Mana Velugu News

  • Home
  • Mana Velugu News

Mana Velugu News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mana Velugu News, TV Channel, .

Mana Velugu Foundation
Mancherial Dist
Mana Velugu New Youtube Channel : https://www.youtube.com/channel/UCSRm81ffB4gduhyLauxGFjA
Ram Prakash Madupu
Cont: 9346188828
Janam Kosam - Man Galam

Please watch like Subscribe
05/08/2024

Please watch like Subscribe



YADASUDU KALLALLO NUVVE FULL SONG ll FOLK TELUGU 2024 ll SRIHARIDASS ll - SINGER - CAST : SRIHARI DAS MUSIC : RAMESH THUDIMILLAPRODUCER : ...

15/01/2024
*అందరికి   2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు*  🌻            *పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి, నూతన సంవత్సరానికి హృదయపూర్వక...
01/01/2024

*అందరికి 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు* 🌻

*పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి, నూతన సంవత్సరానికి హృదయపూర్వక స్వాగతం పలుకుదాం....*

*కొత్త ఏడాదిలో అందరి కలలు సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....*

*నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను....*

*మరియొక్క సారి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ...* 🙏

*మీ....*
మడుపు రాంప్రకాష్ .
వెలుగు ఫౌండేషన్ .
మంచిర్యాల

06/12/2023

మోది అమిత్ షా చాణక్యం..

రాజకీయమా..
అబ్బా ఏం రాజకీయం..
రాజకీయమా నీ రాజకీయానికి జోహార్లు...

తెలంగాణలో చచ్చుబడి ఉన్న బిజేపిని తన రెక్కల కష్టంతో పార్టీని కాంగ్రెస్ కంటే ముందు కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా తయారుచేసిండు

అప్పుడు పాపం రేవంత్ మీద కాంగ్రెస్ సీనియర్లు రోజుకో సమస్యను సృష్టించి గందరగోళం లేపుతున్న సమయం

క్రమక్రమంగా రేవంత్ పార్టీ పై పట్టు పెంచుకుంటూ కాంగ్రెస్ ను పోటీలో నిలబెట్టిండు

తెలంగాణా లో త్రిముఖ పోటీ తప్పదని గ్రహించిన బిజెపి అనూహ్య నిర్ణయాలు తీసుకుంది

పార్టీ మాంచి ఊపుమీదున్న దశలో అకస్మాత్తుగా బండి సంజయ్ ని మార్చడం ఒక నాటకం

కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చెయ్యడం కూడా బిజేపి స్వపక్షానికి,విపక్షాలకు,ప్రజలకు, విశ్లేషకులకూ కాడా అంతు చిక్కకుండా ఆడిన ఓ అద్భుత నాటకం ఆడింది

బిజెపి ఏదైనా నిర్ణయం తీసుకుంటే పని జరిగే దాక మీడియాకే కాదు మూడో కంటికి కూడా తెలియకుండా జాగ్రత్త పడ్తది

అట్లా నేటి కేసిఆర్ ఓటమికి ఆనాడే బండి సంజయ్ ని మార్చి బీజం వేసింది

ఏదో కేసీఆర్ కు కిషన్ రెడ్డి దగ్గరని అధిష్టానంతో కిషన్ రెడ్డి కేసీఆర్ కు లోపాయికారి ఒప్పందం కుదిర్చి కవితను లోపలెయ్యకుండా కాపాడారని జనం నమ్మేలా అయోమయంలో పడేసే నాటకమాడింది

ఈ విషయం బండి సంజయ్ కి బాగా తెలుసు పార్టీ విధేయుడైన సంజయ్ ఆటను బాగా రక్తి కట్టించాడు

కొద్ది రోజులు కావాలనే సంజయ్ ని సైలెంట్ మోడ్ లో పెట్టారు

ఆ దశలో అయోమయానికి గురైన స్వపక్షంలోని వారు మిగతా వారు కాంగ్రెసే ప్రత్యమ్నాయమని అందరు కాంగ్రేస్లోకి వలసలు పోయేలా చేసారు

బలమైన నాయకుల వలసలతో రేవంత్ అద్భుత నాయకత్వ లక్షణాలతో అంది వచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్ గా వినియోగించుకున్నాక

