Mangalagiri Times

  • Home
  • Mangalagiri Times

Mangalagiri Times మంగళగిరి సమాచార స్రవంతి
Subscribe my youtube channel
https://youtube.com/c/MANGALAGIRITIMES

తెలుగు మాట్లాడకపోతే ఆంగ్ల దేశమౌతుంది!ఆంధ్రులు తెలుగు మాట్లాడకపోతే ఆంధ్రదేశం ఆంగ్లదేశం అవుతుందని ప్రముఖ సినీ గేయ రచయిత , ...
22/02/2024

తెలుగు మాట్లాడకపోతే
ఆంగ్ల దేశమౌతుంది!

ఆంధ్రులు తెలుగు మాట్లాడకపోతే ఆంధ్రదేశం ఆంగ్లదేశం అవుతుందని ప్రముఖ సినీ గేయ రచయిత , తెలుగు వేద కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు అభివర్ణించారు.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా మంగళ కైశికి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లోని శ్రీ వైష్ణవి ఫంక్షన్ హాలులో తెలుగు సంస్కృతికి అక్షర హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథి జొన్నవిత్తుల మాట్లాడుతూ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకొని రామకృష్ణ మిషన్, డాన్ బాస్కో పాఠశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులు ఒక్కొక్కరు పద్యాలను పఠించడం మంచి పరిణామమని పేర్కొన్నారు.

తెలుగుజాతి, తెలుగువారి ఆత్మగౌరం అన్న నినాదాన్ని అందుకున్న కారణం చేతనే నందమూరి తారకరామారావు ఆనాడు అంతటి ప్రజాదరణ పొందగలిగారని ఈ సందర్భంగా జొన్నవిత్తుల పేర్కొన్నారు.

భువనేశ్వరీ పీఠాధిపతి కమలానంద భారతీ స్వామి మాట్లాడుతూ జ్ఞానానికి ద్వారం మాతృభాష అని చెబుతూ జ్ఞానపీఠ్ ,నోబుల్ బహుమతులు వంటి అత్యున్నత పురస్కారాలు పొందిన ప్రతి ఒక్కరి విద్యార్జన మాతృభాషలోనే సాగిందని ఉదహరించారు.

అయితే మాతృభాషను నిర్లక్ష్యం చేస్తున్న పాలకులకు దేశానికి వారసులైన మీలాంటి విద్యార్థులే బుద్ధి చెప్పాలని ఈ వేదిక సాక్షిగా కమలానంద భారతీస్వామి పిలుపునిచ్చారు.

అవధాన సార్వభౌమ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షుడు నన్నపనేని నాగేశ్వరరావు , కవి పండితులు దీవి శ్రీనివాసాచార్యులు, వామరాజు సత్యమూర్తి, వలివేటి శివరామకృష్ణ, డాక్టర్ కానుకొల్లు బాలకృష్ణ తదితరులు మాట్లాడారు.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకొని సీతానగరంలోని రామకృష్ణ మిషన్, ఎర్రబాలెంలోని డాన్ బాస్కో పాఠశాలల విద్యార్థులకు పద్యపఠన పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంగళగిరి సాహితీ కళావేదిక ప్రతినిధులు గుత్తికొండ ధనుంజయరావు, రేకా కృష్ణార్జునబోధి, పొట్లాబత్తునిలక్ష్మణరావు, గోలి మధు, అల్లక తాతారావు, సందుపట్ల భూపతి, తెలుగు విశ్రాంత అధ్యాపకులు కే ఎస్ ఎస్ నాగేశ్వర శర్మ, రచయిత మాదిరాజు గోవర్ధనరావు పలువురు మాతృ భాషాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

*మా మంగళగిరి దుర్గారావుకు బెజవాడ పోలీసుల మన్ననలు*అది 1974వ సంవత్సరం... మంగళగిరిలోని చింతక్రింది కనకయ్య ఉన్నత పాఠశాలలో తొ...
01/02/2024

*మా మంగళగిరి దుర్గారావుకు బెజవాడ పోలీసుల మన్ననలు*

అది 1974వ సంవత్సరం... మంగళగిరిలోని చింతక్రింది కనకయ్య ఉన్నత పాఠశాలలో తొలి అడుగులు పడిన శుభవేళ. జారిపోతున్న చెడ్డీలను సరిచేసుకుంటూ... మొలతాడుతో ముడులు వేస్తూ చీముడు కారుతున్న ముక్కులను చొక్కాతో తుడుచుకుంటూ... అంతా కొత్త పిల్లలు. బిత్తర చూపులు. ఈ ముచ్చట్లు 50 సంవత్సరాల క్రితం నాటివి. ఓ పట్టానా గుర్తుకు రావటం లేదు... జ్ఞాపకాల దొంతరలను చీల్చుకుంటూ బెజవాడ బెంజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ లో చిక్కుకున్న సందర్భంలో మేము వెళుతున్న కారు ఆగిన ఆ క్షణంలో గతంలోకి వెళితే...

