Tirumala times

  • Home
  • Tirumala times

Tirumala times Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tirumala times, Media/News Company, .

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కార్తీక మాసం సందర్భంగా ఈరోజు నుండి స్వామి అమ్మవార్ల అంతరాలయం నందు లక్ష కుంకుమార్చ...
02/11/2024

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం
కార్తీక మాసం సందర్భంగా ఈరోజు నుండి స్వామి అమ్మవార్ల అంతరాలయం నందు లక్ష కుంకుమార్చన లక్ష బిల్వార్చన కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమం కార్తీకమాసం పూర్తిగా ప్రతిరోజు నిర్వహిస్తారు


31/10/2024

తిరుమ‌ల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం


,

19/10/2024

Heaven …🥰😍👌

Vc:


తిరుమలలో ప్రత్యేక  ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలిటీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్‌.వెంకయ్య చౌదరిREVIEW MEETING O...
18/10/2024

తిరుమలలో ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి

టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి

REVIEW MEETING ON TIRUMALA TRAFFIC MANAGEMENT HELD

తిరుమలలో పెరిగిపోతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు అత్యవసరంగా ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో గురువారం సాయంత్రం టీటీడీ సీవీఎస్వో శ్రీధర్, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడలతో కలిసి టీటీడీ, విజిలెన్స్, పోలీసులు, ఆర్టీఏ, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ఆయన తిరుమల ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమల ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఈఓ మాట్లాడుతూ తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. టీటీడీ, విజిలెన్స్, పోలీసులు, ఆర్టీఏ, టౌన్ ప్లానింగ్, ఏపీఎస్ ఆర్టీసీ, టీటీడీ ఇంజినీరింగ్, రెవెన్యూ, ట్రాన్స్ పోర్ట్ జీఎంలు కమిటీ గా ఏర్పడి వారం రోజుల లోపు సమస్యలను గుర్తించి పరిష్కారానికి సలహాలు, సూచనలు అందివ్వాలన్నారు.

సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలు

- తిరుమలలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే గోకులం, ఏటీసీ, రామ్ భగీచా వంటి ప్రాంతాలను గుర్తించాలి.

- వివిధ వర్గాల భక్తులు, ప్రైవేట్ వాహనాలు, ట్యాక్సీలకు సూచిక బోర్డులను, నిర్ధిష్టమైన పార్కింగ్ ను ఏర్పాటు చేయాలి.

- తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులకు టీటీడీ నుండి అదనపు సిబ్బందిని కేటాయించాలి.

- తిరుమలలో భవిష్యత్తులో చేపట్టే నిర్మాణాల్లో పార్కింగ్ సౌకర్యం తప్పనిసరి చేయడం, మల్టీ లెవెల్ పార్కింగ్ లను నిర్మించాలి.

- నిబంధనలను అతిక్రమించే ట్యాక్సీ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుని, అందరూ విధిగా నిబంధనలు పాటించేలా విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పించాలి.

- ఎప్పటికప్పుడు ట్రాఫిక్, పార్కింగ్ అప్డేట్స్ వచ్చేలా మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలి.

TIRUMALA, In view of the ever-increasing vehicular traffic along with environmental concerns in Tirumala there is an urgent need for a Tirumala Integrated Traffic Management System (TITMS) said TTD Additional EO Ch Venkaiah Chowdary.

Along with the CVSO Sridhar and SP Subbarayudu, he reviewed in length on the need for Traffic Management at Annamaiah Bhavan in Tirumala on Thursday evening.

The points of discussion included short-term and long-term plans for Traffic Management in Tirumala. The Additional EO said a co-ordination Committee with TTD Cops, Tirumala Police, RTA, Town planning, APSRTC, Engineering, Revenue, GM Transport as members should be formed immediately to asses the issues and submit the recommendations in a week.

Some excerpts from the meeting:

Identifying Traffic Congestion points in Tirumala viz. Gokulam, ATC, Rambhageecha and other areas

Earmarking specific routes and parking places for different categories of Darshan pilgrims

and also for Private Vehicles and Yellow Board Taxis.

Allotment of additional forces for Tirumala Traffic to avoid traffic congestion during odd hours

In all future constructions, parking facilities shall be made mandatory while approving building plans and also mulling Multi-level parkings

Stringent measures on taxi drivers for violating rules and Wide publicity shall be given through display boards, PA system, effective patroling and educating them on restricted access areas.

Exclusive mobile app for traffic and parking updates with digital

Kiosks with up-to-date traffic parking information shall also be planned.


