99 update news

  • Home
  • 99 update news

99 update news Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from 99 update news, Media/News Company, .

27/10/2021
99 update news.*గుంటూరు*  *ఇన్సూరెన్స్ వస్తుందని.. బెంజికారును తగులబెట్టిన యజమాని* ఇన్సూరెన్స్ కోసం ఏకంగా కారుపై పెట్రోల...
22/07/2021

99 update news.

*గుంటూరు*

*ఇన్సూరెన్స్ వస్తుందని.. బెంజికారును తగులబెట్టిన యజమాని*

ఇన్సూరెన్స్ కోసం ఏకంగా కారుపై పెట్రోల్ పోసి తగులపెట్టాడు యజమాని. ఈ సంఘటన రెంటచింతల మండలం రెంటాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రవీంద్రారెడ్డి పదకొండు నెలల క్రితం బెంజ్కారు కొనుగోలు చేసాడు. అయితే డ్రైవర్ కారు తాళాలు పోగ్గొటాడు. తాళాలను షోరూమ్‎లో వెతికిన దొరకకపోవడంతో సెకండ్ హ్యాండ్ తాళం కూడా దొరకలేదు. దీంతో కారును తగులబెడితే ఇన్సురెన్స్ వస్తుందని స్నేహితుల ద్వారా సలహా తీసుకున్నాడు. ఈ నెల 18న పెదకాకాని వద్దకు కారును తరలించి కారుపై యజమాని రవీంద్రారెడ్డి పెట్రోల్ పోసాడు. తన స్నేహితుడు కారుకు నిప్పు పెట్టాడు. నిప్పంటించిన వెంటనే కారులోంచి ఒక్కసారిగా మంటలు రావడంతో నాగరాజుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి.. ముగ్గురినీ అరెస్ట్ చేసి పెదకాకాని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

99 update news.*మనుషుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం తక్కువే!*భారతదేశంలో వైరస్ లు భయాన్ని సృష్టిస్తున్నాయి. కరోనా మొదటి వే...
22/07/2021

99 update news.
*మనుషుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం తక్కువే!*

భారతదేశంలో వైరస్ లు భయాన్ని సృష్టిస్తున్నాయి. కరోనా మొదటి వేవ్ ముగిసిపోయి..సెకండ్ వేవ్ కొనసాగుతుండగా..త్వరలోనే థర్డ్ వేవ్ ముంచుకొస్తుందని నిపుణులు హెచ్చరిస్తుండడంతో ప్రజలు హఢలిపోతున్నారు. వీటికి తోడు..ఇతర వైరస్ లు కూడా పంజా విసురుతున్నాయి. అందులో 'బర్డ్ ఫ్లూ' ఒకటి. భారతదేశంలో ఈ వైరస్ బారిన పడి ఒకరు చనిపోయారనే వార్త కలకలం సృష్టించింది.
హర్యానా రాష్ట్రానికి చెందిన 11 నెలల బాలుడు బర్డ్ ఫ్లూ సోకి..ఢిల్లీ ఎయిమ్స్ లో చనిపోయారని వార్తలు వెలువడ్డాయి. దీంతో ఒక్కసారిగా ప్రజల్లో భయం నెలకొంది. బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు కూడా సోకుతుందా ? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. బర్డ్ ఫ్లూ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకే అవకాశం చాలా అరుదని వెల్లడించారు.
ఇందులో భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. H5N1 వైరస్ పక్షుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందడం చాలా అరుదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే..ఫౌల్ట్రీల్లో పనిచేసే వారందరూ జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఇప్పటి వరకు మనుషుల నుంచి మనుషులకు సంక్రమించినట్లు ఆధారాలు లేవని వేవియన్స్‌లోని మెడిసిన్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ గా ఉన్న డాక్టర్‌ నీరజ్‌ నిశ్చల్‌ వెల్లడించారు. అధిక ఉష్టోగ్రత వద్ద ఆహారం వండిన సమయంలో వైరస్ చచ్చిపోతుందని, గతంలో ఫౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైన సమయంలో ప్రారంభంలోనే వైరస్ వ్యాప్తిని నివారించడం జరిగిందని ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపారు.

