Maa Thorrur News

  • Home
  • Maa Thorrur News

Maa Thorrur News maa Thorrur updates

31/05/2022
Please watch and share ...  moviehttps://youtu.be/u4C8ZyogKMU
24/05/2022

Please watch and share ... movie

https://youtu.be/u4C8ZyogKMU

Watch Movie First Song Launch | | | | FT is South India's YouTube Channel ...

https://youtu.be/62WHJxPp2Dcశరపంజరం సినిమా మోషన్ పోస్టర్ ఇప్పటి వరకు చూడని వాళ్ళు   please watch it...
16/05/2022

https://youtu.be/62WHJxPp2Dc
శరపంజరం సినిమా మోషన్ పోస్టర్ ఇప్పటి వరకు చూడని వాళ్ళు please watch it...

Tips Telugu & Dosthan Films Presents Latest Telugu Movie Motion Poster " Shara Panjaram". Staring Naveen Kumar Gattu, Laya, Jabardast Venky, Jabardast Rajamo...

16/05/2022

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో గత 50 రోజుల నుండి మన ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన 28 మండలాలకు సంబంధించిన 400 మంది విద్యార్థులకు పదో తరగతి (యస్.యస్.సి) పరీక్షలలో ఉతీర్ణత కొరకై పిల్లలలను సిద్దం చేస్తూ ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గారి మార్గదర్శకంలో 2006 నుండి ఉచిత శిక్షణ ఇస్తున్న వందేమాతరం ఫౌండేషన్ వారి కార్యక్రమంలో ముఖ్య అతిథి గా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఈ సందర్భంగా తల్లి దండ్రులకు పాద పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకున్నది

కొందరు పిల్లలు, వారి తల్లిదండ్రులు కంట నీరు పెట్టుకున్నారు.

అలాగే తమ తల్లి దండ్రులను, పెద్దలను అనాథ, వృద్ధాశ్రమాలకు పంపించబోమని, మంచిగా చూసుకుంటామని పిల్లల చేత ఆత్మ సాక్షిగా ప్రమాణం చేయించారు.

కాగా, పిల్లలను, వారి తల్లిదండ్రులను పుష్పాల అభిషేకం చేసి మంత్రి అభినందించారు

ఈ దృశ్యాలు అందరినీ కలచివేశాయి.

మన సంప్రదాయం, సంస్కృతిని ప్రతిబింబంచేలా చేసిన ఈ అరుదైన ఘటన అందరినీ ఆకర్షించాయి. కళ్ళను చెమ్మ గిల్లేలా చేశాయి.

*మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి కామెంట్స్*

 వందేమాత‌రం ఫౌండేష‌న్ చేస్తున్న సేవ‌ల‌ను ఎంత పొగిడినా త‌క్కువే. వారికి అభినందనలు!

 అత్యంత నిజాయితీతో సేవానిర‌తిని చాటుకుంటున్నందుకు ఫౌండేష‌న్ ను, ర‌వింద‌ర్ రావుగారిని అభినందిస్తున్నా

 త‌ల్లిదండ్రుల‌కు, ఉపాధ్యాయుల‌కు, ప్ర‌భుత్వానికి కూడా ఆద‌ర్శంగా... నిలిచే విధంగా...అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి విజ‌య‌వంతం చేస్తున్నారు.

 తాజా కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దువుతున్న బ‌డుగు బిడ్డ‌ల‌కు భ‌రోసా ఇస్తున్నారు.

 ఒక స్వ‌చ్ఛంద సంస్థ నుంచి శిక్ష‌ణ తీసుకుని 700 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి వెళ్ళ‌డం మామూలు విష‌యం కాదు

 14 మంది ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న‌ విద్యార్థులు ఐఐటీ లో చేర‌డం అసాధార‌ణం.

 క‌రోనా నుంచి కోలుకోలేని, ఆర్థికంగా, ఆరోగ్యంగా, విద్యా ప‌రంగా న‌ష్ట‌పోయిన విద్యార్థుల‌కు వందేమాత‌రం ఫౌండేష‌న్ బాస‌ట‌గా నిలిచింది.

 ఐఐటీ లో 30 మంది

 ఎన్ఐటి లో 78 మంది

 ఎంబీబీఎస్‌, బిఎంఎస్ లో 108 మంది

 ఎండీ లో 12 మంది

 ట్రిపుల్ ఐటీలో 695 మంది

 పాలిటెక్నిక్ లో 2250 మంది

 అగ్రిక‌ల్చ‌ర్‌, బిటెక్‌, ఎం టెక్‌, ఫార్మ‌సీ, పోలీసు, ఐటీ, వంటి రంగాల్లో స్థిర ప‌డ్డవాళ్ళెంద‌రో...

