Mana chithralu

  • Home
  • Mana chithralu

Mana chithralu we are promote short films movies and web sires, entertainment blocks movie memes media promotions l
(1)

Writer & DirectorHarikrishna JaggurothiProducerKiran Kumar KamarsuActorsVinay KumarPradeep KmsPoster designer  Associate...
31/07/2022

Writer & Director
Harikrishna Jaggurothi


Producer
Kiran Kumar Kamarsu


Actors
Vinay Kumar


Pradeep Kms


Poster designer


Associated with

Title logo of "ABHAYANKARI"  Written And directed by   Manikanta KumarProducer : sanivarapu venkata ramu and cheruku pal...
08/07/2022

Title logo of "ABHAYANKARI" Written And directed by Manikanta Kumar
Producer : sanivarapu venkata ramu and cheruku palli raj kumar
Dop : prathyuth Balu

Presented by : aishwarya , lathika and GeethaArts

Happy to announce  "Trinetra creative works"Production no  #6    directed by k.m.s.p    kamarsu  creative works
10/09/2021

Happy to announce "Trinetra creative works"
Production no #6

directed by k.m.s.p

kamarsu
creative works

Tuck Jagadish movie review: ‘టక్ జగదీష్’ రివ్యూ.. నాని కూడా మోయలేకపోయిన రొటీన్ ఫ్యామిలీ డ్రామా..Tuck Jagadish movie revi...
10/09/2021

Tuck Jagadish movie review: ‘టక్ జగదీష్’ రివ్యూ.. నాని కూడా మోయలేకపోయిన రొటీన్ ఫ్యామిలీ డ్రామా..

Tuck Jagadish movie review: గతేడాది సెప్టెంబర్ 5న ఓటిటిలో వి (V) సినిమాతో వచ్చాడు నాని (Nani). అది ఆయనకు 25వ సినిమా. మళ్లీ ఏడాది తర్వాత పరిస్థితులు మారలేదు. నాని నిర్ణయం కూడా మారలేదు. అందుకే మరోసారి ఓటిటిలోనే వచ్చాడు. ఈ సారి టక్ జగదీష్ (Tuck Jagadish) సినిమాతో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నాని నటించిన టక్ జగదీష్ సినిమాపై ముందు నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ చిత్రం అంచనాలు ఎంతవరకు అందుకుందో చూద్దాం..

నటీనటులు: నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్, జగపతిబాబు, నాజర్, రోహిణి , ప్రవీణ్, డేనియల్ బాలాజీ, తిరువీర్ తదితరులు
సంగీతం: థమన్నేపథ్య సంగీతం: గోపీ సుందర్ సినిమాటోగ్రఫర్: ప్రసాద్ మూరెళ్ళ
సంగీతం: థమన్
నిమాటోగ్రఫర్: ప్రసాద్ మూరెళ్ళ
ఎడిటర్: ప్రవీణ్ పూడి
నిర్మాతలు: సాహు గరపాటి,
1\6కథ:

భూదేవిపురంలో భూ తగాదాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఊరి పెద్ద ఆదిశేషు నాయుడు (నాజర్) వాటిని రూపుమాపాలని చాలా ప్రయత్నిస్తుంటాడు. ఆయనకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య చనిపోతుంది. మొదటి భార్యకు ఇద్దరు కూతుళ్ళు (రోహిణి, దేవదర్శిణి చేతన్).. మొదటి భార్యకు బోసు (జగపతి బాబు), జగదీష్ (నాని) సంతానం ఉంటారు. అంతా కలిసే ఉంటారు. అయితే పెద్దాయన చనిపోయిన తర్వాత బోసులో మరో కోణం బయటికి వస్తుంది. తమ ఆస్తి చినభార్య పిల్లలు అనుభవిస్తున్నారని.. బోసు అందర్నీ బయటికి పొమ్మంటాడు. అదే ఊళ్లో విఆర్‌వోగా పని చేస్తుంది గుమ్మడి వరలక్ష్మి (రీతూ వర్మ). ఆమెకు, టక్ జగదీష్‌కు మధ్య ప్రేమ నడుస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే ఆ ఊరిలో వీరేంద్ర నాయుడు (డేనియల్ బాలాజి) అనే ఓ పెద్ద మోతుబరి ఉంటాడు. రైతుల భూములు లోకల్ ఎమ్ఆర్‌ఓతో కలిసి కుమ్మక్కై లాక్కుంటాడు. ఆ భూముల్లో ఆదిశేషునాయుడు భూములు కూడా ఉంటాయి. వాటి కోసం బోసు వాళ్ళతో చేతులు కలుపుతాడు. అలాంటి సమయంలో తన కుటుంబాన్ని టక్ జగదీష్ ఎలా కాపాడుకున్నాడు అనేది అసలు కథ..

