Telugu News

Telugu News Get Politics, Sports, Cinema and All Latest Breaking News in Telugu at One Place.

01/03/2024

చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకునికి ఆరు కిలోల బంగారం విరాళంగా ఇచ్చిన ఎన్నారైలు

04/11/2023
పెళ్లైన నాలుగు నెలలకే ప్రభు, ఖుష్బూ.. ఇద్దరూ విడాకులు తీసుకోక తప్పలేదు. అయితే పెళ్లికి ముందే తనతో నాలుగున్నరేళ్లు సహజీవన...
12/04/2023

పెళ్లైన నాలుగు నెలలకే ప్రభు, ఖుష్బూ.. ఇద్దరూ విడాకులు తీసుకోక తప్పలేదు. అయితే పెళ్లికి ముందే తనతో నాలుగున్నరేళ్లు సహజీవనం చేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది నటి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రభుకు దూరమవడం ఖుష్బూను మానసికంగా కుంగదీసింది. ఈ వేదన నుంచి బయటపడ్డ అనంతరం ఖుష్బూ 2000 సంవత్సరంలో దర్శకనిర్మాత సుందర్‌ను పెళ్లాడింది. భర్త పేరును తన పేరు చివరన జోడించింది. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం.

రీసెంట్ గా వచ్చిన బలగం మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ బాగా తెలుసు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ గొప్ప సినిమాగా మారిప...
11/04/2023

రీసెంట్ గా వచ్చిన బలగం మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ బాగా తెలుసు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ గొప్ప సినిమాగా మారిపోయింది. ఏకంగా ఊర్లలో పరదాలు వేసుకుని చూసే స్థాయికి వెళ్లిపోయింది. ఎంత పెద్ద సినిమాకు కూడా ఇలాంటి గౌరవం దక్కలేదనే చెప్పుకోవాలి. కాగా ఇందులో అయిలయ్య పాత్రలో నటించాడు నటుడు జయరాం.

ఆయన గతంలో దాదాపు 40 సీరియల్స్ లో నటించారు. పైగా సినిమాల్లో పోలీస్ పాత్రలు అంటే అందరూ ఆయన్నే ఎక్కువగా అడిగేవారంట. అయితే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ఓ సినిమాలో నన్ను కుక్కకంటే దారుణంగా చూశారు.

ఓ సినిమా సమయంలో నేను ఓ చిన్న పాత్రలో నటించాను. అందులో నా ఎక్స్ ప్రెషన్ బాగుందని.. జయరాం మీద కెమెరా పెడుదామని కెమెరామెన్ చెప్పాడు. దానికి కో డైరెక్టర్ సీరియస్ అవుతూ.. అతని మీద ఎందుకు.. ఆ కుక్క మీద పెట్టు అంటూ దారుణంగా అవమానించాడు.

షూటింగ్ సమయంలో కుక్కకు ఉన్నంత విలువ కూడా నటులకు లేదు అంటూ ఎమోషనల్ కామెంట్లు చేశాడు జయరాం. బలగం సినిమాలో ముందుగా తన ఫ్రెండ్ చేయాల్సిందంట. కానీ ఆయన చేయనని చెప్పడంతో ఆ అవకాశం తనకు వచ్చిందని చెప్పుకొచ్చాడు జయరాం.

27/03/2023

కొనటం, అమ్మడమే చంద్రబాబు విజయ రహస్యం: పేర్ని నాని

రోడ్డు పక్కన నిలిపిన క్యాబ్‌ డోర్‌ను ఒక్కసారిగా తెరవడంతో అటుగా ద్విచక్ర వాహనంపై వచ్చినన ప్రభుత్వ టీచర్‌కు తీవ్ర గాయాలై మ...
13/02/2023

రోడ్డు పక్కన నిలిపిన క్యాబ్‌ డోర్‌ను ఒక్కసారిగా తెరవడంతో అటుగా ద్విచక్ర వాహనంపై వచ్చినన ప్రభుత్వ టీచర్‌కు తీవ్ర గాయాలై మృతి చెందగా, అతని కుమారుడు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా పాపన్నపేటకు చెందిన ప్రభుత్వ పాఠశాల టీచర్‌ పెంటయ్య(45) ఆదివారం కొంపల్లిలో చదువుతున్న కుమారుడు శ్రీతేజను తీసుకుని ప్రగతినగర్‌కు వచ్చాడు. ఆపై అక్కడ నుండి జేఎన్‌టీయు మీదుగా కొండాపూర్‌కు బయలుదేరారు.

ఈ క్రమంలో ప్రగతినగర్‌ కాకతీయ హిల్స్‌ సమీపంలో రోడ్డుపై నిలిపిన క్యాబ్‌ డ్రైవర్‌ అకస్మాత్తుగా డోర్‌ను తెరిచాడు. దీంతో బైకుపై నుంచి పెంటయ్య, శ్రీతేజలు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో వెనుక నుండి వచ్చిన టిప్పర్‌ పెంటయ్య మీదుగా వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పెంటయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

కాగా తీవ్రంగా గాయపడిన శ్రీతేజను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిర్లక్ష్యంగా క్యాబ్‌ డోరు తెరిచిన డ్రైవర్‌తో పాటు క్యాబ్‌ బుక్‌ చేసిన వ్యక్తిపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

31/10/2022

ప్రేమ మత్తులో మునిగిన యువకుడు.. అందులోంచి బయట పడలేకపోయాడు. ఆమె కోసం పరితపించిపోయి పిచ్చి ప్రేమను ప్రదర్శించాడు...

