K S Kavali Samchalanam

  • Home
  • K S Kavali Samchalanam
With Charly KC – I just got recognized as one of their top fans! 🎉
12/06/2024

With Charly KC – I just got recognized as one of their top fans! 🎉

With Arunita kanjilal – I just got recognized as one of their top fans! 🎉
12/06/2024

With Arunita kanjilal – I just got recognized as one of their top fans! 🎉

03/06/2024

ఈసీ మరో సంచలన నిర్ణయం

సార్వత్రిక ఎన్నికల ఓట్లతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను మంగళవారం లెక్కించనున్నారు. అందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో ఏపీ ఈసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కౌంటింగ్ కేంద్రంలో మరో ఏజెంట్‌కు నియమించుకొనేందుకు రాజకీయ పార్టీలకు ఈసీ అనుమతి ఇచ్చింది. రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద మరో ఏజెంట్‌ను నియమించు కోవచ్చని ఆ యాపార్టీలకు ఈసీ సూచించింది. అభ్యర్థి లేని సమయంలో మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేలా సదరు ఏజెంట్‌కు ఈసారి అవకాశం కల్పించినట్లు ఈసీ స్పష్టం చేసింది.

అయితే మిగతా కౌంటింగ్ ఏజెంట్లు అందరూ రౌండ్‌కి రౌండ్‌కి మధ్య రిలాక్స్ అయ్యేలా చర్యలు సైతం చేపట్టింది. అందులోభాగంగా వారికి భోజన సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. అయితే ఏపీ అసెంబ్లీలోని భీమిలి, పాణ్యం నియోజకవర్గాలకు సంబంధించి 26 రౌండ్లు గరిష్టంగా కౌంటింగ్ జరగనుంది. అలాగే రాజమండ్రి, నరసాపురంలో కనిష్టంగా 13 రౌండ్లకే ఫలితాలు వెలువడనున్నాయి. అమలాపురం లోక్‌సభ నియోజకవర్గంలో 27 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ లోక్‌సభ నియోజకవర్గ ఫలితం అర్థరాత్రికి వెలువడే అవకాశముంది.

03/06/2024

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వివిధ దశల్లో జరిగాయి. ఆ క్రమంలో మే 13వ తేదీన ఏపీలోని లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఒకే దశలో జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఓట్లతోపాటు ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది.

03/06/2024

*ప్రపంచ రికార్డు సృష్టించిన భారత ఓటర్లు: ఈసీ*

దేశంలో 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విజయవంతంగా నిర్వహించామని CEC రాజీవ్ కుమార్ తెలిపారు.

ఈ ఎన్నికల్లో 64.2కోట్ల మంది ఓట్లు వేయడం ప్రపంచ రికార్డు అని చెప్పారు.

ఇది G7 దేశాలైన USA, UK, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ జనాభా కంటే 1.5 రెట్లు ఎక్కువన్నారు.

ప్రపంచంలోనే అత్యధికంగా మనదేశంలో 31.2కోట్ల మంది మహిళలు ఓట్లు వేసినట్లు ఎన్నికల తర్వాత నిర్వహించిన తొలి ప్రెస్మెట్లో ఆయన వివరించారు.

03/06/2024

💥💥💥💥💥💥

*ఓటర్లకు స్టాండింగ్‌ అవేషన్‌ ఇచ్చిన CEC*...

ఈ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో 64.2 కోట్ల మంది ఓటు వేశారు...

*31 కోట్ల మంది మహిళలు ఓటేశారు*...

మన దేశంలో ఓటేసినవారి సంఖ్య...

జీ7 దేశాల జనాభాకు ఒకటిన్నర రెట్లు...

రేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం...

సీఈసీ రాజీవ్‌ కుమార్‌...

03/06/2024

*అమరావతి*

కౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్...

రెచ్చగొట్టే పోస్టులపై వ్యాఖ్యలపై సీరియస్ అయినా ఏపీ డీజీపీ...

గీత దాటితే తాటతీస్తామంటున్న AP DGP...