వైభవంగా పౌర్ణమి గరుడసేవPOURNAMI GARUDA SEVA HELDతిరుమలలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటల...
17/10/2024

వైభవంగా పౌర్ణమి గరుడసేవ

POURNAMI GARUDA SEVA HELD

తిరుమలలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

TIRUMALA, The monthly Pournami Garuda Seva was observed with utmost religious fervour in Tirumala on Thursday evening.

Sri Malayappa Swamy in all His splendour blessed the devotees along the four mada streets on the mighty Garuda Vahanam.



17/10/2024

మబ్బుల తోట తిరుపతి నగరం ఇంత వగలుపోయేదీ.. ఈ కొండలు చూసుకునే! మబ్బులు కమ్మితే.. వాన కురిస్తే.. ఇక పట్టలేం. కపిలతీర్థం ఉరుకులు.. మాలాడగుండం పరుగులు.. కనుమ దారిలో జలధారలు.. పచ్చని లోయల్లోకి కాలి కవ్వించే మొయిళ్లు.. ఈ అందాలను ఫోటో,విడియో గ్రాఫర్స్
కెమెరాలో పట్టి అందిస్తున్నారు


16/10/2024

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం కొనసాగుతోంది. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.


అందుబాటులో 2025వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లుటీటీడీ అధ్వర్యంలో 2025వ సంవత్సరం12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, పెద్ద ...
14/10/2024

అందుబాటులో 2025వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు

టీటీడీ అధ్వర్యంలో 2025వ సంవత్సరం
12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, పెద్ద డైరీలు 8.25 లక్షలు, చిన్నడైరీలు 1.50 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 1.25 ల‌క్ష‌లు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు- శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 3 లక్షలు, 6 షిట్ క్యాలెండ‌ర్లు 50 వేలు, టీటీడీ స్థానిక ఆల‌యాలు 10 వేలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టీటీడీ ముద్రించింది.

కాగా 2025 టీటీడీ డైరీలు, క్యాలెండర్లు ఈనెల 5వ తేదీ నుండి తిరుమల, తిరుపతిలో అందుబాటులో వున్నాయి. ఈనెల రెండో వారం నుండి ఇతర ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉంటాయి.

All these calendars and diaries will be made available in all TTD book stalls located in Tirumala and Tirupati initially and later in the outside places for the sake of devotees soon.


తిరుమలలో కన్నుల పండుగగా ”భాగ్‌ సవారి”UNIQUE BAGH SAVARI FESTIVAL OBSERVED శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంల...
13/10/2024

తిరుమలలో కన్నుల పండుగగా ”భాగ్‌ సవారి”

UNIQUE BAGH SAVARI FESTIVAL OBSERVED

శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన ”భాగ్‌సవారి” ఉత్సవం ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్‌సవారి” ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రేవేశించి మాయమైపోతారు.

అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేనని విషయం గ్రహించి పశ్చాత్తాపపడుతాడు. వెంటనే అమ్మవారిని బంధీనుండి విముక్తురాలుని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. తన భక్తునియొక్క భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు.

ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ ”భాగ్‌సవారి” ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. స్వామివారు సాయంత్రం 4 గంటలకు వైభ‌వోత్స‌వ మండ‌పం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకొని తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది.

అంత‌కుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్‌సవారి ఉత్స‌వం సంద‌ర్భంగా నాళాయరా దివ్య ప్రబంధం నిర్వ‌హించారు.

TIRUMALA, Religious fervour marked the unique Bagh Savari festival observed at the Hill shrine of Tirumala on Sunday evening. This festival which would be observed on the immediate day after the conclusion of the nine-day Brahmotsavam has a great significance and an interesting legend to convey the message of the bonding between a devotee and the Universal Lord.

According to temple legend, Sri Venkateswara Swamy along with His Consort Padmavathi Devi in the guise of ordinary humans destroy the flower gardens grown up by Ananthalwar, an arden Sri Vaishnava devotee of Lord who introduced Pushpa Kainkaryams in the temple, only to testify his dedicated devotion.

In a bid to catch-hold of the “Divine Human Couple”, Ananthalwar succeeds in tying up Goddess to an Aswatha(sacred Fig) tree in his garden while the Lord escapes from his clutches running anti-clock wise.

Later, Ananthalwar realises his mistake and carries the Goddess in a floral basket to the Srivari temple and rejoins Her with the Lord.

As the Lord escapes in an anti-clockwise direction, even today this festival is conducted in an anti-clock wise manner.

In connection with the festival, the processional deities of Sri Malayappa Swamy and His two consorts, Sridevi and Bhudevi were taken around in a procession from the main temple to the Ananthalwar gardens situated on the South-West corner of the temple complex.

After observing certain religious formalities at the gardens, the deities were again taken back to the main temple.

The TTD officials, priests, Jeeyar Swamys and scores of devotees and locals took part in the festival.


ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలుBrahmotsavam concludes with Dhwajavarohanam         తిరుమల శ్రీవారి...
12/10/2024

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Brahmotsavam concludes with Dhwajavarohanam

తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.

రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. అనంతరం ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.

Tirumala, The nine-day long Srivari Salakatla Brahmotsavam at Tirumala concluded with the ceremonial flag lowering Dhwajavarohanam on Saturday night.

Earlier Bangaru Trichy Utsav was held at 7 pm. The Garda flag was lowered amidst chanting vedic hymns and thanking the deities of all the worlds who participated in the Navahnika Brahmotsavam of Srivaru and enhanced the grandeur.


శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌య‌వంతంసామాన్య భ‌క్తుల‌కు పెద్ద పీఠ‌సౌక‌ర్య‌వంతంగా శ్రీవారి మూల‌మూర్తి, వాహ‌న సేవ‌ల‌ ద‌ర్శ...
12/10/2024

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌య‌వంతం

సామాన్య భ‌క్తుల‌కు పెద్ద పీఠ‌

సౌక‌ర్య‌వంతంగా శ్రీవారి మూల‌మూర్తి, వాహ‌న సేవ‌ల‌ ద‌ర్శ‌నం

టీటీడి క‌ల్పిస్తున్న సౌక‌ర్యాల‌పై భ‌క్తుల సంతృప్తి

టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు

ENHANCED SERVICES TO DEVOTEES DURING ANNUAL FETE THIS YEAR

DEVOTEES POUR IN LAURELS ON TTD FOR ITS FLAWLESS SERVICES-TTD EO

SERVICE TO DEVOUT IS SERVICE TO DIVINITY - CM TO TTD DURING HIS TIRUMALA VISIT

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన‌ట్లు, సామాన్య భ‌క్తుల‌కు ఎలాటి ఆసౌక‌ర్యాం క‌లుగ‌కుండా టీటీడీలోని అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో సేవ‌లందించిట్లు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు చెప్పారు. టీటీడీ సిబ్బంది సంయ‌మనంతో, ప్ర‌ణాళిక బ‌ద్ధంగా, సీనియ‌ర్ అధికారుల ప‌ర్య వేక్ష‌ణ‌లో సేవ‌లందించార‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా టీటీడీ ఏర్పాటు చేసిన సౌక‌ర్య‌ల‌పై భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేశార‌న్నారు.

తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం ఈవో, అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌య్య చౌద‌రితో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ,

బ్ర‌హ్మోత్స‌వాల్లో అక్టోబ‌రు 4 నుండి 11వ తేదీ వ‌ర‌కు (8 రోజులు) న‌మోదైన వివ‌రాలు

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల ముఖ్యాంశాలు

- ముఖ్య‌మంత్రి వర్యులు శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు అక్టోబ‌రు 4వ తేదీన శ్రీవారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.

-అక్టోబ‌రు 5వ తేదీ పాంచ‌జ‌న్యం విశ్రాంతి భ‌వ‌నం వెనుక వైపున రూ. 13.45 కోట్ల‌తో నూత‌నంగా నిర్మించిన వ‌కుళమాతా వంట‌శాల‌ను ప్రారంభించారు.

శ్రీవారి ఆలయం :

- 6 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

- 15 ల‌క్ష‌ల మంది భ‌క్తులు శ్రీ‌వారి వాహ‌న సేవ‌లు విక్షించారు.

- గరుడసేవనాడు 82,043 మంది దర్శించుకున్నారు. కాగా, గరుడసేవ‌లో దాదాపు 3.5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు.

- 7 లక్షల లడ్డూలు బఫర్‌ స్టాక్‌.

- విక్రయించిన మొత్తం లడ్డూలు 30 లక్షలు.

- హుండీ కానుక‌లు రూ.26 కోట్లు.

- తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 2.60 లక్షలు.

- భ‌క్తుల‌కు 32,713 గ‌దుల కేటాయించాం.

- బ్రహ్మోత్సవాల్లో 475 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం.

- క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద వివిధ విభాగాల ద్వారా ఏర్పాటు చేసిన ఫ‌ల పుష్ప ప్ర‌ద‌ర్శ‌న నాడు -నేడు కాన్సెప్ట్‌తో ఫోటో ఎగ్జిబిష‌న్‌, అట‌వీ, శిల్ప క‌ళాశాల‌ల‌చే ఏర్పాటు చేసిన‌ ఎగ్జిబిష‌న్లు భ‌క్తుల ప్ర‌శంస‌లు అందుకున్నాయి.