కథనం:

ఇప్పటి వరకు తెలుగులో ఎన్నో సినిమాల్లో చూసిన కథే టక్ జగదీష్. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే నాని ఈ విషయం చెప్పాడు. తమ సినిమాలో ఇప్పటి వరకు చెప్పని కథ చెప్తున్నాం.. కొత్తగా ఉంటుందని చెప్పట్లేదని.. తెలిసిన కథనే మరింత ఎమోషనల్‌గా చెప్పే ప్రయత్నం చేస్తున్నామని తెలిపాడు. నిన్ను కోరి, మజిలి లాంటి సినిమాలతో ఎమోషన్స్ బలంగా పలికిస్తాడనే పేరు తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణ.. తన దారి కాదనుకుని కమర్షియల్ యాక్షన్ జోనర్‌లోకి వచ్చి చేసిన సినిమా టక్ జగదీష్. హీరోకు టక్‌కు ఎలాంటి కనెక్షన్ ఉండదు. ఆయనకు టక్ ముట్టుకుంటే కోపం వస్తుందంతే. అందుకే ఆయనకు టక్ జగదీష్ అనే పేరు వస్తుంది. ఎప్పట్నుంచో తెలుగులో ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. ఆస్తి కోసం విడిపోయిన అన్నాదమ్ములు.. ఇద్దరు భార్యలు పిల్లలు.. వాళ్లను కలపడానికి హీరో చేసే ప్రయత్నాలు చాలా కాలంగా చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఇదే కథను మరోసారి కొత్త బాటిల్‌లో పోసి స్టైలిష్‌గా చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు శివ. ఈ ప్రయత్నంలో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యాడు ఈయన. విందు భోజనం చేద్దామని విస్తరు ముందు కూర్చున్న వాడికి.. పాచిపోయిన అన్నంలో వేడి పప్పు వేసి తిను అంటే ఎలా ఉంటుంది.. టక్ జగదీష్ అలాగే అనిపిస్తుంది. నిన్ను కోరి, మజిలీ లాంటి అద్భుతమైన సినిమాలు తీసిన శివ.. జోనర్ మార్చి తప్పు చేసాడు అనిపించింది. నాని ఈ టక్ జగదీష్ పాత్రలో తనకు తాను కొత్తగా ఊహించుకుని కథకు ఓకే అన్నాడేమో.. ఎందుకంటే నాని తప్ప ఇందులో ఏం లేదు. ఇంతకుముందు కూడా ఏమీ లేని కథలని.. అన్నీ తానై నడిపించాడు నాని. కానీ టక్ జగదీష్ లో ఆ ఛాన్స్ లేదు.

ఎందుకంటే ఎమోషన్స్ కంటే ఆస్తి గొడవలే ఎక్కువగా ఉన్నాయి ఈ సినిమాలో. ఓ పక్క ఫ్యామిలీ ఎమోషన్స్ అంటూనే.. మరోపక్క నరుక్కోవడాలు చూపించారు. ఫస్టాఫ్ లో నాని MROగా ఎంట్రీ సీన్.. సెకండాఫ్ లో పొలం ఫైట్ బాగున్నాయి. క్లైమాక్స్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ఇలా అక్కడక్కడా అనేలా తప్ప.. అంతా బాగుంది అని చెప్పలేని పరిస్థితి. ఎన్నో సినిమాల్లో వచ్చిన కథకు టక్ వేసి స్టైల్ గా తీసాడు శివ నిర్వాణ. బయట టక్ అయితే వేసాడు కానీ.. లోపల లోపాలు వదిలేసాడు. అందుకే ఎమోషనల్ జర్నీలా ఉండాల్సిన టక్ జగదీష్.. యాక్షన్.. ఎమోషన్స్ మధ్యలో ఉండిపోయాడు. జగపతిబాబు ఆస్తి కోసం మారిపోయిన తర్వాత కథను మరింత ఎమోషనల్‌గా నడిపించే ప్రయత్నంలో.. కమర్షియల్‌గా ఉండలేక.. అనుకున్నది చెప్పలేక దర్శకుడు బ్యాలెన్స్ తప్పినట్లు అనిపించింది. అప్పటి వరకు ఊళ్ళోనే ఉన్న హీరో ఉన్నఫలంగా సిటీ వెళ్లి MRO గా వెనక్కి వచ్చేస్తాడు. అదెలా అనేది ఎవరికీ అర్థం కాదు. పోనీలే అది సినిమాటిక్ లిబర్టీ అనుకుంటే.. MRO అంటే ఏదో కలెక్టర్ అన్నట్లు.. ఆయనపై ఎవరూ లేనట్లు చూపించారు. నాని ఇమేజ్ పెంచడానికి.. ఆయనకు మాస్ ఇమేజ్ తీసుకురావడానికి బలంగా రుద్దిన ప్రయత్నంలా అనిపిస్తుంది టక్ జగదీష్. గత సినిమాలతో పోలిస్తే నాని కూడా కొత్తగా మాస్ హీరోలా కనిపించాడు ఇందులో. పొలం ఫైట్ అయితే చాలా స్టైలిష్‌గా తీసారు. పాటకు ఫైట్ పెట్టడం అల వైకుంఠపురములో సినిమాను గుర్తు చేసింది. ఐశ్వర్య రాజేష్ పాత్రను సరిగ్గా వాడుకోలేదేమో అనిపించింది. అరగంటలో అయిపోయే కథను క్లైమాక్స్ వరకు ఆస్తి గొడవలుగా చూపించే ప్రయత్నం చేయడంలో ఎమోషనల్ సీన్స్ కొంతవరకు మాత్రమే వర్కవుట్ అయ్యాయి.