ఇంకా చాలదన్నట్టు కిషన్ రెడ్డి అధిష్టానం కేసిఆర్ తో కలిసినట్టు భ్రమ కల్పిస్తూ
పదే పదే నన్ను కుట్రపన్ని ఊడపీకిచ్చిర్రు కదా అని సంజయ్ చెప్పించారు

బిజెపి ఇంకొక అనూహ్యమైన ఎత్తుగడ వేసి మంద కృష్ణ మాదిగ గారితో చేతులు కలపడం

ఏబిసిడి వర్గీకరణ చేస్తామని దళితులను కేసీఆర్ కు ఓట్లెయ్యకుండా ఎమ్మార్పియస్ తో బిజపికే ఓటెయండని ప్రచారం చేయించారు

అప్పటికే బిఆరెస్ ఓటు బ్యాంకు రేవంత్ కొల్లగొట్టిండు

దళిత బంధుతో కేసిఆర్ కు ఉన్న దళితుల ఓట్ బ్యాంకును కూడా మంద కృష్ణ గారిని రంగంలోకి దించి ఆత్మగౌరవం పేరుతో వర్గీకరణ పేరుతో పూర్తిగా దళితుల ఓట్లను కేసిఆర్ కు పడకుండా బిజెపికి వేయించుకుని ఓట్లు చీల్చి కాంగ్రెస్ గెలుపుకు రూట్ క్లియర్ చేసారు..

*కారణం.......*
*కేసిఆర్................*

తెలంగాణ రాష్ట్ర సమితి
ఎప్పుడైతే
భారత రాష్ట్ర సమితిగా
కేసీఆర్ పేరు మార్చి దేశమంతట విస్తరించుటకు ప్రణాళికలు సిద్దం చేసుకుని పర్యటనలు మొదలయ్యాయో

అప్పుడే కేసీఆర్ దుకాణం ముందు తెలంగాణ ముయ్యాలనే స్కెచ్ పడ్డది

కేసిఆర్ బలమైన నేత
అద్బుతమైన వాగ్దాటి ఉన్న నేత
హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ లలో అనర్గళంగా మాట్లాడుతూ ఆయా స్థానిక సమస్యలను ఉటంకిస్తూ రాష్ట్రాలకు రాష్ట్రాలనే మార్చ గలిగే దమ్మున్న నేర్పరి

తెలంగాణ ను తెచ్చిన నేతగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేరు గడించిన నేత
కాబట్టి కేసీఆర్ మాటను దేశ ప్రజలు నమ్ముతరు

దానికి తగ్గట్టుగా పంజాబ్, హర్యానా, డిల్లీ, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ లలో కార్యాచరణ మొదలుపెట్టిండు

మోడికి ప్రత్యమ్నాయమని దేశం మొత్తం తనవైపు తిప్పుకునేలా ప్రచారంతో ఫ్లెక్సిలతో , సోషల్ మీడియాతో బిజెపి పతనానికి పునాది బలంగా వేసిండు

కాంగ్రెస్ కంటే ముందు ముందు బిఆరెస్ తో ఎక్కువ ప్రమాదమని గ్రహించి కేసిఆర్ ను కట్టడి చేయడానికి తెలంగాణలో రాష్ట్ర బిజెపి ని పణంగా పెట్టి విజయవంతంగా కేసిఆర్ ను దెబ్బ కొట్టి తమకు భవిష్యత్తులో పోటికి రాకుండా దేశంలో బిఆరెస్ విస్తరించకుండా నియంత్రించారు

కాంగ్రెస్ కు బంగారు పల్లెంల పెట్టి తెలంగాణను అప్పగించి జాతీయ నాయకత్వం ఫోకస్ అంతా తెలంగాణ మీద పెట్టేలా చేసి ఒక్క రాష్ట్రం వదులుకుని మూడు రాష్ట్రాల్లో దెబ్బ కొట్టారు

బిజెపి ఒక్క దెబ్బతో రెండు పిట్టలు ఇటు కేసిఆర్ ను అటు కాంగ్రెస్ ను జాతీయ స్థాయిలో దెబ్బ కొట్టారు

కాంగ్రెస్ అధినాయకత్వానికి తెలంగాణ లో గెలిచినందుకు సంబరపడాలో
అటు రాజస్థాన్, మధ్యప్రదేశ్,చత్తీస్ గడ్ లలో ఓడిపోయినందుకు బాదపడాలో అర్దం కాని పరిస్తితిని కల్పించారు ..

