16/02/2023
|| జగన్‌ది హోల్‌సేల్ దోపిడీ ||
‘రాష్ట్రంలో అవినీతి, దోపిడీ పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా విధ్వంసాలు, హత్యా రాజకీయాలు. ఏమిటీ రాష్ట్రం? ఎన్టీఆర్, నేను అవినీతిపై సింహస్వప్నంలా వ్యవహరించాం. తెదేపా హయాంలో ఎప్పుడైనా అవినీతి జరిగిందా? జగన్ హోల్‌సేల్ దోపిడీ చేస్తుంటే..
Follow us Political Sinnodu for more updates!
నమ్మకం కాదు.. అందరికీ పట్టిన దరిద్రం
పన్నుల రూపంలో బాదేస్తున్న ప్రభుత్వం
ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలి
పోలవరం అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి
‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో తెదేపా అధినేత చంద్రబాబు
తెదేపా హయాంలో పోలవరం ప్రాజెక్టును 72% పూర్తిచేస్తే.. జగన్ వచ్చాక ఆ ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారు. నిర్వాసితులకు అందాల్సిన వెయ్యి ఎకరాల తాలూకు పరిహారాన్ని బోగస్ పట్టాలతో వైకాపా నాయకులు కొట్టేశారు. ఈ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి. లేకపోతే తెదేపా అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ జరిపిస్తాం. జగన్ అవినీతికి కక్కుర్తి పడి పోలవరం కాంట్రాక్టరును, అధికారులను మార్చేసి ప్రాజెక్టును ఈ పరిస్థితికి తెచ్చారు.
నేనే మీ నమ్మకం అంటూ స్టిక్కర్లు అతికిస్తారట.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మీ ముఖాలకూ రంగులేస్తారు. వైకాపా ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజలను బాదేస్తోంది. సంక్షేమం పేరుతో రూ.10 ఇచ్చి.. ప్రజల నుంచి రూ.50 కాజేస్తున్నారు. వైకాపా పనైపోయింది.. ప్రజల ఆగ్రహాన్ని చూసిన జగన్ ఇక గెలిచే పరిస్థితి లేదు. జగన్ రుషికొండను తవ్వేస్తుంటే.. కిందిస్థాయి నాయకులు ఎక్కడికక్కడ కొండలు తవ్వేస్తున్నారు. తాతలు, తండ్రులు గడించిన ఆస్తుల పాస్‌పుస్తకాలపై జగన్ బొమ్మలు వేసుకోవడమేంటి? ఓటు అనే ఆయుధంతో జగన్‌కు ప్రజలు బుద్ధిచెప్పాలి.‘రాష్ట్రంలో అవినీతి, దోపిడీ పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా విధ్వంసాలు, హత్యా రాజకీయాలు. ఏమిటీ రాష్ట్రం? ఎన్టీఆర్, నేను అవినీతిపై సింహస్వప్నంలా వ్యవహరించాం. తెదేపా హయాంలో ఎప్పుడైనా అవినీతి జరిగిందా? జగన్ హోల్‌సేల్ దోపిడీ చేస్తుంటే.. కిందివాళ్లు రిటెయిల్‌గా దోపిడీ చేస్తున్నారు’ అని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలో ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో రోడ్‌షో, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. బుధవారం మధ్యాహ్నం మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీశ్రేణులు పెద్దఎత్తున స్వాగతం పలికాయి. భారీ వాహనశ్రేణితో వెంట సాగుతూ హారతులిస్తూ, పూలు జల్లుతూ, గజమాలలు వేస్తూ, బాణసంచా కాలుస్తూ స్వాగతించాయి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ, గోకవరం మండలాల్లో యాత్రలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. రాత్రి కాకినాడ జిల్లా జగ్గంపేట చేరుకుని అక్కడ బహిరంగసభలో ప్రసంగించారు. ‘పోలీసులను తెదేపా ప్రభుత్వం గౌరవంగా చూసుకుంది. జీతాలు, టీఏ, డీఏ, సరెండర్ లీవులకు అప్పట్లో కొదవే లేదు. ఇప్పుడు వారి పరిస్థితి చూస్తే జాలేస్తోంది. జీతాలు పెంచాలని అడిగే ఉద్యోగులు.. నెలకు జీతం ఇస్తే చాలనుకునే పరిస్థితి ఎదురైంది. ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా జగన్ రంగులు మారుస్తున్నారు’ అని విమర్శించారు. బాబాయిని జగన్ బాత్రూంలో చంపిస్తే.. ఇక్కడి ఎమ్మెల్సీ డ్రైవరును చంపి కార్లో ఇంటికి తీసుకెళ్లి అప్పగించారని చంద్రబాబు ఆరోపించారు.
రెండు కళ్లనూ పొడిచేశారు
‘మీ కష్టాలు, ఇబ్బందులు, సమస్యలకు ప్రధాన కారణం ఈ జగన్‌మోహన్ రెడ్డి. ఆయన్ని ఇంటికి పంపడమే మన ధ్యేయం కావాలి’ అని చంద్రబాబు అన్నారు. రాబోయే రోజుల్లో ఇంటికొకరు బయటకొచ్చి భవిష్యత్తు కోసం పోరాడాలన్నారు. తనకు అధికారం కొత్తేమీ కాదనీ.. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ప్రజల తరఫున ఉద్యమం చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రానికి రెండు కళ్లలాంటి అమరావతిని, పోలవరాన్ని పొడిచేశారని అన్నారు. ఈ ప్రభుత్వంపై 10వేలకుపైగా కోర్టుధిక్కరణ కేసులు ఉన్నాయన్నారు. గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగిందని.. సీఎం ఇంటి చుట్టుపక్కల వారికే భద్రత లేదన్నారు. పోలవరం నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబుకు వినతి అందించారు. చంద్రబాబు స్పందిస్తూ పోలవరంపై రీసర్వే చేస్తానని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిర్వాసితులకు భూసేకరణలో ఎకరాకు రూ.19 లక్షలు ఇస్తానని చెప్పిన జగన్ మాట నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. తెదేపా హయాంలో కట్టిన ఇళ్లను లబ్ధిదారులకు నేటికీ అప్పగించలేని దుస్థితి ఉందన్నారు. ముంపు గ్రామాల బాధితులకు కనీసం భోజనం కూడా పెట్టలేదని ఎద్దేవా చేశారు. తెదేపా అధికారంలోకి రాగానే.. పోలవరం ముంపు ప్రాంతాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించి అభివృద్ధి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన వెంట తెదేపా నాయకులు జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బండారు సత్యనారాయణమూర్తి, చిక్కాల రామచంద్రరావు, వంతల రాజేశ్వరి తదితరులు ఉన్నారు.
స్వల్ప అపశ్రుతులు
చంద్రబాబు కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ప్రారంభంలో ఓ వాహనం ఓవర్‌టేక్ చేసే క్రమంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనం ముందుభాగానికి తలిగింది. దీంతో బంపర్ దెబ్బతింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్‌షో ముందుకు సాగింది. చంద్రబాబు ప్రసంగం మధ్యలో దగ్గు రావడంతో కాసేపు ఇబ్బందిపడ్డారు. గోకవరం వద్ద చంద్రబాబు ప్రచారరథం టైరు పంక్చర్ కావడంతో చక్కదిద్ది, జగ్గంపేట సభకు దాన్ని సిద్ధం చేశారు.