మన venkatagiri

  • Home
  • మన venkatagiri

మన venkatagiri Venkatagiri is a town, municipality and mandal headquarters in Nellore district in the Indian state He renamed Kalimili with Vaishanava name "Venkatagiri".

Venkatagiri was a small village near Kalivelamma temple with the name Kali Mili during Vijayanagar times which was ruled by Gobburu polygars. They were defeated by Venkatadri Naidu,brother's son of Raja who was ruling territories around Madurantakam in 16th century. These Recherla rulers shifted their capital from Velugodu to Venkatagiri during the reign of Pedda Yachama Naidu. He also had ruled h

is southern territories with Madurantakam as second capital which was granted by Venkatapathi Raya II of Aravidu dynasty of Vijayanagar who ruled from Chandragiri. Later Venkatagiri Rajas abandoned Madhurantakam and ruled their southern territories with North Mallur in Chitoor district as their capital. Raja Bangaru Yachama Naidu Bahudur was trecherously murdered when he was unarmed in 1693AD on the day of Mahanavami by Zu-l-faqar khan, Nawab of vellore during reign of Aurangazeb. Later on 14 taluks were granted to Sarwagna Yachedra, son of assassinated King by Khan with the approval of Emperor in order to prevent heirs of the rajah from complaining to emperor about the murder. After this, the Administration of the kingdom has been transferred completely from north Mallur to Venkatagiri. Raja's Recherla clan was initiated in Nalgonda Dist in Amanagallu village by Chevi reddi around 1198AD – 1208 AD with the sacrifice of life by Rechadu, servant of Chevireddi. The "Gotram" of Venkatagiri rajas was named after him. As per oath gave to him Venkatagiri rajas are celebrating Jatara of Poleramma who is the chief deity of Rechadu's community. The celebration of Jatara in Venkatagiri traced to this tradition. Chevi Reddi also named as Pillalamarri Bethala Naidu was a close associate of Kakatiya King Ganapathi Deva. Rajas of Venkatagiri, Pitauram, Jetprole and Bobbili are his descendents. Thus Chevireddy was the origin person of Venkatagiri Velugoti dynasty of Padma Nayaka Velama Tribe. As per the permanent settlement made with Britishers an "Isthimiral" dated 24 August 1802 was issued to Rajah fixing an annual Periskash of Rs,4,44,232. Thus estate became part of British India. Venkatagiri samsthanam when it was a part of erstwhile Madras Presidency consisted of 736 Villages in addition to that it consisted 617 majara villages.

08/11/2024
HAPPY MARRIAGE  LIFE TO U ANUSHA MADAM garu (SI OF POLICE)
03/11/2024

HAPPY MARRIAGE LIFE TO U ANUSHA MADAM garu (SI OF POLICE)

Any one want Message to us...CHOLA HOUSING FINANCE
26/10/2024

Any one want

Message to us...

CHOLA HOUSING FINANCE

మన Venkatagiri HERO....
25/10/2024

మన Venkatagiri HERO....

Please help and share to all
20/10/2024

Please help and share to all

08/10/2024
శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ వారి నూతన ఉత్సవ విగ్రహ ప్రతిష్ట ఆహ్వానం     మూలసాలి వీధి నందు గల శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయము నందు ...
08/10/2024

శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ వారి నూతన ఉత్సవ విగ్రహ ప్రతిష్ట ఆహ్వానం
మూలసాలి వీధి నందు గల శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయము నందు 09-10-2024 బుధవారం ఉదయం 6 గంటల నుండి 9: 10ని "ల వరకు పోలేరమ్మ నూతన ఉత్సవ విగ్రహ స్థాపన పూజా కార్యక్రమం జరుగును కావున భక్తులందరూ తప్పక ఆలయానికి విచ్చేసి అమ్మవారి పూజ కార్యక్రమంలో భాగస్తులై అమ్మవారి కృపకు పాత్రులు పొందగలరు.
పూజా కార్యక్రమం
6 గంటలకు. గణపతి పూజ
7 గంటలకు. ఆదివాస అభిషేకం
8 గంటలకు. దుర్గా హోమం
9 గంటలకు విగ్రహ స్థాపన తీర్థ ప్రసాదాల వినియోగం.
ముఖ్య అతిథులు
గౌరవనీయులు.శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారు
(వెంకటగిరి శాసనసభ్యులు)
గౌరవనీయులు.శ్రీ వెలుకొండ భాస్కర్ సాయి కృష్ణ యాచంద్ర గారు
(మాజీ ఎస్వీబీసీ చైర్మన్ గారు)
గౌరవనీయులు.శ్రీ శ్రీమతి నక్క భానుప్రియ గారు
(వెంకటగిరి పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్)
గౌరవనీయులు. శ్రీ నక్క వెంకటేశ్వరరావు గారు
(మాజీ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్)

07/10/2024

శ్రీకాళహస్తి క్షేత్రం

భారతదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువుదీరి ఉంటాడని, దీనికి నిదర్శనం ఈ లింగానికి ప్రాణం ఉండడమే అని అంటారు.

