29/08/2020
రాయలసీమ విషయానికొస్తే
లక్ష కోట్లు అప్పులు తెచ్చి ఆ భారం రాష్ట్రమంతా భరిస్తే, సీమలో ప్రాజెక్టులు కట్టుకుంటారా?
60 శాతం కేసులు కోస్తావి, 23 శాతం ఉత్తరాంధ్ర వి, 17 శాతం రాయలసీమవి, అయినా హైకోర్టు తీసుకెళ్ళి సీమ పెట్టుకుంటారా?
కృష్ణా జలాల్లో మా హక్కు ని సీమ కొదిలి, గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకుని పంటలు పండించుకుంటుంటే ,అక్కడికేదో కోస్తా జిల్లాలను ఉద్ధరించినట్లా?
బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ మీ దగ్గరేనా, శ్రీ సిటీ ఇండస్ట్రీస్ మీ దగ్గరేనా, పెద్దపెద్ద ఇండస్ట్రీలన్నీ సీమలోనే పెట్టాలా?
అధికభాగం పాలనంతా మీరే చేసి కోస్తా వారి మీద నిందలా?
ఇక ఉత్తరాంధ్ర విషయానికొస్తే
పెద్దపెద్ద ఇండస్ట్రీలన్నీ విశాఖలోనే కదా పెట్టింది. ఆంధ్రుల హక్కు అనే కదా విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సాధించింది.
జింక్,బి హెచ్పీవీ లాంటి భారీ పరిశ్రమలు విశాఖలోనే కదా నెలకొల్పింది
అనుకూలమైన ప్రాంతం అనే కదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి, సినీ ఇండస్ట్రీకి పునాదులు వేసింది?
ఫార్మా ఇండస్ట్రీ కి టెక్స్టైల్ ఇండస్ట్రీ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించింది,
మీ దగ్గరే కదా పోర్టులు డాక్ యార్డ్ లు షిప్యార్డ్ లు పెట్టి డెవలప్ చేసింది
అవకాశం ఉందనే కదా విశాఖ కాకినాడ పెట్రో కారిడర్ ప్లాన్ చేస్తోంది
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగానే కదా
ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు తీసుకు వచ్చింది
విశాఖపట్నంలో ఇవన్నీ పెట్ట బట్టే కదా దేశంలో రాబడిలో తొమ్మిదో నగరం గా నిలబడింది.
సీమలోనూ, ఉత్తరాంధ్రలోనూ, వెనుకబాటుతనానికి మేమే కారణమా?
అది సాంస్కృతిక వెనుకబాటుతనమా
లేక మీ రెండు ప్రాంతాల్లో కూడా కోస్తావారే మీ సంపద దోచుకున్నారా?
బాగుపడ్డారు, డెవలప్ అయిపోయారు, దోచుకున్నారు అని అందరూ కోస్తా వారి మీద పడి నిందించడం మే కానీ, వాస్తవానికి కోస్తా కు దక్కింది ఏంటి?
70 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్న ఒక రాజధాని. విశాఖపట్నం లో ఉన్న ఒక స్టీల్ ప్లాంట్ అంత ఉండదు . అయినా అందరికీ అందుబాటులో ఉంటుందని అమరావతి లో పెట్టారు.
ఆ రాజధానికి రైతులే భూములు పెట్టుబడిగా పెడితే , ,దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి డెవలప్మెంట్ కి అయ్యే ఖర్చు కూడా వారి వద్ద నుంచి వచ్చిన భూమి అమ్మి పెట్టుబడిగా మార్చే విధంగా తయారు చేయబడిన ఒక ప్రాజెక్టు, మిగిలిన ప్రాంతాల వారికి ఏ విధంగా కంటగింపు కలిగిస్తుందో చెప్పాలి?
రైతులకు తొమ్మిది వేల ఎకరాలు ఫ్లాట్స్ రూపంలో వెనక్కి ఇస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పోను గవర్నమెంట్ కు కూడా అన్నే ఎకరాలు అనగా తొమ్మిది వేల ఎకరాలు
పెట్టుబడిగా మిగిలింది .
ఇనిషియల్ గా పెట్టే పెట్టుబడి తప్పించి రాష్ట్రం మీద ఏ విధంగానూ భారం పడని ప్రాజెక్టు అది.
ఆ పెట్టుబడిలేని ప్రాజెక్టు నుండి రాష్ట్రానికి ఆదాయం, ఉపాధి దొరికే అవకాశం ఉంది. రాజధాని ఇన్స్టిట్యూషన్స్ అక్కడే ఉంటే ఆ సిటీ డెవలప్మెంట్ కి కొంత ఊతం అవుతుంది.
కోస్తా ప్రాంతానికి దక్కిన ఆ ఒక్క రాజధాని ప్రాజెక్టు మీద కూడా మరి ఎందుకో ఈ అపార్ధాలు అనుమానపు చూపులు. దాన్ని కూడా ముక్కలు చేసి,
ప్రాంతాల మధ్య విద్వేషాలు రగల్చా లని
పాలకులు వారి స్వార్థం కోసం భావిస్తుంటే,
తెలిసి తెలియని అమాయక జనం కొంతమంది వారికి వంత పాడటం దురదృష్టకరం.
అదే కావాలనుకుంటే మూడు రాష్ట్రాలుగా విభజించు కోవటం , ఎవరి భాధ వాళ్ళు పడటం ఉత్తమం.
🙏🙏🙏🙏🙏