Forth Front Media

  • Home
  • Forth Front Media

Forth Front Media Forth Front Media provides Latest News On Business, Politics, Sports, Entertainment & Much More From India And Around The World.

జనం మనిషి జనంలో జనం లాగా ఉండే మనిషి మన  #తెలంగాణ_శాసన_మండలి చైర్మన్ శ్రీ  #గుత్తా_సుఖేందర్_రెడ్డి (Gutha Sukender Reddy)...
04/03/2021

జనం మనిషి జనంలో జనం లాగా ఉండే మనిషి మన #తెలంగాణ_శాసన_మండలి చైర్మన్ శ్రీ #గుత్తా_సుఖేందర్_రెడ్డి (Gutha Sukender Reddy) గారు మరియు వారి శ్రీమతి #అరుంధతి రెడ్డి గారి ప్రత్యేక #ఇంటర్వ్యూ hmtvలో.......

For Video Visit: https://youtu.be/5MQK55DSpU4

For latest updates on , and Subscribe to our channel: https://www.youtube.com/c/forthfrontmedia

HMTV Live

06/12/2020

బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు ఉన్నప్పుడు " #శ్రీకాళహస్తి" అంటే ఒక బ్రాండ్ గా ఉండేది. కరోనాపై చర్చ సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి లోకేష్, చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాటికీ ధీటుగా శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, బొజ్జల సుధీర్ రెడ్డి గారు "అసెంబ్లీ అంటే ప్రజల సమస్యల గురించి చర్చించి హుందాగా ఉండాలి. కానీ మీలాగా వెకిలి చేష్టలు చేయడానికి కాదు" అని అన్నారు.

For latest updates on Entertainment, News and Music Subscribe to our channel: https://www.youtube.com/channel/UCrifeVRO4_aeC2pfJw1D8aQ

 #ఢిల్లీలో లీటర్  #పెట్రోల్ ధర 24 పైసలు పెరిగి రూ. 82కి చేరింది. లీటర్  #డీజిల్ ధర రూ 27  పైసలు పెరిగి రూ. 72 కు చేరుకుం...
01/12/2020

#ఢిల్లీలో లీటర్ #పెట్రోల్ ధర 24 పైసలు పెరిగి రూ. 82కి చేరింది. లీటర్ #డీజిల్ ధర రూ 27 పైసలు పెరిగి రూ. 72 కు చేరుకుంది. కాగా... గత తొమ్మిది రోజుల్లో ఇంధన ధరలు పెరగడం ఇది ఎనిమిదవ సారి. అంతకుముందు ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ. 82.13 ఉండగా... డీజిల్ ధర రూ. 71.86. గత తొమ్మిది రోజుల్లో లీటరు పెట్రోలు మొత్తంగా రూ. 1.07, డీజిల్ రూ. 1.67 పెరిగాయి. #కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళించినప్పటి నుంచి రిటైల్ ధరల్లో నెలకొన్న అస్థిరతను నివారించే క్రమంలో చమురు కంపెనీలు ధరలను క్రమబద్దీకరిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. అయితే... గత పది రోజులుగా మాత్రం ధరల్లో పెరుగుదల మాత్రమే చోటుచేసుకుంటూ రావడం గమనార్హం.

For latest updates on Entertainment, News and Music Subscribe to our channel: https://www.youtube.com/channel/UCrifeVRO4_aeC2pfJw1D8aQ

ఇన్‌సైడర్  #ట్రేడింగ్ విషయంలో  #ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ సహా పలువురిపై మార్కెట్ నియంత్రణ సంస్థ(సెబి...
01/12/2020

ఇన్‌సైడర్ #ట్రేడింగ్ విషయంలో #ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ సహా పలువురిపై మార్కెట్ నియంత్రణ సంస్థ(సెబి) నిషేధం విధించింది. సెక్యూరిటీ మార్కెట్‌లో రెండేళ్ల పాటు ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పన్నెండేళ్ళ నాటి ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో ఆయాచితంగా రూ. 16.97 కోట్ల మేర వీరు లబ్ధి పొందినట్లు వెల్లడైన విషఐయం తెలిసిందే. ఈ క్రమంలో... సెబి ఈ నిర్ణయం తీసుకుంది. కాగా... ఈ నిర్ణయంపై ఎన్డీటీవీ అప్పీలుకు వెళ్ళనుంది. 2006 సెప్టెంబర్ నుంచి 2008 జూన్ మధ్య కాలంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి... నిబంధనలను ఉల్లఘించినట్లు గుర్తించామని, ఈ క్రమంలోనే ప్రమోటర్ల పై ఈ చర్యలు తీసుకున్నామని సెబి వెల్లడించింది. నాటి కేసులో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి, ఆర్జించిన రూ. 16.97 కోట్లను వాపస్ చేయాలని వారికి ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా... కంపెనీ ఈ ఆరోపణలను ఖండించింది. సెబి ఆదేశాలను తక్షణం సవాలు చేస్తామని ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ తెలిపారు. ఎన్డీటీవీ షేర్లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన మరో ఏడుగురు వ్యక్తులు, సంస్థల పై కూడా సెబి ఏడాది నుండి రెండేళ్ల పాటు సెబి నిషేధం విధించింది. ఇందులో విక్రమాదిత్యచంద్ర, ఈశ్వరిప్రసాద్ బాజపాయి, సౌరవ్ బెనర్జీ, సంజయ్ దత్ సతీమణి ప్రణీత దత్, క్వాంటం సెక్యూరిటీస్, ఎస్ఏఎల్ రియల్ ఎస్టేట్, తాజ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్ ఉన్నాయి. వడ్డీతో సహా చెల్లించాలి... 2006 సెప్టెంబరు నుంచి 2008 జూన్ మధ్య కాలంలో ఎన్డీటీవీ షేర్లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు దర్యాఫ్తులో వెల్లడైంది. కంపెనీ పునర్నిర్మాణానికి సంబంధించి చర్చలు 2007 సెప్టెంబరు 7నప్రారంభమయ్యాయి. కాగా... 2008 ఏప్రిల్ 16 న ఈ నిర్ణయం వెలువడింది. అయితే ప్రణయ్, రాధికలు 2008 ఏప్రిల్ 17 న షేర్ల విక్రయం ద్వారా కోట్లాది రూపాయల లాభం పొందినట్లు దర్యాఫ్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలు వెలువడ్డాయి. 2008 ఏప్రిల్ 17 నుండి ఆరు శాతం వడ్డీతో ఈ మొత్తాన్ని చెల్లించాలని సెబి ఆదేశాల సారాంశం.