ఏం చాణక్యం..
అబ్బా ఏం రాజకీయం..
రాజకీయమా నీ రాజకీయానికి జోహార్లు..🙏

డిసెంబర్ 5 వ తేదీన ప్రతి సంవత్సరం " ఇంటార్నేషనల్ వలంటీర్ డే ఫర్ ఎకనామిక్ , సోషల్ డెవలప్ మెంట్ ,ను పాటించాల్సిందిగా ఐక్యర...
05/12/2023

డిసెంబర్ 5 వ తేదీన ప్రతి సంవత్సరం " ఇంటార్నేషనల్ వలంటీర్ డే ఫర్ ఎకనామిక్ , సోషల్ డెవలప్ మెంట్ ,ను పాటించాల్సిందిగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వివిధ ప్రభుత్వాలకు పిలుపు ఇచ్చింది . స్వచ్చంద కార్యకర్తలు , కమిటీలు , సంస్థలు , స్థానిక , జాతీయ , అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి కోసం తమ వంతు కృషిని అందిస్తారు . ప్రభుత్వ సంస్థలు , లాభేతర సంస్థలు , కమ్మ్యూనిటీ గ్రూపులు , ఎకడమిక్ ప్రవేట్ రంగం తో కలసి అభివృద్ధి లో భాగం పంచుకోవడానికి ప్రజలు , స్వచ్చంద కార్యకర్తలకు ఈ రోజు ఒక మహత్తరమైన అవకాశం వంటిది . ఇన్ని సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ వలంటీర్ డే ను న్యూహత్మకం గా ఉపయోగిస్తున్నారు . మిలీనియం అభివృద్ధి లక్ష్యాల్ని అందుకోవడానికి అనేక దేశాలు స్వచ్చంద కార్యకర్తల సేవలపై దృష్టిని సారించాయి . పేదరికము , ఆకలి , రుగ్మతలు , నిరక్షరాస్యత , వాతావరణలోపాలు , మహిళలపట్ల వివక్ష వంటి సమస్యల్ని ఎదుర్కోవడం లో లక్ష్యాలు నిర్ణయించి ఆ దిశగా వలంటీర్లను ప్రోస్తహిస్తున్నారు.
అదే తరహాలో మంచిర్యాల జిల్లా వెలుగు ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థ నిస్వార్ధంగా గత ఐదు సంవత్సరాల నుండి విద్యా వైద్య సామాజిక పర్యావరణ సేవలతో జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తున్న సందర్భంలో నిస్వార్ధంగా సేవలను అందిస్తున్న స్వచ్ఛంద సేవ సంస్థ వారందరికీ కూడా ఈ సందర్భంగా అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవ శుభాకాంక్షలు
సదా మీ సేవలో....
తమ విశ్వసనీయ....
మడుపు రాంప్రకాష్.
వెలుగు ఫౌండేషన్.
మంచిర్యాల.
9346188827.

👍భారతదేశంలో జన్మించినందుకు భారతదేశ బాధ్యత గల పౌరుని గా . బాగా ఆలోచించి. నా ఓటు నేను వేసానని గర్వంగా తెలియ జేస్తున్నాను.....
30/11/2023

👍
భారతదేశంలో జన్మించినందుకు భారతదేశ బాధ్యత గల పౌరుని గా . బాగా ఆలోచించి. నా ఓటు నేను వేసానని గర్వంగా తెలియ జేస్తున్నాను...మంచిర్యాల పౌరునిగా ప్రజాస్వామ్య రక్షణకై..గురి తప్పని ఆయుధమై... వజ్రాయుధమై ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిజాయితీగా స్వచ్ఛందంగా...నేను నా ఓటు హక్కు వినియోగించుకున్నాను...ఎక్కడున్నా ఊరికి వచ్చి..మీ వారిని తీసుకొచ్చి..మీరు కూడా...ఓటు హక్కు వినియోగించుకోండి... మనోడనీ చూడకుండా మంచికి ఓటేయండి.. 5. సంవత్సరాల ఉజ్వల.భవిష్యత్తుని నిర్మించుకుందాం..
🌱🙏🌱🙏🪴🙏🪴

సదా మీ సేవలో మీ..
*మడుపు రాంప్రకాష్*.
*వెలుగు ఫౌండేషన్*.
మంచిర్యాల జిల్లా.
.