విజయవాడ గురునానక్ కాలనీలోని ఓ చక్కటి ఫంక్షన్ హాల్ లో మా స్కూల్ మేట్ చంద్రకవి వెంకట నాగ దుర్గారావు ఉద్యోగ విరమణ సన్మాన సభకు హాజరయ్యాం. ఇంతకీ ఈ దుర్గారావు ఎవరో కాదు... మాతో పాటు స్వస్థలం మంగళగిరిలోని ప్రముఖ విద్యాసంస్థ చింతక్రింది కనకయ్య ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు (1974 -1979) కలసి చదువుకున్నాం. అప్పట్లో పదో తరగతి గట్టెక్కడమే గగనం. దానికి తోడు ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రమే. దుర్గా మరుసటి ఏడాది పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ గా హైదరాబాదులో చేరాడు. ఆ తర్వాత పై చదువులకు కొందరు... పదో తరగతి వద్ద బ్రేకులు పడిన మరికొందరు... తొందరేముందిలే అంటూ సెప్టెంబర్ ను టచ్ చేసి కొందరు చదువులో జూనియర్లుగా... ఇలా సాగిపోయాయి మా జీవితాలు.

కాలక్రమంలో 2000 సంవత్సరానికి వచ్చేసాం. మరుసటి ఏడాది మంగళగిరి సీకే హైస్కూల్లో 1979 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటుకు నాంది పలికాం. అప్పటికింకా ఈ తరహా కార్యక్రమాలు మొదలు కాలేదు మా ఊళ్లో... అయినా మేమంతా జతకూడి నాటి గురువులను ఘనంగా సత్కరించి మంగళగిరిలో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి బీజం వేశామని సగర్వంగా చెప్పుకోగలం... ఆ తర్వాత నుంచి అనేక సందర్భాల్లో మా బ్యాచ్ పోరగాళ్లు కలుసుకోగలిగాం... ఆ జ్ఞాపకాల దొంతర్లను చీల్చుకుంటూ వర్తమానంలోకి వచ్చాం.

బెజవాడ గురునానక్ కాలనీలోని ఓ ఫంక్షన్ హాల్ లో జనవరి 31న మా దుర్గారావు ఉద్యోగ విరమణ సందర్భం తో పాటు తాను పనిచేస్తున్న పటమట పోలీస్ స్టేషన్ సిఐ కాశీ విశ్వనాధం, ఎస్సైలు షేక్ జాన్ బాషా, కెవిఎన్వి పవన్ కుమార్, సిహెచ్ విక్రమ్ ల బదిలీ సందర్భంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం లో పాలుపంచుకునే అవకాశం కలగడం మా అదృష్టంగా భావిస్తున్నాం... మా చిన్ననాటి మిత్రుడు పోలీస్ డిపార్ట్మెంట్లో 44 సంవత్సరాల మారథాన్ ఇన్నింగ్స్ ఆడి ఏఎస్ఐగా ఉద్యోగ విరమణ చేస్తున్న మా దుర్గారావు పోలీసు అధికారులతో వేదిక పంచుకోవడం మాకెంతో గర్వకారణంగా అనిపించింది.