- తిరుమ‌ల‌లో ప‌లు ప్రాంతాల్లో దేవతామూర్తుల విద్యుత్‌ కటౌట్ల‌తోపాటు, 32 పెద్ద డిజిట‌ల్ స్క్రీన్లు ఏర్పాటు. ఇందులో నాలుగు మాడ వీధుల‌లో 23, ప్ర‌ధాన కూడ‌ళ్ళ‌లో 9, ప్ర‌త్యేకంగా తిరుప‌తిలో 7 డిజిట‌ల్ స్క్రీన్లు ఏర్పాటు చేశాం.

అన్నప్రసాదం :

- బ్రహ్మోత్సవాల 8 రోజుల్లో 26 లక్షల భోజనాలు, అల్పాహారం అందించడమైనది.

- గరుడసేవనాడు 8.71 లక్షల మందికి అన్నప్రసాదాలు, అల్పాహారం, 3.47 లక్షల మందికి టి, కాఫి, పాలు, బాదం పాలు, 4 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 4 ల‌క్ష‌ల తాగునీరు బాటిళ్ళు, స్నాక్స్‌గా సుండ‌లు, బిస్కెట్లు అందించడం జరిగింది.

వైద్యం :

- 45 మంది డాక్టర్లు, 60 మంది పారామెడికల్‌ సిబ్బందిని, 13 అంబులెన్సులు వినియోగించడమైనది.

- 68 వేల మందికి పైగా భక్తులకు వైద్యసేవలు.

ఆరోగ్య విభాగం :

- తిరుమ‌ల‌లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం 1365 మంది సిబ్బంది, గ‌రుడ సేవ రోజు అద‌నంగా 600 మంది సిబ్బంది ఏర్పాటు.

టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టులు :

- హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 18 రాష్ట్రాల నుండి వ‌చ్చిన 261 కళాబృందాల్లో 6,884 మంది కళాకారులు క‌ళారూపాల‌ను ప్ర‌ద‌ర్శించారు. వాహ‌న సేవ‌ల‌తో పాటు తిరుమ‌ల‌, తిరుప‌తిలో ప్రదర్శించిన కళాకృతులు విశేషంగా అకట్టుకున్నాయి. భ‌క్తులు ఎంతో సంతోషించారు.

ఉద్యానవన విభాగం :

- శ్రీవారి ఆలయంతో పాటు ప‌లు కూడ‌ళ్ళు, అతిథి గృహాల వ‌ద్ద శోభాయమానంగా పుష్పాల అలంకరణలు, పుష్పప్రదర్శన.

- బ్ర‌హ్మోత్స‌వాల‌లో 40టన్నులు పుష్పాలు, 3.50 లక్షల కట్‌ ఫ్లవర్స్‌, 80 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగం.

ప్రజాసంబంధాల విభాగం :

- రాంభగీచా-2లో మీడియా సెంటర్, క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద నాడు - నేడు ఫొటో ఎగ్జిబిష‌న్‌ ఏర్పాటు.

- దాదాపు 7 రాష్ట్రాల నుండి విచ్చేసిన 4 వేల‌ మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు.

- గ‌తంలో ఉన్న 5 స‌మాచార కేంద్రాల‌తో పాటు తిరుమ‌ల‌లో మ‌రో 5 స‌మాచార కేంద్రాలు, తిరుప‌తిలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశాం.

- అదేవిధంగా భ‌క్తుల‌కు విరివిగా స‌మాచారం ఇచ్చేందుకు శ్రీ‌వారి సేవ‌కుల స‌హ‌కారంతో దాదాపు 11 ప్రాంతాల‌లో మే ఐ హెల్ప్ యు కౌంట‌ర్ల‌ను నిర్వ‌హించాం.

- టీటీడీ కాల్ సెంట‌ర్, క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్, స‌మాచార కేంద్రాలు, మీడియా, శ్రీ‌వారి సేవ‌కుల ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు భ‌క్తుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ వారికి మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించాం.

- తిరుమ‌ల‌లో భ‌క్తుల‌ను ఒక ప్రాంతం నుండి మ‌రోక ప్రాంతానికి ఉచితంగా ర‌వాణా చేసేందుకు 14 ధ‌ర్మ ర‌థాల‌ను ఏర్పాటు చేశాం.

ఎపిఎస్‌ఆర్‌టిసి :

- 9.53 ల‌క్ష‌ల మంది ఎపిఎస్‌ఆర్‌టిసి ద్వారా తిరుమ‌ల‌కు రాక పోక‌లు సాగించారు.

- గరుడసేవనాడు ఆర్‌టిసి బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు 2,764 ట్రిప్పుల్లో 97,402 మంది భక్తులను చేరవేశాయి. తిరుమల నుంచి తిరుపతికి 2,711 ట్రిప్పుల్లో 89,181 మంది భక్తులను చేరవేశాయి.

- బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌యవంతం చేయ‌డంలో పాలుపంచుకున్న అర్చ‌క స్వాములు, అధికారులు, సిబ్బంది, క‌ళాకారులు, శ్రీ‌వారి సేవ‌కులు, ఎన్‌సిసి విద్యార్థుల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను.

- అలాగే, బ్ర‌హ్మోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు అన్నివిధాలా స‌హ‌క‌రించిన జిల్లా యంత్రాంగం, పోలీసు, ఆర్‌టీసీ, ఇత‌ర ప్ర‌భుత్వ విభాగాల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను.

- బ్ర‌హ్మోత్స‌వాల వైభ‌వాన్ని భ‌క్తుల‌కు చేరువ చేసిన మీడియా మిత్రుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను.

TIRUMALA, Adhering to the words of the Honourable CM of AP N Chandra Babu Naidu who directed all the TTD officials that "Service to Devotees is Service to Divinity", we have enhanced the pilgrim services in every area during this year annual brahmotsavams when compared the previous years and won laurels from the pilgrims", expressed TTD EO J Syamala Rao.

Speaking to media persons along with the Additional EO Ch Venkaiah Chowdary, at Annamaiah Bhavan in Tirumala on Saturday evening, the TTD EO said, on behalf of the state government the CM of AP has presented silk clothes to Srivari temple on October 4, on the first day of Srivari Brahmotsavam and appreciated the arrangements made by TTD for the convenience of Srivari devotees.

He inaugurated the newly constructed Vakulamata Kitchen at the back of Panchajanyam Rest House at a cost of Rs.13.45 crores. During that time he suggested all the officials of TTD to ensure that the devotees get satisfactory darshan and vahana sevas. "Devotees are our prime guests and service to devotees is service to divinity(Bhaktula Seve Bhagavantuni Seva). Behave in a polite manner with the devotees and give them a memorable experience of Tirumala visit". Keeping up with his words, we have provided comfortable darshan and vahana sevas to devotees during this year's annual fete when compared to previous years. Annaprasadams, laddu prasadams, accommodation, transportation, tonsures and other services were provided to the devotees without any inconvenience during this year annual festival", EO added.

HIGHLIGHTS OF BRAHMOTSAVAMSDarshan:15 lakh devotees had satisfactory darshan of Vahana Sevas which includes 3.5lakh on the day of Garuda Seva alone. 5.5lakh pilgrims had Srivari Darshan in 2023, when the figures crossed 6lakhs this year(for eight days).

Annaprasadams:
Over 26lakh devotees were served Annaprasadams this year when compared to 16lakh devotees during last year. In 2023 Pongal was served to 86thousand devotees while this year to 2.47lakh. Similarly Upma was served to 6.66lakh this year as against 3.44lakh last year, 9.35lakh beverages this year as against 6lakh last year, snacks to the 50thousands last year while it was 1.94lakh this year.Others:
The Hundi collection stood at 26cr this year as against 24cr during last year, the number of tonsures stood at 2lakh last year while the figure recorded 2.60lakh this year.
On the day of Garuda Seva, 2800 trips of APSRTC were commuted to transport devotees as against the 2400 trips during last year.

Dharmic Projects:
Out of 261 artistic troupes from 18 states, 6,884 artistes performed various art forms to entertain the devotees.

Garden department
Beautiful flower decorations and flower display at the Srivari Temple along with several courtyards and guest houses. 40 tons of flowers, 3.5 lakh cut flowers and 80 thousand seasonal flowers were used in Brahmotsavams. The fruit / flower display with the themes from Krita, Treta, Dwapara and Kali Yugas have attracted the devotees.

Besides the Electrical illumination also impressed the devotees with interesting 3D figurines and other mythological electrical decorations.

PR department:The photo exhibition in Kalyanavedika by the PR department with Nadu-Nedu concept has given the devotees information about Tirumala in the good olden days and development at present.Besides, the exhibitions organized by forestry and sculpture college received appreciation from the devotees.

SVBC
The Vahasevas along with other spiritual programs were telecast live with HD cameras on the 23 giant digital screens placed along four mada streets apart from 09 others outside Tirumala temple where congregation of pilgrims was more, facilitating them to witness the carriers.

Srivari Sevaks
Around 4 thousand Srivari Sevaks from around 07 states provided services to lakhs of devotees this year as against 3300 last year.
Feedback:The feedback provided by senior officers, TTD Call Center, Command Control Center, Information Centers, Media, Devotees from time to time helped in providing better facilities to the pilgrims.

Medical Department -
45 doctors, 60 paramedical staff and 13 ambulances were used to provide better medical assistance to the devotees. This year 68thousand pilgrims utilized the medical services as against 31thousand last year.