29/11/2023
మాట్లాడటం ఒక చక్కని కళ . అది ఎలా ఉండాలో తెలుసుకుందాం.మాట వీపుకి చేటు చేయగలదని ఒక సామెత. ఇరుగు పొరుగువారితో, బంధువులతో ఆఫ...
27/11/2023

మాట్లాడటం ఒక చక్కని కళ . అది ఎలా ఉండాలో తెలుసుకుందాం.

మాట వీపుకి చేటు చేయగలదని ఒక సామెత. ఇరుగు పొరుగువారితో, బంధువులతో ఆఫీస్‌లో పనులు చక్కబెట్టాలి అన్నా, నలుగురితో మెప్పు పొందాలి అన్నా మాట ముఖ్యం. మాటలు ఎప్పుడు కోటలు దాటకూడదు. దానివలన మనల్ని కోతల రాయుడు(రాలు) అంటారు తప్ప సీరియస్‌గా మనల్ని పట్టించుకోరు. అలాగే చాలామంది ముక్కుసూటిగా మాట్లాడతాము అని అనుకొని ఎదుటివారి మొహంమీదనే కర్కశంగా చెప్పేస్తుంటారు. అలా కూడా మంచిది కాదు. మాట్లాడటం రాదు వీరికి అని నిర్ణయించి వారు ఎప్పుడైనా ఎదురైతే పక్కకి తొలగిపోతారు.
మాట్లాడటం ఒక చక్కని కళ. కొంతమంది గంటలకొద్దీ మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. మరికొంతమంది మాట్లాడుతుంటే, వీళ్ళు మనల్ని ఎప్పుడు వదలిపెడతారా అని అనుకుంటాం. సందర్భోచితంగా నలుగురికీ నచ్చేటట్లు ముచ్చటగా మాట్లాడటం నిజంగా ఒక కళ. మరికొంతమంది, తమకు తెలిసినది, మళ్లీ మళ్లీ ఎక్కడ పడితే అక్కడ, మాట్లాడేవాడికి అంతరాయం కలిగించి కూడా మాట్లాడుతుంటారు. అది కూడా సరికాదు..
ఇక సంభాషణలలో చాలా రకాలు ఉన్నాయి. హితభాషణం, మితభాషణం, స్మితభాషణం, ప్రియభాషణం, పూర్వభాషణం- ఇలా చాలావిధాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకే మనిషి వద్ద వుంటే అతని చెంతనే మనకు ఉండాలనిపిస్తుంది.

హితభాషణం అన్నిటిలోకి చాలా కష్టమైన విధానం. అవతలివాడికి హితం చెప్పటం. అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే, సలహాలు ఎవరూ సంతోషంగా స్వీకరించరు, ఎవరికైతే అవి అవసరమో, వారు తిరస్కరిస్తారు. మితభాషణం, క్లుప్తంగా ఎంతవరకు మాట్లాడాలో, అంతవరకే మాట్లాడటం మితభాషణం. అనవసరంగా, అతిగా మాట్లాడితే అపార్థాలు రావటానికి చాలా అవకాశాలు వున్నాయి. అందువల్ల బాగా ఆలోచించి క్లుప్తంగా మాట్లాడటం నేర్చుకోవాలి. స్మితభాషణం మాట్లాడే విషయాన్ని చిరునవ్వుతో మాట్లాడటం స్మితభాషణం. పళ్ళు కనపడకుండా నవ్వటమే ‘స్మితం’. అలా ఏ విషయాన్నయినా కూడా నవ్వుతూ చెప్పగలగాలి. ప్రియభాషణం, ప్రియభాషణలో కొన్ని అసత్యాలు ఉండే అవకాశంవుంది. అయితే కొన్ని సందర్భాల్లో అవి చాలా తప్పనిసరి. ఇతరుల మనసు బాధపెట్టకుండా ప్రియంగా మాట్లాడటం చాలా కష్టమైన పని. ఒక్కోసారి అవతలివారికి తెలిసిపోయే ప్రమాదం కూడా వుంది.