*డి‌జి‌పి హరీష్ కుమార్ గుప్తా*
(ప్రెస్ నోట్)

సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు..

కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూన్నారు..

వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారు...

అలాంటి వారిపై కతిన చర్యలు తప్పవు....

IT act కింద కేసులు నమోదు చేస్తాం రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం...

PD ACT ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తప్పవు...

పోస్టులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో కూడా విచారణ చేస్తాం...

రెచ్చగొట్టే పోస్టులను, ఫోటోలను, వీడియోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడం, షేర్ చేయడం కూడా నిషిద్ధం...

గ్రూప్ అడ్మిన్ లు అలెర్ట్ గా ఉండాలి...

సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుంది..

31/05/2024

పది సార్లు రాసిన తర్వాత పదో తరగతి పాస్ అయిన యువకుడు.. బ్యాండు మేళంతో ఊరేగించిన గ్రామస్థులు

మహారాష్ట్ర - బీడ్‌కు చెందిన కృష్ణ నామ్ దేవ్ ముండే 2018 నుండి 10 సార్లు రాసిన తర్వాత.. తాజాగా టెన్త్ పాసయ్యాడు.

దీంతో గ్రామస్థులందరూ బ్యాండు మేళంతో అతడిని ఊరేగించి వేడుక చేశారు.

30/05/2024

*AP ఎన్నికలు.. తొలి ఫలితం వెలువడేది ఇక్కడేనా?*

రాష్ట్రంలో తొలి ఫలితం తూ.గో జిల్లా కొవ్వూరు లేదా ప.గో జిల్లా నర్సాపురం నియోజకవర్గాల నుంచి వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ 2 సెగ్మెంట్లలోనూ 13 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది.

తిరుపతి జిల్లా చంద్రగిరి, అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గాల ఫలితాలు చివరగా వెలువడే ఛాన్స్ ఉంది.

ఈ రెండు స్థానాల్లో 29 రౌండ్ల చొప్పున కౌంటింగ్ చేయనున్నారు.

భీమిలి, పాణ్యం ఫలితాలు కూడా ఆలస్యమయ్యే అవకాశముంది.

30/05/2024

ఈరోజు సాయంత్రం తిరుపతికి అమిత్ షా రాక... రాత్రికి తిరుమలలో బస.. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం...

29/05/2024

ఏపీలో తెరపైకి మరో రగడ.. ఆ అంశంపై కోర్టుకు వెళ్తామంటున్న వైఎస్సార్‌సీపీ

_ పోస్టల్ బ్యాలెట్లో గెజిటెడ్ సంతకం సడలింపు పై హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం

గెజిటెడ్‌ అధికారి సీల్‌, హోదా వివరాలు లేకపోయినా.. బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఈనెల 25న ఆదేశాలు జారీ చేసింది. సీఈవో జారీ చేసిన ఆదేశాలు గతంలో ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

తాజా ఆదేశాలతో ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సడలింపుల విషయంలో ఈసీ పునరాలోచించకపోతే.. కోర్టుకు వెళ్తామంటున్నారు వైసీపీ ముఖ్య నేతలు.

ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి కూడా స్పందించారు. ఏ రాష్ట్రంలో లేని సడలింపులు ఇక్కడే ఎందుకని ప్రశ్నించారు. టీడీపీకి ఎలాగూ గెలిచే ఆలోచన లేదన్నారు.

ఏవైనా నియోజకవర్గాల్లో పోటాపోటీ ఉన్నప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్లను అడ్డుపెట్టుకుని మ్యానిపులేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్‎ను అడ్డుపెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై తమ పార్టీ ముఖ్యనేతలు కేంద్ర ఎన్నికల అధికారి రాజీవ్ శర్మను కలిసి వివరిస్తారన్నారు.

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏవిధంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగిస్తారో అదే మాదిరిగానే ఏపీలో పోస్టల్ ఓట్లు లెక్కించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీనా సాయంత్రం 4 గంటల లోగా స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తామంటున్నారు వైసీపీ నేతలు.

