Voiceopedia

Voiceopedia Government, Politics, History, Geopolitics, Science and Stories

21/09/2023

దేశంలో సాటి పౌరుల్ని ద్వేషించే వాడు దేశభక్తుడెలా అవుతాడు ?
స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నవారిని దూషించే వాడు దేశభక్తుడు ఎలా అవుతాడు?
స్వాతంత్ర పోరాటానికి వెన్నుపోటు పొడిచినవాళ్లను భుజానేసుకునేవాడు దేశ భక్తుడు ఎలా అవుతాడు?

26/03/2023

మార్గదర్శిలో రామోజీరావు చేసిన తప్పేంటి ? అప్పటి ముఖ్యమంత్రిని దాటి మార్గదర్శికి సాయం చేసింది ఎవరు?

21/03/2023

కోర్టుల్లో కూడా మేమే వేలుపెడతాం
Govt vs suprem court on collegium

13/06/2021

***a

Cannabis, also known as ma*****na among other names, is a psychoactive drug from the Cannabis plant used primarily for medical or recreational purposes

"తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంత" పూర్తిగా చదవండి. ఇది hacking గురించి కాదు, ఇంటర్నెట్ లో ఉన్న other dimension గురి...
15/10/2020

"తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంత" పూర్తిగా చదవండి. ఇది hacking గురించి కాదు, ఇంటర్నెట్ లో ఉన్న other dimension గురించి.

ఇంటర్నెట్ వాడుతున్న చాలా మందికి తెలియని విషయం మనం అందుబాటులో ఉండే నెట్ పూర్తి ఇంటర్నెట్ లో కేవలం సుమారు 5% మాత్రమే. అంటే ఈ సెర్చ్ ఇంజిన్స్ వెతకగలిగేవి, మనకు తెలిసిన, తెలుసుకుని మరీ చూడగలిగిన ఇంటర్నెట్ మొత్తం 5% మాత్రమే. దీన్ని surface web అంటారు

1. Surface web
2. Deep web
3. Dark web

ఈ మూడింటిలో అతి ఎక్కువ శాతం ఉండేది Deep web. ఇది సెర్చ్ ఇంజిన్స్ కి దొరకదు కానీ ఇల్లీగల్ కాదు. మీ వెబ్, క్లౌడ్ స్టోరేజ్, బ్యాంక్, గవర్నమెంట్, కంపెనీస్ డేటా లాంటివి ఉంటాయి. లింక్ ఇస్తే తప్ప ఆక్సిస్ చేయలేము. ఉదాహరణకు నా గూగుల్ డ్రైవ్ ఫొటోస్ ఎవరికైనా పంపాలి అంటే దాని లింక్ పంపాలి. ఆ లింక్ కి నేనే ఆక్సిస్ ఇవ్వాలి.

"Dark web" ఈ విషయాన్ని నేను ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే చెప్తున్నాను. దీంట్లోకి ఎంటర్ అవ్వడం ఏ మాత్రం మంచిది కాదు. దయచేసి ఇన్ఫర్మేషన్ లా తెలుసుకోండి తప్ప వాడటానికి ప్రయత్నించకండి. 90s లో US నేవీ రీసెర్చ్ లాబరేటరీ మిగిలిన వారికి అందుబాటులో లేకుండా ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసం ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకుంది, దాన్ని Onion routing అంటారు. ప్రత్యేకమైన Tor బ్రౌసర్(only for information, don't try) ద్వారానే దాంట్లోకి ప్రవేశించగలరు. ఐడెంటిటీని మాస్క్ చేసి మనల్ని anonymous గా ఉంచుతుంది. Dark Web లో వెబ్ సైట్స్ ప్రత్యేకమైనవి అవి .Com బదులు .Onion ని extention గా వాడుతాయి. Tor లాంటివే darkweb లో ఇంకొన్ని dark nets ఉంటాయి. Tor ని జనరల్ బ్రౌసింగ్ కి కూడా వాడొచ్చు.

