23/05/2025
కదం తొక్కిన చింతమనేని అల్ట్రా మోడిఫైడ్ టయోటా లెజెండర్ కారు
Telugu Desam Party (TDP)
- ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అందరిని ఆకర్షించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి కొత్త కారు - హనుమాన్ జయంతిని పురస్కరించుకుని అప్పన్న వీడు లోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కొత్త కారుతో దూసుకెళ్లిన చింతమనేని గారి కాన్వాయ్ - సైకిల్ బ్రాండ్ నే కార్ బ్రాండ్ నేమ్ గా మార్చి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో , పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమంలో చెరగని ముద్ర వేసిన తెలుగుదేశం పార్టీ సింబల్ అయిన సైకిల్ గుర్తును కారు టాప్ పై వేయటంతో పాటు అనేక రకాలుగా కార్ ను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారే సూచనలు ఇచ్చి ఈ అల్ట్రా మోడిఫైడ్ కార్ ను తీర్చిదిద్దించారు. కడపలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి ఈ ప్రత్యేక కార్ లోనే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు వెళ్లనుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఆసక్తి నెలకొంది...