Visalaandhra Publishing House

  • Home
  • Visalaandhra Publishing House

Visalaandhra Publishing House VISALAANDHRA PUBLISHING HOUSE
Chandram Buildings C.R.Road Chuttugunta
Vijayawada-520004
Cell: 9059617089

విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు మరియు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ శ్రీ టీ. మనోహర్ నాయుడు గారు, ఆంధ్రప్రద...
28/10/2025

విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు మరియు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ శ్రీ టీ. మనోహర్ నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని జనవరి నెలలో జరగబోయే 36వ విజయవాడ పుస్తకోత్సవానికి ప్రధాన అతిథిగా ఆహ్వానించారు.
Manohar Naidu

విశాలాంధ్ర కుటుంబం తరఫున గౌరవ నివాళివిశాలాంధ్ర బుక్ హౌస్, విశాఖపట్నం మేనేజర్ శ్రీ రాజు గారి చిత్రపటానికి విశాలాంధ్ర పబ్ల...
28/10/2025

విశాలాంధ్ర కుటుంబం తరఫున గౌరవ నివాళి

విశాలాంధ్ర బుక్ హౌస్, విశాఖపట్నం మేనేజర్ శ్రీ రాజు గారి చిత్రపటానికి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ టి.మనోహర్ నాయుడు గారు మరియు సిబ్బంది నివాళులు అర్పించారు కార్యక్రమంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విశాలాంధ్ర బుక్ హౌస్, మరియు విశాలాంధ్ర డైలీ పేపర్ ఉద్యోగులు పాల్గొన్నారు.

శ్రీ పోలవరపు రాజు గారు విశాలాంధ్ర సంస్థలో 30 సంవత్సరాలకు పైగా అంకితభావంతో సేవలందించారు.
ప్యాకర్‌గా సేవ ప్రారంభించి, శ్రీకాకుళం బ్రాంచ్ మేనేజర్‌గా,
తదుపరి విశాఖపట్నం మేనేజర్‌గా ఎదిగి విశాలాంధ్ర అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారు.
ఆయన సాహిత్య సేవలు, సామాజిక చైతన్యం, మరియు పాఠకుల పట్ల చూపిన ఆప్యాయత చిరస్థాయిగా నిలిచిపోతాయి.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని విశాలాంధ్ర కుటుంబం హృదయపూర్వకంగా ప్రార్థిస్తోంది.💐💐💐

విషాద వార్తవిశాలాంధ్ర బుక్ హౌస్ విశాఖపట్నం మేనేజర్ శ్రీ పోలవరపు రాజు గారు ఈరోజు ఉదయం హార్ట్‌అటాక్ కారణంగా ఆకస్మికంగా మృత...
28/10/2025

విషాద వార్త
విశాలాంధ్ర బుక్ హౌస్ విశాఖపట్నం మేనేజర్ శ్రీ పోలవరపు రాజు గారు ఈరోజు ఉదయం హార్ట్‌అటాక్ కారణంగా ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ,
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మరియు విశాలాంధ్ర బుక్ హౌస్ తరపున హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాం.
ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం.
Raju Polavarapu

23/10/2025

విశాలాంధ్ర బుక్ హౌస్ – శ్రీకాకుళం బ్రాంచ్ ఆధ్వర్యంలో సంచార పుస్తకాలయం ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుంది.

తేది: 24.10.2025
స్థలం: బాపూజీ కళామందిర్ సమీపంలో
సమయం: ఉదయం 9.00 గంటలకు.

విశాలాంధ్ర బుక్ హౌస్ – శ్రీకాకుళం బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఈ మొబైల్ వ్యాన్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరణ చేస్తారు.

ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా సి.పి.ఐ. పార్టీ సెక్రటరీ శ్రీ చాపర వెంకటరమణ గారు, రచయిత మరియు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ నల్లి ధర్మా రావు గారు, ఇతర రచయితలు, పాఠకులు, సాహిత్యప్రియులు పాల్గొననున్నారు.

పుస్తకాల పట్ల ప్రేమను పెంపొందించే ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమంలో విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనవిజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము.

ఇట్లు,
ఇ. రవి బాబు
మేనేజర్, విశాలాంధ్ర బుక్ హౌస్ – శ్రీకాకుళం
సెల్: 9666208872
#సంచారపుస్తకాలయం #విశాలాంధ్ర #తెలుగుపుస్తకాలు #శ్రీకాకుళం

20/10/2025
11/10/2025

ఇవాళ జరిగిన "ఆమె సూర్యుడిని కబళించింది " పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ శ్రీ టి. మనోహర్ నాయుడు గారు,
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ. వై. సత్యకుమార్ యాదవ్ గారికి పుస్తకాన్ని బహూకరించారు.

పాఠకులకు, రచయితలకు, మరియు ప్రచురణ సంస్థలకు 📚 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ తరఫున హృదయపూర్వక గాంధీ జయంతి 🎉🇮🇳, మరియు విజయదశమి...
02/10/2025

పాఠకులకు, రచయితలకు, మరియు ప్రచురణ సంస్థలకు 📚 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ తరఫున హృదయపూర్వక గాంధీ జయంతి 🎉🇮🇳, మరియు విజయదశమి శుభాకాంక్షలు 🌸✨

ప్రఖ్యాత రచయిత, విప్లవ కవి దాశరధి రంగాచార్య గారి సతీమణి శ్రీమతి దాశరధి కమల గారు ఈ రోజు ఉదయం 6 గంటలకు పరమపదించినారన్న వార...
23/09/2025

ప్రఖ్యాత రచయిత, విప్లవ కవి దాశరధి రంగాచార్య గారి సతీమణి శ్రీమతి దాశరధి కమల గారు ఈ రోజు ఉదయం 6 గంటలకు పరమపదించినారన్న వార్త మాకు తీవ్ర విషాదాన్ని కలిగించింది.