For latest updates on Entertainment, News and Music Subscribe to our channel: https://www.youtube.com/channel/UCrifeVRO4_aeC2pfJw1D8aQ

కేంద్ర బడ్జెట్ ఖర్చులు  #అక్టోబరు నెలలో 9.5 శాతం మేర పెరిగాయి. కాగా సెప్టెంబరులో 26 శాతం క్షీణించిన విషయం తెలిసిందే. కాగ...
01/12/2020

కేంద్ర బడ్జెట్ ఖర్చులు #అక్టోబరు నెలలో 9.5 శాతం మేర పెరిగాయి. కాగా సెప్టెంబరులో 26 శాతం క్షీణించిన విషయం తెలిసిందే. కాగా... 2020-21 ఆర్థిక సంవత్సరంలో వార్షిక వ్యయ వృద్ధి బడ్జెట్ 13.2 శాతంగా ఉంటుందని అంచనా. ఏప్రిల్-అక్టోబరు మధ్య గణాంకాలు రెండు శాతం క్షీణించినట్లు కనిపించినప్పటికీ అక్టోబరులో రూ. 31,519 తో కాపెక్స్ 130 శాతం పెరిగింది. ఏప్రిల్-అక్టోబరులో నికర పన్ను ఆదాయం సంవత్సరానికి 16 శాతం మేర తగ్గింది. ఈ నేపధ్యంలో #ద్రవ్యలోటు బడ్జెట్‌లో అంచనా వేసిన రూ. 8 లక్షల కోట్ల కంటే రెట్టింపు ఉంటుందని భావిస్తున్నారు. ఏప్రిల్-అక్టోబరు ఆర్థిక లోటు లక్ష్యంతో 119.7 శాతంగా ఉంది. పన్ను ఆదాయం రూ. 2.6 లక్షల కోట్లు తగ్గవచ్చు... అన్‌లాక్ నేపధ్యంలో దేశ #ఆర్థికవ్యవస్థ క్రమంగా పుంజుకుంటున్నప్పటికీ పన్ను వసూళ్లు లక్ష్యం కంటే రూ. 2.6 లక్షల కోట్ల మేర తగ్గవచ్చని ఆర్థిక శాఖ అధికారులు బుతున్నారు. బడ్జెట్‌లో పన్ను వసూళ్ల లక్ష్యం రూ. 24.23 లక్షల కోట్లుగా ఉంది.

గత ఆర్థిక సంవత్సరానికి పన్ను వసూళ్ల మొత్తానికి సమానంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వసూలైనపక్షంలో ఫరవాలేదని, అయితే... అంతకంటే తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నామని చెబుతున్నారు. కాగా... 2019-230 స్థూల పన్ను వసూళ్ల సవరించిన అంచనా రూ. 21.63 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో వసూలైన రూ. 20.10 లక్షల కంటే ఇది 7.6 శాతం ఎక్కువ. 2020.21 లో మొదటి అర్ధ సంవత్సరంలో పన్ను మొత్తం రూ. 7.21 లక్షల కోట్లుగా ఉంది. గతేడాది ఇదే కాలంలో వసూలైన మొత్తం కంటే 21.6 శాతం మేర తక్కువ. పన్ను వసూళ్ల అంచనాలు సవరించవచ్చు... #కరోనా కారణంగా మార్చి చివరి వారం నుండి దాదాపు మూడు నెలల పాటు దేశమంతా లాక్ డౌన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో... పన్ను వసూళ్ల లోటు గతంలో అంచనా వేసినంతగా ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. 2019-20 అదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో పన్ను ఆదాయం 32.6 శాతం, జూలై-సెప్టెంబరు కాలంలో 13.1 శాతం తగ్గింది.

For latest updates on Entertainment, News and Music Subscribe to our channel: https://www.youtube.com/channel/UCrifeVRO4_aeC2pfJw1D8aQ

మీకు  #బ్యాంక్ ఖాతా ఉందా ? ఉంటే... కచ్చితంగా ఓ విషయం తెలుసుకోవాలి. బ్యాంక్‌ మనీ ట్రాన్స్‌ఫర్ అంశానికి సంబంధించి కొత్త ని...
01/12/2020

మీకు #బ్యాంక్ ఖాతా ఉందా ? ఉంటే... కచ్చితంగా ఓ విషయం తెలుసుకోవాలి. బ్యాంక్‌ మనీ ట్రాన్స్‌ఫర్ అంశానికి సంబంధించి కొత్త నిబంధనలు #మంగళవారం నుంచే అమల్లోకి రాబోతున్నాయి.

