Bapatla District News

  • Home
  • Bapatla District News

Bapatla District News వార్త సమాచారం

24/02/2024

బాపట్ల జిల్లాలో సిట్టింగ్ శాసనసభ్యులు అనగానిసత్యప్రసాద్ (రేపల్లె) ఏలూరి సాంబశివరావు (పర్చూరు) గొట్టిపాటి రవికుమార్( అద్దంకి) తో పాటు నరేంద్ర వర్మ (బాపట్ల)నక్కా ఆనందబాబు (వేమూరు) బి.ఎన్. విజయ్ కుమార్ (సంతనూతలపాడు) లకు టిడిపి టిక్కెట్లు దక్కాయి.

*బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ప్రెస్ నోట్,  తేది:07.12.2023**డిసెంబర్ 8న శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ మ...
07/12/2023

*బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ప్రెస్ నోట్, తేది:07.12.2023*

*డిసెంబర్ 8న శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి బాపట్ల జిల్లా పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించడానికి చర్యలు తీసుకున్న జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు*

*డిసెంబర్ 8న శుక్రవారం మధ్యాహ్నం 12 గం.ల నుండి ముఖ్యమంత్రి గారి పర్యటన ముగిసేంత వరకు అమలులో వుండనున్న ట్రాఫిక్ నిబంధనలు*

*ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం ట్రాఫిక్ మల్లింపు మార్గాల వివరాలను వెళ్లడించిన జిల్లా ఎస్పీ గారు*

👉 రేపల్లె , చెరుకుపల్లి వైపు నుండి బాపట్లకు వచ్చు వాహనాలను
యాజలి - గుడిపూడి మీదగా బాపట్ల - పొన్నూరు మార్గంలో దారి మళ్ళించడమైనది.

👉 బాపట్ల నుండి రేపల్లె, చెరుకుపల్లి వైపు వేళ్ళు వాహనాలను గుడిపూడి - యాజలి మీదుగా దారి మళ్ళించడమైనది.

👉 బాపట్ల లోని హీరో మోటార్ సైకిల్ షో రూమ్ జంక్షన్ నుండి బాపట్ల ఇంజినీరింగ్ కాలేజీ దగ్గరలో ఉన్న జంక్షన్ వరకు హైవే పై కి వాహనాలకు అనుమతి లేదు

👉 చీరాల వైపు నుండి సూర్యలంకు వచ్చు వాహనాలు బాపట్ల ఇంజినీరింగ్ కాలేజీ దగ్గరలో వున్న జంక్షన్ నుండి బాపట్ల టౌన్ లోకి వచ్చి గడియార స్థంభం సెంటర్ మీదుగా సూర్యలంకకు వెళ్ళవలయును.

👉 సూర్యలంక వైపు నుండి వచ్చు వాహనాలు హైవే పైకి అనుమతి లేదు వారు బాపట్ల టౌన్ లోని గడియార స్థంభం సెంటర్ నుండి చీరాల (లేదా) గుంటూరు వైపుకు వెళ్ళవలయునని ఎస్పీ గారు సూచించినారు

బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావం
06/12/2023

బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావం

28/11/2023

బాపట్ల జిల్లాలో ఇసుక మాఫియా ఎక్కువైంది.. మాజీ మంత్రి, వైసిపి నాయకులు గాదె వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు
గాదె యువసేన, బాపట్ల జిల్లా. Vijay Govathoti

*కర్లపాలెం ముకుంద టీ స్టాల్ సమీపంలో అనుమతులు లేకుండా నిల్వచేసిన భారీ ఇసుక డంప్ ను పరిశీలించిన  మైనింగ్ అధికారులు... స్థల...
09/11/2023

*కర్లపాలెం ముకుంద టీ స్టాల్ సమీపంలో అనుమతులు లేకుండా నిల్వచేసిన భారీ ఇసుక డంప్ ను పరిశీలించిన మైనింగ్ అధికారులు... స్థల యజమాని పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే సహించేది లేదని వ్యాఖ్యానించారు...*

09/11/2023

*చుండూరు పోలీస్ స్టేషన్ పై అవినీతి నిరోధక శాఖ దాడి ..*

28/10/2023

*బాపట్ల ప్రజలు కోన రఘుపతిని గెలిపించాలి*
- రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి

కోన రఘుపతి బాపట్ల నియోజక వర్గం అభివృద్ది కోసం గొప్పగా పనిచేశారని, అందరూ ఆయన్ను కలిసికట్టుగా గెలిపించుకోవాలని కోరారు.