నటీనటులు:

నాని మరోసారి మాయ చేసాడు.. జగదీష్ నాయుడుగా కొత్తగా ఉన్నాడు.. నాని ఉన్నాడు కాబట్టి చూడొచ్చు. ఎప్పటికప్పుడు ఏ పాత్ర ఇచ్చినా తనను తాను కొత్తగా చూపించుకోడానికి ప్రయత్నిస్తాడు నాని. అందుకే ఆయన న్యాచురల్ స్టార్ అయ్యాడు. రీతూ వర్మ హీరోయిన్ అని ఎవరో ఒకరు గుర్తు చేయాలి.. అలా ఉంది ఈమె పాత్ర. జగపతిబాబు పర్లేదు. అప్పటి వరకు బాగుండి.. ఉన్నపలంగా విలనిజం షేడ్స్ బాగా చూపించాడు. చాలా రోజుల తర్వాత తమిళ నటుడు డేనియల్ బాలాజీ తెలుగులో కనిపించాడు. ఆయన విలనిజం సరిగ్గా వాడుకోలేదు. తిరువీర్ సర్ప్రైజ్ ప్యాకేజీ.. మనోడు చూడ్డానికి సాఫ్టుగా ఉన్నా కారెక్టర్ మాత్రం చాలా కఠినంగా ఉంది. ఐశ్వర్య రాజేష్ ఉన్నంతలో ఓకే. మిగిలిన వాళ్లంతా పాత్రల మేరకు పర్లేదు.

టెక్నికల్ టీం:

థమన్ పాటలు బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే పాట ఆకట్టుకుంటుంది. గోపీసుందర్ నేపథ్య సంగీతం జస్ట్ ఓకే అనిపించింది. ఆయన కంటే థమన్ ఇంకా బాగా చేసేవాడేమో..? ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అద్భుతం. సినిమా చాలా రిచ్‌గా కనిపించింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కాస్త వీక్ అనిపించింది. దర్శకుడు, ఎడిటింగ్ మధ్య ఇంకాస్త కెమిస్ట్రీ ఉండుంటే ఆకట్టుకునేది. నిర్మాణ విలువల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నాని రేంజ్ కంటే ఎక్కువగానే ఈ చిత్రం కోసం ఖర్చు చేసారు. దర్శకుడిగా ఈ యాక్షన్ జోనర్ శివ నిర్వాణకు కొత్త కానీ ప్రేక్షకులకు పాతే. నిన్ను కోరి, మజిలీ సినిమాలలో చాలా బలమైన ఎమోషన్స్‌తో కథను నడిపించాడు శివ. కానీ ఈ సారి అది కుదర్లేదు. కమర్షియల్ కోణంలో చేయబోయి.. ఇటు ఎమోషనల్ సీన్స్ కూడా గాడి తప్పాయి. నాని ఉన్నాడు కాబట్టి చూడొచ్చు అనేలా ఉంది తప్ప సినిమాగా చూస్తే టక్ జగదీష్ శివ నిర్వాణ స్థాయి సినిమా కాదు.

చివరగా ఒక్కమాట:

టక్ జగదీష్.. రొటీన్ ఫ్యామిలీ డ్రామా..

రేటింగ్: 2.75/5

వినాయక చవితి సంధర్భంగా రేపు విడుదలకు సిద్దంగా వున్న చిత్రాలు
09/09/2021

వినాయక చవితి సంధర్భంగా రేపు విడుదలకు సిద్దంగా వున్న చిత్రాలు

ఫస్ట్ లుక్: 'భవదీయుడు భగత్ సింగ్' గా పవన్ కళ్యాణ్..!పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగత...
09/09/2021