ఖాతాదారరులకు ప్రయోజనం...

డిజిటల్ పేమెంట్స్‌ను పెంచాలనే ఉద్దశంతో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా( #ఆర్‌బీఐ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో... రేపటి నుంచి అంటే డిసెంబరు 1(మంగళవారం) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ క్రమంలో... బ్యాంకు ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. వివరాలిలా ఉన్నాయి.
రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్(ఆర్టీజీఎస్) సేవలను రోజంతా అందుబాటులోకి తీసుకురావాలని ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం... రేపటి(డిసెంబరు ఒకటి) నుంచి అమలు కానుంది. ఈ క్రమంలో... ఆర్‌టీజీఎస్ సేవలు #బ్యాంకుఖాతాదారులకు నిరంతరం అందుబాటులో ఉండనున్నాయి.

ప్రస్తుతం #ఆర్‌టీజీఎస్ సేవలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదికూడా... పనిదినాల్లో మాత్రమే ఈ సేవలను పొందగలుగుతారు. కనీసం రూ. 2 లక్షల మొత్తాన్ని ఆర్‌టీజీఎస్ విధానం ద్వారా పంపించాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు. సాధారణంగా బ్యాంకులు రూ. 10 లక్షల వరకు లిమిట్ పెట్టుకుంటాయి.

ఇకపోతే... ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ వంటి పద్ధతుల్లో #డబ్బు పంపేందుకుగానూ ఎలాంటి చార్జీలూ లేకుండా ఆన్‌లైన్‌లో పంపించుకోవచ్చు. ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు ‘నగదు బదిలీ’ చేసుకోవచ్చు. అయితే... బ్యాంకుకు వెళ్ళే నగదు బదిలీ చేయాలని భావిస్తే మాత్రం చార్జీలను చెల్లించుకోవాల్సి ఉంటుంది.

For latest updates on Entertainment, News and Music Subscribe to our channel: https://www.youtube.com/channel/UCrifeVRO4_aeC2pfJw1D8aQ

 #మంత్రి పేర్ని నానిపై  #హత్యాయత్నం జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఈ దాడి ఘటన... సంచలనంగా మారింది. తాపీ తో దాడ...
30/11/2020

#మంత్రి పేర్ని నానిపై #హత్యాయత్నం జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఈ దాడి ఘటన... సంచలనంగా మారింది. తాపీ తో దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేసాడు. అయితే ఈ షాక్ నుంచి వెంటనే తేరుకున్న మంత్రి నాని... అతడిని పట్టుకుని అనుచరులు, పోలీసుల కు అప్పగించారు. మచిలీపట్నంలోని మంత్రి నివాసంలోనే ఈ దాడి జరిగింది. #పోలీసులు అతనిని స్టేషన్ కు తరలించారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల మంత్రి తల్లి మరణించగా అప్పటి నుంచి ఆయన ఇంట్లోనే ఉంటూ వచ్చారు. మంత్రి విధులకు కూడా కొన్ని రోజుల నుంచి దూరంగానే ఉన్నారు. కాగా ఏపీలో భవన నిర్మాణ కార్మికులు గత కొన్ని రోజుల నుంచి ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఘటన నేపధ్యంలో పలువురు మంత్రులు, స్నేహితులు ఆయనను పరామర్శించారు.

For latest updates on Entertainment, News and Music Subscribe to our channel: https://www.youtube.com/channel/UCrifeVRO4_aeC2pfJw1D8aQ

 #హైదరాబాద్ లో ప్రధాని మోదీ ‘వ్యాక్సిన్‌ టూర్‌’ ముగిసింది. హైదరాబాద్ కన్నా ముందు ఈ రోజు ఉదయం అహ్మదాబాద్‌లోని మోదీ జైడస్‌...
30/11/2020

#హైదరాబాద్ లో ప్రధాని మోదీ ‘వ్యాక్సిన్‌ టూర్‌’ ముగిసింది. హైదరాబాద్ కన్నా ముందు ఈ రోజు ఉదయం అహ్మదాబాద్‌లోని మోదీ జైడస్‌ క్యాడిలా బయోటెక్‌ పార్క్‌ను ఆయన సందర్శించారు. ఈ సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్‌-డి టీకా ప్రయోగాలను గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. పీపీఈ కిట్‌ ధరించి వ్యాక్సిన్‌ ప్రయోశాలను మోదీ పరిశీలించారు. ఆ తర్వాత... అహ్మదాబాద్‌ నుంచి ప్రధాని నేరుగా హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని… రోడ్డు మార్గం ద్వారా జీనోమ్‌వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ సంస్థకు చేరుకున్నారు. ఈ క్రమంలో... కోవాగ్జిన్‌ ప్రయోగాలను పరిశీలించారు. వ్యాక్సిన్‌ మూడోదశ ప్రయోగాలపై భారత్‌ బయోటెక్‌ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు.

For latest updates on Entertainment, News and Music Subscribe to our channel: https://www.youtube.com/channel/UCrifeVRO4_aeC2pfJw1D8aQ


వాహన కొనుగోలుదారులకు త్వరలో తీపికబురు అందనుంది.వాహన కొనుగోళ్ళకు సంబంధించి  మోదీ ప్రభుత్వం కొత్త నిబంధనలను తెచ్చేందుకు సి...
30/11/2020

వాహన కొనుగోలుదారులకు త్వరలో తీపికబురు అందనుంది.వాహన కొనుగోళ్ళకు సంబంధించి మోదీ ప్రభుత్వం కొత్త నిబంధనలను తెచ్చేందుకు సిద్ధమవుతోంది. కాగా... ఈ నేపధ్యంలో... వాహన సొంతదారులు తేలికగానే మారిపోవచ్చు. ఈ క్రమంలో... వాహనాల కొనుగోలుదారులు, విక్రయదారులకు వెసులుబాటు కలగనున్నట్లు భావిస్తున్నారు. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.