Dark web కంటెంట్ లో ఎక్కువ శాతం ఇల్లీగల్ ఆక్టివిటీస్ ఉంటాయి. Hackers, చైల్డ్ పోర్న్, డ్రగ్స్, టార్చర్, చంపడానికి మనిషిని మాట్లాడుకోవడం, అనిమల్స్ ని లైవ్ టార్చర్ చేయడం, ఇలా సామాన్యుడి ఊహకు అందనివి. Bitcoin లాంటి crypto currency ని ఇలాంటి చోట విరివిగా వాడుతారు. మరెందుకు darkweb ని shutdown చేయడం లేదంటే అది US కు చాలా అవసరమైనది. ఇంటర్నెట్ లో మంచి చెడు ఉన్నట్టుగానే darkweb తో అవసరం, అనవసరం రెండూ ఉన్నాయి. Silk road అనబడే డ్రగ్స్ సైట్ ని shutdown చేసిన రెండో రోజు Silkroad 2.0 వచ్చింది దాన్ని క్లోజ్ చేస్తే 3.0 స్టార్ట్ చేశారు, ఇలా continue అవుతూనే ఉంటుంది. ప్రభుత్వ భద్రతా సంస్థల నిఘా ఉన్నా కూడా వాటిని పూర్తిగా ఆపలేరు కొన్ని ఏళ్ల క్రితం సుమారు 2400దాకా darkweb సైట్స్ ఉంటే వాటిల్లో 1500పైగా ఇల్లీగల్ ఆక్టివిటీస్ చేసేవే. పోస్ట్ లెంగ్త్ దృష్ట్యా ఇక్కడితో ఆపేస్తున్నా..Tor వాడినంతమాత్రన మనం ఎవరికి తెలియదనుకోవద్దు గవర్నమెంట్ organisations, hackers ఈజీగా క్రాక్ చేయగలరు.

Browse safe so that you can stay safe

1923 టర్కీ మొదటి ప్రపంచయుద్దం తరువాత "ముస్తఫా కీమాల్ అటా టర్క్" ఆ దేశ ప్రెసిడెంట్ గా అధికారం లోకి వచ్చాడు. ఆయన్ని ఫాదర్ ...
15/10/2020

1923 టర్కీ

మొదటి ప్రపంచయుద్దం తరువాత "ముస్తఫా కీమాల్ అటా టర్క్" ఆ దేశ ప్రెసిడెంట్ గా అధికారం లోకి వచ్చాడు. ఆయన్ని ఫాదర్ అఫ్ టర్కీ గా కూడా పిలుచుకుంటారు. అత్యున్నత స్తాయి నియంత అధికారాలతో అతనికి పదవి లభించింది. అప్పటివరకు ముస్లిం పాలనలో నడిచిన ఒట్టోమన్ ఎంపైర్ కూలిపోవడంతో అతను తన అధికారం తో చేసిన పని secularism ని టర్కీ కు అందించడం. మతాన్ని, ప్రభుత్వాన్ని వేరు చేయడం, జెండర్ ఈక్వాలిటీ ని తీసుకురావడం, ప్రతి ఒక్కరికి విద్య, సమాన హక్కులు అందించడం తో పాటు దేశ మిలిటరీ కి secularism ని కాపాడే భాద్యత అప్పగించడం. అయన ఫ్రెండ్లీ ఫారిన్ పాలసీ వల్ల తరువాత కాలం industrial growth సాధించి వెస్ట్రన్ కంట్రీస్ కు దగ్గరయ్యి నాటో లో భాగస్వామ్యం అయింది. ఆ సమయంలో అయన నియంతగా వుండటం వల్ల ఇంకెవరూ తన తరువాత నియంత అయ్యే అవకాశాన్ని లేకుండా మార్పులు చేసాడు.

2016 టర్కీ

రిసెప్ తయ్యేప్ ఎర్డోగాన్ 2014 లో టర్కీ ప్రెసిడెంట్ గా భాద్యతలు తీసుకున్నాడు. దానికిముందే అతను చాలా కాలం పాటు ఇస్తాంబుల్ మేయర్ గా చేసాడు, ఆ సమయం లో అతని మత పరమైన anti seculular కామెంట్స్ తో జైలు కి కూడా పంపబడ్డాడు.. అతని ఉద్దేశం లో democracy ఏనాడు సొల్యూషన్ కాదు ఒక టూల్ మాత్రమే. మతపరమైన రాజ్యం స్తాపించాలనే బలమైన కోరికతో ఇసిస్ లా కాకుండా planed గా పావులు కదిపాడు, ఫలితం 2015 లో ఆర్మీ తిరుగుబాటు(secularism ని కాపాడే భాద్యత ఆర్మీ కి ఇవ్వబడింది) తిరుగుబాటు సమయంలో టీవీ చానెల్ ద్వారా లైవ్ వీడియో ద్వారా ఎర్డోగాన్ ప్రజల్ని బయటికి వచ్చి దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపు ఇచ్చాడు. ఈ మాటలు పూర్తి ఎమోషనల్, దేశం అనే భావనను దాన్ని కాపాడుకోవాలి అనే భావనను రెచ్చగొట్టడం తో జనం రోడ్ మీదకు వచ్చి తిరుబాటును అడ్డుకోవడం తో తిరుబాటు ఫెయిల్ అయ్యింది. తరువాత 90000 డిస్మిస్ చేయబడ్డారు, 30000 పైగా సస్పెండ్ అయ్యారు, లక్ష మంది పైగా లీగల్ ఆక్షన్ కు గురయ్యారు, 40000 పైగా అరెస్ట్ అయ్యారు, 150 పైగా మీడియా సంస్తలను మూసివేసారు జర్నలిస్ట్స్ దగ్గరినుండి స్కూల్ టీచర్స్ వరకు ఉద్యోగాలనుండి తీసేయబడ్డారు. చిన్న ఇస్లాం దేశాలు, ముస్లిం ప్రజలు ఎర్దోగాన్ ఒక రక్షకుడిగా చూస్తున్నారు(తనను తాను అలా ప్రాజెక్ట్ చేసుకుంటున్నాడు).