ఫస్ట్ లుక్: 'భవదీయుడు భగత్ సింగ్' గా పవన్ కళ్యాణ్..!
పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ పవర్ ఫుల్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ - ప్రీ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో టైటిల్ & ఫస్ట్ లుక్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ పవర్ ప్యాక్డ్ అప్డేట్ తో వచ్చారు. తాజాగా టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు.
పవన్ కళ్యాణ్ చిత్రానికి గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న ''భవదీయుడు భగత్ సింగ్'' అనే పవర్ ఫుల్ టైటిల్ నే మేకర్స్ ఖరారు చేసారు. వీరి కలయికలో ఇంతకముందు వచ్చిన 'గబ్బర్ సింగ్' సౌండింగ్ తో 'భగత్ సింగ్' టైటిల్ అదిరిపోయిందని.. పవర్ ఫుల్ కటౌట్ కి ఇది పవర్ ఫుల్ టైటిల్ అని పీకే ఫ్యాన్స్ అంటున్నారు. ఫస్ట్ లుక్ విషయానికొస్తే.. ఇండియా గేట్ ముందు ఓ ట్రెండీ బైక్ మీద కూర్చొని పవన్ స్టైల్ గా టీ తాగుతూ కనిపిస్తున్నాడు. పవన్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో జనసేన పార్టీ సింబల్ 'గ్లాస్' ని కూడా చూపించడంతో ఖుషీ అవుతున్నారు.
''భవదీయుడు భగత్ సింగ్ - వెండితెరపై చెరగని సంతకం. ఈసారి ఇది కేవలం వినోదం మాత్రమే కాదు'' అని చిత్ర బృందం పేర్కొంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిత్రాల టైటిల్స్ అన్నీ ఆసక్తికరంగా ఉంటున్నాయని చెప్పవచ్చు. 'వకీల్ సాబ్' 'భీమ్లా నాయక్' 'హరి హర వీరమల్లు' వంటి డిఫరెంట్ టైటిల్స్ కు తోడుగా ఇప్పుడు ''భవదీయుడు భగత్ సింగ్'' చేరింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అయానంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. ఫైట్ మాస్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ.. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ‘భీమ్లా నాయక్’ ‘హరిహర వీరమల్లు’ సినిమాలతో పాటుగా కోసం డేట్స్ కేటాయించాలని పవన్ చూస్తున్నారని సమాచారం.

bigg boss telugu5: మొదటివారం ఎలిమినేషన్‌లో ఉన్నది వీరే!హైదరాబాద్‌: నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తు...
09/09/2021

bigg boss telugu5: మొదటివారం ఎలిమినేషన్‌లో ఉన్నది వీరే!

హైదరాబాద్‌: నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. ఇటీవల మొదలైన ‘సీజన్‌5’లో మొత్తం 19మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లోకి వెళ్లారు. కాగా, మొదటివారం ఎలిమినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. తొలి వారానికి జస్వంత్‌, రవి, మానస్‌, సరయు, కాజల్‌, హమీదాలు నామినేట్‌ అయ్యారు.
‘బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండటానికి అర్హులు కాని ఇద్దరు వ్యక్తుల పేర్లు, అందుకు కారణాలు చెప్పి ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలు పెట్టండి’ అని బిగ్‌బాస్‌ సూచించారు. ఈ సందర్భంగా వ్యర్థాలను వేసే కవర్లపై హౌస్‌మేట్స్‌ ఫొటోలు ముద్రించిన బ్యాగులను ఉంచారు. ప్రతి ఒక్కరూ ఇద్దరు కంటెస్టెంట్‌లను ఎంచుకుని వారి ఫొటో ఉన్న బ్యాగును చెత్త డబ్బాలో వేయాలి. అత్యధిక మంది జస్వంత్‌ను నామినేట్‌ చేశారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారు? ఎవరు హౌస్‌లో కొనసాగతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

RC 15: ఒక్క కాన్సెప్ట్‌ పోస్టర్‌కే అంత ఖర్చు పెట్టించాడా!మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్‌ శం...
09/09/2021

RC 15: ఒక్క కాన్సెప్ట్‌ పోస్టర్‌కే అంత ఖర్చు పెట్టించాడా!

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నేడు హైదరాబాద్‌లో పూజ కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో రామ్‌చరణ్‌, కియారాలతో పాటు డైరెక్టర్‌ శంకర్‌, దిల్‌ రాజు, సునీల్‌, అంజలి, శ్రీకాంత్‌ సహా మిగిలిన కాస్ట్‌ అండ్‌ క్రూడ్‌ ఉన్నారు. ఇందులో అందరు షూట్‌ ధరించి ఫైల్స్‌తో దర్శనం ఇచ్చారు. ‘వీ ఆర్‌ కమింగ్‌’ అంటూ విడుదల చేసిన ఈ కాన్సెప్ట్‌ పోస్టర్‌ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.అంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ కాన్సెప్ట్‌ పోస్టర్‌కు శంకర్‌ బాగానే ఖర్చు పెట్టించాడట. భారీ బడ్జెట్‌తో is తెరకెక్కిస్తున్న ఈ పోస్టర్‌తో డైరెక్టర్‌ తన మార్క్‌ చూపించే ప్రయత్నం చేశాడు. దీనికోసం శంకర్‌ ఒక కోటి 73 లక్షల రూపాయలు ఖర్చు చేయించినట్లు ఫిలిం దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్క పోస్టర్‌కే ఇంత డబ్బు ఖర్చు పెట్టిస్తే ఇక సినిమా పూర్తయ్యేసరికి ఇంకేంత పెట్టిస్తారో అంటూ సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట.
కాగా ఈ సినిమాకు దిల్‌ రాజు మొత్తం రూ. 250 కోట్లు కేటాయించినట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో చరణ్‌ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా.. శ్రీకాంత్‌, సునీల్‌ అంజలి, జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీ రెగ్యూలర్‌ షూటింగ్‌ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. కాగా ఈ రోజు హైదరాబాద్‌ జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి, దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కియారా, చరణ్‌లకు చిరు క్లాప్‌ కొట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