29/05/2024

ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లతో అప్రమత్తంగా వ్యవహరించాలి. అవతల పార్టీ ఆటలు సాగనివ్వద్దు. మనం అధికారంలోకి వస్తున్నాం..జూన్ 9న వైయ‌స్

గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందులో ఎలాంటి డౌట్ లేదు!

-వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

29/05/2024

*ఫర్ స్క్రోలింగ్ ప్లీజ్.....*

అమరావతి మే 29: రాష్ట్రంలో వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను న్యూ ఢిల్లీ నిర్వచన్ సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్న సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి, త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లను, తీసుకుంట్టున్న చర్యలను ఈ సమావేశంలో ఆయన సమీక్షిస్తున్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్, అడిషనల్ డీజీ ఎస్. బాగ్చీ , అదనపు సీఈఓ ఎమ్ ఎన్ హరేంధిర ప్రసాద్ తోపాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు / జిల్లా ఎన్నికల అధికారులు మరియు పోలీస్ కమిషనర్లు / ఎస్పీలు వారి నియోజకవర్గాల నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

*(పి ఆర్ ఓ, సీఈఓ కార్యాలయం, ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం వారిచే జారి)*

29/05/2024

*తెలంగాణలో 3 మున్సిపాలిటీ ఎన్నికలకు రేపు నోటీసులు*

తెలంగాణలో 3 మున్సిపా లిటీల్లో ఛైర్పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక తేదీలు ఖరారు అయ్యాయి.

ఈనెల 31న ఛైర్ పర్సన్, వైస్ పర్సన్ ఎన్నికకు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 31న కొల్లాపూర్ మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక తో పాటు..

కామారెడ్డి పురపా లిక వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక, నార్సింగి మున్సిపా లిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు.

ఎన్నిక కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు రేపు నోటీసులు జారీ చేయనున్నారు...

29/05/2024

రాష్ట్ర అధికారిక గీతం మా తెలుగుతల్లికి రాసింది తమిళుడు అయిన శంకరంబడి సుందరాచారి ! అమరావతి గీతం తెలంగాణ అశోక్ తేజ రాస్తే సన్మానించాం !

కెసీఆర్ .. తెలంగాణ బ్రాండ్ అని చెప్పుకున్న .. కాళేశ్వరం కట్టింది ఆంధ్రా మేఘా కృష్ణా రెడ్డి ! దాన్ని ఓపెన్ చేసింది ఆంధ్ర ముఖ్యమంత్రే !
అగ్గిపెట్టె హరీష్ రావ్ .. నైపుణ్యం బేస్ చేసుకుని మేఘాకి ఇచ్చాం అన్నాడు!

తెలంగాణా తిరుమల అని కెసీఆర్ చెప్పిన యాదగిరి గుట్టకి ఆర్కిటెక్ట్ ఆంధ్ర ఆనంద్ సాయి .. అదీ నైపుణ్యం బేస్ చేసుకుని ఆనంద్ సాయికి ఇచ్చామన్నారు !

కెసీఆర్.. తెలంగాణ స్వామీజీగా ప్రొజెక్ట్ చేసింది ఆంధ్ర జియర్ నే ! ఆఖరకి సిఎమ్ కుర్చీనే జీయర్ కి ఇచ్చి మొక్కాడు !

అదే ఇప్పుడు అధికారంలో లేనప్పుడు మాత్రం ప్రాంతం పేరు చెప్పి పబ్బం గడుపుకోవటం ..

29/05/2024

*కేరళలో కొనసాగుతున్న వర్ష బీభత్సం.*

ఒకటి రెండు రోజుల్లోనే ఋతు పవనాలు ప్రవేశం

భారీ వర్షాలకు నీటమునిగిన ప్రధాన రహదారులు..

