Tapasya Media

  • Home
  • Tapasya Media

Tapasya Media page created by me for the purpose of news and entertainment.. there is no ulterior motive to create this page other than aforesaid purpose..

please encourage us..

02/10/2022

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో గాంధీ జయంతి ఇలా...మరి సంబంధిత అధికారులు?

08/07/2022

*విజయనగరం జిల్లా*

శృంగవరపుకోటలో మహానేత వైఎస్ఆర్ ను మరచిన వైఎస్సార్సీపీ మహానేత వారసలు..

ఎమ్మెల్యే..ఎంపీలు వస్టే వందలాదిగా తరలి వచ్చి మహానేతకు ఊపిరి సలపకుండా దండలతో ఉక్కిరబిక్కిరి చేసే వైఎస్సార్సీపీ చోటా నాయకులకు స్వర్గీయ మహానేత రాజశేఖర్ రెడ్డి జన్మదినం గుర్తుకు రాకపోవడం శోచనీయం..

గుంటూరులో వైస్సార్సీపీ పార్టీ ప్లీనరీకి ఎమ్మెల్యే, ఎం.ఎల్.సి మొదలైన నాయకులు వెళ్లడంతో మిగిలిన స్థానిక నాయకులకు వైఎస్ఆర్ గుర్తుకు రాలేదు

శృంగవరపుకోట మండల కేంద్రంలో దేవీకూడలిలో
ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి కనీసం పూల దండయినా వేయలేదు స్థానిక చోటా నాయకులు..

ఈ క్రమంలో ఈ పరిస్థితిని జీర్ణించుకోలేని వైస్సార్ మహిళా అభిమాని తనే ఒక పూలదండ కొని తెచ్చి రాజశేఖర్ రెడ్డి మెడలో అలంకరించి వైస్సార్ పై తన ప్రేమను చాటుకుంది..

కుటుంబ పోషణ కొరకు కొబ్బరికాయల వ్యాపారం చేసుకొని జీవిస్తున్న ఆడారి వరలక్ష్మి అనే మహిళ తన అభిమానాన్ని చాటుకునే తీరును చూసి పలువురు ప్రశంసించారు..

13/08/2021

శ్రావణమాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకొని శృంగవరపుకోట మండల కేంద్రం దేవీ కూడలిలో నెలకొని ఉన్న దుర్గాదేవి శాకాంబరీదేవిగా భక్తులకు కనువిందు..

29/04/2021
30/12/2020

విజయనగరం జిల్లాలో..దారుణం..నెల్లిమర్ల మండలం రామతీర్థం కొండమీద నెలకొని ఉన్న సీతా లక్ష్మణ ,ఆంజనేయ సహిత శ్రీరాముని శిరస్సును గుర్తుతెలియని ఆగంతకులు ఖండించి.పట్టుకుపోయిన సంఘటన ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేపింది..

రాష్ట్రంలో హైందవ..సంస్కృతి, హైందవ దేవతా మూర్తుల పై వాటికి సంభందించిన ఆస్తులపై తరచూ దాడులు జరగడాన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు..కేవలం హైందవులే కాకుండా మతసామరస్యాన్ని , సమాజ శాంతిని కోరుకునే వారంతా ఖండిస్తున్నారు..

దోషులను ఎంతటివారైనా పట్టుకొని శిక్షించాలని రామ భక్తుల డిమాండ్..

400 వందల సంవత్సరాల క్రితం ప్రతిష్టించబడి ఘన చరిత్ర కలిగిన ఈ దేవతా మూర్తులపై దాడిచేసిన వారిని శిక్షిస్తారో ..పోతేపోయింది శ్రీరాముని బొమ్మ శిరస్సు పోతే శ్రీరామునికేమైనా అయ్యిందా మీతో చెప్పాడా ..ఆ విగ్రహాలు మీ అబ్బగాడి సొత్తా అని అంటే, అనిపిస్తే మనం చేసేది ఏమీలేదు..

కానీ ఖచ్చితంగా చెప్పగలం భారీ మూల్యం చెల్లించక తప్పదు..