పూర్వభాషణం, దీనికి చక్కని సంస్కారం అవసరం. అవతలి మనిషితో ముందుగా మనమే మాట్లాడటమే పూర్వభాషణం. అవతలి మనిషి మనకన్నా గొప్పవాడా, చిన్నవాడా అని చూడకుండా పలకరించటం చాలా గొప్ప సుగుణం. సంభాషణం ఒక గొప్ప భూషణం, ఎందుకంటే సంభాషణ బాగోలేకపోతే కింద పేర్కొన్న విధంగా మనం దేన్నైనా కోల్పోవచ్చు.
కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం. ఎక్కువగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతాం. అనవసరంగా మాట్లాడితే అపార్థాలకు తావిస్తాం, స్నేహితులను కోల్పోతాం. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతాం. అసత్యం మాట్లాడితే శీలాన్ని కోల్పోతాం. ఆలోచించి మాట్లాడితే వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకతను కాపాడుకుంటాం.
మాటలలో చాలా రకాలుంటాయి. మంచి మాటలు, చెడు మాటలు. చెడు మాటలు నాలుగు విధాలుగా ఉంటాయి. పారుష్యం అనగా కఠింనగా మాట్లాడడం. కష్టం కలిగించే విధంగా మాట్లాడితే కష్టాలు, సమస్యలే కాక మిత్రులు కూడా శత్రువులు అవుతారు. అందువలన అశాంతి, దుఃఖం కలుగుతుంది. ఇతరులు వారితో మాట్లాడేందుకు సంకోచిస్తారు. అనృతం అనగా అసత్యం చెప్పడం. దీనివలన ఆత్మ, మనస్సు కలుషితమవుతాయి. సత్యం దేవతల వ్రతం అని, అసత్యం చెప్పడం అసురుల స్వభావమని వేదవిదులు అంటున్నారు. అసత్యవాదులు జీవించినా మరణించినవారితో సమానమని వేదోక్తి. పైశున్యం అనగా చాడీలు చెప్పడం. దీనివలన కుటుంబాలలో కలహాలు, సన్నిహితులతో విరోధాలు ఏర్పడతాయి. పరస్పరం అసూయ, అసహనం ఏర్పడతాయి. ఇతరులనుండి అవమానాల్ని, అవహేళనల్ని పొందాల్సి వుంటుంది. వీరు సాంఘిక జీవనం కోల్పోతారు. అసందర్భ ప్రలాపం, పరమాత్మ ప్రసాదించిన వాక్కును ఆచి తూచి వినియోగించాలి. అనవసరంగా, అసందర్భంగా వ్యర్థంగా మాట్లాడకూడదు. ఎడతెగకుండా మాట్లాడుతుంటే ఇతరులకు చిరాకుపుడుతుంది.

ఇక చాలామంది మాట్లాడుతూ పోతూనే వుంటారు. ఎదుటివారు ఏమి చెప్పాలి అనుకుంటున్నది అస్సలు వినరు. తాము చెప్పిందే వేదం అనుకుంటారు. ఇలా ఎప్పుడూ చేయరాదు. ఎదుటివారు ఏమి చెప్తున్నారో కూడా వినరు. ఏదో పని ఉన్నట్టుగా బడబడా మాట్లాడేసి వెళ్లిపోతారు.
మాట లేకుంటే చోటే లేదన్నది ఓ సామెత. ఆ చోటన్నది ఊళ్లో అయినా.. ఎదుటివాళ్ల గుండెల్లోనైనా! మనిషి సంగతి చెప్పేది మాటే. ఉపాధ్యాయులనుంచి రాజకీయ నాయకుల వరకూ, సాహితీ ఉపన్యాసకులనుంచి కార్పొరేట్ బృంద నాయకులవరకూ ఏ రంగంలోనివారైనా సరే గెలవాలంటే ప్రసంగ కళమీద పట్టు సాధించాల్సిందే.