Vigilance and Security Department
Special parking areas for vehicles in various parts of Tirumala and Tirupati were set up to avoid traffic problems on Garuda Seva Day.

Officers on Deputation:Tirumala has been divided into 8 sectors and senior officers were deployed to supervise the amenities being provided to devotees by TTD. Besides 47 officers and 350 ministerial staff were also deputed on the day of Garuda Seva to ensure hassle free services to devotees in every area.

Health Department(Sanitation)
In addition to1365 personnel in Tirumala, 600 additional personnel were deployed for sanitation and cleanliness on the day of Garuda Seva.

TTD EO thanked the entire workforce, police, district administration, srivari sevaks, NCC, media and above all the pilgrim public for their co-operation and support in making the annual brahmotsavams a massive success.


వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానంCHAKRASNANAM PERFORMED TO CHAKRADHARI      శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజై...
12/10/2024

వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

CHAKRASNANAM PERFORMED TO CHAKRADHARI

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శ‌నివారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

అంతకుముందు తెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు.

ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమ‌ల‌ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై – లోకం క్షేమంగా ఉండడానికి, భక్తులు సుఖశాంతులతో ఉండడానికి- చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక – యజ్ఞాంతంలో అవభృథస్నానం’ చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్ని సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం.

చక్రస్నానం (అవభృథం)లో శ్రీవారి సుదర్శనచక్రానికి (చక్రత్తాళ్వార్‌కు) పుష్కరిణిలో స్నానం నిర్వహించే ముందు శ్రీభూ సమేత మలయప్పస్వామికి ‘స్నపన తిరుమంజనం’ నిర్వహించారు. తర్వాత సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణి జలంలో ముంచి, స్నానం చేయించారు. ఆ దివ్యాయుధ స్పర్శవల్ల పవిత్రమైన పుష్కరిణి జలంలో భక్తసమూహం కూడా అదే సమయంలో స్నానం చేశారు. ఇందువల్ల ఈ ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికి దర్శించిన వారికి ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది.

Tirumala,The holy Chakrasnanam was performed in a grand manner to Sri Sudarshana Chakrattalwar on Saturday morning in Swamy Pushkarini.

On the Sunny Saturday, the last day of the Srivari annual Brahmotsavam, holy bath was rendered to the anthropomorphic form of Srivaru.

A significant number of devotees came and took holy bath in the Pushkarini.

Earlier in the morning from 3 am to 6 am pallaki utsavam was held at the Mukha Mandapam of Sri Varaha Swami Temple. Later Snapana Thirumanjanam was held in grandeur to Sri Malayappa Swamy, Sridevi and Bhudevi along with Sri Sudarshana Chakratthalwar

The archakas performed Vishvaksen Aradhana, Punyahavachanam, Mukha Prakshalanam(face cleansing), Dhoopa Nivedana(incense offering), Chhatra Chamara Vyajana Darpanadi offerings (services with (umbrella and mirror) and Rajopacharam.

As a part of Arghyapada Nivedana, a bath was performed with milk, honey, coconut water, turmeric and sandalwood.

On this occasion, TTD Veda Parayanadars recited Upanishad Mantras, Dashashanti Mantras, Panchasukta Mantras such as Purusha Suktam, Sri Suktam, Bhu Suktam, Neela Suktam, Vishnu Suktam and Vedas related to Divya Prabandham during Abhishekam.

After the abhishekana, various Pasuras were chanted in the presence of Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swami and Sri Sri Sri Chinna Jeeyar Swami.

After the completion of all rituals to keep the world safe and happy, Chakra Snanam was performed.

Since Utsavam is a Yajna – Avabhrida Sanam was performed in the Yajna. Avabhrida is the Deekshantha Snanam which is performed at the last to get rid of the bad results caused by minor mistakes while performing the Yagna to attain the goo virues.



అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌KALKI AVATARAM ON ASWAతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్స...
11/10/2024

అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

KALKI AVATARAM ON ASWA

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం రాత్రి అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు భ‌క్తుల‌కు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహ‌న‌సేవ ప్రారంభమైంది.

వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్లు వేద‌మంత్రాల‌తో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని, నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.

TIRUMALA, The eighth evening witnessed Sri Malayappa donning Kalki Avataram and riding Aswa Vahanam to bless His devotees.

The vahana sevas concluded with the divine horse carrier on the penultimate day of the ongoing annual Brahmotsavams in Tirumala on Friday.



భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడువేడుకగా రథోత్సవంభక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు       తిరుమల శ్రీవారి సాలకట్...
11/10/2024

భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు

వేడుకగా రథోత్సవం

భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం 7 గంటలకు ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు.

బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీథులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి.

తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైనది. ''రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే'' అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీథులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.

రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికీ ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీథులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో - స్థూలశరీరం వేరనీ, సూక్ష్మశరీరం వేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ, అన్నమయ్య సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తనరథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం.


చంద్రప్రభ వాహనం పై వెలిగిన దర్బార్ కృష్ణుడు  తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన గురువారం సాయంత్రం శ్రీ మల్...
10/10/2024

చంద్రప్రభ వాహనం పై వెలిగిన దర్బార్ కృష్ణుడు

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన గురువారం సాయంత్రం శ్రీ మల్లప్ప స్వామి చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుని అలంకారంలో తిరుమల నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించాడు.

"పురుషోత్తమ ప్రాప్తియాగం" చంద్రుడిని శ్రీ మహా విష్ణువు రూపుగా వర్ణిస్తుంది.ఖగోళ శాస్త్రం చంద్రుని సమస్త జీవకోటికి సస్యకారునిగా పేర్కొంది.సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు తనను తాను నక్షత్ర కూటమిలో చంద్రునిగా అభివర్ణిస్తాడు. అందుకే అంకురార్పణం కూడా సాయంత్రం వేళ చంద్రకాంతిలోనే జరుగుతుంది.
చంద్రప్రభ వాహనంపై స్వామివారి దర్శనం మంచికి, ప్రశాంతతకు, ఆనందానికి సంకేతంగా భక్తులు భావిస్తారు.


విద్యుత్ వెలుగుల‌తో వైకుంఠాన్ని త‌ల‌పిస్తున్న తిరుమ‌ల కొండ‌"ELECTRIFYING'' SEVEN HILLS15 BIG AND 30 SMALL ELECTRICAL CUT...
10/10/2024

విద్యుత్ వెలుగుల‌తో వైకుంఠాన్ని త‌ల‌పిస్తున్న తిరుమ‌ల కొండ‌

"ELECTRIFYING'' SEVEN HILLS

15 BIG AND 30 SMALL ELECTRICAL CUT OUTS ERECTED

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా టీటీడీ విద్యుత్ శాఖ తిరుమ‌ల‌లో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంక‌ర‌ణ‌ల‌తో తిరుమ‌ల కొండ వైకుంఠాన్ని త‌ల‌పిస్తోంది. వైకుంఠం భువికి దిగివ‌చ్చిందా అన్న చందంగా విద్యుత్ కాంతుల‌తో తిరుమ‌ల కొండ భ‌క్తుల‌ను క‌నువిందు చేస్తోంది.

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా వాహ‌న సేవ‌ల‌ను వీక్షించేందుకు వ‌చ్చిన ల‌క్ష‌లాదిమంది భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేందుకు శ్రీ‌వారి ఆల‌యాన్ని ప్ర‌త్యేక‌మైన పార్కన్ మరియు ఫకాడ్ లైటింగ్ తో టీటీడీ అలంక‌రించింది. రంగురంగుల కాంతుల‌తో శ్రీ‌వారి ఆల‌య గోడ‌ల‌ను, మ‌హాద్వార గోపురం, మాడ వీధులు, ముఖ్య‌మైన కూడ‌ళ్లు, ఆర్చిల వ‌ద్ద భ‌క్తులు మైమ‌ర‌చేలా విద్యుత్ వెలుగుల‌ను శోభాయ‌మానంగా అలంక‌రించారు. తిరుమ‌ల‌లోని ఇత‌ర ఆల‌యాలు, గార్డెన్లు, చెట్ల‌ను కూడా ప్ర‌త్యేక విద్యుత్ కాంతుల‌తో సినిమా సెట్టింగ్ ల‌ను అలంక‌ర‌ణ‌లు చేశారు. పురాణాలు, ఇతిహాసాల్లోని దేవ‌త‌ల రూపాల‌తో తిరుమ‌ల కొండ మొత్తం విద్యుత్ బోర్డులు ఏర్పాటు చేయ‌డంతో భ‌క్తులకు వైకుంఠంలో ఉన్న అనుభూతి క‌లుగుతోంది.