వాహనాన్ని మరొకరి పేరు పైకి తేలికగా మార్చుకోవచ్చు. ఇందుకు సంబంధించి మోదీ సర్కారు ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రోడ్డు రవాణ జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ... సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989కు సవరణ చేయాలని ప్రతిపాదించింది.

కాగా... సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ ఇప్పటికే జారీ అయిన విషయం తెలిసిందే. కొత్త చట్టం అమలైనపక్షంలో... వాహనాలకు కూడా ‘నామినీ’ ఫెసిలిటీ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. వెహికల్ రిజిస్ట్రేషన్ సమయంలో.. యజమానితోతోపాటు నామినీ పేరును కూడా చేర్చేలా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే కాకుండా తర్వాత కూడా నామినీ పేరును చేర్చేలా వెసులుబాటు అందుబాటులో ఉండవచ్చని సమాచారం. ఆన్‌లైన్‌లోనే నామినీని యాడ్ చేసుకోవచ్చని తెలుస్తోంది.

ఇక... కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినపక్షంలో... వాహన సొంతదారు మరణించినప్పుడు ఆ వాహనాన్ని సులభంగానే నామినీ పేరు పైకి మార్చుకోవచ్చు. యజమాని మరణ ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తే సరిపోతుంది. ఆ క్రమంలో... నామినీ పేరు పైకి వాహనం మారిపోతుంది. ఒకవేళ నామినీ పేరు లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైనా... వాహన యజమానికి చట్టపరమైన వారసులమని తామేనన్న విషయాన్ని తెలియజేసే ఆధారాలను అందించాల్సి ఉంటుంది.

For latest updates on Entertainment, News and Music Subscribe to our channel: https://www.youtube.com/channel/UCrifeVRO4_aeC2pfJw1D8aQ

ఓవైపు  #నివర్‌  #తుఫాన్‌ ప్రభావం కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కుండపోత  #వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో  ...
29/11/2020

ఓవైపు #నివర్‌ #తుఫాన్‌ ప్రభావం కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కుండపోత #వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో #వాగులు వంకలు పొంగిపొర్లుతుంటే… మరోవైపు #నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లక్షల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నివర్‌ తుఫాను సృష్టించిన బీభత్సం నేపధ్యంలో ఎడతెరపి లేని వర్షాలు పలు జిల్లాలను ముంచెత్తాయి. లక్షల ఎకరాల్లో పంటను నీటిపాలు చేసాయి. ఈ క్రమంలో... వేలాది మందిని నిరాశ్రయులుగా మారాల్సి వచ్చింది. భారీ వరదల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా #చిత్తూరు, #నెల్లూరు, #కడప జిల్లాలపై నివర్‌ తపాన్‌ తీవ్ర ప్రభావాన్ని చూపించింది.

వాస్తవానికి నివర్ తుపాను తమిళనాడులో తీరం దాటినప్పటికీ దాని ప్రభావం #ఆంధ్రప్రదేశ్ లో కూడా తారస్థాయిలో కనిపించింది. చలిగాలుల తీవ్రతతో జనం అతలాకుతలమయ్యారు. పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో పల్లపు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసాయి.

#ప్రకాశం, #గుంటూరు, #కృష్ణా, ఉభయ #గోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదయ్యింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. #వరి, #ప్రత్తి, #వేరుశనగ పంటలు ఎక్కువ నష్టపోయాయి. రవాణా వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది.

జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. నెల్లూరు-చెన్నై మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. #తిరుమల ఆలయ ప్రాంగంణంలోకి కూడా వరద నీరు చేరింది. ఘాట్ రోడ్లో పలు చోట్ల రాళ్లు పడ్డాయి. మరోవైపు #సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాగా... ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది. వర్షాల ప్రభావం తగ్గిన తర్వాత పంట నష్టం అంచనా వేస్తామని చెబుతోంది.

తీరం దాటిన తర్వాత ఏపీకి తాకిడి...
తుపాను తీరం దాటిన తర్వాత ఏపీ లో ఎక్కువ ప్రభావం కనిపించింది. నివర్ శుక్రవారం ఉదయానికి దాదాపుగా బలహీనపడి అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ ప్రకటించింది.

అయితే, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో 55-75కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షపాతం నమోదుకావడంతో తీవంగా నష్టం జరిగింది. ఏపీలోని 293 మండలాల్లో గురువారం 10 మిల్లీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైంది. వీటిలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని అన్ని మండలాలూ ఉన్నాయి. కడప జిల్లా రైల్వేకోడూరులో అత్యధికంగా 280, నెల్లూరు జిల్లా కోట మండలంలో 247, వెంకటగిరిలో 235, బాలాయపల్లిలో 230, డక్కిలిలో 214 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

తిరుమలలో...
తుపాను కారణంగా చిత్తూరు జిల్లావ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదయ్యింది. ఈ క్రమంలో... తిరుమల ఆలయ ప్రాంగంణం కూడా వరదనీటిమయమైంది. పాపవినాశనం, ఘాట్‌రోడ్లతోపాటు, తిరుమలలోని పలు ప్రదేశాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి.