 ఇంకా ఇస్రో, డిఆర్ డిఓ వంటి శాస్త్ర‌, సాంకేతిక రంగాల్లోనూ ఇక్క‌డి పిల్ల‌లు ఉన్నారు.

 ఈ త‌ర‌హాలో రాష్ట్ర మంతా శిక్ష‌ణ ఇవ్వ‌గ‌లిగితే...అద్భుతాలు సృష్టించ‌వ‌చ్చు.

 మాన‌వ వ‌న‌రుల అభివృద్ధికి విద్యే ప్ర‌ధానం.

 విద్య ద్వారానే అన్ని రంగాల్లో రాణించ‌వ‌చ్చు.

 *నైపుణ్యంతో కూడుకున్న మాన‌వ స‌మాజ నిర్మాణం జ‌ర‌గాల్సింది త‌ర‌గ‌తి గ‌దిలోనే.*

 వందే మాతం ఫౌండేష‌న్ 18 ఏండ్లుగా ఈ ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది.

 అందులో అద్భుత ఫ‌లితాలు సాధించింది.

 మ‌న ఊరు మ‌న బ‌డి కార్య‌క్ర‌మం ద్వారా ఇలాంటి ఫ‌లితాలు సాధించాల‌న్న‌దే ప్ర‌భుత్వ ఆలోచ‌న‌.

 ప్ర‌భుత్వం, టీచ‌ర్లు, వందేమాత‌రం ఫౌండేష‌న్ లాంటి సంస్థ‌లు ఆలోచిస్తున్నాయి.

 ఈ మాత్రం ఆలోచ‌న పిల్ల‌ల తల్లిదండ్రులు చేస్తే స‌మాజానికి గొప్ప వ్య‌క్తుల‌ను ఇచ్చిన వాళ్ళ‌మ‌వుతాం.

 *అమ్మా నాన్న‌ల పెంప‌కం మీదే స‌మాజ నిర్మాణం అధార ప‌డి ఉంది.*

 టీచ‌ర్ మీదో, బ‌డి మీదో నింద‌లు వేసి చేతులు దులుపుకోవ‌ద్దు

 టీచ‌ర్ శ్ర‌ద్ధ చూపిస్తే, శిబిరాల అవ‌స‌రం ఉండ‌దు

పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచండి

 వీటన్నింటికీ ప‌రిష్కారాలు ఇవ్వాల‌న్న ఉద్దేశ్యంతోనే ప్ర‌భుత్వం...

 7 వేల 280 కోట్ల‌తో మ‌న ఊరు మ‌న బ‌డికి శ్రీ‌కారం చుట్టింది

 త‌ల్లిదండ్రుల‌కు, ఉపాధ్యాయుల‌కు, ఆద‌ర్శంగా... నిలిచే విధంగా... ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేద్దాం.

 వందేమాత‌రం ఫౌండేష‌న్ చేస్తున్న కృషి, ప‌ట్టుద‌లను చూసే, నితిన్ భ‌వ‌న నిర్మాణానికి నిధులు స‌మ‌కూర్చాను.

 నా న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా, నిలిపిన వందేమాత‌రం ఫౌండేష‌న్ ను, నిర్వాహకుడు వందేమాతరం రవీందర్ రావు గారిని అభినందిస్తున్నా.

 చ‌దువు, అభివృద్ధి విష‌యంలో నా అండ‌దండ‌లు ఎప్ప‌టికీ ఉంటాయ‌ని తెలియ చేస్తున్నా...

వందేమాతరం ఫౌండేషన్ సేవలు తెలంగాణ సహా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల లో విస్తరించాయి.

ఎల్లలు దాటి అంతర్జాతీయంగా మంచి పేరు సంపాదించారు.

పిల్లలు మంచి ఫలితాలు సాధించాలి

వారికి అభినందనలు! శుభాకాంక్షలు

వందేమాతరం రవీందర్ రావు మాట్లాడుతూ, సంస్థ ప్రస్థానాన్ని, మంత్రి దయాకర్ రావు గారి సహకారాన్ని, ప్రస్తుత కార్యక్రమ ప్రాధాన్యాన్ని వివరించారు. విద్య ఒక్కటే వికాసాన్ని కలిగిస్తుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పిల్లలు, వారి తల్లిదండ్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
---------------------

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Maa Thorrur News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share