర్వహించారు. బీసీలంటే బలహీనులు...
04/01/2024

టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో “జయహో బీసీ సదస్సు” నిర్వహించారు. బీసీలంటే బలహీనులు కాదు.. బలవంతులని బీసీ నేతలు నినందించారు. బీసీ ద్రోహి జగన్‌ని గద్దె దింపి, బీసీల పార్టీ తెలుగుదేశంని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. జయహో బీసీ ప్రచార రథాలను జెండా ఊపి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీసీలపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండవ లిస్ట్ !
02/01/2024

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండవ లిస్ట్ !

రేపటి నుంచి 'నిజం గెలవాలి' పేరుతో 3 రోజులపాటు నారా భువనేశ్వరి పర్యటన!వారానికి మూడు రోజులు చొప్పున పర్యటన ఖరారు!!3న విజయన...
02/01/2024

రేపటి నుంచి 'నిజం గెలవాలి' పేరుతో 3 రోజులపాటు నారా భువనేశ్వరి పర్యటన!

వారానికి మూడు రోజులు చొప్పున పర్యటన ఖరారు!!

3న విజయనగరంలో, 4న శ్రీకాకుళం, 5న విశాఖ జిల్లాలో
చంద్రబాబు అరెస్టుకు మనస్తాపంతో చనిపోయిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు.

31/12/2023

🔴ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం ఇవ్వడంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. మరోసారి తన హోదా, అధికారంకన్నా మానవత్వమే మిన్న అని నిరూపించారు సీఎం. ఈరోజు ముఖ్యమంత్రి తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్లే క్రమంలో కేబీఆర్ పార్క్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో ఓ అంబులెన్స్ అటుగా రావడం కనిపించింది. ఇది గమనించిన సీఎం అంబులెన్స్ కు దారివ్వాలని సూచించారు. దీంతో సీఎం కాన్వాయ్ అంబులెన్స్ కు దారిచ్చింది. అటుగా వెళుతున్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలోనూ తన కోసం ట్రాఫిక్ ను ఆపొద్దంటూ సీఎం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది.

29/12/2023

కుప్పంలో రెండో రోజు పర్యటించిన టీడీపి అధినేత నారా చంద్రబాబునాయుడు!

RGV కామెంట్స్!
29/12/2023

RGV కామెంట్స్!

‘త్యాగాల త్యాగరాజు’.. పవన్‌పై జగన్ ఓ రేంజ్‌ పంచ్‌లు!
29/12/2023

‘త్యాగాల త్యాగరాజు’.. పవన్‌పై జగన్ ఓ రేంజ్‌ పంచ్‌లు!

సీఎం జగన్ పర్యటన వివరాలు!
29/12/2023

సీఎం జగన్ పర్యటన వివరాలు!

Address


Alerts

Be the first to know and let us send you an email when మన ఊరి వార్తలు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share