విజయవాడ సెంట్రల్ ఏసిపి భాస్కర రావు గారు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర పోలీసు అధికారులు, పటమట పోలీస్ స్టేషన్ సిబ్బంది మా దుర్గారావు గురించి చెప్తున్న మాటల్లో మా హృదయాలను హత్తుకున్న ముచ్చట్లు... పోలీస్ డిపార్ట్మెంట్లో 44 సంవత్సరాలపాటు సర్వీస్ చేయడం అంటే ఆషామాషి కాదు. విధి నిర్వహణలో దుర్గారావు నిబద్దత, క్రమశిక్షణ, అంకితభావం గురించి పై అధికారులు చెబుతుంటే మాకు పట్టరాని సంతోషం కలిగింది. రాష్ట్రం అంతా విజయవాడ వైపు చూస్తుంది... విజయవాడ ఏమో పటమట వైపు చూస్తుంది అంటూ పోలీసు అధికారులు ప్రత్యేకంగా చెప్పడం... తన సర్వీసులో 11 సంవత్సరాలు ఈ ఠాణాతో అనుబంధం పెనవేసుకున్న మా దుర్గారావు మా మిత్రుల కార్యక్రమాల సందర్భంగా .. ఇంకా వీడు రాలేదేంటి రా అనుకుంటూ... ఫోన్ చేస్తే బాబాయ్ వచ్చేస్తున్నా స్టేషన్లో పనిముగించుకొని అంటూ ఎంతో హుషారుగా చెబుతూ క్షణాల్లో వాలిపోయేవాడు.
ఏంట్రా ఇంత లేట్ అంటే . మీకు తెలియందేముందిరా అంటూ సరదా కబుర్లు పంచుకునేవాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంత సుదీర్ఘకాలం పనిచేయడం, అది మంచి ట్రాక్ రికార్డు సాధించడం అలాగే తన కుటుంబాన్ని తీర్చిదిద్దిన వైనం ఈ విషయాలన్నీ మా దుర్గారావు ఉద్యోగ విరమణ సన్మాన సభలో ఒక్కో పోలీసు అధికారి మనవాడి గురించి చెప్తుంటే ఆ ప్లేస్లో మేమే ఉన్నామంతా గర్వకారణం అనిపించింది. ఇప్పుడిక విశ్రాంత జీవనంలో కుటుంబంతో పాటు ఆ కుటుంబంలో మేము భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషం వ్యక్తంచేస్తూ మా దుర్గా కు బెజవాడ దుర్గమ్మ కరుణాకటాక్షాలతోపాటు మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం.

కారెక్కాక గుర్తొచ్చింది! హై స్కూల్ వార్షికోత్సవంలో 'అనుభవించు రాజా పుట్టింది పెరిగింది ఎందుకు' అంటూ మా దుర్గారావు నాడు వేదికపై పాడిన పాట నిజమే కదూ.. మావాడు విశ్రాంత జీవితంలోనూరాజానే ..!

థాంక్యూ రా దుర్గా !

- *మీ చింత క్రింది కనకయ్య ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు (1974 -79), మంగళగిరి.*

యర్రబాలెం  #స్నేహ చారిటబుల్ ట్రస్టు  # వృద్ధులు, అనాథ పిల్లలకు ఆపన్న హస్తం... పూర్తి వివరాలను ఈ క్రింది లింక్ ద్వారా వీక...
11/01/2024

యర్రబాలెం #స్నేహ చారిటబుల్ ట్రస్టు # వృద్ధులు, అనాథ పిల్లలకు ఆపన్న హస్తం... పూర్తి వివరాలను ఈ క్రింది లింక్ ద్వారా వీక్షించండి..

# snehacharitabaltrust # contact no:8...

23/12/2023
*21, 22 తేదీల్లో మంగళగిరి-తాడేపల్లి బాలోత్సవం**వేదిక: డాన్ బాస్కో హైస్కూల్, యర్రబాలెం**విస్తృతస్థాయిలో నిర్వాహకుల  ఏర్పా...
13/12/2023

*21, 22 తేదీల్లో మంగళగిరి-తాడేపల్లి బాలోత్సవం*

*వేదిక: డాన్ బాస్కో హైస్కూల్, యర్రబాలెం*

*విస్తృతస్థాయిలో నిర్వాహకుల ఏర్పాట్లు*

*ఎకోపార్కులో వాకర్స్ ను కలిసిన బాలోత్సవం ప్రతినిధులు*

*సృజనాత్మక వేడుకలో సహకారం అందించాలని విన్నపం*

మంగళగిరి-తాడేపల్లి బాలోత్సవం రెండో పిల్లల పండుగను విజయవంతం చేసేందుకు నిర్వాహకులు విస్తృతస్థాయిలో చర్యలు చేపట్టారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోగల యర్రబాలెంలోని డాన్ బాస్కో ఉన్నత పాఠశాలలో ఈ నెల 21, 22 తేదీల్లో బాలోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం మంగళగిరి ఎకో పార్కులో ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులను నిర్వాహకులు కలిసి అసోసియేషన్ తరఫున సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరారు.

ఈ మేరకు బాలోత్సవం అధ్యక్షులు, నిర్మల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వీవీ ప్రసాద్, కోశాధికారి, తాడేపల్లికి చెందిన సీనియర్ జర్నలిస్టు గాదె సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు, సీకే జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ మంచా విజయమోహనరావు, కార్యదర్శి, వీజే జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ ప్రెగడ రాజశేఖర్ లు ఎకో పార్కుకు విచ్చేశారు.

ఈ సందర్భంగా వాకర్స్ రచ్చబండ వద్ద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు, కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పెద్దిరాజు, వాకర్స్ ప్రతినిధులకు బాలోత్సవం కార్యక్రమ వివరాలను వెల్లడించి అసోసియేషన్ సహకారం కోరారు.