బాలాజీనగర్‌లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఎడతెరపిలేని వర్షం, ఈదురుగాలులతో తిరుపతిలో జనజీవనం స్తంభించింది. చెట్లు పెద్దసంఖ్యలో విరిగిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కపిలతీర్థం ప్రాంతంలో కొండల నుంచి భారీగా నీరు ప్రవాహం మాదిరిగా ప్రవహిస్తోంది.

#రేణిగుంట సమీపంలో వాగులో ముగ్గరు రైతులు చిక్కుకోగా వారిలో ఇద్దరిని సహాయ బృందాలు కాపాడగలిగాయి. ప్రసాద్ అనే మరో రైతు మాత్రం గల్లంతయ్యారు. తిరుపతి నగరంలో కూడా పలు పల్లపు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. చిత్తూరు జిల్లాలో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లు, చెరువులు దాదాపుగా నిండిపోయాయి. పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు 600 కు పైగా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు 30 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇటీవలి కాలంలో ఇంతగా #వర్షపాతం నమోదు కాలేదని వివిధ జిల్లాల్లో ప్రజల నుంచి వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి.

For latest updates on Entertainment, News and Music Subscribe to our channel: https://www.youtube.com/channel/UCrifeVRO4_aeC2pfJw1D8aQ

 #కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ  #విమాన ప్రయాణాలపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరోమారు పొడిగించింది. డిసెంబరు 31 వరకు విమాన...
27/11/2020

#కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ #విమాన ప్రయాణాలపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరోమారు పొడిగించింది. డిసెంబరు 31 వరకు విమాన సర్వీసులను నిషేధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది. అయితే... ఎంపిక చేసిన విమాన సర్వీసులు మాత్రం నడవనున్నాయి. కరోనా వ్యాప్తీ తీవ్రత కారణంగా ఈ నిషేధం ఈ ఏడాది చివరి వరకు ఉంటుందని ప్రకటించారు. కార్గో విమానాలకు మాత్రం నిషేధం వర్తించదని తెలిపింది.

For latest updates on Entertainment, News and Music Subscribe to our channel: https://www.youtube.com/channel/UCrifeVRO4_aeC2pfJw1D8aQ

చైనీస్ యాప్  #టిక్‌టాక్ విక్రయానికి మరో వారం రోజుల పాటు గడువును పెంచింది. ఈ మేరకు కోర్టుకు సమాచారమిచ్చింది. ఈ క్రమంలో......
27/11/2020

చైనీస్ యాప్ #టిక్‌టాక్ విక్రయానికి మరో వారం రోజుల పాటు గడువును పెంచింది. ఈ మేరకు కోర్టుకు సమాచారమిచ్చింది. ఈ క్రమంలో... డిసెంబరు 4 లోగా టిక్‌టాక్‌ను విక్రయించడానికి బైట్ డ్యాన్స్‌కు సమయం దొరికినట్లైంది. టిక్ టాక్‌ను అమెరికా సంస్థలకు విక్రయించాలని ట్రంప్ పాలనా వర్గం ఆగస్ట్‌లో కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే... గడువును పలుమార్లు పొడిగించారు. తాజా గడువు 27 వ తేదీతో ముగిసిన నేపధ్యంలో... దానిని మరో వారం రోజులు పెంచింది.

తొలుత ఆగస్ట్ ప్రారంభంలో 45 రోజుల గడువిచ్చారు. ఇప్పుడు దానిని 90 రోజులకు నవంబర్ 12 వ తేదీ వరకు పొడిగించారు. ఆ తర్వాత...మరో 15 రోజులు పొడిగించి, నవంబరు 27వ తేదీ వరకు అవకాశమిచ్చారు. ఇప్పుడు మరో వారం పొడిగింపు లభించింది.

For latest updates on Entertainment, News and Music Subscribe to our channel: https://www.youtube.com/channel/UCrifeVRO4_aeC2pfJw1D8aQ

కస్టమర్లకు  #గూగుల్ పే షాకివ్వనుందా ? జనవరి నుండి గూగుల్ పే వెబ్ యాప్స్ సేవలు నిలిచిపోనున్నాయా ? అంతేకాదు... గూగుల్ పే న...
27/11/2020

కస్టమర్లకు #గూగుల్ పే షాకివ్వనుందా ? జనవరి నుండి గూగుల్ పే వెబ్ యాప్స్ సేవలు నిలిచిపోనున్నాయా ? అంతేకాదు... గూగుల్ పే నుండి తక్షణ నగదు బదలీ కోసం ఛార్జీలను వసూలు చేయనుందా ? ఈ ప్రశ్నల నేపధ్యంలో వార్తలొస్తోన్న విషయం తెలిసిందే. గూగుల్ పే వినియోగదారులు డబ్బులు పంపించేందుకు గూగుల్ పే యాప్ లేదా గూగుల్ పే వెబ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే... వచ్చే ఏడాది నుండి డబ్బు పంపించేందుకు, స్వీకరించేందుకు పే డాట్ గూగుల్ డాట్ కాంను ఉపయోగించలేరని, ఇకపై గూగుల్ పే యాప్‌ను ఉపయోగించాలని కంపెనీ వెల్లడించింది. ఇది భారత్‌లోనూ వర్తిస్తుందని పేర్కొంటూ వార్తలొచ్చాయి. ఈ నేపధ్యంలో గూగుల్ పే స్పందించింది.