New announcement. Coming soon..     KUMAR SANIVARAPU  ARTS  CREATIVE WORKS
30/08/2021

New announcement. Coming soon..

KUMAR SANIVARAPU
ARTS
CREATIVE WORKS

   Friday,May 7th 💥Releasing in Shade Studios,VI Stream, Airtel xtream,Mx Player & Hungama Play..6 Days to go...🔥✊ 💖    ...
01/05/2021

Friday,May 7th 💥
Releasing in Shade Studios,VI Stream, Airtel xtream,Mx Player & Hungama Play..
6 Days to go...🔥✊
💖 🕔

28/04/2021
ఇటీవల థియేటర్లలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రం ‘వకీల్‌సాబ్’. ఇప్పుడు డిజిటల్‌ మాధ్యమంలో అలరించేందుకు సిద్ధమవు...
28/04/2021

ఇటీవల థియేటర్లలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రం ‘వకీల్‌సాబ్’. ఇప్పుడు డిజిటల్‌ మాధ్యమంలో అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఏప్రిల్‌ 30 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు అమెజాన్‌ ప్రైమ్‌ ఇండియా ట్వీట్‌ చేసింది. హిందీలో విజయవంతమైన ‘పింక్‌’ రీమేక్‌గా శ్రీరామ్‌ వేణు ‘వకీల్‌సాబ్‌’ను తెరకెక్కించారు. సత్యదేవ్‌గా లాయరు పాత్రలో అదరగొట్టారు పవన్ కల్యాణ్‌. ప్రకాశ్‌ రాజ్‌, అంజలి, నివేదా థామస్, అనన్య, శ్రుతి హాసన్‌ కీలక పాత్రలు పోషించారు. దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు.

‘వకీల్‌సాబ్’ను ఓటీటీలో విడుదల చేసే విషయంలో అనేక వార్తలు వచ్చాయి. చిత్ర నిర్మాణ సంస్థ వాటన్నింటినీ ఖండించింది. అయితే, ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను మూసివేశారు. దీంతో పవన్‌ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సినిమాకు సంబంధించిన కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది.

Release date of   April 30th in     studios
27/04/2021

Release date of April 30th in studios

టాలీవుడ్‌లో మ‌రో విషాదం..ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌ను బ‌లి తీసుకున్న క‌రోనా!క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం విద్వాంసం సృష్టిస్తున్న సం...
27/04/2021

టాలీవుడ్‌లో మ‌రో విషాదం..ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌ను బ‌లి తీసుకున్న క‌రోనా!

క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం విద్వాంసం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌ని ఈ మ‌హ‌మ్మారి న‌లువైపుల నుంచి ఎటాక్ చేస్తూ.. ప్ర‌జ‌ల‌కు ఊపిరాడ‌కుండా చేస్తోంది. ఈ సెకెండ్ వైవ్‌లో సామాన్యులే కాదు.. సెల‌బ్రెటీలు కూడా క‌రోనా బారిన ప‌డుతున్నారు. కొంద‌రు ప్ర‌ముఖులు ప్రాణాలు కూడా విడిచారు.
తాజాగా టాలీవుడ్‌లో మ‌రో విషాదం నెల‌కొంది. తెలుగు సినీ డైరెక్ట‌ర్, రచయిత సాయి బాలాజీ ప్రసాద్ కరోనా కార‌ణంగా మృతి చెందారు. ఈయ‌న వ‌య‌సు 57 సంవ‌త్స‌నాలు. ఇటీవ‌లె క‌రోనా సోకిన సాయి గచ్చిబౌలిలోని టిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

శ్రీహరి, ఉదయ్ కిరణ్ లాంటి హీరోలతో సినిమాలు తెరకెక్కించిన అనుభవం ఉన్న దర్శకుడు సాయి బాలాజీ. ఇక కొన్ని సినిమాలకు రచయితగా.. మరికొన్ని సినిమాలకు స్క్రీన్‌ప్లే రైట‌ర్ గా వ‌ర్క్ చేశారు. చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన `బావగారూ బాగున్నారా!’ సినిమాకి పనిచేసిన స్క్రీన్‌ప్లే టీమ్ లో సాయి ఒకరు. అటువంటి వ్య‌క్తి క‌రోనాకు బ‌లి కావ‌డంతో తెలుగు ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కోట్లు కుమ్మరించినా వెనక్కి తగ్గని బోయపాటి శ్రీను.. అక్కడే బాలయ్య విశ్వరూపం.. సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూ...
26/04/2021

