16/03/2021
దళితుల్లో ఒక్క దేవుడైన లేక పాయె!
============================
రాముడు, కృష్ణుడూ దేవుళ్లు కారు..
వారిని మేం కొలవం.. మాకు బుద్ధుడే దైవం..
మాది బుద్ధిజం.. అని చెప్పదలుచుకోవడం మాత్రమే కాదు..
దాన్నో ప్రతిజ్ఞగా మార్చి.. దాన్ని స్వేరో స్కూళ్లలో ప్రతిజ్ఞ చేయించారు
ఈ స్కూళ్లకు ఇంఛార్జ్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి..
ఇప్పుడాయన హోదా కావచ్చు..
ఆయన బహుజనుడు కావడం కావచ్చు..
స్వేరో గురుకులాలేంటి.. సమాజంపై వాటి ప్రభావమేంటి?
ఈ గురుకులాలలకు తల్లిదండ్రుల్లో ఉన్న క్రేజ్ కావచ్చు..
వాటిలో పిల్లలకు నేర్పిస్తున్న నైతిక విలువల క్రమశిక్షణ తదితర వ్యవహారాలు కావచ్చు..
వాటన్నిటినీ అలా ఉంచి..
రాముడెందుకు వద్దు కృష్ణుడెందుకు వద్దు.. బుద్ధుడు ఎందుకు కావాలి???
రాముడు దేనికి ప్రతీక- కృష్ణుడు దేనికి ప్రతీక- బుద్ధుడు ఎవరికి ప్రతీక
అని తరచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది..
మనమిప్పుడు రాముడెవరో చూస్తే..
ఆయనకూ మనువాదానికీ సంబంధమేంటి?
దీనికీ బ్రాహ్మణీకానికీ సంబంధమేంటో పరిశీలిస్తే..
రాముడు క్షత్రియుడు.. సూర్యవంశీకుడు..
ఇక కృష్ణుడు టెక్నికల్లీ యాదవుడు.. రక్త సిద్ధాంతం ప్రకారం చూస్తే..
ఆయన కూడా ఒక క్షత్రియుడు...
ఇక బుద్ధుడెవరూ? అని తరచి చూస్తే.. గౌతమ బుద్ధుడు కూడా క్షత్రీయుడే..
సిద్ధార్ధుడి తండ్రి శుద్ధోదనుడు సూర్యవంశ రాజైన.. ఇక్ష్వాకుడి వారసుడని అంటారు..
సరిగ్గా అదే సమయంలో.. శుద్ధోదనుడు ఒక ఆటవిక తెగ నాయకుడన్న పేరుంది..
ఒక వేళ తండ్రి ఆటవిక తెగకు చెందిన నాయకుడైనా
తల్లి మహా మాయాదేవి.. మాత్రం కోళియన్ దేశపు రాకుమారి..
బుద్ధుడికి గౌతమ బుద్ధుడు అన్న పేరెందుకు ఉందంటే..
ఆయన పుట్టడానికి మాయాదేవి గర్భాన పుట్టినా..
పెరిగింది మాత్రం గౌతమీ అనే పెంపుడు తల్లి చేతుల మీదుగా..
అందుకే ఆయనకు ఈ పేరు వచ్చింది..
తనను ఒక చెట్టు కింద కన్న తల్లి మాయావతి.. ఐదు రోజులకే మరణించగా..
ఆ బిడ్డకు సిద్ధార్ధుడనే నామకరణం చేశారు..
ఈ కుర్రాడి భవిష్యత్ ఏమిటో జ్యోతిష్కులను అడిగి చూడగా.. ఇతడు భవిష్యత్తులో గౌతమ బుద్ధుడవుతాడని ఆ జ్యోతిష్కులు చెప్పడం.. అనుకున్నట్టుగానే తన బాల్య, యవ్వనాదులను అంతఃపురంలో బంధీగా గడపటం.. 16వ ఏటనే యశోదతో పెళ్లి కావడం.. రాహులుడనే బిడ్డకు జన్మనివ్వడం.. ఇలా తన 29వ ఏట వరకూ సిద్ధార్ధుడు రాజభోగాలను అనుభవించాడన్నది చరిత్ర.
తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే..
బేసిగ్గా సిద్ధార్ధుడు.. ప్రాపంచిక సౌఖ్యాలను అనుభవించడం మాత్రమే జీవిత పరమార్ధం కాదని గ్రహించడం వల్ల..
కాలి చెప్పులకున్న విలువ కూడా.. చచ్చిన మనిషి శవానికి ఉండదని గుర్తించడం వల్ల.. దేశాలు పట్టి తిరగడం..
ఒక బోధి వృక్షం కింద.. సాలీడు ద్వారా.. అనుకున్నది సాధించాలంటే సాధన చేస్తూనే పోవాలన్న జ్ఞానం పొందడం..
చివరికి తన 35 వ ఏట కోరికలే మనిషి జీవితానికి తీరని కష్టాలను కొని తెస్తున్నాయన్నది తెలుసుకోవడం..
ఇలా నాటి అఖండ భారతం నేటి నేపాల్లో పుట్టిన ఒక చెట్టుకింద పుట్టి..
గయలోని బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయిన.. బుద్ధుడు తన తర్వాతి కాలంలోతాను కనుగొన్న జీవన సూత్రాన్ని ప్రచారం చేస్తూ.. ఏషియాలోనే అత్యంత పెద్ద దైవాంశ సంభూతుడయ్యాడు..
ఇప్పుడు బుద్ధుడు భారతదేశంలో పుట్టినా.. శ్రీలంక- చైనా- జపాన్ తదితర దేశాల్లో అత్యంత ప్రజాదరణ గల దైవం..
నాటి అంబేద్కరుడు కావచ్చు..
నేటి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమారుడు కావచ్చు..
బుద్ధుడి యొక్క భక్తాగ్రేసరులే..
క్రిస్టియన్స్ గా మారి.. మతం పుచ్చుకోడానికి ఇష్టపడని.. చాలా మంది స్వాభిమాన దళితుల ఆరాధ్య దైవం.. బుద్ధుడు..
బుద్ధుడు విగ్రహారాధన వద్దంటాడు.. కోరికల్లేని జీవనమే గొప్పదని అంటాడు..
అందులో భాగంగా..
దుఃఖం అంతటా ఉంటుంది..
ఈ దుఃఖం తృష్ణ వల్ల ఏర్పడుతుంది
ఈ తృష్ణ అవిద్య వల్లే వస్తుంది
అష్టాంగ మార్గమే అవిద్య నాశనకారి
అంటూ నాలుగు పరమ సత్యాలను సూచించాడు..
అవిద్యను నాశనం చేసే.. అష్టాంగ మార్గాలంటే..
సమ్యక్ వచనము - నొప్పించకుండా, వక్రీకరించకుండా, సత్యంగా మాట్లాడడం
సమ్యక్ కర్మము - హాని కలిగించే పనులు చేయకుండుట
సమ్యక్ జీవనము - తనకు గాని, ఇతరులకు గాని, ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని కీడు కలుగకుండా జీవించడం
సమ్యక్ సాధన - ప్రగతి కోసం మంచి ప్రయత్నం చేయుట
సమ్యక్ స్మృతి - స్వచ్ఛమైన దృష్టితో విషయాలను స్పష్టంగా చూడగలగడం
సమ్యక్ సమాధి - రాగ ద్వేషాలకు అతీతంగా మనసును స్థిరపరచుకొని సత్యాన్ని అన్వేషించడం
సమ్యక్ దృష్టి - భ్రమ పడకుండా.. ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం
సమ్యక్ సంకల్పము - ఆలోచించే విధానంలో మార్పు
అని సూచిస్తోంది బుద్ధుని అష్టాంగ మార్గం..
ఇలాంటి మంచి లక్షణాలను ఆచరించడం ద్వారా..
రాగద్వేషాలకు అతీతంగా
కులమత వర్గ వైషమ్యాలకు సంబంధం లేకుండా..
హెచ్చు తగ్గుల జీవన సరళితో
అగ్ర అథమ కులాలనే తారతమ్యాలను వీడి..