YSR Congress Party - YSRCP

21/10/2023

బాపట్ల పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో పోలీస్ అమరవీరుల దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు.

21/10/2023

కోన ప్రభాకర్ రావు వర్ధంతి సందర్భంగా బాపట్ల జిల్లా బాపట్ల టౌన్ పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులర...
20/10/2023

కోన ప్రభాకర్ రావు వర్ధంతి సందర్భంగా బాపట్ల జిల్లా బాపట్ల టౌన్ పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి

ప్రతిపక్ష పార్టీల అణచివేతే లక్ష్యంగా వైసీపీ రాక్షస పాలనవేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్మా...
20/10/2023

ప్రతిపక్ష పార్టీల అణచివేతే లక్ష్యంగా వైసీపీ రాక్షస పాలన

వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్

మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసన గా బాపట్ల నియోజకవర్గ టిడిపి భాద్యులు వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో నిజం గెలవాలి - సైకిల్ యాత్ర శుక్రవారం పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెం గ్రామం నుండి చందోలు వరకు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి సైకిల్ యాత్ర చేశారు.
అనంతరం బాబుతో నేను కరపత్రాలు పంపిణీ చేశారు.
ముందుగా మంతెనవారి పాలెం యస్.సి కాలనీలో బి.ఆర్ అంద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సైకిల్ యాత్ర ప్రారంభించారు.

బిజెపి యువమోర్చా రాష్ట్ర ట్రెజరర్‌గా కృష్ణ చైతన్య భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర ట్రెజరర్‌గా బి.కృష్ణ చైతన్యను న...
20/10/2023

బిజెపి యువమోర్చా రాష్ట్ర ట్రెజరర్‌గా కృష్ణ చైతన్య
భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర ట్రెజరర్‌గా బి.కృష్ణ చైతన్యను నియమిస్తూ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట వంశీకృష్ణ గురువారం కృష్ణ చైతన్యకు నియామక పత్రాన్ని అందజేశారు. రాష్ట్రస్థాయిలో పదవి రావటంపై కృష్ణచైతన్యను పలువురు పార్టీలకతీతంగా అభినందించారు.కృష్ణచైతన్య అభిమానులు ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ పార్టీపై నిబద్ధత తనకు ఇచ్చిన కర్తవ్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ రాష్ట్రస్థాయిలో కృష్ణచైతన్యకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. రానున్న రోజుల్లో ఉన్నత పదవులు పొంది మరింతగా ముందుకెళ్లాలని పలువురు ఆశీర్వదించారు. నాపై నమ్మకం ఉంచి రాష్ట్రస్థాయిలో ట్రెజరరీ పదవి ఇచ్చిన పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట వంశీకృష్ణకు, పార్టీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్‌ నుకలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన పదవికి వన్నె తెస్తానని కృష్ణ చెతన్య తెలిపారు. కృష్ణ చైతన్యను మిట్ట వంశీకృష్ణ పార్టీ నేతలు పూలమాలలు దృశ్యాలతో పార్టీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు...