అమెరికా యూజర్లకు మాత్రమే... గూగుల్ పే ప్లాట్‌ఫాం నుండి మనీ ట్రాన్సుఫర్‌కు అదనపు రుసుం చెల్లింపులపై వస్తోన్న వార్తల మీద స్పష్టతనిస్తూ... ఇది కేవలం అమెరికన్ యూజర్లకు మాత్రమేనని, భారత్‌లో కస్టమర్లు ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. సరికొత్త ఫీచర్లతో గూగుల్ పే యాప్‌ను విడుదల చేస్తున్నట్లు గూగుల్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనిని #అమెరికాలో ప్రయోగాత్మకంగా అందుబాటులోక తీసుకు వచ్చింది. ఈ నేపథ్యంలో గూగుల్ పే యాప్ నుండి చేసే మనీ ట్రాన్సుఫర్‌కు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

అమెరికాలో వెబ్ గూగుల్ పే ఉండదు... భారత్‌లోని గూగుల్ పే, గూగుల్ పే బిజినెస్ కస్టమర్లు ఈ ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదని గూగుల్ పే తెలిపింది. కేవలం అమెరికాలో మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కొంది. కొత్త ఏఢాది నుండి అమెరికాలో వెబ్ ఆధారిత గూగుల్ పే ఉండదని, కేవలం యాప్‌‌లో మాత్రమే చెల్లింపులు చేయాలని తెలిపింది. కొత్త ఫీచర్లతో కూడుకున్నగూగుల్ యాప్... ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లలో అందుబాటులో ఉంటుంది. వెబ్ బ్రౌజర్ అమెరికాలో మాత్రమే వినియోగించలేరు.

For latest updates on Entertainment, News and Music Subscribe to our channel: https://www.youtube.com/channel/UCrifeVRO4_aeC2pfJw1D8aQ

నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఒవైపు మహమ్మరిలా బళిస్తోన్న కరోనాకు  #వరదలు కూడా తోడైన నేపధ్యంలో... మరోవైప...
27/11/2020

నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఒవైపు మహమ్మరిలా బళిస్తోన్న కరోనాకు #వరదలు కూడా తోడైన నేపధ్యంలో... మరోవైపు ఆహార ధాన్యాలు, నిత్యావసరాల ఉత్పత్తి పడిపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ క్రమంలో ‘ఏం కొనేటట్టు లేదు... ఏం తినేటట్టు లేదు’ అంటూ సామాన్యులు నిట్టూరుస్తున్నారు. ఇక... పనుల్లేక పేద, మధ్య తరగతి వర్గాల ఆదాయం పడిపోతూ ఉంటే నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం జెట్ స్పీడ్ తో నింగిలోకి దూసుకుపోతున్నాయి.

#కరోనా , వరదల నేపధ్యంలో... గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నూనెల ధరలు 25 శాతం పెరగగా, పప్పుల ధరలు, చింతపండు ధరలు మరింతగా పెరిగిపోయాయి. కరోనా లాక్‌డౌన్ నేపధ్యంలో దిగుమతులు తగ్గిపోయాయి. ఇక దేశీయంగా ఉత్పత్తయ్యే #పప్పుధాన్యాలు, #ఉల్లిగడ్డలు, #కూరగాయలు కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ ప్రభావం తోపాటు ఆ తర్వాత కురిసిన భారీ #వర్షాలు, తాజాగా చోటుచేసుకున్న #నివర్ #తుఫాన్ కారణంగానూ తీవ్రంగాదెబ్బతిన్నాయి.

ఇక కరోనా సమయంలో రవాణా ఇబ్బందులతో నష్టపోయిన రైతులు ఖరీఫ్ లో కొత్తగా కూరగాయల పంటలు వేయకపోవడం, ఇక పంటలు వేసిన ప్రాంతాలల్లో భారీ వర్షాలు కురవడం వల్ల నీటమునిగిన పంట కుళ్ళిపోవడం వంటి కారణాలతో కూరగాయల ధరలు గతంతో పోలిస్తే విపరీతంగా పెరిగిపోయాయి. పప్పుల ధరలు చూస్తే దేశీయంగా ఉత్పత్తి తగ్గిపోవడం, ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి కూడా అవకాశం లేకపోవడం వంటి కారణాలతో ధరలకు రెక్కలొచ్చాయి.

ఇక ఉల్లి ధరలు రూ. 100 నుండి రూ. 120 వరకు ఉన్నాయి. కరోనా లాక్‌డౌన్ ప్రభావంతో రవాణా లేక ఉల్లిగడ్డలు పంట పొలాల్లోనే పాడైపోవడం, ఇక కొత్త పంట రాకపోవడం, ఇతర దేశాల నుండి ఉల్లి దిగుమతులను పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. ఇక నూనెల ధరలు చూస్తే #వేరుశెనగ #నూనె మూడేళ్ల కిందటికన్నా ఏకంగా 50 శాతం పెరిగాయి.

ఇక ఈ పరిస్థితుల నేపధ్యంలో ప్రభుత్వ యంత్రాంగం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోంది.

For latest updates on Entertainment, News and Music Subscribe to our channel: https://www.youtube.com/channel/UCrifeVRO4_aeC2pfJw1D8aQ

 #అమెరికా జనరల్ మోటార్స్( #జీఎం) సంస్థ... దాదాపు 60 లక్షల పెద్ద పికప్ ట్రక్కులు, ఎస్‌యూవీలను వెనక్కు తెప్పించుకోనుంది.  ...
26/11/2020

#అమెరికా జనరల్ మోటార్స్( #జీఎం) సంస్థ... దాదాపు 60 లక్షల పెద్ద పికప్ ట్రక్కులు, ఎస్‌యూవీలను వెనక్కు తెప్పించుకోనుంది. ప్రమాదకర తకాటా ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ప్లేటర్లు వీటి అమర్చారు. ఈ కార్లను వెనక్కు పిలిపించాలని జనరల్ మోటార్స్‌ను అమెరికాలోని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్(ఎన్‌హెచ్‌డబ్ల్యూటీఎస్‌ఏ) ఆదేశాలు జారీ చేసింది. వాటికి మరమ్మతులు చేసిన తర్వాత తిరిగి యజమానులకు అప్పగించాలని సూచించింది. వీటికి దాదాపు రూ. 9 వేల కోట్ల మేరకు ఖర్చయ్యే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.

