19/01/2024
నేడు మన ప్రభుత్వంలో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా విజయవాడ సామాజిక చైతన్య వాడలా కనిపించింది. మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ విగ్రహం సామాజికన్యాయ మహాశిల్పం. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తొచ్చినట్టు ఇకపై స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ గుర్తొస్తుంది. ఈ విగ్రహం మన ప్రభుత్వం ఈ 56 నెలల్లో అనుసరించిన సామాజికన్యాయానికి నిలువెత్తు నిదర్శనం. వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణంలేని మహనీయుడి విగ్రహాన్ని నేడు విజయవాడలో ఆవిష్కరించాం