ఫలితం

ఎర్దోగాన్ తన ఆశయం వైపు నెక్స్ట్ స్టెప్ వేసాడు... దేశ భద్రత అనే ఎమోషన్ ప్రజల్లో క్యారీ అవుతున్న సమయం లోనే ప్రెసిడెంట్ కు అత్యన్నత అధికారాలు(dictatorship) అందించేలా రాజ్యాంగ సవరణ కోసం రెఫరెండం జారి చేసారు. అది 51% అత్యల్ప మెజారిటీ తో అతనికి అనుకూలంగా వచ్చింది, దానితో అతను budget, మిలిటరీ, కోర్ట్స్, సివిల్ సర్వెంట్స్ appointments ముక్యంగా పార్లిమెంట్ ను dissolve చేసే అత్యున్నత అధికారాలు పొందాడు. ఇప్పుడు democracy కేవలం అలంకారం మాత్రమే ultimate పవర్ ప్రజలనుండి ఒక వ్యక్తికి చేరింది. ఆర్మీ తిరుబాటును ఎర్దోగాన్ దేవుడు ఇచ్చిన అవకాశం గా పేర్కొన్నాడు(ప్రజలను ఎమోషనల్ గా రెచ్చగొట్టి తన పని నెరవేర్చుకోవడానికి తిరుగుబాటు అతనే చేయించాడు అనే వాదన కూడా వుంది). ఇప్పుడు ఒట్టోమన్ ఎంపైర్ ను పునః స్తాపించే ఆలోచనలో అతని స్టేట్మెంట్స్ వినపడుతున్నాయి. ఇసిస్ కు అత్యంత సపోర్ట్ ఇస్తున్న దేశాలలో టర్కీ కూడా ఒకటి.

తెలుసుకోవాల్సినవి

కొన్ని వేల ఏళ్ళ మానవ జీవనక్రమం లో మనల్ని మనమే పరిపాలించుకునే అవకాశం కోసం వేల పోరాటాలు, బలిదానాలు చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ నియంతల అధీనంలో వున్న ప్రజలకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఒక్కసారి democracy చేజారిపోతే సాధించడం ఇప్పటి తరానికి దాదాపు అసాధ్యం. ప్రజలే(మనమే) అంతిమ తీర్పు ఇచ్చేవారిగా, మన పాలకులను ఎన్నుకునే వారిగా వున్న ఈ అవకాశాన్ని కులాల కోసం, మతాల కోసం, పార్టీ మీద గుడ్డి అభిమానం తో ఎమోషనల్ angle లో సపోర్ట్ చేస్తే దాని ఫలితం మనతో పాటు మన తరువాతి తరాలు కూడా అనుభవించాలి. వాడు, తరువాత వాడి కొడుకు అంటూ ఎమోషనల్ గా ఎన్నుకోకుండా, మాటలు, రాజకీయం తప్ప పరిపాలన చేతకాకపోయినా వెర్రి అభిమానం తో ఓట్లు వేస్తే దూల తీరేది మనకే. స్వాతంత్ర్యం చాలా చాలా విలువైనది కోల్పోతే సాధించడం ఈ కాలం లో దాదాపు అసాధ్యం. Never loose ur power, and never sell yourself for the sake of ur emotional satisfaction.

Media paradigmమీడియా paradigm లో ఎప్పుడూ ఒకే అంశానికి రెండు భిన్న వాదనలు వినిపిస్తాయి ఒకరు ప్రో ఒకరు anti. ఈ రెండు తప్ప ...
15/10/2020

Media paradigm

మీడియా paradigm లో ఎప్పుడూ ఒకే అంశానికి రెండు భిన్న వాదనలు వినిపిస్తాయి ఒకరు ప్రో ఒకరు anti. ఈ రెండు తప్ప న్యూట్రల్ వాదన మనం చూడలేం. అంటే జరిగే ప్రతివిషయంలోను మనల్ని ఏదో ఒకవైపుకు ఉండేలా చేయడం. ఒకవైపు ఉండటం అంటే రెండో వైపు వారితో విడిపోవడం.

ఇన్ఫర్మేషన్ కంట్రోల్ చేయడం, సొసైటీ లోకి వచ్చే ఇన్ఫర్మేషన్ ని ఫిల్టర్ చేయడం, తమ అవసరానికి తమ అజెండాను అనువైనవాటిని మాత్రమే అందించడం.