సృష్టి స్థితి లయ కారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వీటన్నింటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రానికి, అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాధున్ని అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు. కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమ గల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు. అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన, పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయు లింగం ఇక్కడ పూజలందుకుంటుంది. అద్భుతమైన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది. శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం, చెక్కు చెదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ల మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు. కళంకారీ కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు.

శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివ లింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయు లింగంగా కొలువైన స్వామి వారి ఉఛ్వాశ నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు.

అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరూ కూడా తాకరు. ప్రాణ వాయులింగంగా పూజాలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరున్ని కర్పూర లింగం కూడా పిలుస్తారు. నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజూ పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు.

శ్రీ అంటే సాలీడు, కాళము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు మూగ జీవుల చేత పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కధనం. సాలెపురుగు, పాము, ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకుని స్వామి స్వయంభువుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు. ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం, సద్యోముక్తిక్షేత్రం, శివానందైక నిలయం, సత్య మహా భాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగా, స్వామి వారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనం ఇస్తారు. గణపతి ఉత్తర దిక్కుగా, దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు.

ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుణ్ణి దర్శించుకుని తరువాత శ్రీకాళహస్తీశ్వరున్ని భక్తులు దర్శించుకుంటారు. పాతాళ గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి, మహాలక్ష్మి గణపతి, సహస్ర లింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. దేశంలోని అతిపురాతన క్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకూ అడుగడుగునా ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి.

సాధారణంగా భక్తుడు ఎప్పుడూ భగవంతుని పాదాల చెంతన ఉంటాడు. కానీ శ్రీ కాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే, శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది. అందుకే పరమేశ్వరున్ని భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు. మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం.

పరమేశ్వరుడికి మహా భక్తులైన రోమస మహర్షి, ధూర్జటిల దేహాలను కూడా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సమాధి చేశారు. ఆలయం రాజద్వారం దాటే గడప కింద వారి దేహాలను ఉంచారు. వేశ్య కన్యలు, యాదవరాజు, వశిష్టుడు ఇలా ఎన్నో కధలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకుని ఉన్నాయి.

రాహుకేతు శాంతి పూజలు:

శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్ట మొదటి గుర్తొచ్చేది రాహు కేతు శాంతి పూజలు.శ్రీకాళహస్తీశ్వరుడి ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహు కేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు. ఇక జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటాడు. అందువల్ల ఈ క్షేత్రంలో రాహు కేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తుంటారు. ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకే సారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు.

సాధారణంగా శైవ క్షేత్రాల్లో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది. కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది. శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

చెంగల్వ రాయుని ఆలయం:

శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లీదేవసేన సమేత చెంగల్వ రాయునిగా కొలుస్తారు. ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ పేరు ఉండదు.

అదే విధంగా ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్ర నామ మండపం. శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడా ఆకాశం కనిపించదు. కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామి వారి శిఖరం, అమ్మవారి శిఖరం, భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మండపంలో ధర్మరాజు, యమధర్మరాజు, చిత్ర గుప్తుడులు ప్రతిష్టించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి.

ఇలా ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టతలతో శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక, పర్యాటక గమ్యస్థానంగా మారింది. ఈ క్షేత్రాన్ని ఒక్క సారి సందర్శించిన వారి మళ్లీ మళ్లీ సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక క్షేత్రమైన తిరుమల నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది. కాబట్టి తిరుమలకు వెళ్లే టూరిస్టులు, భక్తులు శ్రీకాళహస్తిని కూడా సందర్శిస్తుంటారు. తిరుమల నుంచి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు రవాణా ఉంటుంది.

07/10/2024
26/09/2024

Address


Alerts

Be the first to know and let us send you an email when మన venkatagiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share