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా తిరుమ‌ల‌ను క‌లియుగ వైకుంఠంగా అనుభూతి క‌లిగించేలా విద్యుత్ అలంక‌ర‌ణ‌ల‌కు టీటీడీ రూ.2.20కోట్లు మంజూరు చేసింది. శ్రీ‌వారి ఆల‌య ప్రాంగ‌ణం, క‌ళ్యాణ వేదిక‌, కూడ‌ళ్ల వ‌ద్ద టీటీడీ 14 భారీ ఎల‌క్ట్రిక‌ల్‌ బోర్డులు, 30 చిన్న ఎల‌క్ట్రిక‌ల్‌ బోర్డుల‌ను ఏర్పాటు చేసింది. ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర‌, సీతా రాములు, శ్రీ‌రామ ప‌ట్టాభిషేకం, మ‌హా విష్ణు, విశ్వ‌రూపం, ద‌శావ‌తార రూపాల‌ను భారీ ఎల‌క్ట్రిక‌ల్ బోర్డుల‌తో ఏర్పాటు చేశారు. అష్ట ల‌క్ష్ములు, తుంబూరుడు, అన్న‌మాచార్యుడి వంటి ఇత‌ర రూపాల‌తో మ‌రో 30 ఎల‌క్ట్రిక‌ల్ బోర్డుల‌ను ఏర్పాటు చేశారు. భ‌క్తులకు విస్మయం క‌లిగేలా విద్యుత్ కాంతుల అలంక‌ర‌ణ‌కు 100 మందికి పైగా టీటీడీ విద్యుత్ శాఖ సిబ్బంది నెల రోజుల‌కు పైగా తీవ్రంగా శ్ర‌మించారు.

విద్యుత్ అలంక‌ర‌ణ‌ల‌పై టీటీడీ ఈఓ శ్రీ జె.శ్యామ‌ల‌రావు మాట్లాడుతూ శ్రీ‌వారిని అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజించే భ‌క్తుల‌ను బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక శోభ ఉట్టిప‌డేలా విద్యుత్ అలంక‌ర‌ణ‌లను ఏర్పాటు చేసేందుకు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్నామ‌ని తెలియ‌జేశారు.

భ‌క్తులు వాహ‌న సేవ‌ల‌ను తిల‌కించేందుకు తిరుమ‌ల‌లోని శ్రీ‌వారి ఆల‌య మాడ వీధులు, మ్యూజియం, వ‌ర‌హాస్వామి రెస్ట్ హౌస్‌, అన్న‌దానం కాంప్లెక్స్, రాంభ‌గీచా, ఫిల్ట‌ర్ హౌస్‌, ఇత‌ర ప్రాంతాల్లో 32 భారీ డిజిటల్ స్క్రీన్ల‌ను టీటీడీ ఏర్పాటు చేసింది.

బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్బంగా తిరుమ‌ల‌కు విచ్చేసిన భ‌క్తులను ఆక‌ట్టుకునేలా జీఎన్సీ ఏరియాతో పాటు ప‌లు పార్కుల్లో దేవ‌తా రూపాల‌తో ప్ర‌త్యేక ఎల‌క్ట్రిక‌ల్ క‌టౌట్ లు ఏర్పాటు చేశారు. తిరుమ‌ల‌లోనే కాకుండా తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నం, బ‌స్టాండ్, రైల్వే స్టేష‌న్ స్వాగ‌త తోర‌ణాల వ‌ద్ద ప్ర‌త్యేక‌మైన విద్యుత్ అలంక‌ర‌ణ‌లను టీటీడీ ఏర్పాటు చేసింది.

TIRUMALA, Tirumala, the Bhooloka Vaikuntham and the abode of Hill God, Sri Venkateswara donned an electrifying look with the
Stupendo fantabulously phantasmagorically magical look for the ongoing annual Brahmotsavams.

The entire temple complex is glittering with electrical illumination and the surroundings with the a galaxy of mythical divinities.

The 3 Dimention figurine of Sri Maha Vishnu on the moving Garuda atop old Sahasra Deepalankara Seva Mandapam stands as a cynosure.

Besides various mythological including Sri Rama, Hanuman, Tirunamam, Dasavatara, Astalakshmi, Vishwarupam, Tumburu, Annamacharya, Sri Rama Pattabhishekam and 15 such big and 30 small illuminated themes erected apart from the decorative arches, walls, trees and many more.

Parkon and Facade lightings are used at different places to enhance the attractive look. TTD has allocated Rs.2.20 crores for electrical decorations in Tirumala.

According to DE Sri N Chandrasekhar, over 200 electricians including 100 from TTD and 100 from outside places including Vijayawada, Hyderabad, Guntur besides Tirupati worked for over 45 days to erect these electrical figurines.

Out of the 32 large digital screens, 23 are installed in Mada Streets besides nine in the crowded areas including SV Museum, Varahaswamy Rest House, MTVAC, Rambhagicha Rest House, Filter House and other places to watch Vahanaseva on all the nine days.

The 23 screens are provided with live HD resolution services for better visibility and clarity of the religious programs and Vahana sevas for the sake of devotees by Radio and Broadcast department of TTD.


Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Tirumala times posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Tirumala times:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share