సంచరించమంటూ సూచిస్తుంది.. బుద్ధుడి అష్టాంగ మార్గం..
ఇది అంబేద్కరుడితో సహా దళిత వర్గాల మేధావులకు చాలా మందికి ఎంతో బాగా నచ్చిందని చెప్పాలి..
ఇక్కడ వీళ్లంతా గుర్తించ వలసిందేంటంటే..
రాముడైనా ఒకటే.. కృష్ణుడైనా ఒకటే.. బుద్ధుడైనా ఒకటే..
వీరి తల్లిదండ్రులు కుల- మత- వర్గ- ప్రాంతాలను అనుసరించి మాట్లాడితే
వీళ్లంతా ఒకటే.. క్షత్రియ వంశజులు.. నాకైతే అదే తెలిసింది..
ఒక వేళ శుద్ధోదనుడు ఆటవిక తెగ నాయకుడే అయినా- ఆయన క్షత్రియ వంశ లక్షణాలతోనే తన జీవనాన్ని గడిపాడు..
ఆ తర్వాత ఆయన పుత్రుడిగా పుట్టిన సిద్ధార్ధుడు సైతం తన 29వ ఏట వరకూ.. శుద్ధ క్షాత్రియుడిగానే జీవనాన్ని గడిపాడు..
వీరంతా క్షత్రియ సుఖ భోగలాలసత్వం అనుభవించిన వారే..
వీటన్నిటిని బట్టీ చూస్తే వీరు ఎవర్ని కావాలన్నా ఎవర్ని వ్యతిరేకించినా ఒకటే
అన్నది నేను అందిస్తున్న అర్ధ తాత్పర్యం..
ఇక్కడ చాలా చాలా జాడ్యాలు రాజ్యం చేస్తుంటాయి..
క్షత్రియుడైన మనువు రాసిన ధర్మశాస్త్రానికీ
బోయవాడైన వాల్మీకి రామాయణానికీ
బెస్తవాడైన వేద వ్యాసుడి మహాభారతానికీ
క్షత్రియుడైన రాముడికి
యాదవ\క్షత్రియుడైన కృష్ణుడికీ
బ్రాహ్మణ వాదానికీ సంబంధం పెట్టి మాట్లాడేస్తుంటారు..
నిజమైన బ్రాహ్మణ దైవాలు వామనుడు, పరశురాముడు..
కానీ వీరికి ఎలాంటి భక్తజన ఆదరణ లేదు..
సగం జంతువు- సగం మనిషిగా కనిపించే నారసింహుడికైనా
భక్తజనుల్లో తగిన ఆదరణ ఉందేమోగానీ..
బ్రాహ్మణ పుట్టుక పుట్టిన వామన- పరశురాములకు కనీసం లేదు..
చాలా మంది మాట్లాడుకుంటున్నట్టు..
రావణుడు బహుజనుడు కాడు.. ఒక బ్రాహ్మణుడు
అందుకే రావణుడ్ని రావణ బ్రహ్మ అంటారు..
వింత ఏంటంటే.. ఈ బ్రాహ్మణ జాతి మొత్తం రావణుడ్ని విలన్ గా చిత్రీకరించి..
క్షత్రియుడైన రాముడే గొప్పగా భావించి నెత్తిన పెట్టుకుని ఊరేగుతుంది..
నరకాసరుడుతై భూదేవి- మహా విష్ణువుల కొడుకు..
నరకాసురుడ్ని కూడా.. దళిత బహుజనులు ఓన్ చేసుకుంటారు..
రావణ నరకాసుర రాక్షస ప్రముఖులు తమ ప్రతీకలుగా చెప్పుకొస్తారు..
ఏతా వాతా చెప్పాల్సి వస్తే.. బుద్ధుడంటే మరెవరో కాదు..
ఆయన కూడా ఒక రాజే.. క్షత్రియ సంజాతుడే..
కొత్తగా మనం ఇపుడు కనుగొన్న దళిత దైవం లేనే లేడు..
