Ism Telugu

Ism Telugu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ism Telugu, Video Creator, .

15/06/2024

సీనియర్ సిటిజన్లకు TTD నుంచి మంచి శుభ వార్త.

వేంకటేశ్వరుని ఉచిత దర్శనం సీనియర్ సిటిజన్‌ల కోసం రెండు స్లాట్లు ఏర్పాటుచేయబడ్డాయి.

ఒకటి ఉదయం 10 గంటలకు,మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు. మీరు ఫోటో ID తో వయస్సు రుజువును సమర్పించాలి మరియు S1 కౌంటర్‌లో సమర్పించాలి.

వంతెన కింద గ్యాలరీ నుండి ఆలయం కుడి వైపు గోడకు రోడ్డు దాటుతుంది. ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు.మంచి సీటింగ్ ఏర్పాటు అందుబాటులో ఉంది.

మీరు లోపల కూర్చున్నప్పుడు - వేడి సాంబార్ అన్నం మరియు పెరుగు అన్నం మరియు వేడి పాలు అందించ బడతాయి.

ప్రతిదీ ఉచితం.
మీరు రూ20/- చెల్లించి రెండు లడ్డూలను పొందుతారు.

మరిన్ని లడ్డూల కోసం మీరు రూ. 25/- ప్రతి లడ్డూకి.టెంపుల్ ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుండి, కౌంటర్ కౌంటర్ వద్ద మిమ్మల్ని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు అందుబాటులో ఉంది.

దర్శనం సమయంలో అన్ని ఇతర క్యూలు నిలిపివేయబడతాయి, ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం సీనియర్ సిటిజన్ దర్శనం మాత్రమే అనుమతించ బడుతుంది.

భగవంతుని దర్శనం తర్వాత మీరు 30 నిమిషాల్లోపు దర్శనం నుండి బయటకు రావచ్చు.

హెల్ప్‌డెస్క్ తిరుమల 08772277777 ని సంప్రదించండి
సమాచార వివరాలు: TTD.
_______
అందుకున్నట్లుగా ఫార్వార్డ్ చేయబడింది కానీ ఇది చాలా ముఖ్యమైన సర్క్యులర్, కాబట్టి దయచేసి సీనియర్ సిటిజన్‌లకు మరియు అన్ని గ్రూపులకు పంపండి.🙏

15/06/2024

జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓటమికి కారణాలు మేధావులు కూలంకషంగా చేసిన విశ్లేషణ. సహేతుకంగా ఉన్నట్లు అనిపిస్తోంది. కక్షసాధింపు చర్యలవల్లనే అనే విశ్లేషణ బలంగా ఉన్నది.
అక్రమ కట్టడాల కూల్చివేత తప్పు కాదా అక్రమాలు చేసి కట్టడాలు కట్టటం వాళ్ళ హక్కు కాదా
చింతమనేని ని క్షమించలేక పోవటం. చింతమనేని ఎంత క్షోభ పడి ఉంటాడు.
మార్గదర్శి ఛీట్ ఫండ్స్ అక్రమ ఆస్తులు సంపాదిస్తే మీకెందుకు జగన్మోహన్ రెడ్డి గారూ.
4.చంద్రబాబు అక్రమ ఆస్తులు సంపాదించుకుంటే మీకు ఎందుకు ? అసలు ఆయనని అరెస్ట్ చేసి సుప్రీంకోర్టని కూడా సందిగ్ధంలో పడేయడం తప్పు. వాళ్ళు ఇప్పటి వరకూ దాని మీద ఒక నిర్ధారణ కి రాలేకపోయారు.
చంద్రబాబు అక్రమ సంపాదన విచారణ చేసే అధికారం మీకు ఎక్కడిది అంటే సుప్రీంకోర్టుకే లేదు కదా.
అమరావతి లో అక్రమాల మీద విచారణ చెయ్య వద్దని కోర్టులు ఎన్నిసార్లు తీర్పు ఇచ్చినా మీరు మళ్లీ మళ్లీ విచారణ చేయటం తప్పు.
ఎవడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుని పెళ్ళాల్ని మోసం చేస్తే మీకెందుకు ? పెళ్లాలకి లేని దురద మొగుళ్ళకి ఎందుకు ?
అమరావతి ప్రాజెక్టును world bank అప్పు ఇవ్వటానికి తిరస్కరించిన విషయం సుప్రీంకోర్టు కి తెలియదు అనుకుంటున్నారా ? తెలుసు కానీ అందులో భూములు కొనుగోలు చేసిన జడ్జీలు , బీజేపీ , టీడీపీ నాయకులు ఏమై పోవాలి ? కోర్టులు తమ జడ్జీల ఆస్తులు రక్షించలేక పోతే అవి ఉన్నది ఎందుకు ? అమరావతి sustainable project కాదు అని world Bank తిప్పి పంపింది అంటే అదే ఫైనల్ మాట కాదు. పొంగూరు నారాయణ కంటే , సుజనా చౌదరి కంటే వాళ్ళు మేధావులు అనుకుంటున్నారా ఈ world bank వాళ్ళు ? అక్కడ ఉన్నది చంద్రబాబు గారు. కాకి తో గుడ్డు పెట్టించి ఆమ్లెట్ వేసి కాకి తో నే తినిపించెయ్య గలరు.
లంచాలు ఇవ్వటం చేతకాని షాపూర్ జీ పలోన్ జీ , L&T లకి ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టర్లు గా ఉండే అర్హత ఎక్కడి ది ? లంచాలు ఇచ్చే వాళ్ళని శిక్షించాలని చట్టం చెబుతుంటే మీరు లంచాలు పుచ్చుకునే వాళ్ళని శిక్షించాలని చూడటం తప్పు.
పచ్చ మీడియా , పచ్చ జడ్జీలు పుష్కలంగా ఉన్న రాష్ట్రంలో మీరు జెంటిల్మెన్ రాజకీయాలు చెయ్యటం మీ తప్పు.
ప్రతి దానికీ దేవుడు ఉన్నాడు అంటారు మీరు. దేవుడు మీకేనా దొంగలకి కూడా దేవుడు ఉంటాడు. దొంగతనానికి పోయే వాడు ఎవరికీదొరక్కుండా ఉండాలి అని దేవుడి కి మొక్కుకుని దొంగ తనానికి , హత్య లకి , నేరాలు ఘోరాలు చెయ్యటానికి బయలు దేరతాడు.