శ్రీమతి కమల గారి మరణం విశాలాంధ్ర కుటుంబానికి ఒక పెద్ద నష్టం. వారి స్నేహపూర్వక స్వభావం, సౌమ్యమైన వ్యక్తిత్వం ఎల్లప్పటికీ మా హృదయాలలో నిలిచి ఉంటుంది.

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ తరఫున కమల గారి కుటుంబ సభ్యులకు మా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము.

— విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్

05/09/2025

విద్యార్థి భవిష్యత్తు నిర్మాణంలో అద్భుత శిల్పి గురువు.
గురువులందరికీ హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!

– విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన పుస్తకాల ఆవిష్కరణ:3వ ఒంగోలు పుస్తక మహోత్సవంలో ఈరోజు సాయంత్రం 8 గంటలకు విశాలాంధ్ర ...
23/08/2025

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన పుస్తకాల ఆవిష్కరణ:

3వ ఒంగోలు పుస్తక మహోత్సవంలో ఈరోజు సాయంత్రం 8 గంటలకు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన రెండు పుస్తకాలు ఆవిష్కరిణ జరిగింది.

సిపిఐ జాతీయ కార్యదర్శి శ్రీ కె. నారాయణ గారు ఏటుకూరి బలరామమూర్తి రచించిన "మన చరిత్ర" పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు.

అలాగే,

రాహుల్ సాంకృత్యాయన్ రచించిన "భారత దర్శనం" పుస్తకాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు శ్రీ హరినాథరెడ్డి గారు ఆవిష్కరణ చేశారు.

ఆ తర్వాత, "ప్రకాశం జిల్లా సంస్కృతి - సాహిత్యం - కళారంగం" అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ చర్చా సభకు ప్రముఖ సినీ నటులు, నిర్మాత, 'మా' ఉపాధ్యక్షులు శ్రీ మాదాల రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిపిఐ జాతీయ కార్యదర్శి శ్రీ కె. నారాయణ, సిపిఐ నాయకులు శ్రీ హరినాథరెడ్డి, జనవిజ్ఞాన వేదిక సీనియర్ నాయకులు శ్రీ ఎ.వి. పుల్లారావు, శ్రీ చంద్ర నాయక్, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు కె. లక్ష్మయ్య, కార్యదర్శి మనోహర్ నాయుడు ఈ సభలో పాల్గొన్నారు.

ఈ సభలో కె. నారాయణగారు పుస్తక ప్రదర్శన ఆదరణను వివరించారు. చంద్ర నాయక్ గారు ప్రకాశం జిల్లా కళల ప్రాముఖ్యతను వివరిస్తూ "వందనం... వందనం..." అనే జానపద పాటను ఆలపించి ప్రేక్షకులను ఉత్తేజపరిచారు. శ్రీ మాదాల రవి మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా నుంచి మాదాల రంగారావు, జానీ లీవర్ వంటి గొప్ప నటులు, అలాగే కొరియోగ్రాఫర్లు, ఫైట్ మాస్టర్లు వంటి ఎందరో కళాకారులు సినీ రంగానికి అందించిన సేవలను వివరించారు.

కామ్రేడ్‌ సురవరం సుధాకర్ రెడ్డి గారికి ఎర్రజెండా నివాళి🚩✊. జీవితాంతం కమ్యూనిస్టు ఆశయాలకే అంకితం అయి, విద్యార్థి ఉద్యమం న...
23/08/2025

కామ్రేడ్‌ సురవరం సుధాకర్ రెడ్డి గారికి ఎర్రజెండా నివాళి🚩✊. జీవితాంతం కమ్యూనిస్టు ఆశయాలకే అంకితం అయి, విద్యార్థి ఉద్యమం నుంచి రైతు-కార్మిక పోరాటాల వరకు నిరంతరం ప్రజల కోసం పోరాడిన మహానుభావుడు. పార్లమెంట్‌లోనూ, ప్రజా ఉద్యమాల్లోనూ కమ్యూనిస్టు వాణిని బలంగా వినిపించిన విప్లవ మేధావి.
ఆయన జీవితం, పోరాటాలు కొత్త తరాలకు శాశ్వత స్ఫూర్తి.

ఆయనకు ఎర్రజెండా నివాళులు.🚩
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్

Address

Visalaandhra Publishing House, Chandram Buildings

520004

Opening Hours

Monday 10:00 - 18:30
Tuesday 10:00 - 18:00
Wednesday 10:00 - 18:00
Thursday 10:00 - 18:00
Friday 10:00 - 18:00
Saturday 10:00 - 18:00

Telephone

+919059617089

Alerts

Be the first to know and let us send you an email when Visalaandhra Publishing House posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Visalaandhra Publishing House:

  • Want your business to be the top-listed Media Company?

Share

VISALAANDHRA PUBLISHING HOUSE

Leading Publisher, Book sellers and Distributors in Andhra Pradesh and Telangana States.