*ఎర్నాకులం,కొట్టాయం జిల్లాల్లో అతి భారీ వర్షాలు.*

29/05/2024

కడప డీఎస్పీ షరీఫ్ మీడియా సమావేశం - జూన్ 3వ తేదీ మధ్యాహ్నం నుంచి కడపలో ఇతర జిల్లాల వ్యక్తులు ఉండకూడదు - 4వ తేదీ కడపలో ఆర్టీసి బస్సులను తిరగనివ్వం - కడప నగరం నాలుగు సరిహద్దు ప్రాంతాల్లోనే బస్సులు నిలిపివేస్తాం - ప్రయాణికులు 8 కిలోమీటర్ల దూరం వెళ్లి బస్సులు ఎక్కాల్సిందే - ఈసీ నిబంధనల మేరకే కడప నగరంలోకి బస్సులు తిప్పట్లేదు - జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుంది - మౌలానా అబుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద నాలుగు అంచెల భద్రత - జూన్ 3వ తేదీ నుంచి పార్టీ కార్యాలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం : కడప డీఎస్పీ షరీఫ్

27/05/2024

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హాజరుకాలేనని హేమ లేఖ – బెంగళూరు సీసీబీ పోలీసులకు లేఖ రాసిన నటి హేమ – వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు లేఖ రాసిన హేమ – సీసీబీ ఎదుట హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరిన హేమ – మరోసారి హేమకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన సీసీబీ – ఇవాళ హాజరుకావాలంటూ గతంలో ఇచ్చిన నోటీసుకు హేమ రిప్లై

27/05/2024

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో ప్రమాదం, కానిస్టేబుల్ మృతి – స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైన కానిస్టేబుల్ – తీవ్రగాయాలతో ఘటనాస్థలిలోనే కానిస్టేబుల్ పిల్లి సునీల్ బాబు మృతి – గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ లో పనిచేస్తున్న సునీల్

27/05/2024

కర్నూలు : తుగ్గలి మండలం జొన్నగిరిలో కూలీలకు వజ్రాలు లభ్యం – పొలం పనులు చేస్తున్న ఇద్దరు కూలీలకు దొరికిన డైమండ్స్ – రూ.7 లక్షలు, 5 తులాల బంగారం ఇచ్చి సొంతం చేసుకున్న వ్యాపారి – మరో వజ్రం లక్ష రూపాయలకు విక్రయం

27/05/2024

ఇప్పటికి 50 మంది నకిలీ డాక్టర్లు దొరికారు!

నకిలీ క్లినిక్‌లపై తెలంగాణ వైద్యం మండలి దాడులు. హైదరాబాద్, మేడ్చల్ పరిధిలో దాదాపు 50 మంది నకిలీ డాక్టర్ల గుర్తింపు. ఐడీపీఎల్, చింతల్, షాపూర్‌నగర్‌లో పలు క్లినిక్‌లు సీజ్ చేసిన అధికారులు.

27/05/2024

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి – చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి వద్ద డివైడర్ ను ఢీకొన్న కారు – పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఘటన – ప్రమాదంలో నలుగురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు – నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ఘటన – ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేస్తున్న పోలీసులు

27/05/2024

హైదరాబాద్: నిబంధనలు ఉల్లంఘించిన బిల్డర్స్కు రెరా నోటీసులు.. మియాపూర్లోని ప్రజ్ఞా ఎకోస్పెస్, చింతల్కుంటలోని శ్రీసిద్ధి వినాయక డెవలపర్స్.. కొండాపూర్లోని నార్త్ఈస్ట్ హెబిటీషన్స్, సంగారెడ్డిలోని వీఆర్ ప్రమోటర్స్కు నోటీసులు.. కేపీహెచ్బీలోని ఇన్వెస్ట్ఇన్ఫ్రా, కొంపల్లిలోని భారతి లేక్వ్యూలకు రెరా నోటీసులు.. 15 రోజులలోగా సమాధానాలు ఇవ్వాలని రెరా నోటీసులు..