డాన్ బాస్కో హైస్కూల్లో ఈ నెల 21, 22 తేదీల్లో సబ్ జూనియర్స్ 3, 4, 5 తరగతులు, జూనియర్స్ 6, 7 తరగతులు, సీనియర్స్ 8, 9, 10 తరగతుల విద్యార్థినీవిద్యార్థులకు కల్చరల్, అకడమిక్ ఈవెంట్లలో విభాగాల వారీగా జరుగుతాయని, విభిన్న రంగాల్లో విద్యార్థినీవిద్యార్థుల్లో దాగివున్నప్రతిభాపాఠవాలను వెలికితీసేందుకు ఓ పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు బాలోత్సవం నిర్వాహకులు తెలిపారు.

కల్చరల్ ఈవెంట్లలో జానపద నృత్యం, దేశభక్తి, అభ్యుదయ గీతాలు, లఘునాటికలు, శాస్త్రీయ నృత్యం, ఏకపాత్రాభినయం, ఫ్యాన్సీ డ్రెస్, విచిత్ర వేషధారణ, కోలాటం, రైమ్స్ పోటీలు విభాగాల వారీగా ఉంటాయి.

అకడమిక్ ఈవెంట్లలో చిత్ర లేఖనం, వ్యాసరచన (తెలుగు, ఇంగ్లీష్), కథారచన (తెలుగు), కవితా రచన, ఉపన్యాసం (తెలుగు, ఇంగ్లీష్), స్వచ్ఛ తెలుగు, పద్యభావం, స్పెల్ బి (ఇంగ్లీష్), మ్యాప్, క్విజ్, మట్టితో బొమ్మలు వంటి అంశాలు విభాగాల వారీగా నిర్వహిస్తారు.

బాలోత్సవం వివరాలు తెలుసుకున్న ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థినీవిద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, పోటీతత్వం, స్నేహభావం, సామాజిక స్పృహ ఇత్యాది కల్పించేందుకుగాను మంగళగిరి ప్రాంతంలో నిర్వహిస్తున్న బాలోత్సవానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.

మంగళగిరి-తాడేపల్లి బాలోత్సవం (రెండో పిల్లల పండుగ)కు గౌరవాధ్యక్షులుగా ఆంధ్ర నాటక కళాసమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, అధ్యక్షులుగా నిర్మల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వీవీ ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కేఎల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.శ్రీపతిరాయ్, కోశాధికారిగా సీనియర్ జర్నలిస్టు గాదె సుబ్బారెడ్డి వ్యవహరిస్తున్నారు. మంగళగిరి ప్రాంతంలో నిర్వహిస్తున్న సృజనాత్మక వేడుకలో అందరూ భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా బాలోత్సవం ప్రతినిధులు కోరారు.

మంగళగిరి CK హైస్కూల్ విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు పురుషోత్తం గారు కాలం చేశారు.. పూర్తి వివరాలను mangalagiri times యూ ట్య...
09/12/2023

మంగళగిరి CK హైస్కూల్ విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు పురుషోత్తం గారు కాలం చేశారు..
పూర్తి వివరాలను mangalagiri times యూ ట్యూబ్ చానెల్ లో
ఈ క్రింది లింక్ ద్వారా వీక్షించండి

పెదకోనేరు పునరుద్ధరణ పనులు చేపట్టి ఏడాది కాలం పూర్తి అయింది.. ఎందుకు ఇంకా పూర్తి కాలేదు.. పెద కోనేరుకు సంబంధించి  ప్రజా ...
07/12/2023

పెదకోనేరు పునరుద్ధరణ పనులు చేపట్టి ఏడాది కాలం పూర్తి అయింది.. ఎందుకు ఇంకా పూర్తి కాలేదు..
పెద కోనేరుకు సంబంధించి ప్రజా ప్రతినిధులు ఎం.హెచ్., ఆర్కే ఏమన్నారంటే... లింక్ ద్వారా వీక్షించండి..

...

03/12/2023

రేవంత్ ఇంటికి డీజీపీ

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్ వెళ్లారు.

రేవంత్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆయన వెంట పలువురు IPS ఆఫీసర్లు సైతం రేవంత్ ఇంటికి వెళ్లారు.

ఆయనకు కల్పించే భద్రతపై చర్చించినట్లు తెలుస్తోంది.