03/06/2024

కూలికి కోట్ల విలువ చేసే వజ్రం దొరికింది

కర్నూలు జిల్లా ఆలూరు నివాసి అయిన రోజువారి కూలీకి
విలువైన వజ్రం లభ్యం...

తుగ్గలి మండలం జొన్నగిరిలో ఆలూరు కి చెందిన ఓ వ్యక్తికి వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తుండగా అత్యంత విలువైన వజ్రం లభ్యం...

దొరికిన వజ్రం కోట్ల రూపాయలలో ఉంటుంది విలువ చేస్తుంది అంటున్న వ్యాపారులు

వజ్రం కొనుగోలు కోసం పోటీపడుతున్న గుత్తి, పెరవలి కర్నూలు జిల్లా ఆలూరు నివాసి అయిన రోజువారి కూలి

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు అయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందగా.ఒక...
03/06/2024

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు అయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందగా.ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక విషమంగా ఉన్న మహిళను మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలించారు. వీకెండ్ కావడంతో సరదాగా బీచ్ కు వెళ్లినవారికి ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులలో తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. ఇక బీచ్ లో వారు సరదాగా సెల్ఫీ తీస్తుండగా కాలు జారిపడి సముద్రంలో గల్లంతు అయ్యారు.
అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న మత్స్యకారులు కాపాడడానికి ప్రయత్నామ్ చేసిన అప్పటికే ఇద్దరు యువతులు మృతి చెందారు. మృతిచెందిన ఇద్దరి యువతులు అక్కా చెల్లెలుగా గుర్తించారు అధికారులు. మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన నూక రత్నం, కనకదుర్గ గా వారిని గుర్తించారు. ఈ సంఘటనతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

03/06/2024

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలోని ఓ కుమ్మరి కొలిమిలో వ్యవసాయ పనిముట్లు తయారు చేసిన వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి. ఉన్నత స్థాయిలో వృత్తిలో ఉన్నా.. ప్రవృత్తిని మరచిపోలేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న నెటిజన్లు.

03/06/2024

గెలుపుకి ఒక రోజు ముందు
నారా లోకేశ్, నారా బ్రాహ్మణి, చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి.

03/06/2024

జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో నటుడు శరత్‌కుమార్ తన భార్య, ఎన్డీయే అభ్యర్థి రాధిక విజయం కోసం విరుదునగర్‌లోని శ్రీ పరాశక్తి మరియమ్మన్ ఆలయాన్ని సందర్శించారు.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Ism Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ism Telugu:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share