కోట్లు కుమ్మరించినా వెనక్కి తగ్గని బోయపాటి శ్రీను.. అక్కడే బాలయ్య విశ్వరూపం..
సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న అఖండ మూవీ రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకొంటున్నది. టైటిల్ మోషన్ లుక్‌తోపాటు రిలీజ్ చేసిన టీజర్ దక్షిణాదిలో అత్యథిక వ్యూస్ సాధించిన టీజర్‌గా ఓ ఘనతను సొంతం చేసుకొన్నది

2020 వేవ్ వెళ్లింది. 2021 వేవ్ కొనసాగుతోంది. మహమ్మారీ వేవ్ ప్రతిసారీ ఓటీటీలకు సాయం చేస్తోంది. ఇది ఓటీటీల పునరుద్ధరణ లేదా...
25/04/2021

2020 వేవ్ వెళ్లింది. 2021 వేవ్ కొనసాగుతోంది. మహమ్మారీ వేవ్ ప్రతిసారీ ఓటీటీలకు సాయం చేస్తోంది. ఇది ఓటీటీల పునరుద్ధరణ లేదా ప్రజా జీవనంలో మార్పును సూచించేందుకు వచ్చిన వేవ్ అని అర్థమవుతోంది. మునుముందు వినోద రంగంలో కొత్త పరిణామానికి.. సినిమా వీక్షణలో డిజిటల్ - ఓటీటీ ప్రాధాన్యతకు ఇది స్పష్ఠమైన సూచిక. సాధారణ పరిస్థితుల్లో థియేట్రికల్ ఆదరణకు కొదవ లేదని ప్రూవైనా ఓటీటీల అవసరం స్పష్ఠంగా అర్థమవుతోంది.

2020 మహమ్మారీ వేవ్ తో చాలా క్రేజీ సినిమాలను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేశారు. దీంతో ఈ వేదికపై వినోదరంగం ఆధారపడిందని అర్థమైంది. గతం ఇప్పుడు కూడా రిపీటవుతోంది. వరుసగా పలు క్రేజీ చిత్రాలు ఓటీటీ బాట పట్టనున్నాయి. ఇందులో నయనతార- త్రిష లాంటి అగ్ర కథానాయికల సినిమాలు ఉన్నాయి.

నయనతార నటిస్తున్న `నెట్రికాన్` అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది మిస్టరీ థ్రిల్లర్ .. కొరియన్ చిత్రం బ్లైండ్ కి అధికారిక రీమేక్. ఇందులో ప్రతీకారం తీర్చుకునే అంధ మహిళగా నయనాతార నటించారు. నయనతార - విఘ్నేష్ శివన్ లకు చెందిన రౌడీ పిక్చర్స్ నిర్మించగా.. అవల్ ఫేమ్ మిలింద్ రౌ ఈ చిత్రానికి దర్శకత్వం వహస్తున్నారు.

మరో స్టార్ హీరోయిన్ త్రిష నటించిన 60 వ చిత్రం `పరమపాదమ్ విలయాట్టు` ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. ఈ చిత్రం తెలుగు- తమిళ- మలయాళ భాషలలో అందుబాటులోకి వచ్చింది. త్రిష తదుపరి చిత్రం రాంగి కూడా స్ట్రీమింగ్ కి రెడీ అవుతోందని సమాచారం. ఏ.ఆర్ మురుగదాస్ రచయితగా జర్నీ ఫేం శరవణన్ దర్శకత్వంలో రూపొందిన స్త్రీ-ఆధారిత యాక్షన్ థ్రిల్లర్ ఇది. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

ప్రపంచ దేశాల్ని అట్టుడికిస్తున్న వైల్డ్ డాగ్!కోవిడ్ 19 సెకండ్ వేవ్ విదేశాల్లో స్ట్రెయిన్ రూపంలో అట్టుడికిస్తోంది. కానీ ఇ...
25/04/2021