27/05/2024

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హాజరుకాలేనని హేమ లేఖ.. బెంగళూరు సీసీబీ పోలీసులకు లేఖ రాసిన నటి హేమ.. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు లేఖ రాసిన హేమ.. సీసీబీ ఎదుట హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరిన హేమ.. మరోసారి హేమకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన సీసీబీ.. ఇవాళ హాజరుకావాలంటూ గతంలో ఇచ్చిన నోటీసులకు హేమ రిప్లై..

27/05/2024

తొలకరి వానలకు కర్నూలు జిల్లాలోని పొలాల్లో వజ్రాల పంట పండుతోంది. రాత్రికి రాత్రే రైతులు, కూలీలు లక్షాధికారులవుతున్నారు. వజ్రాల కోసం గాలిస్తున్న రైతులు, కూలీలపై ఓ కన్నేసి ఉంచుతున్న స్థానిక వ్యాపారులు.. విలువైన వజ్రాలు దొరికిన విషయం బయటకు పొక్కేలోగా డబ్బు, బంగారం ముట్టజెప్పి సొంతం చేసుకుంటున్నారు. వారం రోజుల్లో పది వజ్రాలు దొరకగా.. వ్యాపారులు భారీ మొత్తాలు చెల్లించి వాటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. తాజాగా ఆదివారం ఒక్కరోజే జొన్నగిరిలో రైతు కూలీలకు రెండు వజ్రాలు దొరికాయి. విషయం తెలిసి గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల ఊళ్లు, పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం వచ్చి పొలాల్లో గాలిస్తున్నారు.

మదనంతపురం గ్రామానికి చెందిన ఓ రైతుకు ఇటీవల దొరికిన ఓ వజ్రానికి స్థానిక వ్యాపారి ఏకంగా రూ.15 లక్షలు ఇచ్చి కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తుగ్గలి మండలం జొన్నగిరిలో పొలం పనులు చేస్తున్న కూలీలకు చెరో వజ్రం దొరికింది. ఇందులో ఒకదానికి రూ.6 లక్షల నగదుతో పాటు 6 తులాల బంగారం ఇచ్చి స్థానిక వ్యాపారి ఒకరు కొనుగోలు చేశారు. రెండో వజ్రాన్ని ఇంకా వేలం వేయలేదని, దానికి సుమారు రూ.12 లక్షలు పలకవచ్చని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.

26/05/2024

ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు పొంచివున్న వర్షం ముప్పు
చెన్నైలో వర్షం పడే అవకాశం ఉందంటున్న వాతావరణశాఖ

26/05/2024

IPLఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న SRH
చెన్నై వేదికగా ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్
కోల్‌కతా నైట్‌రైడర్స్ Vs సన్‌రైజర్స్ హైదరాబాద్
మూడోసారి కప్‌పై కన్నేసిన ఇరుజట్లు
ఐపీఎల్‌లో నాలుగోసారి ఫైనల్‌ చేరిన ఇరుజట్లు
తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్‌ మ్యాచ్‌ సందడి
రెస్టారెంట్లు, హోటళ్లలో స్క్రీన్లు ఏర్పాటు