కాగా ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది

ధ్యానం, శాకాహార ప్రచారంలో *ఆకురాతి*కి  *సేవారత్న* అవార్డుగత రెండు దశాబ్దాలుగా ధ్యాన వ్యాప్తి, మహాకరుణ అహింసా సద్భావన శాక...
01/12/2023

ధ్యానం, శాకాహార ప్రచారంలో *ఆకురాతి*
కి *సేవారత్న* అవార్డు

గత రెండు దశాబ్దాలుగా ధ్యాన వ్యాప్తి, మహాకరుణ అహింసా సద్భావన శాకాహార ర్యాలీల నిర్వహణలో విశేషంగా చేస్తున్న కృషికి గుర్తింపుగా మంగళగిరికి చెందిన ధ్యానరత్న *ఆకురాతి శంకరరావు* కు హిమాలయ అమర గురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్టు వారు సేవారత్న అవార్డు అందచేశారు.

ఈమేరకు గురువారం సాయంత్రం విజయవాడ లో జరిగిన శ్రీ మహావతార్ బాబాజీ వారి జన్మదిన వేడుకల్లో శంకర రావుకు సేవారత్న పురస్కారంతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, క్రియా యోగ గురువు భమిడిపాటి శ్రీరామమూర్తి, బ్రహ్మర్షి జక్కా రాఘవరావు, కళ్ళం రామిరెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. తొలుత మహాకరుణ ర్యాలీ నిర్వహించారు.

మంగళగిరికి చెందిన ధ్యానరత్న ఆకురాతి శంకరరావు పత్రీజీ అడుగుజాడల్లో నడుస్తూ వేలాది మందికి ధ్యాన అవగాహన కల్పిస్తూ వున్నారు....
23/11/2023

మంగళగిరికి చెందిన ధ్యానరత్న ఆకురాతి శంకరరావు పత్రీజీ అడుగుజాడల్లో నడుస్తూ వేలాది మందికి ధ్యాన అవగాహన కల్పిస్తూ వున్నారు. ధ్యాన వ్యాప్తికి విశేషంగా కృషి చేస్తున్న ధ్యాన రత్న ఆకురాతి శంకరరావు ప్రస్థానం పై మంగళగిరి టైమ్స్ యూ ట్యూబ్ చానెల్ స్పెషల్ రిపోర్ట్..
ఆసక్తి గల వారు ఈ క్రింది లింక్ ద్వారా చూడ గలరు.

#ధ్యానం #ధ...

26/09/2023

మంగళగిరిలోని ఎకో పార్క్ ప్రారంభోత్సవానికి సిద్దమైంది.. పూర్తి వివరాల కోసం ఈ క్రింది లింక్ ద్వారా వీక్షించండి

https://youtu.be/VHtu7Pew6vk?si=U8uz3dAjaYMACkJX

23/09/2023

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్ల దేవస్థానం వార్షిక పవిత్రోత్సవాలు... సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు..
పూర్తి వివరాల కోసం ఈ క్రింది లింక్ ద్వారా వీక్షించండి

https://youtu.be/A-2ES7TtZ5I?si=rj667DoAHkYc6laK

22/09/2023

మంగళగిరి మెయిన్ బజార్లో 2.20 కోట్లతో గణనాథుని ధన లక్ష్మి అలంకారం
పూర్తి వీడియో ఈక్రింది లింక్ ద్వారా వీక్షించండి

https://youtu.be/XDyLJLc5oK8?si=Fjq722X52xpSqy4E

22/09/2023

మంగళగిరిలో 9వ రోజు టీడీపీ రిలే దీక్షల్లో వాణిజ్య, టీఎన్ టీయూసీ నేతలు

మంగళగిరి GR స్కూల్ వద్ద చవతి వుత్సవాలకు కొలువైన అపురూప వినాయక ప్రతిమ సన్నిధిన..
18/09/2023

మంగళగిరి GR స్కూల్ వద్ద చవతి వుత్సవాలకు కొలువైన అపురూప వినాయక ప్రతిమ సన్నిధిన..

నేడు ఉపాధ్యాయ దినోత్సవం.. మన మంగళగిరి CK ఉన్నత పాఠశాలలో అ 'పూర్వ మాస్టార్లు '.. ఒకసారి గుర్తు చేస్తూ... మన ఊరు - మన చానె...
05/09/2023

నేడు ఉపాధ్యాయ దినోత్సవం.. మన మంగళగిరి CK ఉన్నత పాఠశాలలో అ 'పూర్వ మాస్టార్లు '.. ఒకసారి గుర్తు చేస్తూ...
మన ఊరు - మన చానెల్ మంగళగిరి టైమ్స్ యూ ట్యూబ్ చానల్ లో ఈ క్రింది లింక్ ద్వారా వీక్షించండి..

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Mangalagiri Times posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share