ప్రపంచ దేశాల్ని అట్టుడికిస్తున్న వైల్డ్ డాగ్!
కోవిడ్ 19 సెకండ్ వేవ్ విదేశాల్లో స్ట్రెయిన్ రూపంలో అట్టుడికిస్తోంది. కానీ ఇప్పుడు అంతకుమించి మరొకటి అంటుకుంది. అదే కింగ్ నాగార్జున నటించిన వైల్డ్ డాగ్. ఓవైపు కోవిడ్19 కల్లోలం కొనసాగుతున్నా వైల్డ్ డాగ్ చిత్రబృందం అననుకూల పరిస్థితులలో ఈ చిత్రాన్ని వివిధ ప్రదేశాలలో చిత్రీకరించి థియేటర్లలోకి తెచ్చారు. గొప్ప రివ్యూలు అందుకుని సెకండ్ వేవ్ ప్రభావంతో బాక్సాఫీస్ వద్ద చతికిలబడిన సినిమాగా నిరాశపరిచింది. కరోనా కేసుల పెరుగుదల కారణంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయలేకపోయింది.
కానీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో నాలుగు దక్షిణ భారత భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఓటీటీల్లోనే అగ్రస్థానంలో నిలిచింది. భారతదేశంలోనే కాదు అమెరికా.. బ్రిటన్- మలేషియా- సింగపూర్ - బంగ్లాదేశ్- సింగపూర్ మరికొన్ని దేశాలలో వైల్డ్ డాగ్ ట్రెండింగ్ లో ఉంది. బాంబ్ బ్లాస్ట్స్ - తీవ్రవాదం నేపథ్యంలోని కంటెంట్ యూనివర్శల్ అప్పీల్ ని కలిగి ఉండడంతో ఇంత ఆదరణ దక్కుతోంది.
వైల్డ్ డాగ్ లో ఆకర్షణీయమైన కథనం .. హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. నాగార్జున తన అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం రెండవ వేవ్ కారణంగా ఓటీటీలకు ఆదరణ పెరిగింది. ఇది వైల్డ్ డాగ్ డిజిటల్ వీక్షణకు కలిసొస్తోంది.

ఆషిషోర్ సోలొమన్ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. థియేట్రికల్ రిలీజ్ అనంతరం కేవలం 19 రోజుల్లోనే నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. థియేట్రికల్ పరుగును నిలిపివేసిన కరోనా స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై మిలియన్ల వీక్షణలతో ఈ చిత్రం ది బెస్ట్ గా నిలిచింది. ఓటీటీలో వైల్డ్ డాగ్ బంపర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆదరణ దక్కించుకుంటోంది. ఇది నాగార్జున సహా మ్యాట్నీ టీమ్ కు పెద్ద ఊరట.

https://youtu.be/y-JLwWvK788
24/04/2021

https://youtu.be/y-JLwWvK788

Choosa Oka Hryudhayanne title song Starring Kumar KasaramKristen RavaliWritten & Directed byHarikrishna...

Shade Studios inAssociation with Kiran Kumar KamarsuPresents Video Song is releasing tomorrow at 05:04pmStay Tuned toSha...
23/04/2021

Shade Studios in
Association with Kiran Kumar Kamarsu
Presents



Video Song is releasing tomorrow at 05:04pm

Stay Tuned to
Shade Studios YouTube Channel

Starring
Kumar Kasarm
Kristen Ravali

Written & Directed by
Harikrishna Jaggurothi

Dop
Ganesh B Cinematographer

Editing & Di
Daramani

Music
Anil Miriyala

Singer
Bhagya Lakshmi

Lyrics
Harikrishna Jaggurothi

Producer
Kirankumar Kamarsu

ఈ "లాక్ డౌన్" లో మేము చూసిన నిజ సంఘటనల ఆధారంగా మేము తీసిన ఒక చిన్న ప్రయత్నం మా ఈ "మార్గ దర్శకుడు""  శ్రీ శ్రీ  శ్రీ స్వా...
12/11/2020

ఈ "లాక్ డౌన్" లో మేము చూసిన నిజ సంఘటనల ఆధారంగా మేము తీసిన ఒక చిన్న ప్రయత్నం మా ఈ "మార్గ దర్శకుడు"
" శ్రీ శ్రీ శ్రీ స్వాత్మా నరేంద్ర సరస్వతీ స్వామి"
శృంగేరీ పీఠాధిపతులు ఆశీస్సులతో
కంచి పీఠాధిపతులు ఆశీస్సులతో మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చితే కామెంట్ చేసేసి పక్కన మీ పేరు ఉరి పేరు రాయండి ...... నచ్చితే నలుగురికి పంపండి.......
"దైవం మానుషు రూపేణా"
https://youtu.be/-N6BkBjOL8E

Anirudh Ravichander Album Velai Illa Pattadhaari (Original Sound Track) Licensed to YouTube by One Stop Music Bhd Malaysia (on behalf of Divo); ASCAP, and 1 ...