అమెరికాలోని సిలికానాంధ్ర యూనివర్సిటీ లో జరిగే అమెరికా తెలుగు సాహిత్య సదస్సులో  ప్రసంగించేందుకు ప్రముఖ కవి డాక్టర్ బీరం స...
20/10/2023

అమెరికాలోని సిలికానాంధ్ర యూనివర్సిటీ లో జరిగే అమెరికా తెలుగు సాహిత్య సదస్సులో ప్రసంగించేందుకు ప్రముఖ కవి డాక్టర్ బీరం సుందరరావు కు ఆహ్వానం అందింది.వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన తెలుగుకవులు , రచయితలు ప్రతినిధులు హాజరవుతున్నారు.

అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న స్మృతి పెరేడ్ రిహార్సల్ ను పరిశీలించిన జిల్లా ఎస...
20/10/2023

అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న స్మృతి పెరేడ్ రిహార్సల్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్.

బాపట్ల జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశాం : ఎస్పీ

జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా.,జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ , ...
20/10/2023

జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా.,జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ , జిల్లా అధికారులు

జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల ప్రత్యేక స్పందనలో అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్  పి రంజిత్ బ...
20/10/2023

జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల ప్రత్యేక స్పందనలో అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా


బాపట్ల జిల్లాకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తన కుటుంబంతో కలిసి  చీరాలలోని ఓడరేవు అతిథి గృహంలో ...
17/10/2023

బాపట్ల జిల్లాకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తన కుటుంబంతో కలిసి చీరాలలోని ఓడరేవు అతిథి గృహంలో బస చేశారు. రాజభవన్ కు మంగళవారం తిరిగి వెళుతున్న సందర్భంగా రాష్ట్ర గవర్నర్ కు శాలువలు కప్పి సత్కరిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాIAS, ఎస్పీ వకుల్ జిందల్IPS.

బాపట్ల టౌన్ వివేకానందకాలనీ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఆవరణలో 2వ రోజు జరిగిన " జగనన్న ఆరోగ్య- సురక్ష"  వైద్య ...
17/10/2023

బాపట్ల టౌన్ వివేకానందకాలనీ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఆవరణలో 2వ రోజు జరిగిన " జగనన్న ఆరోగ్య- సురక్ష" వైద్య శిబిరము కార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై జిల్లాస్థాయి అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా.
17/10/2023

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై జిల్లాస్థాయి అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా.

విద్యుత్ రంగాన్ని ఆదాని కంపెనీ  కట్టబెట్టేందుకుకేంద్ర ప్రభుత్వం  ఒప్పందం కుదుర్చుకున్నారని  సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ...
15/10/2023

విద్యుత్ రంగాన్ని ఆదాని కంపెనీ కట్టబెట్టేందుకుకేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నారని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పి. నాగాంజనేయులు, సిపిఐ (ఎంఎల్) రేపల్లె ఏరియా నాయకులు మర్రివాడ వెంకటరావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరుకుపల్లిలో సిపిఐ, సిపిఐ (ఎంఎల్) పార్టీల ఆద్వర్యంలో ఇంటింట కరపత్తాలను పంపిణీ చేస్తూ పెరిగిన విద్యుత్ ఛార్జీలపై అవగాహన కల్పించారు.


పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం శోచనీయమని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమరౌతూ అనురాధ విమర్శించారు.
15/10/2023

పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం శోచనీయమని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమరౌతూ అనురాధ విమర్శించారు.

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఎమ్మెల్యే గొట్టిపాటి ఆధ్వర్యంలో అద్దంకి నియోజక వర్గంలో ఎనిమిది రోజుల నుండి కొనసాగుతున్...
15/10/2023

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఎమ్మెల్యే గొట్టిపాటి ఆధ్వర్యంలో అద్దంకి నియోజక వర్గంలో ఎనిమిది రోజుల నుండి కొనసాగుతున్న సైకిల్ యాత్ర


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గారిని ఆదివారం చీరాల ఓడరేవు గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా...
15/10/2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గారిని ఆదివారం చీరాల ఓడరేవు గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా,జిల్లా ఎస్.పి వకుల్ జిందాల్ మర్యాద పూర్వకంగా కలిశారు.




