06/09/2022
సమంతకు ఏమైంది .
ఆమె కు సంబదించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. గత రెండు వారాలుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేరు. జూలై 21న ఆగస్ట్ 31 వరకూ ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. ఆరు రోజుల క్రితం ‘యశోద’ చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్ విడుదల చేశారు. అంతకు మించి సామ్ నుంచి ఎలాంటి పోస్ట్‌లు లేవు. దీంతో సమంతకు ఏమైందని ఆరాలు తీయడం మొదలుపెట్టారు నెటిజన్లు. తాజాగా సమంతకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. కొన్ని రోజులుగా సామ్ చర్మ సంబంధిత సమస్యతో బాధ పడుతోందని, అందుకే ఆమె బయటకు రావడం లేదని, ఫొటోలు కూడా షేర్ చేయడం లేదని చెప్పుకొంటున్నారు. దీనిపై సమంత మేనేజర్ స్పందించారు ఇటీవల ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ సమంతకు ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఇలాంటి వార్తలు క్రియేట్ చేస్తున్నారని, అలాంటి వారిపై లీగల్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ నెలాఖరు నుంచి ఆమె షూటింగ్‌లో పాల్గొంటారని చెప్పారు. తాజాగా సమంత నటించిన ‘యశోద’, ‘శాకుంతలం’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ సినిమా చేస్తున్నారు. హిందీలో ఓ వెబ్ సిరీస్‌తోపాటు హాలీవుడ్‌లో కూడా ఓ సినిమా చేయనున్నారు అని తెలిపారు .