రామకృష్ణులనే దైవాలు వద్దనడానికీ- బుద్ధుడే మా దైవం అనడానికీ
ఎలాంటి తేడా కనిపించడమే లేదు.. నా దృష్టిలో ఎవరైనా ఒకటే..
రాములమ్మ సినిమాలో రాసినట్టు దళితుల్లో ఒక్క దేవుడైన లేక పాయె.. అన్నట్టు..
దళితుల్లో ఒక్క దేవుడు కూడా ఇంత వరకూ పుట్టలేదు..
రాముడు- కృష్ణుడు- బుద్ధుడు అందరూ అగ్రవర్ణాల వారే..
కాకుంటే వీళ్లలో బుద్ధుడు కాస్త బెటర్.. చాతుర్వర్ణం పాటించడు..
బ్రాహ్మణ క్షత్రియ శూద్ర దళిత అన్న బేధాలను చూపడు..
రాముడు శంభూక వథ చేసి.. శూద్రకుల హత్య గావించి..
వారి వారి విద్యాబుద్ధులకు తీవ్ర విఘాతం కలిగించి శూద్ర జన ద్రోహిగా ముద్ర పడ్డాడు రాముడు..
ఇక కృష్ణుడు దశావతారాల్లో ఒకడు కాబట్టి.. సాక్షాత్ ఆ మహా విష్ణువు అంశగా చెబుతారు కాబట్టి..
మహా విష్ణువంటే ఇక బ్రాహ్మణ జన ఆరాధ్య దైవం కాబట్టి.. కృష్ణుడ్ని మా దేవుడు క ఆనే కానంటున్నారు కావచ్చు..
నిజానికి కృష్ణుడు నేరుగా శూద్రకుల సంజాతులకు చేసిన హాని ఏమీ లేదు.. పైపెచ్చు తాను కూడా ఒక శూద్ర కులస్తుడిగానే జీవించాడు..
ఇక మహాభారత యుద్ధంలో.. శూద్ర కర్ణుడి చావుకు ఇన్ డైరెక్టుగా కారకుడన్న ముద్ర పడ్డం వల్ల శూద్ర జన వ్యతిరేకి అయి ఉంటాడేమో తెలీదు కానీ.. కృష్ణుడ్ని రిజెక్ట్ చేయాల్సిన అవసరం అయితే కనిపించడం లేదు..
ఇవన్నీ ఒక సారి ఆలోచించుకుని.. విద్వేషం విరజిమ్మితే.. మేలు..
ఒకరకంగా చెప్పాలంటే..
కులాలను బట్టీ దేవుళ్లను ఆరాధించడాన్ని బట్టీ చూస్తే
బ్రాహ్మణులు దైవాల్లో కులారాధన చేయడం లేదనిపిస్తుంది నాకు..
క్షత్రియ- రామ, యాదవ- కృష్ణ, అర్ధనర- నారసింహ వంటి దేవతలకే తమ పూజల్లో అధిక ప్రాధాన్యతనిస్తుంటారు..
సరిగ్గా అదే సమయంలో తాము సృష్టించిన దశావతారంలో కూడా బౌద్ధ అవతారాన్ని జొప్పించి అక్కడా చేయాల్సిన బౌద్ధ- న్యాయం చేశారనిపిస్తుంది.. నాకు
ఇక హిందూ మతానికి వస్తే..
ఇదొక మత విశ్వ విద్యాలయంగా చెప్పాలి..
జైన- సిక్కు- వీరశైవ- బౌద్ధ.. ఇలా చాలానే మతాలు వేరుబడి..
తమకంటూ సొంత మతాలుగా ఆవిర్భవించే స్థాయికి చేరడం..
ప్రపంచమంతా తెలుసు..
కాబట్టి.. రాముడైనా ఒకటే- కృష్ణుడైనా ఒకటే- బుద్ధుడైనా ఒకటే..
ఏదో నా జ్ఞానం కొద్దీ నేను రాశా..
ప్రవీణ్ సార్ మీ జ్ఞానం కొద్దీ మీరు కూడా స్పందించ వలసిందిగా ప్రార్ధన!!!