12/11/2023
ప్రజలందరికీ విశాఖపట్నం సిటీ సైబర్ క్రైమ్ పోలీసువారి విజ్ఞప్తి ఈ మెసేజ్ అందరికీ చేరేవరకు ఫార్వర్డ్ చేయండి . ., ఎవరూ online లో మోసపోకుండా చూడండి.
ఇటీవల కాలంలో చాలామంది అమాయకుల్ని మోసం చేస్తూ సైబర్ నేరగాళ్లు లక్షల్లో దోచుకుంటున్నారు.., అది ఎలాగో చూడండి.
1) పార్ట్ టైం జాబ్ అని చెప్పి, టెలిగ్రామ్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ లో మెసేజెస్ పంపిస్తారు. అందుకుగాను యూట్యూబ్లో వీడియోస్ లైక్ చేయమని గాని, మూవీ రేటింగ్ ఇవ్వమని గాని, హోటల్స్ రివ్యూ రాయమనడం కానీ చెప్తారు. నమ్మించేందుకు ప్రతి టాస్క్ కి చిన్న మొత్తం లో డబ్బులు మన బ్యాంక్ అకౌంటు కి పంపిస్తారు. తర్వాత నుంచి పెయిడ్ టాస్క్ అని చెప్పి మనచేత అమౌంట్ కట్టించుకొని వర్చువల్ అకౌంట్లో డబ్బులు చూపిస్తూ మన నుంచి లక్షల లక్షలు రూపాయలు దోచుకుంటున్నారు..,ఇటువంటి *ఆన్లైన్ టాస్క్ గేమ్స్ జోలికి పోవద్దు*
2) Online లో లోన్ పేరుతో లోన్స్ ఇస్తామని అందుకు ప్రూఫ్స్ అడిగి, యాప్స్ డౌన్లోడ్ చేయమని చెప్పి, మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తారు., యాప్స్ డౌన్లోడ్ చేసిన వెంటనే మన మొబైలు లో వున్న వ్యక్తిగత సమాచారం వారికి చేరి, మీ ఫొటోస్ ని అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి మిమ్మల్ని వేధింపులకు గురి చేస్తారు.. ఇటువంటి *లోన్ యాప్స్ జోలికి పోవద్దు*. ఒక వేళ మీకు తెలిసిన వాళ్ళు ఈ బ్లాక్ మెయిల్ నేరగాళ్ల జోలికి వెళ్లి ఉంటే భయపడకుండా దైర్యం గా ఉండమని, సైబర్ క్రైమ్ స్టేషన్ నీ సంప్రదించమని చెప్పండి.
3) *కరెంట్ బిల్ కట్టిన కట్టలేదని చెప్పి మీకు ఫోన్ లేదా మెసేజ్ వస్తుంది*, *నమ్మొద్దు* ఆ మెసేజ్లు లో ఇప్పుడే మీ బిల్లు పే చేయండి లేదంటే కరెంట్ కట్ అవుతుంది అని, బిల్లు పే చేయడానికి లింక్ మీద క్లిక్ చేయండి అని చెప్తారు, క్లిక్ చేసిన వెంటనే మీ ఫోన్ హ్యాకింగ్ గురై అకౌంట్ లో డబ్బులు మొత్తం ఖాళీ అవ్వడం జరుగుతుంది.. జాగ్రత్త వహించండి
4) OLX లో తక్కువ ధర కి వస్తువులు అమ్ముతామని మరియు మనం పెట్టిన వస్తువులను ఎక్కువ ధర కి కొంటారని నమ్మిస్తారు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి QR కోడ్ స్కాన్ చేయమని చెప్పి మన నుంచి డబ్బులు వేయించుకుంటారు. అటువంటి యాడ్స్ చూసి మోసపోకండి
5) ఆర్మీ ఆఫీసర్ అని చెప్పి, ఫేక్ ఐడి కార్డ్ పంపిస్తూ మీ ఇల్లు రెంటల్ వెబ్సైట్లో చూసామని మాకు రెంట్ కి కావాలని, కానీ ఆర్మీ రూల్స్ ప్రకారం ముందుగా రెండు లేదా మూడు నెలల అడ్వాన్స్ వారికి చెల్లించమని చెప్పి అందుకు ఆర్మీ అకౌంటు నుంచి ఐదు నెలల రెంట్ వస్తుందని చెప్పి నమ్మిస్తారు..,మోసపోవద్దు
6) కస్టమర్ కేర్ నెంబర్స్ కోసం గూగుల్ లో వెతకవద్దు., గూగుల్ లో మోసపూరిత ఫోన్ నెంబర్స్ ఉంటున్నాయి సహాయం కోసం ఒరిజినల్ వెబ్సైట్స్ సంప్రదించండి..,
7) ఇప్పుడే మీ బ్యాంక్ KYC అప్డేట్ చేయండి లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ స్తంభించిపోతుంది అని మెసేజ్ వస్తుంది., నిజం అనుకొని ఆ మెసేజ్ లు ఉన్న లింక్ క్లిక్ చేసిన వెంటనే మన బ్యాంక్ అకౌంట్ నేరగాల చేతికి చిక్కుతుంది ఇటువంటి మెసేజెస్ ని కాల్స్ ని నమ్మకండి..,ఇటువంటి సందేహాలపై నేరుగా బ్రాంచ్ మేనేజర్ ని సంప్రదించండి.
8) Meshoo, Flipkart, అమెజాన్ వంటి షాపింగ్ వెబ్సైట్ పేరుమీద మీకు లక్కీ డ్రా లో కారు గిఫ్ట్ వచ్చింది అని చెప్పి అందుకుగాను వివిధ టాక్స్ ల రూపంలో మీ దగ్గర నుంచి డబ్బులు అడిగి ఇదంతా refund అని చెప్పి మోసం చేస్తారు., అటువంటి ఫేక్ లక్కీ డ్రా ల ని నమ్మవద్దు.
9) ముంబై పోలీస్ అని చెప్తూ మీకు కొరియర్ వచ్చింది. అందులో నిషేధిత మాదకద్రవ్యాలు ఉన్నాయి మీ పైన కేసు ఫైల్ అవుతుంది అని భయపెట్టించి కేసు ఫైల్ కాకుండా ఉండేందుకు డబ్బులు కట్టమని చెప్తారు.,అటువంటి బెదిరింపులకు భయపడొద్దు.
ముఖ్యంగా ఆన్లైన్లో తెలియన లింక్స్ పై క్లిక్ చేయకండి అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి తెలియని వ్యక్తులతో సాంగత్యం పనికిరాదు జాగ్రత్త వహించండి సైబర్ నేరానికి గురికాకండి..,
మీరు ఎటువంటి సైబర్ నేరానికి గురైన *1930* నెంబర్ కి కాల్ చేసి వెంటనే ఫిర్యాదు చేయండి ఇలా చేయడం ద్వారా మీ పోయిన *అమౌంట్ వెనకకి వచ్చే అవకాశం ఉంది*
ఇటువంటి మరిన్ని వివరాలకు మా సైబర్ క్రైమ్ యూట్యూబ్ ఛానల్ https://youtube.com/?si=ghXtN2LFlSBDPIzr సబ్స్క్రైబ్ చేయండి.,
ఇట్లు
సైబర్ క్రైమ్ పోలీస్
విశాఖపట్నం సిటీ
Awareness and preventive steps against cybercrimes