13/12/2020

దృశ్యంలో మీకు కనిపిస్తున్నది...పొగ మంచుతో కప్పబడిన ప్రకృతి రమణీయ దృశ్యం అనుకుంటున్నారా !!!..

తప్పకుండా మీరు తప్పులో కాలేసినట్లే...

ఆ దృశ్యం రేగుతూ ఆ ప్రాంతాన్ని ఆక్రమించిన స్టోన్ క్రషర్ ల ధూళి కణాలు..
అది ఎక్కడో జనజీవనానికి దూరంగా మారుమూల ప్రాంతం అనుకున్నారా!! కానే కాదు..
లక్కవరపుకోట మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి సోంపురం జంక్షన్..
ఈ జంక్షన్ ఉన్నది విశాఖ నుండి వెళ్లే హైవే రోడ్డు లో..

నిత్యం వేలాది వాహనాలు అరకు పర్యాటక కేంద్రానికి ఈ జంక్షన్ మీద నుండి వెళ్తాయి..

ఈ ప్రాంత వాసులు అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో పట్టించుకోవడమే మానేశారు.

ఈ ప్రాంతంలో అనేక సందర్భాల్లో వి.ఐ.పి లు కూడా వెళ్లే పరిస్థితి.. అయితే అధికారుల ముందస్తు సమాచారంతో ఆ సమయంలో కాస్త జాగ్రత్త వహిస్తారు స్టోన్ క్రషర్ యాజమాన్యాలు..

వీటిని అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమని కోరుకుంటున్నారు.. పర్యావరణ ప్రేమికులు ..

13/11/2020

విజయనగరం జిల్లా.. జామి మండలం...జట్టేటివలస గ్రామంలో ఉన్న దీపావళి సామాన్లు హోల్ సేల్ గా అమ్మే గోడౌన్ ..
చాలా కాలంగా అక్కడ వారు ,
వారి ఊరికి సమీపంగా కనీస ప్రమాణాలు పాటించని, ఒకవేళ ప్రమాదాలు సంభవిస్తే నివారణకు ఎటువంటి ముందస్తు చర్యలు లేకుండా హోల్సేల్ పేరుతో రిటైల్ వ్యాపారం కూడా చేస్తున్న ఆ గోడౌన్ ను అక్కడినుంచి తీయించాలని చాలాకాలంగా అక్కడి గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు..

ఈ రోజు కూడా గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది..
ఆ సమయంలో అక్కడికి చేరుకున్న ఆ ప్రాంత ఎస్సైతో రిటైల్ వ్యాపారం చేయడం వాస్తవమేనని మీరు తీసే మంటే తీసేస్తానని ఎస్.ఐ తో వ్యాపారస్తుడు మాట్లాడటంతో అందరూ ఖంగు తిన్నారు..

హోల్సేల్ గోడౌన్ వద్ద ఎటువంటి అనుమతి లేకుండా రిటైల్ వ్యాపారం చేయడం రూల్స్ కు విరుద్ధం అయినా కూడా ఎస్సై సమక్షంలోనే ఎదేశ్చగా రిటైల్ వ్యాపారం చేయడం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది..

పైగా ఎటువంటి అనుమతులు లేకుండా కనీస ప్రమాణాలు పాటించకుండా వ్యాపారం చేయడాన్ని ప్రశ్నించిన జర్నలిస్టులను.. మీరు రాసుసుకుంటే రాసుకోండి కానీ అవన్నీ ప్రశ్నించే అధికారం అర్హత మీకు లేవు.. అని విలేకరులను ఎస్సై వారించడం..
గోడౌన్ యజమాని సంబంధిత అధికారులని ఏవిధంగా ప్రభావితం చేసాడు అన్నదానికి అద్దం పడుతుంది..