Congratulations Sinivarapu ManiKanta Kumar garu after long gap comeback as a director and thankyou very much  giving a o...
29/09/2020

Congratulations Sinivarapu ManiKanta Kumar garu after long gap comeback as a director and thankyou very much giving a opportunity to in DRSAKUDU and all the best whole team and. Once again Trinetra Creativeworks proudly presents...
#మార్గ దర్శకుడు title logo

: devi Varma
# director : Sinivarapu ManiKanta Kumar
# Trinetra Creativeworks

HAPPY BIRTHDAY "POWER STAR"   .M RATHNAM
02/09/2020

HAPPY BIRTHDAY "POWER STAR"


.M RATHNAM

ప్రభాస్ 22 ప్రకటనతో ఫ్యాన్స్ కి బిగ్ షాక్డార్లింగ్ ప్రభాస్ వరుసగా షాక్ ల మీద షాక్ లిస్తున్నాడు. మొన్నటికి మొన్న నాగ్ అశ్...
18/08/2020

ప్రభాస్ 22 ప్రకటనతో ఫ్యాన్స్ కి బిగ్ షాక్డార్లింగ్ ప్రభాస్ వరుసగా షాక్ ల మీద షాక్ లిస్తున్నాడు. మొన్నటికి మొన్న నాగ్ అశ్విన్-అశ్వనిదత్ బృందంతో కలిసి ప్రభాస్ 21 ప్రకటన వెలువరించగానే అంతా ఆశ్చర్యపోయారు. నిప్పు పొగ లేకుండానే.. ఇంత స్పీడ్ చూపించాడు! అంటూ ఫ్యాన్స్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ప్రభాస్ 21లో కథానాయికగా దీపిక పదుకొనేని ఎంపిక చేసి ఆ వెంటనే మరో షాకిచ్చారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో మునుపెన్నడూ చూడని విజువల్ ఫీస్ట్ ని తెరకెక్కిస్తామని ప్రకటించారు.

తాజాగా మరో ఊహించని షాక్. గత కొంతకాలంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డార్లింగ్ ప్రభాస్ తో ఓ సినిమాని చేయనున్నారని ప్రచారమైంది. ఎట్టకేలకు అది కాస్తా అధికారికంగా కన్ఫామ్ అయ్యింది. ప్రభాస్ 22 వ చిత్రాన్ని ఓంరౌత్ తెరకెక్కిస్తారు.
దీనిపై తాజా ప్రకటనతో ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశ్చర్యపోయారు. `A- ఆదిపురుష్` పేరుతో భారతదేశంలో నెవ్వర్ బిఫోర్ అనేంత అత్యంత భారీగా ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. A అనే సింగిల్ లెటర్ టైటిల్ అంతర్జాతీయ రిలీజ్ ని దృష్టిలో ఉంచుకుని ఫిక్స్ చేశారని అర్థమవుతోంది.ఆదిపురుష్ కథాంశం `రామాయణం` ఇతిహాసంపై ఆధారపడినది. ప్రభాస్ అందులో రాముడి పాత్రను పోషించనున్నారు. 3 డి ఫార్మాట్ లో .. హైఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ తో నెవ్వర్ బిఫోర్ విజువల్ ఫీస్ట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ ప్రాజెక్ట్ 2021 లో సెట్స్ పైకి వెళ్లి.. 2022 లో విడుదలవుతుంది ప్రధాన విలన్ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటుల పేర్లను పరిశీలిస్తున్నారు.

ఈ చిత్రం హిందీ-తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుంది. అంతర్జాతీయంగా విడుదల కోసం అనేక విదేశీ భాషల్లోకి అనువదించనున్నారు. దీంతో పాటు తమిళం..మలయాళం .. కన్నడ భాషలలో కూడా అనువదించనున్నారని తెలుస్తోంది. ఓమ్ రౌత్ నిర్మాణ సంస్థ సహకారంతో టీ-సిరీస్ కు చెందిన భూషణ్ కుమార్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. దాదాపు 500కోట్ల మేర బడ్జెట్ ని వెచ్చించనున్నారని అంచనా వేస్తున్నారు.

టాలీవుడ్ యువరాజు.. సుపర్‌స్టార్ మహేష్ బాబు నేటితో 45వ వసంతంలోకి అడుగుపెడుతున్నారుHappy Birthday Mahesh Babu: టాలీవుడ్ యు...
09/08/2020

టాలీవుడ్ యువరాజు.. సుపర్‌స్టార్ మహేష్ బాబు నేటితో 45వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు
Happy Birthday Mahesh Babu:
టాలీవుడ్ యువరాజు.. సుపర్‌స్టార్ మహేష్ బాబు నేటితో 45వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్‌ ప్రముఖ టాప్ హీరోలల్లో మహేష్ బాబు ( Mahesh Babu ) ఎప్పుడూ ముందుంటారు. ఆయన నటనకు, మంచితనానికి ఎవ్వరైనా సరిలేరు నీకెవ్వరు అనాల్సిందే. అలాంటి హీరో పుట్టినరోజు ఎవ్వరికైనా పండగే.. కావున అందరూ సోషల్ మీడియా వేదిక ద్వారా మహేశ్ బాబుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య నమ్రత, రామ్ చరణ్, గోపిచంద్, హరిశ్ శంకర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Mana chithralu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mana chithralu:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share