Dalit Media

Dalit Media " Dalit means Oppressed " not Caste.
అణచివేత నా శత్రవు😠
I support Oppressed✊

చెలో కొల్లాపూర్ శిరీష (బర్రెలక్క )కు మద్దతుగా వేలదిగా తరలిరండి లక్ష మేజారిటితో గెలిపిద్ధాం... మన బర్రెలక్కను.మిత్రులారా....
24/11/2023

చెలో కొల్లాపూర్
శిరీష (బర్రెలక్క )కు మద్దతుగా వేలదిగా
తరలిరండి లక్ష మేజారిటితో గెలిపిద్ధాం... మన బర్రెలక్కను.
మిత్రులారా...
శిరీషకూ నిజంగాసపోర్ట్ చేసేవాళ్ళు అయితే ఫీల్డ్ లొ దిగాలి వుత్త వుత్త మద్దతు వొద్దు. కేవలం సోషల్ మీడియా లొ మద్దతు తెలిపాము అనీ చేతులు దులుుకుంటే
మీవల్ల పైసా ఉపయోగంలేదు.
గమనిక: అగ్రవర్ణాలు చేసేదాడులకాడ ఆత్మగౌరవం కోసం కొట్లాడుదాం పట్టింపులు వొద్దు..
ఇక్కడ జెర మాల మాదిగ లొల్లి పక్కన పెట్టండి మహమేధావుల్లారా...
Jai Bhim

22/11/2023
30/09/2023

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?
లేదా ఆ ప్రభుత్వం డబ్బున్న వాళ్ళకోసమే పని చేస్తుందా?
ఇంత అన్యాయాలు రోజుకు వంద జరుగుతుంటే పట్టని రాష్ట్ర సీఎం, why not 175 కోసం మాత్రం తెగ వెంపర్లాడుతున్నాడా..

అక్కడే ఉంది అసలు మ్యాజిక్కు... 😂😂ఆ పూజారి నీ గోత్రం అడిగి నీ వర్ణం తెలుసుకుని, నువ్వు శూద్రుడివి అని అర్థం అవగానే, నీకు ...
29/09/2023

అక్కడే ఉంది అసలు మ్యాజిక్కు... 😂😂
ఆ పూజారి నీ గోత్రం అడిగి నీ వర్ణం తెలుసుకుని, నువ్వు శూద్రుడివి అని అర్థం అవగానే, నీకు దగ్గరగా రావాలా వద్దా డిసైడ్ చేసుకుని #అగోత్రస్యాః అంటూ దేవుడికి మంత్రాలు చదువుతాడు అంటే "గోత్రం లేనివాడు వచ్చాడు స్వామీ" అనీ..

స్కూల్ లో కాలేజీ లో అలా కాదు.. 🤷🏻‍♂️🤷🏻‍♂️
నీ క్యాస్ట్ తెలుసుకుని నీ సామాజిక వెనుకబాటు తనాన్ని తీసివేయడం కోసం ప్రభుత్వం నుండి నీకు న్యాయంగా రావాల్సిన స్కూల్ కాలేజ్ సీటుతో పాటుగా అదనపు బెనిఫిట్స్ అనగా ఫీస్ రీ ఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ లాంటివి అందిస్తారు.!!
Know the difference 🤷🏻‍♂️🤷🏻‍♂️

- Ram Robert Rahimm

ప్రోటీన్స్ విటమిన్స్ వద్దు, మేము ఆకులు అలుమలు గడ్డి గాదం మాత్రమే తింటాం అనేవారు... పులిని సింహాన్ని చూసి నేర్చుకోవాలసిన ...
29/09/2023

ప్రోటీన్స్ విటమిన్స్ వద్దు, మేము ఆకులు అలుమలు గడ్డి గాదం మాత్రమే తింటాం అనేవారు...
పులిని సింహాన్ని చూసి నేర్చుకోవాలసిన అవసరం ఉందీ..
ఎందుకో అర్థం అయిందా.??? 😎

- Ram Robert Rahimm

14/09/2023
13/09/2023
13/09/2023
13/09/2023
13/09/2023

అంటరానితనం , అసమానత, సనాతన ధర్మం
#సనాతన

10/09/2023
10/09/2023

భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ గారి పాత్రని తక్కువ చేసి చూపే ప్రయత్నంలో చాలా మంది చేసే వాదన, 'ఆయనేం సొంతంగా రాయలేదు, ప్రపంచంలోని అనేక రాజ్యాంగాల నుంచి ముక్కలు ముక్కలు ఏరుకొచ్చి అతుకుల బొంతలా తయారు చేశారు. కాపీ కొట్టడం కూడా గొప్పేనా?' అని.

అవునా?
అంబేద్కర్ గారు కాపీ కొట్టి రాజ్యాంగాన్ని రచించారా?

ప్రపంచంలోని మొట్టమొదటి వ్రాతపూర్వక రాజ్యాంగం 4300 సంవత్సరాల క్రితమే సుమేరియన్ల సొంతం.

ఆ తర్వాత వచ్చిన అనేక రాజ్యాంగాల్లో ఎన్నో విషయాలు ఆ మొదటి రాజ్యాంగం లోని పాయింట్లతో కలుస్తాయి.

అనేక ఆధునిక రాజ్యాంగాల్లో కూడా, వాటి కన్నా ముందు ఉన్న రాజ్యాంగాలలోని పలు పాయింట్లను వాడుకున్నారు.
అంత మాత్రాన అవన్నీ కాపీ చేసిన రాజ్యాంగాలా?

ఒక పెళ్లి శుభలేఖ డిజైన్ చేయించాలంటేనే, ఆల్రెడీ ఉన్న డజన్ల కొద్దీ శుభలేఖల డిజైన్లు పరిశీలిస్తాం; అన్నింటిలో నుంచి మనకు నచ్చిన అంశాలు ఏరుకుని, కొంత మన క్రియేటివిటీ జోడించి మన డిజైన్ ఫైనల్ చేస్తాం.

అలాంటిది, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య గణతంత్ర దేశానికి రాజ్యాంగం రాయాలంటే, అప్పటికే అమల్లో ఉన్న పలు అభివృద్ధి చెందిన దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, ఈ దేశ స్థితిగతులకు సరిపడే అంశాలు స్వీకరించకూడదా?

అసలు మన రాజ్యాంగం గురించే పూర్తిగా అవగాహన లేని ఈ అధములు, 20 పైచిలుకు దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన బాబాసాహెబ్ ను అనేంత ఘనులా?

అసలు వీళ్ల జీవితమంతా ధారపోసినా, అంబేద్కర్ గారు చదివినన్ని, కాదు కాదు.. కనీసం ఆ మహానుభావుడు రాసినన్ని పుస్తకాలు చదవగలరా?
ఆయన చేసినన్ని డిగ్రీలు చేయగలరా?

Address


Alerts

Be the first to know and let us send you an email when Dalit Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share