26/05/2024

*మోడీ బస చేశారు… బిల్లు కట్టండి*

– ప్రభుత్వానికి మైసూర్‌ హోటల్‌ నోటీసు

మైసూర్‌ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ హోటల్‌లో బస చేసి.. 80 లక్షల రూపాయల బిల్లు చెల్లించనందుకుగాను చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు మైసూర్‌ రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌ యాజమాన్యం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే.. ప్రధాని మోడీ గతేడాది ఏప్రిల్‌ నెలలో నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ), పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ (ఎంఓఈఎఫ్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన 50 సంవత్సరాల ‘ప్రాజెక్టు టైగర్‌’ ఈవెంట్‌ మైసూర్‌లో జరిగింది. ఈ కార్యక్రమం ఏప్రిల్‌ 9 నుంచి 11 వరకు జరిగింది. ఈ ఈవెంట్‌ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్రమోడీ మైసూర్‌కి వచ్చి అక్కడ ఉన్న రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లో బస చేశారు. దీనికి గానూ రూ. 80.6 లక్షల రూపాయల బిల్‌ అయింది. కాని, ఈ బిల్లుని హోటల్‌కి చెల్లించలేదు. ఈ బకాయిలను చెల్లించాలని కర్నాటక ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ (వైల్డ్‌ లైఫ్‌).. న్యూఢిల్లీ ఎన్‌టీసీఏ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌కి లేఖ రాసింది. అయితే ఈ హోటల్‌ బకాయిలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని ఎన్‌టీసీఏ తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరి 12న లేఖ రాసింది. బకాయిలు చెల్లించకపోవడంతో మరోసారి మార్చి 22 2024వ తేదీన ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ (పీసీసీఎఫ్‌) ప్రిన్సిపల్‌ సుభాష్‌ కె. మల్ఖేడే ఎన్‌టీసీఏ లేఖ రాశారు. సుభాష్‌ రాసిన లేఖకు సంబంధించి ఎన్‌టిసిఎ సమాధానం ఇవ్వలేదు. ఆ తర్వాత ‘ఏడాది గడిచినా హోటల్‌లో బస చేసినందుకు బిల్లు చెల్లించలేదు’ అని మే 21న ఈ హోటల్‌ ఫైనాన్స్‌ జనరల్‌ మేనేజర్‌ డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ చీఫ్‌ బసవరాజుకు లేఖ రాశారు. బకాయిలు సరైన సమయంలో చెల్లించనందుగాను 12.09 లక్షలు, మొత్తం డబ్బు సంవత్సరానికి 18 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని బ్లూ ప్లాజా యాజమాన్యం లేఖలో పేర్కొంది. ఈ బకాయిల్ని ఈ ఏడాది జూన్‌ 1వ తేదీ లోపు చెల్లించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోటల్‌ యాజమాన్యం హెచ్చరించింది. అయితే ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిందన్న కారణంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఈ హోటల్‌కి చెల్లించే బకాయిల్ని చెల్లించేందుకు తిరస్కరించిందని ఫారెస్ట్‌ చీఫ్‌ బసవరాజు అన్నారు.

24/05/2024

Chandrababu Naidu Letter to UPSC Chairman:

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఐఏఎస్ కన్ఫర్మెంట్​ను వాయిదా వేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు యూపీఎస్సీకి లేఖ రాశారు. ఐఎఎస్​కు రాష్ట్ర కేడర్ ఆఫీసర్​ల ఎంపిక కార్యక్రమాన్ని మోడల్ కోడ్ ఉన్నప్పుడు చేయడం సముచితం కాదని ఆయన లేఖలో పేర్కొన్నారు.

క్రొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఈ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని వారికే పదోన్నతులు పరిమితం చేశారని, జాబితా తయారీలో పారదర్శకత లేదని ఆరోపించారు. జాబితాను పునఃపరిశీలించి ఎంపిక ప్రక్రియను కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేవరకూ వాయిదా వేయాలని చంద్రబాబు కోరారు.

24/05/2024

విశాఖ :
పోలీసుల చొరవతో స్వదేశానికి తిరిగి వస్తున్న
హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు

ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్ పోర్టు కు చేరుకున్నారు కంబోడియా బాధితులు

మొదటి దశలో వివిధ విమానాల ద్వారా రానున్న 60 మందిని బాధితులు

6గంటల 30 నిమిషాలకు విశాఖ చేరుకోనున్న ఎయిర్ ఇండియా విమానం

మొదటి విమానంలో 7 మంది సభ్యులు వచ్చారు

రాత్రి 9 గంటలకు మరో విమానంలో మరికొంత మంది వచ్చే అవకాశం

హ్యూమన్ ట్రాఫికింగ్ లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్న పోలీసులు

బాధితుల రాక కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు

Address


Telephone

+918008873015

Website

Alerts

Be the first to know and let us send you an email when K S Kavali Samchalanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to K S Kavali Samchalanam:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share