#ఎన్‌హెచ్‌డబ్ల్యూఎస్‌ఏ నిర్ణయం నేపధ్యంలో వాహన తయారీదారులపై సుమారు 1.2 బిలియన్ డాలర్ల మేర భారం పడనుంది. ఈ ఏడాది కంపెనీ ఆదాయంలో ఇది మూడోవంతు. రీకాల్‌ను తప్పించుకోవడం కోసం జీఎం 2016 నుండి నాలుగుసార్లు పిటిషన్లు వేసింది.

కాగా... ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్లు సురక్షితంగా ఉన్నాయని పరీక్షల్లో తేలిందని జీఎం మోటార్స్ పేర్కొంది. అయితే వీటిని కొనుగోలు చేసిన యజమానులు మాత్రం తమ భద్రత కంటే లాభాల కోసమే కంపెనీ చూసిందని ఆరోపిస్తూ వచ్చారు.

ఇలా ప్రమాదకరం... తకాటా ఎయిర్ బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్ కారణంగా అమెరికా చరిత్రలో అతిపెద్ద ఆటో(సిరీస్) రీకాల్స్ చోటు చేసుకున్నాయని తెలిపింది. దాదాపు 63 మిలియన్ల ఇన్‌ఫ్లేటర్స్‌ను రీకాల్ చేయనున్నారు. వాహనాలు ఢీకొన్నప్పుడు, చిన్నపాటి పేలుడు జరిగి ఎయిర్ బ్యాగ్స్ గాలితో నిండటానికి అనువుగా అమ్మోనియం నైట్రేట్‌ను తకాటా ఎయిర్ బ్యాంక్ ఇన్‌ఫ్లేటర్లలో వాడుతున్నట్లు జీఎం మోటార్స్ పేర్కొంది. అయితే... ఈ రసాయన పదార్థం వేడికి, తేమకు బహిర్గతమైనపక్షంలో అధిక శక్తితో పేలుతోందని, ఈ క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకొని ప్రాణాలు పోతున్నాయని యజమానులు చెబుతున్నారు.

అందుకే వెనక్కు... ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 27 మంది ఇలా ప్రాణాలు కోల్పోగా, ఇందులో 18 మంది ఒక్క అమెరికాలోనే చనిపోయినట్లు సమాచారం.

For latest updates on Entertainment, News and Music Subscribe to our channel: https://www.youtube.com/channel/UCrifeVRO4_aeC2pfJw1D8aQ

గ్రేటర్  #హైదరాబాద్ మునిసిప కార్పొరేషన్ ఎన్నికల్లో మైనారిటీలతో పాటు మెజారిటీ సెటిలర్ల ఓట్లు టీఆర్‍ఎస్‍ అభ్యర్ధులకే పోలయ్...
26/11/2020

గ్రేటర్ #హైదరాబాద్ మునిసిప కార్పొరేషన్ ఎన్నికల్లో మైనారిటీలతో పాటు మెజారిటీ సెటిలర్ల ఓట్లు టీఆర్‍ఎస్‍ అభ్యర్ధులకే పోలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయా రాజకీయ పార్టీల నేతలు అభి•ప్రాయపడుతున్నారు. తెలంగాణ స్థానిక ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్న అంశాన్ని పక్కన పెడిత, మెజారిటీ ఓటర్లు టీఆర్‍ఎస్‍ వేపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యేకించి... విజయం సాధించగల అవకాశాలుంటే... #చంద్రబాబునాయుడు సామాజికవర్గానికి చెందిన ఓటర్లు #టీడీపీ అభ్యర్ధులకు ఓటు వేస్తారు. లేదా టీఆర్‍ఎస్‍ అభ్యర్ధులకు ఓటు వేస్తారని ఆ కులసంఘాల నేతలు పేర్కొంటున్నారు. ‘రాష్ట్ర విభజించిన కాంగ్రెస్... ఆంధ్రాకు అన్యాయం చేసింది. బీజేపీ మోసం చేసింది. చంద్రబాబు గత ఎన్నికలలో ఓడిపోవటానికి బీజేపీ పెద్దలు చేసిన కుట్ర కూడా చంద్రబాబు సామాజికవర్గ ఓటర్లందరికీ తెలుసన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వినవస్తుండడం గమనార్హం. కాగా... హైదరాబాద్ లో దాదాపు పాతిక లక్షల మంది వరకుసెటిలర్లుండగా, వారిలో అధిక భాగం ఓటర్లు టీఆర్‍ఎస్‍ అభ్యర్ధులకే ఓటు వేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ‘సోనియా గాంధీ అన్యాయం చేశారు. ప్రధాని మోదీ మోసం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. తర్వాత... హోదా కుదరదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. అది కూడా ఇవ్వకపోవడంతో ఎదురుతిరిగిన చంద్రబాబును పరోక్షంగా జగన్‍ పార్టీతో చేతులు కలిపి టిడిపి అభ్యర్ధులను ఓడించింది ప్రధాన మంత్రి మోదీ అంటూ సెటిలర్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ‘ఢిల్లీని మించిన రాజధానికి సాయం చేస్తా’నంటూతిరుపతి వేంకటేశ్వరుని సాక్షిగా చెప్పిన మోదీ ఇప్పుడు మాత్రం పెదవి విప్పటం లేదన్న విమర్శలు తరచూ వినబడుతున్నాయి. రాజధాని అమరావతిని విశాఖకు తరలించబోతోన్న నేపధ్యంలో ప్రధానమంత్రి మోదీ, హోం మంత్రి అమిత్‍షాలు మాత్రం పెదవి విప్పడేంలేదన్న విమర్శలూ ఉన్నాయి. ఇదిలా ఉంటే... రాష్ట్ర #బీజేపీ నేతలు పూటకో మాట మారుస్తున్నారంటూ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నేతలు ఆగ్రహంగా ఉన్నారు.