సమాజం ప్రతి విషయంలో రెండు వర్గాలుగా మాత్రమే ఉంచాలన్న ఐడియాలజీ ఇది. ఆ మతమా ఈ మతమా? ఆపార్టీనా ఈపార్టీనా? ఆపక్కనా ఈపక్కనా? ఒకదాన్ని వ్యతిరేకించడం అంటే రెండో దాన్ని ప్రోత్సహించడమే అన్న వీరి విధానాన్ని జనం బుర్రల్లో ప్రవేశపెట్టే ప్రయత్నం ఇది. న్యూట్రల్ ఆలోచన లేకుండా చేసి రెండు వర్గాలుగా ఉంచడం వల్ల వీళ్లకు లాభం వీరిని ఆడించే వారికి లాభం. రెండు వర్గాలుగా ఉంటేనే సమాజంలో రగడ ఉంటుంది దాని మీద వీరు వీళ్ళని ఆడించేవారు బ్రతకొచ్చు

ఒకప్పుడు william hearst, joseph pulitzer అనే మీడియా అధినేతల మధ్య ఆరాటం స్పెయిన్ అమెరికాల మధ్య యుద్ధం వచ్చే పరిస్థితిని తెచ్చింది. ఇలా యుద్దాన్ని ఆశించే మీడియా వారు ఇప్పుడు కోకల్లలు. మీడియా తన బాధ్యత సక్రమంగా నిర్వహించి ఉంటే చాలా నష్టాలు కూడా నివరించగలిగేది అనడానికి రెండో ప్రపంచయుద్దం ఉదాహరణ. హిట్లర్ అబద్దాలను, ఇంటెన్షన్ ను expose చేయాల్సిన మీడియా అతన్ని పైకెత్తి ప్రజల ఆలోచనల్ని తమ వైపుకు తిప్పుకోగలిగింది. తద్వారా సుమారు రెండు లక్షలమంది మరణానికి కారణమైన రెండో ప్రపంచయుద్దానికి జర్మన్ ప్రజల అంగీకారాన్ని సాధించింది. Doklam విషయంలో media చూపిన అత్యుత్సాహం వల్ల కొన్ని రాష్ట్రాల్లో మొబైల్ స్టోర్లపై దాడులు జరిగి స్వదేశ ప్రజలకు ఆస్తినష్టం కలిగించేలా చేసింది అంటే అచ్చర్యపోక తప్పదు.

వాస్తవ వార్తకు కల్పిత వార్తకు, న్యూట్రల్ రిపోర్టింగ్ కు అజెండా రిపోర్టింగ్ కు తేడా తెలుసుకోకుండా వెర్రి అభిమానంతో ఆ అభిమాన మీడియా అందించే వార్తలకు మాత్రమే పరిమితం అయితే నిజం ఎప్పటికి తెలియాకపోగా సమాజానికి దేశానికి ద్రోహం చేసిన వాళ్లగా మిగిలిపోతాము.

మన కుటుంబం, స్నేహితులు, బంధువులు, బలం, బలగం, నమ్మకం, రాజకీయం, మతం, పెత్తనం, కథలు, కథనాలు, ఊహలు మొత్తం ఆ కనిపించి కనిపించ...
13/10/2020

మన కుటుంబం, స్నేహితులు, బంధువులు, బలం, బలగం, నమ్మకం, రాజకీయం, మతం, పెత్తనం, కథలు, కథనాలు, ఊహలు మొత్తం ఆ కనిపించి కనిపించని BLUE DOT వరకే..

1st పిక్..1990లో NASA వోయేజర్ సూర్యమండలాన్ని దాటుతున్న క్రమంలో తీసిన PALE BLUE DOT ఫోటో,

రెండవది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కి చెందిన CASSINI space క్రాఫ్ట్ 2006 లో తీసిన "Saturn's Shadow" ఫోటో.

Updateకరోనా వైరస్ ఇంతకుముందు surface ని బట్టి 2-4 days వరకు బ్రతికివుంటుంది అని చెప్పారు.ఆస్ట్రేలియన్ ఏజెన్సీ CSIRO చేసి...
12/10/2020

Update

కరోనా వైరస్ ఇంతకుముందు surface ని బట్టి 2-4 days వరకు బ్రతికివుంటుంది అని చెప్పారు.

ఆస్ట్రేలియన్ ఏజెన్సీ CSIRO చేసిన రీసెర్చ్ లో వైరస్ 20డిగ్రీల వద్ద చీకట్లో 28 రోజులవరకు బ్రతికివుంటుంది అని నిర్ధారించారు.

Address


520001

Website

Alerts

Be the first to know and let us send you an email when Voiceopedia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Voiceopedia:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share