అయితే చట్ట వ్యతిరేకంగా , రూల్స్ కు విరుద్ధంగా ప్రజలకు హాని కలిగే అవకాశం ఉన్న విధంగా ప్రవర్తించిన వారిని ప్రశ్నించడానికి జర్నలిస్టులే కానక్కరలేదు.. ఎవరికైనా అర్హత ఉందనే అతిసూక్ష్మ మర్మాన్ని ఎస్ ఐ విస్మరించడం గమనార్హం..

మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం.. అక్రమాలను అధికారులు అరికట్టరు.. ప్రశ్నించే వారి అర్హతలు గుర్తు చేస్తారు.
ప్రతీదీ సవ్యంగా జరిగేవరకు లాలూచీలు పర్వాలేదు.. జరగరానిది జరిగితే ఎవరు సమాధానం చెబుతారు..

https://youtu.be/BWiDhk4GKPQ
23/10/2020

https://youtu.be/BWiDhk4GKPQ

మంటగలిసిన అమ్మతనం ...మేల్కొన్న మానవత్వం.. పొదల్లో పడేసిన అప్పుడే పుట్టిన మగశిశువు, స్థానికులు గుర్తించి సపర్యలు....

https://youtu.be/G1myG0EhPgw
11/10/2020

https://youtu.be/G1myG0EhPgw

విజయనగరం జిల్లా శృంగవరపుకోట..ప్రాణాలతో చెలగాటం...వారికి చేతివాటం #కరోనా సూచనలు బేఖాతరు..

https://youtu.be/-UBqK6-zyeE
07/10/2020

https://youtu.be/-UBqK6-zyeE

విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవానికి జామి మండలం బలరామపురంలో చెట్టు సిద్ధం

https://youtu.be/HeCoudZ3H3E
04/10/2020

https://youtu.be/HeCoudZ3H3E

విజయనగరం జిల్లాలు.. ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కరోనా

https://youtu.be/JFv9DlIt3Og
04/10/2020

https://youtu.be/JFv9DlIt3Og

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం దారపర్థి పంచాయితీ గిరిజనులకు తప్పని డోలీ కష్టాలు

https://youtu.be/MJU3HhE5PB0
21/08/2020

https://youtu.be/MJU3HhE5PB0

విజయనగరం జిల్లా శృంగవరపుకోట లో సచివాలయం 3 , 4 భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు

https://youtu.be/ekUefeiMJCc
21/08/2020

https://youtu.be/ekUefeiMJCc

విశాఖ జిల్లా...అనంతగిరి మండలం..కాశీపట్నంలోని కొత్తమ్మ తల్లి

04/08/2020

మనల్ని కరోనా నుండి కాపాడే ముగ్గురిలో మొదటి వారు..
చూడండి ఎలా కాపాడుతున్నారో ..

Logo tapasya media...
02/08/2020

Logo tapasya media...

01/08/2020

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో నేటి నుంచి మూడు రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్.. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి..

మద్యం విక్రయాలకు వర్తించని లాక్ డౌన్

24/07/2020
22/07/2020

విజయనగరం జిల్లా.. శృంగవరపుకోట మేజర్ పంచాయతీకి చాలా ప్రాముఖ్యత ఉంది..
ఆంధ్ర ఊటీ అరుకు ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారం అయినటువంటి ఈ మండల కేంద్రం లో నుండి రోజూ వేలాది మంది టూరిస్టులు అరుకు చూడడానికి వెళ్తుంటారు..
అలాగే ప్రస్తుత తరుణంలో కరోనా మహమ్మారి నుండి రక్షించుకోవడానికి అతి కీలకమైన ఇటువంటి అంశం పరిశుభ్రత... అలాంటిది ఎస్ కోట పంచాయితీ పారిశుద్ధ్యం విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ దృశ్యాలే నిదర్శనం...

22/07/2020

జగనన్న ప్రతిష్టాత్మకంగా పేదల కొరకు ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు సక్రమంగా అందుతున్నాయా.. అపాత్రదానం లా ఉన్నాయేమో..?

Address

Near: MPDO'S OFFICE
CA

Telephone

+19493913614

Website

Alerts

Be the first to know and let us send you an email when Tapasya Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Tapasya Media:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share