99 update news.*గోదావరి ఉగ్రరూపం.. నీటమునిగిన సీతమ్మ విగ్రహం*భద్రాచలం జూలై 22 ( నందిధాత్రిక ) ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల...
22/07/2021

99 update news.
*గోదావరి ఉగ్రరూపం.. నీటమునిగిన సీతమ్మ విగ్రహం*

భద్రాచలం జూలై 22 ( నందిధాత్రిక ) ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో భద్రాద్రి దుమ్ముగూడెం వద్ద గోదావరినది ఉగ్రరూపం దాల్చింది. ఎస్సారెస్సీ ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉప్పొంగుతోంది. గురువారం ఉదయం నుంచి భద్రాద్రి వద్ద భారీగా నీటిమట్టం పెరుగుతోంది. ఈ క్రమంలో, పర్ణశాలలో స్వామివారి నారచీరలు ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. అటు, సీతమ్మ వారి విగ్రహం, స్వామివారి సింహాసనం కూడా మునిగిపోయాయి. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో మరో 48 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో, గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

99 update news.ఈరోజు ప్రకాశం జిల్లా చీరాల NRPM హైస్కూల్ వద్ద గల OAT లో “వైయస్ఆర్ కాపు నేస్తం “ కార్యక్రమం జరిగింది.ఈ వైఎ...
22/07/2021

99 update news.

ఈరోజు ప్రకాశం జిల్లా చీరాల NRPM హైస్కూల్ వద్ద గల OAT లో “వైయస్ఆర్ కాపు నేస్తం “ కార్యక్రమం జరిగింది.ఈ వైఎస్సార్ కాపు నేస్తం కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు *కరణం బలరామకృష్ణ మూర్తి* గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు డాక్టర్ పాలేటి రామారావు గారు,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి గారు,నియోజకవర్గ ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ రెడ్డి గారు,దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్రగారు,మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుగారు,కమీషనర్ మల్లేశ్వరరావు గారు,వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబుగారు,వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కౌన్సిలర్లు మించాలా సాంబశివరావుగారు,కీర్తి వెంకట్రావుగారు,భతుల అనీల్ గారు,కంపా అరుణ్,చీమకుర్తి బాలకృష్ణగారు,గుంటూరు ప్రభాకర్ గారు,దాసరి శారదా గారు,గొట్టిపాటి ఎబునేజర్ గారు,చిన్ని లీలాగారు,మళ్లీ రామకృష్ణ గారు,నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్,మున్సిపల్ కమిషనర్,చీరాల,వేటపాలెం మండలం ఎంపీడీవోలు, అధికారులు తదితర నాయకులు పాల్గొన్నారు.

*అమరావతి:*99 update news *రాష్ట్ర విపత్తుల  నిర్వహణ శాఖ**ఐఎండి సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది**ద...
22/07/2021

*అమరావతి:*

99 update news

*రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ*

*ఐఎండి సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది*

*దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఈ రోజు విస్తారంగా వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు*

*రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీవర్షాలు*

*కోస్తాంధ్రలో రేపు అక్కడక్కడ భారీ వర్షాలు*

*మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు*

*తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వేగంతో గాలులు*
*సముద్రం అలజడిగా ఉంటుంది*

*మత్స్యకారులు శనివారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు*

*లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*

*- కె. కన్నబాబు, కమిషనర్ విపత్తుల శాఖ*

22/07/2021

*మీ ఆటలు సాగయ్*
*ఓటు మాదే*
*సీటు మాదే*
*బరాబర్ వస్తం*
*బహుజన రాజ్యాధికారం తెస్తం*

*బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా...*
*HMTV తో RSP*
*దమ్మున్న నాయకుడి మాటల్లో*

*HMTV ఎడిటర్ అడిగిన ప్రతీప్రశ్నలకు సమాధానం...*

*ఈరోజు సాయంత్రం6:30pm**

*ఏపీ...*99 update news*_రేపు ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు_* _సా.4 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి సురేష్‌ ఫలితాలను ఆన...
22/07/2021

*ఏపీ...*99 update news

*_రేపు ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు_*
_సా.4 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి సురేష్‌ ఫలితాలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఆప్షన్‌_

Today god message
22/07/2021

Today god message

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when 99 update news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share