For latest updates on Entertainment, News and Music Subscribe to our channel: https://www.youtube.com/channel/UCrifeVRO4_aeC2pfJw1D8aQ

దేశీ స్టాక్ మార్కెట్ దుమ్మురేపింది. బెంచ్‌మార్క్ సూచీలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలతో దూసుకెళ్లాయి. బెంచ్‌మార్క్ సూచీలు పరుగ...
26/11/2020

దేశీ స్టాక్ మార్కెట్ దుమ్మురేపింది. బెంచ్‌మార్క్ సూచీలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలతో దూసుకెళ్లాయి. బెంచ్‌మార్క్ సూచీలు పరుగులు పెట్టాయి. మంగళవారం భారీగా లాభపడ్డాయి. కొత్త రికార్డులను నమోదు చేశాయి. కోవిడ్ 19 వ్యాక్సిన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలు త్వరితగతిన కోలుకుంటాయనే అంచనాలు మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపాయి.

ఇంట్రాడేలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 495 పాయింట్ల లాభంతో 44,572 పాయింట్లను తాకింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. ఇక ఎన్ఎస్‌ఈ నిఫ్టీ కూడా 13,079 పాయింట్లకు ఎగసింది. చివరలో సెన్సెక్స్ 446 పాయింట్ల లాభంతో 44,523 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 129 పాయింట్ల లాభంతో 13,055 వద్ద క్లోజయ్యింది. సూచీలకు ఇవి ఆల్‌టైమ్ గరిష్ట క్లోజింగ్‌ స్థాయిలని వాణిజ్యవర్గాలు వెల్లడించాయి.

నిఫ్టీ 50 లో అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐషర్ మోటార్స్, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ నాలుగు శాతానికి పైగా పెరిగింది. అదేసమయంలో టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ, బీపీసీఎల్, నెస్లే ఇండియా, గెయిల్ షేర్లు నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ ఒక శాతానికి పైగా పడిపోయింది.

ఇక నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ముగిసాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ రెండు శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఒక శాతం, నిఫ్టీ ఫార్మా ఒక శాతం, నిఫ్టీ మెటల్ ఒక శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.5 శాతం, నిఫ్టీ ఆటో ఒక శాతం, నిఫ్టీ బ్యాంక్ 2.4 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇక అమెరికా డాలర్‌తో పోలిస్తే లాభపడిన ఇండియన్ రూపాయి... 21 పైసల లాభంతో 73.90 కి చేరింది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.11 శాతం పెరుగుదలతో 46.55 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.23 శాతం పెరుగుదలతో 43.61 డాలర్లకు చేరింది. మొత్తంమీద రిత్రలో తొలిసారిగా స్టాక్ మార్కెట్ మంగళవారం భారీ రికార్డ్‌ను సృష్టించింది.

For latest updates on Entertainment, News and Music Subscribe to our channel: https://www.youtube.com/channel/UCrifeVRO4_aeC2pfJw1D8aQ

 #టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్‌ను అధిగమించారు. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థా...
25/11/2020

#టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్‌ను అధిగమించారు. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి ఎగబాకారు. ఎలాన్ సంపద 7.2 బిలియన్ డాలర్లు పెరిగి 127.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తద్వారా... 127.7 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను దాటేశారు.

ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను ఇటీవలే దాటిన ఎలాన్...మూడో స్థానానికి చేరుకున్న వనిషయం తెలిసిందే. కొద్ది రోజుల్లోనే రెండో స్థానానికి చేరుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో 35 వ స్థానంలో ఉన్న అతను ఏకంగా రెండో స్థానానికి చేరారు. మస్క్ సంపద ఏడాదిలో 100.3 బిలియన్ డాలర్లు పెరిగింది.

బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం ఎలాన్ మస్క్ ఇతర బిలియనీర్ల కంటే ఈ ఏడాది ఎక్కువగా ఆర్జించారు. జనవరిలో బ్లూమ్‌బర్గ్ ప్రకటించిన ప్రపంచ 500 మిలియనీర్లలో అతను 35 వ స్థానంలో నిలిచాడు. కొద్ది నెలల క్రితం టాప్ 10 లోకి వచ్చాడు. నవంబరులో టాప్ 3 స్థానానికి, ఇప్పుడు 2 వ స్థానానికి ఎగబాకాడు. టెస్లా రాణించడంతో అతని సంపద అమాంతం పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్ వ్యాల్యూ 500 బిలియన్ డాలర్లను తాకింది. అతని ఆర్జనలో మూడో వంతు టెస్లా షేర్లున్నాయి.

For latest updates on Entertainment, News and Music Subscribe to our channel: https://www.youtube.com/channel/UCrifeVRO4_aeC2pfJw1D8aQ

Address


Alerts

Be the first to know and let us send you an email when Forth Front Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share