సంభాషించడం ఒక అందమైన కళ. మన సంభాషణ ఆసక్తికరంగా ఉంటేనే ఎదుటివారు మనతో సంభాషించటానికి ఇష్టపడతారు. లేదంటే మనతో సంబంధాన్ని, స్నేహాన్ని తుంచేసుకుంటారు. ఎదుటివారితో మాట్లాడేముందు మనతో మనం మాట్లాడుకోవాలి. ప్రతిరోజూ మీరు మీతో మాట్లాడుతూ మీరు చేసే పనులను, ఫలితాలను చర్చించుకుంటూ మిమ్మల్ని మీరు బాగా తెలుసుకున్నపుడే ఎదుటివారితో బాగా సంబంధ బాంధవ్యాలని కొనసాగించగలరు.
సదా మీ సేవలో. మీ......
మడుపు రాంప్రకాష్.
వెలుగు ఫౌండేషన్.
మంచిర్యాల.

25/11/2023

*మన జీవితమే ఒక పాఠశాల*
***************************************

మన జీవితంలో "కాఠీన్యాలు" కఠిన సమస్యలు, కష్టాలు, నష్టాలు ,దుఖాలు , భాధలు మనల్ని నాశనం చేయడానికి రావు.*

*మనలో దాగి ఉన్న "సామార్ధ్యాన్ని",* *మరియు మనలోని "శక్తి"ని బయటకు తీయడం కోసం తగు సహాయ సహకారాలను అందించడానికి వస్తాయి.*

*మీరు చేయవలసినదల్లా నిలబడి "ధైర్యం"తో ఎదురించడమే,*
*అట్టి కాఠీన్యాలకు ,కఠిన సమస్యలు కూడా ఎదో ఓక నాటికి తేలుసుపోతుంది,* ఇది సత్యం.

ఎందుకంటే......

*మీరు అంతకంటే ఎక్కువ "కఠినం" అని..!!*

*నా ప్రియ మిత్రులందరికీ శుభోదయం

🙏🙏🙏🙏🙏🙏🙏

సదా మీ సేవలో.. మీ..

మడుపు రామ్ ప్రకాష్ .
వెలుగు ఫౌండేషన్ .NGO.
(స్వచ్ఛంద సేవా సంస్థ )
విద్య, వైద్య, సామాజిక, పర్యావరణ సేవలు.

మానవసేవే మాధవసేవ ...
సేవే మా మార్గం...
చేయుతే.. మా లక్ష్యం...

స్పందించు... సహకరించు.. సహాయపడు..

Cell . 9346188828.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

12/11/2023

*నేను దీపం వెలిగిస్తున్నాను... ధ్వని కాలుష్యం వాయు కాలుష్యం నివారణ కోసం*...
*మట్టి ప్రమిదలతో పర్యావరణ హితం కోసం*...
*నేను దీపం వెలిగిస్తున్నాను*...
*నేను మంచి ఆలోచిస్తూ నా చుట్టూ సమాజాన్ని కూడా మంచి ఆలోచించే లాగా మంచి సమాజ నిర్మాణానికి తోడ్పడుతానని*....
*నేను దీపం వెలిగిస్తున్నాను*...
*కంటి కునుకు లేకుండా దేశాన్ని కాపాడే మన సైనికుల విజయం కోసం*.....
*నేను దీపం వెలిగిస్తున్నాను*...
*నా చివరి రక్తపు బొట్టు ఉండే వరకు దేశాభివృద్ధికి తోడ్పడుతానని* ......
*చెడుపై మంచికి ప్రతీక గా వచ్చిన ఈ దీపావళి పండుగ మీ జీవితంలో కోటి కాంతుల వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ*.... *మీకు మీ కుటుంబానికి పర్యావరణ కాలుష్య రహిత దీపావళి శుభాకాంక్షలు*.. .
*సదా మీ సేవలో మీ*..
*మడుపు రాంప్రకాష్*
*వెలుగు ఫౌండేషన్*

హైటెక్ సిటీ.
మంచిర్యాల.*.
🙏🙏🙏🪴🪴🪴🪴 🙏🙏

Address


Alerts

Be the first to know and let us send you an email when Mana Velugu News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mana Velugu News:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share