07/09/2022

#కాన్వాయ్ ను ఆపి ప్రజల దగ్గర నుండి వినతి పత్రాలు తీసుకున్న సి.ఎం జగన్

07/09/2022

#ఈరోజు వార్తాపత్రిక ముఖ్యాంశాలు

07/09/2022

#మోదీ @ఇక్రిశాట్ హైదరాబాద్

22/07/2021

కుండపోత వర్షానికి తడిసిన తెలుగు రాష్ట్రాలు.. మరో మూడు రోజులపాటు వానలు.. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..!

22/07/2021

తెలంగాణలో మరో 6 ఎయిర్‌పోర్టులు

నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం మూడు గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులకు, వరంగల్‌ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్‌లో మొత్తం మూడు బ్రౌన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులకు వచ్చిన ప్రతిపాదనలపై టెక్నో ఎకనామిక్‌ ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్‌ను ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఎఐ) పూర్తి చేసింది.

జ్వరంతో పాటు కోవిడ్‌కి చెందిన మరికొన్ని లక్షణాలతో బండ్ల గణేష్‌ తీవ్రంగా అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం జూ...
13/04/2021

జ్వరంతో పాటు కోవిడ్‌కి చెందిన మరికొన్ని లక్షణాలతో బండ్ల గణేష్‌ తీవ్రంగా అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్లుగా సమాచారం. అయితే అధికారికంగా మాత్రం బండ్ల గణేష్‌ ఫ్యామిలీ సభ్యులెవరూ ఈ విషయాన్ని ధృవీకరించలేదు. బండ్ల గణేష్ దేవుడుగా కొలిచే.. ఆయన దేవుడు పవన్‌ కల్యాణ్‌ కూడా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న విషయం తెలిసిందే.

13/04/2021

Coronavirus Symptoms: ఈ లక్షణాలుంటే కరోనావైరస్ బారిన పడినట్లే.. ఆ లక్షణాలు ఏంటంటే..?

కరోనా వ్యాపించిన వారిలో రోగులలో బాగా అలసట, గుండె వ్యాధులు లాంటివి కూడా ఉత్పన్నమవుతాయి. రోజువారీ పనులు చేసిన తర్వాత కూడా మీకు అలసట అనిపిస్తే కరోనా పరీక్షలు చేయించుకోవాలి.

గందరగోళం, కుదుటుగా లేకపోవడం, మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నా కరోనా లక్షణం కావొచ్చు. ఈ పరిస్థితిని బ్రెయిన్ ఫాగ్ అంటారు. కాబట్టి మీరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంటే.. అది కరోనా సోకిన సంకేతం కావచ్చు.

కరోనా వైరస్ మీ జీర్ణవ్యవస్థపై కూడా దాడి చేస్తుంది. సోకిన వ్యా్క్తికి కడుపు నొప్పి, దగ్గు తీవ్రంగా వస్తుంది. కడుపులో తిప్పుతుంది. కావున ఈ లక్షణాలున్నా జాగ్రత్తగా ఉండాలి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.. కరోనా ప్రధాన లక్షణంగా పరిగణించాలి. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో భారమనిపించినా.. నొప్పి ఉన్నా.. అవి కరోనాకు సంకేతం కావచ్చు.

విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామీజీ ఈ ఏడాది పంచాంగం చెబుతూ ఉత్కంఠభరితమైన విషయాన్ని కూడా చెప్పారు. ఈ ఏడాది ...
13/04/2021

విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామీజీ ఈ ఏడాది పంచాంగం చెబుతూ ఉత్కంఠభరితమైన విషయాన్ని కూడా చెప్పారు. ఈ ఏడాది ఒక పెద్ద నాయకుడికి గండం ఉంటుందని ఆయన చెప్పడం విశేషం.

ఆ పెద్ద నాయకుడు ఎవరు, ఆయన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారా లేక దేశానికి సంబంధించిన జాతీయ నేత అన్నది మాత్రం స్వామీజీ చెప్పలేదు. కానీ ఆ అగ్ర నాయకుడికి జాతకరిత్యా ముప్పు పొంచి ఉందని చెప్పుకొచ్చారు

తమిళ నటుడు, నిర్మాత కుమారజన్‌(35) ఆత్మహత్య... నమక్కల్‌లోని తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్...
12/04/2021

తమిళ నటుడు, నిర్మాత కుమారజన్‌(35) ఆత్మహత్య... నమక్కల్‌లోని తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Tamil actor producer dies by su***de

Megastar Chiranjeevi along with his family watching Power Star Pawan Kalyan 's sensational blockbuster
10/04/2021

Megastar Chiranjeevi along with his family watching Power Star Pawan Kalyan 's sensational blockbuster

విద్యుత్‌ చార్జీలు, వడ్డీ రాయితీలు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మెగస్టార్‌ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు...
07/04/2021

విద్యుత్‌ చార్జీలు, వడ్డీ రాయితీలు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మెగస్టార్‌ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సినీ కళాకారులను ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ట్విట్టర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

06/04/2021

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share