రేపు మంత్రి రోజా బాపట్ల రాకకొండుభోట్ల పాలెంకు  మంత్రి రోజా  దసరా ఉత్సవాలను ప్రారంభించనునట్లుశాసన మండలి చీఫ్ విప్ డాక్టర్...
13/10/2023

రేపు మంత్రి రోజా బాపట్ల రాక

కొండుభోట్ల పాలెంకు మంత్రి రోజా
దసరా ఉత్సవాలను ప్రారంభించనునట్లు
శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.



తనను ఇష్టపడిన వారు తన వద్దకే నేరుగా రావాలంటూ  తనను ప్రేమించే అమ్మాయి కావాలంటూ  వేటపాలెం రామన్నపేటకు చెందిన దేవన నీలకంఠ అ...
13/10/2023

తనను ఇష్టపడిన వారు తన వద్దకే నేరుగా రావాలంటూ తనను ప్రేమించే అమ్మాయి కావాలంటూ వేటపాలెం రామన్నపేటకు చెందిన దేవన నీలకంఠ అయ్యప్ప కుమార్ సైకిల్ పై ప్రచారం చేపట్టాడు.చీరాలలో సైకిల్ పై అదే తరహా ఫ్లెక్సీతో శుక్రవారం ప్రత్యక్షమయ్యాడు


కర్లపాలెం మండలం లోని డ్వాక్రా గ్రూపుల్లోని అక్క చెల్లెమ్మలకు మహిళా ఆర్ధిక స్వావలంబన మరియు మహిళా సంఘాలకు ఆదాయ పెంపు పై అవ...
13/10/2023

కర్లపాలెం మండలం లోని డ్వాక్రా గ్రూపుల్లోని అక్క చెల్లెమ్మలకు మహిళా ఆర్ధిక స్వావలంబన మరియు మహిళా సంఘాలకు ఆదాయ పెంపు పై అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం డ్వాక్రా మహిళలకు బ్యాంకుల ద్వారా మంజూరైన 16 కోట్ల రుణానికి సంబంధించిన చెక్కులు అందజేసిన బాపట్లశాసనసభ్యులు కోన రఘుపతి


వేమూరు మండలం లోని ఏరియా హాస్పిటల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా
13/10/2023

వేమూరు మండలం లోని ఏరియా హాస్పిటల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా


వేమూరు మండలం లోని ఎంపీడీవో ఆఫీస్ నందు ఏర్పాటుచేసిన జగనన్నకి చెబుదాం కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున...
13/10/2023

వేమూరు మండలం లోని ఎంపీడీవో ఆఫీస్ నందు ఏర్పాటుచేసిన జగనన్నకి చెబుదాం కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా , సంయుక్త కలెక్టర్ చామకూరి శ్రీధర్

మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో 8 నెలల శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాకు చేరుకున్న రెండు నూతన జాగిలాలుట్రాకర్ విభాగంలో...
13/10/2023

మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో 8 నెలల శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాకు చేరుకున్న రెండు నూతన జాగిలాలు

ట్రాకర్ విభాగంలో మెడల్ సాధించిన బాపట్ల జిల్లా కు చెందిన పోలీస్ జాగిలం "షాడో "

మెడల్ సాదించినందుకు సంతోషం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్

జిల్లా పోలీస్ శాఖ డాగ్ స్క్వాడ్ బృందం మరింత బలోపేతం: ఎస్పీ

కేసుల ఛేదనలో, నేరస్థులను గుర్తించడంలో జాగిలాల పాత్ర కీలకం: ఎస్పీ

13/10/2023

*అమరావతి*

*ఏపీలో దసరా సెలవులు ఖరారు...*

అక్టోబరు 13 నుంచి ఏపీలో దసరా సెలవులు ఖరారు చేసిన ప్రభుత్వం...

అక్టోబరు 25 వరకు సెలవులు కొనసాగగా.. 26వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం...

ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ విద్యాశాఖ అధికారులు.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Bapatla District News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share